
ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్‌మెయిర్ శుక్రవారం పార్లమెంట్(బుండెస్టాగ్)ను రద్దు చేశారు. చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన మూడు పార్టీల సంకీర్ణ కూటమి నుంచి ఓ కీలక పార్టీ వైదొలగడంతో నవంబర్ 6న ప్రభుత్వం పడిపోయింది. నిబంధనలను అనుసరించి ఈ నెల 16న పార్లమెంట్‌లో బల పరీక్ష చేపట్టగా షోల్జ్ ఓటమి పాలయ్యారు.
దీంతో, నిర్దేశించిన సమయానికి ఏడు నెలలు ముందుగానే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించే విషయంలో పార్లమెంట్‌లోని ప్రధాన పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. తాజాగా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడంతో ఫిబ్రవరి 23న ఎన్నికలకు మార్గం ఏర్పడినట్లయింది. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ రద్దయిన 60 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంది.
ఇదీ చదవండి: అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్