
తమిళంలో మాత్రం కోట్లాది మంది అభిమానులున్న హీరో అజిత్. సదరు ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). తెలుగులో జనాలకు పెద్దగా నచ్చలేదు గానీ తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్లే వసూళ్లలో అజిత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
(ఇదీ చదవండి: తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?)
అజిత్ (Ajith) వన్ మ్యాన్ షో చేసిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో చాలావరకు ఎలివేషన్ షాట్సే ఉంటాయి. దీనికి తోడు అజిత పాత సినిమాల రిఫరెన్సులు కూడా గట్టిగానే ఉంటాయి. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.30.9 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్(Day 1 Collection) వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ వసూళ్లతో అజిత్.. తొలిరోజు వసూళ్లలో తన గత చిత్రాల కంటే ఎక్కువ సాధించాడు. సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. గతంలో పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాలేదు. తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తీసిన ఈ సినిమాకు లాంగ్ రన్ లో వంద రెండొందల కోట్లకు పైగా వసూళ్లు రావడం గ్యారంటీ ఏమో!
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
(ఇదీ చదవండి: తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?)