
కోల్‌కతా: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున ఖర్గే, జైరాం రమేశ్ హాజరు కావచ్చంటున్నారు.
ఉమ్మడి అభ్యర్థిగా ఉండండి..
మమత మంగళవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవాలని అభ్యర్థించారు. అయితే అందుకాయన సుముఖంగా లేరని ఎన్‌సీపీ వర్గాలు తెలిపాయి. బీజేపీని ఓడించే సంఖ్యాబలాన్ని సమీకరించడంలో విపక్షాలు విఫలమవుతాయనే సంశయం పవార్‌కు ఉందని ఎన్‌సీపీ వర్గాల్లో వినవస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా నిలిచే ఉద్దేశ్యం పవార్‌కు లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. 2017లోనూ ఆయన ఈ ఆఫర్‌ను కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment