గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు? | Bigg Boss 8 Telugu 10th Week Nominations Full List | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nominations: సిల్లీ రీజన్ చెప్పిన పృథ్వీ.. రోహిణి తగ్గలేదు!

Published Mon, Nov 4 2024 1:18 PM | Last Updated on Mon, Nov 4 2024 1:38 PM

Bigg Boss 8 Telugu 10th Week Nominations Full List

బిగ్‌బాస్ 8లో అప్పుడే పదోవారం వచ్చేసింది. నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ సందడి మొదలైంది. కాకపోతే ఇద్దరికి బదులు ఒక్కరినే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ లేపారు.

తాజాగా రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో పృథ్వీ.. రోహిణిని నామినేట్ చేశాడు. 'నెక్ ఫ్యాంటసీ' అనడం తనకు అస్సలు నచ్చేలేదని, అదో పెద్ద బూతు అన్నట్లు సీన్ క్రియేట్ చేశాడు. కానీ రోహిణి అస్సలు ఊరుకోలేదు. గట్టిగానే ఇచ్చిపడేసినట్లు కనిపించింది. మరోవైపు హరితేజ.. ప్రేరణని నామినేట్ చేసింది. ఈ నామినేషన్ కూడా మంచి ఫన్ ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

ఇక గౌతమ్-నిఖిల్ మధ్య హీట్ పుట్టించే డైలాగ్ వార్ నడిచినట్లు తెలుస్తోంది. 'అశ్వద్ధామ ఈజ్ బ్యాక్' అని మళ్లీ గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో నిఖిల్ ఊరుకుంటాడా.. 'సరే నువ్వు బయటకెళ్లడానికి రెడీ హా. బయటకు వెళ్లి చూసుకుని వద్దాం, అమ్మతోడు దమ్ముంటే గేట్ తీయమను' అని అనేసరికి.. 'పదా.. దా' అని గౌతమ్ గట్టిగానే ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఓవరాల్‌గా ఈ వారం నామినేషన్స్‌లో హరితేజ, యష్మి, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వాళ్ల సంగతేమో గానీ గౌతమ్-నిఖిల్ మధ్య మినీ మాటల యుద్దమే జరిగిందని తెలుస్తోంది. అయితే ఎవరు ఎవరిని ఏ కారణం చెప్పి నామినేట్ చేశారనేది తెలియాలంటే రాత్రికి ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: నయని రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement