opposition parties
-
ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్‌పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్‌పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు. నిరాశతోనే ప్రేలాపనలు.. ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్‌ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు ‘భూమిపుత్రుడికి’ స్వాగతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్‌పూర్‌కు చేరుకున్న ఫడ్నవీస్‌కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్‌లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ -
పార్లమెంట్లో ఆగని రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అదానీ అంశంతోపాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైనా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు నాలుగో రోజు శుక్రవారం సైతం స్తంభించాయి. లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నియంతృత్వం నశించాలి, అదానీని అరెస్ట్ చేయాలి అనే నినాదాలతో సభ మార్మోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు ఎంపీలు మాత్రం సభను పదేపదే అడ్డుకొంటూ ప్రజల ఆకాంక్షలు వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరుపట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్యం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యçసభలోనూ ఇదే రీతిలో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. అదానీ గ్రూప్‌పై వచి్చన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచి్చన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. రూల్ నెంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. -
ప్రజల చేత పదేపదే తిరస్కరణకు గురవుతున్నా కొందరు పార్లమెంట్‌ను నియంత్రించాలనుకుంటున్నారు. విపక్ష పార్టీలపై ప్రధాని విసుర్లుప్రజల చేత పదేపదే తిరస్కరణకు గురవుతున్నా కొందరు పార్లమెంట్‌ను నియంత్రించాలనుకుంటున్నారు. విపక్ష పార్టీలపై ప్రధాని విసుర్లు
-
ప్రజలు తిరస్కరించినా పార్లమెంట్‌పై పెత్తనమా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఇప్పటిదాకా దాదాపు 80–90 సార్లు ఓటమిని చవిచూసినా విపక్షాలు తమ తీరును మార్చకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియలో పదేపదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనాసరే కొన్ని పార్టీలు పార్లమెంట్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభాకార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంట్ భవనం ఎదుట మీడియాతో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌పై పట్టుకు యత్నం‘పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 80–90 సార్లు ఎన్నికల్లో ఓడినా విపక్షాల తీరు మారలేదు. విపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలు జరగ నివ్వట్లేదు. ప్రజాస్వామ్య సూత్రా లను, ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు’’ అని మోదీ విమర్శల దాడి చేశారు. కొన్ని ప్రతిపక్షపార్టీలు సహకరిస్తున్నా‘‘కొందరు విపక్ష నేతలు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. వీళ్ల వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణచివేస్తుంది. వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ పార్టీల మనసుల్ని వాటి మిత్రపక్షాలు మార్చేస్తు న్నాయి. సభలో ఆందోళనలు, నిరసనలకే మొగ్గుచూపుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయి. సభా సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్షపార్టీల గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తు న్నాయి. వీళ్ల గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైనవారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.భారత్‌లో వచ్చిన అవకాశం అరుదైంది‘‘ప్రపంచదేశాల పార్లమెంట్లతో పోలిస్తే భారత పార్లమెంట్లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకా శం రావడం నిజంగా అరుదు. పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజా స్వామ్యంపై ప్రజలకున్న అంకితభావా నికి అద్దంపట్టాలి. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని, ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకో వాలి. ప్రస్తుత సమావే శాలు అత్యంత ఫలవంతమవ్వాలి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తిచేసు కుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనందరం పెంచుదాం. కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం’ అని మోదీ అన్నారు. -
వక్ఫ్ జేపీసీకి విపక్షాలు దూరం!
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నుంచి విపక్ష పారీ్టల సభ్యులు వైదొలగే అవకాశముంది. కమిటీ చైర్పర్సన్, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట తమ నిరసనను తెలిపేందుకు మంగళవారం వీరంతా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తమ అభిప్రాయాలకు పూచికపుల్లంత అయినా విలువ ఇవ్వట్లేరని, ప్రతిపాదిత బిల్లుపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు ఒక సంయుక్త లేఖ సైతం రాయనున్నాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా కమిటీ సమావేశాలు నిర్వహించేలా జగదాంబికా పాల్‌ను ఆదేశించాలని, లేని పక్షంలో తామంతా కమిటీ నుంచి వైదొలుగుతామని స్పీకర్‌కు విపక్షసభ్యులు మంగళవారం కరాఖండీగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. -
ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా
-
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
PM Narendra Modi: ప్రధాని గొంతే నొక్కజూస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకు పార్లమెంటును కూడా దురి్వనియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతునే నొక్కే పోకడలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలను పక్కన పెట్టి వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసం పారీ్టలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు. మొత్తం దేశం కోసం’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. ‘‘మళ్లీ 2029 జనవరిలో మరోసారి లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలోకి దిగండి. కావలిస్తే అందుకు పార్లమెంటును కూడా వాడుకోండి. అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాం’’ అని పిలుపునిచ్చారు. విపక్షాల తీరు మారాలి సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాల తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు. ‘‘ఇది విచారకరం. అన్ని పారీ్టలు సభ్యులందరికీ, ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశమివ్వాలి. తొలి సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయి. దాంతో 140 కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వ స్వరం పదేపదే మూగబోయింది. ఇవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు’’ అన్నారు.ఇది అమృతకాల బడ్జెట్ మేం ప్రవేశపెట్టబోతోంది అమృతకాల బడ్జెట్. వచ్చే ఐదేళ్లకే గాక 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాకారం చేసుకునే కలకు పునాది. -
నీట్ మంటలు.. విపక్షాల వాకౌట్..
-
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
-
నీట్ పై లోక్ సభలో రచ్చ
-
Lok Sabha Election Results 2024: ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రండి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలనూ మించి కూటమి 234 స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో కాంగ్రెస్‌తో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ జోష్‌లో ఉన్నాయి. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహా్వనిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణకు, అందులో పేర్కొన్న విలువలకు కట్టుబడ్డ పారీ్టలన్నింటికీ ఇండియా కూటమిలోకి స్వాగతమన్నారు. తమ కూటమి పక్షాలన్నీ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడాయంటూ ప్రశంసించారు. ‘‘ప్రజా తీర్పు ప్రధాని మోదీకి, ఆయన విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వెలువడింది. ఫలితాలు ఆయనకు నైతిక ఓటమి. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ ప్రజా తీర్పును కాలరాసేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని పారీ్టలపైనా ఉందన్నారు. సరైన సమయంలో సరైన చర్యలు భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలన వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పు వెలువరించారన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ఇండియా కూటమి సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందంటూ నర్మగర్భంగా మాట్లాడారు. కూటమి నేతలంతా భేటీలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లడం లేదన్నారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ఫాసిస్టు పాలనపై రాజీలేని పోరు కొనసాగించాలని కూటమి నేతలంతా నిర్ణయించామన్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. దాన్ని చేరేందుకు ఇండియా కూటమికి మరో 38 సీట్లు కావాలి. పాలక ఎన్డీఏ కూటమికి మెజారిటీకి మించి 292 స్థానాలొచి్చనా బీజేపీ మాత్రం 240కే పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ), శివసేన, ఎల్జేపీ వంటి భాగస్వాములపై ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఆ పారీ్టలను తమవైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రాతో పాటు భాగస్వామ్య పక్షాల నుంచి అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), శరద్ పవార్, సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), చంపయ్ సోరెన్ (జేఎంఎం), సీతారాం ఏచూరి (సీపీఎం), సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా (ఆప్), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), ఎన్కే ప్రేంచంద్రన్ (ఆరెస్పీ) తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు తదితర భావి వ్యూహాలపై నేతలంతా రెండు గంటలకు పైగా లోతుగా చర్చించారు. వేచి చూడండి: తేజస్వి భేటీకి ముందు తేజస్వి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరగనుందో వేచి చూడండి’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన, ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ బుధవారం పట్నా నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వెళ్లడం విశేషం! ఆ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాటలు కలిపడంతో మీడియాలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నితీశ్‌ను తిరిగి ఇండియా కూటమిలో చేరేలా ఒప్పించేందుకు తేజస్వి ప్రయతి్నంచారంటూ పుకార్లొచ్చాయి. దాంతో ఢిల్లీ చేరగానే విమానాశ్రయంలో మీడియా అంతా తేజస్విని చుట్టుముట్టింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. నితీశ్‌తో తన మాటలు కుశల ప్రశ్నలకే పరిమితమైనట్టు తేజస్వి బదులిచ్చారు. -
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
పాటలీపుత్ర/ఘాజీపూర్: విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విమర్శనా్రస్తాలు సంధించారు. విపక్ష కూటమి బానిసగా మిగిలిపోయిందని, ముస్లిం ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి ముజ్రా(వేడుకల్లో అతిథులను అలరించడానికి చేసే నృత్యం) చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటానని తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల జోలికి వస్తే సహించబోనని హెచ్చరించారు. శనివారం బిహార్‌లోని పాటలీపుత్ర, కారాకాట్, బక్సర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పొరుగు దేశాన్ని చూపించి మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడడం లేదని, పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని, అవినీతిని, నక్సలైట్ల హింసాకాండ అంతం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి బిహార్ కొత్త దిశను ఇచి్చందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు ‘‘పంజాబ్, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులో డీఎంకే నేతలు, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బిహార్ వలస కూలీలను దూషిస్తూ మాట్లాడారు. తద్వారా బిహారీలను కించపర్చారు. బిహారీలను అవమానిస్తే కనీసం నిరసన తెలిపే ధైర్యం ఆర్జేడీకి లేకుండాపోయింది. ఆర్జేడీ నాయకులకు లాంతర్ పట్టుకొని ముజ్రా డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఓటు జిహాద్‌కు పాల్పడుతున్నవారిపై విపక్షాలు ఆధారపడుతున్నాయి, వారి మద్దతు పొందుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చొక్కాలు చించేసుకుంటారు మన సైనికులు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పొందకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనికులకు మేలు జరిగింది. పనులు ఆలస్యం చేయడంతో, హక్కులు లాక్కోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. ‘ఇండియా’ కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష నాయకులు పరస్పరం చొక్కాలు చించేసుకుంటారు. ఎన్నికల్లో ఓటమికి రాజకుటుంబం(సోనియా గాంధీ కుటుంబం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేను బాధ్యుడిని చేస్తుంది. అనంతరం విదేశాలకు విహారానికి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి ఒక గాలిబుడగ. అది ఇప్పటికే పేలిపోయింది’’ అని ప్రధాని మోదీ తేలి్చచెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
-
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్‌పుత్‌లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
మీరట్ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
CM Jagan: అందరి చూపులూ ప్రొద్దుటూరు సభ వైపే..
వైఎస్సార్, సాక్షి: ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలోకి దిగడంతో.. ఏపీలో ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం ఇటు ప్రజలు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఈ 21 రోజుల ప్రచార యాత్ర.. ఇఛ్చాపురంతో ముగుస్తుంది. ఈ క్రమంలో తొలిరోజు ప్రొద్దుటూరులో నిర్వహించబోయే ప్రచార సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ఆందోళనలు చేపట్టినా.. వాళ్ల సాధకబాధకాలను గుర్తించి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసినా.. చివరకు సుపరిపాలన తదనంతరం సిద్ధం సభలు నిర్వహించినా.. ఈ జననేతకు ప్రతీసారి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో.. అదీ ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రచార శైలి ఎలా ఉండనుంది?.. ప్రజా స్పందన ఏస్థాయిలో ఉండబోతోందో? అనే చర్చ నడుస్తోంది. మేమంతా సిద్ధం యాత్రలో.. ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారని, ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఇదివరకే ప్రకటించాయి. అలాగే.. గత 58 నెలల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును సాయంత్రం జరిగే సభల్లో ఆయన వివరిస్తారని తెలిపాయి. దీంతో ప్రొద్దుటూరు సభలో ఆయన ఆయా అంశాల్ని కచ్చితంగా ప్రస్తావిస్తారనేది ఊహించొచ్చు. ఇదీ చదవండి: మరో యాత్రకు సిద్ధం అలాగే గత పాలన- వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనను ఆయన పోల్చి పలు అంశాల్ని ప్రస్తావించ్చొచ్చు. అదే సమయంలో కూటమిపైనా ఆయన విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గజదొంగల ముఠాగా, తోడేల మంద, మోసకారులుగా చంద్రబాబు అండ్ను కో(యెల్లో మీడియాను కలిపి మరీ) అభివర్ణించిన సీఎం జగన్.. ఇప్పటి కూటమి లక్ష్యంగా విమర్శలు, పంచ్ డైలాగులు గుప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే.. 2014లో ఇదే కూటమి రాష్ట్రాన్ని మోసపూరిత హామీలతో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారని.. దోచుకో పంచుకో దాచుకో ద్వారా అవినీతికి పాల్పడ్డారని.. అలాగే ప్రజలను ఎలా మోసం చేశారనే దాన్ని.. ఆయన ప్రముఖంగా ప్రస్తావించే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే.. కూటమిలో భాగమైన పవన్ కల్యాణ్, బీజేపీ, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను ఆయన టార్గెట్ చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారాయన. ఇక ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వడం సీఎం జగన్ చేస్తూ వస్తున్నారు. తద్వారా విశ్వసనీయత, విలువల్ని చాటుతూ వస్తున్నారు. దీంతో.. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమానికి కొనసాగింపుగా ఆయన ఏమైనా ప్రకటనలు చేస్తారా?.. పోనీ మేనిఫెస్టో ఎప్పుడనేదానిపై స్పష్టత ఇస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. జగన్ కోసం జనమంతా.. ఇక.. సీఎం జగన్ సొంత జిల్లా నుంచే బస్సు యాత్ర ప్రారంభం అవుతుండడంతో తొలి ఎన్నికల ప్రచార సభ లక్షలాది మందితో జనసంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తమ ప్రియతమ నాయకుడికి అండగా నిల్చేందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రొద్దటూరు వైపు అడుగులేస్తున్నారు. మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి రావొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావటంతో పార్టీ కేడర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని ముఖ్యనేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. -
Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్ నేత వినాశ్ పాండే చెప్పారు. ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్‌బరేలీ, కాన్పూర్ నగర్, వారణాసి, షహరాన్‌పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్‌గంజ్, బన్స్‌గావ్, బులంద్òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్‌రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. -
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ..
ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు! సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు. -
మోదీ కలలు కంటున్నారు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్‌లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు. వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి. 400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్‌కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌ను చూస్తే జాలేస్తోంది.. మా హ్యాట్రిక్ ఖాయం: లోక్‌సభలో ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సాక్షిగా కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని.. పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారాయన. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. సభకు సెంగోల్ తీసుకొచ్చే కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించాం. పార్లమెంట్ ఔన్నత్యానికి సెంగోల్ జోడించాం. విపక్షాలు కూడా చాలా కాలం అదే స్థానంలో ఉంచాలని తీర్మానించుకున్నాయి. అందుకు సభకు నా ధన్యవాదాలు. బీజేపీ పై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయి. కొంత మంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారు. ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. మీ ఆలోచనా తీరును దేశం గమనిస్తోంది. విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణం. .. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనివ్వడం లేదు. కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్ ఒకే ప్రొడెక్ట్ ను మాటిమాటికీ లాంచ్ చేస్తోంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం. అమిత్ షా, రాజ్ నాథ్, నేను వారసత్వ రాజకీయాలు చేయలేదు. అన్ని నిర్ణయాలు ఒకే కుటుంబం తీసుకోవడం కుటుంబ పాలన. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పుకాదు. కానీ వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు. ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే కాంగ్రెస్ తీరు మారడం లేదు దేశాన్ని విభజించడమే విపక్షాల పని. ఇలా ఎంతకాలం ఇలా చేస్తారు?. ఎన్నాళ్లీ మైనారిటీ రాజకీయాలు? అంటూ అధీర్ రంజన్ చౌదరిను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రశ్నించారు. మేం అభివృద్ధి నినాదం చేస్తే.. కాంగ్రెస్ క్యాన్సిల్ నినాదం తలెత్తుంది. మేం ఎలాంటి అభివృద్ధి చేసినా క్యాన్సిల్ అంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ విద్వేషం మీ గుండెల్లో ఉంచుకుంటారు. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మానడం లేదు. ఒక కుటుంబం కోసం పార్టీ పని చేస్తే దానిని కుటంబ పాలనగానే మేం భావిస్తాం. కాంగ్రెస్‌ది కుటుంబ రాజకీయం. ఒకే కటుంబం చుట్టూ తిరుగుతుంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం. కుటుంబ పాలన వల్ల దేశం ఎంత నష్టపోయిందో.. కాంగ్రెస్ నాయకులు కూడా అంతే నష్టపోయారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదు. జాలేస్తోంది.. విపక్షాలకిదే నా సలహా కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్ పదే పదే రీలాంచ్ చేస్తోంది. కాంగ్రెస్ దుకాణం ఒక్క నాయకుడి కోసమే. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయి. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోంది. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరు. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్ చేస్తోంది. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారడం లేదు. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకు విపక్షాలకు నా ధన్యవాదాలు. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. కూటమి(ఇండియా) కుదుపులకు లోనైంది. విపక్షాల సంకల్పానికి నేను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ చురకలంటించారాయన. 2014 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. పదేళ్ల కిందట ప్రపంచంలోని 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. ఎవరేం అనుకున్నా మా హ్యట్రిక్ విజయం గ్యారెంటీ. ఈ మూడో టెర్మ్‌లో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ.. అని ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ దేశ ప్రజల్ని అవమానించింది.. దేశ సామర్థ్యంమీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. ఆ పార్టీని నడిపించే కుటుంబం భారతీయుల్ని చిన్నచూపు చూసింది. నెహ్రూ, ఇందిరలు దేశ ప్రజల్ని అవమానించారు. భారతీయులు కష్టపడరని ఎర్రకోట సాక్షిగా నెహ్రూ అన్నారు. యూరప్, చైనాలతో పోలిస్తే భారతీయులు అంతకష్టపడరని నెహ్రూ అన్నారు. అమెరికా, జపాన్, చైనా పౌరులతో పోలిస్తే.. భారతీయుల నైపుణ్యం తక్కువనీ నెహ్రూ అన్నారు. అలాగే భారతీయుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువని ఎర్ర కోట సాక్షిగా ఇందిరాగాంధీ చెప్పారు. కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందేమో! పదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ది చేయాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందేమో. నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చాం. సానిటేషన్ కవరేజ్ వంద శాతానికి పెంచాం. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తొలగించాం. చంద్రయాన్-3తో విజయం సాధించాం. ఒలింపిక్స్‌లో సత్తా చాటాం. అన్ని రంగాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చాం. బడ్జెట్లో రైతులకు ఎక్కువ నిధులిచ్చాం. యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇదేపని కాంగ్రెస్ చేయాలంటే 70 ఏళ్లు పట్టేది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాం. భగవాన్ రాముడు తన సొంతింటికి వచ్చాడు. అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అభివృద్ధి చేశాం. మాకు అదే ముఖ్యం ఖాదీని, చేనేతను కాంగ్రెస్ ప్రజలకు దూరం చేస్తే.. మేం దగ్గర చేశాం. ప్రభుత్వంలో ఓబీసీ నేతలు లేరని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. కర్పూరి ఠాకూర్ లాంటి వెనకబడిన వర్గాల వారికి మేం భారతరత్న ఇచ్చాం. కానీ, కర్పూరిని కాంగ్రెస్ అవమానించింది. ఆయన్ని గద్దె దించడానికి కాంగ్రెస్ యత్నించింది. మాకు ఓట్లు ముఖ్యం కాదు ప్రజల హృదయాలు ముఖ్యం. మళ్లీ మా సర్కారే వంద రోజుల్లో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడబోతుంది. అబ్కీ బార్ మోదీకి సర్కార్. బీజేపీకి సొంతంగా 370కిపైగా సీట్లు వస్తాయి. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయి.. మూడో టర్మ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం. సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయి. మూడో టర్మ్‌లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తాం. దేశ ప్రజలు మా పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు అని ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయావసరాలకు దర్యాప్తు సంస్థలా? కేసులపై తీర్పులు కోర్టులు ఇస్తాయి. దర్యాప్తు సంస్థలపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈడీ దాడులతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో దర్యాప్తు సంస్థలున రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్ చేసింది. మా హయాంలో లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తీశాం. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. అవి స్వతంత్రంగా తమ చేసుకుంటూ పోతున్నాయి. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేది లేదు అని ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించగానే.. ఎన్డీయే ఎంపీలంతా నిలవడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. -
జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా?
శ్రీహరి నామ శబ్దాన్నే సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని నానా హింసలూ పెడతాడు.. నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. అక్కడా...? ఇక్కడా ? ఎక్కడ ? అంటూ ఇబ్బంది పెడతాడు.. అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు తండ్రీ.. ఎందెందు వెతికినా.. శ్రీహరి కనిపిస్తాడు అంటాడు.. అప్పుడు తండ్రి.. ధిక్కారమున్ సైతునా అంటూ ఏదీ ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని బద్దలుకొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు.. అది వేరే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉంది... దేశంలో ఏ చిటారుకొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు.. తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత... శ్రద్ధాసక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళుతున్నారు. దానికి ఉదాహరణే.. హైదరాబాద్‌లో బతకడానికి వలసవెళ్లిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళా అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న భోజన హోటల్ పెట్టుకుని నడుపుతోంది. ఇక్కడ తాము ఆర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పదిమందికీ భోజనం పెడుతోంది. ఆమె వండి వడ్డిస్తున్న తీరు.. మాటకారితనం.. అన్నీ కలిపి ఆమెను కొద్దిరోజుల్లోనే పాపులర్ చేసేశాయి.. దానికి తోడు యూట్యూబ్ చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని, ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది.. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కనున్న ఆమె హోటల్‌ను తొలగించారని వార్తలు వెల్లువెత్తాయి. కేవలం జగనన్న పేరు తల్చుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేసారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ అన్న పేరు తలచుకున్నవారిని చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళిపోయినా వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారేనని ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తోంది. ఏ రాష్ట్రానికి వలసపోయినా వారికి స్వగ్రామంలో ఏదోవిధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని... అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్‌ని తలచుకుని గుండెల్లో గుడికట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.? -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌తోనే ఆపార్టీలు పార్లమెంట్ సెషన్‌ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్‌సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్‌పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్‌పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్‌సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్‌సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్‌లోని నాగౌర్‌లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్‌సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్‌శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్‌కు పంపాడు. తర్వాత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
14 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల నిరసన.. ఉభయసభలు వాయిదా
-
దాడి ఘటనపై లోక్ సభలో గందరగోళం..సభ వాయిదా
-
ప్రతిపక్షాలకి రోజా కౌంటర్
-
రాజకీయ పొత్తులను నియంత్రించలేం: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ పొత్తులను నియంత్రించేందుకు చట్టపరంగా తమకు ఎలాంటి అధికారమూ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టుకు ఈసీ సోమవారం ఈ మేరకు తన స్పందన తెలియజేసింది.‘‘మాకు పారీ్టల నమోదుకు, ఎన్నికల నిర్వహణకు మాత్రమే అధికారముంది. అంతే తప్ప రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పొత్తులకు నియంత్రిత కూటములుగా గుర్తింపునిచ్చే అధికారం కూడా లేదు. పైగా కేరళ హైకోర్టు గత తీర్పు మేరకు ఈ కూటములను చట్టబద్ధమైన సంస్థలుగా కూడా పరిగణించలేం’’ అని వివరించింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం తాలూకు చట్టబద్ధత తమ పరిధిలోని అంశం కాదని వివరించింది. విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ గిరీశ్భరద్వాజ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ప్రతిపక్షాలకు మంత్రి రోజా అదిరిపోయే కౌంటర్
-
విపక్షాలకు విజన్ లేదు, రోడ్‌మ్యాప్ లేదు
జైపూర్/గ్వాలియర్: దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్ లేదని, రోడ్‌మ్యాప్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. రాజస్తాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న సంగతి గహ్లోత్‌కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్‌లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్‌వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్‌గఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు. భారత్ విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఒక విజన్ గానీ, రోడ్‌మ్యాప్ గానీ లేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. మోదీ మధ్యప్రదేశ్‌లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. గ్వాలియర్‌లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. -
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించాలి రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
ఇండియా కూటమిపై సీఎం ఏక్నాథ్ షిండే సెటైర్లు..
ముంబై: ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జతకట్టడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ గొర్రెలు, మేకలు సింహం లాంటి ప్రధాని నరేంద్ర మోదీని ఏమీ చేయలేవని అన్నారు. వాళ్ళు గొర్రెలు, మేకలు సోమవారం ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఏక్నాథ్ షిండే ప్రతిపక్షాలు గురించి ఒకే మాటలో తేల్చేశారు. ప్రతిపక్షాల గుంపును నేను రాబందులని పిలవను కానీ వారు గొర్రెలు, మేకలతో సమానం అన్నారు. అలాంటి మేకలు, గొర్రెలు ఎన్ని వచ్చినా అడవిలో సింహంలాంటి ప్రధానిని ఏమీ చేయలేవని అన్నారు. కనుచూపుమేరలో కూడా లేరు.. రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమైన విషయాన్ని ప్రస్తావించగా వారంతా ఏకమై ప్రధానిని ఓడిద్దామనుకుంటున్నారు.. అది వారి మనసులో ఆలోచన తప్ప వారెక్కడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఎన్నికల్లో వారు కనీసం పోటీనిస్తారని నేననుకోవడం లేదన్నారు. దేశంలోనే అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్‌సభకు పంపించనుండగా మహారాష్ట్ర 48 మంది సభ్యులను లోక్‌సభకు పంపిస్తూ రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రతిపక్షాలు మాకు దగ్గర్లోనే లేరని అన్నారు. మళ్ళీ మేమే.. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అజిత్ పవార్ మాతో కలిసిన తరువాత మా బీజేపీ-శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి బలం 215కు చేరింది. మా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వానికి ఢోకానే లేదని అన్నారు. బాల్ థాక్రే వారసులుగా మేము ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నాము. తమ కోసం పనిచేసే వారు కావాలో లేక ఇంట్లో కూర్చుని ఉండే నేత(ఉద్ధవ్ థాక్రే) కావాలని కోరుకుంటారో అదంతా ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
న్యూఢిల్లీ: వివిధ టీవీ చానళ్లకు చెందిన కొందరు జర్నలిస్టులు/యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు, వేదికలకు తమ ప్రతినిధులను పంపించకూడదని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్(ఎన్బీడీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయం ఆందోళనకరమని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకోవడం సరైంది కాదని పేర్కొంది. గతంలో ఇలాంటి పరిణామం ఎనాడూ సంభవించలేదని గుర్తుచేసింది. ప్రమాదకరమైన ఈ ధోరణిని మానుకోవాలని ఇండియా కూటమికి విజ్ఞప్తి చేసింది. మీడియా స్వేచ్చను గౌరవించాలని కోరింది. కొందరు జర్నలిస్టులను/యాంకర్లను బహిష్కరించడం అనేది దేశాన్ని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) నాటి రోజుల్లోకి తీసుకెళ్తుందని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. మీడియాపై విరుచుకుపడితే స్వతంత్ర భావాల వ్యక్తీకరణను, గొంతుకలను అణచివేసినట్లే అవుతుందని తెలియజేసింది. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమికి సూచించింది. -
సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కుట్రలు
బీనా/రాయ్‌గఢ్: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని దురంహకారి కూటమిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని, వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి దేశాన్ని నెట్టివేయాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైందని, ఈ ఘనత 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గురువారం పర్యటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్లతో నిర్మించే పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు మరో 10 పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొండతరాయి గ్రామంలో ‘విజయ్ శంఖనాథ్’ సభలోనూ మాట్లాడారు. రెండు సభల్లో ఆయన ఏం చెప్పారంటే... కుట్రలను అడ్డుకోవాలి ‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు. రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి. మన లక్ష్యం ‘ఆత్మనిర్భర్ భారత్’ జీ20 సదస్సు విజయంతో దేశ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఘనత మోదీకి కాదు, ముమ్మాటికీ 140 మంది భారతీయులదే. చిన్నపిల్లలకు కూడా జీ20 గురించి తెలిసింది. బృంద స్ఫూర్తితో పని చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీ చేసిందేమీ లేదు. అవినీతికి, నేరాలకు పాల్పడడంతోనే కాంగ్రెస్‌కు సమయం సరిపోయింది. కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు రాజ్యమేలారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకివచ్చాక అవినీతి అంతమైంది. సుపరిపాలన కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు తరలివస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించుకోవాలి. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం స్వావలంబన దిశగా బీనా రిఫైనరీ ఒక ముందడుగు అవుతుంది. దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం బానిస మనస్తత్వం నుంచి దేశం బయట పడింది. ‘న్యూ ఇండియా’ సగర్వంగా ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.2.60 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం. రైతులపై భారం తగ్గిస్తున్నాం. ఎరువులను చౌకగా అందజేయడానికి సబ్సిడీ రూపంలో గత తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా వెచి్చంచాం. అమెరికాలో ఒక యూరియా సంచి ధర రూ.3,000 ఉంది. మన దగ్గర మాత్రం రైతులకు కేవలం రూ.300కే లభిస్తోంది. దేశంలో గత నాలుగేళ్లలో కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. మొఘల్ రాజులపై పోరాటం చేసిన గిరిజన పాలకురాలు రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అక్టోబర్ 5న ఘనంగా నిర్వహిస్తాం. ‘ఇండియా’ పట్ల జాగ్రత్త భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి. మన దేశానికి, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. కొందరు వ్యక్తులు అధికారం నుంచి దూరమయ్యాక ప్రజల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచి్ఛన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచి్ఛన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నదే వారి అసలు లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తుల జన్మకు కాదు, వారి కర్మ(చేసే పనులు) ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
భారతదేశం మీ తాతల సొత్తు కాదు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. ఎవరో చిన్న నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు. అదే మా ప్రణాళిక.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ సీన్ రిపీట్ అవుతుంది.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు. భయం మొదలైంది.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..
న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఒక్కటే ఎజెండా.. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. అక్కడే అసలు సమస్య.. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు. కమిటీలో ఎవరెవరంటే.. ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు -
‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు. తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్ నేత గుర్దీప్ సింగ్ సప్పాల్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్జేడీ సంజయ్ యాదవ్, ఎన్సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఎం నేత అరుణ్ కుమార్, సీపీఐఎంఎల్ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్ నేత కేఎం కాదర్ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. -
కలిసే పోటీ చేద్దాం.. విపక్ష కూటమి తీర్మానం
ముంబై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేయాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు తీర్మానించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలని, రాష్ట్రాల స్థాయిలో సీట్ల పంపకం ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చారు. ముంబైలో ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం శుక్రవారం ముగిసింది. ముందస్తు ఎన్నికలు, ఒకే దేశం–ఒకే ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని తీర్మానాలు చేశారు. కూటమికి సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంపాటు సీట్ల పంపకంపై చర్చించడానికి 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేద్దామంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ‘జుడేగా భారత్, జీతేగా భారత్’ అనే థీమ్‌తో వివిధ భాషల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం ఆమోదించారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ‘ఇస్రో’ను ప్రశంసిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. అయితే, ఈ సమావేశంలో కూటమి కన్వినర్ ఎంపికపై దృష్టి పెట్టలేదు. ఈ నెల 30 నాటికి సీట్ల పంపకం పూర్తి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తోపాటు వివిధ పారీ్టల ముఖ్య నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీతారాం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్, కపిల్ సిబల్, జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ సెపె్టంబర్ 30 నాటికి పూర్తవుతుందని ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి. మోదీ సర్కారు ఓటమి తథ్యం: ఖర్గే నియంతృత్వ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు సాగించినా వచ్చే ఎన్నికల్లో పరాజయం తథ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల పేరిట దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ప్రజలను ఎవరూ మోసం చేయలేరని స్పష్టం చేశారు. అంతకముందు విపక్ష ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ప్రతిపక్ష కూటమి బలాన్ని చూసి మోదీ ప్రభుత్వం బెంబేలెత్తిపోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై మరింత ఉధృతంగా విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉందని, దాడులు, అరెస్టులు జరగబోతున్నాయని, కక్ష సాధింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. విశ్వసనీయ ప్రత్యామ్నాయం: పవార్ బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇండియా కూటమి రూపంలో ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇండియా కూటమి సమావేశానికి 28 పారీ్టలకు చెందిన 86 మంది నేతలు హాజరయ్యారని తెలిపారు. ‘ముందస్తు’కు సిద్ధంగా ఉండాలి: నితీశ్ లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, అందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉండాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారు. 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం: రాహుల్ దేశంలో 60 శాతం జనాభాకు ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఈ పారీ్టలన్నీ కలిసికట్టుగా ఉంటే బీజేపీని సులభంగా ఓడించవచ్చని అన్నారు. కన్వినర్ అవసరం లేదు: ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్ష ఇండియా కూటమికి కన్వినర్ అవసరం లేదని శివసేన(ఉద్ధవ్) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. కూటమి లోగోపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నామని వివరించారు. మాకు పబ్లిసిటీ ఆఫీసర్ మోదీ: స్టాలిన్ బీజేపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. మోదీ సర్కారును ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని చెప్పారు. తమ కూటమికి ప్రధాని మోదీ ‘పబ్లిసిటీ ఆఫీసర్’గా మారారని పేర్కొన్నారు. సమన్వయ కమిటీలో ఎవరెవరు? 14 మందితో కూడిన సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ఇండియా కూటమి ఖరారు చేసింది. వివిధ పారీ్టల నాయకులతో ఇందులో భాగస్వామ్యం కలి్పంచారు. కె.సి.వేణుగోపాల్(కాంగ్రెస్), శరద్ పవార్(ఎన్సీపీ), టీఆర్ బాలు(డీఎంకే), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అభిõÙక్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), సంజయ్ రౌత్(శివసేన), హేమంత్ సోరెన్(జేఎంఎం), రాఘవ్ చద్ధా(ఆమ్ ఆద్మీ పారీ్ట), జావెద్ అలీఖాన్(సమాజ్‌వాదీ పారీ్ట), లాలన్ సింగ్(జేడీ–యూ), డి.రాజా(సీపీఐ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబ్ ముఫ్తీ(పీడీపీ) ఇండియా కూటమి సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. తమ పార్టీ తరఫు సభ్యుడి పేరును తర్వాత వెల్లడిస్తామని సీపీఎం ప్రకటించింది. ఇది కూడా చదవండి: Jamili Elections: 'జమిలి'పై కమిటీ -
Jamili Elections: 'జమిలి'పై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై తొలిసారిగా 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్‌లో 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. కోవింద్‌తో జేపీ నడ్డా భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్ జోషీ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్ టర్మ్ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. తరచూ ఎన్నికలతో నష్టమే.. దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ కోవింద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కోవింద్ చెప్పారు. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతాయని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. దేశంలో 1967 దాకా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు ‘జమిలి’పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. -
‘ఇండియా’ కూటమితో మోదీలో గుబులు: నితీశ్
పాటా్న: విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు కావడంతో ప్రధాని మోదీలో గుబులు మొదలైందని జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘ఇండియా’ ఏర్పాటైన తర్వాత ఎన్డీయే పక్షాల సమావేశాలు నిర్వహిస్తున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఎన్డీయే పగ్గాలు మోదీ చేతుల్లోకి వచ్చాక భాగస్వామ్య పక్షాలను గౌరవించడం మానేశారన్నారు. ‘ఇండియా’ అధికారంలోకి వస్తే దేశానికి మంచి జరుగుతుందన్నారు. -
విపక్షాలు పారిపోయాయి
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. దాన్ని దేశమంతా వీక్షించిందన్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో వాటికి చిత్తశుద్ధే లేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కంటే స్వార్థ రాజకీయాలకే విపక్షాలు ప్రాధాన్యమిచ్చాయని దుమ్మెత్తిపోశారు. దాంతో కీలక సమస్యలకు పార్లమెంటులో చర్చ ద్వారా పరిష్కారం సాధించే సువర్ణావకాశం చేజారిందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా విపక్షాలు వ్యాప్తి చేస్తున్న ప్రతికూల భావజాలాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పశి్చమ బెంగాల్లో పంచాయతీ రాజ్ పరిషత్‌ను ఉద్దేశించి శనివారం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. వారికి రాజకీయాలే ముఖ్యం రెండు రోజుల క్రితమే విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఓడించామని మోదీ అన్నారు. ‘అలాగే వారు వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతనూ ఓడించాం. మణిపూర్ అంశంపై చర్చించాలని కేంద్రం భావిస్తోందంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే విపక్షాలకు లేఖ రాశామని. కానీ ఏం జరిగిందో మీరంతా చూశారు. దానిపై చర్చను అవే అడ్డుకున్నాయి. అంతటి సున్నిత అంశంపై చర్చ జరిగి ఉంటే మణిపూర్ ప్రజలకు కాస్త ఊరటన్నా దక్కి ఉండేది. సమస్యకు కొన్నయినా పరిష్కారాలు దొరికి ఉండేవి. కానీ మణిపూర్ హింసాకాండకు మూల కారణానికి సంబంధించిన వాస్తవాలు విపక్షాలను ఎంతో బాధిస్తాయి. కనుక కావాలనే చర్చను జరగనీయలేదు. అసలు పార్లమెంటులో ఏ చర్చ జరగడమూ వారికి ఇష్టం లేదు. ప్రజల బాధ వాటికి పట్టదు కావాల్సిందల్లా కేవలం రాజకీయాలు’ అంటూ తూర్పారబట్టారు. విపక్షాల నిజ రూపాన్ని దేశ ప్రజల ముందు బట్టబయలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల విశ్వాసమే నాకు స్ఫూర్తినిస్తుంది. నా ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది’ అని అన్నారు. మమతది అరాచక పాలన గత నెల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలను భయభ్రాంతులను చేసేందు కు పాలక తృణమూల్ కాంగ్రెస్ భాయోతోత్పాతానికి, బెదిరింపులకు దిగిందని విమర్శించారు. పైగా ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా పోజు లు కొడుతోందని మండిపడ్డారు. -
అవిశ్వాసంపై చర్చకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానిపై చర్చకు ముందు మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ఆగ్రనేతలందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని, అహంకారుల కూటమి అని తీవ్రంగా మండిపడ్డారు. అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా అని పేర్కొన్నారు. చదవండి:అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నెహ్రూ నుంచి మోదీ వరకు.. అత్యధికంగా ఎదుర్కొన్నది ఎవరూ? సోమవారం రాజ్యసభలొ ఆమోదం పొందిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రధాని ప్రస్తావిస్తూ.. విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాసం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి మ్యాచ్ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంప్రతిపక్షాలఐక్యతకు, వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష అని తెలిపారు. ఈ ఓటుతో వెరు ఐక్యంగా ఉన్నారో, ఎవరూ లేరో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్’ కావాలని కోరుకుంటోందని, దానికి తగ్గట్లే ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ నేడు లోక్‌సభలో అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించి.. చర్చకు మూడు రోజులు(8,9,10 తేదీలు) సమయమిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించనున్నారు. చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
అప్పటిదాకా లోక్‌సభకు రాను: స్పీకర్ ప్రకటన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే లోక్‌సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారాయన. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. అధ్యక్ష స్థానంలో మరొకరు బాధ్యతలు నిర్వహించారు కూడా. అయితే.. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలనిRule 267.. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. స్వల్పకాలిక చర్చతోRule 176 సరిపెడతామని, అదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడతారంటూ కేంద్రం చెబుతోంది. Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the… — ANI (@ANI) August 2, 2023 -
రాష్ట్రపతి ముర్ముతో ప్రతిపక్ష కూటమి ఎంపీలు..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బుధవారం భేటీ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మణిపూర్ అంశంపై ప్రధాని పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని, దీనిపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గకపోవడం వంటి అంశాలపై రాష్ట్రపతికి వివరించారు. ఇద్దరు మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో జూలై 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలు, ఇండియా కూటమి నేతలు ఉన్నారు. విపక్ష పార్టీల తరఫున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. కాగా గత మూడు నెలలుగా నెలకొన్న మణిపూర్ అల్లర్లపై రూల్ 267 ప్రకారం పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే రూల్ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. చదవండి: అప్పటిదాకా లోక్‌సభకు రాను: స్పీకర్ ప్రకటన -
ఎవరి గోల వారిదే
-
నితీష్ కుమార్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమవాడేనని, ఏ క్షణమైనా ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా గతేడాది వరకు ఎన్డీయే కూటమిలోనే కొనసాగిన నితీష్ కుమార్.. 2022 ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో (మహాఘట్బంధన్) చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావడంతో బిహార్ సీఎం కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో 26 విపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా రామ్‌దాస్ అథవాలే ముంబైలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ సీఎంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఎన్డీయే లక్ష్యమైతే.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి తొలగించడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ‘ఇండియా’ కూటమిపై విరుచుకుపడ్డారు. కూటమికి కన్వీనర్, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా విపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ‘నేను నిన్న(శనివారం) పాట్నాలో ఉన్నాను. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్షాలు భేటీపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇండియా పేరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను సంతోషంగా లేకపోతే త్వరలో ముంబయిలో నిర్వహించబోయే సమావేశానికి కూడా హాజరు కావొద్దని కోరాను. నితీష్ అంతకుముందు ఎన్డీయేలో సభ్యుడు, ఆయన ఎప్పుడైనా సొంతగూటికి తిరిగి రావొచ్చు’ అని అథవాలే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు మమతా వల్ల ఉపయోగం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలపై జేడీయూగానీ, నీతీష్గానీ స్పందించలేదు. కానీ ‘ఇండియా’ పేరుపై నీతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
మణిపూర్ బయలుదేరిన బృందంలో డీఎంకే ఎంపీ కనిమొళి
-
రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్
న్యూఢిల్లీ: 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష 'ఇండియా' కూటమి పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విపక్షాల INDIA కూటమిపై అధికార బీజేపీ విమర్శలు, వ్యంగ్యస్త్రాలు సంధిస్తోంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా..పేర్లలో కూడా ఇండియా పేరు ఉందని ఇటీవల ప్రధాని మోదీ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి దిశానిర్దేశం లేదని.. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు మోసపోరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండియా పేరుపై వివాదం రాజ్యసభలోనూ చెలరేగింది. ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నరేష్ బన్సాల్ రాజ్యసభలో సంచలన డిమాండ్ చేశారు. ‘ఇండియా’ (INDIA) అనేది నిజమైన పేరైన ‘భారత్’ స్థానంలో వలసరాజ్యం విధించిన పదమని ఆయన పేర్కొన్నారు.. ఇండియా పేరు మన దేశంలో నేటికీ బానిసత్వానికి చిహ్నమని, దానిని వెంటనే తొలగించాలని బీజేపీ ఎంపీ అన్నారు. చదవండి: గవర్నర్‌ను వదిలేసి వెళ్లిపోయిన విమానం.. అధికారులు సీరియస్ ఆయన మాట్లాడుతూ.. విప్లవకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పోరాడి బలిదానాల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. తర్వాత 1950లో రూపొందించిన రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్’ అని రాశారన్నారు.. ప్రాచీన కాలం నుంచి దేశానికి భారత్ అనే పేరు ఉందని, ఆ పేరుతోనే పిలవాలని తెలిపారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో వలస వారసత్వాన్ని దూరం చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బానిసత్వ చిహ్నాలను వదిలించుకోవాలని విజ్ఞప్తి చేశారని నరేష్ బన్సాల్ గుర్తు చేశారు. అదే సమయంలో వాటి స్థానంలో భారతీయ చిహ్నాలు, విలువలు, ఆలోచనలను అమలు చేయాలని ఆయన సూచించారు. అయితే బన్సాల్ మాత్రమే కాదు ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు 024 లోక్‌సభ ఎన్నికలు ‘ఇండియా-భారత్ మధ్య జరిగే పోరాటంగా పేర్కొంటున్నారు. राज्यसभा में बोले बीजेपी सांसद नरेश बंसल "इंडिया नाम गुलामी का प्रतीक है, संविधान से हटा देना चाहिए" #Nareshbansal #RajyaSabha #INDIA pic.twitter.com/LvlivkiYMV — Alka Awasthi (@alkaawasthi01) July 28, 2023 ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ను ఓడించడమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా పేరిట కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరులో జరిగిన సమావేశంలో ఈ పేరును ఫిక్స్ చేశాయి. తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ శరద్ పవార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. అయితే ఆగస్టు 25, 26 తేదీల్లో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోనే 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు -
నినాదాల్లేవ్.. ‘మణిపూర్’పై వ్యూహాత్మక నిరసన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్‌ను కుదిపేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇక నినాదాలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగని తమ నిరసనలను మాత్రం ఆపదట. ఇందుకోసం వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించాలని నిర్ణయించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా ఎన్డీయేకి సంబంధించిన కొందరు ఎంపీలు మాత్రమే ప్రసంగించే సమయంలో నినాదాలు చేయకూడదని ఎన్డీయే కూటమి సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం జరిగిన ఫ్లోర్ స్ట్రాటజీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా వాళ్ల విషయంలో మాత్రం తమ నిరసనలు కొనసాగిస్తారట. మణిపూర్‌లో శాంతి భద్రతలు చెల్లాచెదురై అక్కడ అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి.. ఆ అంశంపై మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్రం అందుకు సుముఖంగా లేకపోవడంతో అవిశ్వాసం ద్వారా చర్చ వైపుగా అడుగులు వేస్తున్నాయి. నల్ల నిరసన ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. స్పీకర్ అనుమతి సైతం పొందింది విపక్ష కూటమి. చర్చకు ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఈలోపు కూడా మణిపూర్ రగడ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇవాళ సమావేశాలకు నల్ల దుస్తులతో నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ మీటింగ్‌కు పలువురు సభ్యులు నల్లటి దుస్తుల్లో హజరు అయ్యారు కూడా. #WATCH | Leaders of the INDIA alliance meet at the LoP Chamber in Parliament to chalk out the strategy for the Floor of the House.#MonsoonSession pic.twitter.com/quLfU4TMT8 — ANI (@ANI) July 27, 2023 #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM is rubbing salt to the wounds of the people of Manipur. At a time when we are saying that he should go to Manipur and work in the interest of national security, he is giving speeches here. For the first time in India's history, we have… pic.twitter.com/0B9k5PNecz — ANI (@ANI) July 27, 2023 -
కేంద్రంపై అవిశ్వాసం.!
-
మణిపూర్‌పై ఆరని మంటలు .. ప్రతిపక్షాలకు అమిత్ షా కీలక లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ అల్లర్ల అంశం కుదిపేస్తోంది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల కూటమి పట్టుబడుతుండటంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ ఘటనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరపున మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. విపక్షాలు శాంతించడం లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తూ.. సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డుతున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ సమస్యపై విపక్షాలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తూ.. పార్లమెంట్ ఉభయసభలకు చెందిన పత్రిపక్ష నేతలకు మంగళవారం ఆయన లేఖ రాశారు. (పార్లమెంట్లో మణిపూర్ రగడ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు) ఈ మేరకు లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి సహకరించాలనే ఆసక్తి లేదు. దళితులపైనా, మహిళల సంక్షేమంపైనా వారికి ధ్యాస లేదు. వారి చర్యలతో విపక్షాల నినాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మణిపూర్‌పై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలకు లేఖ రాశాను.ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదు. చర్చించాలనుకునే వారెవరికైనా స్వాగతం. ఇందులో దాచాల్సింది ఏది లేదు. ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై చర్చకు అనువైన వాతావరణం కల్పించండి’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు.. #WATCH | I have written to the Leaders of Opposition in both Houses that the government is ready for a discussion on Manipur and urged them to create a conducive atmosphere for a discussion on this sensitive matter: Union Home Minister Amit Shah in Lok Sabha pic.twitter.com/5HsWj6K8MU — ANI (@ANI) July 25, 2023 అదే విధంగా ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే(రాజ్యసభ ప్రతిపక్షనేత), కాంగ్రెస్‌నేత అధిర్ రంజన్ చౌదరికి(లోక్‌సభ ప్రతిపక్ష నేత) రాసిన లేఖను ట్విటర్లో షేర్ చేశారు అమిత్ షా.. ‘మణిపూర్ అల్లర్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి సహకారం కోరుతున్నాం. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను’ సదరు లేఖలో పేర్కొన్నారు. Today, I wrote to the opposition leaders of both houses, Shri @adhirrcinc Ji of Lok Sabha, and Shri @kharge Ji of Rajya Sabha, appealing to them for their invaluable cooperation in the discussion of the Manipur issue. The government is ready to discuss the issue of Manipur and… pic.twitter.com/IpGGtYSNwT — Amit Shah (@AmitShah) July 25, 2023 కాగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని వార్తలు వెలుడిన కొన్ని గంటలకే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మణిపూర్‌లో మే 3న రెండు జాతుల మధ్య చెలరేగిన హింసా నానాటికీ తీవ్రతరం అవుతూ వినాశకరమైన పరిస్థితికి దారితీసింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ హింసాకాండతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి, సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. అయితే మణిపూర్ ఘటనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా.. విపక్షాలు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్ర స్వరంతో నినాదాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ సహా విపక్షాలు అన్నీ ఆందోళనకు దిగుతూ.. సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజూ మంగళవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్లో విపక్షాలు సృష్టిస్తోన్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ సహా సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. చదవండి: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. కేవలం ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సక్సెస్ కాలేరని విమర్శించారు. ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిద్దీన్’ లోనూ ఇండియా పేరు ఉందని, బ్రిటీష్ వారి ‘ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మనల్ని దోచుకున్నారని మండిపడ్డారు. దేశం పేరు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని దుయ్యబట్టారు. చదవండి: ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం? PM Shri @narendramodi and other senior leaders arrive for the BJP Parliamentary Party Meeting in New Delhi. pic.twitter.com/3Hk6q5wlwa — BJP (@BJP4India) July 25, 2023 విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాల వైఖరి చూస్తుంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక లేదన్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లుగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. #WATCH | LoP Rajya Sabha & Congress President Mallikarjun Kharge in Parliament, says, "So many representatives are giving notices under 267 in Parliament. We are talking about Manipur, but the Prime Minister is talking about East India Company" pic.twitter.com/rCpfn8JHPO — ANI (@ANI) July 25, 2023 ఇక ప్రధానిమోదీ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తాము పార్లమెంట్ సాక్షగా మణిపూర్ సమస్య గురించి మాట్లాడాలని కోరుతుంటూ.. ప్రధాని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో చాలా మంది ప్రతినిధులు నిబంధన 267 కింద నోటీసులు ఇస్తున్నారని, కాబట్టి పార్లమెంట్లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకుపెట్టి, మణిపుర్ ఘటనపై చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు తెలిపారు. -
Manipur: ప్రధాని కాదు.. ఆయనే మాట్లాడతారట!
న్యూఢిల్లీ: మణిపూర్ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని కేంద్రం అంటోంది. గురివింద గింజ సామెతలాగా.. తమ రాష్ట్రాల్లో నేరాలను ఆయా ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని విపక్షాలపై మండిపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? అనే సందిగ్ధం నెలకొనగా.. అనూహ్యంగా క్విడ్ ప్రోకో(రెండు వైపులా లాభం) తెర మీదకు వచ్చింది. ‘‘మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీనే పార్లమెంట్లో మాట్లాడాలి. ఇది తేలనిదే పార్లమెంట్ సమావేశాలను ముందుకు సాగనివ్వం’’ విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇది. ఈ డిమాండ్‌తోనే గత రాత్రి సైతం పార్లమెంట్ బయట తమ నిరసన గళం వినిపించాయవి. అయితే కేంద్రం మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. పైగా ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండగా.. అందునా వివాదాస్పదమైన ఢిల్లీ ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా ఉంది. దీంతో మణిపూర్ గండం దాటుకోవడం ఎలాగ? అనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. శాంతి భద్రతల అంశం కాబట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రసంగం చేస్తారని.. అనుమానాలను నివృత్తి చేస్తారని చెబుతోంది. ఈ క్రమంలోనే క్విడ్ ప్రోకో ఆలోచనతో ముందుకు వచ్చింది. మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చతో సరిపెడతామని.. ప్రతివిమర్శలు చేయబోమని విపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశాలకు సజావుగా సాగనిచ్చేందుకు, సామరస్యంగా మణిపూర్ చర్చ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో ఫోన్లలో మాట్లాడారు. సభను సజావుగా సాగనిచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే హోం మంత్రి నివృత్తి చేస్తారని.. చర్చించేందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో కొందరు కేంద్ర మంత్రులు.. హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీలు జరిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడూ ఇంత సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని మణిపూర్ సంక్షోభంపై ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా ప్రకటన చేసింది. ‘‘1993-97 మధ్యకాలంలో మణిపూర్ ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులను చవిచూసింది. ఆ సమయంలో ఏ ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. అలాగే పార్లమెంట్లో ఒక్కసారిగా కూడా చర్చించలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మణిపూర్‌పై పరిమిత చర్చ మాత్రమే జరిపి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేరాలపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా బిల్లుల ఆమోద ప్రయత్నాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం ప్రతిపాదనకు ఎలా స్పందించాయనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అనేది అనుమానమే!. ఇదీ చదవండి: రూల్ నెంబర్ 267 వర్సెస్ 176 -
Parliament Monsoon session: 267 X 176
మణిపూర్ అమానవీయ ఘటనపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఏ నిబంధన కింద చర్చించాలన్న దానిపై పీటముడి నెలకొంది. 267 కింద మణిపూర్‌పై రాజ్యసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిపి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనంతట తానుగా ఒక ప్రకటన చేయాలని విపక్ష పారీ్టలు పట్టుబడుతున్నాయి. దానికి బదులుగా నిబంధన 176 కింద చర్చకు సిద్ధమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ రెండు నిబంధనలకున్న ప్రాథమికమైన తేడా చర్చా సమయం. నిబంధన 267 కింద సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటే, నిబంధన 176 కింద స్వల్పకాలిక చర్చ మాత్రమే జరుగుతుంది. రూల్ 267 ► రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) ప్రకారం రూల్ 267 కింద చర్చ సుదీర్ఘంగా సాగుతుంది. ఆ రోజు ఏదైనా అంశంపై చర్చకు సభ్యులు ముందుగా నోటీసులు ఇచ్చి ఉంటే రాజ్యసభ చైర్మన్ వాటిని పూర్తిగా రద్దు చేసి దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చ సందర్భంగా సభ్యులు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. చర్చ ఎన్ని గంటలు కొనసాగించాలన్న దానిపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. చర్చ జరపడానికి తీర్మానం, దానిపై ఓటింగ్ వంటి వాటికి అవకాశం ఉంటుంది. రూల్ 176 ► స్వల్పకాలిక వ్యవధిలో ముగిసే చర్చలు 176 నిబంధన కింద జరుపుతారు. ఈ నిబంధన కింద రెండున్నర గంటలకు మించి చర్చ కొనసాగదు. ఈ నిబంధన కింద సభ్యుడెవరైనా అప్పటికప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇవ్వొచ్చు. ఆ నోటీసులో చర్చకు గల కారణాలు వివరించాలి. ఆ నోటీసుకి మద్దతుగా మరో ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. రాజ్యçసభ చైర్మన్ చర్చకు అంగీకరించిన తర్వాత ఆ రోజైనా, ఆ మర్నాడైనా చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చకు సంబంధిత మంత్రి మాత్రమే సమాధానమిస్తారు. ఇదంతా రెండున్నర గంటల్లోనే ముగిసిపోతుంది. లాంఛనంగా తీర్మానం, దానిపై ఓటింగ్ వంటివి ఉండవు. గతంలో 267 కింద చర్చ జరిగిందా ? పార్లమెంటు రికార్డుల ప్రకారం రూల్ 267 కింద 1990 నుంచి 2016 వరకు 11 సార్లు చర్చలు జరిగాయి. 2016లో చివరిసారిగా పెద్ద నోట్ల రద్దుపై అప్పటి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రూల్ 267 కింద చర్చకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ నిబంధన కింద ఏ నోటీసును చైర్మన్ అనుమతించలేదు. గత శీతాకాల సమావేశాల్లో వాస్తవా«దీన రేఖ వెంబడి చైనా పెత్తనం పెరిగిపోవడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించడానికి రూల్ 267 కింద విపక్ష సభ్యులు ఇచి్చన నోటీసుల్ని ఎనిమిది సార్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కార్ తోసిపుచ్చారు. ఈ నిబంధన కింద చర్చకు అనుమతిస్తే సభలో గందరగోళం నెలకొనడం మినహాయించి సమగ్రమైన చర్చ జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. రోజంతా సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి అత్యవసరంగా చర్చ జరిపే ప్రజా ప్రాముఖ్యత అంశాలు ఉండవని కొందరు అధికార పక్ష ఎంపీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌పై స్వల్పకాలిక చర్చ జరిపి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాధానమివ్వాలని అధికార పక్షం భావిస్తూ ఉంటే, ప్రతిపక్షాలు సుదీర్ఘంగా చర్చించాక ప్రధాని నరేంద్ర మోదీయే బదులివ్వాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎవరికివారే మెట్టు దిగకపోవడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అటు N.D.A...ఇటు I.N.D.I.A
-
తొలిసారి భేటీ కానున్న విపక్ష కూటమి ఇండియా
-
విపక్ష కూటమి పేరుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభ్యంతరం
-
నువ్వా..నేనా ?..సై
-
టార్గెట్ 2024 పై చేయి ఎవరిదంటే ?
-
ఎవరి ఎజెండా వారిదే..
-
బెంగళూరులో ఇండియా 'కలిసి ఓడిస్తాం'!
బెంగళూరు: 26 విపక్ష పార్టీలు సమైక్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల సమరనాదం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) పేరుతో కొత్త కూటమిగా ఆవిర్భవించాయి. సమైక్యతా ప్రయత్నాల్లో భాగంగా సోమవారం బెంగళూరులో మొదలైన విపక్షాల రెండు రోజుల భేటీ మంగళవారం సాయంత్రం ముగిసింది. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు పలు అంశాలపై నాలుగు గంటల పాటు కూలంకషంగా చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాందీ, రాహుల్‌గాందీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కర్టీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితర దిగ్గజాలంతా భేటీలో పాల్గొన్నారు. విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముంబై భేటీలో కీలక నిర్ణయాలు: ఖర్గే ముంబైలో జరగబోయే విపక్షాల తర్వాతి భేటీలో కమిటీ కన్వీనర్ ఎంపికతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలుంటాయని ఖర్గే తెలిపారు. కూటమికి ఇండియాగా నామకరణం చేసినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి ఘనవిజయం సాధించి తీరతామని ధీమా వెలిబుచ్చారు. విపక్షాలన్నా, తాజాగా పురుడు పోసుకున్న 26 విపక్షాల కూటమి అన్నా మోదీకి భయం పట్టుకుందని ఖర్గే ఎద్దేవా చేశారు. అయితే కూటమి సారథి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఖర్గే నేరుగా బదులివ్వలేదు. కాంగ్రెస్‌కు అధికారంపై గానీ, ప్రధాని పదవిపై గానీ ఆసక్తి లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అందుకే కూటమిలో పలు పక్షాల మధ్య భేదాభిప్రాయాలున్నా విస్తృత ప్రయోజనాల కోసం, దేశ శ్రేయస్సు కోసం వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చామని చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఖర్గే సహా విపక్షాల నేతలంతా సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం భేటీలో పాల్గొనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. రాహుల్ మా ఫేవరెట్ దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండియా కూటమిని సవాలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని మీడియాతో మాట్లాడుతూ మమత నిలదీశారు. ‘‘మా మాతృభూమి అంటే మాకు ప్రాణం. మేం దేశభక్తులం. మేం రైతులం, దళితులం. మేం మా దేశం కోసం, ప్రపంచం కోసం పాటుపడేవాళ్లం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న పని ఒక్కటే. ప్రభుత్వాలను కొనడం, అమ్మడం!’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఇండియా నెగ్గుతుంది. మన దేశం నెగ్గుతుంది. బీజేపీ ఓడుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘నేటి సంయుక్త డిక్లరేషన్ ద్వారా పాలక ఎన్డీఏ కూటమిపై మా విపక్ష కూటమి 420 సెక్షన్ విధిస్తోంది’’ అని ప్రకటించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 మోసానికి సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. రాహుల్ గాంధీ తమ ఫేవరెట్ అంటూ దీదీ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలందరినీ పలకరించే క్రమంలో ఆమె చేసిన ఈ కామెంట్ పలు రకాల చర్చలకు దారి తీసింది. ఎవరేమన్నారంటే... 1. ‘‘మేం మా కుటుంబాల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని కొందరంటున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేశమే మా కుటుంబం. ఆ కుటుంబం కోసమే మేం పోరాడుతున్నాం. మా పోరు ఒక వ్యక్తిపై కాదు. ఒక నియంతృత్వ పోకడపై. ఈ నియంతృత్వాన్ని చూసి దేశ ప్రజలు భయపడుతున్నారు. మై హూ నా (నేనున్నా) అని ఒక హిందీ సినిమా వచ్చింది. మేం కూడా హమ్ హై నా (మేమున్నాం) అని ప్రజలకు భరోసా ఇవ్వదలచాం’’ – మోదీపై ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ) విసుర్లు 2. ‘‘గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ఎంతో చూసే గొప్ప అవకాశం ప్రధాని మోదీకి దక్కింది. కానీ ఏ రంగంలోనూ ఏమాత్రమూ అభివృద్ధి జరగలేదు’’ అరవింద్ కేజ్రీవాల్ 3. 2024లో నూతన భారత ఆవిర్భావం ‘‘దేశంలో నియంతృత్వం సాగుతోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం సంక్షోభంలో పడ్డాయి. కానీ 2024లో సరికొత్త భారత్ ఆవిర్భవించడం ఖాయం. జూన్‌లో జరిగిన పట్నా భేటీలో 15 పార్టీలుగా ఉన్న విపక్ష కూటమి బలం బెంగళూరు భేటీ నాటికి 26 పార్టీలకు విస్తరించడం రాబోయే మార్పుకు ప్రబల సంకేతం. దేశాన్ని ఎవరు పాలించకూడదు అన్నదాని మీదే ప్రధానంగా మా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిపై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చి తీరతాం’’ – తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ‘ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్), సీపీఎం, సీపీఐ, శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆరెల్డీ, ఎండీఎంకే, కేఎండీకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), అప్నాదళ్ (కమెరవాదీ), ఎంఎంకే లోక్‌సభలో బలాబలాలు ఎన్డీఏ కూటమి – 330పై చిలుకు ఎంపీలు 26 విపక్షల ‘ఇండియా’ కూటమి – 150 మంది ఎంపీలు (విపక్ష కూటమిలోని పార్టీలు ఢిల్లీలోనూ, మరో 10 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నాయి) దీదీ పెట్టిన పేరు! విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాని పూర్తి పేరు ఎలా ఉంటే బాగుంటుందని నేతలంతా లోతుగా చర్చించినట్టు చెబుతున్నారు. -
ప్రధాని పదవిపై ఆసక్తి లేదు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..
బెంగుళూరు వేదికగా మంగళవారం రెండో రోజు విపక్షాల ఐక్యత భేటీ జరిగింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా 26 ప్రతిపక్ష పార్టీలు, అగ్ర నేతలు హాజరయ్యారు. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ, తదితరాలపై కూటమి కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో విపక్షాల భేటీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడటం లేదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే తామంతా కలిశామని ఖర్గే పేర్కొన్నారు. చదవండి: విపక్షాల భేటీ.. మహాకూటమి పేరు ఇదే..! ‘కాంగ్రెస్‌కు అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చెన్నైలో స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా చెప్పాను. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం ఈ భేటీలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీ స్వయంగా 303 స్థానాల్లో గెలుపొందలేదు. అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకున్న కాషాయ పార్టీ.. ఆ తర్వాత వారిని విస్మరించింది’ అని ఖర్గే మండిపడ్డారు. మరోపక్క విపక్షాల భేటీకి దీటుగా ఎన్డీయే మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఏకంగా 38 మిత్రపక్షాలతో కలిసి మెగా పోటీ భేటీ తలపెట్టింది. ఈ సమావేశంలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త పార్టీలు పాల్గొంంటాయని ఇప్పటికే బీజేపీ వెల్లడించింది. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇక హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగుతున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. -
పొలిటికల్ భేటీలు.. బిగ్ షాకిచ్చిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan." On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw — ANI (@ANI) July 17, 2023 మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు -
యూపీఏ పేరు మారుతుందా..?
-
నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ
-
బెంగళూరులో విపక్షాల వ్యూహరచన
బనశంకరి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి బెంగళూరులో సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు. బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ సీఎంలు నితీశ్‌కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా పాల్గొననున్నారు. జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) నితీశ్‌కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్‌సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్ఎస్–యుబీటీ), శరద్‌పవార్ (ఎన్సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్ (ఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు. భేటీకి ఆప్ కూడా.. ఢిల్లీ యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఆప్ స్పందించింది. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పారీ్టల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. -
విపక్షాల కూటమికి ఒవైసీ పంచ్.. ‘చౌదరీ’ల క్లబ్‌లా తయారైందంటూ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూసీసీని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో విపక్ష పార్టీల కూటమికి సెటైరికల్ పంచ్ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్‌లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #WATCH | Our party will oppose UCC...If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV — ANI (@ANI) July 15, 2023 ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. क्या Assam के CM Himanta Sarma UCC Bill को अदिवासियों पर लागू करेंगे, वह सिर्फ एक आंख से देख रहे हैं बस और उस आंख में मुसलमानों को लेकर Hatred (नफ़रत) भरी हुई है : Barrister Asaduddin Owaisi#ucc #ManipurBurning #UCCDividesIndia #IndiaAgainstUCC #aimim #owaisi pic.twitter.com/3OJHPYO2Sg — Mohammad shahnshah (@shahnshah_aimim) July 15, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్? -
అఖిలపక్షం..అయోమయం
-
Ajit Pawar: ఎన్సీపీలో చీలిక.. బీజేపీ వ్యతిరేక కూటమి యత్నాలకు దెబ్బ!
న్యూఢిల్లీ: ఎన్సీపీలో అనూహ్య చీలిక మహారాష్ట్రలోనేకాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను అజిత్ తనవెంట తీసుకెళ్లడంతో శరద్ పవర్‌కు సొంత పార్టీలో బలం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతకు తనవంతు బలం ఇచ్చే స్థాయిలో శరద్ ప్రస్తుతం లేరనే చెప్పాలి. దీంతో గత నెలలో పట్నాలో 15 ప్రతిపక్ష పార్థీలల ఐక్యత కోసం చేసిన యత్నానికి జోరు కాస్తంత తగ్గింది. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో పాలనపై సర్వాధికారం విషయంలో ఆర్డినెన్స్‌కు సంబంధించి ఆప్, కాంగ్రెస్ మధ్య పొసగలేదు. అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య బాహాటంగా మాటల తూటాలు పేలాయి. కేరళలోనూ కాంగ్రెస్, సీపీఎంలకూ కుదరట్లేదు. తాజాగా అజిత్ ఇచ్చిన షాక్‌తో 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఐక్యంగా ఢీకొట్టాలన్న ప్రయత్నాలకు కాస్తంత బ్రేక్ పడినట్లయింది. విపక్షాలను ఏకం చేయడంలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న శరద్ పవార్ మున్ముందు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి ఊపు మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దికాలంగా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. షిండే ప్రభుత్వంలో చేరాలన్న అజిత్ నిర్ణయంతో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ కీలకంగా మారే సమయం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయానికి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు మూడు శక్తివంతమైన వర్గాలకు నాయకత్వం సాధించే స్థాయిలో ఉన్నాయి. మహావికాస్ అఘాడి(ఎంవీఏ)పై బీజేపీ పైచేయి సాధించేందుకు అవకాశం చిక్కింది. -
ప్రతిపక్షాలు బీజేపీ ఉచ్చులో పడరాదు!
యూనిఫాం సివిల్ కోడ్(యూసీ సీ)పై వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఊహించదగిన ప్రతిస్పందనలనే రాబట్టగలిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు యూసీసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముస్లిం సంస్థలు ఒక అడుగు ముందు కేసి దీన్ని మైనారిటీలకు, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకరమైన చర్యగా ఖండించాయి. రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వాన్ని అందరికీ అందించడం కోసం అంటూ యూసీసీని బరిలోకి దించింది బీజేపీ. అయితే లౌకికవాద రాజకీయాలు సంప్రదాయ (మైనారిటీ) మతనాయకులతో గొంతుకలుపుతూ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో విషాదకరమైన, హాస్యస్ఫోరకమైన సైద్ధాంతిక పోరాటానికి వేదిక సిద్ధమైంది. లౌకికవాదం పేరుతో ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయమని ఊహించే బీజేపీ ఈ చదరంగాన్ని ప్రారంభించి ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలు చట్టవిరుద్ధంగా హిందూ మతాన్నీ, సంప్రదాయాలనూ, జాతీయవాదాన్నీ ఆక్ర మించి ముందుకు వెళుతుంటే లౌకికవాద రాజకీయాలు ఆ మేర వెనకబడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ప్రతిపక్షాలు పప్పులో కాలువేసి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్ప డటానికి కారణమవుతున్నాయి. ఈ తిరోగమనం ఆగాలంటే, లౌకిక రాజకీయాలు ఉమ్మడి పౌరస్మృతి పట్ల సూత్రప్రాయమైన, ప్రగతిశీలమైన పాత్ర పోషించాలి. యూసీసీకి ఏ ఒక్క మతానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలతో ప్రమేయం ఉండదనీ, దీని ద్వారా వివిధ మతపరమైన సమూహాల్లోనూ, సమూహాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వాన్ని పాదుకొల్పడమే ప్రధాన ఉద్దేశం అనే సంగతినీ గుర్తెరగాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరికీ ఒకే విధమైన న్యాయాన్ని ప్రదానం చేయడం దీని ఉద్దేశమని గ్రహించాలి. యూసీసీని వ్యతిరేకించడం పేలవమైన రాజకీయం! 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లౌకికవాదులకు ఇది చెడు రాజకీయ వ్యూహం అని చెప్పక తప్పదు. ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన చట్టం ముందు సరళమైన, శక్తిమంతమైన హేతుబద్ధ సమానత్వాన్ని ప్రతిపాదిస్తోంది. పౌరు లందరినీ ఒకే శిక్షాసమ్మృతి ద్వారా పాలించగలిగితే, సివిల్ కోడ్‌కు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? అలాగే వివిధ సంఘాలు వారి ప్రత్యేక ఆచారాలను సంప్రదాయాలను ఆస్వా దించవచ్చు, అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఏ సంఘాన్నైనా అనుమతించవచ్చా? ఒక మతం లేదా సంస్కృతికి చెందినవారు తమ ఆచారం పేరుతో సొంత సమా జంలోని మహిళల సమానత్వ హక్కును హరించడాన్ని అనుమ తించవచ్చా? ఇవి బీజేపీ వాదనలు కావు. యూసీసీ కోసం మహిళా సంస్థల అసలు డిమాండ్ వెనుక ఉన్న కారణం ఇదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఈ న్యాయబద్ధం కాని ఆదేశిక సూత్రము (సమానత్వం)ను కలిగి ఉంది. భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్‌ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూనే ఉన్న మనలాంటి వారు ఈ కీలక సూత్రాలలో ఒకదాని నుంచి అకస్మాత్తుగా వెనుదిరగలేరు. జాతీయ ఎన్నికలకు 10 నెలల ముందు, లా కమిషన్ అంతకు ముందు తిరస్కరించిన యూసీసీనే తిరిగి ప్రవేశ పెట్టాలని బీజేపీ భావించడం మైనారిటీలను దెబ్బతీయడానికి మరొక సైట్‌ను తెరవడమే. కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ చట్టాల సంస్కరణలను హిందువుల గొంతుకపైకి నెట్టేయ గలవనీ, అయితే ముస్లింలు, క్రిస్టియన్ల విషయంలో అలా చేయడానికి ధైర్యం చేయవనీ దీని ఉద్దేశ్యం. ముస్లిం, క్రైస్తవ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో ప్రతిపక్షాలు గొంతు కలుపు తాయని ఊహించే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించి తప్పు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ పన్నిన యూసీసీ ఉచ్చులో పడిపోతున్నాయి. ప్రతిపక్షాలు యూసీసీ ఆలోచనను వ్యతిరేకించే బదులు, ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌ను బీజేపీ ఏ విధంగా తప్పుగా వ్యాఖ్యా నిస్తుందో చెప్పాలి. ‘యూనిఫాం’ సివిల్ కోడ్ అంటే దేశంలో బహుళ కుటుంబ చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండాలి. పైగా ఆ చట్టం అన్ని మత వర్గాల సభ్యులకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఇదే ముందుకు తేవాల్సిన వెర్షన్. కానీ బీజేపీ విమర్శ కులు ప్రతిఘటిస్తున్న సంస్కరణ ఇది. ఇది రాజ్యాంగ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. సంఘ సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం, స్త్రీవాద ఉద్యమం డిమాండ్ వంటివి ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఏకరూప కోడ్ అనేది ఒకే రూపంలో కానీ ఒకే సూత్రంగా కానీ ఉండదు. బదులుగా, ఇది ఉమ్మడి సూత్రాలు, విభిన్న నియ మాలను కలిగి ఉంటుంది. ఇక్కడ, ఏకరూపత అంటే అన్ని మత, సామాజిక సంఘాలు ఒకే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండడం. సమానత్వ హక్కును, వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కును, లింగ న్యాయం ఆలోచనను ఉల్లంఘించేలా ఏ కమ్యూ నిటీకి చెందిన కుటుంబ చట్టం అనుమతించబడదు. ఈ సూత్రా లను ఉల్లంఘించే ఏ ఆచారం లేదా కుటుంబ చట్టానికి స్థానం ఉండదు. అదే సమయంలో, ఈ ఉమ్మడి సూత్రాలు వివిధ సంఘాలకు వేర్వేరు రూపాలను తీసుకోవచ్చు, వాటి ప్రస్తుత లేదా క్రోడీకరించిన పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. హిందూ ఆచారాల మాదిరిగా కాకుండా, ముస్లిం వివాహం ‘నిఖా నామా’పై ఆధారపడిన ఒప్పందం. ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌కు ముస్లింలు దీనిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, లేదా హిందువులు దానిని స్వీకరించాల్సిన అవసరం లేదు. వివిధ సంఘాలు అందరికీ ఉద్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంత కాలం... వివాహం, విడాకులు, దత్తత, వారసత్వా నికి సంబంధించి పూర్తిగా భిన్నమైన, పరస్మర విరుద్ధమైన ఆచా రాలు, పద్ధతులను అనుసరించడం కొనసాగించవచ్చు. చాలా కాలంగా, లౌకిక రాజకీయాలు బీజేపీ చొరబడిన నేలను ఖాళీ చేశాయి. ప్రతిపక్షాల ఈ స్వీయ–ఓటమి రాజకీ యాలకు యూసీసీ మరొక ఉదాహరణగా మారకూడదు. బీజేపీ రచించిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటానికి, మైనారిటీ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో చేతులు కలపడానికి బదులుగా, లౌకిక రాజకీయాలు బీజేపీ బుకాయింపునకు ఎదు రొడ్డాలి. ప్రతిపాదిత యూసీసీ గణనీయమైన ముసాయిదాను సమర్పించమని అడగాలి. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు.