![Opposition MPs seek Om Birla's intervention over Waqf bill](/styles/webp/s3/article_images/2024/11/5/waqf.jpg.webp?itok=Rn-5xHr3)
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నుంచి విపక్ష పారీ్టల సభ్యులు వైదొలగే అవకాశముంది. కమిటీ చైర్‌పర్సన్, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట తమ నిరసనను తెలిపేందుకు మంగళవారం వీరంతా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తమ అభిప్రాయాలకు పూచికపుల్లంత అయినా విలువ ఇవ్వట్లేరని, ప్రతిపాదిత బిల్లుపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు ఒక సంయుక్త లేఖ సైతం రాయనున్నాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా కమిటీ సమావేశాలు నిర్వహించేలా జగదాంబికా పాల్‌ను ఆదేశించాలని, లేని పక్షంలో తామంతా కమిటీ నుంచి వైదొలుగుతామని స్పీకర్‌కు విపక్షసభ్యులు మంగళవారం కరాఖండీగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment