సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.
గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్‌కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.
(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment