petrol and diesel prices
-
చమురు ధరలు తగ్గాయ్.. కానీ ఏం లాభం!
ప్రపంచ ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ 2025 ప్రారంభంలో బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 2021 డిసెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. ముడి చమురు అవసరాల్లో 87 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఈ తగ్గుదల సైద్ధాంతికంగా ఇంధన ధరలను సైతం తగ్గించాలి. కానీ అందుకు భిన్నంగా తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచుతున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ తగ్గుదల కనిపిస్తున్నా ఏప్రిల్ 7, 2025 నాటికి ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77, డీజిల్ లీటరుకు రూ.87.67 వద్దే కొనసాగుతుంది. మార్చి నుంచి ఇదే ధరలు అమలవుతున్నాయి. 2024 నుంచి ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పడిపోయినప్పటికీ ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. పైగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం సోమవారం పెంచుతున్నట్లు తెలిపింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.క్రూడ్ డిమాండ్ అంచనాలు సవరణఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2024 మధ్య నుంచి తగ్గుముఖం పట్టాయి. అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి మందగించడంపై నెలకొన్న ఆందోళనలు డిమాండ్ అంచనాలను దెబ్బతీశాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ఇటీవల 2024, 2025 సంవత్సరాలకు చమురు డిమాండ్ వృద్ధి అంచనాను రోజుకు 2.11 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2.03 మిలియన్లకు సవరించింది. ఇది బలహీనమైన ప్రపంచ వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది. అదనంగా యునైటెడ్ స్టేట్స్ వంటి ఒపెక్ యేతర ఉత్పత్తిదారుల నుంచి బలమైన సరఫరా, చైనా వంటి మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడం క్రూడ్ ధరలు మరింత తగ్గేలా చేశాయి.పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, సెప్టెంబర్ 2024 నాటికి దుబాయ్, ఒమన్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 71 డాలర్లకు పడిపోయింది. రాయిటర్స్ డేటా ప్రకారం, 2025 ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 76.58 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ప్రకారం జనవరి చివరి నాటికి బ్యారెల్ 72.62 డాలర్ల వద్ద స్థిరపడింది. 2024 సెప్టెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతల తరువాత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు 2025 ప్రారంభం నుంచి 14.94% పడిపోయాయి.భారీ పన్నుల వ్యవస్థభారతదేశంలో ఇంధన ధరలు క్రూడాయిల్ క్షీణతకు అనుగుణంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రిటైల్ ఇంధన ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) నిర్ణయించిన బేస్ ధర, ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), డీలర్ కమిషన్లపై ఇంధన ధరలు ఉంటాయి. ఇంధనం రిటైల్ ధరలో పన్నులే సుమారు 50-60% వాటాను కలిగి ఉంటాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా ఫలితం లేకుండా పోతుంది.ఇదీ చదవండి: ‘మైక్రోసాఫ్ట్‌లో డిజిటల్ ఆయుధాల తయారీ’చమురు బాండ్లు2005-2010 మధ్య కాలంలో ముడిచమురు ధరలు అధికంగా ఉన్న సమయంలో ఇంధన ధరలను కట్టడి చేసేందుకు ఓఎంసీలకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేసింది. అందుకు వెచ్చించిన సుమారు రూ.1.3 లక్షల కోట్లు 2025-26 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం అధిక ఇంధన పన్నులను కొనసాగిస్తోంది. క్రూడాయిల్ బ్యారెల్‌కు 62-64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ ఆర్థిక అవసరాలతో ఇంధన ధరలను స్థిరంగా ఉంచుతోంది. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్‌లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్‌లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్‌లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్‌ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!
దేశంలో సెప్టెంబర్ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 2% ఉంది. డీజిల్ 1.7%, ఎల్పీజీ 4.5%, పెట్రోల్ ధరలు 5.8% సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్‌పీసీఎల్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన (పెట్రోల్, డీజిల్) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి 'పంకజ్ జైన్' వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే. అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాలు) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటోంది.ఇదీ చదవండి: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. భారత ప్రభుత్వం హెచ్చరికఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా తరువాత ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశంలోని మొత్తం చమురులో 80% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్‌కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా: కేంద్రమంత్రి
ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం ఇండియా అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ), డీలర్ల మధ్య మార్జిన్లకు సంబంధించి ప్రభుత్వం చర్చలను ప్రోత్సహిస్తోందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత్‌లో వీటి ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2024 మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ ధరలు 13.65 శాతం, డీజిల్ ధరలు 10.97 శాతం తగ్గాయి. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌లో 22.19 శాతం, జర్మనీలో 15.28 శాతం, ఇటలీలో 14.82 శాతం, స్పెయిన్‌లో 16.58 శాతం పెట్రోల్ ధర పెరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్ల విలువైన ఫ్లోటింగ్ ఆయిల్ బాండ్లను(పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ఓఎంసీ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు) జారీ చేసింది. దానికోసం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తోంది’ అని మంత్రి వివరించారు.డీలర్ల మార్జిన్ పెరుగుదలపై మంత్రి స్పందిస్తూ..‘ఇది ఓఎంసీలు, డీలర్లు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. జులై 1, 2024 నాటికి దేశంలో 90,639 అయిల్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందినవి. చివరిసారిగా 2017లో డీలర్ల మార్జిన్లు పెరిగాయి. ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాల్లోని కొన్ని షరతులు కొంత కఠినంగా ఉన్నాయని డీలర్లు కోర్టుకు వెళ్లారు. డీలర్ల మార్జిన్లు పెంచితే వారి ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు పెంచాల్సి ఉంటుంది. దీన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఓఎంసీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మధ్య చర్చలు సాగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన అపూర్వ చంద్ర కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం.. డీలర్ల మార్జిన్ రివిజన్ సిఫార్సులను ఓఎంసీలు నిలుపుదల చేస్తున్నాయి. వీటిని ఏటా జనవరి, జులైలో రెండుసార్లు సవరించాలి. ఈమేరకు ఓఎంసీలు, డీలర్ల మధ్య నవంబర్ 4, 2016న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, గత ఏడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఎలాంటి మార్జిన్లు పెంచలేదని డీలర్లు అంటున్నారు. -
గోవాలో ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్‌సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్‌సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 90 యూఎస్ డాలర్లకు చేరింది. కానీ భారత్‌లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్‌ఆన్ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్‌పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్, ఇరాన్‌ల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే.. ఎన్నికల వేళ ఆచితూచి.. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Petrol and Diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్జీసీఎన్ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
రష్యా తిరస్కరణ.. పెట్రోల్, డీజిల్ ధరలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి!
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారీ నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ రష్యాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాయితీపై ముడి చమురు సరఫరా చేసిన రష్యాను మరింత తగ్గించాలని కోరగా రష్యా తిరస్కరించింది. పాకిస్తాన్‌కు చెందిన ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక ప్రకారం.. రష్యాను దీర్ఘకాల చమురు ఒప్పందాన్ని ఖరారు చేయాలని కోరింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన తమకు బ్యారెల్ ముడి చమురు గరిష్టంగా 60 డాలర్లకే విక్రయించాలని అభ్యర్థించింది. ఇది భారత్ విక్రయించిన దానికంటే దాదాపు 6.8 డాలర్లు తక్కువ. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత జులైలో రష్యా చమురు సగటు ధర బ్యారెల్‌కు 68.09 డాలర్లు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు చమురు ధరలపై మరిన్ని తగ్గింపులను పొందాలని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు, ఓడరేవులో వసూలు చేసే వాస్తవ ధర అయిన 'ఫ్రీ ఆన్ బోర్డ్' (FOB) ఒక బ్యారెల్‌కు 60 డాలర్లు బెంచ్‌మార్క్‌గా నిర్ణయించాలని పాకిస్తాన్ కోరింది. అంటే పాకిస్థాన్‌కు ఎగుమతి చేసే చమురు సరుకు రవాణా ఖర్చును కూడా భరించాలని అభ్యర్థించింది. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పాకిస్తాన్లో ఆగస్ట్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను రెండుసార్లు పెంచడం గమనార్హం. సెప్టెంబర్ ప్రారంభంలో, అన్వర్ ఉల్ హక్ కకర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు (పాకిస్తానీ రూపాయల్లో) రూ.14.91, రూ.18.44 చొప్పున పెంచింది. ప్రస్తుతం (అక్టోబర్ 19) ఆ దేశంలో సూపర్ పెట్రోల్ ధర లీటరు రూ. 283.38, హైస్పీడ్ డీజిల్ ధర లీటరు రూ. 304.05 ఉంది. గతంలో రాయితీ ఈ ఏడాది జూన్‌లో అప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రాయితీపై రష్యా ముడి చమురు మొదటి రవాణా కరాచీకి చేరుకుంది. మీడియా నివేదిక ప్రకారం.. మాస్కో ఒక నెలలో 1,00,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఒక కార్గోను రవాణా చేసింది. ఆ చమురు కోసం సరుకు రవాణా ఖర్చు కూడా రష్యా చెల్లించింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్‌లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా?
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎన్‌సిఆర్‌కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్ప్లాట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్‌లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం ప్లాస్టిక్ ధరలు, లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం. ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్‌తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.బీఎన్పీ పారిబాస్ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న డాబర్ , మారికో లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అక్టోబర్ 6 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.58 డాలర్లు ఉండగా, ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్‌లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది. -
పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు
Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆల్ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్ కరెన్సీ 305.6 వద్దకు చేరింది. -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్‌ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్‌కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్‌కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్‌కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్‌ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా బ్యారెల్‌పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్‌ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్‌ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్‌కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
వాహనదారులకు భారీ షాక్! పెట్రో ఎగుమతులపై ట్యాక్స్ పెంపు!
వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురుపై టన్నుకు రూ.23,230 అదనంగా ట్యాక్స్ విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది.దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం బంగారంతో పాటు పెట్రోల్,డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ఎగుమతులపై ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేంద్ర నిర్ణయం వాహనదారులకు మరింత భారంగా మారనున్నాయి. ట్యాక్స్ పెంపుతో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫెక్ట్ ఉండదు ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు బాగా పెరిగాయి. దేశీయ ముడి ఉత్పత్తిదారులు ముడి చమురును దేశీయ రిఫైనరీలకు అంతర్జాతీయ సమాన ధరలకు అమ్ముతున్నారు. ఫలితంగా దేశీయంగా ముడిచమురు ఉత్పత్తిదారులు లాభాలు ఆర్జిస్తున్నారు' అని ప్రభుత్వం తెలిపింది. "ఈ సెస్ దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు."అంటూ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. -
అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్‌తో ఫిదా!
కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లో ఒక ఆటో డ్రైవర్ డాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్రహమాన్ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. #SriLanka: The petrol queue dance (to @arrahman's music from 1994) - received via whatsapp. Hoping to see him sometime when I'm in line. #lka #SriLankaEconomicCrisis pic.twitter.com/e42hiiLWmi — Meera Srinivasan (@Meerasrini) June 16, 2022 -
రికార్డ్ స్థాయికి చమురు: పేలనున్న పెట్రో బాంబు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి. ఫలితంగా రష్యా ముడి చమురు దిగుమతి మరింత కఠినతరం కానుంది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద ఆంక్షలు, నిషేధాజ్ఞలు తీవ్రం కావడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 124 డాలర్లకు చేరడానికి దారి తీసిందీ పరిస్థితి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధరల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి దేశీయ ధరలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం దేశీయ ఇంధన రంగం కూడా ప్రభావితం కానుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల కార్యకలాపాల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం, త్రైమాసికంలో 7.40 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ 50లో 5 శాతానికి పైగా పతనంతో పోలిస్తే 2022లో బిఎస్ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 7.5 శాతం లాభపడింది. అలాగే ఇండియాలోని రెండు చమురు ఉత్పత్తిదారులు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల మార్చి త్రైమాసికంలో నికర లాభం వరుసగా 21 శాతం, 207 శాతం జంప్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనపుడు ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు అటూ ఇటూ కద లాడింది. మధ్యలో కాస్త శాంతించినప్పటికీ రష్యన్ చమురు ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ తాజా ఆంక్షలతో మళ్లీ బ్యారెల్ 124 డాలర్ల మార్కుకు ఎగిసింది. దీంతో పెట్రోలు ధరలు మరింత పుంజుకోనున్నా యనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం పన్నులను తగ్గించిన్పటికీ అంతర్జాతీయ ప్రభావంతో దేశీయంగా మళ్లీ పెట్రో వాత తప్పదనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు చమురు ధరలు బ్యారెల్ 110 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెద్ద ముప్పే అంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దావోస్‌లో వ్యాఖ్యలును గుర్తు చేసుకుంటున్నారు. -
పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ..ఎక్కడంటే?
గత వారం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది. పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలివే ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో ఛండీఘడ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20కి,డీజిల్ ధర రూ.6.57 తగ్గడంతో రూ.84.26కి చేరింది. దీంతో పాటు పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలిలా ఉన్నాయి. పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.41 గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 హర్యానాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.5 అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96 జమ్మూ- కశ్మీర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 ఉత్తరా ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.8 జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.5గా ఉంది. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే! 1/ Good to see the interest generated by @PMOIndia @narendramodi ‘s decision yesterday to bring an Excise Duty cut on petrol and diesel. Sharing some useful facts. ‘am sure criticism/appraisal can benefit from having them before us. — Nirmala Sitharaman (@nsitharaman) May 22, 2022 ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.గతేడాది నవంబర్ '2021లో చేసిన సుంకం తగ్గింపుతో సంవత్సరానికి రూ.1,20,000 కోట్లు. ఈ ఏడాది కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో కేంద్రానికి సంవత్సరానికి లక్షకోట్ల మేర ప్రభావం చూపుతుంది. ఈ రెండు సుంకాల కోతలపై కేంద్రానికి మొత్తం రాబడి ప్రభావం ఏడాదికి 2,20,000 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
గుడ్‌న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
ధరల దెబ్బ..! దేశంలో భారీగా పడిపోతున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
ఆదాయం..ఆవ గింజలా ఉంటే.. ఖర్చు కొండలా మారింది. దీంతో తోడు పెరిగిపోతున్న నిత్యవసర ధరలతో పాటు..సరుకు రవాణాకు లింకై ఉండడంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాన్యులు ఒక్కోరూపాయి లెక్కలేసుకొని మరి ఖర్చు చేస్తున్నారు. దీంతో గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. అలాగే మహమ్మారి సమయంలో గ్యాస్ వినియోగం వృద్ధి పెరిగింది. అయినప్పటికీ తాజాగా గ్యాస్ డిమాండ్ తగ్గింది. వంట గ్యాస్ ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల వినియోగంలో నెలవారీగా 1.7శాతం క్షీణించింది.పెరుగుతున్న ధరలతో ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1శాతం అధికంగా ఉంది. అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6శాతం అయితే, మార్చి 2022 మొదటి 15 రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7శాతం తగ్గింది. ఇంకా, దేశంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్ ఏప్రిల్ మొదటి 15రోజుల వరకు 7.4 అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8% ఎక్కువ. అయితే ఈ ఇంధన వినియోగం మార్చి 1 నుంచి 15 రోజుల మధ్య 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతానికి పడిపోయింది. -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతుంది. ఇక సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 30పైసలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.35 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది ముంబైలో లీటర్ పెట్రోల్ధర రూ.113.88 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.98.13 గా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11 ఉండగా.. డీజిల్ ధర రూ.90.42గా ఉంది కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.93.57గా ఉంది. -
వినూత్న నిరసన.. ఇళ్ల ముందు 31న డప్పులు కొడుతూ బెల్స్ మోగించండి..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ పోరుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా.. మార్చి 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లు ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకొని, డప్పులు కొడుతూ బెల్స్ మోగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో లీటరు పెట్రోల్ ధర రూ.29లు, డీజిల్ ధర రూ.28.58లు పెంచారని స్సష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.3.20 పెంచారని మండిపడ్డారు. మరోవైపు.. ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 531శాతం, పెట్రోల్‌పై 203 శాతం పెంచినట్టు ఆరోపించారు. -
సామాన్యుడికి చుక్కలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్, డీజిల్ వాత కొనసాగుతోంది. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలు పెంచాయి. దీంతో శనివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 89పైసలు, డీజిల్‌పై 86పైసలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నట్లు సమాచారం. దేశంలో పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.98.10గా ఉంది విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.99.56 పైసలుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.61పైసలు ఉండగా డీజిల్ ధర రూ.89.87 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.97.55పైసలుగా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.43పైసలు ఉండగా డీజిల్ ధర రూ.94.47పైసలుగా ఉంది బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.88.14పైసలుగా ఉంది -
వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
-
వాహనదారులకు భారీ షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. చివరి సారిగా డీజిల్,పెట్రోల్ ధరలు గతేడాది నవంబర్ 4వరకు పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరూ.110గా ఉండగా డీజిల్ ధర రూ.96.36 పైసలుగా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.08 ఉండగా డీజిల్ ధర రూ.98.10పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.99 ఉండగా డీజిల్ ధర రూ.97.90పైసలుగా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.87.47పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00పైసలుగా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51 ఉండగా డీజిల్ ధర రూ.90.62పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.16 ఉండగా డీజిల్ ధర రూ.92.19పైసలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42 ఉండగా డీజిల్ ధర రూ.85.80పైసలుగా ఉంది. -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
మన దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువ.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాలలో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగితే భారతదేశంలో కేవలం ధరలు 5 శాతం పెరిగాయని సభకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేడు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తే మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని అని అన్నారు. "మేము గత ఏడాది సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. కానీ, మహారాష్ట్ర & కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదు. చమరు ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" మంత్రి తెలిపారు. "కరోనా మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, స్పెయిన్ దేశాలలో పెట్రోల్ ధరలు 50, 55 & 58 శాతం పెరిగితే.. భారతదేశంలో చమరు ధరలు 5 శాతం మాత్రమే పెరిగాయి. ఇందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. ముడి చమురుపై రష్యా అందిస్తున్న డిస్కౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం(సెస్‌లతో సహా) విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం వివరాలను మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. 2018-29లో సేకరించిన మొత్తం సుంకం రూ.2.14 లక్షల కోట్లు అయితే, 2019-20లో ఇది రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020-21లో ఈ మొత్తం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సేకరించిన మొత్తం సుంకం రూ.1.71 లక్షల కోట్లు వసూలు అయినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. (చదవండి: రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!) -
అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఇక రష్యా-ఉక్రెయిన్ వార్తో క్రూడాయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. కాగా భారత ప్రభుత్వం క్రూడాయిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకుగాను ఫ్లెక్స్ ఫ్యుయల్(మిశ్రమ ఇంధనం) వాహనాల తయారీపై ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల తయారీపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలను చేశారు. తయారీకి సిద్దం..! వచ్చే ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీని ప్రారంభిస్తామని ఆటోమొబైల్ కంపెనీల ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తెలిపారు. ఈటీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ...100 శాతం స్వచ్ఛమైన ఇంధన వనరుల నుండి ప్రజా రవాణాను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికపై పని చేస్తుందని చెప్పారు. వాహన దారులకు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే సగం ధరకే ఇంధనం లభిస్తోందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. త్వరలో 100 శాతం ఇథనాల్‌తో.. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల తయారీ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆటోమొబైల్ కంపెనీలతో సమావేశాలను ముమ్మరం చేశారు. గత వారం అన్ని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు సియం(ఎస్ఐఏఎం) ప్రతినిధులతో సమావేశమయ్యానని తెలిపారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల తయారీని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయా కంపెనీలు హామీ ఇచ్చారన్నారు. ఇక భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వాహనాలు 100 శాతం ఇథనాల్‌తో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. కాగా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల తయారీని ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ అంటే..! ఫ్లెక్స్-ఫ్యుయల్ అనేది గ్యాసోలిన్ ,మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం నుంచి తయారైన ప్రత్యామ్నాయ ఇంధనం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలపడంతో ఫ్లెక్స్ ఫ్యుయల్ తయారవుతుంది. పెట్రోల్ కంటే దీని ధర తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో చాలా చోట్ల ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులో ఉంది.దీని ధర లీటరు రూ. 70 కంటే తక్కువగా ఉంది. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్! -
బండి నడపాలంటే భయమేస్తుంది..14ఏళ్ల తర్వాత రికార్డ్ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు!!
ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంతో ఇరు దేశాలు భారీగా నష్టపోతున్నాయి. అయినా పట్టు సాధించేందుకు దాడుల్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడే ఇదే అంశం ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా ఉక్రెయిన్- రష్యా సంక్షోభంతో అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. మార్చి10న పెట్రోల్ ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరాయి. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ అత్యధికంగా 4.31 డాలర్లకు (అంటే రూ.329కి) చేరింది. 2008 జూలై 17న ఓ గ్యాలన్ పెట్రోలు ధర 4.11 డాలర్లు ఉండేది. ఆ రికార్డు తాజాగా చెరిగిపోయింది. అమెరికాలో ఓ గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. కాబట్టి ఓ లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.86.97కు చేరింది. డీజిల్ గ్యాలన్ ధర సైతం రికార్డ్ స్థాయిలో 5.05శాతం డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికన్లు ప్రెసిడెంట్ జోబైడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి నడపాలంటే భయమేస్తుందని, సామాన్యుల్ని కాపాడాలని వరుస ట్వీట్లు చేస్తున్నారు. యూఎస్‌లో ఇంధన ధర యూఎస్‌లో పెట్రోల్, డీజిల్‌ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో రూపంలో అమ్ముతారు. అంటే యూఎస్‌లో గ్యాలన్ అంటే 3.78లీటర్లకు సమానం. కాబట్టి యుఎస్‌లో లీటర్ పెట్రోల్,యుఎస్ గ్యాలన్ను లీటర్‌గా, డాలర్లను రూపాయిలుగా మార్చినప్పుడు రూ.86.97 గా ఉంది. అంటే ఇది మనదేశంలో నెలరోజులుగా అమ్ముతున్న పెట్రోల్ ధరల కంటే తక్కువగా ఉంది. శ్రీలకంలో ఏకంగా ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పాటు శ్రీలంకలో సైతం పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ఇటీవల శ్రీలంకకు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఎల్ఐఓసీ) ఒకే నెలలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచగా.. తాజాగా తాజాగా ఎల్ఐఓసీ ఒకేరోజు డీజిల్ పై రూ.75, పెట్రోల్ పై రూ.50 భారీగా పెంచింది. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు కేంద్రం ప్రభుత్వం అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో చాలా మంది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే, కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ఉండటానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ప్రపంచ ముడిచమురు ధరల ప్రభావం నుంచి వినియోగదారులను రక్షించడానికి డీజిల్, పెట్రోల్ విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.10-12 తగ్గించాల్సి అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదని మాజీ ఆర్థిక కార్యదర్శి తెలిపారు. "ఆదాయంపై ప్రభావం పడకుండా చమురు రిటైల్ ధరలు తగ్గే మార్గం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 నుంచి రూ.12కు తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం వేరే మార్గం లేదు" అని సుభాష్ చంద్ర గార్గ్ సీఎన్ బిసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మార్చి 7న బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధరలు 139 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యన్ చమురుపై నిషేధాన్ని విధిస్తాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఇది దేశీయ ఇంధన ధరలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. చమురు ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్పణం పెరిగి జీడిపీ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది అని సుభాష్ అన్నారు. (చదవండి: అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్‌తో మాట మార్చిన అమెరికా?) -
రూ.60 పెంచి.. రూ.5 తగ్గిస్తారా?
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు. రూ.60 పెంచి రూ.5 తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు పెట్రోల్ ధరలపై నిరసన తెలుపుతామన్నారు. ఏపీలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పని తీరు సరిగా లేదని ఆరోపించారు. రష్యా విప్లవం విజయవంతమైన రోజును పురస్కరించుకుని లెనిన్ చిత్రపటానికి పార్టీ నాయకులు రామకృష్ణ, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, వై.చెంచయ్య, నార్లవెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు. -
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘వ్యాట్’ తగ్గింపు.. మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం అదేబాటలో నడిచాయి. తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించాయి. దీంతో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత కిందికి దిగొచ్చాయి. కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా నగర్ హవేలి, డయ్యూడామన్, చండీగఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లద్ధాఖ్‌లో ‘వ్యాట్’ తగ్గింది. కాంగ్రెస్-దాని భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలు, ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజస్తాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వ్యాట్ వాత యధాతథంగా కొనసాగుతోంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత దేశంలోనే అత్యధికంగా రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.111.10, డీజిల్ రూ.95.71, ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14 పలుకుతోంది. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా మిజోరాంలో లీటర్ డీజిల్ ధర రూ.79.55కు చేరింది. చదవండి: (మాజీ మంత్రిని నిర్బంధించిన రైతులు.. చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే..) -
పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా తగ్గించాలి
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను ఇంకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు. శుక్రవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ...‘పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా ఏం తగ్గించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్డ్యూటీ రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలి. ఎల్పీజీ రేట్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. నవంబర్ 14 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామ’ని అన్నారు. (చదవండి: పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం) కాగా, గతకొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు సతమతవుతున్నారు. చమురు ధరల అనూహ్య పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర సర్కారు స్వల్పంగా ఎక్సైజ్డ్యూటీ తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే ఇంకాస్త తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. (వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం.. ఎంతంటే?) -
‘ఆ ఎన్నికలు అయిపోగానే ఇంధన ధరలు పెంచుతారు’
లక్నో: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించి.. ప్రజలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తిరిగి ఇంధన ధరలు పెంచుతారని తెలిపారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. దాన్ని నివారించడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది’’ అని తెలిపారు. (చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!) ‘‘తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో కాలం ఉండవు. 2022లో యూపీ ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరు 50 రూపాయలకు తగ్గిస్తే.. అప్పుడు ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ఇక శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర 50 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! -
పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. నింగిలోకి దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా బుధవారం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వీటిపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ తగ్గింపు గురు వారం నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ.5, డీజిల్ ధర రూ.10 చొప్పున తగ్గనుంది. కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు కొంత తగ్గడంతో ప్రజలకు ఆ మేరకు ఊరట లభించనుంది. వ్యవసాయ రంగానికి మేలు డీజిల్ ధర దిగి రావడం వ్యవసాయ రంగానికి ఎంతగానో మేలు చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘లాక్డౌన్ కాలంలోనూ రైతులు తమ శ్రమ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తోడ్పాటు అందించారు. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రాబోయే రబీ సీజన్లో రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఇంధనాల కొరత కనిపించింది. ధరలు పెరిగాయి. మన దేశంలో ఇంధనాల కొరత తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. దేశ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్–19 వ్యాప్తి వల్ల డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. తయారీ, సేవలు, వ్యవసాయం తదితర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇంధనాల వినియోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది..’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. డీజిల్ రేటు తగ్గడం వల్ల పంటల సాగుకు పెట్టుబడి వ్యయం స్వల్పంగానైనా తగ్గనుంది. తద్వారా రైతాంగంపై కొంత భారం దిగిపోయినట్లే. కాగా వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, లీటర్ డీజిల్‌పై రూ. 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ (సెస్‌లతో కలిపి) విధిస్తోంది. ఇందులో నుంచి పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించనుంది. దీని ప్రభావం మన రాష్ట్ర పన్నులపై కూడా పడనుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.6.81, డీజిల్‌పై రూ.12.73 తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.107.37 ధరలు ఉండగా, తగ్గిన సుంకంతో పెట్రోల్ రూ.107.66కు, డీజిల్ రూ.94.64కు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.04 నుంచి రూ.105.04కు, డీజిల్ రేటు రూ.98.42 నుంచి రూ.88.42కు తగ్గిపోనుంది. ఎన్నికల్లో పరాజయాలతో అప్రమత్తం దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.100 మార్కును ఎప్పుడో దాటేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అయితే లీటర్ పెట్రోల్ రేటు రూ.120కి చేరింది. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ప్రజాగ్రహాన్ని గుర్తించిన కేంద్రం ఒక మెట్టు కిందికి దిగిరాక తప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిశీలిస్తే ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.8,700 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే సంవత్సరానికి రూ.లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలానికి రూ.43,500 కోట్ల నష్టం వాటిల్లనుంది. -
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
ఆగని పెట్రో బాదుడు: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతుంది. బుధవారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెంచడం సామాన్యులకు మోయలేని పెనుభారంగా మారింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.08 ఉండగా డీజిల్ ధర రూ.99.75గా ఉంది. వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.100.1 ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 108.93 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.61 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.94.49 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.46 ఉండగా లీటర్ డీజిల్ రూ.95.90 ఉంది. -
స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే?
వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడింది.ఆదివారం పెట్రోల్‌పై 25 పైసలు,డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం పెట్రో ధరలు పెరగకపోవడంతో పోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
మరోసారి పెరిగిన పెట్రో ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది ► ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా డీజిల్ ధర రూ. 97.84 ఉంది ► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.106కి చేరింది, లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08 ఉంది ► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.06కి పెరిగి రూ.108.67కి చేరింది, లీటర్ డీజిల్ ధర రూ.1.06 పెరిగి రూ.100.39కు ఉంది ► వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధరపై 0.82పైసలు పెరిగి రూ.107.51కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.99.28 ఉంది. -
పెట్రో ధరలు తగ్గింపుపై రాని స్పష్టత, ఇంధనం ఆదా చేసే కార్లకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: పనితీరుపై రాజీపడకుండా ఇంధనాన్ని మరింత ఆదా చేసే వాహనాల తయారీపైనే ఇకపైనా దృష్టి పెడతామని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కొనుగోలుదారులు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. పర్యావరణ హితమైన, ఇంధనం ఆదా చేసే విధమైన కార్లకు మారుతీ కట్టుబడి ఉందని తెలియజేసే కమ్ సే కామ్ బనేగా (కాస్త ఇంధనం సరిపోతుంది) పేరిట కొత్త ప్రచార కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. ఇంధన ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలేమీ కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో కస్టమర్లు మెరుగైన మైలేజీనిచ్చే వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి మరింత కఠినతరమైన కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో అన్ని ఆటోమొబైల్ కంపెనీలూ ఇంధనం ఆదా చేసే వాహనాలను తప్పనిసరిగా తయారు చేయాల్సి రాగలదని శ్రీవాస్తవ చెప్పారు. స్మార్ట్ హైబ్రిడ్, ఎస్–సీఎన్జీ, కె–సిరీస్ ఇంజిన్లు మొదలైన వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ఊతంతో గడిచిన దశాబ్ద కాలంలో తమ వాహనాల సామర్థ్యాన్ని దాదాపు 30% దాకా మెరుగుపర్చామని ఆయన తెలిపారు. ‘ఇంధనం ఆదా చేసే కార్లకు సంబంధించి మేము వివిధ విభాగాల్లో లీడర్లుగా ఉన్నాం. ఆల్టో, వ్యాగన్ ఆర్, బాలెనో స్మార్ట్ హైబ్రిడ్, డిజైర్, సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఈకో తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి‘ అని శ్రీవాస్తవ చెప్పారు. అధిక మైలేజీ, మెరుగైన పనితీరుకు పేరొందిన కే–సిరీస్ ఇంజిన్లు అమర్చిన కార్లు 70 లక్షలకు పైగా విక్రయించామని చెప్పారు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
వాహనదారులకు షాకింగ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పన్నెండు రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాహనదారులకు మరోసారి ఇక్కట్లు మొదలుకానున్నాయి. పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల ఇంధన రిటైల్ విక్రయ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ భారీగా పెరిగిన బారెల్ ధరలు...! అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆగస్టు సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 4-6 డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలపై ఇప్పటివరకు చమురు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఇదే స్థాయిలో ఉంటే..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చివరగా ఈ ఏడాది జూలై 15, 17 తేదిల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్, డిజీల్ ధరలు వరుసగా రూ.101.19, రూ. 88.62 గా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే సగటు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆగస్టులో బ్యారెల్‌కు మూడు డాలర్లకంటే తక్కువగా నమోదయ్యాయి. యుఎస్, చైనా మిశ్రమ ఆర్థిక డేటా, వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ కారణంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రకారం, జూలై 18 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ రిటైల్ ధరలను వరుసగా లీటరుకు రూ. 0.65,రూ. 1.25 కు తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాలతో ముడి చమురు ధరలు ఆగస్టు చివరి వారం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
పెట్రోల్ విషయంలో సామాన్యులకు మరోసారి నిరాశ!
లఖ్‌నవూలో ఈ రోజు జరిగిన 45వ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు అడిగిన విధంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కౌన్సిల్ చర్చినట్లు పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేధించనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితో పాటు సెప్టెంబర్ 30 వరకు వర్తించే కోవిడ్-19 సంబంధిత ఔషధాలపై రాయితీ జీఎస్టీ రేట్లు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, క్యాన్సర్ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు. (చదవండి: మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ బైక్ : ధర?) -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
దేశంలో పెట్రో ధరలు,19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం జాతీయ మార్కెట్లపై పడింది. దీంతో గత ఆదివారం నుంచి ఈ రోజు(శుక్రవారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెరిగింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ధర 9 సార్లు పెరగ్గా.. డీజిల్ ధర 5 సార్లు తగ్గింది. పెట్రోల్ ధర 39 సార్లు, డీజిల్ ధర 36 సార్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరిగింది. అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర లీటరు రూ .100 దాటింది. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, పంజాబ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక శుక్రవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Petrol Diesel Prices: వాహనదారులకు స్వల్ఫ ఊరట
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
Petrol Diesel Prices ముంబై: ఇంధన ధరల్లో స్వల్ఫ ఊరట. డీజిల్ ధర లీటర్‌కు 15 నుంచి 17 పైసలు తగ్గింది. అయితే పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. సోమవారం లీటర్‌కు 25 నుంచి 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.97.33పై.గా ఉన్న లీటర్ డీజిల్ ధర.. ప్రస్తుతం 97.19పై.కి చేరింది. ఇక పెట్రోల్ మాత్రం రూ.107.24పై. చేరుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత డీజిల్ ధరలో తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం. మే 4 నుంచి పెట్రోల్ ధరపై ఇది 39వ పెంపు. ఇప్పటికే రాష్రా్టలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 16 చోట్ల పెట్రోల్ రేట్లు సెంచరీ దాటేశాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 105కి చేరుకోగా, లీటరు డీజిల్ స్వల్ఫంగా తగ్గి రూ.97.86పై. కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో.. పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. రాబోయే రోజుల్లో.. ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుండడంతో పెట్రో మంటలను అదుపు చేయలేకపోతున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ ‘కొత్త’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని, అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారాయన. -
11న పెట్రోల్ బంక్‌ల ముందు నిరసన: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంక్‌ల ముందు ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 5 నెలల్లోనే 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, దీనికి నిరసనగా కోవిడ్ నిబంధనల అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. -
Petrol, diesel price today: పెట్రో ధరల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం మరింత ఎగిసాయి. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటేసిన పెట్రోలు ధరలు రికార్డు స్తాయిల వద్ద వాహన దారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా పెట్రోల్‌పై లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 95.37 ,డీజిల్ ధర రూ. 86.28 పలుకుతోంది. ఫలితంగా గడిచిన నెల రోజుల్లో పెట్రోలు 5 రూపాయలు, డీజిల్ 6 రూపాయలు పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు , డీజిల్ ధర లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ.101.52 , డీజిల్ రూ. 93.58 చెన్నైలో పెట్రోల్ రూ. 96.71, డీజిల్ రూ. 90.92 కోల్‌కతాలో పెట్రోల్ రూ.95.28, డీజిల్ రూ.89.07 హైదరాబాదులో పెట్రోల్ రూ .99.06 డీజిల్ రూ. 93.99 ఆరు రాష్ట్రాల్లో సెంచరీ ఆదివారం పెట్రోల్ లీటరుకు 21 పైసలు, డీజిల్ 20 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్‌లు ఉన్నాయి. మే 4 నుంచి ధరలు పెరగడం ఇది 21వ సారి కావడం గమనార్హం. మొత్తంగా పెట్రోల్ ధర రూ. 4.97 పెరగ్గా, డీజిల్ ధర రూ. 5.55 పెరిగింది. -
Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్!
సాక్షి, ముంబై: పలు నగరాల్లో సెంచరీ మార్క్‌ను దాటి పరుగులు పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహనదారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపులో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర 101 మార్క్‌ను తాకింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు,డీజిల్ 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర. 94.76, డీజిల్ ధర. 85.66గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో లీటరు పెట్రోలు ధర 100 మార్కును ఇప్పటికే అధిగమించిన సంగతి తెలిసిందే. పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ ధర రూ. 100.98 , డీజిల్ 92.99 చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 96.23, డీజిల్ ధర. 90.38 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 94.76, డీజిల్ రూ. 88.51 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.98.48, డీజిల్ రూ. 93.38 అమరావతిలో పెట్రోల్ ధర రూ. 100.93, డీజిల్ రూ. 95.23 వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ. 99.69, డీజిల్ రూ. 94.03 చదవండి: దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
Petrol, Diesel Prices: వరుసగా రెండో రోజూ బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న ఇంధన ధరలను వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. మంగళవారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.49, లీటర్ డీజిల్ రూ.85.38కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101కి చేరువైంది. అటు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69 చెన్నైలో పెట్రోల్ రూ.95.99, డీజిల్ రూ.90.12 కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.50, డీజిల్ రూ.88.23 బెంగళూరులో పెట్రోల్ రూ.97.64, డీజిల్ రూ.90.51 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.20, డీజిల్ రూ.93.08 అమరావతిలో పెట్రోలు రూ. 100.72, డీజిల్ రూ. 94.99 వైజాగ్‌లో పెట్రోలు రూ. 99.42, డీజిల్ రూ. 93.73 చదవండి : లాభాల జోరు: సరికొత్త గరిష్టానికి నిఫ్టీ -
పెట్రో ధరలు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒకరోజు వ్యవధిలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెలలో వరుసగా పదిసార్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.83.51కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.99.14, డీజిల్, రూ.90.71కు పెరిగింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.80, డీజిల్ రూ.96.30కి చెరింది. ► కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.92, డీజిల్ రూ.86.35 ► చెన్నైలో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.34 ► హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04 ► జైపూర్‌లో పెట్రోల్ రూ.99.30, డీజిల్ రూ.92.18 ► బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53 (చదవండి:India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!) -
పెట్రో సెగ: మరోసారి సెంచరీ కొట్టిన పెట్రోలు
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు చొప్పున పెంచుతూ చముర కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోలు ధర రూ.100 మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి 100 రూపాయలను దాటి వాహన దారులను బెంబేలెత్తించింది. రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకు రూ .102.15 ను తాకింది. ఇక్కడ డీజిల్ రేటు రూ .94.62 గా ఉంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ .101.86 వద్ద ఉండగా, లీటరు డీజిల్ రేటు రూ. 92.90గా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు 102 రూపాయలను తాకడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 91.27, డీజిల్ రూ. 81.73 ముంబైలో పెట్రోల్ రూ .97.61, డీజిల్ రూ .88.82 కోల్‌కతాలో పెట్రోల్ రూ .91.41, డీజిల్ రూ .84.57 చెన్నైలో పెట్రోల్ రూ .93.15, డీజిల్ రూ .86.65 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ .94.86, డీజిల్ రూ .89.11 అమరావతిలో పెట్రోల్ రూ .97.42 డీజిల్ రూ .91.12 -
పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వాహనదారులు భయపడినట్టే అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతి రోజు నుంచి పెట్రో బాదుడు తప్పదన్న అంచనాల కనుగునే వరుసగా మూడో రోజు గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. లీటర్ పెట్రోలుపై .25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99, డీజిల్ రూ.81.42కు చేరింది. ప్రధాన నగరాల్లో లీటరుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్ రూ.88.49 చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.35 కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.14, డీజిల్ రూ.84.26 బెంగళూరులో పెట్రోల్ రూ.94.01, డీజిల్ రూ.86.31 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.57, డీజిల్ రూ.88.77 అమరావతిలో పెట్రోల్ రూ.97.14, డీజిల్ రూ.90.79 విశాఖపట్టణం పెట్రోల్ రూ.95.90, డీజిల్ రూ.89.59 విజయవాడపెట్రోల్ రూ .96.72, డీజిల్ రూ. 90.41 చదవండి : కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
Petrol Diesel Prices Hike: వరుసగా రెండో రోజు పెట్రో బాదుడు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. కొంతకాలంగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలుపై 30 పైసలు, డీజిల్ 21 చొప్పున ధర పెరిగింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరగా, డీజిల్ ధర రూ. 80.91కి చేరింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.12, డీజిల్ రూ .88.19 చెన్నై పెట్రోల్ రూ .92.70, డీజిల్ రూ .86.09 కోల్‌కతాలో పెట్రోల్ రూ .90.92, డీజిల్రూ .83.98 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 94.34.డీజిల్ ధర రూ.88.46 అమరావతిలో పెట్రోల్ ధర రూ. 96.90.డీజిల్ ధర రూ.90.50 విజయవాడలో పెట్రోల్ ధర రూ. 96.49 డీజిల్ ధర రూ.90.11 -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలుపై లీటరుకు 22 పైసలు , డీజిల్‌పై లీటరుకు 23 పైసలు చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.98, డీజిల్ ధర 87.96 కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.77 డీజిల్ ధర రూ 83.75 (సోమవారం ధర కంటే 23 పైసలు) చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58(19 పైసలు తగ్గింది) డీజిల్ ధర రూ. 85.88 22 పైసలు తగ్గింది హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్ రూ. 88.20 అమరావతి పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్ ధర రూ. 90.28 -
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు చేరింది. డీజిల్ 20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10 స్థాయికి చేరింది. వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ. 97.19, డీజిల్ ధర 88.20 చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10 కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98 బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.39 డీజిల్ రూ.88.45 అమరావతి పెట్రోల్ రూ.96.99, డీజిల్ రూ.90.52 -
వాహనదారులకు ఊరట : దిగొచ్చిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి కాలం దాకా వాహనదారులకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ఊరటనిస్తున్నాయి. వరుసగా 24 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోలు ధర నేడు (మార్చి 24 బుధవారం) లీటరుకు18 పైసలు,డీజిల్‌పై 17 పైసలు చొప్పున తగ్గాయి. ఫిబ్రవరి 27 న పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర.91.17 నుండి. 90.99 కు , డీజిల్ 17 పైసలు తగ్గి లీటరుకు. 81.47 నుండి. 81.30కు చేరింది. వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోలు ధర రూ. 97.40 డీజిల్ ధర 88.42 చెన్నైలో పెట్రోలు ధర 92.95 డీజిల్ ధర86.29 కోల్‌కతాలో పెట్రోలు ధర 91.18 డీజిల్ ధర 84.18 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.61 , డీజిల్ ధర రూ.88.67 అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14 , డీజిల్ ధర రూ.90.67 కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి. అయితే బుధవారం మాత్రం పైకి చూస్తున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి, బ్యారెల్ 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.95 డాలర్లకు చేరుకుంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై బ్యాడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
న్యూఢిల్లీ: విరామమెరుగక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా అదేం లేదు ప్రజల ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు రిజర్వ్ బ్యాంక్, ప్రతిపక్షాలు చేసిన సలహాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతటితో ఆగకుండా బీమా రంగంలో ప్రైవేటుపరం చేసే చర్యలను కార్యరూపం దాల్చారు. పార్లమెంట్లో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను జీఎస్టీ మండలి పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 2017 జూలై 1వ తేదీన వచ్చిన జీఎస్టీలో పెట్రోలియం ఉత్పత్తులను చేరిస్తే ధరలు తగ్గుతాయని అందరూ చెబుతున్నారు. అయినా కూడా కేంద్రం పెడచెవిన పెట్టేసింది. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఒక కేంద్రమంత్రి చలికాలం అయిపోగానే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అదీ కూడా ఇప్పుడు లేదని పేర్కొంటున్నారు. తాజాగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల ప్రవేశంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం మొత్తం 74 శాతం బీమా రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లును ఆమోదం పొందితే బీమా రంగంలో కూడా ప్రైవేటు శక్తులు ఆధిపత్యం చలాయించనున్నాయి. -
పెట్రోధరలపై స్పందించిన నిర్మలా సీతారామన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి 'ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని అని అన్నారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం" అని శక్తికాంత దాస్ అన్నారు. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి! -
ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే చమురు ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజానీకం బయటకి వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరల తగ్గింపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఏదైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ సీజన్ గడిస్తే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం చమురు ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు అధికంగా ఉంటున్నాయని వారు తెలిపారు. వీలైనంతగా త్వరగా ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు -
నిరసన గళం: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సచివాలయానికి దీదీ
కోల్‌కత: ఆకాశానికి ఎగబాకుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సచివాలయానికి చేరుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్కూటర్‌ను నడుపగా, మమతా హెల్మెట్ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ఫ్లకార్డును మెడలో ధరించారు. ఇప్పుడు మీ నోళ్లలో నానుతున్న అంశంఏది అని ప్రశ్నిస్తే..పెట్రోల్ ధరల పెరుగుదల. డీజిల్ ధరల పెరుగుదల. వంట గ్యాస్ ధరల పెరుగుదల అనే ఉంటుందన్న సమాధానాలు వినిపిస్తాయి అని ఫ్లకార్డులో రాసి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించివచ్చు అని మమతా పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా..దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిన మోటెరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. కాగా గత కొన్ని రోజలుగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ 90 రూపాయలు దాటేసింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర (రూ .91.12), చెన్నై (రూ .92.90), బెంగళూరు (రూ .93.98), భువనేశ్వర్ (రూ .92), హైదరాబాద్ (రూ. 94.54), జైపూర్ (రూ. 97.34), పాట్నా (రూ. 93.56), తిరువనంతపురం (రూ. 92.81)గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. చదవండి : (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) (పెట్రో సెగ: బీజేపీ మంత్రి ఉచిత సలహా) #WATCH | West Bengal CM Mamata Banerjee nearly falls while driving an electric scooter in Howrah, as a mark of protest against fuel price hike. She quickly regained her balance with support and continued to drive. She is travelling to Kalighat from State Secretariat in Nabanna pic.twitter.com/CnAsQYNhTP — ANI (@ANI) February 25, 2021 -
పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: దేశీయంగా రికార్డుస్థాయికి చేరుతున్న ఇంధన ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండుతున్న పెట్రోధరలపై ప్రభుత్వాలు సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అధిక ధరలు కార్లు, బైక్‌లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తయారీ, రవాణా రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజలను, దేశాన్నిఈ భారం నుంచి బయట పడవేసేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరమని తెలుసు, కానీ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. వరుస బాదుడు తరువాత ప్రస్తుతం స్థిరంగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ) మరోవైపు డిజిటల్ కరెన్సీ ఆవిష్కారంపై కసరత్తు చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. డిజిటల్ రెవల్యూషన్లో తాము వెనకబడి ఉండాలనుకోవడం లేదంటూ క్రిప్టోకరెన్సీ లాంచింగ్‌పై ఇప్పటివరకు వస్తున్న అంచనాలపై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి తమకు ఆందోళనలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అయితే తమ డిజిటల్ కరెన్సీ ప్రస్తుత క్రిప్టోకరెన్సీ కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలు ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. (బిట్‌కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ ) డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ భారీగా పుంజుకున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా క్రిప్టోకరెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రెగ్యులేటర్స్ చొరవ తీసుకోవాలన్నారు. అంతేకాదు బిట్ కాయిన్లో తాను పెట్టుబడులు పెట్టేది లేదని తెగేసి చెప్పారు. మరోవైపు దేశీయంగా డిజిటల్ కరెన్సీ ఆందోళన నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పెట్టుబడులతో ఇటీవలి కాలంలోబిట్కాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దీంతో బిట్కాయిన్పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అయితే ధరలు చాలా హైలో ఉన్నాయంటూ ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌పై చేసిన ట్వీట్ కారణంగా భారీ నష్టాన్ని మూట గట్టుకున్నారు. దీనికి తోడు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ బిట్‌కాయన్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బిట్ కాయిన్ ఏకంగా 17 శాతం క్షీణించి 45వేల డాలర్లకు పడిపోయింది. (పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో ఫైర్) Diesel &petrol prices do have an impact on the cost side. They play as cost push factor across a range of activities. It's not just that passengers who use cars and bikes. High fuel prices also have an impact on cost of manufacturing, transportation & other aspects: RBI Governor pic.twitter.com/zn4AzB5Ag8 — ANI (@ANI) February 25, 2021 -
పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!
దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ(రూ.100) చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువలో ఉన్నాయి. రికార్డుస్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు చూసి సామాన్య ప్రజానీకం వాహనం తీయాలంటేనే భయపడిపోతున్నారు. వారి ఆగ్రహాన్ని సోషలో మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ ఇంధన ధరల పెరుగుదలపై ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించాలని ప్రతి పక్షాలు కోరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని 4 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాయి. త్వరలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి సుంకాలు తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మేఘాలయలలో పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గించబడ్డాయి. తగ్గిన తర్వాత కూడా ఢిల్లీలోని డీజిల్ ధర ఈ మూడు రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్లో అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.1 వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లో మేఘాలయ పెట్రోల్‌పై లీటరుకు రూ.7.40, డీజిల్‌పై రూ .7.10 భారీగా తగ్గించినట్లు ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం జనవరిలోనే చమురు ధరలపై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. అటు అసోం కూడా కరోనా కారణంగా విధించిన అదనపు పన్ను రూ.5 తగ్గిస్తూ ఫిబ్రవరి 12న నిర్ణయం తీసుకుంది. పన్ను తగ్గింపు తరువాత పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.91.78, షిల్లాంగ్‌లో రూ .86.87, గౌహతిలో రూ .87.24, జైపూర్‌లో రూ .97.10గా ఉంది. చదవండి: సైనికుల కోసం సోలార్ టెంట్లు భారీగా పెరిగిన ఉల్లి ధర -
భారీగా పెరిగిన ఉల్లి ధర
ముంబై: పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు ధరలు పెరిగి పోతుంటే ఇప్పుడు ఉల్లి గడ్డల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో కిలోకు 25-30 రూపాయలకు విక్రయిస్తున్న ఉల్లిపాయను ప్రస్తుతం కిలోకు 60-70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇలా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ఉల్లి పంట ఎక్కువగా నాశనమైంది. ఉత్పత్తి లేకపోవడం వల్ల సరఫరా కూడా తగ్గింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తుంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రెట్లుపైగా పెరిగింది. నవీ ముంబైలోని ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు 30-40 రూపాయల హోల్‌సేల్ ధరకు అమ్మేవారు. ముంబై, థానే, పూణే రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం ఉల్లిపాయ కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్గావ్లో ఉల్లిపాయల టోకు రేటు గత 10 రోజుల్లో 15శాతం నుంచి 20శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం రిటైల్ లో ఉల్లిపాయ ధర కిలోకు రూ.54గా ఉంది. మరోవైపు, డీజిల్ ధరలు నిరంతరం పెరగడం కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 73.87 రూపాయలు ఉండగా నేడు అది 78.38 రూపాయలుగా ఉంది. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
పెట్రో సెగ: బీజేపీ మంత్రి ఉచిత సలహా
పట్నా: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరిగుతోంది. ఈ విషయంలో జనాలకు మద్దతుగా ఉండాల్సిన రాజకీయ నాయకులు తలకు మాసిన కామెంట్లు చేస్తూ.. ప్రజాగ్రహాన్ని మరింత పెంచుతున్నారు. తాజాగా బిహార్ బీజేపీ మంత్రి ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదు.. ఎందుకంటే వారు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కువగా వాడతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. బిహార్ మినిస్టర్ నారాయణ్ పటేల్ పెరిగిన ఇంధన ధరలపై స్పందిస్తూ... ‘‘సామాన్యులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ మీద ఆధారపడతారు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రైవేట్ వాహనాలు వాడతారు. కాబట్టి ఇంధన ధరల పెంచినప్పటికి వారి మీద పెద్దగా ప్రభావం పడదు. పెరిగిన ధరలకు నెమ్మదిగా వారే అలవాటు పడతారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం ఉత్తమం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారాయణ్ పటేల్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పెట్రో ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చిన సంగతి తెలిసిందే. పెట్రో ధరల పెంపు పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో ఉత్పత్తి కోతలను తగ్గించాలని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎగుమతి దేశాల (ఒపెక్), అనుబంధ చమురు ఉత్పత్తిదారులను కోరారు. అంతకుముందు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ప్రధాన్, కరోనావైరస్ మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఇంధన ఉత్పత్తి తగ్గిందని.. అందువల్లే ధరల పెరిగాయని ఆరోపించారు. తక్కువ ఉత్పత్తి డిమాండ్.. సరఫరాలో అసమతుల్యతకు కారణమైందన్నారు. చదవండి: కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే -
అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే
బీహార్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా బీహార్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంతో అసెంబ్లీ మొదటి రోజున ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన మహువా ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పాట్నాలోని అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంపై తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు. "నేను హాజీపూర్ నుంచి ఉదయం 7గంటలకు సైకిల్ మీద బయలుదేరాను. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు, అలాగే బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటి విషయంపై ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం" అని ముఖేష్ మీడియాకు తెలిపారు. చదవండి: భారీగా పడిపోయిన బంగారం ధరలు -
పెట్రో షాక్: రికార్డు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ నింగిని చూస్తున్నాయి రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. నేడు (మంగళవారం) పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురుకంపెనీలు నిర్ణయించాయి. గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. జనవరి 6 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.3కు పైగా పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ .87.30 కాగా, డీజిల్ ధర రూ .77.48గా ఉంది. ముంబైలో లీటరుకు రూ .93.83. డీజిలు ధర రూ .84.36 పలుకుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.70, డీజిల్ రూ .82.66 కోల్‌కతాలో పెట్రోల్ రూ .88.63, డీజిల్ ధర రూ .81.06 బెంగళూరులో పెట్రోల్ రూ.90.22 డీజిల్ రూ.82.13 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ. 84.52 అమరావతిలో పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 86.68 అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గరిష్టానికి చేరాయి. మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ బ్యారెల్ ధర 60 డాలర్లు దాటేసింది. సోమవారం 2 శాతం పెరిగి ఏడాదిలోనే అత్యధిక స్థాయిని తాకాయి. -
పెట్రో ధరల మోత : రికార్డు హై
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన సెగలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29-32 పైసలు పెరిగింది. తాజా రికార్డు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.95 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.77.13గా ఉంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) వరుసగా రెండవ రోజు రిటైల్ ధరలను పెంచడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.42, డీజిల్ రూ. 84.14 అమరావతిలో పెట్రోల్ రూ. 93.09, డీజిల్ రూ. 86.31 బెంగళూరులో పెట్రోల్ రూ.89.85 డీజిల్ రూ.81.76 ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99 చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.82.33 కోలకతాలో పెట్రోల్ రూ.88.30 డీజిల్ రూ.80.71 -
బడ్జెట్ తర్వాత పెట్రో సెగ షురూ
సాక్షి, ముంబై: 2021 బడ్జెట్ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అగ్రి సెస్ ప్రభావం వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు. కానీ గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.13 పైసలుండగా, డీజిల్ ధర రూ.82.04 కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.01,, లీటర్ డీజిల్ ధర రూ.80.41 హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ 90.10 పైసలుండగా, డీజిల్ ధర రూ.83.81 అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.78పైసలుండగా, డీజిల్ ధర రూ.85.99 పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని కాబట్టి, వినియోగదారులపై అగ్రి సెస్ సంబంధిత అదనపు భారం పడదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినా, పెటట్రోల్ ధరలు మరింత భారం కావాడం వినియోగదారులనుబెంబేలెత్తిస్తోంది. కాగా బడ్జెట్లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గుండె గుభేల్ : సెంచరీ కొట్టిన పెట్రోలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రికార్డులను నమోదు చేస్తున్నలీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 38 పైసలు పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.101.80కు చేరుకుంది. రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 లు పలుకుతోంది. రాజస్థాన్ అంతటా, పెట్రోల్ 93 రూపాయలకు ఎగువన, డీజిల్ ధర రూ.85 కంటే ఎక్కువగానే ఉండటం విశేషం. గురువారం నాటికి ఢిల్లీలో సాధారణ పెట్రోలు రేటు రూ. 86.30, లీటర్ డీజిల్ ధర రూ. 76.48 చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 88.82, డీజిల్ ధర రూ. 81. 71 జైపూర్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 93.86, డీజిల్ ధర రూ. 85.94 హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్ ధర రూ. 83.46 అమరావతి : పెట్రోలు ధర లీటరుకు రూ. 92.54. డీజిల్ ధర రూ. 85.73 వ్యాట్‌లో తేడాలు కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భిన్నంగా ఉంటాయి. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం వ్యాట్ అమల్లో ఉండగా, రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4- 8 నుంచి 10 -11 రూపాయలు ఎక్కువ. -
పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి కాలం దాకా ధరల మోతతో వాహనదారులకు బెంబేలెత్తించిన ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాహనదారులకు ఊరట లభించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం (సెప్టెంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు. 81.55 నుండి 81.40 రూపాయలకు, డీజిల్ లీటరుకు 72.56 రూపాయల నుండి 72.37కు దిగి వచ్చింది. (రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!) దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ లోపెట్రోలు 81.40, డీజిల్ 72.37 రూపాయలు కోల్‌కతాలో పెట్రోలు రూ. 82.92, డీజిల్ 75.87రూపాయలు ముంబైలో పెట్రోలు రూ. 88.07, డీజిల్ 78.85 రూపాయలు చెన్నైలో పెట్రోలు రూ. 84.44, డీజిల్ 77.73 రూపాయలు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర 78.88 రూపాయలు అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ 80.07 రూపాయలు -
రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మంగళవారం వెల్లడించాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08 గా ఉది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. గత రెండు రోజులలో, పెట్రోల్ డీజిల్ ధర ఢిల్లీలో వరుసగా 31 పైసలు 37 పైసలు తగ్గింది. అమరావతిలో పెట్రోలు ధర రూ. 86.34 డీజిల్ ధర 80.27 రూపాయలు ఢిల్లీ పెట్రోల్ ధర లీటరు రూ .81.55, డీజిల్ లీటరు రూ .72.56 ముంబైలో పెట్రోల్ రూ. 88.21 డీజిల్ ధర 79.05 రూపాయలు చెన్నైలో పెట్రోల్ రూ. 84.57 డీజిల్ 77.91 రూపాయలు మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ క్షీణించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి 39.58 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా పె ట్రోలు ధరలు మరింత దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. (ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత) -
పెట్రోల్, డీజిల్‌పై కరోనా ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : చమురు ధరలపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. చమురుకు డిమాండ్ ఎక్కువగా ఉండే చైనాలో కరోనా వైరస్ విస్తరించడంతో చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గత పక్షం రోజులుగా చమురు ధరలు మరింత పడిపోయాయి. వరుసగా క్షీణత నమోదవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు మాసాలుగా పైసాపైసా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.75.04 ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.68.88 ఉంది. గత మూడు నెలల నుంచే... జనవరిలో పెట్రోల్ ధర రూ.80.80 ఉండగా, ఆ మాసంలో రూ.2.05 తగ్గింది. ఫిబ్రవరిలో రూ.77.77 పైసలు ఉండగా, ఇదే నెలలో రూ.1.17 తగ్గింది. మార్చి 1న రూ.76.23 ఉండగా, ప్రస్తుతం రూ.75.04కు చేరింది. ఇక డిజిల్ ధరను పరిశీలిస్తే జనవరిలో రూ. 75.42 ఉండగా, అదే నెలలో రూ.1.89 తగ్గింది. ఇక ఫిబ్రవరిలో రూ.72.16 ఉన్న ధర...రూ.70.27కు పడిపోయింది. మార్చి1న రూ.70.01 ఉన్న ధర.... ప్రస్తుతం రూ.68.88కి చేరింది. మరో పక్షం రోజులు సైతం పైసాపైసా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రం ధరల మోత మోగే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న బీఎస్–6 ఉద్గానా నిబంధనలే ఈ ధరల పెరుగుదలకు కారణం. -
ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్‌నుంచి ఇంధన ధరలు మోతమోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గాన నిబంధనల నేపథ్యంలో పెట్రోలు ధరలు లీటరుకు 70-120 పైసలు పెంచవలసి వుంటుందని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తక్కువ ఉద్గారాలతో బీఎస్-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుందని ఐవోసీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కొన్నిరిమోట్ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) శుక్రవారం వెల్లడించింది. అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. ధరల పెంపు సంకేతాలను ధృవీకరించిన సంజీవ్ సింగ్ ఏ మేరకు పెంపు వుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంధనాల రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ, గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని చెప్పారు. కాగా బీపీసీఎల్ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్జీసీకి చెందిన హెచ్‌పీసీఎల్ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్‌పీసీఎల్ ఇప్పటికే ప్రకటించింది. -
భారీగా తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా దిగి వస్తున్నాయి. వరుసగా మూడవరోజుకూడా పెట్రోలు డీజీలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు ధర తగ్గింది. దీంతో మొత్తంగా ఫిబ్రవరిలో పెట్రోల్ లీటరుకు 82 పైసలు, డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గింది. జనవరి 12 నుండి ఇంధన రేట్లు తగ్గడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రకంపనలు ముడిచమురు ధరలను కూడా తాకాయి. చమురుకు డిమాండ్ ఎక్కువుండే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేసింది. బ్రెంట్ ముడి బ్యారెల్ 54.50 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ : లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్ ధర రూ.65.43. ముంబై : లీటరు పెట్రోల్ రూ. 78.11, డీజిల్ ధరూ.68.57 కోల్‌కతా: లీటరు పెట్రోల్ రూ. 75.13, డీజిల్ ధ రూ. 67.79 చెన్నై: లీటరు పెట్రోల్ రూ. 75.27, డీజిల్ ధ రూ. 69.10 విజయవాడ : లీటరు పెట్రోల్ రూ. 76.63, డీజిల్ ధర రూ.70.91 హైదరాబాద్ : లీటరు పెట్రోల్ రూ. 77.08, డీజిల్ ధర రూ.71.35. -
8వ రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 74 మార్క్‌కు చేరగా, ముంబై 80 రూపాయలకు చేరింది. పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్‌పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 8 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై 2.20 రూపాయలు, డీజిల్‌పై 1.64 రూపాయలు పెరిగింది. సౌదీలో చమురు బావులపై డ్రోన్ దాడులు తర్వాత.. ముడి చమురు ధరల పెరుగుదల దేశంలో కూడా ప్రభావం చూపుతోందని చమురు సంస్థలు చెబుతున్నాయి. 2014 నుంచి పెట్రోల్ పైన 211.7శాతం , డీజిల్ పైన 443శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది. దాదాపుగా 12సార్లు ఎన్‌డిఎ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించింది. విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ. 78.10, డీజిల్ ధర రూ. 72.10 హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ. 78.80, డీజిల్ ధర 73.11 ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ. 74.13, డీజిల్ ధర రూ. 67.07 ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ. 79.79, డీజిల్ ధర 70.37 చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ. 77.06, డీజిల్ ధర రూ. 70.91 చదవండి : సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీపై డ్రోన్‌దాడి కలకలం -
భగ్గుమన్న పెట్రోల్ : భారీగా వడ్డన
జైపూర్: కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలతో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంపును ప్రకటించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంధనంపై సెస్‌పెంపుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ .5 వరకు పెరిగాయి. పెట్రోల్‌పై వ్యాట్ రేటును 26 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై 18 శాతం నుంచి 22 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్రోల్ ధర రూ .4.62 మేర పెరిగిందని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత్ బాగై వెల్లడించారు. దీంతో జైపూర్‌లో పెట్రల్ ధర లీటరుకు 75.77 రూపాయలకు చేరింది. ఇంతకుముందు 71.15 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధర లీటరుకు 4.59 రూపాయలు పెరిగి 66.65 రూపాయలు నుంచి రూ.71.24 కు చేరింది. మధ్యప్రదేశ్‌లో కూడా లీటరు పెట్రోల్ ధర రూ. 4.5 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర రూ. 78.19 గానూ, డీజిల్ ధర రూ. 70.02గా ఉంది. సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నుభారం విధించక తప్పలేదని రాష్ట్రమంత్రి జితు పట్వారి తెలిపారు. వివిధ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.48 డీజిల్ ధర లీటరుకు రూ. 72.62 అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.17 డీజిల్ ధర లీటరుకు రూ. 71.96 చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 75.76 డీజిల్ ధర లీటరుకు రూ. 70.48 ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 78.57 డీజిల్ ధర లీటరుకు రూ. 69.90 -
ఇక పెట్రోల్ మంటే
సాక్షి, సిటీబ్యూరో : కేంద్ర బడ్జెట్ వాహనదారులకు వాత పెట్టింది. సామాన్యులకు మళ్లీ పెట్రో మంట అంటుకుంది. ఇప్పటికే రోజువారి సవరణతో పెట్రో, డీజిల్ ధరలు పైసా పైసా ఎగబాకుతూ పరుగులు తీస్తుండగా.. బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ రూపాయి చొప్పున బడ్జెట్లో పెంచారు. ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65 అదనపు భారం పడింది. దాంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.88, డీజిల్ రూ.70.06 గా ఉన్నవి కాస్తా శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్ రూ.77.57, డీజిల్ రూ.72.71కు చేరాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు 60.34 లక్షల వివిధ రకాల వాహనాలున్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్ బస్సులు, మినీ బస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 20.30 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ నిర్ణయంతో గ్రేటర్‌లోని వాహనదారుల నుంచి రోజుకు సగటున రూ.కోటిన్నరకు పైగా అదనపు భారం పడనుంది. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల బాదుడు కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపు అధికంగానే ఉంది. నగరంలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నాయి. ప్రజలపై పన్ను భారం తగదు ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు రోజువారి సవరణతో పెచడం భారంగా మారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారమే. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖాజానా నింపేందుకు ప్రజలపై పన్ను బాదుడు తగదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు చేర్చితే ధరలు దిగి ఉపశమనం కలుగుతుంది. – బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ -
కొనసాగుతున్న పెట్రో పరుగు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఇంధన ధరలు వరుసగా మూడోరోజు కూడా పుంజుకున్నాయి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సర్కార్ కొలువ దీరనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరలు కూడా పెరుగుతూ వినియోగదారులకు భయపెడుతున్నాయి. శనివారం (మే 25) పెట్రోలు ధర 14 నుంచి 15 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 12 నుంచి 13 పైసల మేర పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా పలు మెట్రో నగరాల్లో పెట్రో,డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.46 శాతం పెరుగుదలతో 67.47 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.24 శాతం పెరిగి 58.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ.71.53, డీజిల్ ధర రూ.66.57 ముంబై : పెట్రోలు రూ.77.14 , డీజిల్ ధర రూ.69.75 చెన్నై: పెట్రోలు రూ.74.25, డీజిల్ ధర రూ. 70.37 కోలకతా : పెట్రోలు రూ.73.60, డీజిల్ ధర రూ.68.33 హైదరాబాద్ : పెట్రోలు రూ.75.86, డీజిల్ రూ. 72.80 అమరావతి : పెట్రోలు రూ.75.86, డీజిల్ ధర రూ.71.75 విజయవాడ: పెట్రోలు రూ.75.27 డీజిల్ రూ.71.42 వద్ద కొనసాగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 19 నుంచి శనివారం (మే 25) వరకు.. అంటే వారం రోజుల వ్యవధిలో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 60 పైసల మేర పెరిగింది. దీంతో పెట్రో భారం మరింత పెరుగుతుందనే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై : దేశీ ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. మంగళవారం (మే 21) పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 9-10 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.43 శాతం పెరుగుదలతో 72.28 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరుగుదలతో 63.50 డాలర్లకు ఎగసింది. దేశీయంగా పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.17కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.66.20కు ఎగసింది. వివిధ నగరాల్లో ఇంధన ధరలు లీటరుకు ముంబై: పెట్రోల్ రూ.76.78, డీజిల్ రూ.69.36 కోలకతా : పెట్రోల్ రూ.73.24, డీజిల్ రూ.67.96 చెన్నై : పెట్రోల్ రూ.73.87 డీజిల్ రూ.69.97 హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.48, డీజిల్ రూ.71.99 అమరావతి: పెట్రోలు రూ.75.24 , డీజిల్ రూ.71.36 విజయవాడ : పెట్రోల్ రూ.74.89 డీజిల్ రూ.71.03 -
పెరుగుతున్న పెట్రోలు ధరలు
సాక్షి,ముంబై: పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ( 25) పెట్రోలు పై 16 పైసలు, డీజిల్‌పై 17 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు వారం రోజుల్లో 5 శాతం పెరుగుదలనునమోదు చేయగా, గత శుక్రవారం చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. మరోవైపు యూఎస్-చైనా ట్రేడ్ డీల్‌తో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడం లాంటివి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణాలుగా ఎనలిస్టులు చెబుతున్నారు. హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.95 డీజిల్ ధర రూ.72.63 అమరావతి : లీటర్ పెట్రోల్ ధర రూ.75. 71,డీజిల్ ధర రూ. 71.99 ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.71.57,డీజిల్ ధర రూ.66.80 ముంబై : లీటర్ పెట్రోల్ ధర 77.20m డీజిల్ ధర69.80. చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.74.32 డీజిల్ ధరరూ.70.59. కోల్‌కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.67, డీజిల్ ధరరూ.68.59. -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి ముంబై : ఒకరోజు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు నేడు (గురువారం) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై లీటరు 15పైసలు, డీజిల్ పై 16పైసలు చొప్పున ధర పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పైపైకి పోతుండటంతో ఈవారంలో సోమ, మంగళవారాల్లో దేశీయంగా పెట్రోలు ధరలు పెరిగినా, బుధవారం స్థిరంగా ఉన్నాయి. కానీ ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. తాజా పెరుగుదలతో దేశంలో వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు , డీజిలు ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 71.15, డీజిల్ ధర రూ.66.33 ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.79 డీజిల్ ధర రూ.69.47 చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.87, డీజిల్ ధర రూ.70. 09 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.25, డీజిల్ ధర రూ.68.12 హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర రూ. 75.50, డీజిల్ ధర రూ.71.12 అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.28, డీజిల్ ధర రూ.71.49 -
ఆరో రోజూ పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా క్రమంగా పెట్రో ధరల సెగ పెరుగుతోంది. వరుసగా ఆరవ రోజుకూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలుపై 10పైసలు, డిజిల్ పై 9 పైసలు ధర పెరిగింది. దీంతో రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 71ల స్థాయిని టచ్ చేసింది. అటు ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ.76.64 పలుకుతోంది. ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.64 డీజిల్ ధర రూ.69.30 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.11, డీజిల్ ధర రూ.67.95 చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.72 డీజిల్ ధర రూ.69.91 అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్ ధర రూ.71.33 హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర రూ. 75.34, డీజిల్ ధర రూ.71.95 -
పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు
ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సమర్పించిన బడ్జెట్లో పెట్రో ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోలు ధర రూ.5, డీజిల్ ధర రూ.1 తగ్గనుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
పెరుగుతున్న పెట్రో ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.60లుగా ఉండగా, డీజిల్ ధర రూ.65.86లుగా ఉన్నాయి. అయితే చెన్నైలో లీటరు పెట్రోలుధర రూ. 73.28 వద్ద గరిష్ట రేటు పలుకుతోంది. అటు డీజిల్ ధర రూ.69.57గా ఉంది. ముంబై : పెట్రోల్ ధర రూ.76.23, డీజిల్ ధర రూ.68.97 హైదరాబాద్ : పెట్రోల్ ధర రూ.74.90 వద్ద.. డీజిల్ ధర రూ.71.60 అమరావతి : పెట్రోల్ ధర రూ.74.70, డీజిల్ ధర రూ.70.99 కోల్‌కతా: పెట్రోలు ధర రూ.72.71 పెట్రోలు ధర రూ.67.64 -
స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం (ఫిబ్రవరి 11) వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 5 పైసలు , డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన కూడా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.33 వద్ద.. డీజిల్ ధర రూ.65.62 వద్ద కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని లీటరు ముంబైలో పెట్రోల్ ధర రూ.75.97 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.68.71 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.17 డాలర్ల వద్ద ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు కోల్‌కతా : పెట్రోలు ధర లీటరు రూ. 72.44, డీజిల్ ధర రూ. 67.40 చెన్నై : పెట్రోలు ధర లీటర్ రూ. 73.00 డీజిల్ ధర రూ. 69.32 బెంగళూరు : పెట్రోలు ధర లీటర్72.65 డీజిల్ ధర రూ. 67.78 హైదరాబాద్ :పెట్రోలు ధర లీటర్ 74.62 డీజిల్ ధర రూ.71.34 విజయవాడ : పెట్రోలు ధర లీటర్ 74.05 డీజిల్ ధర రూ.70.40 -
ఈ ఏడాది కనిష్ట స్థాయికి పెట్రో ధరలు
సాక్షి, ముంబై: చమురు ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా పెట్రోలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలుపడిపోవడంతో ఇటీవల బాగా దిగివ వచ్చిన పెట్రోలు డీజిలు ధరలు శనివారం 2018 కనిష్టానికి చేరాయి. ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నైతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దిగి వస్తున్నాయి. లీటరుకు 30పైసలు చొప్పున పెట్రో ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .69.26గా ఉంది. డీజిలు ధర రూ. 63.32గా ఉంది. ముంబై: పెట్రోలు ధర రూ.రూ. 74.89 , డీజిలు ధర రూ.66.25 చెన్నై : పెట్రోలు ధర రూ.71.85 డీజిలు ధర రూ. 66.84 కోలకతా: పెట్రోలు ధర రూ. రూ. 71.37, డీజిలు ధర రూ. 65.07 హైదరాబాద్: పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర రూ.68.82 విజయవాడ: పెట్రోలు ధర రూ. 72.93, డీజిల్ ధర రూ.67.97 చమురు ధరల సెగతో ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా నమోదయ్యాయి. అయితే గ్లోబల్‌గా మళ్లీ ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా 20శాతం దిగి వచ్చిన ఇంధన ధరలు ఏడాదిన్నర కనిష్టాన్ని తాకాయి. అలాగే డిసెంబరు 24న ఢిల్లీలో పెట్రోధర (జనవరి తరువాత) తొలిసారిగా 70 రూపాయల దిగువకు చేరింది. -
ఇక పెట్రో బాదుడు షురూ?
సాక్షి, ముంబై: గత రెండు నెలలుగా ఊరట చెందిన వినియోగదారుల నెత్తిన పెట్రో భారం మళ్లీ మొదలైంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో మళ్లీ పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈ వారంలో 2శాతం క్రూడ్ ధర క్షీణించగా, గత రెండు నెలల్లో 30శాతం తగ్గింది. అయినా దేశీయంగా పెట్రో బాదుడు షురూ కావడం గమనార్హం. తాజాగా పెట్రోలు పై 11 పైసలు ధర పెరిగింది. అయితే డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో గత రెండు రోజులుగా స్ధిరంగా కొనసాగిన పెట్రోల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో 9 పైసలు పెరిగి రూ.70.29 కి చేరింది. అటు వరసగా మూడో రోజు కూడా స్థిరంగా ఉన్న డీజిల్ ధర రూ.64.66 వద్ద యథాతథంగా కొనసాగుతోంది. ముంబైలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా..డీజిల్ ధర రూ.67.66 గా ఉంది. కోలకతా : పెట్రోలు ధర రూ. 72.38 , డీజిలు ధర రూ. 66.40 చెన్నై: పెట్రోలు ధర రూ. 72.94 డీజిలు ధర రూ. 68.26 హైదరాబాద్: పెట్రోలు ధర రూ.74.55. డీజిల్ ధర రూ70.26 . విజయవాడ: పెట్రోలు ధర రూ. 73.99. డీజిలు ధర రూ. 69.36 కాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 4న చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ప్రభుత్వం జోక్యంతో అక్టోబర్ 16నుంచి పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేసింది. అటు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగి రావడంతో రెండు నెలలుగా దేశీయ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. -
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై: వరుసగా చమురు ధరలు దిగి రావడంతో దేశీయంతో పెట్రోలు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాటి ఇంధన ధరలను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 25-30పైసలు దిగి వచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని ధరలను చూద్దాం. ఢిల్లీ : పెట్రోలు ధర రూ.70.77 డీజిల్ రూ. 65.30 ముంబై: పెట్రోలు ధర రూ.76.28 డీజిల్ రూ. 68.32 చెన్నై: పెట్రోలు ధర రూ.73.33.డీజిల్ రూ. 68.93 కోలకతా: పెట్రోలు ధర రూ.72.75 డీజిల్ రూ. 67.03 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.74.95 డీజిల్ రూ.70.94 విజయవాడ : పెట్రోలు రూ.74.38 డీజిల్ రూ. 70.02 -
ఆరు వారాల్లో భారీగా పెట్రోలు ధర
సాక్షి, ముంబై: అంతర్జాతీయం మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా క్షీణిస్తూ ఉండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(నవంబరు,30) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో గత ఆరువారాల్లో పెట్రోలు ధర 10 రూపాయలు దిగిరాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 8 తగ్గింది. న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 37 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు తగ ధరరూ.72.87 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.67.72గా ఉంది. ముంబై: పెట్రోల్ ధర 37 పైసలు, డీజిల్ ధర 44 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ. 78.43గా ఉంది. డీజిల్ లీటర్ ధర రూ.70.89 కి చేరింది. చెన్నై: పెట్రోలు ధర లీటరు ధర. 75.62, డీజిల్ ధర 71.52 పలుకుతోంది. కోల్‌కతా: పెట్రోలు ధర రూ.74.88గానూ, రూ. 69.57గా ఉంది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ.77.25 డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.73.68 గా ఉంది. విజయవాడ: పెట్రోల్ ధర రూ.76.61 ఉండగా.. డీజిల్ ధర రూ.72.67 వద్ద కొనసాగుతోంది. కాగా అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్‌కు 60 డాలర్లు దిగువకు చేరింది. గత 45 రోజులుగా నేల చూపులు చూస్తున్న బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏడాది కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే ఈ రోజు స్వల్పంగా పుంజుకుని పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. -
పెట్రో ధరలు: మరో శుభవార్త!
సాక్షి, ముంబై: పెట్రో షాక్‌నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న వాహనదారులకు మరో శుభవార్త. గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు మరో 5 రూపాయలకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలుపై పరిమితులపై భారత్, చైనా, జపాన్ సహా 8 దేశాల నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ధరలు మరింత దిగి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఉపశమనం తాత్కాలికమే అయినప్పటికీ ఈ మేరకు సానుకూల ప్రభావం ఉండనుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో ముడి చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద వినియోగదారు భారత్‌కు చాలా ప్రయోజనం ఉంటుందని అంచనా. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 68 డాలర్లు రావచ్చని కూడా కేడీయా కమోడిటీ మేనేజింగ్ డైరెక్టర్ అజరు కేడియా పేర్కొన్నారు. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువ రూ. 72.50 పైకి రాగలిగితే దేశంలో పెట్రోల్ ధర 5 రూపాయల మేర తగ్గవచ్చని కేడియా చెప్పారు. దీంతోపాటు ఒక రూపాయి డిస్కౌంట్‌ను ఉపసంహరించుకోవాలని, చమురు మార్కెటింగ్ కంపెనీలను (హెచ్‌పీసీఎల్, బిపిసిఎల్, ఐఒసి) అడగవచ్చని.. ఇదే జరిగితే పెట్రో ధరలనుంచి భారీ ఉపశమనం లభిస్తుందని ఆయన విశ్లేషించారు. కాగా రికార్డు స్థాయిధరలో వాహన దారులకు చుక్కలు చూపించిన పెట్రో ధరలు క్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 మేర క్షీణించిన సంగతి తెలిసిందే. -
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి రోజు యథాతథంగా కొనసాగిన ఇంధన ధరలు నేడు( గురువారం, నవంబరు 8) తగ్గుముఖం పట్టాయి. పెట్రోలుపై లీటరుకు సగటున 21పైసలు, డీజిల్ పై 18పైసలు ధర తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ. 78.21కు చేరుకోగా, డీజిల్ ధర లీటరు రూ. 72.89కు చేరింది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 93, డీజిల్ 22 పైసలు తగ్గి లీటరు రూ. 79.31 కు చేరింది. విజయవాడ: లీటర్ పెట్రోల్ 82.11, డీజిల్ ధర రూ. 78.08 ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజిల్ ధర రూ.76.38గా ఉంది. చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 81.24, డీజిల్ ధర రూ.77.05 కోలకతా: లీటర్ పెట్రోల్ రూ. 80.13, డీజిల్ ధర రూ.74.75 అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా దిగి వస్తున్న తరుణంలో దేశీయంగా కూడా పెట్రోలు , డీజిల్ ధరలు వాహన దారులకు మరింత ఊరట కల్పించనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
ప్రధాన నగరాల్లో తగ్గిన పెట్రో ధర
సాక్షి, న్యూఢిల్లీ:అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా 13వ రోజులపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు నిన్న (బుధవారం ,అక్టోబరు 31) స్వల్పం విరామం తరువాత నేడు గురువారం (నవంబరు 1) వాహనదారులకు మరోసారి మరింత ఊరట కలిగించాయి. అయితే పెట్రోలు ధరలను తగ్గించిన ఆయిల్ కంపెనీలు డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత తగ్గింపుతో వాణిజ్య రాజధాని ముంబైలో 16 పైసలు తగ్గిన పెట్రోలు లీటరు ధర రూ.84.86గా ఉండగా, డీజిల్ ధర రూ.77.32 వద్ద ఉంది. ఢిల్లీలో 16 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.79.39. డీజిల్ ధర రూ.73.78 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.84.14 పలుకుతోంది. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.29 , డీజిల్ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు రూ .79.99. డీజిల్ ధర రూ.74.16. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.25. డీజిల్ ధర రూ. 75.63. చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.65 గాను, డీజిల్ ధర లీటరుకు78 రూపాయలుగాను ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రూడాయిల్ ధర 74.73 డాలర్లకు చేరింది. అక్టోబరులో బ్యారెల్ ధర 86 డాలర్ల గరిష్టస్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
13వ రోజూ తగ్గిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: దిగి వస్తున్న పెట్రో ధరలు వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా 13వరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మంగళవారం, పెట్రోలు పై 20 పైసలు, డీజిల్‌పై 7 పైసలు ధరను దేశీయ కంపెనీలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర రూ. 79.55 గాను, డీజిల్ ధర లీటరుకు రూ. 73.78 గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరు ధర. 85.04, డీజిల్ ధర లీటరుకు రూ. 77.32 పలుకుతోంది.. కోలకతా : పెట్రోలు లీటరు ధర రూ. 81.63, డీజిల్ ధర లీటరుకు రూ .75.70 చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86 , డీజిల్ ధర లీటరుకు 78.08 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు లీటరు ధర రూ. 84.33, డీజిల్ ధర లీటరుకు రూ.80.25 విజయవాడ : పెట్రోలు లీటరు ధర రూ.83.47, డీజిల్ ధర లీటరుకు రూ. 79 లు అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న కారణంగా దేశీయంగా ఇంధన ధరలు ఆరు వారాల కనిష్ఠానికి చేరాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత దిగి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
గుడ్‌న్యూస్: దిగి వస్తున్న పెట్రో ధరలు
సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల చుక్కలు చూపించిన ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గాయి. ఇటీవల ఆల్ టైం గరిష్టాలను తాకిన ఇంధన ధరలు అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో తాజాగా ఆరువారాల కనిష్ఠానికి దిగి వచ్చాయి. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆ మేరకు ధరలను తగ్గించాయి. సోమవారం ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర 30 పైసలు తగ్గిన 79.75గా ఉంది. డీజిల్ ధర లీటరుకు 20 నుంచి తగ్గి రూ. 73.85గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరుకు 85.24 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు 77.40 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 21 చొప్పున ధర తగ్గింది. హైదరాబాద్: పెట్రోల్ లీటరు ధర రూ.84.54, డీజిల్ లీటరు ధర రూ.80.33గా ఉంది. విజయవాడ: పెట్రోలు ధర రూ.83.65, డీజిల్ లీటరు ధర రూ. 79.08 పలుకుతోంది. కోలకతా: పెట్రోలు లీటరు ధర రూ.81.63, డీజిల్ లీటరు ధర రూ .75.70 చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86, డీజిల్ లీటరు ధర రూ. 78.08 అక్టోబర్ 4న రికార్డు స్థాయికి చేరినన పెట్రోల్, డీజిల్ ధరలు గత 12రోజుల్లో రెండు రూపాయలకు పైగా దిగి వచ్చాయి. -
నాల్గవరోజూ తగ్గిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 17పైసలను సంస్థలు తగ్గించాయి. దీంతో సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81.74 ఉండగా, డీజిల్ ధర రూ.75.19 గా ఉంది. వరుసగా నాలుగురోజులపాటు చమురు ధరలను తగ్గించడంతో మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.1.09, డీజిల్‌పై 50 పైసలు తగ్గింది. -
అది ఎన్నికల తాయిలం..
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇంధన ధరలను ఇటీవల కేంద్రం స్వల్పంగా తగ్గించిందని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల తాయిలాలను ప్రకటించకుండా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రో ధరలను పెంచని కేంద్ర ప్రభుత్వం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏం చేయనుందని ప్రశ్నించారు. పెట్రో దరలను ఎన్నికలతో ముడిపెట్టి తాయిలాలు ప్రకటించే కన్నా వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘర్-ఘర్ మోదీ సమయం నుంచి బైబై మోదీ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల ముఖాల్లో నవ్వులు తీసుకురావచ్చని హితవు పలికారు. ఇంధన విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రూ 13 లక్షల కోట్లను కేంద్రం ప్రచారాలకు, ఈవెంట్ మేనేజ్మెంట్కు వెచ్చిస్తోందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫుల్‌టైమ్ బ్లాగర్లా, పార్ట్‌టైమ్ మంత్రిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
పెట్రో వాత : ఆగస్టునుంచి ఎంత?
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 16పైసలు పైకి ఎగబాకింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ధర సోమవారం 83.21 డాలర్ల నుంచి బ్యారెల్‌కి 85 డాలర్లకు చేరింది. త్వరలోనే బ్యారెల్‌కు 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు మధ్యకాలం నుంచి పెట్రోలు లీటరుకు 6.50 రూపాయల మేరకు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు డాలరు మారకంలో రూపాయి విలువ అంతకంతకూ మరింత దిగజారుతోంది. దేశీయకరెన్సీ డాలరు మారకంలో సోమవారం 72.91 వద్ద ముగిసింది. -
పెట్రో మంట : రూ. 91 దాటేసింది
సాక్షి,ముంబై: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 1 సోమవారం పెట్రోలు ధర 24పైసలు డీజిల్ 30పైసలు పెరిగింది. న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 83.73 రూపాయలు. డీజిల్ ధర లీటరు 75.09 రూపాయలు. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిని తాకి మరింత సెగ రాజేస్తున్నాయి. లీటరు పెట్రోలు ధర 91 రూపాయల మార్క్‌నుదాటి 91.08 రూపాయల వద్ద వుంది. అలాగే 32పైసలు పెరిగిన డీజిల్ లీటరు ధర రూ .79.72 గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్ ధర 81.68 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్ ధర రూ. 80.37. మరోవైపు దేశీయంగా వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .59 పెరిగింది. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది. -
కేక్ కొంటే పెట్రోల్ ఫ్రీ
సాక్షి, చెన్నై: పెట్రో ధరలు వినియోగదారులకు సెగ పుట్టిస్తోంటే.. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇపుడు ఈ కోవలోకి ఒక బేకరీ సంస్థ వచ్చి చేరింది. ఒక కిలో కేక్ కొంటే లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తామంటూ ఒక బేకరీ వినూత్న ఆఫర్ అందిస్తోంది. తమిళనాడులోని ఒక బేకరీ దుకాణం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితమని అని ప్రకటించింది. దీంతో ఇది వైరల్‌గా మారింది కాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ. 82.32 , 89.92 రూపాయలుగా ఉంది. -
‘పెట్రో’ ధరను రూ.2 తగ్గించిన కర్ణాటక
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. కలబురిగిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తమ జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను 3.25, 3.27% చొప్పున తగ్గనుంది. ఇది ప్రస్తుతం 32%, 21 శాతంగా ఉంది’ అని వివరించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.80, డీజిల్ రూ.76.21గా ఉంది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు రూ.91 ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ.90కు చేరుకుంది. ముంబై మినహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర దేశంలోనే అత్యధికంగా రూ.91కి ఎగబాకింది. పెట్రోలు, డీజిల్‌లపై సర్‌చార్జితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39% వరకు వ్యాట్ వసూలు చేస్తోంది. -
పెట్రోల్ ధరలపై ప్రశ్నించినందుకు బీజేపీ నేత దాడి
చెన్నై: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పెరిగిన ధరలతో కడుపు మండిన ఓ ఆటోడ్రైవర్ ఓ బీజేపీ సీనియర్ నేతను ప్రశ్నిస్తే అతనిపై చేయిచేసుకున్నారు. ఈ విచారకర ఘటన సోమవారం చెన్నైలోని సైదాపేటలో తమిళనాడు బీజేపీ ఛీఫ్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతుండగా చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే.. సౌందర్యరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. రిపోర్టర్లు అడుగుతున్న ప్రశ్నలను వింటున్నారు. ఇంతలో ఖాకీ డ్రెస్ వేసుకున్న ఓ పెద్దాయన మధ్యలో కలుగజేసుకుని పెరిగిన ఇంధన ధరలను ప్రస్తావించాడు. దీంతో ఆమె పక్కనే ఉన్న మరో బీజేపీ నేత వి కాళీదాస్ ఆగ్రహంతో ఆ వ్యక్తిని నెట్టేస్తూ చేయిచేసుకున్నాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. అనంతరం మీడియా ఆ ఆటోడ్రైవర్‌ను సంప్రదించగా.. ‘నేను ఓ ఆటో డ్రైవర్. పెరిగిన ఇంధన ధరలు నా జీవనశైలిపై ప్రభావం చూపుతున్నాయి. ఆమె ప్రభుత్వ చేసిన మంచి పనులు గురించి మాట్లాడటం నేను విన్నాను. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలపై అడగాలనిపించి ఆమె ఓ వీఐపీ కదా అని అడిగాను. అక్కడ ఒకరు నాపై చేయిచేసుకున్నారు. రోజువారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. మేం రూ.100ల పెట్రోల్ కొట్టించి ఆటో నడిపితే మాకు అంతకంటే ఎక్కువ రావడం లేదు. మా కష్టం అంతా మా ఆటో పెట్రోల్‌కే సరిపోతుంది. ఆటో నడుపుకుంటునే జీవిస్తున్నాం. పండుగలొస్తున్నాయి. మేం మరింత కష్టపడి సంపాదించాలి. కానీ పెరిగిన ఇంధన ధరలతో సంపాదించడం కష్టంగా మారింది’ అని తన బాధను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85గా ఉంది. -
పెట్రోల్ ధరలపై ప్రశ్నించినందుకు ఓ ఆటోడ్రైవర్‌పై..
-
ఆకాశాన్నంటుతున్న పెట్రోధరలు
-
తాజా పెట్రో వాత
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న పెట్రోధరలపై ఒక పక్క తీవ్ర ఆందోళన కొనసాగుతూండగానే ఇంధన ధరలు పరుగు మాత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా పెట్రోలుపై సగటున 35పైసలు, డీజిల్ 24 పైసలు పెరిగింది. దీంతో అత్యంత గరిష్ట స్థాయిల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర. 81.63 వుండగా, డీజిల ధర రూ. 73.54 ముంబైలో పెట్రోలు ధర రూ. 89.01 (34పైసలు) డీజిల్ ధర రూ 78.07 (25పైసలు పెంపు) చెన్నైలో డీజిల్ ధర రూ. 77. 74 పెట్రోలు ధర రూ. 84.49 (30పైసలు పెంపు) కోల్‌కతాలో పెట్రోల్ రూ. 83.49, డీజిల్ రూ. 75.39 హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.86.18, డీజిల్ ధర రూ. 79.73( 24పైసలు పెంపు) విజయవాడలో పెట్రోల్ రూ. 85.41, డీజిల్ రూ.78.63 -
పెట్రో సెగ: మంచి రోజులు ఎపుడు?
సాక్షి, ముంబై: పెట్రోలు, డీజిల్ ధరలకు అడ్డకట్ట పడే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రోజువారీ సమీక్షలో భాగంగా శుక్రవారం కూడా ధరలు పెరిగి హై స్థాయిల్లో కొనసాగుతున్నాయి. పెట్రోలుపై 28 పైసలు, డీజిల్ ధరలు 22 పైసలు పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో ధరలు వినియోగదారుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ .88.67, రూ.77.82 గా ఉన్నాయి. దీంతో వినియోగదారులు పెట్రో సెగపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా ఇంధన ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. బీజీపీ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆ అచ్ఛేదిన్ ఎప్పుడొస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81లు, డీజిల్ ధర రూ.73.30 గా ఉంది. చెన్నైలో పెట్రోలు రూ.84.19, డీజిల్ ధర రూ.84.05. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.85.88గాను, డీజిల్ ధర రూ.85.75 గా ఉంది. కోలకతాలో పెట్రోలు రూ.82.87, డీజిల్ ధర రూ.82.74గా ఉంది. Petrol and diesel prices in Mumbai are Rs 88.67/litre and Rs 77.82/litre respectively, locals say, "Don't know what the government is doing? It should reduce fuel prices. Achhe din kab aayenge?" pic.twitter.com/zCSIVQdxCF — ANI (@ANI) September 14, 2018 -
స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా ఇంధన ధరలు మాత్రం అసలు తగ్గడం లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, దేశీయంగా పన్నుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గుదల కిందకి దిగిరావడం లేదు. బుధవారంతో పోలిస్తే గురువారం పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున పెట్రోలు ధర 13 పైసలు, డీజిల్ ధర 11 పైసల చొప్పున పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రికార్డు స్థాయిల్లో రూ. 81 మార్కును తాకింది. లీటరు డీజిల్ ధర కూడా చారిత్రాత్మక గరిష్టంలో రూ. 73.08గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 15 పైసలు పెరిగి, రూ. 88.39, డీజిల్ ధర రూ. 77.58గా ఉంది. అయితే అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సైతం ఒత్తిడులను ఎదుర్కొంటోంది. అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. రూపాయి విలువ తగ్గుతుండటం, పెట్రోల్, డీజిల్‌పై కూడా ప్రభావం కనిపిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై, క్షీణిస్తున్న డాలర్ మారకంలో రూపాయి విలువపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారంలో సమావేశం నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర : రూ 85.88 డీజిల్ ధర రూ.79.49 -
పెట్రో సెగ : టుడే అప్డేట్
సాక్షి, ముంబై: దేశంలో ఇంధన ధరలు బుధవారం కూడా ఆకాశం వైపే చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న పెట్రో ధరలు ఏమాత్రం కిందికి దిగి రావడం లేదు. మంగళవారంతో పోలిస్తే బుధవారం దేశవ్యాప్తంగా సగటున 14 పైసల చొప్పున పెట్రోలు ధరలు పెరిగాయి. దేశరాజధానిలో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 80.87, డీజిల్ ధర రూ. 72.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు లీటరు ధర రూ. 83.75, డీజిల్ ధర రూ.75.82గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ. 88.26, డీజిల్ ధర రూ. 77.47 పలుకుతోంది. హైదరాబాద్ : బుధవారం పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ.85.75 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.37గా ఉంది. -
పెట్రోల్ ధర రూ 50కి దిగిరావాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 55, డీజిల్ రూ 50కి దిగిరావాలంటే బయో ఇంధనానికి మళ్లాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వరి, గోధుమ, చెరకు వ్యర్థాలతో పాటు మున్సిపల్ వ్యర్థాలతో ఇంధనాన్ని తయారుచేసే ఐదు ఇథనాల్ ప్లాంట్లను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నెలకొల్పుతుందని వీటి ఉత్పత్తులు బయటికి వస్తే పెట్రో ధరలు గణనీయంగా దిగివస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకంతో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బయో ఇంధనాల ప్రాధాన్యత గురించి నొక్కిచెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని జత్రోపా ప్లాంట్‌లో తయారైన బయో ఇంధనాన్ని ఉపయోగించి తొలి బయో ఇంధన విమానం ఇటీవల డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలో ల్యాండయిందన్నారు. బయో ఇంధన ఉత్పత్తి ద్వారా రైతులు, గిరిజనులు, యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ప్రజాందోళనలతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రజాందోళన వెల్లువెత్తుతుండడం, ప్రతిపక్షాల ఆందోళనలు తీవ్రమవడంతో పెట్రోల్, డీజిల్ ధరలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ పన్ను రూ.4లో రెండు రూపాయలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో కేంద్రం పెట్రో ధరలపై రెండు శాతం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి, రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పన్నులు తగ్గించాలని కోరగా చంద్రబాబు అప్పట్లో స్పందించలేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోతుందనే కారణం చూపి చంద్రబాబు వ్యతిరేకించారు. అయితే ప్రస్తుతం పెట్రో ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్, ఆందోళనలు కొనసాగుతుండడం, ప్రజల్లో సైతం ధరలపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన రూటు మార్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు వ్యాట్ కొంత తగ్గించాలని నిర్ణయించారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ పన్నును తాము రెండు రూపాయలు తగ్గించామని, కేంద్రం కూడా ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను, డివిడెండ్‌ను తగ్గించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయించారు. కేంద్రం బాధ్యతారాహిత్యం: సీఎం ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం బాధ్యతారాహిత్యం వల్లే ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచుతుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికుతోందని, సోమవారం ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరగిందని, వీటిని తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని కానీ అది వాస్తవం కాదన్నారు. 2013–14 సంవత్సరంలో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 105.52 డాలర్లు ఉండగా ప్రస్తుతం 72.23 డాలర్లుగా ఉందని తెలిపారు. 2014లో లీటరు పెట్రోల్ ధర రూ.62.98 ఉండగా ఇప్పుడు రూ.86.71కు, డీజిల్ ధర రూ.49.60 నుంచి రూ.79.98కి పెరిగిందన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని పైగా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో ధరలు పెంచిందని విమర్శించారు. ఇప్పుడు మాత్రం క్రూడాయిల్ ధరలు పెరిగాయనే నెపంతో ధరలను పెంచుతోందన్నారు. 2014 జూన్ నెలలో డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ లీటరుపై రూ.3.56 ఉండగా, 2017 సెప్టెంబర్ నాటికి అది రూ.17.33కి పెరిగిందని, 2014లో లీటరు పెట్రోల్‌పై రూ.9.48 ఉన్న కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ 2018 నాటికి రూ.19.48కి పెరిగిందన్నారు. ఇదికాకుండా, మౌలిక సదుపాయాల సెస్ పేరుతో లీటరుకు పెట్రోల్‌కు రూ.7, డీజిల్‌కు రూ.8ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆందోళను గుర్తించి కేంద్రం వెంటనే ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆయన తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. సంబంధం లేకుండా జగన్‌పై ఆరోపణలు దీనిపై బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతుండగా చంద్రబాబు సహా పలువురు పదేపదే అడ్డుతగిలారు. సంబంధం లేకుండా ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించి ఆరోపణలు చేశారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్ ధరలు రూ.2కి తగ్గించడం అభినందనీయమని కానీ ఆ ధరలపై గుజరాత్లో 16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 18 శాతం, కర్నాటకలో 20 శాతం, తెలంగాణలో 22 శాతం వ్యాట్ పన్ను ఉండగా ఏపీలో మాత్రం 24 శాతం ఉందని, దాన్ని ఇంకా తగ్గించాలని కోరారు. రూ.60 వేల కోట్లతో 25 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లబ్ధిదారులతో అక్టోబరు 2, జనవరిలో గృహ ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. మంజూరు చేసిన 25 లక్షల ఇళ్లలో ఎన్నికలు వచ్చేలోగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సోమవారం శాసనసభలో గృహ నిర్మాణం అంశంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 20.95 లక్షల మందికి పక్కా ఇళ్లు లేవని సర్వే చేసి కేంద్రానికి పంపామని, పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరితే, కేంద్రం ఇప్పటివరకు 1.20 లక్షల మందికి మాత్రమే మంజూరు చేసిందన్నారు. గృహ నిర్మాణానికి కేంద్రం అసలు సహకరించడం లేదన్నారు. లబ్ధిదారులకు ఇంటి జాగా కోసం భూ సేకరణ చేపడుతున్నామని, బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు. గృహ నిర్మాణాల తీరుపై కమిటీ వేద్దామా? ఈ చర్చలో బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ లబ్ధిదారులు 20 ఏళ్ల పాటు కిస్తీలు చెల్లించాలని, ఇది వారికి భారమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన గృహ నిర్మాణం ఎలా ఉంది? ఏపీలో జరిగిన గృహ నిర్మాణం ఎలా ఉందనే అంశంపై కమిటీ వేద్దామా? అని సవాల్ విసిరారు. శాసనసభలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పెట్రో మంటల నడుమ పొలిటికల్ కామెడీ!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ధరల పాపం తనది కాదంటూ జనం చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఒకవైపు పన్నుల పోటుతో ప్రజల రక్తాన్ని పిల్చేస్తూ.. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్వాకం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు 5–7 రూపాయలు అధికం కావడం గమనార్హం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఒడిశా రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వమే పెట్రోల్, డీజిల్‌పై ఎక్కువ పన్నులు వసూలు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఖజానాకు పెట్రోలు, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు అయిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పన్నులు విధించిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్న పన్నులు, పెట్రో ధరలతో జనం కష్టాలు పడుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10వ తేదీన తాను తలపెట్టిన బంద్‌లో పాల్గొనాలంటూ అధికార తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చింది. పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు అంతర్గతంగా సూచించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గతంలో బంద్‌కు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు తెలపలేదు. ఈ బంద్‌ను విఫలం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్రలు పన్నింది. కానీ, ఇప్పుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంద్ పేరిట పరస్పరం సహకరించుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీలకు ప్రజా ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పైసా కూడా తగ్గించం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉండడంతో రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ తెచ్చుకుంటున్నారు. ఏపీలో పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వందలాది పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. లీటర్ పెట్రోల్‌పై కేంద్రానికి పన్నుల రూపంలో రూ.19.48 వస్తుండగా, ఏపీకి రూ.21.20 వస్తోంది. డీజిల్‌పై కేంద్రం పన్నుల రూపంలో రూ.15.33 వసూలు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం రూ.17.10 వసూలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై సుంకాలను రూ.9.48 నుంచి రూ.21.48కు, డీజిల్‌పై రూ.3.56 నుంచి రూ.17.33కు పెంచింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం పెట్రోల్‌పై పన్నుల భారాన్ని రూ.13.95 నుంచి రూ.20.95కు, డీజిల్‌పై రూ.8.86 నుంచి రూ.14.87కు పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం పెంచిన సుంకాల్లో రూ.2 తగ్గించగా, రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. పన్నులను పైసా కూడా తగ్గించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. జనంపై ‘అదనపు’ బాదుడు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 2015లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.4 చొప్పున అదనపు ‘వ్యాట్’ను విధించింది. దీంతో పన్నులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రవాణా రంగం, నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం చూపే డీజిల్‌పై దేశంలోనే అత్యధిక పన్ను వసూలు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్, లీటర్‌కు రూ.4 అదనపు వ్యాట్.. అంటే మొత్తం కలిపి 28.08 శాతం పన్ను వసూలు చేస్తోంది. పెట్రోల్‌పై విధిస్తున్న పన్నులో మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, రూ.4 అదనపు వ్యాట్.. అంటే మొత్తం 35.77 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఈ స్థాయి పన్ను రేట్లు సరిహద్దు రాష్ట్రాల్లో లేకపోవడం విశేషం. పెట్రో ఆదాయం రెట్టింపు పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ధరలు పెరుగుతుండటంతో లక్ష్యాలకు మించి ఆదాయం ఖజానాకు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రూ.10,800 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా మొదటి నాలుగు నెలల్లోనే రూ.3,728 కోట్ల ఆదాయం వచ్చేసింది. 2014–15లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రూ.5,270 కోట్లుగా ఉన్న పెట్రో ఆదాయం 2017–18 నాటికి రూ.9,694 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 18 శాతం కేవలం పెట్రోల్, డీజిల్ నుంచే సమకూరుతుండడం గమనార్హం. రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా సగటున నెలకు రూ.439 కోట్ల ఆదాయం వచ్చేది. అది ఇప్పుడు ఏకంగా రూ.932 కోట్లకు పెరిగిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.10,800 కోట్లు.. అంటే ప్రతినెలా సగటున రూ.900 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, గడిచిన నాలుగు నెలల్లో సగటున రూ.932 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. వైఎస్సార్ చూపిన చొరవ ఆదర్శప్రాయం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం తగ్గించకుండా సీఎం చంద్రబాబు ఆ నెపాన్ని కేంద్రంపైకి నెడుతుండడం పట్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని గ్యాస్ సిలెండర్ ధరను రూ.50 చొప్పున పెంచితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ప్రతి సిలిండర్‌పై రూ.50 అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించారు. కానీ, పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఒకసారి సుంకం తగ్గించినా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతుగా పైసా కూడా తగ్గించకపోవడం ఏమిటని జనం మండిపడుతున్నారు. గతంలో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్రంలో అదనపు ‘వ్యాట్’ను సైతం పెంచేశారని, ఇప్పుడు ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరినా అదనపు ‘వ్యాట్’ను ఎందుకు తగ్గించడం లేదని నిలదీస్తున్నారు. పన్నులు తగ్గించరు గానీ ‘బంద్’ చేస్తారట! రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాజధాని అమరావతిలో శనివారం లీటర్ పెట్రోల్ రూ.86.4, డీజిల్ రూ.79.62కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి, ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి ఈ వ్యవహారాన్ని రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికంగా పన్నులు విధిస్తూ, ఆ మేరకు ఆదాయం పొందుతున్న టీడీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రమే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ నిందిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నిస్తే మాత్రం నోరు విప్పడం లేదు. పెట్రో ధరల పాపాన్ని కేంద్రంపై నెట్టేసి, తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రో ధరల మంటకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలంటూ సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలునివ్వడం గమనార్హం. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి
మంత్రాలయం రూరల్ : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ మంత్రాలమం మండల కేంద్రంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌యాదవ్, సీపీఎం మండల నాయకులు జయరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాదాపు 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగిందని మండిపడ్డారు. అంతే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడాపెరగడంతో సామాన్యులు ఇళ్లల్లో వంట చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు అనిల్, నూరమ్మ, భీమన్న, అనిల్, నర్సయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. కౌతాళం : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శనివారం మండల కేంద్రమైన కౌతాళంలో రస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బిస్మిల్లా సర్కిల్లో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఈరన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారం చేపట్టిన వెంటనే ఇంధన ధరలపై నియంత్రణ చేపడుతామని హామీ ఇచ్చిందని, తీరా అధికారం చేపట్టాక లెక్కలేనన్ని సార్లు ధరలు పెంచిందని విమర్శించారు. దేశంలో ఇందన ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే లీటర్ పెట్రోల్ కేవలం రూ.40కు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అక్రం, నాగరాజు, వలీ పాల్గొన్నారు. -
9 పైసలు తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: రూపాయి బలం పుంజుకోవడంతో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోవడంతో శనివారం4 మెట్రో నగరాల్లో లీటరు డీజిల్, పెట్రోల్ ధరలు 9 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.78.20, ముంబైలో 86.01, చెన్నైలో 81.19, కోల్‌కతాలో రూ.80.84గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.69.11, కోల్‌కతాలో రూ.71.66, ముంబైలో రూ.73.58, చెన్నైలో రూ.72.97కి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు డాలర్ చొప్పున తగ్గాయి. ఫలితంగా ఇంధన ధరలు భారత్‌లోనూ స్వల్పంగా దిగివచ్చాయి. -
ఆ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధర రూ.1 తగ్గింపు
సాక్షి, తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇంధన ధరలకు చెక్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనంపై రీటైల్ వాట్‌ను తగ్గించనుంది. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరల వాత తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వామపక్ష పాలక రాష్ట్రం కేరళలో పెట్రోల్, డీజిల్ ధరల స్వల్పంగా నైనా శాంతించనుండటం విశేషం. జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై ఒక రూపాయి తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. పెట్రోల్‌పై పన్నుపై కోత పెట్టడం ద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ .2 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించగా, నాలుగు రాష్ట్రాలు కేవలం వాట్ కట్‌ను ప్రకటించాయి. కాగా గత 16 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే గ్లోబల్‌గా చమురు ధరలు శాంతించడంతో దేశీయంగా బుదవారం 1 పైసా ధర తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భగ్గుమన్న ధరలను భరిస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా మండిపడ్డారు. చమురు ధరలు చల్లబడిన తరువాత కూడా లీటరుకు కేవలం ఒక పైసా తగ్గింపుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
ములుగు : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలో ఆదివారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాటా ఏస్ వాహనాన్ని తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మాజీ ఎంపీపీ నలెల్ల కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యులకు బాసటగా నిలిచామని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రూ.65 ఉన్న పెట్రోల్ ధరను క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం రూ.82కు చేర్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి ప్రస్తుతం సామాన్యడిపై భారం మోపుతుందని అన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోగిల మహేష్, యూత్ మండల అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల ప్రధాన కార్యదర్శి హరినాథ్‌గౌడ్, బండారుపల్లి సర్పంచ్ జంజిరాల దేవయ్య, నాయకులు ముసినపల్లి కుమార్‌గౌడ్, అశోక్‌గౌడ్, వంగ రవియాదవ్, రాములు, చాంద్‌పాషా, బొల్లం రవి, శ్రీను, దేవరాజు, కట్ల రాజు, కోటి, రజినీకాంత్, రంజిత్, శ్రీకాంత్, నవీన్, రాజు, రాజ్‌కుమార్, సురేష్, వినయ్, యుగేందర్ పాల్గొన్నారు. -
వరుసగా పదకొండో రోజూ ఆగని పెట్రోల్ పరుగు
-
పదకొండో రోజూ ఆగని పరుగు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధన ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన, విమర్శలు కొనసాగుతుండగానే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11 రోజుకూడా మోత మెగిస్తున్నాయి. వరుసగా 11 రోజు గురువారం కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు 19-31 పైసలు పెరిగాయి. ఈ మొత్తం 11 రోజుల్లోనూపెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు లీటరుకు రూ.2.50 మేర ఎగిసాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ ప్రకారం మే 24, గురువారం ఉదయం 6 గంటలనుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ .77.47 పలుకుతోంది. కోలకతాలో రూ. 80.12, ముంబైలో రూ .85.29, చెన్నైలో లీటరుకు 80.42 రూపాయలుగా ఉంది. ఉంది. అలాగే ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.68.53గానూ, కోలకతాలో రూ. 71.08, చెన్నైలో రూ. 72.35, ముంబైలో రూ .72.96 పలుకుతోంది. ఇక హైదారాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 పలుకుతోంది. లీటరు డీజిల్ ధర రూ. 74.49గా ఉంది. -
పెట్రోవాతపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇంధన ధరలపై సబ్సిడీ అమలు చేస్తే , ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాల అమలుపై పడుతుందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి వుందని ఇదొక అనివార్యమైన పరిస్థితిని అనీ గడ్కరీ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ సబ్సిడీ కోసం డబ్బును ఉపయోగించినట్లయితే సంక్షేమ పథకాల అమలు ఇబ్బందిగా మారుతుందని ఒక ఇంటర్వ్యూలో గడ్కరీ తెలిపారు. పెట్రోలు ఎక్కువ ధరకు కొన్ని దేశంలో తక్కువ ధరకు కొనడం వల్ల ప్రభుత్వంపై అదనపు భార పడుతుందన్నారు. ప్రభుత్వం దగ్గర చాలా తక్కువ డబ్బు ఉందనీ దీన్ని పెట్రోల్, డీజిల్ ధరలపై సబ్సిడీకి వినియోగిస్తే తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. అయితే పన్నుల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకున్న ఆర్థికమంత్రిదేనని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా నిరంతరంగా పెరుగుతున్న ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్న డిమాండ్‌తోపాటు పెట్రోల్ లీటరు 100 రూపాయలకు చేరవచ్చనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. తక్షణమే ధరల నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మిథనాల్ మిశ్రమం కలపడం వల్ల పెట్రోల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉందంటూ పలుమార్లు ప్రకటించిన నితిన్ గడ్కరీ ఇపుడు పెరుగుతున్న ధరలను భరించాల్సిందే అని ప్రకటించడం విశేషం. మరోవైపు భగ్గుమంటున్న పెట్రోలియం ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని బీజేపీ చీఫ్ అమిత్ షా భరోసా ఇచ్చారు. ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పెట్రోలియం మంత్రి, ప్రభుత్వరంగ చమురు సంస్థల ఉన్నతాధికారులతో చర్చిస్తోందనీ, వీలైనంతవరకు ధరలు తగ్గించాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ పెట్రోల్ బాంబు!
సాక్షి, హైదరాబాద్ : ఓ రోజు 6 పైసలు.. మరోరోజు 4 పైసలు.. ఇంకోరోజు 24 పైసలు.. చినుకు చినుకు కలసి వరదగా మారినట్టు.. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ ధరల సవరణతో కొంచెం కొంచెంగా పెరుగుతూ సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రోజువారీ ధరల సవరణ చేపట్టిన తర్వాత ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్ట స్థాయిలకు చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.08కు, డీజిల్ ధర రూ.70.16కు.. విజయవాడలో పెట్రోల్ రూ.79.43కు, డీజిల్ రూ. 71.59కు చేరాయి. తెలుగు రాష్ట్రాలు డీజిల్ ధరలో దేశంలోనే టాప్‌గా నిలవగా.. పెట్రోల్ ధరలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. రోజురోజుకు పెరుగుతూనే.. చమురు సంస్థలు మొదట్లో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. అయితే గతేడాది జూన్ 16వ తేదీ నుంచి మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు ధరల సవరణను అమల్లోకి తెచ్చాయి. ఇందులో తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా.. ఆ తర్వాతి నుంచి మోత మోగిస్తూనే వస్తున్నాయి. మార్కెట్ ధరల సవరణ సమయంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.67.11 కాగా.. మూడు నెలల క్రితం రూ.75.47కు, తాజాగా రూ.78.08కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర గత నెల 23న రూ. 76.56 మాత్రమే. అంటే ఈ పది రోజుల్లోనే రూ.1.52 పెరిగింది. ఇందులో ఆదివారం రోజునే 19 పైసలు పెరిగింది. ఇక మూడు నెలల కింద డీజిల్ ధర రూ.రూ.67.23కాగా.. ఇప్పుడు రూ.70.16కు చేరింది. -
షాకింగ్ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డిజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. పెట్రోల్ ధర ఆదివారం నాలుగేళ్ల గరిష్ట స్ధాయిలో దేశరాజధానిలో లీటర్‌కు రూ 73.73కు చేరగా, డీజిల్ అత్యంత గరిష్టస్ధాయిలో లీటర్‌కు రూ 64.58కి ఎగబాకింది. పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోతుండటంతో వీటిపై ఎక్సైజ్ పన్నులను భారీగా తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంధన ధరలను రోజువారీ సవరిస్తున్న చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఆదివారం లీటర్‌కు 18 పైసల చొప్పున పెంచడంతో ఇవి అత్యంత గరిష్టస్ధాయిలకు చేరి సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల పెంపును అధిగమించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతున్నా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్‌లపై అత్యధిక పన్నుల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్‌లోనే పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. -
‘పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను తగ్గించండి’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో వాటిపై ఎక్సైజ్ పన్నును తగ్గించాల్సిందిగా ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరింది. లీటర్ పెట్రోల్ ధర మంగళవారం ఢిల్లీలో రూ.72.38గా ఉంది. ముంబైలో ఇటీవల రూ.80 దాటిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత ధర ఎప్పుడూ లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్లోనే ఎక్సైజ్ పన్నును తగ్గించాలంటూ పెట్రోలియం శాఖ ఆర్థిక శాఖను కోరింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వమే రూ.19.48 ఎక్సైజ్ పన్నును వసూలు చేస్తోంది. -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యావసర ధరల పెంపుతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోమారు పెట్రో బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.19 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రోల్ ధరల పెంపుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు వారాల్లో రెండుసార్లు పెంపా?
ధరలు తగ్గిస్తామని చెప్పి దరువేస్తున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజం గుంటూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం పట్నంబజారు(గుంటూరు) : ధరలను తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పి బీజేపి ప్రభుత్వం సిగ్గు లేకుండా రెండు వారాల్లో రెండుసార్లు చమురు రేట్లు పెంచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ చమురు రేట్లు పెంచడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, దీనివలన పేద ప్రజల జీవనం మరింత అస్తవ్యస్తంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్ధలకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సంధర్భంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. పది వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. తొలుత కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, వెలూగూరి రాధాకృష్ణమూర్తి, షేక్ అమీర్‌వలి, బి.శ్రీనురెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అయ్యస్వామి, నవీనతం సాంబశివరావు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర,రాష్ట్రాల్లో ప్రజాకంటక పాలన
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగించాలి ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన అనంతపురం టౌన్ : దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజా కంటక పాలన సాగిస్తున్నాయని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నాయని మండిపడ్డారు. పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని నిరసిస్తూ సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎస్‌యూసీఐ కార్యదర్శి అమర్నాథ్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఇండ్లప్రభాకర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విలేకరులతో నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సును, సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి సామాన్య, పేద వర్గాలపై భారం మోపాయన్నారు. సంస్థలు చెల్లించాల్సిన ట్యాక్స్‌ను కూడా ప్రజలపై రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రజలను మరింత కుంగదీసే విధంగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నగర కార్యదర్శి లింగమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, నాయకులు అల్లీపీరా, బాలపెద్దన్న, పెనచర్లబాలయ్య, ఎల్లుట్లనారాయణస్వామి, రాజేశ్, నరేష్, గాదిలింగ, జయలక్ష్మి, బంగారుబాషా, తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒక లీటరు పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై రూ. 1.30 పైసలు తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. అంతర్జాతీయ ముడిచమురు లావాదేవీల్లో చోటుచేసుకున్న పరిణామాలే ధరల తగ్గుదలకు కారణమని తెలిసింది.