అచ్చంపేట రూరల్, న్యూస్‌లైన్ : తుఫాన్ బా ధితులను పరామర్శిస్తూ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నల్లమలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యటించారు. వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ హైదరాబాద్ అదనపు సంచాల కులు విజయలక్ష్మి, జిల్లా డిప్యూటీ డెరైక్టర్ ర ఘురాం, ఏరువాక రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ, హైదరాబాద్ ఏడీఏలు శైలజ, శ్రీనివాసచారి, అచ్చంపేట సహాయ సంచాలకులు సరళకుమారి తదితరులు అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో పర్యటించి పంటపొలాలను సందర్శించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించామని తెలిపారు. రైతులతో నేరుగా మాట్లాడి జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయి అధికారులతో అంచనా వేయిస్తున్నామని చెప్పారు. రైతులు భయపడాల్సిన అవసరంలేదని, పరిహారం అందిస్తామన్నారు. పర్యటనలో ఎమ్మెల్యే రాములు, టీడీపీ రాష్ట్ర నాయకులు పి. మనోహర్, తులసీరాం, నియోజకవర్గ వ్యవసాయాధికారులు కృష్ణమోహన్, జగదీశ్వరచారి, సర్పంచ్ తదితరులున్నారు.
పంటలను పరిశీలించిన రాష్ట్ర అధికారి
తెలకపల్లి : మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంటపొలాలను వ్యవసాయ రాష్ట్ర అడిషనల్ డెరైక్టర్ విజయలక్ష్మి ఆదివారం సందర్శించారు. తాళ్లపల్లి, నడిగ డ్డ గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతుల ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జిల్లా అధికారు ల నివేదికల ఆధారంగా ప్రతిరైతును అన్నివి ధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.ఆమె వెంట ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, ఏడీఏ మునిస్వామి, డీడీఏ రఘరాములు, ఇ తర వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.
రైతులను ఆదుకుంటాం
Published Mon, Oct 28 2013 2:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement