కువైట్ సిటీ: తగ్గుతున్న ముడి చమురు ధరలు, పెరుగుతున్న ఐసిస్ ప్రాబల్యం కారణంగా కువైట్ రాజు షేక్ సాబా అల్ అహ్మద్ అల్‌సాబా ఆ దేశ పార్లమెంటును రాజాజ్ఞ ద్వారా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ముడిచమురు సమృద్ధిగా దొరికే ఈ దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది.
అమెరికాకు ప్రముఖ మిత్రదేశమైన కువైట్‌లో చివరిసారిగా ఎన్నికలు 2013లో జరిగాయి. ఓపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి)లో భాగస్వామి అయిన కువైట్‌లో పార్లమెంటులు తరచుగా తమ పూర్తి గడువు వరకు పాలించకుండా మధ్యలోనే నిష్క్రమిస్తుంటాయి. మంత్రివర్గం కూడా త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. చమురు ధరల పతనం, ఐసిస్ వల్ల పెరుగుతున్న ముప్పు వంటి కారణాల వల్ల పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు రాజు తన ఆజ్ఞలో పేర్కొన్నాడు.
కువైట్ పార్లమెంటు రద్దు
Published Mon, Oct 17 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement