సాక్షి, హైదరాబాద్: విపక్షాల ఐక్యతపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ఓడించడం కోసం అందరూ ఏకం కావడం ఏంటి అని ప్రశ్నించారు. దేశానికి నష్టం చేసింది కాంగ్రెస్, బీజేపీనేనని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల వల్లే దేశంలో ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ సమస్య ఉందన్నారు. బీజేపీ ఇష్టం లేదని కాంగ్రెస్ వైపు ఉండాలంటే ఎలా అని మండిపడ్డారు. తాము ప్రజలను ఐక్యం చేయడాన్ని నమ్ముతామని పేర్కొన్నారు.
కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం విపక్షాల మెగా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు కలసికట్టుగా పోటీ చేయడానికి అంగీకరించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి వచ్చే నెల సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లాలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం.
చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
Comments
Please login to add a commentAdd a comment