Mental patient
-
తల్లి ఊపిరి ఆగిందని తెలియక..
సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన కుమారుడు ఆస్పత్రి నుంచి ఆమెను సైకిల్‌పై తన నడుముకు కట్టుకుని 15 కిలోమీటర్లు పయనించాడు. ఈ ఘటన తమిళనాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లై జిల్లా నాంగునేరి సమీపంలో వడక్కు మీన్వన్కుళం, మాతాకోవిల్ వీధికి చెందిన బాలన్ (38) మానసిక రోగి. ఇతని తల్లి శివగామి అమ్మాల్ (60) కూడా మానసిక రోగి. వీరు నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య విభాగంలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి బాలన్ వైద్యం చేయిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా శివకామి అమ్మాల్ కింద పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దీంతో ఆమెను నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో బాలన్ చేర్చాడు. ఈ స్థితిలో గురువారం నెల్లై ఆస్పత్రిలో ఉన్న తల్లిని బాలన్ బయటకు తీసుకొచ్చాడు. తర్వాత తన సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు. కిందకు వాలిపోతున్న ఆమెను తాడుతో తన నడుముకు కట్టుకుని సైకిల్‌పై బయలుదేరాడు. అక్కడి నుంచి 15 కిలో మీటర్ల దూరం నెల్లై–కన్యాకుమారి జాతీయ రహదారిపై వెళ్లాడు. రాత్రి మూండ్రైపాళయం వద్ద బాలన్ సైకిల్‌పై నిలిచి ఉండగా, అక్కడ ఉన్న వారు బాలన్ వెనుక కూర్చుని ఉన్న తల్లి మృతిచెందినట్టు గుర్తించారు. తర్వాత మానసిక రుగ్మతతో ఉన్న కుమారుడు తల్లి మరణించిన విషయం కూడా తెలియకుండా సైకిల్‌పై వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కీల్కడంలో ఉన్న బాలన్ సోదరుడు సవరిముత్తు (43)ను రప్పించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. video credit to : Dinamalar -
పోలీసుల అరాచకం.. మానసిక రోగి చేతులు వెనక్కు కట్టి..
చెన్నై: నాగై సమీపంలో మానసిక రోగి రెండు చేతులు వెనుకకు కట్టి పోలీసులు చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. నాగై జిల్లా కొల్లిడం సమీపం బట్విలాకం గ్రామానికి చెందిన జాన్సన్ (47) మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఇతనికి వివాహం కాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న జాన్సన్ ఎదురు ఇంట్లో ఉంటున్న అన్న చార్లెస్ (55) వద్ద ఖర్చులకు నగదు తీసుకొనే వాడని తెలిసింది. రోజులాగే శనివారం అన్న చార్లెస్ వద్దకు వెళ్లి ఖర్చులకు నగదు ఇవ్వాలని అతన్ని ఇబ్బంది పెట్టాడు. దీంతో విసిగిపోయిన చార్లెస్ తమ్ముడు జాన్సన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కొల్లిడం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కొల్లిడం కానిస్టేబుల్ కన్నన్ బట్విలాకంకు వెళ్లి జాన్సన్‌ను విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు రమ్మని పిలిచారు. ఆ సమయంలో జాన్సన్ కర్రతో పోలీసు కన్నన్ తలపై దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న కొల్లిడం ఇన్స్పెక్టర్ మునిశేఖర్, పోలీసులు అక్కడికి వెళ్లి ఇంటిలోపల ఉన్న జాన్సన్‌ను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి అతని రెండు చేతులు వెనుకకు కట్టి లాఠీలతో చితకబాదారు. అక్కడ గుమికూడిన గ్రామస్తులు ఇన్స్పెక్టర్ను ప్రశ్నించగా వారిని బెదిరించినట్టు తెలిసింది. తరువాత జాన్సన్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సమాచారం తెలుసుకున్న చార్లెస్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ్ముడిని విడిపించి తీసుకొచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వెలువడడంతో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
కశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
-
కశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
ఇద్దరు సైనికులకు గాయాలు శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఆర్మీపై దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని పారింపురా నుంచి పంథాచౌక్కు వెళ్తున్న ఆర్మీ వాహనశ్రేణిపై శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు స్కిమ్స్ ఆసుపత్రి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో చివరి వాహనంలో ఉన్న ఇద్దరు సైనికులు గాయాలపాలయ్యారు. ఆ సమయంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. బలగాలు ప్రతిదాడి చేయడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. హోటల్లో మానసిక రోగి వీరంగం శ్రీనగర్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం లాల్‌చౌక్‌లో శనివారం కాల్పులు కలకలం రేపాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దుకాణాలన్నీ మూతపడ్డాయి. జనం మధ్య భయోత్పాతం సృష్టించిన ఓ మానసిక రోగిని పట్టుకునేందుకు పోలీసులు గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక్కడి ఓ హోటల్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి అందులో ఉగ్రవాదులు ఉన్నారని, అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హల్చల్ చేశాడని వెల్లడించారు. అక్కడికి పోలీసులు రావడంతో అతడు పారిపోవడానికి ప్రయత్నించగా వారు హెచ్చరికగా కాల్పులు జరిపారని పేర్కొన్నారు. చివరికి అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
కమాన్...గూగుల్ ఆన్సర్ మీ!
అతనో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్..అతను తనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన గూగుల్ తల్లిని ఆశ్రయిస్తాడు.. అంటే అది కూడా అలా ఇలా కాదండోయ్.. తనకు కలిగిన లక్షణాలను బట్టి ఏ రోగం వచ్చిందో కనుక్కోవడానికి గంటలు గంటలు నెట్టింట్లో గడిపేస్తాడు..ఇలా చాలా సేపు గడిపిన తర్వాత తనకు చాలా రోగాలు ఉన్నాయని తుది నిర్ణయానికి వచ్చేసి చివరికి నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటాడు. కాని చివరికి తేలిదేంటంటే అతనికి ఉంది మలబద్ధకం.. ఇలా రోజులకు రోజులు గూగుల్‌ను అతిగా ఉపయోగించి చివరికి సైబర్‌కాండ్రియా అనే మానసిక రోగిగా మారిపోయాడు. ప్రస్తుతం ఆ గూగుల్ ప్రియుడు ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘ఆ వ్యక్తికి గతేడాదిగా కొద్దిపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి. అతనికి విరేచనాలు కలిగిన ప్రతిసారి నెట్లో సమాధానం వెతకడం ప్రారంభించి తనకు దొరికిన అత్యంత సులభమైన చికిత్సను తీసుకుంటాడు. అంతటితో ఊరుకోకుండా తనకున్న లక్షణాలను తలుచుకుంటూ ఇంకా ఏయే రోగాలు ఉన్నాయో అని భ్రమపడుతూ చివరికి నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నాడు. 4-5 సెషన్లు అనంతరం తనకు ఎలాంటి రోగం లేదని ఆ ప్రబుద్ధుడు తెలుసుకున్నాడు’ అని ఓ డాక్టర్ తెలిపారు. ఇలా లక్షణాల ఆధారంగా నెట్లో గంటలు గంటలు గడపడాన్ని సైబర్‌కాండ్రియా వ్యాధి అంటారని వైద్యులు చెబుతున్నారు. గూగుల్‌లో అన్నింటికీ సమాధానాలు దొరకవని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంతకన్నా దొరకవని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల డాక్టర్-రోగి మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయంటున్నారు. -
గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు
హైదరాబాద్: నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. మతిస్థిమితం సరిగా లేని ఆ వ్యక్తి రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది గుండెల్లో గంటన్నరపాటు ‘రైళ్లు’ పరుగెత్తించాడు. పిచ్చిగా అరుస్తూ... పరుగులు పెడుతూ.. చివరికి తన ప్రాణాలకే ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దొల్లోనిపల్లికి చెందిన సంపంగి రంగయ్య (40) వృత్తిరీత్యా వడ్డరి. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం భార్య కాంతమ్మ కుమారుడు శ్రీకాంత్‌తో కలసి ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. నగరంలోని తన సోదరి బాలమ్మ చిరునామా కోసం తిరగగా దొరకలేదు. దీంతో గత్యంతరం లేక మళ్లీ కుటుంబంతో సహా మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మధ్నాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నాడు. అంతలోనే అకస్మాత్తుగా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. రైల్వే పోలీసులు,ప్రయాణికులు ఎంత వారించినా వినకుండా రైలు బోగీల మీది నుంచి పరుగు తీయడం మొదలుపెట్టాడు. ఒక బోగీపై నిల్చుని బీడీ కాల్చేందుకు అగ్గిపుల్లను అంటించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో రైలుకు అనుసంధానమై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ రంగయ్య చేతికి తగలడంతో పెద్ద పెట్టున మంటలు చెలరేగాయి. రంగయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలు ఉండడంతో రంగయ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
పాతబస్తీలో మానసిక రోగి హాల్చల్
నగరంలోని పాతబస్తీ రెయిన్ బజార్లో ఓ మానసిక రోగి గురువారం హాల్చల్ చేశాడు. అక్బర్ అనే మానసిక రోగి బజార్లో వెళ్లే 14ఏళ్ల బాలుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. మానసిక రోగి దాడి చేయడంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
సైకో ఎదురింటి మహిళపై హత్యాయత్నం
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ఓ మానసిక రోగి ఎదురింటి మహిళపై హత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గ ట్ల నర్సింగపురం గ్రామానికి చెందిన మాడుగుల సురేందర్(35) బతుకుదెరువుకోసం 15 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌కు వలస వచ్చాడు. స్థానికంగా కూలిపనులు చేస్తున్నాడు. ఇతడికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అక్కలు, అన్నలు స్వామి, విజయ్ ఉన్నారు. సురేందర్‌కు కుటుంబీకులతో సరిగా సంబంధాలు లేవు. ఇతడి చేష్టలకు విసిగిపోయిన భార్య వెళ్లిపోయింది. అనంతరం రెండో వివాహం చేసుకున్నాడు. ‘సైకో’ ప్రవర్తనకు నెలరోజులకే రెండో భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సురేందర్ అంబేద్కర్‌నగర్ చౌరస్తాకు సమీపంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇతడు స్థానిక మహిళలను వేధించసాగాడు. పొరుగున ఉండే బాలికలు నిత్యం పాఠశాలకు వెళ్లే సమయంలో వెకిలి చేష్టలతో ఇబ్బందిపెట్టేవాడు. ఈవిషయాన్ని స్థానికులు పలుమార్లు సురేందర్ అన్న విజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మందలించాడు. అయినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో శనివారం పొరుగింటి మహిళ కూరగాయలు కొనుగోలు చేసి ఇంట్లోకి వెళ్తోంది. సురేందర్ ఓ బకెట్లో దాదాపు 5 లీటర్ల కిరోసిన్ తీసుకొచ్చి వచ్చి ఆమెపై పోసి నిప్పంటించబోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విషయం గమనించి అతడిని పట్టుకునేందుకు యత్నించగా తప్పించుకొని పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హఠాత్పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలిని ఈసీఐఎల్‌లోని రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఎస్ఐ రాములు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.