గత వారం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది.
పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలివే
ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో ఛండీఘడ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20కి,డీజిల్ ధర రూ.6.57 తగ్గడంతో రూ.84.26కి చేరింది. దీంతో పాటు పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలిలా ఉన్నాయి.
పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.41
గుజరాత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8
హర్యానాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.5
అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96
జమ్మూ- కశ్మీర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8
ఉత్తరా ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.8
జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.5గా ఉంది.
నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే!
1/ Good to see the interest generated by @PMOIndia @narendramodi ‘s decision yesterday to bring an Excise Duty cut on petrol and diesel.
— Nirmala Sitharaman (@nsitharaman) May 22, 2022
Sharing some useful facts.
‘am sure criticism/appraisal can benefit from having them before us.
ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.గతేడాది నవంబర్ '2021లో చేసిన సుంకం తగ్గింపుతో సంవత్సరానికి రూ.1,20,000 కోట్లు. ఈ ఏడాది కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో కేంద్రానికి సంవత్సరానికి లక్షకోట్ల మేర ప్రభావం చూపుతుంది. ఈ రెండు సుంకాల కోతలపై కేంద్రానికి మొత్తం రాబడి ప్రభావం ఏడాదికి 2,20,000 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment