సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan."
— ANI (@ANI) July 17, 2023
On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw
మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు
Comments
Please login to add a commentAdd a comment