బిగ్‌బాస్‌: నయని రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? | Bigg Boss 8 Telugu 9th Week Elimination: Nayani Pavani Remuneration For Four Weeks In BB House, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nayani Remuneration: నాలుగు వారాలకు నయని ఎంత సంపాదించిందంటే?

Nov 3 2024 10:12 PM | Updated on Nov 4 2024 10:56 AM

Bigg Boss Telugu 8: Nayani Pavani Remuneration for Four Weeks

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ వైల్డ్‌కార్డులు వచ్చాకే అంతో ఇంత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు వచ్చిన మొదటివారం తప్ప తర్వాత వాళ్లే ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. మొదట మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవగా ఇప్పుడు నయని పావని అవుట్‌ అయింది. ఆటపై కసి ఉన్నా ఎమోషన్స్‌పై కంట్రోల్‌ లేకపోవడంతో గేమ్‌ బోల్తా కొట్టింది. 

ఎంత సంపాదించిందంటే?
పదేపదే ఏడుస్తూ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు చిరాకు వేసింది. అలా తొమ్మిదోవారం ఎలిమినేట్‌ అయింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హౌస్‌లో నాలుగు వారాలు ఉంది. వారానికి రూ.1,50,000 చొప్పున మొత్తం రూ.6 లక్షల మేర సంపాదించినట్లు తెలుస్తోంది.

అప్పుడు  వారమే.. ఈసారి నెల!
కాగా నయని గత సీజన్‌లోనూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి వెళ్లిపోయింది. ఈ సీజన్‌లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఆటపై బాగానే ఫోకస్‌ పెట్టింది. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్‌ అయింది. పైగా ఆటలో గెలిచింది లేదు కానీ గొడవల్లో మాత్రం ముందు ఉందన్న పేరు సంపాదించుకుంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement