
∙అధిక్ రవిచంద్రన్, జీవీ ప్రకాశ్ కుమార్, ప్రియా ప్రకాశ్ వారియర్, సునీల్, నవీన్ ఎర్నేని
‘‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ, ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఈ విజువల్స్‌ని మర్చిపోలేను. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్ని చోట్ల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా హ్యూజ్ బ్లాక్‌బస్టర్. అజిత్‌గారు చాలా సింపుల్ పర్సన్.
ఆయన మనసుతో మాట్లాడే వ్యక్తి. అధిక్ ఈ సినిమాను 95 రోజుల్లోనే పూర్తి చేశాడు. అధిక్‌లాంటి దర్శకులు ఇండస్ట్రీకి కావాలి’’ అని నిర్మాత నవీన్ ఎర్నేని అన్నారు. అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. టీ–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది.
ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ నిర్మాతలకు తమిళంలో తొలి సినిమా ఇది. ఈ సినిమాతో తమిళనాడులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హిస్టరీ క్రియేట్ చేసింది’’ అని తెలిపారు. ‘‘తమిళంలో తొలిసారి సినిమా తీసి, మంచి హిట్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు కంగ్రాట్స్’’ అని పేర్కొన్నారు సునీల్. ‘‘18 నెలల తర్వాత అజిత్‌గారితో కలిసి మళ్లీ ఈ సినిమా చేశాను. దర్శకుడు అధిక్‌తో ఇది నా మూడో చిత్రం’’ అని తెలిపారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘‘ఈ మూవీలో నేను చేసిన పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ అయ్యింది’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్.