సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 52610 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది.అటు నిఫ్టీ కూడా15828 స్థాయికి చేరింది. ఆరంభం లాభాలనుంచి 313 పాయింట్లు మేర సెన్సెక్స్ ఎగిసింది. నిఫ్టీ 95 పాయింట్లు జంప్ చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. టాటా స్టీల్, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ పవర్, కోల్‌ఇండియా, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ లాభపడుతున్నాయి. మరోవైపు బజాన్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇంకా టైటన్, విప్రో, బ్రిటానియా, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి.
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. గురువారం నాటి ముగింపు 73.05తో పోలిస్తే డాలరు మారకంలో రూపాయి 72.84 వద్ద కొనసాగుతోంది.
చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment