సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన కుమారుడు ఆస్పత్రి నుంచి ఆమెను సైకిల్‌పై తన నడుముకు కట్టుకుని 15 కిలోమీటర్లు పయనించాడు. ఈ ఘటన తమిళనాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. నెల్‌లై జిల్లా నాంగునేరి సమీపంలో వడక్కు మీన్‌వన్‌కుళం, మాతాకోవిల్ వీధికి చెందిన బాలన్ (38) మానసిక రోగి. ఇతని తల్లి శివగామి అమ్మాల్ (60) కూడా మానసిక రోగి. వీరు నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య విభాగంలో చికిత్స పొందుతూ వచ్చారు.
ఈ స్థితిలో వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి బాలన్ వైద్యం చేయిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా శివకామి అమ్మాల్ కింద పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దీంతో ఆమెను నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రిలో బాలన్ చేర్చాడు. ఈ స్థితిలో గురువారం నెల్‌లై ఆస్పత్రిలో ఉన్న తల్లిని బాలన్ బయటకు తీసుకొచ్చాడు. తర్వాత తన సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు.
కిందకు వాలిపోతున్న ఆమెను తాడుతో తన నడుముకు కట్టుకుని సైకిల్‌పై బయలుదేరాడు. అక్కడి నుంచి 15 కిలో మీటర్ల దూరం నెల్‌లై–కన్యాకుమారి జాతీయ రహదారిపై వెళ్లాడు. రాత్రి మూండ్రైపాళయం వద్ద బాలన్ సైకిల్‌పై నిలిచి ఉండగా, అక్కడ ఉన్న వారు బాలన్ వెనుక కూర్చుని ఉన్న తల్లి మృతిచెందినట్టు గుర్తించారు. తర్వాత మానసిక రుగ్మతతో ఉన్న కుమారుడు తల్లి మరణించిన విషయం కూడా తెలియకుండా సైకిల్‌పై వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కీల్‌కడంలో ఉన్న బాలన్ సోదరుడు సవరిముత్తు (43)ను రప్పించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
video credit to : Dinamalar
Comments
Please login to add a commentAdd a comment