వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురుపై టన్నుకు రూ.23,230 అదనంగా ట్యాక్స్ విధించింది.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది.దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం బంగారంతో పాటు పెట్రోల్,డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ఎగుమతులపై ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేంద్ర నిర్ణయం వాహనదారులకు మరింత భారంగా మారనున్నాయి. ట్యాక్స్ పెంపుతో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫెక్ట్ ఉండదు
ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు బాగా పెరిగాయి. దేశీయ ముడి ఉత్పత్తిదారులు ముడి చమురును దేశీయ రిఫైనరీలకు అంతర్జాతీయ సమాన ధరలకు అమ్ముతున్నారు. ఫలితంగా దేశీయంగా ముడిచమురు ఉత్పత్తిదారులు లాభాలు ఆర్జిస్తున్నారు' అని ప్రభుత్వం తెలిపింది. "ఈ సెస్ దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు."అంటూ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment