సాక్షి, పశ్చిమగోదావరి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆదివారం జరిగిన టూరిజం బోటు ప్రమాదంలో మృతి చెందిన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈవో వలవల రఘురామ్ పార్ధీవ దేహాన్ని ఆయన నరసాపురం తరలించారు. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాళులర్పించారు. ఈవో ఉద్యోగాన్ని రఘురామ్ భార్యకు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేవరకు రఘురామ్ మృతి చెందిన విషయం ఇంట్లో వాళ్లకి తెలియనివ్వలేదు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతూ వచ్చారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రఘురామ్ తల్లికి గుండె సంబంధిత జబ్బు ఉండడంతో ఆమెకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఇంట్లో రఘురామ్ మృతదేహాన్ని చూసి నాగజ్యోతి కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment