బిగ్‌బాస్ 8వ సీజన్‌లో మరో ఎలిమినేషన్. వరంగల్ బిడ్డ, యూట్యూబర్ నబీల్ టాప్-5లో నిలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చేశాడు. ఫినాలే వరకు వచ్చినా సరే విజేత కాలేకపోయిన ఇతడు రెమ్యునరేషన్ మాత్రం బాగానే సంపాదించాడు. ఇంతకీ ఎంత మొత్తం అందుకుంటాడనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)
14 మందితో సెప్టెంబరు 1వ తేదీన బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. యూట్యూబర్ నబీల్ అఫ్రిది పెద్దగా అంచనాల్లేకుండానే హౌసులోకి వచ్చాడు. ఒక్కోవారం తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ నెగ్గుకొచ్చాడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ.. వాళ్లతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటూ ఇప్పుడు టాప్-5 ఫినాలే వరకు వచ్చాడు. కానీ విజేత రేసులో ఇతడు లేడని ఇప్పుడు ఎలిమినేట్ కావడంతో అర్థమైంది.
ఫినాలే వరకు అంటే 15 వారాల పాటు నబీల్.. బిగ్‌బాస్ హౌసులో ఉన్నాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లే. ఏది ఏమైనా ఓ యూట్యూబర్‌గా హౌసులోకి అడుగుపెట్టి, ఫినాలే వరకు వచ్చి ఇంత మొత్తం రెమ్యునరేషన్‌గా అందుకోవడం విశేషమే. విజేత కానప్పటికీ మంచి మొత్తాన్ని అయితే అందుకున్నట్లేగా!
(ఇదీ చదవండి: బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!)
Comments
Please login to add a commentAdd a comment