
పోటీ లేకుండా ఉంటే బాగుండేది: వెంకయ్యనాయుడు
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే బాగుండేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రతిపక్ష మిత్రులు పోటీ పెట్టారని అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేరుగా వచ్చి కలవడం అరుదైన అవకాశమని ఆయన తెలిపాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి రావాలని ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపామని, అభ్యర్థి ఖరారు అయ్యాక కూడా ప్రతిపక్షాలను సంప్రదించామని..అయినా ఫలితం లేకపోయిందన్నారు.
ఎన్డీఏ బయట ఉన్న టీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీలతో పాటు జేడీయూ, బీజేడీ, ఏఐడీఎంకే వంటి పార్టీలు సహకరించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రామ్ నాధ్ కోవిందుకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని వ్యాఖ్యానించారు.