
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్‌పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు.
రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్‌గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్.
Comments
Please login to add a commentAdd a comment