Raghu ram
-
ఆ షో వల్లే జీవితం నాశనమైంది.. విడాకులు కూడా!
రియాలిటీ షోలలో ఎమ్‌టీవీ రోడీస్‌కి మంచి పాపులారిటీ ఉంది. 2003లో ఈ షో ప్రారంభమైంది. రోడీస్ మొదలైనప్పటినుంచి దాదాపు 10 సీజన్లపాటు అందులో ఒక జడ్జిగా కొనసాగాడు రఘు రామ్. తర్వాత టీమ్‌తో విభేదాల కారణంగా షో నుంచి తప్పుకున్నాడు. అతడు వెళ్లిపోయిన కొంతకాలానికే అతడి సోదరుడు రాజీవ్ కూడా షో నుంచి వైదొలిగాడు. అంతా అయిపోయింది తాజాగా రఘురామ్ ఈ షో వల్ల తను ఎంత ఇబ్బందిపడ్డాడో చెప్పుకొచ్చాడు. 'ఆ షో వల్ల ఏం జరగకూడదో అంతా జరిగిపోయింది. ముఖ్యంగా రెండు కారణాల వల్ల ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను. ఒకటి.. ఎమ్‌టీవీ ఆ షోను ఇంకో మార్గంలో తీసుకెళ్లాలనుకుంది. నేనందుకు ఒప్పుకోలేదు. పది సీజన్లదాకా స్వతంత్రంగా ఉన్నాను. కానీ పదవ సీజన్‌కు వచ్చేసరికి టీమ్, నాకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. విడాకులదాకా వెళ్లింది వ్యవహారం రెండోది.. మానసికంగా నన్ను దెబ్బకొట్టింది. రోడీస్ ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా వైవాహిక జీవితం కూడా సమస్యల్లో చిక్కుకుంది. చివరకు విడాకులు తీసుకోక తప్పలేదు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయి. షో నుంచి బయటకు రాక తప్పలేదు. కానీ బయటకు వచ్చి మంచి పనే చేశాను. నన్నూ పిలిచారు.. ఇందుకు ఎప్పుడూ బాధపడలేదు. నా సోదరుడు కూడా బయటకు వచ్చేస్తే తిరిగి రమ్మన్నారు, వెళ్లాడు. అలా నన్నూ పిలిచారు, నేను మాత్రం వెళ్లలేదు, వెళ్లను కూడా! ఒకప్పటి రోడీస్ షో కాదిది. అంతా మారిపోయింది. మేము ఆ షో నుంచి బయటకు వచ్చేసినప్పుడే దాని కథ ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చాడు. కాగా రఘురామ్.. నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరు 2016లో విడాకులు తీసుకున్నారు. చదవండి: ఇద్దరమ్మాయిలతో డేటింగ్.. గిల్టీగా ఉందన్న బాలీవుడ్ హీరో -
ఏపీలో 175 స్థానాలకు పోటీ చేసే దమ్ము బీజేపీకి ఉంది..!
-
హైదరాబాద్ డాక్టర్‌కు బ్రిటిష్ అత్యున్నత అవార్డు
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్ దగ్గర్లోని విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్‌లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్ ఈ అవార్డును పొందారు.కిమ్స్ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
మాజీ భర్త కుటుంబాన్ని క్లిక్‌మనిపించిన నటి!
టెలివిజన్ నిర్మాత, నటుడు రఘురాం, అతడి భార్య కెనడియన్ సింగర్ నటాలీ డి లూసియోలు తమ కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ముగ్గరి ఫొటోలను రఘురాం మాజీ భార్య, టీవీ నటి సుగంధ గార్గ్... వీరి ఫొటో షూట్‌ను నిర్వహించారు. తన కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలతో పాటు, భార్య నటాలి డి లూసియోతో కలిసి ఉన్న ఫొటోలకు ‘ప్రెజెంటింగ్.. ప్రౌడ్ పేరెంట్స్, బేబీ రిథమ్, డ్యాడీ లైఫ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి షేర్ చేశారు. కాగా ఈ పోస్టుకు ‘ఈ ఫొటోలను తీసినందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ భార్య సుగంధకు రఘురాం కృతజ్ఞతలు తెలిపారు. సుగంధ జార్గ్ తీసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ ‘రిథమ్ ఎంత ముద్దుగా ఉన్నాడు’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 6వ తేదిన రఘురాం భార్య నటాలి.. రిథమ్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. (అందుకే నా కొడుకుకు ఆ పేరు: నటుడు) View this post on Instagram Presenting... The Proud Parents! #BabyRhythm #DaddyLife @nataliediluccio Pic: @isugandha Thank you so much for the pics, Kuhu! A post shared by Raghu Ram (@instaraghu) on Jan 19, 2020 at 9:52pm PST ఇక రఘురాం షేర్ చేసిన ఈ పోస్టుకు ఆయన మాజీ భార్య సుగంధ గార్గ్.. ఆయనకు, నటాలికి హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. ‘ ఈ ఫోటో గడిచిన జ్ఞాపకాలకు గుర్తు... వెల్కమ్ రిథమ్. నువ్వు యోధులకు జన్మించావు’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2006లో సుగంధ గార్గ్, రఘురాంలు వివాహవ చేసుకోగా, 2016లో వీరిద్దరూ విడుకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో కెనడియన్ సింగర్ నటాలిని ఆయన వివాహం చేసుకున్నారు. View this post on Instagram A photo to commemorate the passing of time..Welcome Rhythm...You’ve been born to warriors. @instaraghu @nataliediluccio A post shared by Sugandha (@isugandha) on Jan 17, 2020 at 12:21pm PST -
నా పేరు చెప్పుకోండి చూద్దాం!
‘సృజనాత్మకత చిగురులు తొడిగే క్షణంలో నేను పుట్టాను... కాంతిలా.. ప్రేమలా విశ్వంలో వ్యాప్తి చెందుతాను... జీవన ప్రవాహపు ప్రతీ అలలోనూ నేను కనబడతాను... ప్రతీ హృదయపు లయలో.. ప్రతీ పాటలో నేను వినిపిస్తాను.... వాన చినుకులు ముఖాన్ని తాకుతున్నపుడు.. ఆస్వాదించే స్వర్గంలో... రుతువులు మారే సమయంలో కనిపిస్తాను... నేను ఏ ఒక్క సంస్కృతికో పరిమితం కాను... దేశాలు.. ఖండాలను దాటి ఉంటుంది నా పరిధి.... నేను ప్రపంచ వ్యాప్తం... నన్నెవరూ నిర్వచించలేరు... నేను అమరం.. నేను రిథమ్’ అంటూ ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్, స్ల్పిట్స్విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్ రఘురాం దంపతులు తమ కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. తన తొలి ఫొటోను షేర్ చేస్తూ.. అతడి పేరును కవితాత్మకంగా అభిమానులతో పంచుకున్నారు. కాగా ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం.. కెనడియన్ సింగర్ నటాలియో డి లూసీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట జనవరి 6న కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి రిథమ్‌గా నామకరణం చేసిన వీరు.. శుక్రవారం తొలిసారిగా తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఈ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన కొడుకుకు రిథమ్ అనే పేరును ఎంపిక చేయడం గురించి రఘురాం మాట్లాడుతూ... ‘ విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలతో ముడిపడి... మా కలయికను ప్రతిబింబించేలా ఉన్న పేరు కోసం అన్వేషించాం. రిథమ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని భావించాం. ముఖ్యంగా ఇది ఏ మతంతోనూ ముడిపడిన పేరు కాదు’ అని పేర్కొన్నాడు. కాగా రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. ఆ తర్వాత నటాలియోతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక రియాలిటీ షోలతో పాటు తీస్మార్ ఖాన్, జూటా హై సాహి వంటి సినిమాల ద్వారా రఘురాం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram I am Rhythm. I was born at the moment of creation. I permeate the universe. Like light. Like love. I am present in the very ebb and flow of life. I can be felt in every heart beat. You can hear me in every song. I can be found in the changing of seasons and in raindrops falling on a face turned up to the heavens. I cannot be contained in any one culture. I transcend countries and continents. I am global. Nay, I am Cosmic. Eternal. I am Rhythm. Hello World! 🤗 A post shared by Raghu Ram (@instaraghu) on Jan 9, 2020 at 7:00pm PST -
పౌరసత్వ చట్టానికి వక్రభాష్యాలేల?
దేశంలోని పలు ప్రాంతాల్లో పౌర సత్వ సవరణ చట్టం 2019కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొం టున్న వారిలో అత్యధికులు యువతీయువకులే. నెహ్రూ–లియాకత్ ఒప్పందం గురించి, పాకిస్తాన్ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ గురించి, అబ్దుల్ హక్ అలియాస్ మియాన్ మిథు గురించి, ఆసియా బీబీ గురించి, రవీనా–రీనా గురించి ఈ ఆందోళనలు చేస్తున్న వారిలో ఎంత మందికి తెలుసు? ఎంత తెలుసు? గత నెల 13న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో శుక్రవారం ప్రార్థనల అనంతరం విద్యార్థులంతా మూకుమ్మడిగా రోడ్లపైకి రావడంతో ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థులతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైతం ర్యాలీ చేశారు. ఈ ఒక్క సంఘటనను బట్టే ఈ ఆందోళనలన్నీ ఎలా మొదలవుతున్నాయో, ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసుకోవచ్చు. ఏదో జరిగిపోతోందని భ్రమిస్తున్న కొందరు ఇంకేదో జరిగిపోవచ్చు అని మరింతమందిని ఉసిగొల్పుతున్నారు. దురదృష్టం ఏమిటంటే.. అసలు ఏం జరుగుతోందన్న విషయం ఎవరికీ స్పష్టంగా తెలియకపోవడం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ముస్లిం మత దేశాలు. మతమే ఆ దేశాల రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసిస్తుంది. ఆయా దేశాల్లో ముస్లింలు కాని ఇతర మతస్తులపైన మతం మార్చుకోవాలన్న డిమాండ్లు, మైనార్టీ మతం కావటం వల్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అలా మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మైనార్టీలు భారతదేశంలోకి వచ్చి, ఆశ్రయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇది ముస్లిం వ్యతిరేక చట్టం అని చాలామంది అంటున్నారు. అసలు ఈ చట్టంతో భారతీయ ముస్లింలకు కానీ, మరే ఇతర మతస్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ చట్టం మూడు పొరుగు దేశాల్లోని వారికి మేలు చేసేందుకు ఉద్దేశించిన చట్టం. ఇక, ఆ మూడు దేశాలకు మాత్రమే ఈ చట్టాన్ని ఎందుకు పరిమితం చేశారు? పక్కనే ఉన్న మయన్మార్, నేపాల్, భూటాన్, శ్రీలంక మొదలైన దేశాలకు కూడా దీన్ని వర్తింపచేయొచ్చు కదా? అని కొందరు అంటున్నారు. నిజమే. ఏ దేశానికైనా దీన్ని వర్తింపచేయొచ్చు. అయితే, తొలుత అంగీకరించాల్సిన వాస్తవం ఏమిటంటే.. ఈ చట్టంలో ఎలాంటి తప్పూ లేదు, కాకపోతే దీని పరిధిని విస్తరించి ఉంటే బాగుండేది అని. వాస్తవానికి ఏ దేశం నుంచి అయినా ఎవరైనా శరణార్థిగా భారత్‌కు రావొచ్చు. వారివారి అర్హతలను బట్టి భారతీయ పౌరసత్వం పొంద వచ్చు. మతపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఈ మూడు దేశాల మైనార్టీలకూ చారిత్రక నేపథ్యంలో, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక శ్రీలంక హిందువులు మతపరమైన ఒత్తిళ్లను ఎదుర్కోవడం లేదు. వారిది జాతుల సంఘర్షణ. మయన్మార్‌లో హిందువులను కూడా ఊచకోత కోస్తున్నారు. వారికి కూడా ఈ చట్ట ప్రకారం మేలు చేసి ఉండా ల్సింది. అయితే, దీని పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో తప్పులేదు. ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మొదలైన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. నిజానికి పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. అందులో రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదు. పౌరసత్వం ఇవ్వాలన్నా, తొలగించాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఈ చట్టం అమలు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే. మరి రాష్ట్రాలు దీన్ని ఎలా తిరస్కరిస్తాయి? అబ్దుల్ హక్ అలియాస్ మియాన్ మిథు పాకిస్తాన్లో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గత పదేళ్ల కాలంలో ఇతను చేసిన, చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని కిడ్నాప్ చేయడం, బలవంతంగా మతం మార్చడం, నిండా 18 ఏళ్లు లేని ఆ అమ్మాయిల్ని కాటికి కాళ్లు చాచిన ముస్లిం వృద్ధులకిచ్చి పెళ్లిళ్లు చేయడం.. ఇతని దురాగతాలపై మీడియా కానీ, ప్రపంచం కానీ దృష్టి సారించడంలేదు. సరిగ్గా పదేళ్ల కిందట పంజాబ్ ప్రావిన్సులో ఆసియా నౌరీన్ అనే ఒక క్రిస్టియన్ మహిళ మత ప్రవక్తను కించపర్చిందంటూ తప్పుడు కేసు పెట్టారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. పంజాబ్ గవర్నర్ సహా చాలామంది ఈ కేసు తప్పుడు కేసు అంటూ ఆసియా బీబీకి మద్దతుగా నిలిచారు. దాదాపు దశాబ్దకాలంపాటు ఆసియా బీబీ న్యాయ పోరాటం చేసింది. చివరికి సుప్రీంకోర్టు ఆమె ఉరిశిక్షను రద్దు చేసింది. సింధ్ ప్రావిన్సులో రవీనా–రీనా హిందూ అమ్మాయిలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల తర్వాత ముస్లిం మతంలోకి మారి, ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. మతం మారిన తరువాత వాళ్ల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లే స్వేచ్ఛ లేదు. ఇలాంటి బాధితుల కోసం చేసిన చట్టాన్ని స్వాగతించాల్సిందిపోయి రాజకీయం చేయడం ఎవరికోసమో? 1950 ఏప్రిల్ 8న నెహ్రూ–లియాకత్ ఒప్పందం మేరకు భారతీయ ముస్లింలకు, ఇతర మైనారిటీ మతస్థులకు సంపూర్ణ స్వేచ్ఛ, ఇతర హక్కులను రాజ్యాంగంలోనే పొందుపర్చామని నాటి భారత్ ప్రధాని నెహ్రూ పేర్కొనగా పాకిస్తాన్ రాజ్యాంగంలో ఇలాంటి హక్కులు అక్కడి మైనారిటీలకు ఇవ్వలేదని పలువురు చేసిన వాదనలను నెహ్రూ పట్టించుకోకుండా పాక్ లోని మైనారిటీ మతస్తులకు తీరని అన్యాయం చేశారు. ఈ తప్పును 70 ఏళ్ల కిందటే గుర్తించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించినా నెహ్రూ వినకపోవడంతో ముఖర్జీ తన మంత్రిపదవికి రాజీనామా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో జోగేంద్రనాథ్ మండల్లాగే బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలస వచ్చిన మహా నాయకులే ఎలాంటి గుర్తింపు లేకుండా చనిపోవాల్సి వచ్చింది. కానీ, ఆ దేశం నుంచి వచ్చిన ముస్లింలను మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుగా మార్చుకుంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. చారిత్రక అన్యా యాన్ని సరిదిద్దటానికి బీజేపీ ప్రయత్నిస్తే దీన్ని అక్రమం, అన్యాయం అంటూ గోల చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీయే అని ప్రజలు నమ్ముతున్నారు. చరిత్రాత్మక చట్టాలతో, చర్యలతో నరేంద్ర మోదీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
నరసాపురానికి ఈవో రఘురామ్ మృతదేహం
సాక్షి, పశ్చిమగోదావరి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆదివారం జరిగిన టూరిజం బోటు ప్రమాదంలో మృతి చెందిన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈవో వలవల రఘురామ్ పార్ధీవ దేహాన్ని ఆయన నరసాపురం తరలించారు. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాళులర్పించారు. ఈవో ఉద్యోగాన్ని రఘురామ్ భార్యకు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేవరకు రఘురామ్ మృతి చెందిన విషయం ఇంట్లో వాళ్లకి తెలియనివ్వలేదు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతూ వచ్చారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రఘురామ్ తల్లికి గుండె సంబంధిత జబ్బు ఉండడంతో ఆమెకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఇంట్లో రఘురామ్ మృతదేహాన్ని చూసి నాగజ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. -
రాష్ట్రానికి దశ, దిశ ప్రజా సంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నయవంచక పాలనను అంతమొందించే లక్ష్యంతో 2003లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి రాష్ట్రంలో సుస్థిర పాలన అందించిన మాదిరిగానే నేడు మరోసారి చంద్రబాబు ప్రజాకంటక పాలనకు తెరదించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రతో చరిత్ర పునరావృతం కానుందని ప్రజలంతా భావిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం పేర్కొన్నారు. గురువారం ఆయన విశాఖలోని పార్టీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర విశేషాలను విలేకరులకు వివరించారు. ప్రతి అడుగూ సంచలనమే గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌కు దశా దిశను నిర్దేశించేలా అప్రతిహతంగా సాగుతోందని తలశిల చెప్పారు. తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్ సాగిస్తున్న ప్రజా పోరాటాలు ఒక ఎత్తయితే.. ఈ ప్రజా సంకల్ప యాత్ర మరో ఎత్తన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో ప్రతి అడుగు ఓ సంచలనమేనన్నారు. పాదయాత్రలో జనవాహినితో కృష్ణా బ్యారేజ్ కంపించిందని, గోదావరి బ్రిడ్జి కిక్కిరిసిపోయిందని, విశాఖ తీరం పోటెత్తిందని చెప్పారు. చరిత్రను తిరగరాసేలా సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్ద 1,000 కిలోమీటర్లు, ఏలూరు వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటగా ఈ నెల 24న విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనుందని తెలిపారు. జగన్ పాదయాత్ర చూసే బాబు నిర్ణయాలు సీఎం చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని జగన్ పాదయాత్ర డిసైడ్ చేస్తోందని తలశిల రఘురాం పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర వల్లే హోదాపై బాబు యూటర్న్ తీసుకున్నారని, అంగన్వాడీలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారని, ఆశా వర్కర్ల గౌరవవేతనం పెంచారని, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశారని, 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ వేశారని, బీసీలకు ఆదరణ పథకం, హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచారని.. ఇవన్నీ జగన్ చేసిన డిమాండ్లేనని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లుగా జనంలోనే జగన్ జగన్ పాదయాత్ర ఇంకా రెండు జిల్లాలు మిగిలి ఉండగానే మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిందంటే ప్రజలు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని తలశిల తెలిపారు. పాదయాత్రలో జగన్‌కు లభిస్తున్న జనాదరణ బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లభించిన దాఖలాలు లేవన్నారు. ఎక్కడైనా ఓ నాయకుడ్ని ఒకరోజు చూస్తారు. రెండ్రోజులు చూస్తారు అంతేకానీ ఎప్పుడూ వెన్నంటే ఉండరని, కానీ తొమ్మిదేళ్లుగా జగన్ ప్రజల్లో ఉన్నప్పటికీ ఏరోజూ, ఎక్కడా జనాదరణ తగ్గకపోవడం గొప్ప విషయమన్నారు. పాదయాత్రలో జననేతను చూసేందుకు ఊళ్లకు ఊళ్లు, నగరాలకు నగరాలు కదిలి వస్తుండడం పట్ల పార్టీ నేతలుగా గర్విస్తున్నామన్నారు. కుట్రలపై కల్లాపి నీళ్లు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజాసంక్షేమ పాలనకు మించి అందించాలన్న పవిత్రమైన లక్ష్యంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని తలశిల చెప్పారు. పాదయాత్రలో పలు చోట్ల టీడీపీ నేతలు విచ్ఛిన్నానికి కుట్రలు చేశారని, కొన్ని చోట్ల పసుపునీళ్లు చల్లారని, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించినా తమ పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేశారన్నారు. టీడీపీ నేతలు పసుపు నీళ్లు చల్లితే వారి అవినీతిపై ప్రజలే కల్లాపి నీళ్లు చల్లి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2019లో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ సర్కార్ ఏర్పడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తలశిల తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు తైనాల విజయ్‌కుమార్, రవి రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, వై.అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశపాత్రునిపాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల మైలురాయి ఈనెల 24వతేదీన విజయనగరంలో అడుగు పెట్టబోతున్న ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట మండలం దేశపాత్రునిపాలెం వద్ద మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుందని, ఈ అరుదైన ఘట్టానికి గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన పైలాన్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారని తలశిల తెలిపారు. ఈ సందర్భంగా దేశపాత్రునిపాలెం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 115 నియోజకవర్గాల పరిధిలో 193 మండలాలు, 1650 గ్రామాలు, 44 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల మీదుగా జగన్ పాదయాత్ర సాగిందన్నారు. 106 బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారని, 41 చోట్ల వివిధ సామాజిక వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. జగన్ దారి పొడవునా లక్షలాది మందిని నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుని తమ ప్రభుత్వం వస్తే ఎలా మేలు చేస్తుందో వివరిస్తూ భరోసా నింపారన్నారు. పాదయాత్రలో అందే విజ్ఞాపనలను తీసుకోవడానికే పరిమితం కాకుండా పరిష్కారం కోసం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పాదయాత్ర ఓ పరిష్కారాన్ని చూపిస్తోందన్నారు. -
సింగర్‌తో ప్రొడ్యూసర్ ఎంగేజ్మెంట్
ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్, స్ల్పిట్స్విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్ రఘురాం తన గర్ల్‌ఫ్రెండ్ నటాలియో డి లూసీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. టొరంటోలో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు టీవీ నటుడు కరణ్వీర్ బోహ్రాతో పాటు అతడి భార్య తీజాయ్ కూడా హాజరయ్యారు. రఘురాం, నటాలియోతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన తీజాయ్..‘ మేము ఈ రోజు టొరంటోలో ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. మాకెంతో ప్రియమైన స్నేహితుల కోసం ఇక్కడికి వచ్చాం. రఘు.. చాలా స్వీట్, ఇంటెలిజెంట్ పర్సన్. అన్ని రకాల సంతోషాలు పొందడానికి నువ్వు మాత్రమే అర్హుడివి. మీ ఇద్దరి(రఘు, నటాలియో)ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. కెనడియన్ అమ్మాయిలు ఎప్పుడూ ప్రత్యేకమే కదా’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. గత కొంత కాలంగా కెనడియన్ సింగర్ నటాలియోతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. The main reason we were in Toronto - to see two of our dearest friends get engaged. :) Raghu - You have always been one of the people I love most - so sweet, so kind, so intelligent, and so funny (especially at 8am!!) 😄 If anyone deserves happiness, it's you and I'm so glad you found it with Natalie. (Aren't Canadians awesome?) ;) You guys are so great together! 😍 Biggest hug ever to you.. ❤ @instaraghu @nataliediluccio A post shared by Teejay Sidhu (@bombaysunshine) on Aug 4, 2018 at 11:40am PDT -
ప్రకృతే స్ఫూర్తి
జీవితం, ప్రకృతి ఆయన ఛాయాచిత్రానికి స్ఫూర్తి! బండరాళ్లను ఆయన కెమెరా ఎంత అందంగా చూపించగలదో సామాన్యుడి జీవనాన్ని అంతే హృద్యంగా బంధించగలదు.. అందుకు సాక్ష్యం.. హైదరాబాద్ రాక్స్.. భోపాల్ దుర్ఘటన! అందుకేనేమో ఆ ప్రతిభకు 70ల్లోనే మాగ్నమ్ ఫోటోస్సభ్యత్వం ఇచ్చి సత్కరించింది వరల్డ్ ప్రెస్ ఫోటో తన జ్యూరీలో మెంబర్‌ను చేసుకుంది.. ఆయనే.. భారతదేశంలో ఫొటోగ్రఫీకి ఓ కళగా గుర్తింపుతెచ్చిన కళాకారుడు రఘురాయ్! నికాన్ ఇండియా హాట్స్ నిర్వహించిన ‘పవర్ యువర్ క్లిక్స్’ సెమినార్లోపాల్గొనడానికి సిటీకి వచ్చిన ఈ మేస్ట్రోతో సంభాషణ.. ..:: సరస్వతి రమ హైదరాబాద్.. గొప్ప హిస్టారికల్ సిటీ. ఏ సృజనకారుడికైనా బోలెడంత స్ఫూర్తినిచ్చే ప్రాంతం! ఇక్కడి ఇస్లామ్ కల్చర్ వెరీ డీప్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇస్లామ్ ఆర్కిటెక్చర్ అండ్ హరిటేజ్ వెరీ మీనింగ్ ఫుల్. పాతబస్తీ.. అక్కడి గల్లీలు అన్నీ నాకు చాలా ఇష్టం. ఇక్కడి మహిళలు.. చాలా అంకితభావంతో కనిపిస్తారు. దేశంలోకి కెమెరా వచ్చిన వెంటనే హైదరాబాదూ దాన్ని అడాప్ట్ చేసుకుంది. రాజా దీన్‌దయాళ్ తన ఫొటోగ్రాఫ్స్‌తో ఈ కళను అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టాడు. కానీ ఆ పరంపరను కొనసాగించే శక్తి ఇక్కడి ఫొటోగ్రాఫర్లలో కొరవడిందేమో అనిపిస్తోంది. ఆశించనంతగా కంట్రిబ్యూషన్ కనిపించడంలేదు. దీన్‌దయాళ్ లాంటి వాళ్లు ఈ కళే ఊపిరిగా బతికారు. దానికోసం అంకితమైపోయారు. అలాంటి దీవానాపన్ తర్వాత తరంలో కనిపించలేదు. నా ఫ్రెండ్ రవీందర్‌రెడ్డి హైదరాబాద్ హెరిటేజ్ అండ్ కల్చర్‌ని ఫొటో డాక్యుమెంటేషన్ చేస్తానంటున్నాడు. ‘ఆ పని నువ్ తొందరగా చేయకపోతే నేనొచ్చి చేస్తాను’అన్నాను. ఆర్ట్ అండ్ కల్చర్ విలువ తెలియదు బ్రిటిష్ గవర్నమెంట్ ఈవెన్ ఈస్టిడింయా కంపెనీ.. వాళ్ల అంపైర్‌ని కెమెరాలో బంధించింది. ఫోటో ఆల్బమ్‌ని తయారుచేసింది. వాళ్లది సివిలైజ్డ్ సొసైటీ. ఆ ఫొటో డాక్యుమెంటేషన్ని చాలా విలువైనదిగా భావించారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వయసులో ఉన్నప్పుడే ముసలిదైంది. ఇప్పటికీ మన ప్రభుత్వానికి ఆర్ట్ అండ్ కల్చర్ విలువ తెలియదు. మనమేంటి.. మన రూట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి, వాటిని భద్రపర్చాలన్న ధ్యాస లేదు. అసలలాంటివాటిని లెక్కే చేయవు మన ప్రభుత్వాలు. సిగ్గుపడాల్సిన విషయం. దీనికి సంబంధించి ప్రభుత్వంలోని ఏ శాఖా పట్టించుకోకపోవడం మన దురదృష్టం. ఫొటోగ్రఫీ లేని టైమ్‌లో కూడా బ్రిటన్ లాంటి దేశాల్లో పెద్ద ఆర్టిస్టులతో స్కెచెస్ వేసుకొని మరీ హెరిటేజ్ అండ్ కల్చర్‌ని భద్రపర్చుకున్నారు వాళ్లు. టెక్నాలజీ ఇంత వృద్ధి సాధించింది.. చక్కటి కెమెరాలు వచ్చాయి.. అయినా మనదేశం ఇంత నాలాయక్లా ఎందుకు ప్రవర్తిస్తోంది? వాళ్లను వాళ్లు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.. ఏయే రంగాల్లో ప్రతిభావంతులున్నారో గ్రహించి ఆయా రంగాల్లోని ఇన్క్లూడింగ్ ఫోటోగ్రఫీ ఆర్టిస్టులతో మన దేశానికి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్‌ని డాక్యుమెంటేషన్ చేయాలి. మ్యాగ్నమ్ క్లబ్.. డెబ్భెల్లో నాకు అందులో సభ్యత్వం అందింది. తర్వాత ఇప్పుడు ఓ 24 ఏళ్ల కుర్రాడికి వచ్చింది. వరల్డ్ ఫొటోగ్రఫీకి ఇండియా కాంట్రిబ్యూషన్ చాలానే ఉన్నప్పటికీ మాగ్నమ్ క్లబ్లో నా తర్వాత ఇన్నేళ్ల దాకా మళ్లీ ఎవరికీ ఎందుకు సభ్యత్వం రాలేదు అంటే.. మాగ్నమ్ క్లబ్ ఎప్పుడూ టాలెంటెడ్ అండ్ డిఫరెంట్ ఫొటోగ్రాఫర్ల కోసం అన్వేషిస్తుంటుంది. బహుశా ఇన్నేళ్లదాకా ఆ క్లబ్ అన్వేషణలో ఇండియానుంచి ఎవరూ చిక్కలేదేమో. ఫిలిం రోల్ నుంచి డిజిటల్దాకా.. డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లు అవుతున్నారు... దీనివల్ల ఆర్ట్‌గా ఉన్న ఫొటోగ్రఫీ డైల్యూట్ అవుతున్న మాట వాస్తవమే కానీ... ప్రయోగాలైతే దండిగా జరుగుతున్నాయి కదా. వీళ్లలోంచి ఓ మంచి ఫొటోగ్రాఫర్ పుట్టుకొస్తాడేమో ఎవరికేం తెలుసు? మంచి ఫొటోగ్రఫీకి ఇదో వేదికా అవునున్నదేమో! ప్రతివాళ్లకూ ఆడే హక్కు ఉంది. అలా ఆడితేనే ప్రతిభ బయటకు వస్తుంది. అయితే న్యూడిజిటల్ టెక్నాలజీతో ఫొటోగ్రఫీ చాలా ఈజీ. బుర్రపెట్టాల్సిన పనిలేదు. అదే అన్నీ చేస్తుంది. దీనివల్ల బద్ధకం పెరిగే ప్రమాదమూ ఉంది. ఫిలింరోల్ ఉన్నప్పుడు ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నామో ఇప్పుడూ అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలి. కళకు జీవం సృజన ఫొటోగ్రఫీ నేర్పించే ఇన్స్టిట్యూట్లు దేశంలో చాలానే ఉన్నాయి. నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన 45 ఏళ్లకు (2009లో) రఘురాయ్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీని స్టార్ట్ చేశాను. మిగిలిన శిక్షణసంస్థలకు, ఢిల్లీలోని నా ఇన్స్టిట్యూట్కి తేడా ఒక్కటే. అవన్నీ ఔట్‌డేటెడ్ సిలబస్‌ను బోధిస్తాయి. మా ఇనిస్టిట్యూట్ ఔత్సాహికుల్లో ఉన్న సృజనను వెలికి తీస్తుంది. హైదరాబాద్‌లో రఘురాయ్ సెంటర్ శాఖ..? ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రఘురాయ్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్ వ్యాపారం కోసం పెట్టింది కాదు. అలాంటి సెంటర్ ఒకటి హైదరాబాద్‌లోనూ ఉండాలనే లక్ష్యంతో ఎవరైనా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే నావంతు సహాయం తప్పకుండా చేస్తాను. -
తమషాగా ఉంటుందట
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, నీలం ఉపాధ్యాయ, సునీత మార్షియా ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమాషా’. ఎం.విజయవర్దన్‌రావు, శివారెడ్డి నీలపు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణ గోగుల కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీనివాస్ బల్లా అద్భుతమైన కథ తయారు చేశారు. మలయాళ దర్శకుడు సిద్దిక్ శిష్యుడైన శ్రీనివాస్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తీస్తారనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు. నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని దర్శకుడు చెప్పారు. మంచి నిర్మాతలు దొరికితేనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని, అనుకున్నట్లే మంచి నిర్మాతలు దొరికారని శ్రీ అన్నారు. సంగీతానికి మంచి ఆస్కారం ఉన్న సినిమా ఇదని సంగీత దర్శకుడు రఘురాం అన్నారు. సయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రవిప్రకాష్, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జి.సందీప్, సంగీతం: రఘురామ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.రావు, నిర్మాణ సారథ్యం: ఎస్.ముకుందరావు. -
రైతులను ఆదుకుంటాం
అచ్చంపేట రూరల్, న్యూస్‌లైన్ : తుఫాన్ బా ధితులను పరామర్శిస్తూ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నల్లమలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యటించారు. వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ హైదరాబాద్ అదనపు సంచాల కులు విజయలక్ష్మి, జిల్లా డిప్యూటీ డెరైక్టర్ ర ఘురాం, ఏరువాక రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ, హైదరాబాద్ ఏడీఏలు శైలజ, శ్రీనివాసచారి, అచ్చంపేట సహాయ సంచాలకులు సరళకుమారి తదితరులు అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో పర్యటించి పంటపొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించామని తెలిపారు. రైతులతో నేరుగా మాట్లాడి జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయి అధికారులతో అంచనా వేయిస్తున్నామని చెప్పారు. రైతులు భయపడాల్సిన అవసరంలేదని, పరిహారం అందిస్తామన్నారు. పర్యటనలో ఎమ్మెల్యే రాములు, టీడీపీ రాష్ట్ర నాయకులు పి. మనోహర్, తులసీరాం, నియోజకవర్గ వ్యవసాయాధికారులు కృష్ణమోహన్, జగదీశ్వరచారి, సర్పంచ్ తదితరులున్నారు. పంటలను పరిశీలించిన రాష్ట్ర అధికారి తెలకపల్లి : మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంటపొలాలను వ్యవసాయ రాష్ట్ర అడిషనల్ డెరైక్టర్ విజయలక్ష్మి ఆదివారం సందర్శించారు. తాళ్లపల్లి, నడిగ డ్డ గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతుల ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జిల్లా అధికారు ల నివేదికల ఆధారంగా ప్రతిరైతును అన్నివి ధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.ఆమె వెంట ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, ఏడీఏ మునిస్వామి, డీడీఏ రఘరాములు, ఇ తర వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.