సాక్షి, ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక, జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.
వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) పలు ప్రతిపాదనలతో ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించింది. ఇదే సమయంలో విపక్ష సభ్యులు సూచించిన మార్పులకు మాత్రం ఆమోదం లభించకపోవడం గమనార్హం. వారి సూచనలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో బిల్లు విషయమై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. మొత్తంగా జేపీసీ సూచించిన 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
#WATCH | After the meeting of the JPC on Waqf (Amendment) Bill, 2024, its Chairman BJP MP Jagdambika Pal says, "...44 amendments were discussed. After detailed discussions over the course of 6 months, we sought amendments from all members. This was our final meeting... So, 14… pic.twitter.com/LEcFXr8ENP
— ANI (@ANI) January 27, 2025
ఈ సందర్బంగా జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు ఆమోదంలో భాగంగా 44 సవరణలు చర్చించబడ్డాయి. ఆరు నెలల కాలంలో వివరణాత్మక చర్చల తర్వాత, మేము అందరు సభ్యుల నుండి సవరణలను కోరాము. ఇది మా చివరి సమావేశం.. కాబట్టి, మెజారిటీ ఆధారంగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. ప్రతిపక్షం కూడా సవరణలను సూచించింది. మేము ఆ సవరణలలో ప్రతిదాన్ని ప్రతిపాదించాము. వాటిపై ఓటింగ్ జరుగుతుంది. కానీ వారి (సూచించిన సవరణలు) మద్దతుగా 10 ఓట్లు.. వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment