avinash
-
మందలించారని ఉరేసుకున్నారు
యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం)/ గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్పీ గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. రోహక్ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సచ్దేవ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్ పెంట్‌హౌస్ ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. -
విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత
-
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్‌బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌తో పోలిస్తే అవినాష్‌కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్‌కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే! -
తల్లడిల్లుతున్న పేగుబంధం..
ఖమ్మం: రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరగా.. కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి వడదెబ్బతో మృతిచెందాడు. మరో కొడుకు ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేస్తున్నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తల్లిపై పడటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే రోడ్డుప్రమాదంలో గాయపడిన కుమారుడికి చికిత్స కోసం రూ.22 లక్షల మేర అప్పు చేసిన ఆ కుటుంబం తండ్రి మృతితో మరింత కష్టంలో పడిపోయింది.రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వల్లెపు నరసింహారావు, నళిని దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో వల్లెపు అవినాష్ గతేడాది నవంబర్ 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అవినాష్‌ను చికిత్స కోసం హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తిప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద రూ.22 లక్షల వరకు అప్పులు చేసి అతని చికిత్సకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన వైద్యానికి రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది.వడదెబ్బతో తండ్రి..ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతుండగా.. యజమాని నరసింహారావు కూడా మరణించాడు. ఎండల్లో పనిచేయడంతో వడదెబ్బకు గురై ఈ నెల 6న మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒక పక్క కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండగా.. ఇలా భర్త అర్ధాంతరంగా ముగియడంతో ఆమె గుండె పగిలింది. ఇక మరో కొడుకు అభిలాష్ హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అది ఖర్చుల వరకు కూడా సరిపోవడం లేదని నళిని వాపోయింది. ప్రస్తుతం నళిని కూలీ పనులకు వెళ్తూ నెట్టుకొస్తోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 79896 32983 నంబర్లో సంప్రదించాలని బంధువులు కోరారు. -
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్‌పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్‌బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోంది.గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్‌లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్‌కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్‌కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్‌చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్‌లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్‌లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్‌కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అవినాశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్‌పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం! -
పాత కక్షలతో మహిళను గొడ్డలితో దారుణంగా..
మహబూబాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో అంబట్పల్లి అమరేశ్వర ఆలయంలో బుధవారం ఉదయం అయ్యప్ప మాలధారుడు పుట్ట నరసింహస్వామి.. మరో మాలధారుడు నల్ల అవినాశ్‌పై కత్తితో దాడికి పాల్పడగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన సహా మాలధారులు ఇద్దరిని సముదాయించి ఇంటికి పంపించారు. అనంతరం నరసింహస్వామి గొడ్డలితో అవినాశ్ ఇంటికి చేరకున్నాడు. అక్కడ అతడు కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన నరసింహస్వామి.. అవినాశ్ తల్లి పద్మ (40)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పద్మను స్థానికులు మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పద్మ మృతదేహానికి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి అంబట్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త నల్ల భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
క్రికెట్ వరల్డ్‌కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్
U19 World Cup 2024 India Squad: యువ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19- ఫిబ్రవరి 11 వరకు అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఇందులో పాల్గొనబోయే భారత యువ జట్టును మంగళవారం ప్రకటించింది. ఇదే టీమ్ సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌లోనూ పాల్గొననుంది. పోత్గల్ కుర్రాడంటూ కేటీఆర్ హర్షం ఇక మొత్తంగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్ గ్రామంలో పుట్టిపెరిగాడు’’ అంటూ అవినాశ్ సక్సెస్ పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency. pic.twitter.com/yGMX7YYpnd — KTR (@KTRBRS) December 14, 2023 అభిషేక్‌కు కూడా కంగ్రాట్స్ కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికట్లో కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నుంచి శాసన సభ్యులుగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ట్వీట్లో అభిషేక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హైదరాబాద్ నుంచి అండర్-19 వరల్డ్‌కప్ జట్టుకు సెలక్ట్ అయిన మురుగన్ అభిషేక్‌కు కంగ్రాట్స్. అవినాశ్, అభిషేక్ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అవినాశ్ వికెట్ కీపర్‌గా.. అభిషేక్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక వీరిద్దరు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ క్రమంలో అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. Would also like to Congratulate another bright lad from Hyderabad, Murugan Abhishek, who made it to the U-19 squad. Best wishes to both these youngsters 👍 pic.twitter.com/SGqaA2Tr23 — KTR (@KTRBRS) December 14, 2023 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. -
హైదరాబాదీ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్.. ప్రపంచకప్ జట్టులో చోటు
U19 World Cup 2024 India Squad: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేవారు. కాగా వికెట్ కీపర్ అవినాశ్, ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్‌లో భారత్ ఆడిన 3 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. కాగా అండర్–19 వరల్డ్‌కప్ టోర్నమెంట్లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్–19 ఆసియా కప్‌లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం. ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. చదవండి: U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్.. భారత్ ఘన విజయం -
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్‌గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్‌బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు. ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు! కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్ హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్‌లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్‌బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్‌గా అవకాశం కలి్పంచింది. శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్‌శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. -
ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసు డిపార్టుమెంట్లో జరిగిన ఈ–చలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు తెలిపారు. మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం 2018–19లో జరిగిందని తమ విచారణలో స్పష్టమైందన్నారు. 2018లో అప్పటి డీజీపీ సాంబశివరావు ఎటువంటి టెండర్లు లేకుండానే తొమ్మిది జిల్లాల్లో మోటారు వాహనాల చలానాల వసూళ్లను డేటా ఎవాన్ సొల్యూషన్స్‌కు అప్పగించారని, ఆ తర్వాత 2019లో కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిన ఆ సంస్థకు కట్టబెట్టారన్నారు. ఆడిటింగ్ జరగకుండానే టెండర్ కట్టబెట్టడంతో రూ. 36.53 కోట్లు దారి మళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డేటా ఎవాన్ సొల్యూషన్స్‌తో పాటు రోజర్ పీఈ అనే సంస్థ ద్వారా అవకతవకలకు తెరలేపారన్నారు. చలానాల ద్వారా కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్‌గా డీజీ అకౌంట్‌కు వెళ్లకుండా రేజర్‌పే ద్వారా రోజర్ పీఈకు మళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ విధంగా దారిమళ్లిన సొమ్ముతో అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా 50 నుంచి 60 సంస్థలకు సర్విసులు ఇస్తున్నారని చెప్పారు. ఈ సర్వీసుల ద్వారా సుమారు రూ. 25 కోట్లు డేటా ఎవాన్ సొల్యూషన్ సంస్థకు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసేలా కోర్టు ద్వారా చర్యలు చేపట్టామన్నారు. 2019 తర్వాత సుమారు 16 ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేసి ఎటువంటి లావాదేవీలు జరగకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీరియస్‌గా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము ఈ విధంగా దారి మళ్లడంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పాలరాజు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకూ ఎంత సొమ్ము, ఏ ఖాతాలకు మళ్లింది అనే అంశాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత డబ్బు పలు ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని, ఆ ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రస్తుత డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారన్నారు. టెండర్ కట్టబెట్టడంలో ఎవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–చలానా వసూలు చేయకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఐసీ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో కంపెనీలోని మిగిలిన డైరెక్టర్ల పాత్రపై కూడా విచారణ జరిపి వారి తప్పు ఉంటే అరెస్టు చేస్తామని ఐజీ పాలరాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్‌పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్. -
NBDA : మరోసారి అధ్యక్షుడిగా అవినాష్ పాండే
న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) 2023-2024 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నిక తాజాగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏబీపీ నెట్వర్క్ సీఈవో అవినాష్ పాండే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంశ్ కుమార్ ఎన్బీడీఏ వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఇక న్యూస్24 బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా గౌరవ కోశాధికారిగా కొనసాగనున్నారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్‌ను గతంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌గా పిలిచేవారు. ఇది దేశంలోని వివిధ న్యూస్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ అసోసియేషన్. ఇందులో రజత్ శర్మ, ఎమ్కే ఆనంద్, రాహుల్ జోషి, ఐ వెంకట్, కల్లి పూరీ భండాల్, సోనియా సింగ్, అనిల్ కుమార్ మల్హోత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు. NBDA గురించి న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసొసియేషన్ అనేది ప్రైవేట్ టీవీ ఛానళ్లు, కరెంట్ అఫైర్ ఛానళ్లు, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ల కోసం ఏర్పడిన NBAకి కొత్త రూపం. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని నిర్వహణ పూర్తిగా సభ్యులే నిర్వహించుకుంటారు. ప్రస్తుతం NBDAలో 27 పెద్ద న్యూస్ ఛానళ్లతో పాటు మొత్తమ్మీద 125 న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే వశ్వసనీయమైన సంస్థ NBDA. టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వాక్ స్వతంత్ర హక్కును నిలబెట్టడం, మీడియాకు సంబంధించిన తాజా అంశాలను చర్చించడం, కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుంచడం దీని బాధ్యతలు. తన సభ్యులైన వివిధ టీవీ (న్యూస్, కరెంట్ అఫైర్స్) ఛానళ్లకు సంబంధించిన న్యాయ వివాదాల పరిష్కారంలో NBDA కీలక భూమిక పోషిస్తోంది. -
Mukku Avinash Wife Anuja Baby Shower Pics: జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుకలు (ఫోటోలు)
-
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్‌లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్
-
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే..
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్‌బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు కూడా ఈ అమ్మడి యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..త్వరలోనే ఈ బ్యూటీ మిసెస్ అరియానాగా మారనుందట. అయితే ఈమె పెళ్లాడే ఆ వరుడు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని ప్రకటించాడు అవినాష్. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ ఓపెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అరియానా పెళ్లి మ్యాటర్ వెలుగులోకి రావడంతో ఫ్యాన్స్‌లో సందేహాం మొదలైంది. కొంపదీసి వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ షో నుంచి ఎంతో క్లోజ్‌గా మూవ్ అయిన అరియానా-అవినాష్‌లపై ఇప్పటికే పలు పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేస్తూ తాము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొనే ఈ జంట మరి ఈ వార్తలపై స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది? యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య -
37 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాలకుపైగా చెక్కు చెదరకుండా ఉన్న జాతీయ అథ్లెటిక్స్ రికార్డు శుక్రవారం బద్దలైంది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సర్వీసెస్ తరఫున బరిలో దిగిన అవినాశ్ ఈ రికార్డును తిరగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్లో గోపాల్ సైనీ (8ని.30.88 సెకన్లు) నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ 24 ఏళ్ల అథ్లెట్ సవరించాడు. అవినాశ్ 8 నిమిషాల 29.80 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. రాకేశ్ కుమార్ స్వామి 8ని. 47.31 సెకన్లలో... దుర్గా బహదూర్ 8ని. 48.29 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
అంజలి ప్రేమలేఖ
కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్ ముఖ్యతారలుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్ బాగా తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. ఆర్ట్: ఎస్వీ మురళి. -
జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు
బంజారాహిల్స్: వినోద కార్యక్రమం చేస్తానని అడ్వాన్స్ తీసుకొని కార్యక్రమానికి హాజరుకాకుండా మోసం చేసిన కమెడియన్ మాస్ అవినాష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24న కార్యక్రమం నిర్వహించేందుకు బుల్లితెర కమెడియన్ మాస్ అవినాష్‌తో ఒప్పందం కుదర్చుకొని ఈనెల 14న రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం అతను కార్యక్రమానికి హాజరుకాకపోగా సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఈ కారణంగా అతిథులు నిరాశకు లోనయ్యారని, తమ ఈవెంట్ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని బాధితుడు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్ కాలేజ్‌కు చెందిన అవినాష్(16), పీడీఎస్ చరణ్(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ట్రంప్ ప్రమాణ ఈవెంట్లో తెలుగు వ్యక్తి
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇరగవరపు అవినాశ్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన కొద్దిమందిలో అవినాశ్ ఒకరు. రిపబ్లికన్ పార్టీ నేత అవినాశ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. వాషింగ్టన్ నుంచి అవినాశ్ మాట్లాడుతూ.. ఒబామా కేర్‌ను సమూలంగా మార్చి, ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉందని అవినాశ్ తెలిపారు. ఉగ్రవాదులకు, అక్రమ శరణార్థులకు సమస్యలు తప్పవని.. చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో న్యూఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్ లోనూ పనిచేసిన అవినాశ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తరఫున పనిచేశానని వివరించారు.