Record highs
-
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
ధర పెరిగినా బంగారమే
న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా 5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి. ∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి. ∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. -
71,000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 71,000 పాయింట్ల ఎగువన ముగిసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు తాజా గరిష్టాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై కొనసాగింది. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు అంశాలు కలిసొచ్చాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 70,804 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 1,092 పాయింట్లు ఎగసి 71,484 వద్ద కొత్త జీవితకాల గరిష్టం తాకింది. చివరికి 970 పాయింట్లు లాభపడి 71,484 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 310 పాయింట్లు బలపడి 21,492 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 274 పాయింట్లు లాభపడి 21,457 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియలీ్ట, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► సూచీల రికార్డుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్లలో రూ.8.11 లక్షల కోట్ల పెరిగి రూ.357.87 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఐదు మాత్రమే నష్టపోయాయి. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 1,658 పాయింట్లు, నిఫ్టీ 487 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇరు సూచీలకిది వరుసగా ఏడో వారం లాభాల ముగింపు. ► పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు చివరిరోజు నాటికి 93.40 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 88.37 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 82.54 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 115.97 రెట్లు, రిటైల్ కోటా 69.10 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ► డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం, స్టాక్ సూచీల కొత్త శిఖరాలకు ► ఫెడ్ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఐటీ షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఇనీ్ఫబీమ్ 12%, జెన్సార్ టెక్ 11%, మెస్టేక్ 6.50%, హెచ్‌సీఎల్ టెక్ 6%, పర్సిస్టెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 5%, కో ఫోర్జ్, సైయంట్ 4%, టెక్ మహీంద్రా 3 చొప్పున లాభపడ్డాయి. ► బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.91.24 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఒక లక్షల కోట్లను అధిగిమించింది. -
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
తగ్గేదేలే..దూసుకుపోతున్నసెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా 6వ రోజు కూడా తగ్గేదెలే అన్నట్టు దూసుకు పోతున్నాయి. రికార్డుల రికార్డులను సృష్టిస్తూ కీలక సూచీలు ఆల్ టైం గరిష్టాలను తాకాయి. నిఫ్టీ బ్యాంకు ఆల్ టైంహైకి చేరింది. సెన్సెక్స్ 395 పాయింట్లు ఎగిసి 63484 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 18862 వద్ద ప్రారంభ మైనాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, టెక్ఎం, ఇన్ఫోసిస్, విపప్రో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ విన్నర్స్‌గా, బజాజ్ ఆటో, యూపీఎల్, ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్, సిప్లా నష్టపోతున్నాయి. -
రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర.. కొత్తగా ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. -
AP: చివరి రోజు అమ్మకాల మోత!
సాక్షి, అమరావతి: గత ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగాయి. సాధారణంగా రోజుకు 3,000 నుంచి 3,500 వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. కానీ, ఆ ఒక్క రోజు మాత్రం మొత్తం 13,034 వాహనాలు అమ్ముడయ్యాయి. కొత్త ఏడాది జనవరి 1 నుంచి రవాణేతర వాహనాలపై జీవిత పన్ను పెరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కువమంది ఆ రోజు వాహనాలు కొనుగోలు చేశారని, దీంతో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలోని 738 వాహన డీలర్ల నుంచి ఏకంగా 13,034 వాహన విక్రయాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు 10,529.. 1,742 కార్లు అమ్ముడయ్యాయి. అలాగే, ఆ ఒక్కరోజే త్రైమాసిక పన్ను, జీవిత పన్ను రూపంలో రవాణా శాఖకు రూ.32.53 కోట్ల ఆదాయం వచ్చింది. జీవిత పన్ను పెంపు ఇక జనవరి 1 నుంచి ఐదు లక్షల రూపాయల్లోపు రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. అలాగే, రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల్లోపు ఉన్న రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 14 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు వాహనాలపై 17 శాతం, రూ.20 లక్షలు పైనున్న రవాణేతర వాహనాలపై 18 శాతం మేర జీవిత పన్ను అమల్లోకి వచ్చింది. ఈ కారణంతోనే మొన్న డిసెంబర్ 31న భారీఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు కొనుగోలు చేశారని రవాణా శాఖాధికారులు తెలిపారు. -
ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్ నెక్ట్స్ టార్గెట్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడింది. అటు ఎనలిస్టులు కూడా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితుందని భావిస్తున్నారు.వరుసగా నాలుగో రోజు కరోనా కొత్త కేసులు లక్ష మార్క్‌కు దిగి రావడం, చక్కటి వర్షపాతం వార్తలతో వరుసగా రెండవ సెషన్లోనూ దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈ రోజు రికార్డు స్థాయిలో 231.52 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది మార్చి 23 కనిష్టంతో పోలిస్తే ఇది 129.66 లక్షల కోట్ల రూపాయలు లేదా 127.29శాతం ఎక్కువ. అంటే గత14 నెలల్లో స్టాక్ మార్కెట్ , పెట్టుబడిదారుల సంపదలో గణనీయంగా పుంజుకుందన్నమాట. శుక్రవారం సెన్సెక్స్ 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 52,516వద్ద, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని 15,431ని తాకింది. సెన్సెక్స్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 10.09శాతం లేదా 4,816 పాయింట్లు సాధించింది. నిఫ్టీ 13.24శాతం లేదా 1,851 పాయింట్లు పెరిగింది. ఒక సంవత్సరంలో 59.86 శాతం లేదా 5,922 పాయింట్లు ఎగిసింది. ఈ రికార్డుర్యాలీ తరువాత ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. మరికొంతమంది మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందని సెలక్టివ్‌గా పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియ, దేశంలో ప్రజలందరికీ టీకాలు పూర్తియితే ఆర్థిక పునరుజ్జీవనంపై యస్ సెక్యూరిటీస్ సీనియర్ ప్రెసిడెంట్, రీసెర్చ్ , ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ అమర్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ టాప్ 10 హెవీవెయిట్ స్టాక్‌లలో ర్యాలీ ఉంటుందని.. ఇప్పటికే ఆరు నెలల విరామం తర్వాత ఆర్ఐఎల్ ఆ దశలో ముందుందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో సెన్సెక్స్ డిసెంబర్ 2021 నాటికి 60వేలకు చేరుతుదని వ్యాఖ్యానించారు. జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్, రాహుల్ శర్మ కూడా మార్కెట్ భవిష్యత్తు సానుకూల అంచనాలను ప్రకటించారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వికె విజయకుమార్ మాట్లాడుతూ మిడ్, స్మాల్ క్యాప్ జోరు ఆందోళన కలిగించే అంశమన్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ 2017లో చిన్న సూచిక 60శాతం పెరగడాన్ని గుర్తు చేశారు. స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఆర్థిక, ఐటీ, ఫార్మా, మెటల్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సానుకూల గ్లోబల్ మార్కెట్లు, తగ్గుతున్న కోవిడ్ కేసులు, అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు, మంచి మాన్సూన్స్ మధ్య సెన్సెక్స్ ఓవర్‌బాట్ స్థాయికి చేరుకుందని టిప్స్ 2 ట్రేడ్స్ సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ప్రస్తుత స్థాయిలో లాభాల స్వీకరణకు దిగుతారన్నారు. రానున్న వారంలో 52170 వద్ద నిఫ్టీ బలమైన మద్దతు స్థాయిగా అంచనా వేశారు. చదవండి: stock market : రికార్డు క్లోజింగ్ పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
stock market : రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో పటిష్టంగా ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ, వరుసగా నాలుగవ రోజు లక్ష కన్నా తక్కువ రోజువారీ కరోనావైరస్ కేసుల నమోదు దేశంలో రుతుపవనాల ప్రారంభం ఇన్వెస్టర్లసెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా కీలక సూచీలు రికార్డు స్థాయిని నమోదు చేశాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు జూమ్ చేసి 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే వారం ముగింపులో ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 174 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్ల మేర లాభపడింది. 52,474 వద్ద సెన్సెక్స్, 15,799.35 రికార్డు స్థాయిలో ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియాల్టీ, మీడియా, బ్యాంక్ సూచీలు నష్టపోయాయి. టాటా స్టీల్ నిఫ్టీ లాభంలో అగ్రస్థానంలో నిలిచింది. జెఎస్డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిండాల్కో, పవర్ గ్రిడ్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, డివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్టూ బ్రో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి. చదవండి : ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్ నెక్ట్స్ టార్గెట్ Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! -
stockmarkets: రికార్డుల మోత
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 52610 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది.అటు నిఫ్టీ కూడా15828 స్థాయికి చేరింది. ఆరంభం లాభాలనుంచి 313 పాయింట్లు మేర సెన్సెక్స్ ఎగిసింది. నిఫ్టీ 95 పాయింట్లు జంప్ చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. టాటా స్టీల్, హెచ్‌సీఎల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ పవర్, కోల్ఇండియా, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ లాభపడుతున్నాయి. మరోవైపు బజాన్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇంకా టైటన్, విప్రో, బ్రిటానియా, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. గురువారం నాటి ముగింపు 73.05తో పోలిస్తే డాలరు మారకంలో రూపాయి 72.84 వద్ద కొనసాగుతోంది. చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు! -
మూడో రోజూ బాదుడు : వాహనదారులు బెంబేలు
సాక్షి, ముంబై: దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు (ఫిబ్రవరి 11, గురువారం) పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. (Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ) ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోలు రూ. 87.85 డీజిల్ రూ. 78.03 ముంబైలో పెట్రోలు రూ. 94.36 రూ. 84.94 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .89.16డీజిల్ ధర రూ .81.61 చెన్నైలో పెట్రోల్ ధర రూ .90.18 డీజిల్ ధర రూ . 83.18 బెంగళూరులో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ.82.72 హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 91.35, డీజిల్ ధర రూ. 85.11 అమరావతిలో పెట్రోల్ రూ. 93.99, డీజిల్ రూ. 87.25 మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. -
ప్రాఫిట్ బుకింగ్ : బడ్జెట్ ర్యాలీకి బ్రేక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగు నుంచి వెనక్కి తగ్గాయి. రికార్డుల మోత మోగించిన సూచీలు ఆఖరి గంటలో మొత్తం లాభాలను కోల్పోయాయి. లాభాల స్వీకరణతో రికార్డు హై నుంచి సెన్సెక్స్ 642 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ , ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. చివరకు సెన్సెక్స్ 20పాయింట్ల నష్టంతో 51329 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 15109వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుస ఏడు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 51,835.86 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 15,257 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ , రిలయన్స్ డీల్‌కు హైకోర్టు తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేస్తూ సానుకూల తీర్పురావడంతో ఫ్యూచర్ షేర్లు 10 శాతం ఎగిసాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది. ఇంకా టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, టీసీస్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎస్బిఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్, టైటాన్, శ్రీ సిమెంట్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రికార్డు స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో ఆరు రోజుల బడ్జెట్ ర్యాలీని బ్రేక్ పడిందని విశ్లేషకులు తెలిపారు. -
పెట్రో షాక్: రికార్డు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ నింగిని చూస్తున్నాయి రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. నేడు (మంగళవారం) పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురుకంపెనీలు నిర్ణయించాయి. గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. జనవరి 6 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.3కు పైగా పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ .87.30 కాగా, డీజిల్ ధర రూ .77.48గా ఉంది. ముంబైలో లీటరుకు రూ .93.83. డీజిలు ధర రూ .84.36 పలుకుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.70, డీజిల్ రూ .82.66 కోల్‌కతాలో పెట్రోల్ రూ .88.63, డీజిల్ ధర రూ .81.06 బెంగళూరులో పెట్రోల్ రూ.90.22 డీజిల్ రూ.82.13 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ. 84.52 అమరావతిలో పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 86.68 అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గరిష్టానికి చేరాయి. మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ బ్యారెల్ ధర 60 డాలర్లు దాటేసింది. సోమవారం 2 శాతం పెరిగి ఏడాదిలోనే అత్యధిక స్థాయిని తాకాయి. -
బుల్ దౌడు : నింగిని తాకుతున్న సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల బుల్ ర్యాలీ అప్రతిహతంగా కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజూ దేశీయ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిలనునమోదు చేశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన సూచీలు అప్‌ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో 51693 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 15229 ఎగువన ట్రేడవుతోన్నాయి. బ్యాంక్ షేర్ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాల్లో ట్రేడవుతోంది.యూపీఎల్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, టైటాన్ లాభాల్లో ఉండగా, ఐఓసీ, టాటా మోటార్స్ , ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్ నష్టపోతున్నాయి. మరోవైపు చమురు ధరలు మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో బీపీసీఎల్ లాంటి ఆయిల్ రంగ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. కరోనా మహమ్మారి సంక్షోభం నుండి వేగంగా ఆర్థికంగా కోలుకునే అశావాదం మధ్య పెట్టుబడిదారుల పాజిటివ్ సెంటిమెంట్‌తో వాల్ స్ట్రీట్ సోమవారం ఆల్-టైమ్ క్లోజింగ్ హై స్థాయికి చేరుకుంది. దీంతో మన మార్కెట్లు కూడా లాభాల దౌడుతీస్తున్నాయి. -
పెట్రో ధరల మోత : రికార్డు హై
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన సెగలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29-32 పైసలు పెరిగింది. తాజా రికార్డు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.95 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.77.13గా ఉంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) వరుసగా రెండవ రోజు రిటైల్ ధరలను పెంచడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.42, డీజిల్ రూ. 84.14 అమరావతిలో పెట్రోల్ రూ. 93.09, డీజిల్ రూ. 86.31 బెంగళూరులో పెట్రోల్ రూ.89.85 డీజిల్ రూ.81.76 ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99 చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.82.33 కోలకతాలో పెట్రోల్ రూ.88.30 డీజిల్ రూ.80.71 -
మూడో రోజు భారీ లాభాలు, రికార్డు ముగింపు
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ కూడా భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి జోరుగా ఉన్న కీలక సూచీలు బుధవారం మరో జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. ఇంట్రా డేలో 700పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 50,472 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. అనంతరం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా చివరకు 458 పాయింట్ల లాభంతో 50256 వద్ద 50 వేల మార్క్‌కు ఎగువన ముగియడం విశేషం. నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ కూడా రికార్డుస్థాయిలను నమోదు చేశాయి. 14, 840 స్థాయిని టచ్ చేసిన నిఫ్టీ చివరకు 142 పాయింట్ల లాభంతో 14789 వద్ద ముగిసింది. . పీఎస్‌యూబ్యాంకులు, ఫార్మ, మెటల్ రంగ షేర్లుమెరుపులు మెరిపించాయి. ఫార్మా ఇండెక్స్ 3 శాతానికి పైగా ర్యాలీ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 9.3 శాతం ఎగిసిటాప్ గెయినర్‌గా ఉంది. డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, దివీస్, ల్యాబ్స్ సిప్లా 4-5 శాతం చొప్పున లాభపడగా, పవర్ గ్రిడ్, ఎం అండ్ ఎం టాటా స్టీల్, హిందాల్కో జేఎస్‌డబ్ల్యు స్టీల్ 2-3 శాతం లాభాలతో ముగిసాయి. మరోవైపు, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి , నెస్లే స్వల్పంగా నష్టపోయాయి. -
వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు జోష్‌నిచ్చే వీలుంది. వారాంతాన పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా నంబర్ వన్ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో గత వారం(4-8) మార్కెట్లు 2 శాతం ఎగశాయి. వెరసి సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడి 48,782 వద్ద నిలవగా.. నిఫ్టీ 329 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. 2009 తదుపరి వరుసగా 10 వారాలపాటు లాభాలతో నిలిచిన రికార్డును సైతం మార్కెట్లు సాధించాయి. గత వారాంతానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి దాదాపు రూ. 196 లక్షల కోట్లను తాకడం విశేషం! ఇకపై మార్కెట్లు మరింత జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలు ప్రకటించనుండటంతో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు పేర్కొంటున్నారు. చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) జాబితా ఇలా నేడు(9న) డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇన్ఫోసిస్, విప్రో 13న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 15న పనితీరును వెల్లడించనున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ 7.7 శాతమే క్షీణించనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దాదాపు ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇది కొంతమేర ఆందోళనకర అంశమే అయినప్పటికీ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనుండటం, తద్వారా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్) ఎఫ్‌పీఐల దన్ను గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ. 8,758 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లోనూ రికార్డు స్థాయిలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పంప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 తొలి వారంలోనూ దేశీ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో అంతరర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్ప కరెక్షన్ల నడుమ మార్కెట్లు మరింత వృద్ధి చూపుతున్నట్లు తెలియజేశారు. -
రికార్డులతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా
ముంబై, సాక్షి: వరుసగా 11వ రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే ఒడిదొడుకులకు తెరలేచింది. ప్రస్తుతం సెన్సెక్స్ 64 పాయింట్లు పుంజుకుని 48,502కు చేరింది. నిఫ్టీ సైతం 22 పాయింట్లు లాభపడి 14,221 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 48,617 సమీపానికి చేరింది. నిఫ్టీ సైతం 14,244 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,373 దిగువన, నిఫ్టీ 14,183 వద్ద కనిష్టాలను చవిచూశాయి. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఆటో, మెటల్ 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.5-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టైటన్, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, మారుతీ 3.3-1 శాతం మధ్య జంప్ ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐటీసీ, ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, ఐషర్, అల్ట్రాటెక్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ 1.3-0.3 శాతం మధ్య క్షీణించాయి. నౌకరీ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో నౌకరీ, వేదాంతా, కంకార్, బాటా, ఎన్ఎండీసీ, టాటా కెమ్, శ్రీరామ్ ట్రాన్స్, ఇండస్ టవర్, బీవోబీ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క లుపిన్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఆర్తి ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, పిరమల్ 3-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,711 షేర్లు లాభపడగా.. 700 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐలు ఓకే నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 986 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 490 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్.. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్
ముంబై, సాక్షి: తొలుత కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ చివరికి మార్కెట్లు హుషారుగా ముగిశాయి. వెరసి వరుసగా 10వ రోజూ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో గత 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,903 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి జోరందుకుని చివరి సెషన్‌కల్లా 48,486ను అధిగమించింది. వెరసి కనిష్టం నుంచి 583 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం 14,216-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. (2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6) మెటల్ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ 2.6 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం చొప్పున లాభపడగా.. మెటల్ 1.4 శాతం, రియల్టీ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటన్, హెచ్‌సీఎల్ టెక్ 6.3-1.3 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో 2-1 శాతం మధ్య క్షీణించాయి. నౌకరీ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో నౌకరీ 14.5 శాతం దూసుకెళ్లగా.. ఇండస్ టవర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఆర్తి ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ 5.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్, సెయిల్, నాల్కో, ఇండిగో, చోళమండలం, డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్ 2.5-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4-0.7 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,780 లాభపడగా.. 1,289 నష్టపోయాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
నయా జోష్- 48,000 చేరువలో సెన్సెక్స్
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయివైపు కదులుతుంటే.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 193 పాయింట్లు ఎగసి 47,944కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 14,031 వద్ద ట్రేడవుతోంది. వెరసి వరుసగా ఏడో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,944కు చేరగా.. నిఫ్టీ 14,033ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం! (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్) ఫార్మా, మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 2.2 శాతం లాభపడగా.. మీడియా, ఐటీ, ఆటో 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, యూపీఎల్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్ ఫార్మా, హిందాల్కో, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, ఐషర్, గెయిల్, టాటా స్టీల్ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో బీఈఎల్, లాల్‌పాథ్, పీఎన్బీ, బీవోబీ, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, సెయిల్, అరబిందో, వేదాంతా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,607 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్
ముంబై, సాక్షి: ఈ ఏడాది మార్చి కనిష్టాల నుంచి 70 శాతం ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా కదులుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్‌చేసి 47,714ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ దాదాపు లాభాల సెంచరీ చేసి 13,968 సమీపానికి చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా బోరోసిల్ రెనెవబుల్స్, ఫైనోటెక్స్ కెమికల్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్‌కార్ట్ బోర్డు రీజిగ్) బోరోసిల్ రెనెవబుల్స్ 11 రోజులుగా దూకుడు చూపుతున్నసోలార్ గ్లాస్ తయారీ కంపెనీ బోరోసిల్ రెనెవబుల్స్ కౌంటర్ మరోసారి 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువై రూ. 280 వద్ద ఫ్రీజయ్యింది. ఇటీవల కంపెనీ రూ. 126.6 ధరలో క్విప్‌ను చేపట్టింది. ఈ ధరతో పోలిస్తే తాజాగా రెట్టింపునకుపైగా లాభపడింది. ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ తదితరాలలో వినియోగించే లో ఐరన్ సోలార్ గ్లాస్‌ను కంపెనీ తయారు చేస్తోంది. క్విప్ నిధులను ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు వినియోగించనుంది. ప్రస్తుతం రోజుకి 450 టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 950 టీపీడీకు పెంచే ప్రయత్నాల్లో ఉంది. కాగా.. గత 11 రోజుల్లో ఈ కౌంటర్ 113 శాతం దూసుకెళ్లడం విశేషం! ఫైనోటెక్స్ కెమికల్స్ నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో దాదాపు 6 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో ఫైనోటెక్స్ కెమికల్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం జంప్‌చేసి రూ. 62ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం లాభంతో రూ. 60 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లోనూ ఈ కౌంటర్ 29 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సోమవారం నిప్పన్ ఇండియా ఎంఎఫ్ షేరుకి రూ. 45.25 ధరలో 6.61 మిలియన్ ఫైనోటెక్స్ షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 30 కోట్లు వెచ్చించింది. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నాలుగో రోజూ- రికార్డులతో షురూ
ముంబై, సాక్షి: క్రిస్మస్ సందర్భంగా వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెరసి ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 47,354ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు జంప్‌చేసి 47,258కు చేరగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం తొలుత 13,865 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 90 పాయింట్లు ఎగసి 13,839 వద్ద ట్రేడవుతోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, గెయిల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ అదికూడా 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటి స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, డీఎల్ఎఫ్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, మదర్సన్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు వేదాంతా, బయోకాన్, ఇండస్ టవర్, జూబిలెంట్ ఫుడ్, అంబుజా, అపోలో హాస్పిటల్, ఏసీసీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,697 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఐటీ షేర్ల దూకుడు- సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. తొలుత కొంతమేర ఊగిసలాటకు లోనైనప్పటికీ ప్రస్తుతం సెన్సెక్స్ 311 పాయింట్లు జంప్‌చేసింది. 46,318కు చేరింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు ఎగసి 13,557 వద్ద ట్రేడవుతోంది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలోనూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. యాక్సెంచర్ అంచనాలను మించిన గైడెన్స్ ప్రకటించడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు విప్రో తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 70 కోట్ల డాలర్ల డీల్‌ను కుదుర్చుకోవడం, రూ. 9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుండటం వంటి అంశాలు జత కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కౌంటర్లలో కనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా అటు బీఎస్ఈలోనూ, ఇటు ఎన్ఎస్ఈలోనూ ఐటీ ఇండెక్సులు తాజాగా సరికొత్త గరిష్టాలను చేరాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌తోపాటు.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్) రికార్డుల బాట ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా.. బీఎస్ఈలో 24,174కు చేరింది. సాఫ్ట్వేర్ సేవల కంపెనీలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ. 1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ. 960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 933 సమీపంలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ రూ. 3,685 సమీపంలో, ఎంఫసిస్ రూ. 1,533 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 265 సమీపంలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ. 1,459 వద్ద చరిత్రాత్మక గరిష్టాల రికార్డులను సాధించాయి. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) లాభాల్లో ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో రామ్‌కో సిస్టమ్స్, ఈక్లెర్క్స్, హెచ్జీఎస్, ఫస్ట్‌సోర్స్, మాస్టెక్, టాటా ఎలక్సీ, ఎన్ఐఐటీ లిమిటెడ్, మైండ్‌ట్రీ, ట్రైజిన్, ఇంటెలెక్ట్ డిజైన్, శాస్కెన్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ తదితరాలు 8-3.5 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! -
బుల్ జోరు- మార్కెట్లు ఖుషీ
ముంబై, సాక్షి: ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు, కోవిడ్-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల దుమ్మురేపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 403 పాయింట్లు జంప్‌చేసి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్లు ఎగసి 13,683 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. మంగళవారం నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద ముగియడం గమనార్హం! తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,705 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,692 వద్ద సరికొత్త గరిష్టాలను సాధించాయి. మెటల్, ఆటో.. ఎన్ఎస్ఈలో రియల్టీ 5 శాతం జంప్‌చేయగా.. మెటల్, ఆటో, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మాత్రం 1.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, దివీస్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, గెయిల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ అప్ డెరివేటివ్స్‌లో డీఎల్ఎఫ్ 10 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్, పేజ్, అశోక్ లేలాండ్, జిందాల్ స్టీల్, హావెల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జూబిలెంట్ ఫుడ్, నాల్కో, అపోలో టైర్, సెయిల్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పీఎన్బీ 6 శాతం పతనంకాగా, జీఎంఆర్ ఇన్ప్రా, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, టాటా కెమ్, టొరంట్ పవర్, పెట్రోనెట్, కంకార్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బీవోబీ 3.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో ఐబీ రియల్టీ 12 శాతం, శోభా, ఒబెరాయ్ 5 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,858 లాభపడగా.. 1,167 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
46,000 దాటేసిన సెన్సెక్స్‌ప్రెస్
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరోసారి సరికొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్ 495 పాయింట్లు జంప్‌చేసి 46,103 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 46,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 136 పాయింట్లు జమ చేసుకుని 13,529 వద్ద స్థిరపడింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,164 వద్ద, నిఫ్టీ 13,549 వద్ద కొత్త రికార్డులను సాధించాయి. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా స్పీడ్.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 1-0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఐవోసీ, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్, ఐటీసీ, ఆర్ఐఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ 4.7-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్, విప్రో, గ్రాసిమ్, టాటా స్టీల్, మారుతీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో, సిప్లా 1.5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. చదవండి: (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) సిమెంట్ వీక్ డెరివేటివ్స్‌లో పీవీఆర్, ఆర్ఈసీ, కమిన్స్, ఐడిఎఫ్సీ ఫస్ట్, జీఎంఆర్, ఐడియా, సన్ టీవీ, బీఈఎల్ డీఎల్ఎఫ్ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కెనరా బ్యాంక్, పీఎన్బీ, టీవీఎస్ మోటార్, సెయిల్, జూబిలెండ్ ఫుడ్, అపోలో టైర్, ఏసీసీ, రామ్‌కో సిమెంట్, అంబుజా, పెట్రోనెట్ 6.6- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,767 లాభపడగా.. 1,200 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఈ షేర్లు- రేస్ గుర్రాలు
ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్, గుడ్ఇయర్ ఇండియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. మార్కెట్ క్యాప్ సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం) డీమార్ట్ జోరు వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్ఇయర్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రికార్డుల ర్యాలీ- ప్రభుత్వ బ్యాంక్స్ హవా
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. వెరసి మరోసారి రికార్డుల ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్ 181 పాయింట్లు ఎగసి 45,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 13,393 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,742ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 13,435ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్‌కు భారీ డిమాండ్ కనిపించడం గమనార్హం! చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 7.15 శాతం దూసుకెళ్లగా.. రియల్టీ, ఐటీ 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే మెటల్, ఫార్మా, మీడియా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ 3-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎయిర్టెల్ 2.3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. బ్యాంకింగ్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్ 19 శాతం, పీఎన్బీ 15 శాతం, బీవోబీ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో భెల్, వేదాంతా, గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, చోళమండలం 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్బీఎల్ బ్యాంక్, పెట్రోనెట్, లుపిన్, జిందాల్ స్టీల్, పీఎఫ్సీ, బంధన్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్ 2.6-1.8 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,498 లాభపడగా.. 1,460 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా పటిష్టంగా సాగుతున్న సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలపై అంచనాలతో ఇన్వెస్టర్లు సిమెంట్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ఈ ఏడాది(2020-21) ద్వితీయార్ధంలో కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్న అంచనాలు సైతం జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సిమెంట్ రంగంలోని కొన్ని కౌంటర్లు తాజాగా చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. మరికొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. లాభాలతో ఎన్ఎస్ఈలో తొలుత శ్రీ సిమెంట్ షేరు రూ. 25,655ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా జేకే సిమెంట్ రూ. 2,080 వద్ద, రామ్‌కో సిమెంట్ రూ. 900 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో ఏసీసీ రూ. 1,785 వద్ద, దాల్మియా భారత్ రూ. 1,198 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ. 909 వద్ద 52 వారాల గరిష్టాలను తాకడం గమనార్హం. ఇతర కౌంటర్లలో కాకతీయ సిమెంట్స్, డెక్కన్ సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్, అల్ట్రాటెక్, సాగర్‌సిమెంట్స్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం గ్రాసిమ్ 3.4 శాతం లాభపడి రూ. 906 వద్ద, దాల్మియా భారత్ 4.5 శాతం జంప్‌చేసి రూ. 1151 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఏసీసీ 2 శాతం పెరిగి రూ. 1740 వద్ద, శ్రీ సిమెంట్ 2 శాతం పుంజుకుని రూ. 24,748 వద్ద, జేకే సిమెంట్ 1.3 శాతం వృద్ధితో రూ. 2066 వద్ద కదులుతున్నాయి. అంచనాలు ఇలా ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో(అక్టోబర్- మార్చి) సిమెంట్ కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సిమెంటుకు కనిపిస్తున్న పటిష్ట డిమాండ్ కారణంగా విద్యుత్, ఇంధనం, రవాణా తదితర వ్యయాలను మించి ధరలు బలపడనున్నట్లు అంచనా వేస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్ -డిసెంబర్ కాలంలో ధరలు 0.8 శాతం పడినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. వెరసి 2020-21లో సిమెంట్ రంగ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పుంజుకోగలదని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. రుతుపవనాల కాలంలో సిమెంట్ ధరలు స్వల్పంగా నీరసించినప్పటికీ తిరిగి 1-2 శాతం స్థాయిలో ప్రస్తుతం బలపడినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. పెట్‌కోక్ వంటి ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ ఈ రంగంపై ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తోంది. ఈ ఏడాది క్యూ2లో సిమెంట్ అమ్మకాలు త్రైమాసిక ప్రాతిపదికన 35.7 శాతం పెరిగినట్లు తెలియజేసింది. -
వారెవ్వా.. మార్కెట్లు ధూమ్‌ధామ్
ముంబై, సాక్షి: ఈ ఏడాది మార్చిలో కుప్పకూలాక జోరందుకున్న మార్కెట్లు బుల్ వేవ్‌లోనే కదులుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఇండెక్సులు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నాయి. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 129 పాయింట్లు ఎగసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 13,055 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ సైతం 44,523 పాయింట్లు జంప్‌చేసి 44,523 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాలను సాధించాయి. ఈ బాటలో ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 44,601 వద్ద, నిఫ్టీ 13,079 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ జోరు కరోనా వైరస్ విలయంతో ఈ ఏడాది మార్చి 24న నిఫ్టీ 7,511 పాయింట్లకు పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టంకాగా.. తదుపరి ర్యాలీ బాట పట్టింది. 8 నెలల్లోనే 75 శాతం దూసుకెళ్లింది. 13,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. అయితే గతేడాదిలో 12,000 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాక 13,000కు చేరేందుకు 18 నెలల సమయం తీసుకోవడం గమనార్హం! బ్యాంక్స్ భేష్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా, మెటల్ 2.5- శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐషర్, హిందాల్కో, ఎంఅండ్ఎం, ఐటీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్ 4.5-2.8 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, నెస్లే, గెయిల్, శ్రీ సిమెంట్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్, ఎయిర్టెల్, ఐవోసీ 1.5-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. బాష్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో బాష్ 10 శాతం జంప్‌చేయగా.. ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, ఎస్ఆర్ఎఫ్, పిరమల్ 6-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క జీఎంఆర్, జూబిలెంట్ ఫుడ్, అపోలో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్, యూబీఎల్, ముత్తూట్ 3-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.9 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,637 లాభపడగా.. 1,174 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు: రికార్డులే రికార్డులు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందడి కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఇండెక్సులు నిరవధికంగా పరుగు తీస్తున్నాయి. వెరసి రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 315 పాయింట్లు ఎగసి 43,953 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు పుంజుకుని 12,874 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో తొలిసారి సెన్సెక్స్ 44,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ సైతం 13,000 పాయింట్ల మార్క్ సమీపానికి అంటే 12,934కు చేరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ఆశలు రేపగా.. తాజాగా మోడర్నా ఇంక్ సైతం వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో సోమవారం యూఎస్ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటో సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, రియల్టీ రంగాలు 2.5-2 శాతం లాభపడగా.. ఆటో 1 శాతం బలపడింది. మీడియా, ఫార్మా, ఐటీ 1.3-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఎల్అండ్టీ 6.2- 2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ 4.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) చిన్న షేర్లు అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, నాల్కో, ఐసీఐసీఐ ప్రు, ఎంఆర్ఎఫ్, పేజ్, అంబుజా, టాటా పవర్ 6-3.4 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పిరమల్, టొరంట్ ఫార్మా, సన్ టీవీ, ఐబీ హౌసింగ్, లుపిన్, బాష్, ముత్తూట్ 3.2- 1.8 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,564 లాభపడగా.. 1,254 నష్టపోయాయి. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) అమ్మకాలవైపు నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!
ముంబై: దీపావళి వెలుగులు కొనసాగిస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా 44,000 పాయింట్ల మైలురాయిని సైతం దాటేసింది. 44,161కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 12,934 వరకూ ఎగసింది. 13,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. వెరసి మళ్లీ సరికొత్త గరిష్టాల రికార్డులను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 43,987 వద్ద కదులుతోంది. నిఫ్టీ 92 పాయింట్లు అధికంగా 12,872 వద్ద ట్రేడవుతోంది. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్‌పై ఆశలతో సోమవారం యూఎస్ మార్కెట్లు సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం గమనార్హం! మెటల్, బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్ 2-1 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.5 శాతం స్థాయిలో క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, శ్రీ సిమంట్, గెయిల్, ఏషియన్ పెయింట్స్ 4.2-1.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఐషర్, ఐవోసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ 3.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ డెరివేటివ్స్‌లో ఐడియా, అంబుజా, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్ 4.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, పిరమల్, టొరంట్ ఫార్మా, మ్యాక్స్ ఫైనాన్స్, ఆర్ఈసీ, మణప్పురం, కోఫోర్జ్, ముత్తూట్ 3.6-1.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,029 లాభపడగా.. 702 నష్టాలతో కదులుతున్నాయి. -
మార్కెట్ల జోరు చూడతరమా..!!
ముంబై: వరుసగా 8వ రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు జంప్‌చేసి 43,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 12,749 వద్ద స్థిరపడింది. వెరసి ఇండెక్సులు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలను పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించాయి. 8 రోజుల భారీ ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలుత సెన్సెక్స్ 43,708 వరకూ దూసుకెళ్లింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 42,970 వరకూ వెనకడుగు వేసింది. అంటే గరిష్టం నుంచి దాదాపు 740 పాయింట్లు క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 12,770- 12,571 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మెటల్స్ మెరుపులు ఎన్ఎస్ఈలో ఫార్మా, మెటల్ 3.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ1.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 0.5-0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్ 8 శాతం స్థాయిలో పురోగమించాయి. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఐషర్, ఐటీసీ, బజాజ్ ఫిన్, హీరో మోటో, టాటా మోటార్స్, సిప్లా, గెయిల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, అల్ట్రాటెక్, దివీస్ 4.2-2.8 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్ 5.25 శాతం, ఆర్ఐఎల్ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. అపోలో అప్ డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అరబిందొ, ఐజీఎల్, లుపిన్, సెయిల్, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా, ఆర్ఈసీ, అంబుజా, మదర్సన్ 8-3.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. భారత్ ఫోర్జ్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, హావెల్స్, బాటా, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బీవోబీ 4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,433 లాభపడగా.. 1,295 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,036 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 13,399 కోట్ల పెట్టుబడులు కుమ్మరించడం గమనార్హం! అక్టోబర్‌లో రూ. 14,537 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. -
మార్కెట్లు అదుర్స్- సెన్సెక్స్ ట్రిపుల్
ముంబై: మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. వరుసగా 8వ రోజు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 43,596ను తాకగా.. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 12,735 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,753కు చేరగా.. సెన్సెక్స్ 43,675ను అధిగమించింది. వెరసి మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. నిఫ్టీ-50 మార్కెట్ క్యాప్(విలువ) రూ. 100 లక్షల కోట్లను అధిగమించడం విశేషం! చదవండి: (మళ్లీ చమురు ధరల సెగ) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఎంఅండ్ఎం, హీరో మోటో, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, సిప్లా, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, హిందాల్కో, ఐటీసీ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ అదికూడా 0.7-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎన్ఎండీసీ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, సెయిల్, లుపిన్, ఐబీ హౌసింగ్, అరబిందో, అపోలో హాస్పిటల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీ, ఐజీఎల్, ఎస్కార్ట్స్, పీఎన్బీ, సన్ టీవీ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎన్ఎండీసీ 4 శాతం పతనంకాగా.. బాటా, జీఎంఆర్, అపోలో టైర్, ఇండిగో, ఐడియా, హావెల్స్, వోల్టాస్ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,119 లాభపడగా.. 551 నష్టాలతో కదులుతున్నాయి. -
కొత్త చరిత్ర- 43,000 దాటిన సెన్సెక్స్
ముంబై: వరుసగా ఏడో రోజూ స్టాక్ బుల్ కాలు దువ్వింది. రోజంతా లాభాల దౌడు తీసింది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం వరుసగా రెండో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్ చేసి 43,278 వద్ద నిలిచింది. నిఫ్టీ 170 పాయింట్లు ఎగసి 12,631 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద గరిష్టాలను తాకాయి. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 4 శాతం జంప్ చేయగా.. రియల్టీ 2 శాతం ఎగసింది. ఫార్మా, ఐటీ 4 శాతం స్థాయిలో పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫిన్, స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, దివీస్, నెస్లే, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, హిందాల్కో, మారుతీ, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ 6-1 శాతం మధ్య పతనమయ్యాయి. ఇండిగో జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇండిగో, అశోక్ లేలాండ్, యూబీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, ఫెడరల్ బ్యాంక్ 9-5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ముత్తూట్, కేడిలా, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, కోఫోర్జ్, టొరంట్ ఫార్మా, మైండ్ ట్రీ, అరబిందో, నౌకరీ, మారికో 7-3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,231 లాభపడగా.. 1,482 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,036 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
రెండో రోజూ సరికొత్త రికార్డ్స్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తద్వారా రెండో రోజూ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ట్రిపుల్ సెంచరీతో ప్రారంభంకావడం ద్వారా సెన్సెక్స్, 80 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,959ను తాకింది. తద్వారా 43,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. ఇక నిఫ్టీ తొలిసారి 12,500ను అధిగమించి 12,557కు చేరింది. సోమవారం సైతం మార్కెట్లు లైఫ్ టైమ్ హైలను సాధించిన విషయం విదితమే. భూగోళాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 మహమ్మారికి చెక్ పెట్టగల వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు ఫైజర్ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 42,714కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 12,486 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 1.6 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ 3 శాతం, ఫార్మా 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, ఎల్అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గెయిల్, ఎస్ బీఐ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, ఐవోసీ, శ్రీసిమెంట్, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, సిప్లా, దివీస్, నెస్లే, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ 4-0.6 శాతం మధ్య క్షీణించాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్స్‌లో పీవీఆర్, యూబీఎల్, ఇండిగో, మెక్‌డోవెల్, భారత్ ఫోర్జ్, టాటా పవర్, అశోక్ లేలాండ్, బాష్ 6-1.6 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. ముత్తూట్, జూబిలెంట్ ఫుడ్, మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, కోఫోర్జ్, మణప్పురం 6-2.3 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్ 0.2 శాతం నీరసించగా, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 841 లాభపడగా.. 881 నష్టాలతో కదులుతున్నాయి. -
భళిరా భళి- మార్కెట్ల కొత్త రికార్డ్స్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం. కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ తొలుత 673 పాయింట్లు దూసుకెళ్లింది 42,566ను తాకింది. నిఫ్టీ సైతం 173 పాయింట్లు ఎగసి 12,436కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 12,420 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 42,446 వద్ద కదులుతోంది. కారణలేవిటంటే? డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తదితర కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధాని మోడీతో బైడెన్ కు సత్సంబంధాలుండటం, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.8-1.7 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, యాక్సిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం కోల్ ఇండియా అదికూడా 0.25 శాతం నీరసించింది. బంధన్ జూమ్ డెరివేటివ్స్‌లో బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, ఇండిగో, మైండ్ ట్రీ, మదర్ సన్, కోఫోర్జ్, మారికో, బీఈఎల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం సీపీ 3.5-1.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అశోక్ లేలాండ్, సెయిల్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, బాష్, టొరంట్ పవర్, హావెల్స్, పీవీఆర్ 1.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,296 లాభపడగా.. 491 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్‌కల్లా కోవిడ్-19కు చెక్పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బ్లూచిప్స్ దన్ను ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్ మోటార్స్, హెచ్‌పీ 4 శాతం, ఇంటెల్ కార్ప్, ఫేస్బుక్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్ మోటార్, బోయింగ్ 1.75 శాతం, అమెజాన్ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్‌కింగ్స్ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్ 2 శాతం క్షీణించింది. -
అదిరే.. అదిరే.. పసిడే.. అధరే- వెండి రికార్డ్
విదేశీ మార్కెట్లో ప్రతి రోజూ సరికొత్త రికార్డులను సాధిస్తున్న ధరలకు అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది. కాగా.. మంగళవారమే వెండి రూ. 4,000 జంప్‌చేయడం ద్వారా రూ. 76,000 మార్క్‌ను అధిగమించి దేశీయంగా సరికొత్త గరిష్టాన్ని సాధించింది. ఇంతక్రితం 2011 ఏప్రిల్ 25న రూ. 75,000 వద్ద వెండి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఆరో రోజూ రికార్డ్స్ కోవిడ్-19 సృష్టిస్తున్న సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలలో ఆరో రోజూ ర్యాలీ కొనసాగుతోంది. బులియన్ చరిత్రలో గురువారం మరోసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2,081 డాలర్లకు ఎగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 2,068 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా మరోసారి ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఈ వారంలోనే పసిడి 4.7 శాతం జంప్‌చేయడం విశేషం! ఇక వెండి సైతం ఔన్స్ 2.5 శాతం ఎగసి 29.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది! గురువారం సైతం.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి రూ. 747 లాభపడి రూ. 55,845 వద్ద నిలిచింది. తొలుత రూ. 56,079 వద్ద గరిష్టాన్ని తాకింది. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ధర రూ. 4,159 దూసుకెళ్లి రూ. 76,052 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 76,360 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్ 25న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 75,000ను సులభంగా దాటేసింది! కారణాలేవిటంటే? చైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నాయి. పలు దేశాలు లాక్‌డవున్‌లతో కరోనా వైరస్ కట్టడికి చర్యలు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా కేంద్ర బ్యాంకులు బిలియన్లకొద్దీ నిధులను నామమాత్ర వడ్డీలతో రుణాలుగా అందిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వాలు సైతం ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిధులు సంక్షోభ కాలంలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడివైపు అధికంగా మళ్లుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా ఈక్విటీలకూ ప్రవహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు తెలియజేశారు. బంగారాన్ని అధిక పరిమాణంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసే విషయం విదితమే. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లు భారీగా పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం. డాలర్ ఎఫెక్ట్ ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా రెండేళ్ల కనిష్టం వద్దే కదులుతోంది. దీంతో వరుసగా ఏడో వారంలోనూ నష్టాలతో ముగిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు యూఎస్ ట్రెజరీల ఈల్డ్స్ బలహీనపడుతున్నాయి. తాజాగా ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. ఇవన్నీ పసిడి ధరలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
చరిత్రలో తొలిసారి 2,000 డాలర్లకు పసిడి
వెండి, బంగారం.. జంటగా సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. సోమవారం 9ఏళ్ల తదుపరి చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన పసిడి నేటి ట్రేడింగ్‌లో మరో కొత్త శిఖరాన్ని చేరుకుంది. ప్రపంచ బులియన్ చరిత్రలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) పసిడి తొలుత 2000 డాలర్లను తాకింది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో 2 శాతం బలపడి 1991 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. ఇంతక్రితం 2011 సెప్టెంబర్‌లో 1921 డాలర్ల వద్ద నమోదైన రికార్డ్ "హై'ను సోమవారం 1956 డాలర్లకు చేరడం ద్వారా అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా వెండి (ఔన్స్) మరింత అధికంగా 6.5 శాతం దూసుకెళ్లి 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 ఏప్రిల్ తదుపరి గరిష్టాన్నిచేరింది. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి ధరలు సోమవారం హైజంప్ చేశాయి. వెండి దూకుడు సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములు రూ. 1066 ఎగసి రూ. 52,101 వద్ద ముగిసింది. ఈ ఆగస్ట్ డెలివరీ ఫ్యూచర్స్ తొలుత రూ. 52,220 వరకూ పెరిగింది. ఇక వెండి కేజీ సెప్టెంబర్ డెలివరీ రూ. 4305 దూసుకెళ్లి రూ. 65,528 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 66,164ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! కారణాలివీ.. ఇటీవల హ్యూస్టన్, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్, చైనా మధ్య చెలరేగిన వివాదాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ ఇండెక్స్ తాజాగా రెండేళ్ల కనిష్టం 94 డాలర్ల దిగువకు చేరింది. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి యూరోపియన్ దేశాల నేతలు 850 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి గత వారం ఆమోదముద్ర వేశారు. మరోవైపు ఈ వారంలో వాషింగ్టన్ ప్రభుత్వం సైతం కోవిడ్-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. నేటి నుంచి అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫెడ్ నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు సాధారణంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, సావరిన్ ఫండ్స్, ఈటీఎఫ్ పెట్టుబడులు తదితరాలు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపే విషయం విదితమే. ఇక సోలార్‌ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబిల్ తదితర పలురంగాల నుంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కోవిడ్-19 కారణంగా ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో వెండి ధరలకు రెక్కలొస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా 2021 ద్వితీయార్థానికల్లా వెండి ధరలు 30 డాలర్లను తాకవచ్చని తాజాగా అంచనా వేశారు. ఈటీఎఫ్‌ల జోరు సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగే సంగతి తెలిసిందే. ప్రస్తుత అనిశ్చిత పరిస్థతులలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సావరిన్ ఫండ్స్, ఈటీఎఫ్ తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బంగారం కొనుగోలుకి ఎగబడుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈటీఎఫ్‌ల పసిడి హోల్డింగ్స్ 28 శాతం ఎగశాయి. అంటే 105 మిలియన్ ఔన్స్‌ల పసిడిని జమ చేసుకున్నాయి. ఫలితంగా 195 బిలియన్ డాలర్లకు వీటి విలువ చేరినట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. బుల్ ట్రెండ్‌లో ప్రస్తుతం బంగారం బుల్ ట్రెండ్‌లో ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పసిడిలో బుల్ ట్రెండ్ 8-10ఏళ్లపాటు ఉంటుందని తెలియజేశాయి. గతంలో 2001-2011 మధ్య వచ్చిన బుల్ ట్రెండ్ కారణంగా పసిడి 1921 డాలర్ల వద్ద రికార్డ్ నెలకోల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అయితే తదుపరి బంగారం ధరలు 46 శాతం పతనంకావడంతోపాటు.. కొన్నేళ్లపాటు కన్సాలిడేట్ అయినట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం గోల్డ్‌లో నెలకొన్న స్పీడ్ ప్రకారం ఔన్స్ 3000 డాలర్లవరకూ దూసుకెళ్లవచ్చని యూఎస్ నిపుణులు నిగమ్ ఆరోరా ఒక నివేదికలో తాజాగా అంచనా వేశారు. ఇందుకు 50 శాతం అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు అరోరా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక జెఫరీస్ విశ్లేషకులు క్రిస్టోఫర్ ఉడ్ అయితే గత వారం ఔన్స్ పసిడి మరింత అధికంగా 4,000 డాలర్లను తాకవచ్చనంటూ అత్యంత ఆశావహంగా అంచనా వేసిన విషయం విదితమే. స్వల్ప కాలంలో ఇటీవల పసిడి వేగంగా బలపడటంతో సాంకేతికంగా ఓవర్‌బాట్ స్థాయికి చేరినట్లు బులియన్ విశ్లేషకులు అరోరా పేర్కొన్నారు. దీంతో సమీపకాలంలో భారీగా దిద్దుబాటుకు లోనుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వేగంగా పతనమైతే ఆ స్థాయిలో పసిడిని కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఇక నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా అక్టోబర్-నవంబర్ మధ్య ఔన్స్ పసిడి 2350 డాలర్లకు, వెండి 29.70 డాలర్లకు బలపడే వీలున్నదని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ణానశేఖర్ త్యాగరాజన్ అంచనా వేశారు. -
‘పెట్రో’ ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 12 పైసలు, డీజిల్‌పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50కు చేరగా, డీజిల్ రూ.72.61కు చేరి ఆల్‌టైం రికార్డును సృష్టించాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్‌పై రూ.3.42, డీజిల్‌పై రూ.3.84ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీల వద్ద లీటర్ పెట్రోల్ రూ.40.50, డీజిల్ రూ.43గా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాలతో పాటు ఆయా రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించకపోవడంతో తాజాగా చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. ఇక మహారాష్ట్రలోని ముంబైలో పెట్రోల్‌పై అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ విధిస్తుండగా, తెలంగాణలో డీజిల్‌పై అత్యధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తున్నారు. 2014–15లో రూ.99,184 కోట్లుగా ఉన్న కేంద్ర ఎక్సైజ్ రాబడి..2017–18 నాటికి రూ.2,29,019 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రాల వ్యాట్ 2014–15లో రూ.1,37,157 కోట్ల నుంచి 2017–18 నాటికి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. రాజస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2.4 మేర తగ్గుతాయన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. -
ఆగని పెట్రో ధరలు
-
షాకింగ్ : ఆగని పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. ఇక ముంబయిలో రెండు రోజుల కిందట రూ 83.76 పలికిన లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ 86.56కు ఎగబాకింది. ఇక చెన్నైలో రూ 82.24, కోల్‌కతాలో రూ 82,.02, ఢిల్లీలో రూ 78.84గా నమోదైంది. మరోవైపు డీజిల్ ధరలూ భారమయ్యాయి. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో డీజిల్ లీటర్‌కు వరుసగా రూ 75.54, రూ 75.19, రూ 71.15కు పెరిగింది. ఇక కోల్‌కతాలో డీజిల్ లీటర్ ధర రూ 74కు చేరింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా అమెరికా ఏకపక్ష విధానాలతోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
షాకింగ్ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డిజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. పెట్రోల్ ధర ఆదివారం నాలుగేళ్ల గరిష్ట స్ధాయిలో దేశరాజధానిలో లీటర్‌కు రూ 73.73కు చేరగా, డీజిల్ అత్యంత గరిష్టస్ధాయిలో లీటర్‌కు రూ 64.58కి ఎగబాకింది. పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోతుండటంతో వీటిపై ఎక్సైజ్ పన్నులను భారీగా తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంధన ధరలను రోజువారీ సవరిస్తున్న చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఆదివారం లీటర్‌కు 18 పైసల చొప్పున పెంచడంతో ఇవి అత్యంత గరిష్టస్ధాయిలకు చేరి సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల పెంపును అధిగమించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతున్నా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్‌లపై అత్యధిక పన్నుల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్‌లోనే పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. -
రీక్యాప్ బూస్ట్: రికార్డ్ స్థాయిల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు అత్యంత భారీ స్ఠాయిలో రూ. 2.11 లక్షల కోట్ల పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిని తాకింది. సెన్సెక్స్ 33వేల స్థాయిని,నిఫ్టీ 10,300 స్థాయిని దాటేసింది. పీఎన్బీ 40శాతం ఎగిసి టాప్ విన్నర్‌గా నిలిచింది. వరుసగా మూడవ సెషన్లో కూడా లాభపడిన పీఎన్బీ ఆల్ టైంగరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని దిగ్గజ బ్యాంకులు 52 వారాల గరిష్టం వద్ద ఉన్నాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ లాంటి ప్రభుత్వం బ్యాంక్ షేర్లతోపాటు ప్రయివేటు బ్యాంక్‌దిగ్జజం ఐసీఐసీఐ, యాక్సిస్‌తో పాటు ఇతర చిన్న బ్యాంకుల షేర్లుకూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లో దూకుడు కొనసాగుతోంది. అయితే ఎస్‌బ్యాంక్, కోటక్ బ్యాంక్ , హెడ్ఎఫ్సీ నష్టపోతున్నాయి. అటు రిలయన్స్, ఇండియా బుల్స్‌ఫైనాన్స్, ఐడియా నష్టపోతున్నాయి. -
కొత్త గరిష్టాల వద్ద మార్కెట్ల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. భారీ లాభాలతో స్టాక్స్ మార్కెట్లో దీపావళి వెలుగులు విరజిమ్మాయి. బుల్ జోరుతో రికార్డ్ స్థాయిలను నమోదు చేసిన మార్కెట్లలో మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు మరింత బలపడ్డాయి. దీంతో సెన్సెక్స్ లాభాలతో డబుల్ సెంచరీ సాధించింది. 201 పాయింట్ల లాభంతో 32,634 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 10,230వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్, ఆటో టెలికాం, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ లాభాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఫెడరల్‌బ్యాంక్, భారతి ఎయిర్టెల్, వేదాంతా, ఎంఅండ్ఎం, బాష్, హెచ్‌యూఎల్, సిప్లా, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, లుపిన్, బజాజ్ ఆటో, టాటా కమ్యూనికేషన్స్ ఐడియా, రిలయన్స్, లాభపడగా, సుందరం ఫైనాన్స్, సిమన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, యస్‌బ్యాంక్ , అదానీ పోర్ట్స్, మారుతీ, నష్టాల్లో ముగిశాయి. అటు డాలర్ మారకంలో రుపీ కూడా బాగా బలపడగా, ఎంసీఎక్స్మార్కెట్లో బంగారం ధరలుమెరుపులు మెరిపిస్తున్నాయి. -
రికార్డు గరిష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 135.70 పాయింట్ల లాభంలో 31,273.29 వద్ద ముగియగా.. నిఫ్టీ 37.40 పాయింట్ల లాభంతో తొలిసారి 9650 మార్కుకు పైన నిలిచింది. హీరో మోటార్ కార్పొ, సిప్లా రెండు సూచీల్లో లాభాలు పండించగా.. గెయిల్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. ఇంట్రాడేలో హీరో మోటార్ కార్పొ స్టాక్ ధర సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. మే నెలలో విక్రయాల వృద్ధి జోరుగా ఉండటంతో 3 శాతం పైగా లాభపడిన ఈ స్టాక్ ధర రూ.3,849ను తాకింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు, సెన్సెక్స్ 31,333 నిఫ్టీ 9673 వద్ద సరికొత్త రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. ఫార్మా, ఆటో స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో మంచి జోరును కొనసాగించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.45 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 2 రూపాయల నష్టంతో 28,650గా నమోదయ్యాయి. -
సెన్సెక్స్, నిప్టీ చారిత్రాత్మక మెరుపులు
ముంబై: ప్రపంచ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలను తాకాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 30,007 వద్ద ఆల్ టైం హై స్థాయిని తాకగా నిఫ్టీ కూడా అదే బాటలో పయనించడం విశేషం. నిఫ్టీ ఇంట్రాడేలో 9,268ని చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఉదయనుంచి గ్రీడ్ అండ్ ఫియర్ మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో మిడ్‌సెషన్ అనంతరం కొనుగోళ్ళ ధోరణి నెలకొంది. మరోవైపు ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ లాభాలు మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది. మిడ్ క్యాప్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ గరిష్ట స్థాయిలో 64 పాయింట్ల లాభంలో 29,974 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల లాభంలో 9250కి పైనే ముగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పురోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్ 4 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఇన్ఫ్రాటెల్, హిందాల్కో, జీ, ఆర్ఐఎల్, గ్రాసిమ్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, బీవోబీ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐటీసీ , ఇన్ఫోసిస్ నష్టాల్లో నడిచాయి. దీంతో ఎనలిస్టులు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. అయితే ఈ స్తాయిల్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కాగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష రేపు (గురువారం) జరగనుంది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంటాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నప్పటకీ, మదుపర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. -
సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 27 వేలు అధిగమించింది. సెన్సెక్స్152 పాయింట్లు లాభపడి 27,019 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 8,083 వద్ద ముగిశాయి.