
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith)ను పేరు పెట్టి పిలిచినందుకు అందరూ తనను గుర్రుగా చూశారంటున్నాడు నటుడు రఘురామ్. ఇతడు ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్‌లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రఘురామ్ (Raghu Ram) మాట్లాడుతూ.. నేను పెరిగిందంతా ఢిల్లీలో.. ఉంటోంది ముంబైలో! అక్కడ మాకంటే పెద్ద స్థాయిలో ఉండేవారిని కూడా పేరు పెట్టే పిలుస్తాం. నాకూ అదే అలవాటైపోయింది.
తల కొట్టేసినట్లయింది
గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) షూటింగ్‌లో అజిత్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. నన్ను నేను పరిచయం చేసుకునే క్రమంలో అతడి పేరు పెట్టి పిలిచాను. అందరూ షాకయ్యారు. సెట్ నిశ్శబ్దంగా మారిపోయింది. అలా పేరు పెట్టి పిలవడం ఆయన్ను అవమానించినట్లు కాదా అన్నారు. నాకు తల కొట్టేసినట్లుగా అనిపించింది. అంత పెద్ద హీరోతో కలిసి నటించే ఛాన్స్ వస్తే నేనిలా చేశానేంటి? అనుకున్నాను. స్పెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు, సహాయ దర్శకుడు కూడా అజిత్‌ను పేరు పెట్టి పిలవొద్దన్నారు.
అందుకే అలా పిలుస్తున్నా..
సరే.. సర్ అని పిలుస్తానని చెప్పాను. సాధారణంగా ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరనుకుంటాను. జనాలు ఇబ్బందిపడుతున్నారని నేనే ఆయన్ను సర్ అనడం మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. రఘురామ్ ఝూఠా హై సహీ అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం య్యాడు. తీస్‌మార్ ఖాన్ మూవీలోనూ నటించాడు. తమిళంలో డాక్టర్, తెలుగులో గాంధీ తాత చెట్టు, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటించాడు.
చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment