టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్‌లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్‌బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు.
కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌తో పోలిస్తే అవినాష్‌కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్‌లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్‌గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్‌కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.
అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే!
Comments
Please login to add a commentAdd a comment