బిగ్‌బాస్ 8వ సీజన్ సెంచరీ కొట్టేసింది. అంటే 100 రోజులు పూర్తయ్యాయి అనమాట. ప్రస్తుతం ఫినాలే వీక్ నడుస్తోంది. దీంతో టాస్కులు, గేమ్స్ అని పెట్టుకోకుండా వారమంతా ఎమోషనల్‌గా ఉండేలా బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే స్టార్ మాలో సీరియల్స్ చేస్తున్న నటీనటులు హౌసులోకి వచ్చి సరదాగా అలా కాసేపు గడిపి, హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి వెళ్తున్నారు. మంగళవారం ఎపిసోడ్‌లోనూ అలా దీప్తి, సుహాసిని, ఆకర్ష్ వచ్చారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో 100వ రోజు ఏం జరిగింది?
'మామగారు' సీరియల్ జంట ఆకర్ష్-సుహాసిని హౌసులోకి వచ్చారు. అలానే ఇద్దరూ హౌస్‌మేట్స్‌ని తమ తొలి ప్రేమ- బ్రేకప్ స్టోరీలు చెప్పాలని అడిగారు. దీంతో నిఖిల్-గౌతమ్ తమ భగ్న ప్రేమకథల్ని బయటపెట్టారు. తొలుత గౌతమ్ ఓపెన్ అయ్యాడు. కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా సీరియల్ రిలేషన్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యా. కొన్ని కారణాల వల్ల అనుకున్నది జరగలేదు. చాలా బాధపడ్డా, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అప్పుడు నా కుటుంబం అండగా నిలిచింది. ఇలాంటి కష్టమొచ్చినప్పుడే కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు. అది గుర్తుపెట్టుకొని జీవితాన్ని జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నా అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)
తర్వాత నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నా తొలి బ్రేకప్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం, తొలి మూవీ పోస్టర్.. మా ఊరిలో నేను చదివిన కాలేజీ పక్కన థియేటర్ బయట కటౌట్ పెట్టడం, తర్వాత నేను గుర్తుకురావడంతో తను ఫోన్ చేసి క్షమాపణ చెప్పింది. సారీ మీరెవరో నాకు తెలీదు అని నేను ఆమెని బ్లాక్ చేశా అని నిఖిల్ చెప్పాడు. బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. పరోక్షంగా కావ్య గురించి చెప్పాడు.
అందరి జీవితంలో బ్రేకప్ జరుగుతుంది. అయితే మనం చూడాల్సింది మనకేంటి అని కాదు, వదిలేసేటప్పుడు ఏం కారణం చెప్పారా అనేది ముఖ్యం. భవిష్యత్తులో నాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా కొందరు బ్రేకప్ చెప్పి వెళ్తారు. ఉదాహరణ చెప్పుకొంటే.. నా వల్ల నీకు ఏమైనా అవుతుందా అని నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు హర్ట్ అవ్వకూడదని.. అలాంటి బ్రేకప్‌ని బ్రేకప్ చేసుకోకుండా సెట్ చేసి పక్కన నిల్చోబెట్టుకోవడమే మంచిది.. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావోనని వదిలేసి వెళ్లడం.. ఈ జనరేషన్‌లో కరెక్ట్ అనుకోవడం లేదని నిఖిల్ చెప్పాడు. అయితే ఇదంతా కూడా కావ్యని ఉద్దేశించి చెప్పాడా అనిపించింది.
(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)
తర్వాత 'బ్రహ్మముడి' కావ్య పాత్రధారి దీపిక వచ్చింది. వచ్చీ రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలు, పిచ్చివాగుడుతో అందరి బుర్రలు తినేసింది. ఓ దశలో ఈమె దెబ్బకు బిగ్ బాస్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దీప్తి, నిఖిల్‌ని ఓ ప్రశ్న అడిగింది. దీనికి అతడు చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నీకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. గతంలో నువ్వంటే తనకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కాదు. మీకు తన మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు. మీ ఇంట్లోనూ పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా? లేకపోతే వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా? అని దీప్తి, నిఖిల్‌ని అడిగింది.
ప్రేమ ఉందంటే నేను నిజంగా ఎదురుచూస్తా, ఎన్ని ఏళ్లయినా కచ్చితంగా వెయిట్ చేస్తా, అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను, నేను మూవ్ ఆన్ అవ్వలేను ఆ అమ్మాయిపైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే కచ్చితంగా ఆమె కోసం ఎదురుచూస్తానని నిఖిల్ చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment