president elections
-
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లింక్డిన్ కో-ఫౌండర్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ విజయంతో రీడ్ హాఫ్మన్ అమెరికా వదిలేందుకు సిద్ధమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. BREAKING: Democratic Mega-Donor, Reid Hoffman tells friends he is considering leaving the United States following President Trump’s Election Win. Bye! ✌🏻 pic.twitter.com/g2olDLGVR8— Ian Jaeger (@IanJaeger29) December 2, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో భయం మొదలైందని అమెరికా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ కో-ఫౌండర్ హాఫ్మన్ దేశాన్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాఫ్మన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలికారు. ఆమె ఎన్నికల ప్రచారానికి 10 మిలియన్ డాలర్లు విరాళం అందించారు.దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ మరణాన్ని కోరుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.అయితే,వీటన్నింటికి కంటే ట్రంప్‌పై మాజీ న్యూయార్క్ మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పరువు నష్టం దావా వేశారు. అందుకు హాఫ్మన్ సహకరించారు. ఈ భయాలతో హామ్‌మన్ అమెరికాను వదిలేయాని నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
కమల ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో అక్టోబర్ 7న జరిగిన ఇంటర్వ్యూను మోసపూరితంగా ఎడిటింగ్ చేశారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ఒకే ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలు ప్రసారం చేశారంటూ సీబీఎస్ నెట్‌వర్క్‌పై వ్యాఖ్యలు చేశారు.When will CBS release their Transcript of the fraudulent Interview with Comrade Kamala Harris? They changed her answer in order to make Kamala look intelligent, rather than “dumb as a rock.” This may be the Biggest Scandal in Broadcast History! CBS MUST GET THE TRANSCRIPT OUT NOW…— Donald J. Trump (@realDonaldTrump) October 21, 2024అయితే.. ట్రంప్ ఆరోపణలను ఇప్పటికే సీబీఎస్ నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంది. ‘ఫేస్ ది నేషన్’ న్యూస్ ప్రోగ్రాం కంటే ‘60 మినిట్స్’ ప్రోగ్రాంలో ప్రసారమైన కమలా హారిస్ ఇంటర్వ్యూ అధిక భాగం ఉందని స్పష్టం చేసింది. ప్రసారమైన రెండు ప్రోగ్రాముల్లో ఒకే ప్రశ్నకు స్పందించినా.. కమల సమాధానంలోని వివిధ భాగాలను హైలైట్ చేశాయని తెలిపింది.‘‘మేము ఏదైనా ఇంటర్వ్యూని ఎడిట్ చేసినప్పుడు. ఒక రాజకీయవేత్త, అథ్లెట్ లేదా సినిమా స్టార్ అయినా మేము స్పష్టంగా ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపింది. అయినా విమర్శలు ఆగటం లేదు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పూర్తి ఇంటర్వ్యూపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోపైపు.. సీబీఎస్ నెట్‌వర్క్‌పై దావా వేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త అవతారం.. ఇలా ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)
-
ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు. -
శ్రీలంక అధ్యక్షునిగా అనురకుమార విజయం
కొలంబో:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిసనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురకుమారకు ఆధిక్యం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనురకుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. -
ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్ అనుమానం
ఆస్టిన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ నామినీ డొనాల్ట్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. ట్రంప్‌కు అతి సమీపంలోనే కాల్పులు జరిగాయని, అయితే ఆయన క్షేమంగా బయటపడ్డారన్నది, అనుమానితుడ్ని భద్రతా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయన్నది ఆ కథనాల సారాంశం. ఇక.. ఈ ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే..ట్రంప్ మద్దతుదారుడిగా పేరున్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారాన్ని రేపింది. ‘‘డొనాల్డ్ ట్రంప్‌ను వాళ్లు ఎందుకు చంపాలనుకుంటున్నారు?’’ అని ఓ వ్యక్తి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయగా దానికి మస్క్ స్పందించాడు. బైడెన్, కమలపై మాత్రం ఎందుకనో ఎవరూ హత్యాయత్నం చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారాయన.And no one is even trying to assassinate Biden/Kamala 🤔 https://t.co/ANQJj4hNgW— Elon Musk (@elonmusk) September 16, 2024ఆ అనుమానాలకు కొనసాగింపుగా.. ఆయన మరిన్ని ట్వీట్లు చేశారు. తాను లేవనెత్తిన అంశాన్ని కనీసం ఎవరూ ప్రస్తావించడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. ఈలోపు.. ట్రంప్ వ్యవస్థను భయపెడుతున్నారని, అందుకే ఆ వ్యవస్థ ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆ వ్యవస్థ బైడెన్, కమల అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే మస్క్ దానికి నూటికి నూరు శాతం అంటూ రిప్లై ఇచ్చారు. మస్క్ ట్వీట్‌పై డెమోక్రటిక్ మద్దతుదారులతో పాటు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: చంపినా వెనక్కి తగ్గను: ట్రంప్ -
ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్‌షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహంఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు మరోసారి చేతులు కలిపారు. నిన్న డిబేట్ ప్రారంభానికి ముందు ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి కరచలనం చేసుకున్నారు.9/11 దాడులు.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. నిన్నటితో దాడులకు 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంలో.. న్యూయార్క్‌లోని 9/11మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి బైడెన్ సమక్షంలో మరోసారి కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 90 నిమిషాల ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్, హారిస్ ఇద్దరూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్లలో అధ్యక్ష అభ్యర్థులెవరూ డిబేట్‌కు ముందు ఎవరూ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. 🚨 After putting on a MAGA hat, Joe Biden told a group of Trump supporters: “No eating dogs and cats”pic.twitter.com/TIxtN5LDOa— Benny Johnson (@bennyjohnson) September 12, 2024ట్రంప్ టోపీ ధరించిన జో బైడెన్ ఇదే సంస్మరణ సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ట్రంప్2024 అని ఉన్న టోపీని ధరించిన ట్రంప్ అభిమానులున్నారు. ట్రంప్ అభిమానులు ధరించిన టోపీని చూసిన బైడెన్ సరదాగా వారితో మాట్లాడారు. అందులో ఓ ట్రంప్ మద్దతు దారుడు ధరించిన టోపీని బైడెన్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : ట్రంప్- హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి -
ఆమె మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్ పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ తెలిపారు.అయితే తాజాగా ఆమె కమలకు మద్దతు ఇవ్వటంపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ టేలర్ స్విఫ్ట్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఆమె ఎప్పుడూ డెమోక్రట్లకే మద్దతు పలుకుతుందని విమర్శలు గుప్పించారు. ట్రంప్ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. ఆమె చాలా ఉదారవాద వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ డెమొక్రాట్ల మాత్రమే సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆమె తర్వాత తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుంది’’ అని అన్నారు.కమల హారిస్, డొనాల్డ్ తొలి డిబేట్ పూర్తి అయిన వెంటనే టేలర్ స్విఫ్ట్ తన మద్దతును సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ‘ అధ్యక్ష ఎన్నికల్లో నేను డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, టిమ్ వాల్జ్‌కు ఓటు వేస్తాను. ఎందుకంటే ఆమె దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారియర్ అయిన కమల ఛాంపియన్‌గా గెలవాల్సిన అవసరం ఉంది. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశంలో మనం చాలా ఎక్కువగా సాధించగలమని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు.మరోవైపు.. అభిమానులు ‘స్విఫ్టీస్ ఫర్ కమల’ అని కమలా హారిస్ కోసం ప్రచారం ప్రారంభించినా మంగళవారం వరకు కూడా టేలర్ స్పందించలేదు. అయితే మరికొంత మంది ఆమె ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆసత్య ప్రచారానికి చెక్ పెడుతూ కమలకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏఐతో భయం కలుగుతోందని, తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. -
కమలా హారిస్‌కు మద్దతుగా పాప్‌స్టార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మద్దతు పలికారు.ఈ నేపథ్యంలో ఈసందర్భంగా హారిస్‌ను వారియర్‌గా అభివర్ణించిన ఆమె..చైల్డ్‌లెస్ క్యాట్లేడీ (తనకూ పిల్లలు లేరంటూ) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.అంతేకాదు అధ్యక్ష ఎన్నికల్లో హారిస్‌కు ఓటు వేస్తానని ప్రకటించారు. అందుకు గల కారణాల్ని వివరించారు. హారిస్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాటిని సాధించాలంటే వారియర్ అవసరమని నేను నమ్ముతున్నాను’అని ఇన్‌స్టా పోస్ట్‌లు రాశారు. హారిస్ స్థిరమైన, ప్రతిభావంతులైన నాయకురాలు అని భావిస్తున్నాను. ప్రశాంతతో గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు. కాగా, స్విఫ్ట్ 2020లో ప్రెసిడెంట్ జో బైడెన్, హారిస్‌లకు మద్దతు పలికారు. ఆమె కెరీర్లో డెమోక్రటిక్ పార్టీ రాజకీయ నాయకులకు మద్దతుగా పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరో ఎనిమిది వారాల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి : దేశాన్ని అమ్మేసిన ట్రంప్World’s shittiest dad offers to impregnate Taylor Swift (presumably because she threw her support behind Kamala Harris).Totally normal. Right? Right? 🤮#Debate2024 #ElonMusk pic.twitter.com/UP0zSWxnmj— Nonsensei Sean (@yes_nonsensei) September 11, 2024ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ తరుఫున అమెరికా ఉపాధ్యక్షుడిగా బరిలోకి దిగిన జేడీ వాన్స్ గతంలో హారిస్‌ను ఛైల్డ్‌లెస్ క్యాట్ లేడీ విమర్శలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వాన్స్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. దానిపై టేలర్ స్విప్ట్ స్పందించారు. తాను కూడా ఛైల్డ్‌లెస్ క్యాట్ లేడీ అంటూ పిల్లిని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆమె పిల్లులకు తాను సంరక్షకుడిగా ఉంటానంటూ అభ్యంతరకంగా మాట్లాడారు. -
ఈవిడే శ్యామల.. 19 ఏళ్లకే సప్త సముద్రాలు దాటి..!
-
కమల కంటే నేనే మంచిగా కనిపిస్తా: ట్రంప్ సెటైర్లు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డొమోక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి కమలా హారిస్ కంటే తానే చూడడానికి మంచిగా కనిపిస్తున్నానని అన్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. ‘చూడటానికి కమల కంటే నేను చాలా బాగుంటాను. ఆమెతో పోల్చితే.. నేను మంచిగా ఉంటానని భావిస్తున్నా. తెలివితేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను’అని అన్నారు.‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’’లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ ఓ వ్యాసాన్ని రాశారు. అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ మెక్కార్మిక్ను ఉద్దేశించి.. ‘‘డేవిడ్.. దయచేసి స్త్రీని అందంగా ఉన్నారని ఎప్పుడూ పొగడకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుంది’’ అని అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై కమలా ఫొటోను ప్రస్తావిస్తూ.. అందులో ఉన్నది హీరోయిన్లు సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అనుకున్నానని సెటైర్లు వేశారు. శుక్రవారం కమల ప్రకటించిన ఆర్థిక ప్రణాళికను.. యుఎస్‌లో కమ్యూనిజానికి దారితీసే ప్రణాళిక అని ట్రంప్ ఆరోపణలు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా కమలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు సైతం ట్రంప్ వెనుకాడడం లేదు. కమలకు ‘పిచ్చి’ ఉందని కూడా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. -
కమలా హారిస్‌తో డిబెట్‌కు ట్రంప్ ఓకే.. ఎప్పుడంటే..!
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో టీవీ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 4న హారిస్‌తో కలిసి ఫాక్స్ న్యూస్ డిబెట్లో పాల్గొననున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు.కాగా కమలా హారిస్,ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే గత జూన్‌లో ట్రంప్, జోబైడెన్ అధ్యక్ష చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలో బైడెన్ సరిగా మాట్లాడలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ మాటలకు సమాధానలు చెప్పడంలో విఫలమైనట్లు, తడబడినట్లు విశ్లేషకులు భావించారు. దీంతో ఆయన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. అనుకున్నట్లుగానే చివరికి బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రవారం డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రంప్లాంటోళ్లను చాలామందినే చూశా: కమలా హారిస్
తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ధీటుగా బదులిచ్చారు.తన కెరీర్లో ట్రంప్ లాంటి వారెంతో మంది నేరస్థులతో వ్యవహరించినట్లు కమలా హారిస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవకముందు గతంలో అటార్నీ జనరల్, డిస్ట్రిక్ట్ అటర్నీ, కోర్టు ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.‘ట్రంప్ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ప్రవర్తననే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’ అని వ్యాఖ్యానించారు.Throughout my career, I’ve taken on perpetrators of all kinds, and let me tell you: I know Donald Trump’s type. pic.twitter.com/EP9e8ClVKE— Kamala Harris (@KamalaHarris) August 1, 2024 కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై జాతీపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆమె భారతీయురాలా?.. లేక నల్లజాతీయురాలా?’అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. ఇన్నాళ్లూ దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు.ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.కాగా కమలా హారిస్ భారత సంతతికి చెందినవారన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్. ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చారు. అయతే కమలా నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు.. -
ఎట్టకేలకు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. -
అమెరికా ఉపాధ్యక్ష బరిలో నా మనవరాలి భర్త వాన్స్
-
అంచనాలు తలకిందులు.. హంగ్ దిశగా ఫ్రాన్స్ ఫలితాలు!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 577 స్థానాలకుగాను మూడు పార్టీల కూటములకు స్పష్టమైన తీర్పు రాలేదు. అంచనాలు తలకిందులై ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకుండా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 289 ఎంపీ సీట్లు గెలవాలి.ఇక మొదటి దశ పోలింగ్‌లో అతివాద కూటమి నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) 33 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. లెఫ్ట్ వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) కూటమి 28 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. అయితే అధికార ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కేవలం 21 శాతం ఓటు షేర్‌తో మూడోస్థానానికి పరిమితమైంది. ఇక.. ఆదివారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో లెఫ్ట్ పార్టీ న్యూ పాపులర్ ఫ్రంట్ అనూహ్యంగా 182 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాల్సింది ఉంది. మొదటి రౌండ్ పోలింగ్‌లో అత్యధిక పాపులర్ ఓటు షేర్ సంపాధించిన రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ రెండో దశ పోలింగ్ అనంతరం 143 స్థానాలు మాత్రమే గెలచుకొని మూడో స్థానంలోకి వెళ్లింది. ఇక అధికార మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కూటమి 163 ఎంపీ స్థానాలు గెలచుకొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మొదటి నుంచి ఈసారి ఎన్నికలల్లో రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ పార్టీ అధిక సీట్లు గెలచుకొని అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా లెఫ్ట్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలోకి రాగా.. రైట్ వింగ్ పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. ఈ అనూహ్య ఫలితాలతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే.. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ప్రస్తుతం ఫలితాలతో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకొంది. -
అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ అవుట్?.. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్‌ను మార్చే అవకాశం ఉందని తెలిపారు.కాగా నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్‌ను భర్తీ చేసే మార్గాలపై చర్చిస్టున్నట్లు తెలుస్తోంది.బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆయన మాట్లలో బొంగురు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, సమాధానలు చెప్పడంలో, ఆలోచనలను వివరించడంలో తడబాటు.. వంటి పలు కారణాలతో బైడెన్‌ను రేసు నుంచి తప్పించాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిడెన్‌ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాలని చూస్తుందని చెప్పారు టెడ్ క్రూజ్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియమించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు తెలిపారు. -
జోబైడెన్ కీలక నిర్ణయం.. అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట!
వాషింగ్టన్ : వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా పౌరుల భాగస్వాములకు సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్నారు.ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం..అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17,2024 ముందు వరకు వివాహ అయ్యిండి.. కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం..పీఆర్ కోసం అప్లయ్ చేసుకునే వారి సంఖ్య 5లక్షలు ఉండొచ్చని అంచనా.అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు. -
అమెరికాలో పొలిటికల్ హీట్.. ట్రంప్ జైలుకా, వైట్ హౌస్కా
అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో-అమెరికా మధ్య గోడ, ఏడు దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం. ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా వివర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో...జైలుకా, వైట్ హౌస్కా అన్న చర్చ మొదలైపోయింది. ఈ ఎపిసోడ్‌కి ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే...డోనల్డ్ ట్రంప్ కూడా క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం అన్నది ఇదే తొలిసారి. ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా...ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటు రిపబ్లికన్స్ కూడా అదే స్థాయిలో ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. మన్ హట్టన్ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని నవంబర్ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందంటున్నారు ట్రంప్. నవంబర్ 5 ఎలక్షన్ డే. అయితే...అందరి చూపు మాత్రం ఇప్పుడు జులై 11వ తేదీన న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్ వయస్సు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్ అవడం...ఇలా అనేక అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో...జరిమానాతో సరిపెడతారా ? లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. హష్ మనీ కేసులో ట్రంప్ పై మొత్తం 34 అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా...గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక వేళ ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కేవలం అధ్యక్షుడికి మాత్రమే కాదు. మాజీ అధ్యక్షులకు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంది. ట్రంప్‌కి కూడా సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఇప్పుడు హష్ మనీ కేసులో ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...ట్రంప్‌కి జైల్లో కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీని కోసం అనేక జైలు నిబంధ నలను సవరించాలి. అలానే...అమెరికా మాజీ అధ్యక్షుడుని జైల్లో ఉంచడం అంటే...భద్రతా పరంగా చాలా రిస్క్. ఈ కోణంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ట్రంప్‌కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే...అమెరికా రాజ్యాం గం అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో వయస్సు, అమెరికా పౌరసత్వం, 14 ఏళ్లుగా అమెరికాలో నివశించడం లాంటి వే ఉన్నాయి. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నాయి. అయితే...ఇప్పటికే ట్రంప్‌కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపి స్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూమ్‌బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్‌లో...ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లి కన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు తెలిపారు. క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు. ట్రంప్‌ని న్యాయస్థానం దోషిగా తేల్చిన మర్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన సర్వేలో ఈ తీర్పు సరైనదే అని, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని...సర్వేలో పాల్గొన్న మెజార్టీ అమెరికన్లు తేల్చేశారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిం దంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. కానీ...హష్ మనీ కేసు మాత్రం ట్రంప్‌ని తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరుగుతోంది. ఆయనకొచ్చే విరాళాలు పెరుగుతున్నాయి.ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో బైడెన్‌కి అధికారాన్ని బదలాయించకుండా...తన మద్దతుదా రులను ట్రంప్ రెచ్చగొట్టిన తీరు...ఆయన తెంపరితనానికి పరాకాష్ట. వ్యవస్థలపై ట్రంప్ ఎప్పుడూ పెద్దగా గౌరవం చూపించరు. ఈసారి గెలిస్తే...వలసలను కట్టడి చేయడం దగ్గర నుంచి అంతర్జాతీయ సాయానికి కత్తెర వేయడం దాకా చాలా వివాదాస్పద అంశాలనే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రత ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో జులై 11న హష్ మనీ కేసులో ట్రంప్‌కి పడే శిక్ష ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్రిమినల్ కేసులో ట్రంప్ దోషిగా తేలడాన్ని...తన ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవడం పై బైడెన్ ఫోకస్ పెడుతున్నారు. బైడెన్ కుమారుడు ఎపిసోడ్‌ని కూడా ట్రంప్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. 80 ఏళ్లు బైడెన్, 80 వసంతాలకు అతి చేరువలో ఉన్న ట్రంప్. పైగా...వీరిద్దరూ చుట్టూ క్రిమినల్ కేసుల కేంద్రం గా నెగిటివ్ వైబ్రేషన్స్. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే...సమర్థ నాయకత్వాన్ని అమెరికాకు అందించే విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు బలంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
‘డొనాల్డ్ ట్రంప్ ఒక మోసగాడు, ఫెయిల్యూర్’
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలం నుంచి అధిక వయసు పేరుతో జో బైడెన్(81)పై విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదే విషయాన్ని ట్రంప్ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. బైడెన్‌తో పోల్చితే అమెరికాకు తానే చురుకైన ప్రెసెడింట్‌గా ఉండగలనని పేర్కొంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్ సైతం 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో జో బైడెన్ ఎన్నికల ప్రచారం బృందం ఓ వైపు ట్రంప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేస్తునే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఓ సందేశం పంపారు.‘హ్యాపీ బర్త్ డే ట్రంప్. మీరు మోసపూరిత, ఫెయిల్యూర్ వ్యక్తి. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, హాక్కులు, భవిష్యత్తుకు మీరు చాలా ప్రమాదకారి. మీరు ఇక ఎప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్ కాలేరు. మీ 79వ బర్త్‌డేకు అదే మొదటి అందమైన బహుమతి అవుతుంది’అని తెలిపింది. అదేవిధంగా అధ్యక్షుడు బైడెన్ అధికార యంత్రాగం సైతం ట్రంప్‌పై విమర్శలు చేస్తూ.. ట్రంప్ సాధించిన 78 విజయాలు ఇవే అంటూ ఆయనపై ఉన్న కేసులు, అభియోగాల జాబితాను విడుదల చేసింది. పలు కేసులు, అభియోగాలు మోపబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ట్రంప్ అని ఎద్దేవా చేసింది.అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్ ట్రంప్‌కు ఎక్స్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ‘అధిక వయసు ఉన్న వ్యక్తి నుంచి మరో ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగా బర్త్ డే శుభాకాంక్షలు అందుకోండి. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎన్నికలతో సంబంధం లేదు. ఎన్నికలు అధ్యక్షుడి ఎంపిక చేసేవి మాత్రమే’’ అని బైడెన్ అన్నారు. ఇక.. ట్రంప్ అరోపించినట్లు గానే జో బైడెన్ అధిక వయసు, మతిమరుపుతో ఇబ్బంది పడినట్లు పలు సందర్భాల్లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ట్రంప్ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇద్దరు అధిక వయసు నేతలు అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటం అమెరికాలో తొలిసారి కావటం గమనార్హం. -
Donald Trump: అమెరికన్లకు బిగ్ ఆఫర్ ఇచ్చిన ట్రంప్!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న టార్గెట్‌తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రజలకు పెద్ద పెద్ద వరాలే ఇస్తున్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏకంగా ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ హామీపై చర్చ నడుస్తోంది.అయితే, వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్లో ట్రంప్.. అమెరికా పార్లమెంట్ సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో టారిఫ్‌ల పాలసీని అమలు చేస్తానని ప్రకటించారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో తెలిపారు. Trump has floated the concept of eliminating income tax and replacing it with tariffs.Wouldn't that require drastically reducing the size of the US Government?Dammit, I'm in. How about you? pic.twitter.com/YHSw3arMV5— TaraBull (@TaraBull808) June 13, 2024 అయితే, ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్‌లను తీసుకురావడమంటే దిగువ, మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం -
అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న వరుస ప్రైమారీల్లో గెలుస్తూ దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రేక్ పడింది. తాజాగా వాషింగ్టన్ డీసీ ప్రైమారీలో నిక్కీ హేలీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధక్ష్య అభ్యర్థిత్వం పోటీ పడుతున్న నిక్కీ హేలీకి ఇదే మొదటి ప్రైమరీ విజయం కావటం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉన్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ 33.2 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. వాషింగ్టన్ డీసీలో గత 2020 ఎన్నికల సమయంలో డొమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ 92 శాతం ఓట్లు సాధించారు. అయితే ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి ఎక్కువ శాతం మెజర్టీ రాదనే వాదనలు ఉన్నాయి. దానికి భిన్నంగా నిక్కీ హేలీ 62 శాతం ఓట్లు సాధించారు. ‘వాషింగ్టన్‌లోని రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ .. అతని గందరగోళాన్ని తిరస్కరిచంటంలో ఆశ్చర్యం లేదు’ అని నిక్కీ హేలీ తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాల ప్రైమరీల్లో నిక్కీ హేలీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ మంగళవారం (మార్చి 5న) ముందు నిక్కీ హేలీ.. మొదటి ప్రైమరీలో విజయం సాధించటం కొంత ఊరటనిచ్చింది. సూపర్ మంగళవారం రోజు సుమారు 12 రాష్ట్రాల్లోని అధ్యక్ష పైమరీలు, కాకస్‌లో ప్రజలు ఓటు వేయనున్నారు. అదేవిధంగా యూఎస్ కాంగ్రెస్‌లోని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్‌కు ఓట్లు వేయనున్నారు. -
మా ఇద్దరిలో ఒకరికి అధ్యక్షపీఠం: నిక్కీ హేలీ!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని మొట్టమొదటిసారిగా మహిళ అధిరోహించనున్నారని ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ జోస్యం చెప్పారు. ఆ అవకాశం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు లేదా తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కనుందని ఆమె చెప్పారు. తాజాగా ఫాక్స్ న్యూస్‌తో నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ ఎన్నికల బరిలో కొనసాగుతానన్నారు. 24న జరిగే సౌత్ కరోలినా ప్రైమరీపైనే తన దృష్టంతా ఉందని నిక్కీ హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అధ్యక్ష బరిలో నిలిచిన ఆ పార్టీకి చెందిన ఏకైక అభ్యర్థి నిక్కీ హేలీ కావడం గమనార్హం. -
Joe Biden: డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికలు.. బైడెన్ భారీ విజయం
వాషింగ్టన్: ఈ ఏడాదిలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీలో అధ్యక్షుడు జో బైడెన్ ఘన విజయం సాధించారు. బెడైన్‌కు ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ఆయనే గెలుపొందారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి శనివారం జరిగిన సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీలో జో బైడెన్ విజయం సాధించారు. దాదాపు 55 మంది డెలిగేట్లు ఈ పోటీలో ఉన్నప్పటికీ, తొలి నుంచి బైడెన్‌దే విజయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే బైడెన్ విజయాన్ని అందకున్నారు. ఈ పోటీలో మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు పోటీ ఇచ్చారు. ఇక, సౌత్ కరోలినా ప్రైమరీలో విజయం సాధించిన సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. Joe Biden wins 96% of the South Carolina vote…….just like Putin, Xi and Rocketman win elections in their countries. Easy to win when it’s fixed. — Steve (@Steve66810226) February 4, 2024 అనంతరం, సౌత్ కరోలినాలో విజయంపై ఆయన స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచారానికి సౌత్ కరోలినా ఓటర్లు కొత్త జోష్ తీసుకొచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓటర్లు మాకు పూర్తి మద్దతు తెలిపారు. ప్రెసిడెన్సీని గెలుచుకునే మార్గంలో మమ్మల్ని నడిపించారు. ఇప్పుడు కూడా సౌత్ కరోలినా ప్రజలు మరోసారి అదే రకమైన తీర్పునిచ్చారు. ట్రంప్‌ను ఓడిపోయేలా చేయడానికి, మమ్మల్ని నడిపించారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. 𝗔𝗠𝗘𝗥𝗜𝗖𝗔 𝗩𝗢𝗧𝗘𝗦 𝗖𝗔𝗠𝗣𝗔𝗜𝗚𝗡 '𝟮𝟰: 𝗧𝗛𝗘 𝗦𝗢𝗨𝗧𝗛 𝗖𝗔𝗥𝗢𝗟𝗜𝗡𝗔 𝗗𝗘𝗠𝗢𝗖𝗥𝗔𝗧𝗜𝗖 𝗣𝗥𝗜𝗠𝗔𝗥𝗬 The votes are still coming in, but Capital Politics projects that Pres. Joe Biden wins the SC Primary, defeating Rep. Dean Phillips and Marianne Williamson. pic.twitter.com/WkzTkz1Vk1 — CAPITAL POLITICS (@capital_pols) February 4, 2024 మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం ఉన్న ప్రతీసారి వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అంతకుముందు, బెడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల సేకరణకు వెళ్లు సమయంలో బైడెన్ మాట్లాడుతూ ఇది కేవలం ప్రచారం కాదని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రచారాన్ని మనం కోల్పోలేమన్నారు. ఏం జరుగుతుందో అమెరికన్లు అర్ధం చేసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. -
పుతిన్ సంపాదన ఇంత తక్కువా?
వ్లాదిమిర్ పుతిన్ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రెబెల్స్ (7,53,000 ఆమెరికన్ డాలర్లు)గా పుతిన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ పది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రెబెల్స్( 606,000 అమెరికన్ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్ యూనియన్ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్ ట్రైలర్ ఉన్నాయి. పుతిన్ మాస్కోలో ఒక అపార్టుమెంట్, సెయింట్ పిరట్స్బర్గ్లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్ కలిగి ఉన్నారు. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్‌లో పుతిన్ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు. -
Russia: రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే
మాస్కో: మైనారిటీ ఉద్యమ నేత ఫెయిల్ అల్సినోవ్‌కు మద్దతుగా రష్యాలో వందల మంది ఆయన మద్దతు దారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాష్కోర్టోసాన్ ప్రాంతంలో అల్సినోవ్ కోసం భారీ సంఖ్యలో మద్దతుదారులు నిరసనకు దిగారు. వీరిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిరసనకారులు వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పోలీసులకు, నిరసనకారులకు వాగ్వాదం, తోపులాట జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్సినోవ్‌కు మద్దతుగా ఇది ఈ వారంలో ఆందోళకారులు చేసిన మూడవ నిరసన కావడం గమనార్హం. విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అల్సినోవ్‌కు ఇటీవలే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బాష్కిర్ మైనారిటీ వర్గానికి అల్సినోవ్ ఒక హీరో. వారి భాష, సంస్కృతి కోసం అల్సినోవ్ తీవ్ర ఉద్యమం చేశాడు. బాష్కిర్ వర్గం వారు పవిత్రంగా భావించే కొండపై మైనింగ్ జరగకుండా 2020లో ఉద్యమం నడిపి విజయవంతమయ్యాడు. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చిలో జరగనుండగా ఈ నిరసనలు జరుగుతుండటం గమనార్హం. In #Ufa, #Bashkortostan republic, #Russia, some 1,000 people joined a #protest rally in support of imprisoned activist Fail Alsynov; police are reportedly detaining protesters. pic.twitter.com/u0rn8HBchD — Alex Kokcharov (@AlexKokcharov) January 19, 2024 ఇదీచదవండి.. గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటన
-
America Elections: ట్రంప్ వర్సెస్ నిక్కీ.. దుమారం రేపుతున్న ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ బ్యాలెట్లు సమీపిస్తున్న కొద్దీ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న రిపబ్లికన్ క్యాండిడేట్ల మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలోనే అధ్యక్షపదవికి నామినేషన్ ఆశిస్తున్న నిక్కీ హాలేపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్ షేర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు దుమారం రేపుతోంది. ఇది కచ్చితంగా జాతి వివక్షత కిందకే వస్తుందని నిక్కీ దుయ్యబడుతున్నారు. నిక్కీ నిజమైన అమెరికన్ సిటిజన్ కాదని, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమెకు అర్హత లేదని ట్రంప్ షేర్ చేసిన పోస్టు సారాంశం. 1972లో నిక్కీ అమెరికాలో జన్మించే సరికి ఆమె తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం రాలేదని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్న రిపబ్లికన్లు నిక్కీపై ఆయన షేర్ చేసిన పోస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిజానికి నిక్కీ అమెరికాలో పుట్టారన్న ఒకే ఒక్క అర్హతతో ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ఆమె తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, సీఎన్ఎన్ సర్వే ప్రకారం త్వరలో ప్రైమరీ జరగనున్న న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్‌కు, నిక్కీకి మధ్య హోరాహోరీ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇక్కడి రిపబ్లికన్ ఓటర్లలో నిక్కీకి మద్దతు ఒక్కసారిగా పెరిగింది. ట్రంప్‌కు ఇక్కడ 39 శాతం మంది ఓటర్లు మద్దతునిస్తుండగా నిక్కీకి 32 శాతం మంది మద్దతిస్తుండటం గమనార్హం. In @NikkiHaley ’s situation, reports indicate that her parents were not U.S. citizens at the time of her birth in 1972. Based on the Constitution as interpreted by @PaulIngrassia, this disqualifies Haley from presidential or vice-presidential candidacy under the 12th Amendment. pic.twitter.com/6zl2gFizNN — The Gateway Pundit (@gatewaypundit) January 3, 2024 A new racist conspiracy theory just dropped. Trump now claims Nikki Haley is ineligible to be president. pic.twitter.com/Rrgw6T8V7Q — Republicans against Trump (@RpsAgainstTrump) January 9, 2024 ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే -
America Elections: రిపబ్లికన్ అభ్యర్థులకు మంచు టెన్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మరికొద్ది గంటల్లో ప్రారంభమవనుంది. ఈ నెల 15వ తేదీన అయోవాలో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీ బ్యాలెట్(కోకస్) జరగనుంది. అయితే ఈ ప్రైమరీలలో ఎన్ని ఓట్లు పోలవుతాయన్నదానిపై పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయోవాలో జీరో డిగ్రీ ఫారెన్‌హీట్ కిందకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఇక్కడ భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందో అని అభ్యర్థులు టెన్షన్ పడిపోతున్నారు. తక్కువ ఓటింగ్ శాతం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎవరికి వారు ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్ జరిగే ఈ నెల 15వ తేదీన రాత్రి రికార్డుస్థాయి చలి ఉంటుందని జాతీయ వాతావరణ సర్వీసుల డేటా చెబుతోంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు వల్ల రోడ్లు బ్లాక్ అయి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అగ్ర నేతలు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తమ ప్రచార ఈవెంట్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే -
US Elections: ట్రంప్‌పై బ్యాన్.. రివ్యూకు సుప్రీంకోర్టు ఓకే
వాషింగ్టన్: ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలో తేలనుంది. ఇప్పటికే కొలరాడో సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్లో పాల్గొనకుండా ట్రంప్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. కొలరాడో స్టేట్ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు దేశ సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఈ విచారణను త్వరిగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి రాజ్యాంగపరంగా తిరుగుబాటు కిందకు వస్తుందా రాదా అనేదానిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ట్రంప్ చేసిన తిరుగుబాటు రాజ్యాంగ తిరుగుబాటు కిందకు వస్తుందని భావించిన కొలరాడో స్టేట్ సుప్రీం కోర్టు ఆయనను ఆ స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. అయితే ఈ బ్యాన్పై దేశ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్‌కు అనుకూలంగా వస్తే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ట్రంప్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీలు ఈ నెల 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో ట్రంప్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మిగతా అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదీచదవండి..ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు చలి -
USA: అమెరికా మాజీ అధ్యక్షుడు మైక్ పెన్స్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిపబ్లికన్ నేత మైక్ పెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్ కొయిలేషన్ వార్షిక సదస్సులో మైక్ పెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ..‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. 🚨🚨🚨Mike Pence DROPS OUT of 2024 Presidential Race Watch: pic.twitter.com/xRTucsmFqV — Benny Johnson (@bennyjohnson) October 28, 2023 ఇక, పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో పెన్స్ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదితరులు పోటీపడుతున్నారు. -
అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. He is a very promising candidate https://t.co/bEQU8L21nd — Elon Musk (@elonmusk) August 17, 2023 ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు. I’m breaking an unspoken rule in the GOP, but I call it like I see it: it’s deeply concerning that @elonmusk met with China’s foreign minister yesterday to oppose decoupling and referred to the U.S. & Communist China as “conjoined twins.” Tesla’s VP in China reposted that… pic.twitter.com/UD26pweilX — Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 31, 2023 ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో -
బైడెన్ ఐదేళ్లలో చనిపోతారు.. రిప్లబికన్ అధ్యక్ష అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. అయితే ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెడైన్‌కు ఓటేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారని, ఎందుకంటే ఆయన ఐదేళ్లకు మించి బతకరని హేలీ అన్నారు. జో బైడెన్ ప్రస్తుత వయసు 80 ఏళ్లు దాటింది. హేలీ వయసు 51 ఏళ్లే. అందుకే ఎన్నికల ప్రచారంలో వయసునే ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకెళ్లాలని హేలీ భావిస్తున్నారు. వృద్ధులను ఎన్నుకునే ముందు ఆలోచించాలని అమెరికన్లను కోరుతున్నారు. సరిగ్గా ఆరోగ్యంగా లేని వారు అగ్రరాజ్యాన్ని ముందుకెలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. 75 దాటి ఎన్నికల్లో పోటీ చేసేవారికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే కొత్త డిమాండ్‌ను ఆమె తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన బైడెన్.. మరో ఐదేళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటారని తనకు నమ్మకం లేదని హేలీ అన్నారు. మరోవైపు తాను మరోసారి డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఉంటున్నట్లు బైడెన్ మంగళవారమే అధికారికంగా ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా బైడెన్ కోటు ధరించి జాగింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. తీరిక లేకుండా ఆయన చేస్తున్న వివిధ పర్యటనల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. దీంతో బైడెన్ తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లను ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. చదవండి: గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి -
ట్రంప్‌కు 34 మిలియన్ డాలర్ల విరాళాలు
న్యూయార్క్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు విరాళంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లను సేకరించినట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు. విరాళాలను ఎలా సంపాదించిందీ వివరిస్తూ ఆయన ఫెడరల్ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మొత్తం 34 మిలియన్ డాలర్లలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 18.8 మిలియన్ డాలర్లు అందాయి. హష్ మనీ కేసులో ట్రంప్‌పై నేరారోపణల ప్రక్రియ మొదలుకొని కోర్టు దోషిగా ప్రకటించే వరకు రెండు వారాల వ్యవధిలోనే 15.4 మిలియన్ డాలర్లు విరాళంగా అందినట్లు మద్దతుదారులు తెలిపారని పొలిటికో పేర్కొంది. -
ట్రంప్‌కు పరీక్షా సమయం
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది కష్టకాలం. అధ్యక్ష ఎన్నికలో తన గెలుపును తన్నుకుపోయారంటూ వాషింగ్టన్‌లోని కాపిటల్ హిల్ భవనంపైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకుడయ్యారన్న ఆరోపణలపై అభియోగాలు నమోదు కావొచ్చని అందరూ అనుకుంటున్న సమయంలో వేరే కేసు తలకు చుట్టుకుని ఆయన ఊపిరాడని స్థితిలో పడ్డారు. తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ భారీ యెత్తున సొమ్ము ముట్టజెప్పారన్న ఆరోపణకు ఆధారాలున్నాయని మన్హటన్ గ్రాండ్ జ్యూరీ భావించటం అసాధారణ నిర్ణయం. దీని పర్యవసానంగా ట్రంప్‌ను సంకెళ్లు వేసి సాధారణ నేరస్థుడి మాదిరిగా తీసుకెళ్లి ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. అయితే ఆ తర్వాత వెంటనే బెయిల్ రావటం పెద్ద కష్టం కాదు. ఈ కేసులో వాస్తవంగా విచారణ యోగ్యమైన నేరారోపణలేమిటన్నది ఇంకా వెల్లడి కావలసివుంది. అర్ధ శతాబ్దంపాటు ట్రంప్ ఓ వెలుగు వెలిగారు. గుట్టు చప్పుడుకాకుండా తప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవటంలో, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటంలో, సమ ర్థుడైన వ్యాపారవేత్తగా వెలిగిపోవటంలో, రాజకీయాల్లో అడ్డగోలుగా మాట్లాడుతూ జనాన్ని ఆకట్టు కుని అధ్యక్ష పదవికి ఎగబాకటంలో ట్రంప్కెవరూ సాటిరారు. అధ్యక్ష పదవిలో ఉంటూ కూడా తన బాణీ ఆవగింజంతైనా మార్చకుండా అందర్నీ హడలెత్తించిన మొనగాడు ట్రంప్. అన్ని దేశాల ప్రజానీకంలో ఉన్నట్టే అమెరికాలో కూడా నైతికవర్తన విషయంలో చాలా పట్టింపులుంటాయి. ముఖ్యంగా తమ పాలకుల నుంచి దాన్ని చాలా ఆశిస్తారు. కానీ ట్రంప్ చరిత్ర ఆద్యంతం అందుకు విరుద్ధం. నిజానికి ఒక నటీమణిని లోబర్చుకోవటానికి తాను చేసిన ప్రయత్నా లను ఆయన ఒక టీవీ షోలో గొప్పగా చెప్పుకున్నారు కూడా. 2006లో ఒక గోల్ఫ్ టోర్నమెంట్ కోసం వచ్చి ట్రంప్ తనతో గడిపారని స్టార్మీ డేనియల్స్ 2016లో అమెరికన్ మీడియా ఇంక్లైన్స్(ఏఎంఐ) అనే సంస్థకు చెప్పారు. అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీపడటం ఖాయమని తేలాక అనేక మంది మహిళలు బయటికొచ్చి ఆయన గతంలో తమను లైంగికంగా ఎలా వేధించిందీ వెల్లడించటం మొదలెట్టారు. అలాంటి మహిళలు ఆ కథనాలు కేవలం తమకు మాత్రమే ఇచ్చేలా అప్పట్లో ఏఎంఐ ఒప్పందాలు కుదుర్చుకుని వారికి డబ్బు ముట్టజెప్పింది. ఆ తర్వాత వాటిని బుట్టదాఖలా చేసింది. ఈ సంస్థ ట్రంప్ మాజీ అటార్నీ మైఖేల్ డి. కోహెన్ చెప్పుచేతల్లో ఉండేది. స్టార్మీ డేనియల్స్ వేరే మీడియా సంస్థకు అంతక్రితమే ఇంటర్వ్యూ ఇచ్చినా అది ప్రచురించకుండా కోహెన్ బెదిరించ గలిగారు. ఆ విషయంలో మరింత ముందుకు పోకుండా అప్పట్లో రహస్య ఒప్పందం కుదుర్చుకుని డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు కోహెన్ అందించారు. అది అనైతిక సంబంధాన్ని కప్పెట్టడానికి కాదనీ, తప్పుడు ఆరోపణలు చేసి తన పరువు తీయకుండా ఉండటం కోసమేననీ ట్రంప్ 2018లో ఒకసారి చెప్పారు. ఇక్కడ ట్రంప్‌కు ఆమెతో అనైతిక సంబంధం ఉందా లేదా అన్నది కుటుంబపరంగా ఏమైనా కావొచ్చుగానీ... చట్టపరంగా పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆ డబ్బును ఏ ఖాతాలో చూపారో, దానికి అనుసరించిన విధానాలేమిటో విచారణ సందర్భంగా బయటికొస్తాయి. తనకు అటార్నీగా వ్యవహరిస్తున్నందుకు కోహెన్‌కు చెల్లించిన ఫీజుగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం చేసిన ఖర్చుగా ట్రంప్ చూపారు. ఈ డబ్బు స్టార్మీకి చెల్లించటం కోసం కోహెన్ ఎసెన్షియల్ కన్సల్టెంట్స్ పేరిట ఒక దొంగ కంపెనీ సృష్టించారు. ఆ తర్వాత ఫీజు రూపంలో ట్రంప్ నుంచి స్వీకరించారు. స్వయానా కోహెనే దీన్ని ఒప్పుకున్నారు. ఇది అమలులో ఉన్న ఆర్థిక చట్టాలను ఉల్లంఘించటం. ఆ విధంగా ఆర్థిక నేరం. అయితే కోహెన్ ఆ మొత్తాన్ని ఏం చేశారో తనకు తెలియదనీ, తన న్యాయవాదిగా ఆయన చెప్పిందల్లా చేశాను తప్ప అందులోని తప్పొప్పులతో సంబంధం లేదనీ ట్రంప్ అనొచ్చు. అసలు ఇదంత పెద్ద నేరమేమీ కాదని వాదిస్తున్నవారు లేకపోలేదు. అది నిజం కావొచ్చు కూడా. ఆర్థిక నేరాన్నీ, అనైతికతనూ కలగాపులగం చేసి నిర్మించే కేసు ధర్మాసనం ముందు వీగిపోయినా పోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ అమెరికా చరిత్రలో ఎప్పుడూ న్యాయ స్థానాల ముందుకురాని ఈ మాదిరి కేసు అంతిమంగా ట్రంప్‌పై సానుభూతిని పెంచినాపెంచొచ్చనీ, పర్యవసానంగా కాపిటల్ హిల్ భవనంపై దాడి, విధ్వంసం, కుట్ర, రహస్యపత్రాలు దగ్గరుంచుకోవటం వంటి బలమైన కేసుల విషయంలో జనంలో నిర్లిప్తత ఏర్పడే ప్రమాదం ఉన్నదనీ వారంటున్నారు. తాజా కేసు ట్రంప్‌కు రాజకీయంగా నష్టమో లాభమో వెంటనే చెప్పటం అంత సులభం కాదు. అభియోగాల నిర్ధారణ తర్వాత రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడే నేతలతో సహా అందరూ ఏకమయ్యారు. అలా చూస్తే ట్రంప్‌కు ఈ పరిణామం మేలు చేసేదే. నైతికతను దిగజార్చుకుని, దాన్ని కప్పిపుచ్చడానికి ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాధ్యక్షుడైన వ్యక్తివల్ల అమెరికన్ సమాజానికీ, పాలనా వ్యవస్థకూ నష్టం కలుగుతుందని ప్రాసిక్యూటర్లు వాదిస్తారు. దాన్ని ఏ మేరకు ధర్మాసనం అంగీకరిస్తుందో చూడాలి. ఒకవేళ శిక్షించినా 1974లో వాటర్‌గేట్ కుంభకోణం దోషి నిక్సన్‌కు ఆయన వారసుడిగా వచ్చిన గెరాల్డ్ ఫోర్డ్ క్షమాభిక్ష పెట్టారు. రిపబ్లికన్ల ఏలుబడి వస్తే ట్రంప్ విషయంలో కూడా అదే జరగొచ్చు. ఏదేమైనా నాలుగేళ్లు దేశాధ్యక్షుడిగా ఉండి, మరోసారి అందుకోసం పోటీపడుతున్న నాయకుడిని శిక్షించడానికి అమెరికన్ న్యాయవ్యవస్థ ఏ మేరకు సిద్ధపడుతుందన్నది ఈ కేసుతో తేలిపోతుంది. -
ట్రంప్‌కు ఊహించని షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్..
అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్ పారీ్టలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పారీ్టలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచి్చనవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. రాన్ డెసాంటిస్ ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్ నెగ్గారు. 44 ఏళ్ల వయసున్న రాన్ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. రాన్ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్‌్కలు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ. ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచి్చంది. పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. మైక్ పాంపియో డొనాల్డ్ ట్రంప్ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. ‘‘చరిత్ర మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది’’ అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు. ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది. మైక్ పెన్స్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్ పెన్స్ ఈసారి అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్ నిరాకరించారు. అప్పట్నుంచి పెన్స్‌పై గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనని ఒక పిరికివాడుగా ముద్ర వేస్తూ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌కి మదుస్వభావిగా పార్టీలో మంచిపేరుంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రతినిధుల సభకు ఎన్నికైన పెన్స్ 2013 వరకు కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు. కరడు గట్టిన సంప్రదాయవాదిగా ముద్రపడిన పెన్స్ 2016లో ట్రంప్ అభ్యరి్థత్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి సై అంటున్నారు. రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ? ట్రంప్ అధ్యక్ష అభ్యరి్థగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యరి్థగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్ వేవ్ వస్తుందని అత్యధికులు ఆశించారు. అధ్యక్షుడు జో బైడెన్ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడం, కేపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలకు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చదవండి: ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం.. -
నేను రెడీ.. అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్
వాషింగ్టన్: అమెరికా వ్యాపార దిగ్గజం, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు బుధవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. వైట్ హౌస్ బిడ్ కోసం 76 ఏళ్ల వయసున్న ట్రంప్ పత్రాలను సైతం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి ప్రధాన అభ్యర్థిగా ఆయన నిలిచినట్లయ్యింది. అమెరికా పునరాగమనం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అంటూ ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి టెలివిజన్ స్పీచ్ ద్వారా ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి.. ఈ రాత్రి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రకటిస్తున్నా అని తెలిపారాయన. ఆపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నా’’ అంటూ పోస్ట్ చేశారు. BREAKING: President Donald J. Trump, the 45th President of the United States, announces his candidacy for re-election as president in 2024. pic.twitter.com/R7zBQmhLtk — RSBN 🇺🇸 (@RSBNetwork) November 16, 2022 బిజినెస్ టైకూన్, రియాలిటీ టీవీ స్టార్ అయిన డొనాల్డ్ ట్రంప్.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అయితే 2020 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఆయనకు ఫాలోయింగ్ మాత్రం ఈనాటికీ తగ్గలేదు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఫర్ ప్రెసిడెంట్ 2024 పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారమే ఆయన US ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద సమర్పించినట్లు తెలుస్తోంది. -
అరుణారుణ ఆశాకిరణం
వర్గాలుగా చీలిన ఓటర్లు... హోరాహోరీ పోరు... అతివాద ఛాందస దేశాధ్యక్షుడు బోల్సనారో ఒక వైపు, వామపక్ష ప్రజాస్వామ్యవాది లూలా మరోవైపు... 34 ఏళ్ళ బ్రెజిల్ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా దేశాధ్యక్ష ఎన్నికలు. అలాంటి సందర్భంలో ఆదివారం లూలా దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశానికి అధ్యక్షుడిగా గెలుపొందడం చరిత్రాత్మకం. 580 రోజులు జైలులో ఉండి బయటపడి, రాజకీయ విరోధుల అంచనాల్ని అధిగమించి, బలమైన ప్రత్యర్థి బోల్సనారోను ఓడించడం వామపక్ష వర్కర్స్ పార్టీకి లూలా సృష్టించిన అపూర్వ సందర్భం. 2020 నుంచి పొరు గున బొలీవియా, చిలీ, పెరూ, కొలంబియా, హోండురస్లలో ఎగిరిన ఎర్ర జెండాకు బ్రెజిల్ గెలుపు మరో ఊపు. అరుణారుణమవుతున్న లాటిన్ అమెరికాకు ఇది ప్రతీక. స్థానికవాద సెంటిమెంట్లను పెంచిపోషించే ఛాందస మితవాద ప్రభుత్వాలు ఐరోపాలో ఎన్నికవుతున్న వేళ మరో ఆశాకిరణం. లూలాకు దేశాధ్యక్ష పదవి కొత్త కాదు. ఆయన పగ్గాలు చేపట్టడం బ్రెజిల్ చరిత్రలో ఇది మూడోసారి. 2003 నుంచి 2010 దాకా నాలుగేసి ఏళ్ళ వంతున రెండు తడవలు ఆయన ఆ పదవిలో ఉన్నారు. సంక్షేమ చర్యలు చేపడుతూనే, దేశంలో ఆర్థికాభివృద్ధి, సామాజిక చేర్పు సాధించిన ప్రజాదరణ గల నేతగా నిలిచారు. మళ్ళీ పుష్కరకాలానికి పీఠమెక్కారు. మధ్యలో పదవి చేపట్టిన ఆయన శిష్యుడు 2016లో అభిశంసనకు గురికావడం, కాంట్రాక్టుల్లో అవినీతిపై 2017లో లూలా జైలు పాలవడం, 2018 ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కావడం, వీటన్నిటితో దేశంలో మితవాద పార్టీల విజృంభణ అంతా ఓ పెద్ద కథ. తాజాగా అక్టోబర్ 2 నాటి తొలి విడత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాని ఆయన ఆదివారం తుది విడతలో పదవిని స్థిరం చేసుకున్నారు. లూలాకు 50.9 శాతం, ప్రత్యర్థి బోల్సనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్ బయటపడ్డాక ఇంత స్వల్ప తేడాతో ఎన్నికల గెలుపు నమోదైంది ఇప్పుడే! తాజా మాజీ అధ్యక్షుడు బోల్సనారో, ఆయన మద్దతుదారులు సాగించిన నాటకీయ, విద్వేష ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినట్టే బోల్సనారో బృందం మీడియానూ, ఎన్నికల ప్రక్రియనూ దుమ్మెత్తిపోసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఔదలదాల్చేది లేదు పొమ్మని బెదిరించింది. లూలా మాత్రం బోల్సనారో ప్రాచుర్యాన్ని అధిగమించేందుకు తన మాజీ ప్రత్యర్థి జెరాల్డో అల్క్మిన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టి, వామపక్షాల నుంచి మధ్యేవాద మిత వాదుల దాకా పది పార్టీలతో జాగ్రత్తగా కూటమి కట్టారు. గెలుపు తీరాలకు చేరారు. బోల్సనారో హయాంలో 7 లక్షల పైగా మరణాలతో కోవిడ్ కట్టడిలో వైఫల్యాన్నీ, అమెజాన్ అడవుల నరికి వేతనూ, కునారిల్లిన ఆర్థికవ్యవస్థనూ బ్రెజిల్ చవిచూసింది. ఒకప్పుడు 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చిన లూలా లాంటి సమర్థుడికి సైతం దేశాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం సవాలే! కలసి పోటీ చేసిన పార్టీల కూటమిని రేపు అధికారంలోనూ లూలా ఎంత కలసికట్టుగా ఉంచగలుగుతారనేది కీలకం. అది ఆయన ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. పర్యావరణం, ప్రజారోగ్యం, విద్య, విదేశాంగ విధానం, మానవహక్కుల లాంటి అంశాల్లో పాత పాలకుడు చేసిన నష్టాన్ని పూడ్చడానికి అనుసరించే విధానాల్లో భాగస్వాములతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఆకలి, దారిద్య్రాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, పారిశ్రామిక రంగాన్ని పరిపుష్ఠం చేయడం తమ ప్రభుత్వ తక్షణ లక్ష్యాలని ఆయనే చెప్పారు. కానీ, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగం, అప్పులు, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయి. ఖజానా ఖాళీ అయింది. ఉత్పత్తి స్తబ్ధమైంది. అనేక రంగాల్లో అంతర్జాతీయ పోటీలో నిలిచే పరిస్థితి లేదు. ఇవి చాలదన్నట్టు రాజకీయంగానూ తిప్పలున్నాయి. సెనేట్‌లో అధిక స్థానాలు బోల్సనారోకు చెందిన లిబరల్ పార్టీకే ఉన్నాయి. దిగువ సభలోనూ ఆ పార్టీయే అతి పెద్ద పార్టీ. ఇక, 27 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో, అందులోనూ రియో డి జనీరో సహా కీలకమైన, మూడు అతి పెద్ద రాష్ట్రాల్లో ప్రత్యర్థి బోల్సనారో సమర్థకులే వచ్చే ఏటి నుంచి గవర్నర్లు. అలాగే, 1964 – 1985 మధ్య బ్రెజిల్‌ను ఏలిన సైనిక వ్యవస్థ, అమెజాన్ వర్షారణ్య దోపిడీ వ్యవస్థల శక్తిమంతమైన వ్యాపార ప్రయోజనాల్ని ఢీకొనాల్సి వస్తుంది. ఇన్నింటినీ అధిగమిస్తూ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, జనరంజకంగా పాలించడం ఎవరికైనా కత్తి మీద సామే. సహజ వనరులపైనా, చమురుతో ముడిపడ్డ ఆర్థిక విజృంభణ పైనా అతిగా ఆధారపడ్డా కష్టమేనని పొరుగున ఉన్న వెనిజులా పాఠం చెబుతోంది. విజయోత్సవ ప్రసంగాన్ని ఆరంభిస్తూ, లూలా అన్న మాట ఒకటే... ‘వారు నన్ను సజీవ సమాధి చేయాలనుకున్నారు. కానీ, ఇదుగో ఇప్పుడు మీ ముందు సజీవంగా నిలిచాను.’ క్లిష్టసమయంలో పదవి చేపట్టిన ఈ 77 ఏళ్ళ పోరాటయోధుడు ఇక ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షల్ని సజీవంగా నిలపాలి. ఒబామా శైలిలో ‘నాకు ఓటేసిన వారికే కాదు, మొత్తం 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ సుపరిపాలన అందిస్తాను’ అన్న మాటల్ని నిజం చేసి, విభజన రాజకీయాలకు విరుద్ధంగా దేశాన్ని ఒక్కటి చేయాలి. మునుపటిలా ప్రభుత్వ సంపదను ప్రజలకు పునఃపంపిణీ చేసే ప్రజాకర్షక సంక్షేమ విధానాలకూ, వర్తమాన ఆచరణాత్మకతకూ మధ్యన ఈ కొత్త ప్రయాణం రాజకీయ పునరుత్థానం పొందిన ఈ కురువృద్ధుడికి అసలు సిసలు అగ్నిపరీక్ష. -
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్..
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈసారి చారిత్రక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి టెక్సాస్‌లో జరిగిన ఓ సమావేశంలో వేల మంది రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికీ 2020లో ఓటమిని మాత్రం ట్రంప్ అంగీకరించలేదు. 2016తో పాటు 2020లోనూ తానే విజయం సాధించానని, గతంలో కంటే మిలియన్ ఓట్లు ఎక్కువ సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్లంతా మరింత పట్టుదలతో ఉండాలని సూచించారు. 2022 జనవరి 6న క్యాపిటల్ హిల్ హింసాత్మక ఘటనకు సంబంధించి హౌస్ సెలక్ట్ కమిటీ ట్రంప్‌కు సమన్లు పంపిన మరునాడే ఆయన ఎన్నికల్లో పోటీపై మాట్లాడటం గమనార్హం. బైడెన్ విజయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు ఆరోజు క్యాపిటల్ భవనంతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తానే గెలిచానని చెప్పుకుంటున్నారు. బెడైన్ మోసానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఫలితాలు వచ్చి మూడేళ్లు గడిచినా ఇంకా తన వాదననే సమర్థించుకుంటున్నారు. చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్.. -
‘నియంతృత్వ శక్తులపైనే పోరాటం’.. బీజేపీ లక్ష్యంగా ఖర్గే విమర్శలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో గాంధీయేతర తొలి అధ్యక్షుడిగా నిలిచారు. పార్టీ ప్రెసిడెంట్‌గా తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఖర్గే.. పార్టీలో అంతర్గతంగా నిర్వహించే ఎన్నికలు పార్టీని బలోపేతం చేస్తాయన్నారు. కార్యకర్తల అంచనాలకు తగ్గట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. ‘ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. శశి థరూర్‌కు నా కృతజ్ఞతలు, అలాగే నా శుభాకాంక్షలు. నాపై పోటీ చేశారు. నన్ను కలిసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. శశి థరూర్‌తో కలిసి పని చేస్తాం. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. సోనియా గాంధీకి నా కృతజ్ఞతలు. ఆమె జీవితం మొత్తం పార్టీకోసమే వెచ్చించారు. ఆమె నాయకత్వంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.’అని పేర్కొన్నారు ఖర్గే. మరోవైపు.. బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. మతాల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామన్నారు. ‘పార్టీలో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఏమీ ఉండదు. అందరం కలిసి పని చేస్తాం. మేమంతా కలిసి కట్టుగా మతతత్వ వేషధారణలో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతాం.’అని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన ఖర్గే.. అక్టోబర్ 26న బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. మల్లికార్జున ఖర్గే ఘన విజయం -
గాంధీ భవన్: పొన్నాల ఫైర్.. సముదాయించిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ.. సోమవారం గాంధీభవన్ వద్ద నాటకీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పోలింగ్ సిబ్బంది తీరుపై సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు లిస్ట్‌లో ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులే అందుకు కారణంగా తేలింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం పీసీసీ ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరికీ మాత్రమే ఓటింగ్ అవకాశం ఉంటుంది. జనగామ నుంచి పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డికి ఓటింగ్ ఐడీ కార్డు ఇచ్చింది ఏఐసీసీ. దీంతో.. పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డి ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చారు. అయితే.. శ్రీనివాసరెడ్డికి ఓటు హక్కు లేదని అడ్డుకున్నారు గాంధీ భవన్ పోలింగ్ సిబ్బంది. దీంతో రగడ మొదలైంది. శ్రీనివాసరెడ్డి స్థానంలో ఆ ఓటు హక్కును కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయించినట్లు గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బంది తెలిపారు. దీంతో పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. శ్రీనివాసరెడ్డికి ఓటు నిరాకరించడం ఒక ఎత్తు అయితే.. కొమ్మూరి ప్రతాప్‌కు ఓటు ఇచ్చి తనను అవమానించారంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు పొన్నాల. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న జానారెడ్డి.. పొన్నాలను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ పంచాయితీపై తేలేవరకు గాంధీ భవన్ వీడనని భీష్మించుకుని అక్కడే ఉండిపోయారు పొన్నాల. -
‘‘థరూర్‌జీ! పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు’’
అక్టోబర్ 19 పెద్ద విశేషమేం కాదు. అక్టోబర్ 17న జరిగేవి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలే కనుక 19న జరిగే కౌంటింగ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ విజయం సాధిస్తుందా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తుందా అనే ఉత్కంఠ ఏమీ ఉండదు. నేనో, థరూరో ఎవరో ఒకరం గెలుస్తాం. మాలో ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లే కానీ, మాలో ఒకరు ఓడిపోయి, ఒకరు గెలిచినట్లు కాదు. ఈ నిజాన్ని అంగీకరించడానికి శశి థరూర్ ఎందుకు సిద్ధంగా లేరో మరి?! కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా కదా ఆయన ఈ ఎన్నికల్ని మనసా వాచా కర్మణా చూడాలి! థరూర్ గానీ, నేను గానీ ఇప్పుడు ఆలోచించవలసింది హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; తర్వాత జరిగే పది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; ఆ తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి. ఏడాదిలో ఇన్ని ఎన్నికల్ని పెట్టుకుని, ఏడాదికోసారి జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలే తన సర్వస్వంగా థరూర్ భావించడం ఏమిటి?! ‘‘ఈ పోటీ న్యాయంగా జరగడం లేదు. అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది’’ అని ఆయన అంటున్నారు! ‘‘థరూర్‌జీ! మీరు అనుకుంటున్నట్లుగా పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు..’’ అన్నాను.. రెండు రోజుల క్రితం ఫోన్ చేసి. నిజానికి ఆ మాట చెప్పడానికి నేను ఆయనకు ఫోన్ చేయలేదు. సోనియాజీ పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్‌పర్సన్‌గా థరూర్‌ని ఎంపిక చేశారని తెలిసి చేశాను. చేసి, ‘‘కంగ్రాట్స్ థరూర్‌జీ..’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ ఖర్గేజీ! మరి నేను కూడా ఇప్పుడే మీకు కంగ్రాట్స్ చెప్పేయమంటారా, అక్టోబర్ 19 వరకు ఆగమంటారా?’’ అని నవ్వుతూ అడిగారు థరూర్. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. సోనియాజీ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆల్రెడీ నేను గెలిచేసినట్లేనని!! ‘‘అప్పుడు కూడా నేనే మీకు కంగ్రాట్స్ చెబుతాను థరూర్‌జీ. ‘మీ’ ప్రయత్నం వల్లనే కదా, పార్టీకి అసలంటూ ఎన్నికలు జరుగుతున్నాయి..’’ అన్నాను. ‘మీ’ అనడంలో నా ఉద్దేశం ‘జి–23’ అని. పార్టీలో ఎన్నికలకు ఒత్తిడి తెస్తూ రెండేళ్ల క్రితం సోనియాజీకి లేఖ రాసిన గ్రూప్ అది. జి–23 అనే మాటకు పెద్దగా నవ్వారు థరూర్. ‘‘ఖర్గేజీ! మీకొకటి తెలుసా? ఆ గ్రూపులో ఉన్నవారెవరూ ఇప్పుడు నాతో లేరు. మీ వైపు వచ్చేశారు. ఆ గ్రూపులో నేను ఉన్నందుకు కూడా ఇప్పుడు నాతో ఎవ్వరూ లేరు. వాళ్లూ మీ వైపే ఉన్నారు. నేనొస్తున్నానని తెలిసి దేశవ్యాప్తంగా పీసీసీ ప్రెసిడెంట్లు పొలాల్లోకి, పక్క ఊళ్లలోకి, లేని పోని సంతాపాల పనుల్లోకి పరుగులు తీస్తున్నారు! మొన్న తెలంగాణలో చూశారు కదా! అక్కడి ప్రెసిడెంట్ మీకు ఒకలా, నాకు ఒకలా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు షాక్ ట్రీట్మెంట్. మీకు స్వీట్ ట్రీట్మెంట్..’’ అన్నారు నవ్వు ఆపకుండా థరూర్. ‘‘థరూర్‌జీ! మీపై నిజంగా వ్యతిరేకత ఉంటే సోనియాజీ మీకు పార్లమెంటరీ ప్యానెల్ పోస్ట్ ఇచ్చేవారా?! సోనియాజీనే స్వయంగా మీకు పోస్ట్ ఇచ్చాక కూడా పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఉంటారా?!’’ అన్నాను. ఆ మాటకు మళ్లీ పెద్దగా నవ్వి.. ‘‘ఖర్గేజీ.. వ్యతిరేకత లేకపోవడం మద్దతు అవుతుందా, మద్దతు ఇవ్వక పోవడం వ్యతిరేకత అవుతుంది కానీ..’’ అన్నారు థరూర్. రేపే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక. ‘‘ఖర్గేజీ వస్తే మారేదేమీ ఉండదు. నేనొస్తే నాతో పాటు మార్పును తెస్తాను’’ అని థరూర్ చెబుతున్నారు. చూడాలి.. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిధులు మార్పు కోసం ఓటేస్తారో, ఏదీ మారకుండా ఉండటం కోసమే ఓటేస్తారో -మాధవ్ శింగరాజు -
‘మహా’ పాలిటిక్స్.. బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులుగా మారటం, మిత్రులు ప్రత్యర్థులుగా మారటం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. మరోమారు.. అలాంటి సంఘటనే ఎదురైంది. విపక్ష పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్.. బీజేపీతో చేతులు కలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఈ మేరకు సోమవారం బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌తో సమావేశమయ్యారు శరద్ పవార్. ఆశిష్ షెలార్- శరద్ పవార్ గ్రూప్ కలిసి అభ్యర్థిని బరిలో దింపాయి. అంతకు ముందు.. ఎంసీఏ అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు శరద్ పవార్ గ్రూప్ మద్దతు తెలిపింది. కానీ, ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో కలిసి ఎంసీఏ ఎన్నికల బరిలో నిలుస్తోంది ఎన్సీపీ. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా ఈ కూటమి ఎమ్మెల్యే జితెంద్ర అహ్వాద్ బరిలో నిలుస్తున్నారు. పవార్-షెలార్ గ్రూప్ నుంచి ఉద్ధవ్ థాక్రే పీఏ మిలింద్ నర్వేకర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు.. షిండే గ్రూప్ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహాంగ్ సర్నాయ్ ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 ఛైర్మన్ పదవి బరిలో నిలిచారు. ఈ మేరకు ఆశిష్ ,షెలార్‌తో శరద్ పవార్ కూటమి ఏర్పాటు చేసినట్లు ఓ లేఖ విడుదల చేశారు. లేఖపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మిలింద్ నర్వేకర్ ట్వీట్ చేశారు. అందులో ఆశిష్ షెలార్ ఫోటో కనిపిస్తోంది. అక్టోబర్ 20న ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పవార్-షెలార్ సంయుక్త గ్రూప్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితుడు అమోల్ కాలే ఉపాధ్యక్షుడి బరిలో నిలవనున్నారు. మరోవైపు.. 2019-22 వరకు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన పవార్ గ్రూప్ అభ్యర్థి అజింక్య నాయక్ సెక్రెటరీగా కొనసాగే అవకాశం ఉంది. దీపక్ పాటిల్ సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు -
సంకట స్థితిలో కాంగ్రెస్ నేతలు?
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. సోనియా గాంధీ కుటుంబం స్పష్టంగా ఒక మాట చెప్పింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరి పక్షాన నిలవబోమని. అలాగే చీఫ్ ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్ట్రీ సైతం పార్టీ తరపున అధికారిక అభ్యర్థి లేరనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు చాలావా.. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండడం లేదని చెప్పడానికి అని థరూర్ ఆదివారం వ్యాఖ్యానించారు. అయితే థరూర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. సోనియా కుటుంబం ఈ అధ్యక్ష ఎన్నికల్లో తటస్థంగా ఉంటుండడంతో.. ఎవరికి తమ మద్దతు ఇవ్వాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు నేతలు. ప్రత్యేకించి సీనియర్లపై ఒత్తిడి నెలకొందని పార్టీ శ్రేణులు పైకి చెప్పేస్తున్నాయి. మరోవైపు సీనియర్లు తనకెవరూ మద్దతు ఇవ్వబోరంటూ గతంలో శశిథరూర్ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కీలక నేతలు మాత్రం అధిష్టానం ఆదేశానుసారం లేదంటే అధిష్టానాన్ని అనుసరించాలని చూశాయి. ఇప్పుడు తటస్థ స్థితితో డైలామాలో పడిపోయారంతా. ఇక అధ్యక్ష బరిలో దిగిన మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే.. ఈ ఎన్నికలు పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే.. నిజమైన పోటీ మాత్రం బీజేపీతోనేనని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏపార్టీ నిర్మించిన ప్రజాస్వామ్యిక వ్యవస్థలను బలహీనం చేసుకుంటూ.. కుప్పకూలుస్తూ పోతున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లతో రాజకీయ, ప్రజాస్వామ్యిక, సామాజిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. అందుకే మా నిజమైన పోరాటం వాటితోనే అని ఖర్గే జమ్ములో తెలిపారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. దాదాపు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకున్నారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఉద్దేశం అదే! -
అందుకే హైదరాబాద్ వచ్చా.. నాకు మద్దతివ్వండి: మల్లికార్జున ఖర్గే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన మేలు ప్రతిచోటా కనిపిస్తుందని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ‘గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. ఈ దేశానికి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లను అందించింది కాంగ్రెస్. ఏ దేశానికి వెళ్లినా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఎన్నారైలు కూడా కాంగ్రెస్ హయాంలో విదేశాలకు వెళ్లిన వారే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, నిర్బంధ విద్య వంటి అద్భుత పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్సే. ఈ దేశాన్ని ధాన్యాగారం చేసింది, సాగునీటి సౌకర్యాలు కల్పించింది, మోదీ అమ్ముతున్న ప్రభుత్వరంగ సంస్థలను సృష్టించింది కాంగ్రెస్ పార్టీనే’ అని ఆయన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లిన ఖర్గే... టీపీసీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటేయాలని కోరారు. అనంతరం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ నేతలు రమేశ్ చెన్నితల, గౌరవ్ వల్లభ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, మల్లురవి, షబ్బీర్ అలీతో కలసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి మంచి చేస్తే... మోదీ, అమిత్ షాలు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దేశంలోని ఒక శాతం జనాభా వద్దనే 22 శాతం సంపద పోగుపడిందని, ఉపాధి తగ్గి నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో దేశంలో 7 కోట్ల ఉద్యోగాలు పోయాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందన్నారు. అలాగే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయని, చివరకు పుస్తకాలపైనా జీఎస్టీ వేశారని ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ నిలబడాలని, అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. చాలా పార్టీలొచ్చాయ్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు గా మారాయని, ఏడీఎంకే ఏఐడీఎంకేగా, టీఎంసీ ఏఐటీఎంసీగా మారిందని, కానీ ఏ పార్టీ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించలేదని ఖర్గే గుర్తుచేశారు. వాళ్లకు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు? ఏఐసీసీ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే దేశ ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థికాభి వృద్ధి కోసం పాటుపడతానని ఖర్గే చెప్పా రు. పార్టీ నియమావళిని తు.చ. తప్పకుండా అమలు చేస్తానని, ఉదయ్‌పూర్ తీర్మా నాన్ని సాధ్యమైనంత వరకు అమలు చేస్తా నని హామీ ఇచ్చారు. పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని... పార్టీ నేతలందరితో కలసి పనిచేస్తానని, అందుకే తనకు అన్ని చోట్లా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. తనపై పోటీ చేస్తున్న వారు కూడా తనకు వ్యతిరేకం కాదని, ఇది పార్టీ అంతర్గత ఎన్నిక అని ఖర్గే వివరించారు. తాను తెలంగాణ బిడ్డనని, అందుకే టీపీసీసీ నేతలంతా తనకు మద్దతిస్తున్నా రని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని, వారికి ప్రజాస్వామ్యం గురించి ఏమాత్రం తెలియ దని ఖర్గే మండిపడ్డారు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నడ్డాలలో ఎవరు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికల ద్వారా గెలిచారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఆచరించలేని వారు ఇతరులకు పాఠాలు చెప్పడం సరికాదన్నారు. చదవండి: రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్ -
కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్‌లు నిలిచారు. కేఎన్ త్రిపాఠి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్‌గంజ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్ దక్కింది. దీంతో రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, లేబర్ మినిస్టర్‌గా పని చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్ పోస్ట్‌కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. -
మ్యానిఫెస్టో తెచ్చిన తంటా... వివాదంలో శశి థరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఒక మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఇది ఇప్పుడు ఆయనకు లేనిపోని ఇబ్బందులోకి నెట్టింది. ఈ మేరకు ఆయన తన మ్యానిఫెస్టో బుక్‌లెట్‌లో 'థింక్ టుమారో, థింక్ థరూర్' అనే ట్యాగ్ లైన్‌తో భారతదేశం అంతటా ఉన్న కాంగ్రెస్ యూనిట్లు సూచించే చుక్కల నెట్‌వర్క్‌తో కూడిన మ్యాప్‌ను ఉపయోగించారు. ఐతే ఈ మ్యాప్ భారతదేశ అధికారిక మ్యాప్‌కి భిన్నంగా ఉంటుంది. అందులో జమ్ము కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలు లేని భారత్ మ్యాప్‌గా రూపొందించారు. దీంతో ఈ మ్యానిఫెస్టో కాస్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఇది వికేంద్రికరణ, విభజన అంటూ ఫైర్ అయ్యారు. గత మూడేళ్లలో ఆయన ఇలాంటి వివాదాస్పద వివాదంలో చిక్కుకోవడం ఇది రెండోసారి. డిసెంబర్ 2019లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేసి ఇలానే వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నాయకుడు సంబిత్ వంటి నేతలు విమర్శలు లేవనెత్తడంతో వెంటనే ఆ ట్విట్ని తొలగించారు. I have just submitted my nomination papers as a candidate for the presidential election of @incindia. It is a privilege to serve the only party in India with an open democratic process to choose its leader. Greatly appreciate Soniaji’s guidance&vision.#ThinkTomorrowThinkTharoor pic.twitter.com/4HM4Xq3XIO — Shashi Tharoor (@ShashiTharoor) September 30, 2022 (చదవండి: కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల్లో బిగ్ ట్విట్ చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజస్థాన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో తను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అశోక్ గహ్లోత్ గురువారం సోనిమా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్ ఎమ్మెల్యేల వ్యవహారంపై సోనియాకు క్షమాపణలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ ఉండనున్నట్లు తెలిపారు. ‘కొచ్చిలో నేను రాహుల్ గాంధీని కలిశాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించాను. అతను అంగీకరించలేదు. దీంతో నేను పోటీ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాజకీయ సంక్షోభంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. పార్టీ అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’ అని సోనియాతో భేటీ అనంతరం గహ్లోత్ వ్యాఖ్యానించారు. కాగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు. చదవండి: యస్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా -
యస్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా
సాక్షి, ఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ వీడింది. రేసులో ఎవరు తుది వరకు నిలుస్తారనే అనుమానాల నడుమ.. ద్విముఖ పోటీ ఖరారు అయ్యింది ఇవాళ. అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన.. ఇవాళ(గురువారం) నామినేషన్ ఫామ్‌లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. అవును.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. అందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలివే అని ఆయన చూపించారు. అనంతరం ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి.. కాసేపు చర్చించారు. ఇక మరో సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇదివరకే నామినేషన్ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన రేపు(సెప్టెంబర్ 30న).. ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్.. పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్-దిగ్విజయ్‌సింగ్ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్ ప్రకటించారు. అశోక్ గెహ్లాట్.. అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి.. ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్ సీఎం చేయాలని భావించగా.. సచిన్ పైలట్ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఈ క్రమంలో.. పరిణామాలపై వివరణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ కోరగా.. ఇవాళ ఆయన ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
ఇదేం ట్విస్ట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్టానం చాయిస్‌గా తానే నిలవాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భావించారు. పార్టీ పగ్గాలతో పాటు సీఎంగానూ కొనసాగాలని ఆశపడ్డారు. అయితే ఒక వ్యక్తి.. ఒకే పదవి సవరణ ఆయన దూకుడుకు బ్రేకులు వేయించింది. ఈ క్రమంలో తన వారసుడిని తన ఇష్ట ప్రకారం ఎంచుకోవాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టి.. రాజకీయ సంక్షోభానికి దారి తీసింది కూడా. అయితే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ వైదొలిగారన్న ప్రచారానికి తెర పడేలా మరో ప్రచారం ఇప్పుడు మొదలైంది. పార్టీ అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోమని ఆదేశాలు ఇవ్వలేదట. అలాగే.. తనంతట తాను తప్పుకుంటానని నిన్న(సోమవారం) సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వద్ద గెహ్లాట్ ప్రస్తావించినట్లు వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్ పరిణామాలపై సీనియర్ నేత అజయ్ మాకెన్- సమర్పించిన నివేదిక.. ఇప్పుడు కీలకంగా మారనున్నట్లు సమాచారం. మరో 48 గంటల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని, ఈ లెక్కన ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో గెహ్లాట్ ఉన్నట్లేనని పార్టీ సీనియర్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని గెహ్లాట్ చెప్పడంతో.. పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీని కలుసుకుని వివరణ ఇచ్చే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. గెహ్లాట్ సంగతి పక్కనపెడితే ‘రెబల్’ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నేత శశిథరూర్ నామినేషన్ పేపర్లను తీసుకున్నారు. ఈ నెల 30న ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ సంక్షోభానికి కారణమైన ఎమ్మెల్యే సచిన్ పైలట్.. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మంతనాలకు సిద్ధమయ్యాడు. ఇంకోవైపు అధిష్టానం సీరియస్ అయిన నేపథ్యంలో చల్లబడ్డ ఎమ్మెల్యేలు తామంతా ఒకేతాటిపై ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ సేమ్ సీన్ -
‘నాకున్న ఫాలోయింగ్ మీకు తెలియట్లేదు.. ఆరోజు అందరూ షాకవుతారు’
కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని టెన్షన్‌కు గురిచేస్తోంది. హస్తం పార్టీ చీఫ్ రేసులో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, వీరిలో ఎవరికి మెజార్టీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ చీఫ్ రేసులో ఉన్న శశిథరూర్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు ఉంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నేను నామినేషన్ దాఖలు చేసే నాకు ఉన్న ఫాలోయింగ్ మీరే చూస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మెజార్టీ నేతలు నేను పోటీ చేయాలని ఇప్పటికే కోరారు. ఈ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను ప్రజలకు సైతం కలుస్తాను అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కేరళలో ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని శశిథరూర్ కలిశారు. ఈ విషయంపై శశిథరూర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ పాలక్కడ్‌లోని పట్టంబిలో భారత్ జోడో యాత్రలో ఉన్నారు. పాలక్కడ్ నా సొంత జిల్లా.. రాహుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏ వ్యక్తి అయినా.. జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే.. ఆ అభ్యర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాలి. కాగా.. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8న చివరి తేదీ, అక్టోబర్ 17న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడికానున్నాయి. ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేతను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం ఇది నాలుగోసారి. దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఓటింగ్ జరుగుతోంది. చివరిసారిగా 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి, జితేంద్ర ప్రసాద్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సోనియా విజయం సాధించారు. You will see the support I enjoy when I submit my nomination paper, says Shashi Tharoor https://t.co/ukiyaBMvkb — World Opinion (@WorldOpinionInd) September 26, 2022 -
సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
కొచ్చి/జబల్పూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత కలిసి నడవాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అధ్యక్ష పోస్టుకి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, గెహ్లాట్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఫలితాల తర్వాత అందరూ కలిసి నడవాల్సిందే. బ్లాక్, గ్రామం, జిల్లా స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐక్యమత్యంగా పనిచేయాలి. కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా మార్చుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా అవసరమని గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడబోనని రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి -
పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, శనివారం(సెప్టెంబర్ 24) నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనుండగా.. 19న కౌంటింగ్ ఉండనుంది. ఇదిలా ఉండగా.. అధ్యక్ష బరిలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ రేసులో నేను కూడా ఉన్నానంటూ చివరి నిమిషంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సైతం ఫ్రేమ్‌లోని వచ్చారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో గురువారం దిగ్విజయ్ సింగ్.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. कांग्रेस अध्यक्ष चुनाव के लिए अधिसूचना जारी ... सेंट्रल इलेक्शन ऑथोरिटी हेड मदुसूदन मिस्त्री के AICC ऑफिस में अधिसूचना की कॉपी चिपकाई गयी . pic.twitter.com/z6BemDvQFO — रंजीता झा डडवाल Ranjeeta Jha Dadwal (@ranjeetadadwal) September 22, 2022 -
అందరూ కోరితే అధ్యక్ష పదవికి రెడీ...!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలకు నాపై ఎంతో నమ్మకముంది. వారంతా కోరితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సీఎంగా కొనసాగమన్నా, అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయమన్నా తోసిపుచ్చలేనన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికపై చాలాసేపు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘‘50 ఏళ్లుగా పార్టీ నాకెన్నో పదవులిచ్చింది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా’’ అని చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా నాకప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నా. ఇకముందు కూడా నెరవేరుస్తూనే ఉంటా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. తద్వారా అధ్యక్షునిగా ఎన్నికైనా సీఎంగా కొనసాగుతానంటూ సంకేతమిచ్చారు. జోడు పదవులు కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ‘‘ఆ నిబంధన నామినేటెడ్ పదవులకే వర్తిస్తుంది. అధ్యక్ష పదవికి బహిరంగ ఎన్నిక జరుగుతుంది గనుక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల్లో ఎవరైనా పోటీ పడవచ్చు’’ అని బదులిచ్చారు. ‘‘నేనెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది. పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం. పార్టీకి ఉపయోగపడే చోటే ఉండాలన్నది నా అభిమతం’’ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా బరిలో దిగుతుండటాన్ని ప్రస్తావించగా అలాంటి పోటీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా మంచిదన్నారు. పోటీకి రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చివరగా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందుకోసం ఆయన గురువారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు గెహ్లాట్ అభిప్రాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ విభేదించారు. ‘‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. తాను కూడా బరిలో దిగే అవకాశముందని దిగ్విజయ్ అన్నారు! ‘‘ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయొద్దా?’’ అని జాతీయ మీడియాతో ప్రశ్నించారు. రాహులే సారథి కావాలి: పైలట్ మరోవైపు, రాహులే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాజస్తాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కోరారు. సగటు కాంగ్రెస్ కార్యకర్తలంతా అదే కోరుతున్నారన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి గెహ్లాట్ గనక పార్టీ అధ్యక్షుడైతే రాజస్తాన్ సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. రాహుల్‌ను ఒప్పించేందుకు పార్టీ నేతలందరం ప్రయత్నిస్తున్నామని సల్మాన్ ఖుర్షీద్ కూడా అన్నారు. మిస్త్రీతో థరూర్ భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీని శశి థరూర్ కలిశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. థరూర్‌కు అన్ని విషయాలూ వివరించినట్టు అనంతరం మిస్త్రీ చెప్పారు. 24న నామినేషన్ పత్రం తీసుకుంటానని చెప్పారన్నారు. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
సీఎంగానా? వర్కింగ్ ప్రెసిడెంట్‌గానా!... టెన్షన్లో రాజస్తాన్ సీఎం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. ఐతే అందుకు ఆశోక్ గెహ్లాట్ సిద్దంగా లేరని సమాచారం. పైగా పార్టీ అధ్యక్ష అత్యున్నత పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలని గెహ్లాట్ ఒప్పించే ప్రయత్నం చేయునున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా...రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కూడా ఢిల్లీకి రావడంతో ఆయనలో మరింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈసారి రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌కి చాన్స్ ఇవ్వాలని పార్టీ సన్నాహాలు చేయడం ఆశోక్‌ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వాస్తవానికి బీజేపీ ఆపరేషన్ కమలం తిరుగుబాటు సమర్థవంతంగా ఎదుర్కొన్న గొప్ప కాంగ్రెస్ అనుభవజ్ఞుడు ఆశోక్ గెహ్లాట్. అందుకే పార్టీ ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తుంది. ఐతే ఆయన అందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఆయన అటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, రాజస్తాన్ ముఖ్యమంత్రిగానూ రెండు పదవులలోనూ కొనసాగాలన్నదే ఆయన ఆలోచన అని పార్టీ సభ్యుల చెబుతున్నారు. తొలుత ఆశోక్ రాహుల్‌ని వర్కింగ్ ఛీప్‌గా ఉండేలా ఒప్పించేందుకు యత్నం చేసిన తదనంతరమే వచ్చే సోమవారం ఈ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్ల సమాచారం. ఆయనకు ప్రత్యర్థిగా శశి థరూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ నామినేషన్లను ఈ నెల సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే అక్టోబర్ 17 ఎన్నికలు నిర్వహిస్తుంది లేదంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. (చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానాయన శాఖ దర్యాప్తు) -
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రాహుల్ గాంధీ ఉన్నారా?
చెన్నై: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గాంధీ కుటుంబంపై కొందరు సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన దరిమిలా.. బయటి వాళ్లకు అవకాశం దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. రాహుల్ గాంధీ ఈ రేసులో ఉన్నారా? లేదా? అనే ప్రశ్న ఆయనకే ఎదురైంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంట్నున రాహుల్ గాంధీకి మీడియా నుంచి అధ్యక్ష ఎన్నికల గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు (పదవికి) జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఏం చేయాలో నేనో నిర్ణయంపై ఉన్నా. అందులో ఎలాంటి గందరగోళం లేదు’’ అని ఆయన తెలిపారు. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు తాను దూరంగా లేననే సంకేతాలను అందించారు ఆయన. అందమైన దేశంలో ఈ రెండు మూడు నెలలు యాత్ర చేపట్టడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నాక్కూడా ఓ అవకాశం దొరుకుతుంది. కొన్ని విషయాలపై పూర్తి స్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అని ఆయన పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నవంబర్17వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ చేపట్టి.. ఫలితం ప్రకటిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 తేదీల మధ్య నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని, పార్టీ కుదేలుకు కారణం రాహుల్ గాంధీనే అంటూ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు సీనియర్ల కాంగ్రెస్‌ను వీడడం.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మూడు వారాల్లో దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. తాను పోటీ చేసేది లేనిదీ చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య పార్టీలో ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడైనా శుభపరిణామమే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసిందని థరూర్ పేర్కొన్నారు. గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్షులైతే మంచిదన్నారు. అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుంటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా, వాళ్ల తరఫున రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లేత్ నిలబడినా శశి థరూర్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ వార్తా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని థరూర్ పేర్కొనడం వీటికి బలం చేకూర్చింది. అంతేకాదు నామినేషన్లు కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఎన్నికలు జరగాలని థరూర్ సూచించారు. ఎవరైనా పోటీ చేయొచ్చు.. భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత జైరాం రమేశ్ థరూర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించామని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని చెప్పారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల -
ఆగస్టు 21 తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు సోనియా గాంధీ. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 21 నుంచి కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ పదవికి పోటీ పడే అంశంపై పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయకపోవటంపై ఉత్కంఠ నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన క్రమంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం మరోమారు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. గాంధీయోతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అధ్యక్ష పదవి గాంధీ కుటుంబంలోని వ్యక్తే చేపట్టాలని, అదే పార్టీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిన సందర్భంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు రాజీనామా చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ 2017లో సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితం కావటంతో మే నెలలో పార్టీ పగ్గాలను వదులుకున్నారు రాహుల్ గాంధఈ. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల తర్వాతే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పోస్టులకు ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం సెప్టెంబర్ 7న ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపైనే దృష్టిసారించారు. ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి -
ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు. తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్ కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు. యాదృచికంగా సిన్హా జూన్21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది. దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం. (చదవండి: యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్) -
జూలై 2న తెలంగాణకు యశ్వంత్ సిన్హా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై 2న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కాకుండా మరోచోట ఉంటుందని సమాచారం. ఎక్కడ సమావేశమయ్యేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు. చదవండి: Presidential Elections 2022: ప్రాతినిధ్యమే రాజకీయంగా కీలకం -
రాష్ట్రపతి ఎన్నికలు: అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు
న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. బీజేపీ కురువృద్ధ నేత, గురువు అయిన ఎల్కే అద్వానీతో సైతం ఆయన ఫోన్ చేసి చాలాసేపే మాట్లాడినట్లు తెలుస్తోంది. నామినేషన్ వేయకముందే ఆయన ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. ఇక రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో.. సిన్హాకు జెడ్ కేటగిరీ భద్రత అందించింది కేంద్రం. సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోలను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. 27న(సోమవారం) ఆయన నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా, పవార్, మమతకు ముర్ము ఫోన్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం కీలక ప్రతిపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడారు. నామినేషన్ వేసిన అనంతరం.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు ఫోన్ చేసి, తనకు మద్దతు తెలపాలని కోరారు. త్వరలోనే వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని వారికి ముర్ము చెప్పినట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు ఆమె విజయాన్ని కాంక్షించారని తెలిపాయి. బీజేపీ చీఫ్ నడ్డా శుక్రవారం కాంగ్రెస్ నేతలు మలికార్జున ఖర్గే, ఆధిర్ రంజన్ చౌధురి, మాజీ పీఎం, జేడీయూ నేత దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాలకు ఫోన్ చేసి, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. చదవండి: అట్టహాసంగా ద్రౌపది ముర్ము నామినేషన్ -
Presidential Polls: ఎన్నిక పద్ధతి, అధికార విధులు ఇవే!
భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి. కేంద్ర కార్య నిర్వాహకశాఖలో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. ప్రకరణ 52 ప్రకారం– భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం– కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రి మండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ► ప్రకరణ 324 ప్రకారం–కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు. అందుకోసం 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి ముందు 60 రోజులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ►రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు.15వ రాష్ట్రపతి (రామనాథ్ కోవింద్) ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వ్యవహరించారు. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ప్రకరణ 54 ప్రకారం– రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది(ఎలక్టోరల్ కాలేజ్). ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ, పుదుచ్ఛేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఇది 1995 జూ¯Œ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా చేర్చాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ►ప్రకరణ 55(3)లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదలాయింపు పద్ధతి(రహస్య ఓటు) ద్వారా ఎన్నికవుతారు. అయితే ఈ పద్ధతిని రాజ్యాంగ పరిషత్‌లో అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఈ పద్ధతిని అమెరికాకు చెందిన థామస్ హేర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఆవిష్కరించారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ = (రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య)(1/1000) ►లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 ►రాజ్యాసభలో మొత్తం సభ్యుల సంఖ్య 233 ►1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలులోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026వరకు పొడిగించారు. ►ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్–208, తమిళనాడు–176, జార్ఖండ్–176, మహారాష్ట్ర–175, బీహార్–173. ►అలాగే అతి తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: సిక్కిం–7, మిజోరాం–8, అరుణాచల్‌ప్రదేశ్–8, నాగాలాండ్–9. ఎంపీల ఓటు విలువను గణించే పద్ధతి ఎంపీల ఓటు విలువ = మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య ►ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. n 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 700. n రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అభ్యర్ధికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే.. మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటె ఎక్కువ. రాష్ట్రపతి ఎన్నిక–రెండు ప్రధాన సూత్రాలు 1. ఏకరూపతా సూత్రం (Principle of Uniformity, Equality) 2. సామ్యతా సూత్రం (Principle of Uniformity, Equality) మొదటి సూత్రం ప్రకారం–రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది. రెండో సూత్రం ప్రకారం– దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా తేడాలుండవు. ఉదాహరణకు దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4033 (జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ రద్దయి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున జమ్మూ–కశ్మీర్‌కు చెందిన 87 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలో పాల్గొనరు.) ►దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ –5,43,231 ►దేశంలోని మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్య–776 ► దేశంలోని మొత్తం ఎంపీల ఓటు విలువ –5,43,200 ►మొత్తం ఎమ్మెల్యేల + ఎంపీల ఓటు విలువ = 10,86,431 ► నియోజక గణంలో మొత్తం ఓటర్ల సంఖ్య = 4033 + 776 = 4809 అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎంపీల ఓటు విలువతో దాదాపు సమానం. దీనినే ప్రిన్సిçపల్ ఆఫ్ పారిటీ అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సూత్రాలను పాటించడానికి కారణం. అందుకే భారత రాష్ట్రపతి యావత్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి – అర్హతలు ►ప్రకరణ 58లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలను పేర్కొన్నారు. ►భారతదేశ పౌరుడై ఉండాలి (సహజ లేదా సహజీకృత పౌరసత్వం) ►35 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభదాయక ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు. ►శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ►నేరారోపణ రుజువై ఉండరాదు. దివాళా తీసి ఉండరాదు. ► లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావల్సిన ఇతర అర్హతలు ఉండాలి. ►పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. ► రాష్ట్రపతి అర్హతలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. ►లాభాదాయక పదవులు(Office of Profit) అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు. 1959 లో పార్లమెంట్ సభ్యుల అనర్హతలు,నియంత్రణ చట్టం రూపొందించి ఈ పదానికి నిర్వచనం తెలిపి.. కొన్ని పదవులను లాభాదాయక పదవులను మినహాయించింది. వీటికి కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తారు. లాభదాయక పదవుల్లో ఉండరాదు అనే అర్హతకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, ఎంఎల్ఏ, ఎంíపీలకు జీతభత్యాలుంటాయి. వారు ఆ పదవులలో కొనసాగుతూనే మరొక పదవికి కూడా పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి ముందే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, వారు రాష్ట్రపతిగా ఎన్నికైతే వారి సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు. షరతులు ►రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించారు. 1997లో దీనిని సవరించారు. ఈ సవరణ ప్రకారం ఈ కింది షరతులు నిర్దేశించారు. ► అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి. ►ఒక సభ్యుడు, ఒక అభ్యర్ధిని మాత్రమే ప్రతిపాదించాలి లేదా సమర్ధించాలి. ►అభ్యర్ధి నామినేషన్ పత్రంతోపాటు రూ.15,000లు ధరావత్తుగా రిజర్వు బ్యాంకులో లేదా ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు ►మనోహర హోల్కర్ (1967) ►మహారాణి గురుచరణ్ కౌర్ (1969) ► లక్ష్మీ సెహగల్ (2002) ► ప్రతిభా పాటిల్ (2007) ►మీరా కుమార్ (2017) ►1967లో రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. ►అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–కె.ఆర్.నారాయణన్ . ►అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–నీలం సంజీవరెడ్డి ►ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయినవారు– నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ. ►అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం–తమిళనాడు (సర్వేపల్లి రాధాక్రిష్ణన్ , ఆర్.వెంకట్రామన్ , ఎ.పి.జె అబ్దుల్ కలామ్) ►స్వతంత్ర అభ్యర్థి, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేపథ్యంతో రాష్ట్రపతి అయినవారు– వి.వి.గిరి ► రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు–ఎ.పి.జె.అబ్దుల్ కలామ్. ►రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి– యం.హిదయతుల్లా 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ►నోటిఫికేషన్ విడుదల: జూన్ 15, 2022 ►నామినేషన్ దాఖలుకు చివరి తేదీ:జూన్ 29, 2022 ► ఉపసంహరణ తేదీ: జూలై 2, 2022 ►ఎన్నిక తేదీ: జూలై 18, 2022 ► ఓట్ల లెక్కింపు: జూలై 21, 2022 ►రిటర్నింగ్ అధికారి: ప్రమోద్ చంద్ర మోడీ (రాజ్యసభ సెక్రటరీ జనరల్) ►ఆంధ్రప్రదేశ్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి: రాజ్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి) ►తెలంగాణాలో సహాయ రిటర్నింగ్ అధికారి: ఉపేందర్ రెడ్డి (తెలంగాణ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి –బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు -
వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా?
రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ అమృతోత్సవ్ జరుపుకుంటున్న తరుణం గనుక రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్ నడ్డా రంగంలోకి దిగినా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలు అంతంతే. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసమంటూ తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి టీఆర్ఎస్, ఆప్, బీజేడీ వంటి పార్టీలు డుమ్మా కొట్టడంతో అస్పష్టత మరింత పెరిగింది. అందుకే బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. ఈసారి ముస్లింకు అవకాశమిస్తుందన్న అంచనాలున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు ముస్లింలు డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ , ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతులయ్యారు. గత ఎన్నికలప్పుడు రాష్టపతి అభ్యర్థి పేరును బీజేపీ చివరి నిమిషం దాకా గోప్యంగా ఉంచింది. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించింది. 2002లోనూ ఎన్డీఏ హయాంలో నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇలాగే చివరి నిమిషంలో అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును ప్రకటించారు. ఈసారి ప్రచారంలో ఉన్న వారిని ఓసారి చూస్తే... అరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్రపతి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్. యూపీలోని బులంద్‌షహార్‌కు చెందిన ఈయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, జనతాదళ్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీల్లో పని చేశారు. 2004లో బీజేపీలో చేరారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ సస్పెండెడ్ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అగ్గి రాజేసిన నేపథ్యంలో ముస్లింకు అత్యున్నత పదవిని కాషాయ పార్టీ కట్టబెట్టవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది. ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాల్లో ఆదివాసీల ఓట్లు గణనీయంగా ఉన్నందున ఈసారి ఆదివాసీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు ప్రచారముంది. తొలి చాయిస్‌గా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. మహిళకు చాన్సిస్తే రానున్న పలు ఎన్నికల్లో మహిళల ఓట్లను మరింతగా రాబట్టవచ్చన్నది బీజేపీ వ్యూహమంటున్నారు. ద్రౌపదిది ఒడిశా గనుక కీలకమైన బిజూ జనతాదళ్ మద్దతూ లభిస్తుంది. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఆ పార్టీ అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్‌ను బీజేపీ రంగంలోకి దించే చాన్స్ లేకపోలేదంటున్నారు. ఆజాద్ అనుచరులు ఇప్పటికే భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. కశ్మీరీ ముస్లిం నేతను రాష్ట్రపతిని చేస్తే ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టల్ని కొట్టొచ్చన్న యోచనా ఉందంటున్నారు. గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా విపక్షాల తరఫున బరిలో దిగేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించడంతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను మమత తెరపైకి తెచ్చారు. 77 ఏళ్ల గాంధీ బ్యూరోక్రాట్‌గా, దౌత్యవేత్తగా పలు దేశాల్లో పని చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గానూ చేశారు. 2017లో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఓడారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ గాంధీ మనవడిని దింపి బీజేపీని ఇరకాటంలో పెట్టవచ్చన్న ఆలోచన విపక్షాల్లో ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో బీజేపీ హవాకు అడ్డుకట్ట వెయ్యాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఫరూక్‌ను బరిలో దించే ఆలోచనా ఉంది. బీజేపీ ముస్లింకు అవకాశమిస్తే పోటీగా ఫరూక్‌ను దించాలని భావిస్తున్నాయి. బీజేపీ నేత ముక్తార్ అబ్సాస్ నక్వీ, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ ఊకే, తెలంగాణ గవర్నర్ తమిళసై , కర్ణాటక గవర్నర్, దళిత నేత తావర్ చంద్ గెహ్లాట్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
President Election 2022: బీజేపీ ఆకర్ష్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో సొంత బలంతోనే తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికార బీజేపీ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునేలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో వారికి గాలం వేసిన బీజేపీ, తాజాగా గోవా, హరియాణా, రాజస్తాన్‌పైనా కన్నేసింది. బలం పెంచుకునే ఎత్తుగడలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 48.9 శాతం ఓట్లున్నాయి. ఇంకో 11,990 ఓట్లు కావాలి. ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్ష ఎమెల్యేలకు గాలమేస్తోంది. బిహార్‌లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలూ, హిమాచల్‌లోనూ ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్, రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్ధవ్ థాకరేకు రాజ్‌నాథ్ ఫోన్ మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించుకున్నట్లు సమాచారం. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపడానికి బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాలను నియమించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్ బీజేపీ!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, అకాలీదళ్, మజ్లిస్ దూరంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ‘‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మోదీ సర్కారు మరింత హాని చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి’’ అంటూ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం విపక్షాల తరఫున పవార్ అభ్యర్థిత్వాన్ని పార్టీలన్నీ ముక్త కంఠంతో సమర్థించాయి. అయితే పోటీకి పవార్ సున్నితంగా నిరాకరించారు. భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పవార్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని మమత మీడియాకు తెలిపారు. వ్యవస్థలన్నింటినీ పథకం ప్రకారం నాశనం చేస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు అందరూ ఒక్కతాటిపై రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ దృష్టిలో ఏ అభ్యర్థీ లేరని ఖర్గే చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించి ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. ‘‘దేశ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు విద్వేష, విభజన శక్తులను ఎదిరించగల వ్యక్తే రాష్ట్రపతి వంటి పదవిని అధిష్టించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీయేతర పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పవార్, మమత, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేలకు అప్పగించినట్టు డీఎంకే నేత టీఆర్ బాలు చెప్పారు. పోటీకి పవారే సరైన వ్యక్తని, ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. పవార్ నిరాకరణ అనంతరం ఎన్సీపీ నేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను కూడా మమత సూచించినట్టు ఆరెస్పీ నేత ప్రేమ్‌చంద్రన్ తెలిపారు. గోపాలకృష్ణ గాంధీ 2017లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కానీ అదే సమయంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటేసిన జేడీ(యూ), బీజేడీ మద్దతు పొందగలిగారు. విపక్షాల భేటీలో ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ఖర్గే, జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా (కాంగ్రెస్), దేవెగౌడ, కుమార్‌స్వామి (జేడీఎస్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) పాల్గొన్నారు. జూన్ 20, లేదా 21న పవార్ సారథ్యంలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. బీజేపీలో జోష్ మమత భేటీకి టీఆర్ఎస్, బీజేడీ, ఆప్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండటం బీజేపీలో ఉత్సాహం నింపింది. బీజేడీ ఎప్పుడూ విపక్ష శిబిరానికి దూరం పాటిస్తూ వస్తోంది. పలు అంశాలపై ఎన్డీఏకే మద్దతివ్వడం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 48 శాతానికి పైగా ఓట్లున్నాయి. బీజేడీ తదితరుల మద్దతుతో తమ గెలుపు సునాయాసమేనని బీజేపీ భావిస్తోంది. విపక్ష భేటీలో నేతలంతా తమదే పై చేయి అని నిరూపించుకోజూశారని పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఈ భేటీలతో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచారు. మీ చాయిస్ చెప్పండి: బీజేపీ మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలను అధికార బీజేపీ ముమ్మరం చేసింది. ఈ బాధ్యతలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం రాజ్‌నాథ్ పలు విపక్షాల నేతలతో ఫోన్లో వరుస సంప్రదింపులు జరిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మమతకు కూడా ఆయన ఫోన్ చేయడం విశేషం. ఆమెతో పాటు విపక్షాల భేటీలో పాల్గొన్న పవార్, కాంగ్రెస్ నేత ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌లతోనూ ఆయన మాట్లాడారు. అలాగే బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరిపినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే వారికి అంగీకారమో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారని నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు చెబుతున్నారు. నడ్డా కూడా ఫరూక్ అబ్దుల్లాతో ఫోన్లో చర్చలు జరిపారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ((ఏజేఎస్‌యూ), స్వతంత్ర ఎంపీలతోనూ మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దాంతోపాటే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. జూన్ 29 దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉపసంహరణకు జూలై 2 తుది గడువు. జూలై 18న ఎన్నిక జరుగుతుంది. జూలై 21న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. తొలిరోజు 11 నామినేషన్లు దాఖలవగా ఒకటి తిరస్కరణకు గురైంది. చదవండి: విపక్ష నేతలకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్.. మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి -
న్యూఢిల్లీ: విపక్షాలతో దీదీ భేటీ.. ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు!
కోల్‌కతా: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున ఖర్గే, జైరాం రమేశ్ హాజరు కావచ్చంటున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఉండండి.. మమత మంగళవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవాలని అభ్యర్థించారు. అయితే అందుకాయన సుముఖంగా లేరని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. బీజేపీని ఓడించే సంఖ్యాబలాన్ని సమీకరించడంలో విపక్షాలు విఫలమవుతాయనే సంశయం పవార్‌కు ఉందని ఎన్సీపీ వర్గాల్లో వినవస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా నిలిచే ఉద్దేశ్యం పవార్‌కు లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. 2017లోనూ ఆయన ఈ ఆఫర్‌ను కాదన్నారు. చదవండి: ఎయిర్ ఏషియా ఇకపై ఉండదు! కారణమిదే? -
రాష్ట్రపతి ఎన్నికతో కేసీఆర్ గుట్టురట్టు: కోమటిరెడ్డి
నల్లగొండ: రాష్ట్రపతి ఎన్నికతోనే కేసీఆర్ బండారం బయట పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పతి ఎన్నికలో బీజేపీని ఓడగొట్టాలంటే విపక్షా లతో కలిసి రావాల్సిందేనని, ఆయనకున్న 9 మంది ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో ఏవిధంగా ఓడగొడతారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి శనివారం నల్లగొండలో విలేకరు లతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి లబ్ధిపొందేందుకు బీజేపీతో కొట్లాట పెట్టుకున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓట్ల శాతం పెంచేందుకే కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడ ఇదని చెప్పారు. కేసీఆర్ చేతగాని తనం వల్లే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని, గవర్నర్ నుంచి వచ్చిన పిటిషన్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజుకో చోట మహిళ లు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం బాధ కలిగిస్తోంద న్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో తొమ్మిదివ నిందితుడిగా ఉన్న హోం మంత్రి మనవడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయ లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే ఉత్తమ డీజీపీగా అవార్డు అందుకున్న మహేందర్‌రెడ్డి ఇలాంటి చేతగాని సీఎం దగ్గర పనిచేసే బదులు రాజీనామా చేసి వైదొలగాలని హితవు పలికారు. సమావేశంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నల్లగొండ జెడ్పీటీసీ లక్ష్మయ్య, నాయకుడు సైదులుగౌడ్ ఉన్నారు. -
రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల.. కేసీఆర్ దారెటు..?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో.. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల దిశగా పయనిస్తున్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వేసే అడుగులపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళతారు? బీజేపీతో తలపడేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారు? అనే చర్చ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్న సీఎం..కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీయేతర ముఖ్యమంత్రులు, విపక్ష పారీ్టల కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో గత వైఖరికి పూర్తిగా భిన్నమైన పంథాను అనుసరించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. పోయినసారి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదిత అభ్యరి్థకి ఆయన మద్దతు పలికిన సంగతి విదితమే. కాగా తాజా ఎన్నిక ప్రక్రియ రాజకీయంగా మరింత వేడి రగిలించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి అభ్యరి్థపైనే చర్చలు! మూడు నెలల్లో దేశ రాజకీయాల్లో సంచలనం చూస్తారని గత నెల చివరి వారంలో జరిగిన బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తుండగా, తాజాగా ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. బీజేపీయేతర పారీ్టలకు చెందిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్, నవీన్ పటా్నయక్‌లతో ఆయన గతంలో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో సీఎంలు ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్, హేమంత్ సొరేన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తోనూ వివిధ సందర్బాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలకు నేతలుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు శరద్ పవార్, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్‌తో కూడా సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ ఎజెండాతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలపడమే లక్ష్యంగా ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. త్వరలో ప్రత్యేక సమావేశం పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సామాజిక కార్యకర్త అన్నా హజారేతోనూ గత నెల చివరి వారంలో కేసీఆర్ భేటీ కావాల్సిన ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో మరోమారు బీజేపీయేతర సీఎంలు, ఇతర కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ లేదా ఢిల్లీ వేదికగా త్వరలో ఈ భేటీ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్‌తో పీకే భేటీ.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలను మదింపు చేస్తూ పీకే బృందం నివేదికలు ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయస్థాయి రాజకీయాలతోనూ విస్తృత సంబంధాలు ఉన్న పీకే కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడం, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన భేటీలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థ, గెలుపు అవకాశాలు, జాతీయ స్థాయిలో పార్టీల నడుమ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన, విపక్ష ఓట్లు చీలకుండా అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది. -
తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నాటికి 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది. -
ఆట ఇంకా అయిపోలేదు: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ.. ఆట ఇంకా అయిపోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించండం అంత సులభం కాదని తెలిపారు. దేశంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా బీజేపీకి లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత రాష్ట్రపతి ఎన్నికల మాదిరి ఈసారి అంత ఈజీ కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య అధికంగానే ఉందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభల్లోని ఎన్నికైన సభ్యుల(ఎమ్మెలేలు)తో కూడిన ఎలక్టోరల్ కళాశాల ద్వారా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఓట్ల విలువను నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు. 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకోసమే కేంద్రంలోని అధికార బీజేపీతో పోరాడటానికి సిద్ధమవుతోంది. -
నార్త్ కొరియా కిమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న కొత్త అధ్యక్షుడు
సియోల్: దక్షిణ కొరియాలో అధ్యక్షుడి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో సౌత్ కొరియాకు పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పోరులో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ ఓటమిని అంగీకరించారు. ఈ సందర్భంగా యూన్ సుక్ మాట్లాడుతూ.. మే నెలలో తాను పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం తన విదేశాంగ విధానం గురించి వెల్లడిస్తూ అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామని కిమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌పై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియావైపు మూన్ జే ఇన్ మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన సుక్ యోల్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్యోల్కు బైడెన్ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిపింది. -
బిహార్ రాజకీయాల్లో పుకార్లు... రాష్ట్రపతిగా నితీశ్?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ భారత రాష్ట్రపతి కాబోతున్నారా? అసలు ఆ పదవికి నితీశ్ సరిపోతారా? అనే ప్రశ్నలు మంగళవారం బిహార్ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియబోతున్న నేపథ్యంలో రాష్ట్రపతిగా నితీశ్ అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి పదవికి పట్నాలోని నితీశ్ కుమార్‌ను ముడివేయడానికి ముంబైలో బీజం పడింది. నితీశ్ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే తమ పార్టీ మద్దతునిస్తుందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. అయితే ముందుగా నితీశ్ బీజేపీతో మైత్రి వదులుకోవాలని సూచించారు. దీంతో నిప్పు లేనిదే పొగరాదన్నట్లు నితీశ్‌ను రాష్ట్రపతిగా చేసే యత్నాలు ఆరంభమయ్యాయని బిహార్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై నితీశ్‌ను మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పారు. నితీశ్ మిత్రపక్షం బీజేపీ కూడా ఈ విషయమై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కోవింద్ పదవీ కాలం జూలైలో ముగుస్తుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయసభల సభ్యులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు. లోక్‌సభలో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా, రాష్ట్రపతిగా తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నిక చేయాలంటే బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం. అందుకే నితీశ్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని బీజేపీ నిలబెట్టవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మిశ్రమ స్పందన నితీశ్ సొంతపార్టీ నేతలు తాజా ఊహాగానాలపై సంతోషం ప్రకటించగా, బద్ద శత్రువైన లాలూకు చెందిన ఆర్జేడీ నేతలు ఈ విషయమై మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. హత్యకేసులో నిందితుడిని రాష్ట్రపతి కుర్చీలో ఎలా కూర్చోబెడతారని లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ప్రశ్నించారు. ఎప్పటికైనా తన తండ్రి లాలూ ప్రధాని అవుతాడన్నారు. అయితే ఒక బిహారీగా నితీశ్ రాష్ట్రపతి అయితే సంతోషిస్తామని ఆర్జేడీ నేత మృత్యంజయ్ తివారీ చెప్పారు. గత రెండు దఫాల రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ సొంత కూటమికి వ్యతిరేకంగా నిలబడిన అభ్యర్థులకు మద్దతునిచ్చాడని ఆర్జేడీ నేత శక్తియాదవ్ గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన నితీశ్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసి చర్చించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, పీఆర్ ఏజెన్సీ అండతో ఎవరైనా రాష్ట్రపతి గద్దెనెక్కితే దేశ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పదవికి నితీశ్ సరిపోతారని బిహార్ మాజీ సీఎం జితన్‌రామ్ మాంజీ అభిప్రాయపడగా, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ మాత్రం నితీశ్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ వ్యతిరేక కూటమి? దేశంలోబీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే యత్నాలు ఆరంభమయ్యాయని మాలిక్ అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌తో సమావేశమయ్యారన్నారు. వీరితో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలను కలిపి ఐక్య కూటమి నిర్మించాలన్నది ప్రతిపక్ష ప్రణాళిక అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరితో నితీశ్, నవీన్ పట్నాయక్ చేరితే కూటమి మరింత బలోపేతమవుతుందని వీరి విశ్లేషణ. కానీ కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోవడంపైనే ప్రతిపక్షాల్లో విబేధాలున్నాయి. -
కమలానికి కఠిన పరీక్ష.. దేశంలో తగ్గుతున్న బీజేపీ పట్టు!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్.. అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది. పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 19 రాజ్యసభ స్థానాలపై.. ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్‌లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది. రాష్ట్రపతి ఎన్నికలపై .. ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై .. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్‌సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ –ఆర్ఎల్డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు. తదుపరి నాయకత్వం పైనా... బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. 2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా.. రాష్ట్రాలపై పట్టు ... 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్‌తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్‌కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది. ఆ ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
25న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడి ఎన్నికను ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో లెజిస్లేచర్, పార్లమెంటరీ సంయుక్త సమావేశం నిర్వహిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ సాధించిన విజయాలను చాటేందుకు నవంబర్ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ‘టీఆర్ఎస్ ఆవిర్భావం దినోత్సవం ఏటా ఏప్రిల్ 27న నిర్వహించడం ఆనవాయితీ కాగా, రెండేళ్లకోసారి అదే రోజు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు, 2020, 2021 ఏప్రిల్‌లో కరోనా మూలంగా ఆవిర్భావ వేడుకలు, అధ్యక్ష ఎన్నిక జరగలేదు. ఈ ఏడాది సెపె్టంబర్ 2న పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటికే పార్టీ సంస్థాగత కమిటీలకు సంబంధించి గ్రామస్థాయి మొదలుకొని మున్సిపల్ వార్డులు, డివిజన్లు, పట్టణ కమిటీల వివరాలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తాం’అని కేటీఆర్ ప్రకటించారు. హెచ్ఐసీసీలో 14 వేల మందితో ప్లీనరీ... ‘పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించి 22 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 23న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగే ఈ నెల 25న జరిగే ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశం ప్రారంభంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని, ఆయన ఆధ్వర్యంలోనే ప్లీనరీ జరుగుతుంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఏర్పాటయ్యే తీర్మానాల కమిటీ... ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలపై చర్చించి ఏయే తీర్మానాలు చేపట్టాలో ఖరారు చేస్తుంది’అని కేటీఆర్ వివరించారు. వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు, అధికార పార్టీగా ఏడేళ్లుగా టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వచ్చే నెల 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’చేపడుతున్నాం. అధికారం చేపట్టిన ఏడేళ్లలోనే ప్రగతిశీల రాష్ట్రంగా దేశంపై తెలంగాణ ముద్ర వేసింది. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకొనేందుకు నిర్వహిస్తున్న ఈ గర్జనకు టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా కోరుతున్నాం. విజయగర్జన తర్వాత హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే పూర్తయిన పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తాం’అని కేటీఆర్ వెల్లడించారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికను అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: నీట్ రద్దు: మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్ సూచన -
Iran: అధ్యక్ష ఎన్నికల బరిలో అహ్మదీ నెజాద్
టెహ్రాన్: ఇరాన్ అతివాద నాయకుడు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్ (64) మరోసారి అదే పదవి ఆశిస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అణ్వస్త్ర కార్యక్రమాల్లో దూకుడుగా వ్యవహరించి, పశ్చిమ దేశాలకు సవాలు విసిరారు. అహ్మదీ నెజాద్ వైఖరి నచ్చని అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌ను దుష్టదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడాలని నెజాద్ నిర్ణయించుకున్నారు. బుధవారం అభ్యర్థిగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇరాన్లో జూన్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. చురుకైన నేతగా ఇరాన్ ప్రజల్లో ఆదరణ ఉన్న నెజాద్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఖాయమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2017 జరిగిన ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అప్పట్లో నెజాద్ ప్రయత్నాలకు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అడ్డుతగిలారు. ఈసారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభన, అమెరికా ఆంక్షలతో పూర్తిగా చితికిపోయిన ఇరాన్ ప్రజలు ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే వచ్చా.. అహ్మద్ నెజాద్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో తన రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని లక్షలాది మంది కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికే బరిలోకి వచ్చానని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు తనకు తెలుసని అన్నారు. దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించే నాయకత్వం రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అహ్మదీ నెజాద్ 2005 నుంచి 2013 వరకూ వరుసగా రెండు పర్యాయాలు ఇరాన్ అధ్యక్షుడిగా సేవలందించారు. నెజాద్ హయాంలో చమురు శాఖ మంత్రిగా పనిచేసిన రుస్తుం ఘాసేమీ కూడా ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. (చదవండి: Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం) (చదవండి: ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన బీజేపీ ఎంపీలు) -
ట్రంప్ రికార్డ్.. 130 ఏళ్లలో తొలిసారి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి. జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతారు. కూర్చి దిగబోయే ముందు ట్రంప్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 40 ఏళ్ల బ్రాండన్ బెర్నార్డ్ అనే వ్యక్తికి కోర్టు విధించిన మరణశిక్షను ట్రంప్ యంత్రాంగం అమలు చేసింది. 18 సంవత్సరాల వయస్సులో బెర్నార్డ్ ఓ నేరానికి సహచరుడిగా వ్యవహరించినందుకు గాను అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు నివ్వగా.. నిన్న దాన్ని అమలు చేశారు. ఇది ఈ సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం అమలు చేసిన తొమ్మిదవ ఉరిశిక్ష. అయితే రికార్డు ఏంటంటే 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలం(పదవి దిగిపోయేమందు)లో అమలు చేసిన తొలి మరణశిక్ష బెర్నార్డ్ది కావడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం టెక్సాస్‌కు చెందిన ఓ స్ట్రీట్ గ్యాంగ్ అయోవాలో ఓ జంటను హత్య చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ దారుణంలో బెర్నార్డ్, క్రిస్టోఫర్ వియాల్వా అనే మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో బెర్నార్డ్ కూడా ఉన్నాడు. దాంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇక ఇండియానా టెర్రె హాట్‌లోని ఫెడరల్ జైలులో స్థానిక సమయం ప్రకారం గురువారం రాత్రి 9:27 గంటలకు బెర్నార్డ్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’) బెర్నార్డ్‌కు శిక్ష విధించడం పట్ల పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కిమ్ కర్దాషియాన్ వెస్ట్, బెర్నార్డ్ కేసు గురించి ట్వీట్ చేశారు. ‘చివరిసారిగా బెర్నార్డ్‌తో మాట్లాడాను. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన ఫోన్ కాల్ ఇదే. బెర్నార్డ్ ఎప్పటిలాగే నిస్వార్థంగా, తన కుటుంబంపై దృష్టి పెట్టాడు. వారు బాగున్నారని నిర్ధారించుకున్నాడు. మన పోరాటం ముగిసినందున ఏడవవద్దని కోరాడు’ అంటూ కిమ్ ట్వీట్ చేశారు. (బైడెన్ సంచలనం: అమెరికా చరిత్రలో తొలిసారి) Just spoke to Brandon for what will likely be the last time. Hardest call I’ve ever had. Brandon, selfless as always, was focused on his family and making sure they are ok. He told me not to cry because our fight isn’t over. 😢 — Kim Kardashian West (@KimKardashian) December 10, 2020 ఇక బెర్నార్డ్ మరణశిక్షని నిలిపివేయాలంటూ పిలుపునిచ్చిన వేలాది మందిలో పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ ప్రతినిధులు ప్రముఖులు ఉన్నారు. ఇక జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి నెల రోజులకు పైనే వ్యవధి ఉంది. ఈ లోపు మరో నాలుగు మరణశిక్షలు అమలు చేయాల్సి ఉన్నట్లు సమాచారం. -
బైడెన్ గెలుపు పర్యావరణ హితానికి కీలక మలుపు
చరిత్రాత్మక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు 2016లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండో సారి గెలిచి ఉంటే, పర్యావరణానికి సంబంధించి యావత్ మానవాళికి ముప్పు వాటిల్లేదని ప్రజాభి ప్రాయం. అభివృద్ధి, నాగరికత, పారిశ్రామికీకరణల పేరుతో పర్యా వరణానికి చేజేతులా ముప్పు తెచ్చిన ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేలుకొని చేసిన తప్పులు దిద్దుకోవడానికి గత 3 దశాబ్దాలుగా పాట్లు పడుతున్నాయి. భారీ డ్యాముల నిర్మాణం, ఖనిజాల త్రవ్వకం, అడవుల నరికివేత, అణు రియాక్టర్ల నిర్మాణం, బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం, డీజిల్ పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల్ని అడ్డూఅదుపూ లేకుండా మండించడంతో జీవవైవిధ్యం దెబ్బతింది. మాన వుని మనుగడకే ప్రమాదం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 190 దేశాలు సమావేశమై ‘వాతావరణ విధాన పత్రం’ను రూపొందిం చాయి. ఈ ఒప్పందంలో భూతల వేడిమిని వచ్చే 100 ఏళ్లలో ఇప్పుడున్న ఉష్ణోగ్రత స్థాయికి 2 డిగ్రీల సెల్సియస్ కంటే మించకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని తీర్మా నించాయి. పారిస్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరై భారత్ తరఫున ఒప్పందం మీద సంతకం చేశారు. 2016 నవంబర్ నుంచి పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి విస్మ యానికి గురిచేశాడు. వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా వాటా 15 శాతం. ఇంత పెద్ద మొత్తంలో నియంత్రించే చర్యలు చేపట్టాలంటే పారి శ్రామిక ఉత్పత్తులను తగ్గించాల్సి వస్తుందనీ, దానివల్ల అమెరికాలో నిరుద్యోగం పెరగడమే కాకుండా ఆర్థికాభి వృద్ధి దెబ్బతింటుందనీ ట్రంప్ వాదించాడు. పైగా చైనా, భారత్ పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకొంటున్నాయి కనుక, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటామని అన్నాడు. 2017 జూన్‌లో అధికారికంగా పారిస్ వాతావరణ ఒప్పందానికి చెల్లుచీటీ రాశాడు. ఒప్పందం నుండి బయటకు రావా లంటే మూడు సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఈ నిబం ధన వల్ల నవంబర్ 4, 2020న అమెరికా ఒప్పందం నుండి బయటకొచ్చినట్లయింది. యాదృచ్ఛికంగా నవంబర్ 4నే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోవటం విశేషం. అమెరికాలో మొదట్నుంచీ డెమొక్రాట్లు పారిస్ ఒప్పం దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక యిన వెంటనే తొలి నిర్ణయం పారిస్ వాతావరణ ఒప్పం దంలోకి పునఃప్రవేశించే దానిపైనే ఉంటుందని జోబైడెన్ ప్రకటించాడు. గత 4 ఏళ్లలో ‘గ్లోబల్ వార్మింగ్’ అమెరికాను అతలాకుతలం చేసింది. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభ వించాయి. దీంతో, క్షీణిస్తున్న దేశ వాతావరణాన్ని రక్షిం చుకోవాలన్న ఆకాంక్ష సగటు అమెరికన్లలో పెరిగింది. చైనా, భారత్ పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నా యంటూ ట్రంప్ చేసిన విమర్శల్లో కొంత నిజం లేక పోలేదు. కర్బన పదార్థాల వినియోగంలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ది 4వ స్థానం. రష్యా 5వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరి చాలా కాలమైంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలాంటి మెట్రో నగరాలలో ఆక్సి జన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2008లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ వాతావరణ మార్పు’పై విధా నాన్ని ప్రకటించింది. కాలుష్యరహిత బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమేపీ తగ్గించి బ్యాట రీలతో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. మోదీ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాక ‘సౌర శక్తి’ వినియోగంలో చొరవ చూపారు. ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ఏర్పాటు చేశారు. దేశంలో వ్యవసాయ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను దశలవారీగా సమకూర్చే ప్రక్రియ వేగవంతంగా అమలు అవుతోంది. దేశంలో రుతుపవనాల ఆగమనం, క్రమం తారు మారు అవుతున్నాయి. వర్షాకాలం 4 నెలలపాటు కొనసాగి నిర్ణీత వ్యవధిలో వర్షాలు పడటం ఆనవాయితీ. కొన్ని సంవత్సరాలుగా ఏకధాటిగా రెండు, మూడు రోజులపాటు కురియడం, ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడం వంటి వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం ఆటుపోట్లకు గురవుతోంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వరి, గోధుమ దిగుబడుల్లో రమారమి 30 శాతం క్షీణత నమోదవుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం అన్ని పంటల్లోకెల్లా వరి, గోధుమ, మొక్కజొన్నలపై ఎక్కువ ప్రతికూలత చూపుతుంది. అత్యధిక దేశాలలో ప్రజలు ఈ మూడు పంటల్నే ప్రధానాహారంగా తీసుకుంటారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మొక్కజొన్న పంటను కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగా తీసుకొనే ఆఫ్రికా ఖండంలోని జాంబియా, కాంగో, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్ తదితర దేశాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసే బాధ్యతను స్వీకరిస్తున్న ప్రభుత్వాలు పర్యావరణ ‘న్యాయం’ కూడా చేయాలి. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహ్లాదకరమైన పరిసరా లను అందుబాటులోకి తేవడమే ‘పర్యావరణ న్యాయం’. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. ఆ పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ కీలకం కానున్నది. వాతావరణ ఆంక్షల్ని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్ది, సంపన్న అగ్ర దేశాలు తప్పించుకోవాలని చూస్తే అంతకంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదు. భూగోళాన్ని కాపాడేందుకు ఎవరివంతు పాత్ర వారు పోషించాలి. ఆ దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలోకి ప్రవేశించడం ఆహ్వానించదగినది. వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
అప్పుడే వైట్‌హౌస్‌ను వీడతాను: ట్రంప్
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పడి వేగంగా అడుగులు పడుతున్నా.. తన ఓటమిని మాత్రం డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంలేదు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందంటూ పాత పాటనే వినిపిస్తున్నారు. దేశంలోని 99శాతం మంది ప్రజలను తన ఓటమని అంగీకరించడంలేదని ప్రజల తీర్పునకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బైడెన్ మాత్రం రాబోయే తన ప్రభుత్వంలో కీలక విభాగాలకు అధిపతులను నియమిస్తున్నారు. అమెరికాను అభివృద్ధి వైపు నడిపిస్తానంటూ తన టీమ్‌ను సిద్ధ చేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ఎంచున్నారు. (వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!) మరోవైపు జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు బైడెన్ సిద్ధమవ్వగా.. ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘ఎన్నికల ఫలితాలపై నాకు ఇంకా నమ్మకముంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది. 2020 యూఎస్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఈ ఎన్నికల్లో నేనే విజయం సాధించాను. దేశంలో ఓ వర్గం మీడియా నాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. ట్విటర్ కూడా నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ట్రెండింగ్‌లో లేని విషయాన్ని కూడా ఉన్నట్లు చూపుతోంది. అసలు ట్రెండైయ్యే అంశాన్ని మాత్రం పట్టించుకోదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తా’అంటూ ట్వీట్ చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా జోబైడెన్ చరిత్ర సృష్టించారు. కౌంటింగ్ కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. మంగళవారానికి బైడెన్‌కు 8కోట్ల 11వేల ఓట్లు రాగా, ట్రంప్‌నకు 7.38 కోట్ల ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని రోజల పాటు కొనసాగనుంది.