
అవుట్ అండ్ అవుట్ కామెడీ స్టోరీతో తీస్తున్న సినిమా 'పురుషః'. బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది అనే పాయింట్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి.
(ఇదీ చదవండి: స్కిట్ వివాదం.. యాంకర్ రవి మరో వీడియో)
పవన్ కళ్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. వీరు ఉలవలను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తన శిష్యుడి కోసం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్ర టైటిల్ లోగో, పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో వైష్ణవి, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
