fuel price row
-
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ..ఎక్కడంటే?
గత వారం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది. పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలివే ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో ఛండీఘడ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20కి,డీజిల్ ధర రూ.6.57 తగ్గడంతో రూ.84.26కి చేరింది. దీంతో పాటు పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలిలా ఉన్నాయి. పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.41 గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 హర్యానాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.5 అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96 జమ్మూ- కశ్మీర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 ఉత్తరా ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.8 జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.5గా ఉంది. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే! 1/ Good to see the interest generated by @PMOIndia @narendramodi ‘s decision yesterday to bring an Excise Duty cut on petrol and diesel. Sharing some useful facts. ‘am sure criticism/appraisal can benefit from having them before us. — Nirmala Sitharaman (@nsitharaman) May 22, 2022 ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.గతేడాది నవంబర్ '2021లో చేసిన సుంకం తగ్గింపుతో సంవత్సరానికి రూ.1,20,000 కోట్లు. ఈ ఏడాది కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో కేంద్రానికి సంవత్సరానికి లక్షకోట్ల మేర ప్రభావం చూపుతుంది. ఈ రెండు సుంకాల కోతలపై కేంద్రానికి మొత్తం రాబడి ప్రభావం ఏడాదికి 2,20,000 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
దేశంలో పెట్రో ధరలు, వాహనదారులకు ఊరట
కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తిన వేళ దేశంలో చమురు వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత ఆదివారం నుంచి ఈ రోజు(ఆదివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరగ్గా అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక ఆదివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్‌ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్‌పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
పెట్రోల్ ధరలు: మోదీజీ.. ఈ మహిళ మొర ఆలకించేనా..?
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశ వ్యాప్తంగా వాహనదారులు తమదైన స్టైల్లో చేస్తున్న నిరసన కొనసాగుతుంది. పార్లమెంట్ వర్షాకాల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు తగ్గించే విషయంపై ప్రధాని మోదీ ప్రసంగించాలని కోరుకుంటున్నారు. ఓవైపు పెట్రోల్ బంకుల్లో కార్లపైకెక్కి అర్ధనగ్నంగా దండాలు పెడుతుంటే,మహిళలు పెట్రోల్ బంకుల్లో తమ మొర ఆలకించాలంటూ మోదీ ఫ్లెక్సీకి దణ్ణాలు పెడుతున్నారు. నెటిజన్లు సైతం #ThankYouModiJiChallenge అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.ఈ నిరసనతో పెట్రో ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా' అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మంగళవారం రోజు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరడగంతో.. దేశీయంగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెలలో ఈ ఇరవై రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఒక్క ఢిల్లీలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం పెట్రోల్ 63 పర్యాయాలు, డీజిల్ 61సార్లు పెరిగింది. మంగళవారం పెట్రోల్,డీజిల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది చదవండి: 'పెగసస్' చిచ్చు, సర్వీస్‌లను షట్ డౌన్ చేసిన అమెజాన్ -
FuelPriceHike: నెలలో పన్నెండోసారి!
సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. శనివారం ఊరట ఇచ్చినట్లే ఇచ్చి.. ఆదివారం స్వల్ఫంగా పెంచాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై పదిహేడు పైసలు, డీజిల్‌పై 29పైసలు పెరిగాయి. ఈ నెలలో ఫ్యూయల్ ధరలు పెరగడం ఇది పన్నెండోసారి. తాజా ధరలతో ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ వందకు దగ్గరైంది. లీటర్ పెట్రోల్ ధర రూ.99.49పైసలకు, డీజిల్ ధర రూ.91.30 పైసలకి చేరుకుంది. ► కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91 ► చెన్నైలో పెట్రోల్ రూ.94.86, డీజిల్ రూ.88.87 ► హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.88, డీజిల్ రూ.91.65 ► జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.91.65 ► బెంగళూరులో పెట్రోల్ రూ.96.31, డీజిల్ రూ.89.12 ► తిరువనంతపురం పెట్రోల్ రూ.95.19, డీజిల్ రూ.90.36 వ్యాట్ తదితర కారణాల వల్ల రాష్ట్రాల మధ్య ఫ్యూయల్ ధరల్లో తేడాలు ఉండే విషయం ఉంటుందన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటర్ వంద దాటింది. రాజస్థాన్ చమురు ఆయిల్స్‌పై అత్యధికంగా వ్యాట్ విధిస్తోంది. -
ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ సెస్సు విధింపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ చేసింది. ఇప్పుడు సెస్ విధింపుతో ఇంధనం ధర మరింత ఎగబాకనుంది. లీటర్ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. ఒక్కసారిగా ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఇక ఈ వ్యవసాయ సెస్సు విధుంపుతో.. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం.. అన్ని అంశాలపై ఉంటుంది. ఇక అప్పుడు సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టు లేదు ధరలిట్టా మండిపోతే’ అని పాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. (చదవండి: బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు) ఇక వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) -
కువైట్ పార్లమెంటు రద్దు
కువైట్ సిటీ: తగ్గుతున్న ముడి చమురు ధరలు, పెరుగుతున్న ఐసిస్ ప్రాబల్యం కారణంగా కువైట్ రాజు షేక్ సాబా అల్ అహ్మద్ అల్సాబా ఆ దేశ పార్లమెంటును రాజాజ్ఞ ద్వారా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ముడిచమురు సమృద్ధిగా దొరికే ఈ దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. అమెరికాకు ప్రముఖ మిత్రదేశమైన కువైట్‌లో చివరిసారిగా ఎన్నికలు 2013లో జరిగాయి. ఓపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి)లో భాగస్వామి అయిన కువైట్‌లో పార్లమెంటులు తరచుగా తమ పూర్తి గడువు వరకు పాలించకుండా మధ్యలోనే నిష్క్రమిస్తుంటాయి. మంత్రివర్గం కూడా త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. చమురు ధరల పతనం, ఐసిస్ వల్ల పెరుగుతున్న ముప్పు వంటి కారణాల వల్ల పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు రాజు తన ఆజ్ఞలో పేర్కొన్నాడు.