అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌.. లింక్డిన్‌ కో-ఫౌండర్‌ సంచలన నిర్ణయం | Reid Hoffman, Linkedin Co-founder, Contemplates Leaving The Us After Trump's Victory | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌.. లింక్డిన్‌ కో-ఫౌండర్‌ సంచలన నిర్ణయం

Published Tue, Dec 3 2024 7:33 PM | Last Updated on Tue, Dec 3 2024 9:21 PM

Reid Hoffman, Linkedin Co-founder, Contemplates Leaving The Us After Trump's Victory

వాషింగ్టన్‌ : ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ సంస్థ లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ట్రంప్‌ విజయంతో రీడ్‌ హాఫ్‌మన్‌ అమెరికా వదిలేందుకు సిద్ధమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్‌ ట్రంప్‌ తన రాజకీయ ప్రత్యర్థుల్లో భయం మొదలైందని అమెరికా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్‌ కో-ఫౌండర్‌ హాఫ్‌మన్‌ దేశాన్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాఫ్‌మన్‌ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలికారు. ఆమె ఎన్నికల ప్రచారానికి 10 మిలియన్‌ డాలర్లు విరాళం అందించారు.దీనికి తోడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్‌ మరణాన్ని కోరుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అయితే,వీటన్నింటికి కంటే ట్రంప్‌పై మాజీ న్యూయార్క్‌ మ్యాగజైన్‌ రచయిత  ఇ.జీన్ కారోల్ పరువు నష్టం దావా వేశారు. అందుకు హాఫ్‌మన్‌ సహకరించారు. ఈ భయాలతో హామ్‌మన్‌ అమెరికాను వదిలేయాని నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement