
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన సెగలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29-32 పైసలు పెరిగింది. తాజా రికార్డు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.95 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.77.13గా ఉంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) వరుసగా రెండవ రోజు రిటైల్ ధరలను పెంచడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.42, డీజిల్ రూ. 84.14
అమరావతిలో పెట్రోల్ రూ. 93.09, డీజిల్ రూ. 86.31
బెంగళూరులో పెట్రోల్ రూ.89.85 డీజిల్ రూ.81.76
ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99
చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.82.33
కోలకతాలో పెట్రోల్ రూ.88.30 డీజిల్ రూ.80.71
Comments
Please login to add a commentAdd a comment