ఆ షో వల్లే జీవితం నాశనమైంది.. విడాకులు కూడా! | Ex Roadies judge Raghu Ram Blames MTV show for His Divorce | Sakshi
Sakshi News home page

ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా!

Published Thu, Apr 11 2024 5:25 PM | Last Updated on Thu, Apr 11 2024 5:56 PM

Ex Roadies judge Raghu Ram Blames MTV show for His Divorce - Sakshi

రియాలిటీ షోలలో ఎమ్‌టీవీ రోడీస్‌కి మంచి పాపులారిటీ ఉంది. 2003లో ఈ షో ప్రారంభమైంది. రోడీస్‌ మొదలైనప్పటినుంచి దాదాపు 10 సీజన్లపాటు అందులో ఒక జడ్జిగా కొనసాగాడు రఘు రామ్‌. తర్వాత టీమ్‌తో విభేదాల కారణంగా షో నుంచి తప్పుకున్నాడు. అతడు వెళ్లిపోయిన కొంతకాలానికే అతడి సోదరుడు రాజీవ్‌ కూడా షో నుంచి వైదొలిగాడు.

అంతా అయిపోయింది
తాజాగా రఘురామ్‌ ఈ షో వల్ల తను ఎంత ఇబ్బందిపడ్డాడో చెప్పుకొచ్చాడు. 'ఆ షో వల్ల ఏం జరగకూడదో అంతా జరిగిపోయింది. ముఖ్యంగా రెండు కారణాల వల్ల ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను. ఒకటి.. ఎమ్‌టీవీ ఆ షోను ఇంకో మార్గంలో తీసుకెళ్లాలనుకుంది. నేనందుకు ఒప్పుకోలేదు. పది సీజన్లదాకా స్వతంత్రంగా ఉన్నాను. కానీ పదవ సీజన్‌కు వచ్చేసరికి టీమ్‌, నాకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి.

విడాకులదాకా వెళ్లింది వ్యవహారం
రెండోది.. మానసికంగా నన్ను దెబ్బకొట్టింది. రోడీస్‌ ద్వారా వచ్చిన క్రేజ్‌ వల్ల వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా వైవాహిక జీవితం కూడా సమస్యల్లో చిక్కుకుంది. చివరకు విడాకులు తీసుకోక తప్పలేదు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయి. షో నుంచి బయటకు రాక తప్పలేదు. కానీ బయటకు వచ్చి మంచి పనే చేశాను.

నన్నూ పిలిచారు..
ఇందుకు ఎప్పుడూ బాధపడలేదు. నా సోదరుడు కూడా బయటకు వచ్చేస్తే తిరిగి రమ్మన్నారు, వెళ్లాడు. అలా నన్నూ పిలిచారు, నేను మాత్రం వెళ్లలేదు, వెళ్లను కూడా! ఒకప్పటి రోడీస్‌ షో కాదిది. అంతా మారిపోయింది. మేము ఆ షో నుంచి బయటకు వచ్చేసినప్పుడే దాని కథ ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చాడు. కాగా రఘురామ్‌.. నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరు 2016లో విడాకులు తీసుకున్నారు.

చదవండి: ఇద్దరమ్మాయిలతో డేటింగ్‌.. గిల్టీగా ఉందన్న బాలీవుడ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement