dissolves parliament
-
జర్మనీ పార్లమెంట్‌కు ఫిబ్రవరిలో ఎన్నికలు
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్‌మెయిర్ శుక్రవారం పార్లమెంట్(బుండెస్టాగ్)ను రద్దు చేశారు. చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన మూడు పార్టీల సంకీర్ణ కూటమి నుంచి ఓ కీలక పార్టీ వైదొలగడంతో నవంబర్ 6న ప్రభుత్వం పడిపోయింది. నిబంధనలను అనుసరించి ఈ నెల 16న పార్లమెంట్లో బల పరీక్ష చేపట్టగా షోల్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో, నిర్దేశించిన సమయానికి ఏడు నెలలు ముందుగానే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించే విషయంలో పార్లమెంట్‌లోని ప్రధాన పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. తాజాగా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడంతో ఫిబ్రవరి 23న ఎన్నికలకు మార్గం ఏర్పడినట్లయింది. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ రద్దయిన 60 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంది.ఇదీ చదవండి: అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్ -
Snap Elections: జపాన్ పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంటు రద్దు అయింది. ముందస్తు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ప్రకటించారు. దశాబ్ద కాలంగా జపాన్ను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పరిపాలిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని షిగేరు ఇషిబా మాట్లాడారు. ‘‘మేము ఈ ఎన్నికలను న్యాయంగా, నిజాయితీగా ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటుంది’’ అని అన్నారు. అయితే.. జపాన్‌లో జనాభా సంక్షోభం నెలకొన్న పేద ప్రాంతాలపై రక్షణ, అటువంటి ప్రాంతాలపై మరిన్ని అధిక నిధులు ఖర్చు చేయటం వంటి విధానాల అమలకు ప్రజల మద్దతును ప్రధాని ఇషిబా కోరుకుంటున్నట్లు తెలిస్తోంది. 🚨#BREAKING: Japan's Prime Minister Shigeru Ishiba dissolved the lower house of parliament on Wednesday, ahead of the general election slated on October 27, the first national vote for the country's new leader. - Reuters/AFP— R A W S G L 🌎 B A L (@RawsGlobal) October 9, 2024 పలువురు కీలక నేతలు పార్టీ మారుతున్నా కూడా ఎలాంటి ఢోకా లేకుండా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలన కొనసాగిస్తోంది. ఇక.. వారం రోజుల కిందటే నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంతలోనే ముందస్తు ఎన్నికల కోసం పార్లమెంట్‌ను రద్దు చేయటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక.. అక్టోబర్ 27న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు!
గాల్లో దీపం మాదిరి మినుకు మినుకుమంటూ ఎప్పుడేమవుతుందోనన్న సంశయాల మధ్యే నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం చిట్టచివరకు కుప్పకూలింది. పార్లమెంటు కెన్సెట్ను రద్దు చేయాలని ఆ చట్టసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించడంతో దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో అయిదోసారి ఆ దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నవంబర్ 1న ఈ ఎన్నికలుంటాయి. చట్టసభల్లో బలాబలాలతో నిమిత్తం లేకుండానే, ఎన్నికల బెడద రాకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్థానపతనాలు రివాజైపోయిన మన దేశంలో ఇజ్రాయెల్ పరిణామాలు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తాయి. నిబంధనల ప్రకారమైతే పార్లమెంటు కాల వ్యవధి నాలుగేళ్లు. లికుడ్ పార్టీ అధినేత, మితవాది అయిన బెంజమిన్ నెతన్యాహూ వరసగా మూడు దఫాలు ఎన్నికై, ఇతర పార్టీల సహకారంతో పన్నెండేళ్లపాటు అధికారం నిలబెట్టుకుని రికార్డు సృష్టించారు. అయితే 2019 ఏప్రిల్ ఎన్నికల నాటినుంచీ దేశంలో అస్థిరత తప్పడం లేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో కనీస మెజారిటీ 61 ఎవరికీ రాలేదు. దాంతో పొసగని పార్టీలు కూటములుగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయక తప్పలేదు. 2018 నుంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితి ఏర్పడింది. నెతన్యాహూ ఎప్పటికప్పుడు అనామతు ఖాతాలతో నెట్టుకొచ్చారు. చివరకు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో నెతన్యాహూ అధికారం నుంచి వైదొలిగారు. నిరుడు జూన్‌లో ఎన్నికల అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన నఫ్తాలీ బెనెట్ పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించారు. అయితే కూటమిలోని వివిధ పక్షాలను సంతృప్తి పరిచేందుకు రాజీపడటం స్వపక్షమైన యామినా పార్టీలో ముసలం పుట్టించింది. ఆ పార్టీ ఎంపీ గత ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. పర్యవసానంగా బెనెట్ ప్రభుత్వం కొన ఊపిరితో సాగుతోంది. సైద్ధాంతిక సారూప్యతలేని పార్టీలు అధికారం కోసమే దగ్గరైనప్పుడు విభేదాలు తప్పవు. కలిసి పనిచేసే క్రమంలో కొన్నిసార్లు పరస్పర అవగాహన ఏర్పడుతుందనీ, ఆ పార్టీల వైఖరుల్లో మార్పు వస్తుందనీ కొందరి వాదన. కానీ నిలువునా చీలిన ఇజ్రాయెల్ సమాజంలో అది సాధ్యపడలేదు. అధికార కూటమిలో ఎనిమిది పార్టీలుండగా అందులో మధ్యేవాద, కుడి, ఎడమ పక్షాలతోపాటు స్వతంత్ర అరబ్ పక్షం రాహంబా పార్టీ కూడా ఉంది. అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే పార్టీల్లో ఒకటి పాలనలో భాగస్వామ్యం తీసుకోవడం ఇజ్రాయెల్ చరిత్రలో అదే తొలిసారి. అందువల్లే ఈ కూటమిపై మొదట్లో అందరూ ఆశలు పెట్టుకున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరి ష్కారం దొరుకుతుందనుకున్నారు. కానీ యూదులకూ, పాలస్తీనా ప్రాంత ప్రజలకూ మధ్య విద్వే షాలు రేకెత్తించడంలోనే దశాబ్దాలుగా మనుగడ వెదుక్కునే పార్టీల పుణ్యమా అని ఈ ప్రయోగం బెడిసికొట్టింది. నెతన్యాహూపై అవినీతిపరుడన్న ముద్ర ఉన్నా ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయ డానికి ఒక అరబ్ పక్షం ప్రయత్నించి విజయం సాధించిందన్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ సమాజం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వారితో చేతులు కలిపి అధికారంలో కొనసాగిన మితవాద పక్షం యామినా పార్టీకి పౌరుల్లో పరపతి అడుగంటింది. రాబోయే ఎన్నికల్లో నెతన్యాహూను సమర్థించే మితవాద పక్షాలకు అధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అంతో ఇంతో వామపక్షాల వైపు సానుభూతిగా ఉండేవారు సైతం ఈసారి మితవాదంవైపు మొగ్గుచూపుతున్నారని సర్వేలంటు న్నాయి. ఈ సర్వేల విశ్వసనీయత సంగతలావుంచి ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌లో అయిదు లక్షలమంది యూదులకు 120 ఆవాసాలు ఏర్పరిచారు. అక్కడున్న 30 లక్షలమంది పాల స్తీనా పౌరులు ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఆ కాలనీలను ఇజ్రాయెల్‌లో విలీనం చేసేం దుకు మొన్న ఏప్రిల్‌లో అధికార కూటమి ప్రయత్నించినప్పుడు పాలస్తీనా వాసులకు ప్రాతినిధ్యం వహించే రహంబా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి తప్పు కుంది. దాంతో ప్రధాని బెనెట్ రాజీపడక తప్పలేదు. యూదు కాలనీలపై చట్టం వస్తే ఆ ప్రాంతం ఇజ్రాయెల్‌లో భాగంగా మారుతుందన్నది పాలస్తీనా వాసుల వాదన. ఇప్పటికే యూదులకూ, పాల స్తీనా వాసులకూ అక్కడ వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. అటు యూదులకు సైతం ఇదొక సంకటంగా మారింది. ప్రస్తుతం ఆ కాలనీల్లో సైనిక పాలన ఉన్నందువల్ల ఇతర ఇజ్రాయెల్ పౌరుల మాదిరి వారు పూర్తి స్థాయి హక్కులు పొందలేకపోతున్నారు. ఈనెల 1వ తేదీతో గడువు ముగు స్తున్న దశలో ఈ చట్టం కోసం రూపొందించిన బిల్లు గత నెల 10న పార్లమెంటులో వీగిపోయింది. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నచోట ‘అందరి ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం, అది నాలుగేళ్లూ మనుగడ సాగించటం సహజంగానే అసాధ్యం. నెతన్యాహూ అధికారంలో ఉండగా ఈ వైషమ్యాలను మరింత పెంచి, భవిష్యత్తులో మళ్లీ అందరూ విధిగా తనవైపే చూడకతప్పని స్థితి కల్పించారు. ఆర్థికాభివృద్ధికి పాటుపడటం, శాంతి సాధనకు ప్రయత్నించడం వంటి ఆదర్శాలకు కాలం చెల్లి, వైషమ్యాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమే. ఈసారి ఎన్నికైతే యూదులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాననడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని నెతన్యాహూ వాగ్దానం చేస్తున్నారు. తదుపరి ఏర్పడ బోయేది ‘పటిష్టమైన’ జాతీయవాద ప్రభుత్వమా... అరబ్ పార్టీల పలుకుబడి కొనసాగే ‘యూదు వ్యతిరేక’ ప్రభుత్వమా అన్నది నవంబర్ 1 తర్వాత తేలుతుంది. -
ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు
జెరూసలేం: విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో ప్రయోగాత్మకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇజ్రాయెల్‌లో బెన్నెట్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించింది. రద్దు ప్రతిపాదనను గురువారం పార్లమెంటు ఆమోదించింది. దీంతో నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవి కోల్పోయారు. విదేశాంగ మంత్రి యాయెర్ ల్యాపిడ్ ఎన్నికల వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. 2021 మార్చిలో ఆఖరిసారిగా ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంటుకి నాలుగేళ్లలోనే నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రద్దు చేయడం గమనార్హం. మార్చి 12 నుంచి 19లోపు అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని, ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది. -
ముందస్తు.. ఫలితాలు ఇలా..!
నిర్ణీత కాలవ్యవధి కంటే దాదాపు ఏడెనిమిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దుకు కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సమర్పించిన కొద్ది సేపటికే గవర్నర్ దానిపై ఆమోదముద్రవేశారు. ఇలా గడువు కంటే ముందే పలు సందర్భాల్లో లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. ఈ విధంగా చట్టసభల పూర్తికాలం ముగియకుండానే లోక్‌సభ/ అసెంబ్లీలు రద్దయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. అలాంటి సందర్భాల్లో కొన్ని... లోక్‌సభకు... లోక్‌సభ కాల పరిమితి ముగిసేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగానే 1970 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దానిని రద్దు చేసి 1971 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె నేతత్వంలోని కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. గడువు ప్రకారం 2004 సెప్టెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వత్తిడిని ప్రధాని ఏబీ వాజ్‌పేయిపై తీసుకొచ్చారు. విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ ఒత్తిళ్ల నేపథ్యంలో వాజ్‌పేయి లోక్‌సభను కూడా రద్దు చేసి 2004 ఏప్రిల్ / మే లలో ఎన్నికలకు వెళ్లగా కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, ఏపీలో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ,బీజేపీ కూటమి ఓటమి చవిచూశాయి. అసెంబ్లీలకు... 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎన్టీరామారావు సీఎం అయ్యాక 1984 ఆగస్టులో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో నెలరోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా వ్యవహరించారు. ప్రభుత్వం మనుగడ సాధించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్టీఆర్ గూటికి చేరుకున్నా పార్టీ / ప్రభుత్వంలో అసంతప్తి లేకుండా చేసేందుకు 1984 నవంబర్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుచేశారు. 1985 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు 1992లో జరగాల్సి ఉండగా, 1991లోనే అప్పటి సీఎం జ్యోతిబసు రద్దుచేశారు. 1991లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలతో పాటు బెంగాల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొంది జ్యోతిబసు మళ్లీ సీఎం అయ్యారు. 2003 మార్చి వరకు శాసనసభ కాలపరిమితి ఉన్నా (9 నెలలు ముందుగానే) గోధ్రా అల్లర్లు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించిన నేపథ్యంలో 2002 లోనే అప్పటి సీఎం నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీని రద్దుచేశారు. ఆ తర్వాత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ మళ్లీ సీఎం అయ్యారు. 2004 సెప్టెంబర్/ అక్టోబర్ వరకు ఏపీ (అవిభాజ్య) అసెంబ్లీ పూర్తయ్యేందుకు గడువు మిగిలి ఉన్నా, అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయటపడిన సానుభూతి పనిచేస్తుందనే నమ్మకంతో అప్పటి సీఎం చంద్రబాబు 2003 నవంబర్లోనే శాసనసభ రద్దుచేశారు. 2004 ఏప్రిల్ / మేలో లోక్‌సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ ఓటమిపాలైంది. అయితే నిర్ణీత కాల వ్యవధి ముగియకుండానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసినా వాటిని ఆమోదించని సందర్భాలు కూడా ఉన్నాయి. సర్కారియా కమిషన్ నివేదికలోని వివరాలను బట్టి 1967లో పంజాబ్, 1968లో ఉత్తరప్రదేశ్‌లో, 1969లో మధ్యప్రదేశ్, 1971లో ఒరిస్సా ప్రభుత్వాలు శాసనసభ రద్దుకు చేసిన విజ్ఞప్తులను అంగీకరించలేదు. 2003లోనూ యూపీ సీఎంగా ఉన్న మాయవతికి కూడా అసెంబ్లీ రద్దుకు అనుమతి లభించలేదు. -
కువైట్ పార్లమెంటు రద్దు
కువైట్ సిటీ: తగ్గుతున్న ముడి చమురు ధరలు, పెరుగుతున్న ఐసిస్ ప్రాబల్యం కారణంగా కువైట్ రాజు షేక్ సాబా అల్ అహ్మద్ అల్సాబా ఆ దేశ పార్లమెంటును రాజాజ్ఞ ద్వారా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ముడిచమురు సమృద్ధిగా దొరికే ఈ దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. అమెరికాకు ప్రముఖ మిత్రదేశమైన కువైట్‌లో చివరిసారిగా ఎన్నికలు 2013లో జరిగాయి. ఓపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి)లో భాగస్వామి అయిన కువైట్‌లో పార్లమెంటులు తరచుగా తమ పూర్తి గడువు వరకు పాలించకుండా మధ్యలోనే నిష్క్రమిస్తుంటాయి. మంత్రివర్గం కూడా త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. చమురు ధరల పతనం, ఐసిస్ వల్ల పెరుగుతున్న ముప్పు వంటి కారణాల వల్ల పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు రాజు తన ఆజ్ఞలో పేర్కొన్నాడు.