జపాన్ పార్లమెంటు రద్దు అయింది. ముందస్తు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ప్రకటించారు. దశాబ్ద కాలంగా జపాన్‌ను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పరిపాలిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని షిగేరు ఇషిబా మాట్లాడారు.
‘‘మేము ఈ ఎన్నికలను న్యాయంగా, నిజాయితీగా ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటుంది’’ అని అన్నారు. అయితే.. జపాన్‌లో జనాభా సంక్షోభం నెలకొన్న పేద ప్రాంతాలపై రక్షణ, అటువంటి ప్రాంతాలపై మరిన్ని అధిక నిధులు ఖర్చు చేయటం వంటి విధానాల అమలకు ప్రజల మద్దతును ప్రధాని ఇషిబా కోరుకుంటున్నట్లు తెలిస్తోంది.
🚨#BREAKING: Japan's Prime Minister Shigeru Ishiba dissolved the lower house of parliament on Wednesday, ahead of the general election slated on October 27, the first national vote for the country's new leader. - Reuters/AFP
— R A W S G L 🌎 B A L (@RawsGlobal) October 9, 2024
పలువురు కీలక నేతలు పార్టీ మారుతున్నా కూడా ఎలాంటి ఢోకా లేకుండా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలన కొనసాగిస్తోంది. ఇక.. వారం రోజుల కిందటే నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంతలోనే ముందస్తు ఎన్నికల కోసం పార్లమెంట్‌ను రద్దు చేయటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక.. అక్టోబర్ 27న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment