
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు అత్యంత భారీ స్ఠాయిలో రూ. 2.11 లక్షల కోట్ల పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిని తాకింది. సెన్సెక్స్ 33వేల స్థాయిని,నిఫ్టీ 10,300 స్థాయిని దాటేసింది. పీఎన్‌బీ 40శాతం ఎగిసి టాప్ విన్నర్‌గా నిలిచింది. వరుసగా మూడవ సెషన్‌లో కూడా లాభపడిన పీఎన్‌బీ ఆల్ టైంగరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని దిగ్గజ బ్యాంకులు 52 వారాల గరిష్టం వద్ద ఉన్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ లాంటి ప్రభుత్వం బ్యాంక్ షేర్లతోపాటు ప్రయివేటు బ్యాంక్‌దిగ్జజం ఐసీఐసీఐ, యాక్సిస్‌తో పాటు ఇతర చిన్న బ్యాంకుల షేర్లుకూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లో దూకుడు కొనసాగుతోంది.
అయితే ఎస్‌బ్యాంక్, కోటక్ బ్యాంక్ , హెడ్‌ఎఫ్‌సీ నష్టపోతున్నాయి. అటు రిలయన్స్, ఇండియా బుల్స్‌ఫైనాన్స్, ఐడియా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment