Stockmarkets
-
సాక్షి మనీ మంత్ర: ఎన్నికల నేపథ్యంలో ఈ మార్కెట్ స్ట్రాటజీతో లాభాలు!
దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా తీవ్ర ఒడుదుడుకుల్లో పయనిస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకవిలువ పడిపోతుంది. యూఎస్‌లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందనే భయాలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న పండగ నేపథ్యంలో మార్కెట్లు ఎలా కదలాడుతాయో ఫండమెంటల్ బిజినెస్ అనలిస్ట్ కౌశిక్మోహన్తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కరుణ్యరావు మాట్లాడారు. కారుణ్యరావు: దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్నిరోజుల నుంచి వారి నగదును ఉపసహరించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికవరకు కొనసాగే అవకాశం ఉంది? కౌశిక్‌మోహన్: ఈక్విటీ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికాలోని ఫెడ్ కీలక వడ్డీరేట్లను పెంచుతుంది. దాంతో ఎఫ్ఐఐలు అప్రమత్తం అవుతున్నారు. ఒడుదొడుకులులేని అక్కడి డెట్ మార్కెట్లో మదుపుచేసేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో భారత్ మార్కెట్లో వారి నగదును ఉపసహరించుకుని అమెరికా వంటి వడ్డీ అధికంగా ఉంటే మార్కెట్లో మదుపు చేస్తున్నారు. వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేంత వరకు ఈపరిస్థితి కొనసాగనుంది. కారుణ్యరావు: మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం అంతగా స్పందించడం లేదు. పైగా అవి కొంతమేర పెరుగుతున్నాయి. అందుకుగల కారణం ఏమిటి? కౌశిక్‌మోహన్: మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలకంటే లార్జ్‌క్యాప్ సూచీల్లో మదుపుచేసేందుకు మంచి అవకాశంగా కనిపిస్తుంది. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు వాటి త్రైమాసిక ఫలితాలను మెరుగుపరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో రిటైలర్లు ఎక్కువగా వస్తుఆధారిత సేవలపై ఖర్చు చేస్తారు. దాంతో ఆ సూచీలు మరింత పెరిగే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సెక్టార్లో మదుపుచేయాలి? కౌశిక్‌మోహన్: అభివృద్ధి చెందుతున్న ఇండియాలో రానున్న రోజుల్లో అన్ని రంగాలు పుంజుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కెమికల్ సెక్టార్ మరింత మెరుగుపడే పరిస్థితులు ఉన్నాయి. చాలా కెమికల్ కంపెనీలు వాటి వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పారాసిటమోల్లో పారాఅమినోఫినాల్‌ను విరివిగా వాడుతారు. పారాసిటమోల్‌ను మనదేశంలోనే అధికంగా తయారుచేస్తారు. కానీ పారాఅమినోఫినాల్‌ను మాత్రం ఏటా 80వేల మెట్రిక్ టన్నుల మేర చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం చైనాలోని అనిశ్చితుల కారణంగా ప్రపంచం చూపు భారత్‌పై పడింది. దేశీయంగా ఉన్న కొన్ని కంపెనీలు నైట్రో బెంజీన్ నుంచి పారాఅమినోఫినాల్‌ను తయారుచేస్తున్నారు. దాంతో మరింత అవకాశాలు ఉండే వీలుంది. కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా మరింత లబ్ధిచేకూరే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుతం ఫార్మాసెక్టార్లోని స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ధరలనుంచి ఈ సెక్టార్ మరింత పుంజుకునే అవకాశం ఉందా? కౌశిక్‌మోహన్: దేశీయ మార్కెట్లో ఫార్మాసెక్టార్ మరింత లాభాల్లోకి వెళుతుంది. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా రానున్న రోజుల్లో మాత్రలు, ఇంజెక్షన్లు, వైద్య పరికరాలకు మరింత ఖర్చుచేస్తారు. శరీరంలోని కొవ్వు కరిగించే మందులు తయారుచేసే కంపెనీలు వాటి పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. దాంతోపాటు ఆయా కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. సంస్థల భవిష్యత్తు కార్యాచరణను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మెరుగైన లాభాలు పొందే వీలుంది. కారుణ్యరావు: దీపావళి పండగ నేపథ్యంలో జరిగే మూరత్ ట్రేడింగ్‌లో భాగంగా ఏ స్టాక్‌ల ద్వారా లాభాలు సంపాదించవచ్చు? కౌశిక్‌మోహన్: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రధానంగా కన్జూమర్ డ్యురబుల్ కంపెనీల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతాయని నమ్ముతున్నాను. కారుణ్యరావు: ఆటోమొబైల్ రంగంలోని సూచీలు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అందుకు కారణాలు? కౌశిక్‌మోహన్: అక్టోబరు నెలలో ఆఫర్ల నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనాలు తీసుకుంటారు. దాంతో ఆ నెలలో ర్యాలీ కనిపిస్తుంది. వచ్చే డిసెంబరులో అంతగా ర్యాలీ ఉండకపోవచ్చు. చివరి నెలలో వాహనాలు తీసుకుంటే ఆ ఏడాది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నెల తర్వాత అదే జనవరిలో వాహనాలు కొనుగోలు చేస్తే వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంతో సాధారణంగా ఒడుదొడుకులు ఉంటాయి. కారుణ్యరావు: దేశంలోని ఫైనాన్స్ మార్కెట్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? కౌశిక్‌మోహన్: ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రివర్స్ మెర్జర్ అవుతున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్న సంస్థలను ఎంచుకుని ముదుపు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కారుణ్యరావు: ఎన్నికల నేపథ్యంలో రానున్న మూడు నెలలకుగాను మార్కెట్లో లాభాలు పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి? కౌశిక్‌మోహన్: గరిష్ఠంగా మరో ఆరునెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. త్వరగా స్పందించి ఇప్పుడే మదుపుచేస్తే ఎన్నికల సమయం వరకు వచ్చే ర్యాలీలో లాభాలు పొందొచ్చు. మదుపు చేసే ముందు కంపెనీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉందో తెలుసుకోవాలి. త్రైమాసిక ఫలితాలు, బోర్డు సమావేశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. (Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్‌ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్‌కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్‌లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్‌సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్‌తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: జోరుగా..హుషారుగా! లాభాల్లోకి మళ్లిన సూచీలు
TodayStock Market Closing bell: గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. తద్వారా ఈ వారంలో రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సెషన్లో నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ బైయింగ్ కనిపించింది. ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గినా మిడ్‌సెషన్ నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 19,700కు ఎగువకు చేరింది. మిడ్‌క్యాప్‌లు, స్మాల్‌క్యాప్‌లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 66,119 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు ఎగిసి 19,717 వద్ద ముగిసింది. లార్సెన్, కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ ఎక్కువగా లాభ పడగా, టైటన్, గ్రాసిం, హీరో మోటో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోయాయి. రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం స్వల్పంగా లాభ పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే 83.22 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Today Stockmarket Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి స్తబ్దుగా కదలాడిన సూచీలు చివరికి వరుసగా రెండో రోజు కూడా బలహీన్‌నోట్‌లో ముగిసాయి.సెన్సెక్స్ 78.22 పాయింట్లు క్షీణించి 65,945 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 19,665 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19700 దిగువకు చేరింది. బ్యాంక్, ఫార్మా , ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు ప్రధానంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 0.5 శాతం లాభంతో గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది వోడాఫోన్ ఐడియా ఏకంగా 7శాతం లాభపడి 20 నెలల గరిష్టానికి చేరింది. ఐషర్ మోటార్స్, హీరో మోటో, నెస్లే, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్‌గా టెక్ ఎం, సిప్లా, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్ర, అదాని ఎంటర్ ప్రైజెస్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. రూపాయి:డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం 10 పైసల నష్టంతో 83.23 వద్ద ముగిసింది. సోమవారం 83.14 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో భారీ నష్టాలు
Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు పండగరోజు విరామం తరువాత భారీ పతనాన్నినమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.వరుగా రెండో సెషన్లో పతనమైనాయి. చివరికి సెన్సెక్స్796 పాయింట్లు పతనమై 66,800 వద్ద, నిఫ్టీ 239 పాయింట్ల నష్టతో 19, 901వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌లు, టెక్నాలజీ, మెటల్స్,ఎనర్జీ స్టాక్‌ల మార్కెట్‌ను ప్రభావితం చేవాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 19,900 స్థాయిని తాకింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద, బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) దాదాపు రూ. 2.60 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. హెచ్డీఎఫ్సీ ఏకంగా 4 శాతం కుప్పకూలాగా రిలయన్స్ 2.5 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మ, ఏసిన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్,రిలయన్స్ బీపీసీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది. రూపాయి: సోమవారం నాటి ముగింపు 83.27తో పోలిస్తే బుధవారం డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ 19 పైసలు పెరిగి 83.08 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
Today Stockmarket Opening దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం లాభాలతో మురిపించిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో దాదాపు 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 67,754 వద్ద ,నిఫ్టీ 15 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 20,177 వద్ద ఉంది. తద్వారా కీలక 20 వేలకు ఎగువన సాగుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, కోల్ ఇండియా లాభపడుతుండగా, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, విప్రో, దివీస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,నెస్టే నష్టపోతున్నాయి. మరోవైపు ఈ రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల కొనసాగే అవకాశం ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: మళ్ళీ నష్టాల్లో సాగుతున్న స్టాక్ మార్కెట్లు
Today Stock Market: నిన్న ఉదయం స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి, కానీ ఈ రోజు ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 138.59 పాయింట్ల తగ్గుదలతో 66128.35 వద్ద.. నిఫ్టీ 30.60 పాయింట్ల నష్టాలతో 19659.80 వద్ద ముందుకు వెళుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నష్టాల బాటలోనే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు టాప్ గెయిన్ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసి కంపెనీలు నష్టాల జాబితాలో ఉన్నాయి. ఈ రోజు ఫార్మా కంపెనీలు మంచి దూకుడు మీద ఉన్నట్లు స్పష్టమవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి. -
Today Market Closing: మూడో రోజు నష్టాలు, రూపాయి 22 పైసలు ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజూనష్టాల్లోనేముగిసాయి. దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ప్రాఫిట్-బుకింగ్‌తో ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 61432 వద్ద,నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 18, 130 వద్ద స్థిరపడింది.బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి మరోవైపు మే 26న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. బజాజ్ ఫైనాన్స్,కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్,ఐసీఐసీఐ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివీస్ ల్యాబక్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, టైటన్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 22 పైసలు కుప్పకూలి 82.59 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
ఆటో, బ్యాంకింగ్ జోరు: తెప్పరిల్లిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయింది. మిడిసెషన్‌నుంచి ఆటోమొబైల్, ఫైనాన్షియల్ షేర్లు లాభాలతో చివరికి లాభపడ్డాయి. సెన్సెక్స్ 62వేల స్థాయికి ఎగువన ముగిసింది. (సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే) ప్రారంభ నష్టాలను పుంజుకున్నసెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,028 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 18,314.80 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 18300 పాయింట్లు ఎగువన స్థిరపడింది. ఐషర్ మోటార్స్, ఎం అండ్ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ టాప్ విన్నర్స్‌గానూ, హిందాల్కో, బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) అటు డాలరుమారకంలో రూపాయి గురువారం నాటి ముగింపు 82.09 తో పోలిస్తే శుక్రవారం 82.16 వద్ద ముగిసింది. ⇒ మరిన్ని మార్కెట్ సంబంధిత వార్తల కోసం చదవండి సాక్షి బిజినెస్, మీ అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
స్వల్ప లాభాల్లో సూచీలు, అదానీ ట్విన్స్ షేర్లలో కొనుగోళ్ళ జోష్
సాక్షి,ముంబై: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు ఎగిసి 60710 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17 వేల 945 వద్ద కదలాడుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ విన్నర్స్‌గానూ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఏషియన్ పె యింట్స్ నష్టపోతున్నాయి. -
ఫలితాల జోష్: లాభాల్లో మార్కెట్లు, ఐటీ రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ కంపెనీ క్యూ4లో మెరుగైన ఫలితాలతో సూచీలకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లతో సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 60649వద్ద, నిఫ్టీ సూచీ 101 పాయింట్ల లాభంలో 17915 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు మేర ఎగిసింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) F&O గడువు ముగింపు రోజున మార్కెట్లు చాలా బుల్లిష్‌గా మారాయి. ఐటీ, రియాల్టీ,కొన్ని మెటల్ స్టాక్‌లు గణనీయమైన కొనుగోళ్లు కనిపించాయి. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ను, మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ గా ముగిశాయి. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పడి 81.84 వద్ద ముగిసింది -
గ్లోబల్గాప్రతికూల సంకేతాలున్నా, సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు న్నప్పటికీ దేశీయ సూచీలు హుషారుగా ఉన్నాయి. సెన్సెక్స్ 367పాయింట్లు ఎగిసి 59476 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 17501 వద్ద కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ షేర్ల లాభాలు సూచీలకు మద్దతిస్తున్నాయి. మరోవైపు ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. బజాజ్ ట్విన్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడుతుండగా, ఐషర్ మోటార్స్,హిందాల్కో, ఇండస్ ఇండ్బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు ఎంఎన్సీ రెండు రోజుల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్నాయి. ఈ సారి 25 బేసిస్ పాయింట్ల వడ్డీరేపు పెంపు ఉంటుందని అంచనాలు భారీగా ఉన్నాయి. -
అదానీ షేర్ల అండ: ఎట్టకేలకు లాభాల్లో సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో కళ కళలాడాయి. వరుసగా ఎనిమిదో రోజుల నష్టాల తరువాత లాభాలో ప్రారంభమైన సూచీలు మిడ్ సెషన్‌నుంచి పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్, అదానీ గ్రూపు షేర్ల లాభాలు మద్దతిస్తాయి. సెన్సెక్స్ 449 పాయింట్లు ఎగిసి 59,411వద్ద నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 17,451 వద్ద స్థిరపడ్డాయి. గత రెండు రోజుల గ్రూపు షేర్ల లాభాలతో అదానీ గ్రూపు మార్కెట్ క్యాప్ 75 వేల కోట్లు పుంజుకోవడం విశేషం. హిండెన్‌బర్గ్ వివాదం రేపిన అలజడితో భారీగా కుదేలైన అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, యూపీఎల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా, బ్రిటానియా, పవర్ గగ్రిడ్, సిప్లా, బీపీసీఎల్, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 20పైసలు ఎగిసి 82. 50 వద్ద ముగిసింది. -
Today StockMarket Opening: నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభ మైనాయి. అనంతరం మరింత అమ్మకాలు కొనసాగాయి. ఐటి, ఎఫ్ఎంసిజి, మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫలితంగా 65 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17827 వద్ద, సెన్సెక్స్ 198 పాయింట్లు కోల్పోయి 60610 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం కూడా అదానీ షేర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ విన్నర్స్‌గా హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.63ప్రారంభమైనా 82.59 వద్ద పాజిటివ్‌గా ఉంది. -
Today StockMarketUpdate: మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్, అదానీ షేర్లు భేష్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ , నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ తరువాత భారీగా పుంజుకున్నాయి. ఒక దశలో నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి, 17871 వద్ద సెన్సెక్స్ 378పాయింట్ల లాభంతో 60664 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, చమురు, గ్యాస్ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 16 శాతం ఎగియడం విశేషం. మరోవైపు బ్యాంకింగ్, టెలికాం షేర్లు నష్ట పోయాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ భారీగా లాభపడగా, పవర్ గగ్రిడ్, కోల్ ఇండియా, లార్సెన్, హీరో మోటో, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఫలితాల్లోమెరుగ్గా ఉన్నప్పటికీ ఎయిర్టెల్ 1 శాతానికి పైగా నష్టపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 25 పాయింట్లు లాభపడింది. -
ఆర్బీఐ వడ్డింపు: సెన్సెక్స్ జూమ్, బ్యాంకు షేర్లకు దెబ్బ!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్బీఐ పాలసీ రివ్యూ ప్రకటించిన అనంతరం సెన్సెక్స్ 300పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 60596 వద్ద, 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17800 ఎగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో తప్ప, దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 11 శాతం ఎగిసింది. అదానీ పోరర్ట్స్ , హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిప్, కోల్ ఇండియా, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, ఐఫర్ మోటార్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.68 వద్ద ఉంది. కాగా రిజర్వ్ బ్యాంకు ఇండియా అనుకున్నట్టుగా రెపో రేటు పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతంగా కీలక వడ్డీరేటు 6.50 శాతానికి పెరిగింది. ఇది వరుసగా ఆరోపెంపు. -
వారాంతంలో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్‌గా సూచీలు ఆ తరువాత మరింత కోలుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 910 పాయింట్లు ఎగిసి 60842 నిఫ్టీ 244 పాయింట్ల లాభంతో 17854వద్ద స్థిరపడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ భారీగా లాభ పడగా, దివీస్ లాబ్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, హిందాల్కో,ఎన్టీపీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపీ 34 పైసలు లాభంతో 81.83 వద్ద ముగిసింది. -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
షార్ట్ కవరింగ్, నష్టాల నుంచి సూచీల రికవరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుస నష్టాల నుంచి షార్ట్ కవరింగ్ కారణంగా కాస్త రికవరీ సాధించాయి. ముఖ్యంగా అదానీ కంపెనికి చెందిన కొన్ని షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. అయితే ఐటీ షేర్లు లాభ పడుతున్నాయి. ప్రస్తుతం 46 పాయింట్ల నష్టంతో 17557 వద్ద నిఫ్టీ, 113 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 59193 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ హెచ్‌సీఎల్ టెక్, బజాజ్‌ఫిన్‌సర్వ్ లాభపడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్; జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ఆటో, హెచ్ యూఎల్ నష్టపోతున్నాయి. -
ఫ్లాట్ ముగింపు, ఆటో జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సానుకూల సంకేతాలు, దిగ్గజాల క్యూ3 ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ మంగళవారం నష్టాలనెదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకుని ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 60978 వద్ద , నిఫ్టీ ఫ్లాట్‌గా 18118 వద్ద ముగిసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.2 శాతం ఎగియగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ నష్టపోయాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్ , బ్రిటానియా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, డా.రెడ్డీస్, హిందాల్కో, పవర్ గ్రిడ్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఫలితాల నేపథ్యంలో ఆటోమేజర్ మారుతి సుజుకి లాభపడింది. టాటా మోటార్స్ గురువారం ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ జోష్‌తో పీవీఆర్ షేరు భారీగా లాభపడింది. అటు డాలరు మారకంలో రూపాయి మరింత పతనమైంది. 28 పైసలు కుప్పకూలి 81.71 వద్ద ముగిసింది. -
ఐటీ షైన్: సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు లాభంతో 60,942 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసి 18,118 వద్ద స్థిరపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ , ఐటీ షేర్లు లాభపడగా, రియల్టీ, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్ర, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యూపీఎల్, విప్రో టాప్ విన్నర్స్‌గా నిలవగా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 33 పైసలు నష్టపోయి 81.39 వద్ద ఉంది. -
61 వేల ఎగువకు సెన్సెక్స్,18150 దాటిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సానుకూలంగా ప్రారంభమైనాయి. ఆ తరువాత మరింత ఎగిసి 400 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 18,164 వద్ద రెండు వారాల గరిష్టం వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 61వేల స్థాయికి, నిఫ్టీ 18150ఎగువకు చేరాయి. ఐటీ మెటల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, లార్సెన్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ భారీగా లాభపడగా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, అదానీ ఎంటర్ పప్రైజెస్, బీపీసీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రుపీ 64 పాయింట్లు ఎగిసి 81.24 వద్ద ఉంది. గత ఏడాది డిసెంబర్ తరువాత ఈ గరిష్ట స్థాయిల వద్ద ముగియడం విశేషం. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు, ఐటీ షేర్ల ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు తరువాత 250 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 60093వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 17895వద్ద ముగిసింది. ఐటీ మినహా బ్యాంకింగ్, మెటల్, ఆటోఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, హీరోమోటో భారీగా లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల, హిందాల్కో నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 39 పాయింట్లు నష్టంతో 81.64 వద్ద ఉంది. -
మూడు రోజుల నష్టాలకు చెక్, ఇన్పీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడు సెషన్ల నష్టాల తరువాత సూచీలు వారాంతంలో (శుక్రవారం) కోలుకున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, ఏడాది కనిష్టానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ఇతర సానుకూల సంకేతాలతో ఆరంభంలో కాస్త తడబడినా తరువాత నష్టాల నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లేదా 0.51శాతం పెరిగి 60,261, నిఫ్టీ 98 పాయింట్లు లేదా 0.55శాతం పెరిగి 17,957 వద్ద స్థిరపడ్డాయి. fe ముఖ్యంగా ఫైనాన్షియల్, ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ క్యూ 3 త్రైమాసిక ఫలితాల్లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఇన్ఫో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంకా అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా, టైటన్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్,నెస్లే ఇండియా ,లార్సెన్ అండ్ టుబ్రో ఐటీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు డాలరు 21 పైసలు ఎగిసి 81.38 వద్ద ముగిసింది. -
TodayStockMarketUpdate: బ్యాంకింగ్ దెబ్బ, మూడో రోజూ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్‌ల వారంవారీ గడువు ముగియనున్న నేపథ్యం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో లాభాలు ఆవిరై పోయాయి. రోజంతా ఊగిస లాడిన సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 59958 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 17858 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు, నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొన సాగాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోగా, ఐటీ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ దిగ్గజాల డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు, యుఎస్ ద్రవ్యోల్బణ డేటా అంచనాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగుతోంది. అల్టట్రా టెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, లార్సెన్. హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లోనూ, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్పనష్టాలతో 81.55 వద్ద ముగిసింది. -
నష్టాలనుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఎప్‌ఐఐల అమ్మకాలు, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో బలహీనమైన ధోరణి మధ్య బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ప్రతికూలంగా ఆరంభమైనాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు కక్షీణించి 60 వేల స్థాయినికోల్పోయగా, నిఫ్టీ 89పాయింట్లు క్షీణించి 17,824 వద్దకు చేరుకుంది. ఆ తరువాత నష్టాలను తగ్గించుకుని సెన్సెక్స్ కేవలం 10 పాయింట్ల నష్టంతో 60105 వద్ద,నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17895 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీపీసీఎల్ లాభపడగా, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌యూఎల్ నష్టపోయాయి. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఆటో ఎక్స్పో ప్రారంభం నేపథ్యంలో ఆటో స్టాక్స్ పై ఇన్వెస్టర్ల దృష్టి పెట్టారు. వరుసగా మూడో రోజు కూడా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సానుకూలత కొనసాగుతోంది. 25పైసలు ఎగిసి 81.56 వద్ద ఉంది. -
భారీ నష్టాలు, 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలన్నీ కోల్పోయి భారీ నష్టాల్లో ముగిసాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి, ఫెడ్ వడ్డీరేట్ల భయాల కారణంగా, మంగళవారం సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్ట పోయింది. ఆరంభంలోనే డీలా పడిన సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఐటీ, ఫైనాన్షియల్స్ బ్యాంకింగ్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 632 పాయింట్లు పతనమై 60115 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు నష్టంతో 17925 వద్ద ముగిసాయి. టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ , బీపీసీఎల్ లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ తదితర షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 62పైసలు ఎగిసి 81.85 స్థాయికి చేరింది. ఈ పతనంతో లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇ ఎం-క్యాప్ నమోదు ప్రకారం సోమవారం నాటి రూ.282.99 లక్షల కోట్ల విలువతో పోలిస్తే దలాల్ స్ట్రీట్ రూ. 3 లక్షల కోట్లను కోల్పోయింది. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ లాంటి ఫ్రంట్‌లైన్ స్టాక్‌ల పతనం మార్కెట్‌ను బలహీనపర్చింది. -
సెన్సెక్స్ 846 పాయింట్లు జంప్, ఐటీ ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేసిన సూచీలు చివరకు ఉత్సాహంగా ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యలో కాస్త పప్రాఫిట్ బుకింగ్ కనిపించినప్పటికీ, సెన్సెక్స్ ఒక దశలో 950 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 18100 పాయింట్లుపైకి చేరింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్, మెటల్, స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 846 పాయింట్లు ఎగిసి 60747 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 18089 వద్ద స్థిరపడ్డాయి. ఎం అండ్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఎస్బీఐ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు ఎగిసి 82.38 వద్దకు చేరింది. -
రెండో రోజూ తప్పని నష్టాలు: విండ్‌ఫాల్ టాక్స్ కోత ఆయిల్ రంగ షేర్లు జూమ్
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోట్రేడ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఫార్మా, ఆటో, ఐటీషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 61500 మార్క్‌ను, నిఫ్టీ 18300మార్క్‌ను కోల్పోయాయి.విండ్ ఫాల్ టాక్స్ కోతతో ఆయిల్‌రంగ షేర్లు భారీ లాభాలతో 5నెలల గరిష్టం వద్ద ఉన్నాయి. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, లార్సెన్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడుతుండగా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డా. రెడ్డీస్, అపోలో హాస్సిటల్స్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ కారణంగా GMM Pfaudler షేర్లు 18 శాతం పడి పోయాయి. అంతేకాకుండా, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఐటీసీ షేర్లు 2 శాతం పడిపోయి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.331.90కి చేరాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 12 పైసలుక్షీణించి 82.84 వద్ద ఉంది. 3.30 PM చివరికి సెన్సెక్స్ 461 పాయింట్లు కుప్పకూలి 61337 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల నష్టంతో వద్ద 18269 ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లో నష్టపోయిన సూచీలు వారాంతంలో ఒక నెల కనిష్టాన్ని నమోదు చేశాయి. దేశీయ కరెన్సీ రూపాయి 82.87 వద్ద ముగిసింది. -
కొంపముంచిన ఫెడ్: దలాల్ స్ట్రీట్ ఢమాల్!
సాక్షి,ముంబై: అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు, అంతర్జాతీయ, భారతీయ మార్కెట్ల కొంప ముంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 879 పాయింట్లు పతనమై 61,799 వద్ద నిఫ్టీ 1.32 శాతం పతనమై 18,415 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియాల్టీ షేర్లు భారీగా నష్టపోగా ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును మరోసారి పెంచింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అధికంగానే ఉందనీ, ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశం ఉందన్న ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో గుబులు రేపాయి. ఫలితంగా అమ్మకాలు వెల్లువెతాయి. బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ , సన్‌ఫార్మా లాభ పడగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐఫర్ మోటార్స్ హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.76 వద్దకు చేరింది. -
భారీ పతనం, 62వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 737 పాయింట్లు కుప్ప కూలగా నిఫ్టీ 200 పాయింట్లు క్షీణించింది. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. దాదాపు అన్నిరంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది. బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ లాభపడుతుండగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.7 4 వద్దకు ఉంది. -
రెండో రోజూ జోరు:18600 ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా పెరిగి వరుసగా రెండో రోజు బుధవారం కూడా లాభాలను పొడిగించింది. నవంబరు ద్రవ్యోల్బణం దిగి రావడంతో పాటు, ఆసియా, అమెరికా మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్ 197 పాయింట్లు లాభంతో 62731 వద్ద, 60 పాయింట్లుఎగిసిన నిఫ్టీ 18677 వద్ద కొన సాగు తున్నాయి. ఫలితంగా నిఫ్టీ 18600 ఎగువన కొనసాగుతోంది. హిందాల్కో, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర టాప్ విన్నర్స్‌గా ఉండగా, భారతి ఎయిర్టెల్, నెస్లే, ఎం అండ్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 20 పైసలు ఎగిసి 82.64 వద్దకు ఉంది. -
భారీ లాభాలు: బ్యాంకింగ్, ఐటీ జూమ్, ఇన్ఫీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే లాభపడిన సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రయివేటు, ప్రభుత్వ బ్యాంకింగ్, ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియల్ ఎస్టేట్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. సెన్సక్స్ ఏకంగా 403 పాయింట్లు ఎగిసి 62533 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 18608 వద్ద స్థిరపడ్డాయి. తద్వార సెన్సెక్స్ 62500 ఎగువకు, నిఫ్టీ 18600 ఎగువకు చేరాయి. ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం ఓఎన్జీసీ, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడగా, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో బీపీసీఎల్, యూపీఎల్, హీరోమోటా టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 32 పైసలు కుప్ప కూలి 82.79 వద్దకు చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో ట్రేడర్లు పాజిటివ్‌గా స్పందించారు. -
లాభాల్లో స్టాక్‌మార్కెట్, బ్యాంకింగ్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెపుతూ లాభాల్లో ప్రారంభమైనాయి. ఆరంభంలో 90 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. ప్రస్తుతం ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. నిఫ్టీ 26 పాయింట్లు లాభంతో 18523 వద్ద, సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 62255 వద్ద కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్, ఓఎన్జీసీ, హీరోమోటో, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ లాభాల్లోనూ, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా నష్టాల్లోనూకొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 17పైసలు నష్టంతో 82.66 వద్ద ఉంది. మరోవైపు సోమవారం ప్రకటించిన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 11 నెలల కనిష్ట స్థాయి 5.88 శాతానికి దిగి వచ్చింది. డిసెంబర్ 2021 తర్వాత మొదటిసారిగా ఆర్బిఐ టార్గెట్ బ్యాండ్ 2-6 శాతానికి దిగువకు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. -
షార్ప్ రికవరీ, ఆయిల్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ఫ్లాట్‌గానే ముగిసాయి. ఆరంభంలోనే 450 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ మిడ్‌సెషన్ తరువాత లాభాల్లోకి మళ్ళింది. సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62131 వద్ద, నిఫ్టీ ఫ్లాట్‌గా 18497 వద్ద స్థిరపడింది. ఆయిల్ రంగ, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీపీసీఎల్, దివీస్ లాబ్స్, కోల్ ఇండియా నెస్లే, యూపీఎల్లాభపడగా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, టైటన్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 34 పాయింట్లు క్షీణించి 82.54 వద్ద ముగిసింది. -
కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 451 పాయింట్లు కుప్పకూలి 61735 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టంతో 18375 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐషర్, మారుతి లాంటి ఆటో షేర్లుకూడా బలహీనంగా ఉన్నాయి. ఐటీసీ, ఎం అండ్, నెస్లే, కోల్ ఇండియా, డా. రెడ్డీస్ గ్రాసిం, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. ఈ సాయంత్రం విడుదల కానున్న నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటాకానుందని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సులా వైన్యార్డ్స్ , అబాన్స్ హోల్డింగ్స్ IPO ఈరోజు షురూ కానుంది. -
ఐటీ ఢమాల్: కుప్పకూలిన హెచ్‌సీఎల్‌టెక్ షేరు
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో లాభపడిన సూచీలు చివరలో కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స్ 389 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 62,182 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 18,497 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రా డేలో ఏకంగా 700 పాయింట్లకు పైగా పడి 61,889 కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 18,500 మార్క్‌ను బ్రేక్ చేసింది. ఎఫ్ఎంసిజి, ఫార్మా లాభపడగా, ఐటీ ఇండెక్స్ 3.16 శాతం పతనమైంది. అలాగే పీఎస్‌యూ బ్యాంక్ రియాల్టీ సూచీలు వరుసగా 1.7 శాతం1.5 శాతం నష్టపోయాయి. నెస్లే, టైటన్, సన్ ఫార్మ, డా.రెడ్డీస్, ఐషర్ మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ ఏకంగా 6 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విపప్రో, హిందాల్కో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు ఎగిసి 82.28 వద్ద ముగిసింది. -
ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని ప్రీ-పాండమిక్ స్థాయిలకు పొడిగించింది. మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, లిక్విడిటీ కార్యకలాపాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ఆర్బీఐ ట్రేడింగ్ గంటలను తిరిగి మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు డిసెంబర్ 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 18, 2022లో కొన్ని మార్పులు చేసిన ఎనిమిది నెలల తర్వాత మరోసారి టైమింగ్స్‌ను పొడిగించింది. అంటే కోవిడ్ ముందున్నట్టుగా ట్రేడింగ్ గంటల పొడిగించింది.మార్కెట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5వరకు ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్నం 3:30తో పోలిస్తే గంటన్నర ఎక్కువ. ఇవే టైమింగ్స్ కమర్షియల్ పేపర్ , డిపాజిట్ మార్కెట్ సర్టిఫికేట్లకు, అలాగే రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్ మార్కెట్‌కి కూడా వర్తిస్తాయి. కాగా కోవిడ్ ఉధృతితో ఏప్రిల్ 2020లో స్టాక్‌మార్కెట్ సమయాన్ని కుదించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ వడ్డింపు,18600 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు నష్ట పోయాయి. ఆ తరువాత ఆర్బీఐ వడ్డీ వడ్డనతో దలాల్ స్ట్రీట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జోరుగా కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 216పాయింట్ల పతనంతో 62,411 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి18 560 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 62500 మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ 18,600 మార్క్ దిగువకు చేరింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్రంట్‌లైన్ సూచీలతో సమానంగా పడిపోయాయి. ఏసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్‌టీ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటామోటార్స్ టాప్ లూజర్స్‌గా స్థిర పడ్డాయి. ఎఫ్ఎంసీజీ రికార్డ్ ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకుపోయాయి. దీంతో ఇండెక్స్ ఆల్ టైం గరిష్టానికి చేరింది. ఇమామీ, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ 1 శాతం నుంచి 3 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 18పైసలు లాభంతో 82.47వద్ద ఉంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును వడ్డించింది. అలాగే గ్లోబల్ సంక్షోభం, ద్రవ్యోల్బణం అప్రమత్తత కారణంగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. -
వడ్డీ రేటుపెంపు అంచనాలు: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలో భారీగా నష్టపోయిన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. కానీ హై స్థాయిల వద్ద సూచీల కన్సాలిడేషన్ కొన సాగుతోంది. చివరికి సెన్సెక్స్ 208 పాయింట్ల నష్టంతో 62626 వద్ద, నిఫ్టీ 58పాయింట్ల నష్టంతో 18642 వద్ద స్థిరపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, నెస్లే, బ్రిటానియా నష్టపోగా ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా బాగా లాభపడ్డాయి. సిమెంట్ ధరలు పెరుగుతాయన్న అంచనాలో అన్ని సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిసాయి. బీపీసీఎల్, టాటాస్టీల్, డా.రెడ్డీస్, హిందాల్కో యూపీఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఆగని రూపాయి పతనం డాలరు మారకంలో రూపాయి భారీగా కుప్పకూలింది. ఏకంగా 96 పైసలు కుప్పకూలి 82.57 స్థాయికి చేరింది. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు(బుధవారం) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీరేటుపెంపునకే మొగ్గు చూపవచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
మెటల్ షాక్: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా మూడో సెషన్లోనే నష్టాలతో ప్రారంభ మయ్యాయి. సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా పతనంతో 62515వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు నష్టంతో 18602 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా వేదాంత, సిప్లా, సెయిల్ తదితర మెటల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా బాగా లాభపడుతుండగా హిందాల్కో, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. రూపాయి భారీ పతనం: డాలరు మారకంలో రూపాయి భారీగా కుప్పకూలింది. అమెరికా జాబ్ మార్కెట్ రిపోర్ట్ అందోళన, ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు అంచనాలతో డాలర్ బలం పుంజుకుంది. దీంతో దేశీయ కరెన్సీ బలహీనపడింది. ఏకంగా 60పైసలు పతనమై 82.23 స్థాయికి చేరింది. -
కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకోవడం గమనార్హం. 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 62835 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 18701 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, యూపీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ భారీ లాభపడగా, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్ర, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 58 పైసలు కుప్పకూలి 81.79 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 81.32 తో పోలిస్తే సోమవారం స్వల్పంగ నష్టపోయిన రూపాయి ఆతరువాత మరింత పతనమైంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. డాలరు బలహీనంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలలో 1.4 శాతం పెరుగుదల కారణంగా రూపాయి సోమవారం కుప్పకూలింది. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు: బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఎఎఫ్‌సీజీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 342 పాయింట్లు కుప్పకూలి 62524 వద్ద నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 18598 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు యూపీఎల్ లాభపడుతుండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎం అండ్ ఎం టైటన్ నష్టపోతున్నాయి. అలాగే డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.37 వద్ద ఉంది. -
ఆటో, ఐటీ షాక్: బుల్ రన్‌కు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజుల లాభాల పరుగుకు బ్రేక్ చెప్పాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు సెన్సెక్స్, నిఫ్టీ వరుస రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసింది. డే హై నుంచి 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ 63 వేల దిగువకు చేరింది. అలాగే నిఫ్టీ కూడా 18700 దిగువకు చేరింది. ఆటో, ఐటీ షేర్లు భారీగా నష్ట పోయాయి. చివరికి సెన్సెక్స్ 416 పాయింట్లు కుప్పకూలి 62868 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు నష్టంతో 18696 వద్ద ముగిసింది. అపోలో హాస్పిట్సల్, టెక్ మహీంద్ర, గ్రాసిం, బ్రిటానియా డా. రెడ్డీస్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా కన్జూమర్స్స్ హెచ్‌యూఎల్, హీరో మోటో నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయ 12 పైసల నష్టంతో 81.31 వద్ద ఉంది. -
కొనసాగిన బుల్ రన్: చివర్లో లాభాల స్వీకరణ
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల్లో ముగిసాయి. వరుసగా రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చూశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ గరిష్టస్థాయిలను తాకింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో భారీ లాభాలను కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగిసి 63284 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 18815వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, టెక్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ లాంటి షేర్లు భారీగా లాభాలనార్జించాయి. మరోవైపు నవంబరు సేల్స్ నిరాశ పర్చడంతో ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. ఐసపీఐసీఐ బ్యాంకు, సిప్లా, యూపీఎల్, ఐషర్ మెటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పైసలు లాభపడి 81.21 వద్ద ముగిసింది. -
తగ్గేదేలే..దూసుకుపోతున్నసెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా 6వ రోజు కూడా తగ్గేదెలే అన్నట్టు దూసుకు పోతున్నాయి. రికార్డుల రికార్డులను సృష్టిస్తూ కీలక సూచీలు ఆల్ టైం గరిష్టాలను తాకాయి. నిఫ్టీ బ్యాంకు ఆల్ టైంహైకి చేరింది. సెన్సెక్స్ 395 పాయింట్లు ఎగిసి 63484 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 18862 వద్ద ప్రారంభ మైనాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, టెక్ఎం, ఇన్ఫోసిస్, విపప్రో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ విన్నర్స్‌గా, బజాజ్ ఆటో, యూపీఎల్, ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్, సిప్లా నష్టపోతున్నాయి. -
దలాల్ స్ట్రీట్ రికార్డ్: 63 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలను మొదట్లో కోల్పోయిన సూచీలు ఆతరువాత ఒక రేంజ్లో ఎగిసాయి. తద్వారా సెన్సెక్స్ 63 వేల స్థాయిని సునాయాసంగా దాటేసింది. అంతేకాదు రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజూ జోరుతో ఆల్-టైమ్ హైకి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాల నార్జించాయి. ముఖ్యంగా మూడు గంటలతర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్, అదానీ షేర్ల లాభాలు మార్కెట్లను రికార్డు స్థాయిల వైపు మళ్లించాయి. ఆటో షేర్లు మెరిపించాయి. ఒక దశలో సెన్సెక్స్ 600పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 418 పాయింట్లు ఎగిసి 63009 వద్ద, నిఫ్టీ140 పాయింట్లు 187580 వద్ద స్థిరపడ్డాయి. ఎం అండ్ ఎం, హిందాల్కో, గ్రాసిం, సిప్లా ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ టాప్ విన్నర్స్‌గా, ఇండస్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు ఎగిసి 81.42 వద్ద ఉంది. -
లాభాల స్వీకరణ, అయినా హైస్థాయిల వద్ద సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుసగా ఏడో సెషన్లోనూ లాభాల జోరు కంటిన్యూ చేశాయి. కానీ లాభాల స్వీకరణతో నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 81 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 62751 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 18646 వద్ద కొనసాగుతుండటం విశేషం. ఆటో మెట్ రంగ షేర్లు లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టోతున్నాయి. హిందాల్కో, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ లాభాల్లో టాప్‌లో ఉండగా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, బిపిసిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్యాంక్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 11 పైసలు ఎగిసి 81.63 వద్ద ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)దేశీయ జీడీపీ డేటా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానుంది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం పై టట్రేడర్లు దృష్టిపెట్టారు. -
బుల్ రన్: పెట్టుబడిదారులకు లాభాల పంట
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత రెండు సెషన్లుగా రికార్డుల మోత మోగిస్తున్న సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. అంతేకాదు వరుసగా ఆరో సెషన్లో లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి మెటల్ రంగ షేర్లు భారీ లాభాలనార్జించాయి. చివరికి నిఫ్టీ 55 పాయింట్లు ఎగిసి 18618 వద్ద, సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 62,681 వద్ద స్థిర పడ్డాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 62,887 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,678 వద్ద ఆల్ టైంని నమోదు చేశాయి. హోచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరోమోటో,బ్రిటానియా, సిప్లా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, పవర్‌గగ్రిడ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.72 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సోమవరం 81.67 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
రికార్డుల జోరు: బుల్ రన్.. తగ్గేదేలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో స్వల్పంగా నష్టపోయిన సూచీలు ఆ వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 350పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ ఆల్ టైం హైని తాకింది. సెన్సెక్స్ 62,687 వద్ద నిఫ్టీ 18,611 వద్ద తాజా రికార్డును తాకింది. మెటల్ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాలనార్జించాయి. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 62,505 నిఫ్టీ 50 పాయింట్లు లాభంతో 18563 వద్ద ముగిసాయి. చైనాలో కరోనా మళ్లీ విస్తరించడం, లాక్డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బ్యాంకు నిఫ్టీ కూడా 43వేల ఎగువకు చేరింది. బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్స్, నెస్లే టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,టాటాస్టీల్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.64 వద్ద ఉంది. -
డ్రాగన్ కంట్రీలో అలజడి: సూచీల పరుగుకు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. చైనాలో కరోనా వైరస్ మళ్లీ విస్తరించడం, లాక్డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఆదివారం షాంఘైలో ప్రదర్శనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ, ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో COVID-19 నిర్వహణపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల పతనానికి దారి తీసాయి. దీంతో దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు చెక్ పడింది. అయితే ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకుని సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 97 పాయింట్లు ఎగిసి 62,396 , నిఫ్టీ పాయింట్లు లాభంతో 18532వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్,హెచ్డీఎఫ్సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.73 వద్ద ఉంది. -
లాభాల స్వీకరణ, ఎఫ్ఎంసీజీ, ఐటీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. రికార్డు హైల వద్ద లాభాల స్వీకరణకు తోడు థాంక్స్ గివింగ్ సందర్భంగా అమెరికా మార్కెట్లు పనిచేయని కారణంగా పెట్టుబడిదారుల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రభుత్వ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్,నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 62 వేల పాయింట్లకుపైన, నిఫ్టీ 18400కు ఎగువన ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు,అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా లాభాల్లోనూ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, సిప్లా, నెస్లే, ఆసియన్‌పెయింట్స్ , అదానీ ఎంటర్ పప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి15 పైసలు ఎగిసి 81.51 వద్ద కొనసాగుతుంది -
రికార్డుల వరద, రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సందేశాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల లాభాలతో రికార్డుల వెల్లువ కురింది. సెన్సెక్స్ 62252 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 52 వారావల హైని నమోదు చేసింది. అలాగే బ్యాంకింగ్ షేర్లు లాభాలతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైకి చేరింది. ఆఖరి నిమిషాల్లో రిలయన్స్, టీసీఎస్ ఐటీసీలో కొనుగోళ్లు మార్కెట్లకు మరింత ఊతమిచ్చాయి. చివరకు సెన్సెక్స్ 762 పాయింట్లు ఎగిసి 62272 వద్ద, నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో18514 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్ల లాభాలతో సెన్సెక్స్ 62 వేల పాయింట్లు సునాయాసంగా అధిగమించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. బిస్లరీ కొనుగోలు వార్తలతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాదాపు 4 శాతం షేరు ధర ఆల్ట టైం హైకిచేరింది. సిప్లా, కోల్ ఇండియా, కోటక్ మహీంద్ర, టాదటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాల్లోనే ముగిసింది. 26 పైసలు ఎగిసిన రూపాయి 81.63 వద్ద స్థిరపడింది. -
లాభాల జోరు: సెన్సెక్స్ 260 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 61757 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు ఎగిసి 18341 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ.790 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.414 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. టాటా కన్జ్యూమర్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 17 పైసలు ఎగిసి 81.70 వద్ద ఉంది. -
వరుసగా రెండో సెషన్లోనూ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ మధ్యలో లాభాలను కోల్పోయినా వరుసగా రెండో సెషన్లోనూ లాభపడింది. సెన్సెక్స్ 92 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 61,511 వద్ద, నిఫ్టీ 0.13 శాతం లేదా 23.05 పాయింట్లు పెరిగి 18,267 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, మారుతి సుజుకి టాప్ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, టెక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 22 పైసలు నష్టంతో 81.84 వద్ద ముగిసింది. -
లాభాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకొనసాగుతున్నాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలున్నప్పటికీ, సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎసిగింది. ప్రస్తుతం102 పాయింట్ల లాభంతో 61,521 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 18,273వద్ద కొనసాగుతోంది. ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, మారుతి సుజుకి లాభాల్లోనూ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలోరూపాయి 15 పైసలు నష్టంతో 81.78కి చేరింది. -
పీఎస్‌యూ బ్యాంకింగ్ జూమ్:లాభాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేస్తున్నారు. అయితే మూడు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సెన్సెక్స్ ఆరంభంలో లాభాలతో మురిపించింది. రోజంతా పటిష్టంగా కొనసాగి చివరకు సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 61,419 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 18,244 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. రియాల్టీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇండస్ ఇండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు నెస్లే, బీపీసీఎల్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, టాప్ లూజర్స్‌గా ముగిసాయి. అటు డాలరు మారకంలోరూపాయి 12 పైసలు ఎగిసి 81.67 వద్ద ముగిసింది. -
వరుస నష్టాలకు చెక్, లాభాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా షేర్లు వెనుకంజలో ఉన్నప్పటికీ మంగళవారం కీలక సూచీలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 61315 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభంతో 18214 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిం, ఇండస్ ఇండ్ బ్యాంకు,హిందాల్కో, డా. రెడ్డీస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిడ్, ఓఎన్జీసీ, నెస్లే, బీపీసీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు ఎగిసి, 81.75 వద్ద ఉంది -
రిలయన్స్, ఇన్ఫోసిస్ షాక్: వరుసగా మూడో సెషన్లో నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సంకేతాలతో సోమవారం వరుసగా మూడో సెషన్లో నష్టపోయిన సెన్సెక్స్ ఆరంభంలో సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయింది. ఐటీ,పవర్, రియాల్టీ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగి, చివరకు సెన్సెక్స్ 519 పాయింట్లు కుప్పకూలి , 61114 వద్ద నిఫ్టీ 148 పాయింట్ల పనతంతో నిఫ్టీ వద్ద 18159 వద్ద ముగిసింది. బీపీసీఎల్ , భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌యూఎల్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హీరో మోటాకార్ప్, అదానీపోర్ట్స్ , ఎల్ అండ్ టీ, టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 17పైసలు నష్టోయి 81.83 వద్ద ఉంది. -
ఆటో షాక్, వరుసగా రెండో రోజూ నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిసాయి. శుక్రవారం మిడ్‌సెషన్‌లో బాగా నష్టపోయిన సూచీలు చివరికి స్పల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 87పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 61,663, నిఫ్టీ 36 లేదా 0.2 శాతం క్షీణించి 18,308 వద్ద ముగిసింది. దాదాపు అన్నిరంగాల షేర్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభ పడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర టాప్ విన్నర్స్‌గా నిలవగా ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 6పైసల నష్టపోయి 81.70వద్ద ముగిసింది. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్: కీలక మద్దతు స్థాయిలు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ, వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 312 పాయింట్లు కుప్పకూలి 61437 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల పతనమై 18244 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు వారాంతం కావడంతో టట్రేడర్ల లాభాల స్వీకరణ కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 61500 దిగువకు, నిఫ్టీ 18300 స్థాయిని కోల్పోయి మరింత బలహీన సంకేతాలిస్తున్నాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టాటామోటార్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ తదితరాలు లాభపడుతున్నాయి. ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, టైటన్, టాటా కన్జ్యూమర్స్ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి నష్టాల్లో ఉంది. 81.65 వద్ద ట్రేడ్ అవుతోంది. -
రోజంతా ఊగిసలాట, చివరికి భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టంతో 61,750 నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 ముగిసింది. మరోవైపు గరిష్టస్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్, బలహీనమైన ప్రపంచ సూచన దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్ ఐటీషేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ టాటా కన్జ్యూమర్, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంకు ,భారతి ఎయిర్టెల్, భారీగా నష్టపోగా టైటన్, ఎం అండ్, టాటా మెటార్స్, అపోలో హాస్పిటల్స్, ఐషర్‌మోటార్ లాభపడ్డాయి. అటు ద్రవ్యోల్బణం దిగిరావడం, వడ్డీరేటు పెంపు పెద్దగా ఉండదనేభరోసా మద్య డాలరు పుంజుకోవడంతో గురువారం డాలర్‌తో రూపాయి పడిపోయింది. అటు రూపాయి గత ముగింపు 81.30తో పోలిస్తే డాలరు మారకంలో రూపాయి భారీ నష్టపోయింది. 35 పైసల నష్టంతో 81.65 వద్ద ముగిసింది. -
రికార్డు క్లోజింగ్, 18400ఎగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న సూచీలు రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 62వేల మార్క్‌ను తాకింది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 61980వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18409 పద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కట్లకు ఊతమిచ్చాయి. అటు మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. కోటక్ మహీంద్ర, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.30 వద్ద ముగిసింది. -
ప్రాఫిట్ బుకింగ్:18400 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 61757 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18367 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరడంతో మంగళవారం రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్ బుధవారం ప్రారంభంలోనే నష్టాలను చవి చూసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస షేర్లు నష్ట పోతున్నాయి. డా. రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, అదానీపోర్ట్స్ లాభాల్లోనూ, దివీస్ ల్యాబ్స్, టాటాస్టీల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. 51 పైసల నష్టంతో 81.50 వద్ద ట్రేడ్ అవుతోంది. -
రెండో రోజు అదో ధోరణి, అసలు ఏమైంది?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగి రావడంతో ఆరంభంలో100 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ వెంటనే సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సోమవారం నాటి ధోరణిని కొటిన్యూ చేస్తున్నాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 61610 వద్ద,నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 18332 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో ఇండెక్స్ లాభాల్లో ఎఫ్ఎంసిజి, రియాల్టీ సూచీలు నష్టాల్లోనూ ఉన్నాయి. బ ఓఎన్జీసీ, హీరో మోటో, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో భారీ లాభాల్లో, కోల్ ఇండియా, ఐటీసీ, టీసీఎస్, సన్‌ఫార్మ, హెచ్డీఎఫ్సీ టాప్ లూజర్స్‌గానూ కొనసాగుతున్నాయి. ఎల్టీఐ-మైండ్‌ట్రీ విలీనం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మైండ్‌ట్రీ 1 శాతం పెరిగింది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.28 వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ఆరంభంలోనే 12 పైసలు ఎగిసింది. కాగా మార్కెట్ ముగింపు తర్వాత విడుదలైన డేటాలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి తగ్గిందని, సెప్టెంబర్‌లో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.41 శాతానికి తగ్గింది. -
లాభాలు పాయే: ఫార్మా డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం నాటి భారీ ర్యాలీకి చెక్ పెట్టిన సూచీలు సోమవారం ఆరంభంలో నష్టాలను చూశాయి. 76 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్ ఆ తరువాత 150 పాయింట్లకు పైగా ఎగిసింది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఫార్మరంగ షేర్ల నష్టాలుమార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 65 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్,ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. అలాగే హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్డబ్య్లూ స్టీల్, బజాజ్ ఆటో లాభపడుతుండగా డా.రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. ఎగిసిన రూపాయి అటు మారకంలో రూపాయి ఆరంభంలోనే 25పైసలు ఎగిసిన రూపాయి 80.53 స్థాయికి చేరింది. -
బుల్ ర్యాలీ: సెన్సెక్స్, నిఫ్టీ జోష్‌కు ఐదు కారణాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఆరంభ లాభాలనుంచి ఏ మాత్రం తగ్గని సూచీలు మరింత జోష్‌గా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్1181 పాయింట్లు ఎగిసి 61795 వద్ద, నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో 18350 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ హైస్థాయి వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్ లాంటి హెవీ వెయిట్ షేర్లు మార్కెట్లను ఊతమిచ్చాయి. కోటక్ మహీంద్ర, జొమాటో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్ భారీగా లాభపడగా, ఐషర్‌మోటార్స్, హీరో మోటో, ఎం అండ్, బ్రిటానియా నష్టపోయాయి. దలాల్ స్ట్రీట్ జోరు,ఐదు కారణాలు బలపడుతున్న రూపాయి, ఎఫ్ఐఐల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, అమెరికా ఇన్ఫ్లేషన్ , ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్లను తగ్గించనున్నారనే అంచచాలు దేశీయ ఈక్విటీలకు ఊతమిచ్చాయి. డాలరుతో పోలిస్తే రూపాయి బలపడుతున్న తీరు ఎఫ్ఐఐలను కొనుగోళ్ల వైపు మళ్లించింది. దీంతో గత 2-3 వారాలుగా నాన్‌స్టాప్ కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ జోరందుకుంది. నవంబర్‌లో ఇప్పటివరకు దలాల్ స్ట్రీట్‌లో ఎఫ్ఐఐలు రూ. 19,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఎన్ఎస్డిఎల్ డేటా చూపిస్తుంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు దేశీయంగా ప్రభావాన్ని చూపించాయి. అంతర్జాతీయ సంకేతాలు వాల్ స్ట్రీట్ సూచీలు దాదాపు రెండున్నరేళ్ల గరిష్టానికి చేరాయి. డౌ జోన్స్ 3.7శాతం, S&P 500 5.54 శాతం, నాస్డాక్ కాంపోజిట్ 7.35 శాతం ఎగిసాయి. ఇక ఆసియా మార్కెట్లలో MSCI ఇండెక్స్ 3.72 శాతం, జపాన్ నిక్కీ ఇండెక్స్ 2.75 శాతం పెరగడంతో రెండు నెలల గరిష్టాన్ని తాకింది. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అటు అక్టోబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 7.7 శాతానికి దిగి వచ్చింది. సెప్టెంబరులో ఇది 8.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ రేటుపెంపు ఉండకపోవచ్చనే అంచనాల మధ్య డాలర్ బలహీన పడింది. ఫలితంగా రూపాయి బాగా పుంజుకుంది. 1.05 పైసలు ఎగిసి 81 మార్క్‌ను కూడా బ్రేక్ చేసి 80.95పైకి ఎగబాకడం విశేషం. చివరికి 60పైసల లాభంతో 80.80 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్, రూపాయి హై జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడటంతో గ్గోబల్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌లో ఉత్సాహం నెలకొంది. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు, వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 1001 పాయింట్లు ఎగిసి 61614వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు లాభంతో 18313 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఒక్క ఆటో తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 3.2 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం ఎగిసాయి. ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్ , హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతుండగా, ఐషర్ మోటారస్, హీరో మోటా, బ్రిటానియా, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. రూపాయి జోరు అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా రూపాయి 23 పైసలు ఎగిసి 80.80 వద్ద కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి గత మూడు రోజులుగా లాభాల్లో ఉంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోవడం, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తప్పదనే అంచనాల మధ్య డాలర్ పతనమైంది. -
భారీ నష్టాలు, మూడు రోజుల లాభాలకు రుపీ చెక్
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్న సూచీలు , తరువాత మరింత బేజారయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 60,500 దిగువకి, నిఫ్టీ 18000 దిగువనకు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 420 పాయింట్లు నష్టపోయి 69613 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 18028 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60,600 ఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన ముగియం విశేషం. అమెరికా ఇన్ఫ్లేషన్ డేటాపై దృష్టి, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు వారం F&O గడువు ముగింపు కావడంతో దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ హెచ్‌యుఎల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా లాభపడ్డాయి. ముఖ్యంగా నైకా షేర్లు ఏకంగా 10 శాతం జంప్ చేశాయి. అటు డాలరుమారకంలో రూపాయి వరుస లాభాలకు చెక్‌పెట్టింది. 40పైసలు కోల్పోయి 81.76 స్థాయికి చేరింది. -
భారీగా నష్టపోతున్న సూచీలు, మద్దతు స్థాయిలు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 61 వేలు, నిఫ్టీ 18100స్థాయి దిగువకు చేరాయి . ఫార్మా మినహా, ఆటో ఇండెక్స్ అత్యధికంగా 1 శాతానికి పైగా క్షీణించింది. ఇంకా మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 335 పాయింట్లను కోల్పోయి 60698 వద్ద, నిఫ్టీ 102పాయింట్ల నష్టంతో 18155 వద్ద కొనసాగుతున్నాయి. నైకా షేర్లు 3 శాతం ఎగిసాయి. సిప్లా, హెచ్‌యూఎల్, డా. రెడ్డీస్, దివీస్, భారతి ఎయిర్టెల్ లాభ పడుతుండగా, టాటామోటార్స్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్, పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్ర, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 15 పైసలు నష్టంతో 81.56 వద్ద ఉంది. బుధవారం 81.44 వద్ద ముగిసింది. -
ప్రాఫిట్ బుకింగ్: ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. అయినా సెన్సెక్స్ 61 వేలకు ఎగువన, నిఫ్టీ 18150స్థాయిని నిలబెట్టుకున్నాయి. ఫార్మా, మెటల్ సూచీల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అలాగే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, రేపు వెలువడనున్న యూఎస్ ద్రవ్యోల్బణం డేటాపై పెట్టుబడి దారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 152 పాయింట్లను కోల్పోయి 61033 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 18157 వద్ద ముగిసాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐటీసీ, హీరోమోటో, డా. రెడ్డీస్ లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, పవర్‌గగ్రిడ్, దివీస్ ల్యాబ్స్, టెక్ ఎం, గ్రాసిం భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45పైసలు ఎగిసి 81.44 వద్ద ముగిసింది. సోమవారం 81.92 వద్ద 82 మార్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. -
హుషారుగా దలాల్ స్ట్రీట్, రూపాయి రయ్..రయ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.ఆసియా మార్కెట్లు బలహీనమైన సంకేతాలు ఉన్నప్పటికీ, బుధవారం సెన్సెక్స్ నిఫ్టీలు మద్దతు స్థాయిలను దాటి ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాబంతో 61326 వద్ద, నిప్టీ 46 పాయింట్లు ఎగిసి 18248 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, బబ్రిటానియా, అదానీ పోర్ట్స్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ లాభపడుతుండగా, హిందాల్కో, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, టైటన్ నష్టపోతున్నాయి. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ భారీ నష్టాల్లో ఉన్నాయి. అటుడాలరు మారకంలో రూపాయి 44 పైసలు ఎగసి 81. 56 వద్ద ఉంది. -
మార్కెట్లో లాభాల జోష్, రూపాయి హై జంప్, 82 మార్క్ బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లో అండతో ఆరంభంలో 350 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆ తరువాత లాభాలను కోల్పోయి క్రమంలో నష్టాల్లోకి జారుకుంది. చివర్లో కొనుగోళ్ల మద్దతుతోసెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 61185 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు ఎగిసి 18202 వద్ద స్థిరపడ్డాయి. తద్వారాసెన్సెక్స్ 61వేలకు ఎగువన, నిఫ్టీ 18200 ఎగువన పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. వారాంతంలో ఊహించిన దాని కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలతో బ్రిటానియా 8శాతం, ఎస్బీఐ 3 శాతం ఎగిసాయి. ఇంకా అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్ షర్ మెటార్స్ గ్రాసిం కూడా భారీగా పెరిగాయి. నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాలతో దివీస్ ల్యాబ్ 9 శాతం కుప్పకూలింది. ఏషియన్ పెయింట్స్ 2 శాతానికిపైగా నష్టపో యింది. అలాగే సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. . రుపీ హై జంప్: అటు డాలరు మారకంలో రూపాయి భారీగా ఎగిసింది. ఆరంభంనుంచి పాజటివ్‌గా ఉన్న రూపాయి చివర్లో ఏకంగా 63 పైసలు జంప్ చేసి 81.90 వద్ద ముగిసింది. -
లాభాల రింగింగ్, దూసుకుపోతున్న ఎస్బీఐ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో ఆరంభంలో 350 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 255 పాయింట్ల లాభంతో 61176 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు ఎగిసి 18201 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల జోష్‌తో ఉన్నాయి. బ్రిటానియా, ఎస్బీఐ అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటామోటార్స్, గ్రాసిం లాభాల్లోనూ, టైటన్, సిప్లా, డా. రెడ్డీస్, హిందాల్కో, ఏషియన్స్ పెయింట్స్ నష్టాల్లోనూ ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజటివ్‌గా ఉంది 25 పైసల లాబంతో 82. 23 వద్ద కొనసాగుతోంది. కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, పేటీఎం త్రైమాసిక ఫలితాలపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా రేపు(మంగళవారం) స్టాక్ మార్కెట్ పనిచేయదు. దీంతో ముగింపు లాభాల స్వీకరణ కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. -
నష్టాలకు చెక్: వారాంతంలో లాభాల జోష్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో పటిష్టంగా ముగిసాయి. ఫెడ్ ఎఫెక్ట్‌తో గత రెండు రోజులుగా ఊగిసలాడుతున్నప్పటికీ కీలక మద్దతు స్థాయిలకు ఎగువన స్థిరంగా ఉంటున్నాయి. శుక్రవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించిన రోజంతా ఒడిడుదడుకుల మధ్య సాగాయి. అన్ని రంగాలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడగా, హెల్త్‌కేర్ ఇండెక్స్ అత్యధికంగా క్షీణించింది. చివరికి114 పాయింట్ల లాభంతో 60950 వద్ద సెన్సెక్స్, 64 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 18117 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 18100 ఎగువన స్థిరపడటం విశేషం. ఫలితాల జోష్‌తో అదానీ ఎంటర్పప్రైజెస్ టాప్ విన్నర్‌గా ఉంది. ఇంకా హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోరర్ట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ లాభపడ్డాయి. అటు హీరొ మోటో కార్ప్,సిప్లా, డా రెడ్డీస్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. డాలరు మారకంలో రూపాయి భారీగా ఎగిసింది. ఏకంగా 48 పైసలు లాబడా 82.49 వద్ద స్థిరపడింది. -
లాభనష్టాల మధ్య ఊగిసలాట, ఫ్లాట్‌గా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. కానీ వెంటనే ఫ్లాట్‌గా మారిపో యాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు ఎగిసి 60956 వద్ద నిఫ్టీ 45 పాయింట్లు లాభంతో 18104 వద్దకు చేరడంతో నిఫ్టీ తిరిగి 18వేల100 ఎగువకు, సెన్సెక్స్ 60 వేలకు ఎగువకు చేరింది. కానీ వెంటనే ఆరంభ లాభాలను కోల్పోయి ప్రస్తుతం ఫ్లాట్‌గా కొనసాగుతోంది. లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ఉండగా, ఫార్మా, ఐటీ రంగ షేర్లు నష్టపోతున్నాయి. హిందాల్కో, బజాజ్ ఆటో,యాక్సిస్ బ్యాంకు,బ్రిటానియా, ఎస్బీఐ, టైటన్, లాభాల్లోనూ, ఫలితాల నేపథ్యంలో హీరోమోటో కార్ప్కూడా టాప్ లూజర్‌గా ఉంది. ఇంకా. ఇన్ఫోసిస్, దివీస్, అపోలో హాస్పిటల్స్, డా.రెడ్డీస్ నష్టపోతున్నాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో ఆరంభంలోనే నెగిటివ్‌గా ఉన్నప్పటికీ వెంటనే ప్రధాన సూచీలు లాభాల్లోకి మళ్లాయి. రోజాంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడి, చివరికి సెన్సెక్స్ 70 పాయింట్లు కోల్పోయి 60836 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో 18053 వద్ద ముగిసాయి. నిఫ్టీ 18వేలకు ఎగువన, సెన్సెక్స్ 60 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి. ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోగా, బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, టైటన్, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్ లాభపడగా, టెక్ మహీంద్ర, హిందాల్కో, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో 12 పైసలు క్షీణించి 82.88 వద్ద ముగిసింది. -
నష్టాలనుంచి అనూహ్యంగా పుంజుకున్న సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లులాభాల్లోకి మళ్లాయి. యూఎస్ ఫెడ్ వరుస వడ్డీ వడ్డనతో నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు వెంటనే నష్టాలనుంచి తేరుకోవడం విశేషం. 278 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు లాభంతో 60965 వద్ద, నిప్టీ 16 పాయింట్లు పాజిటివ్‌గా 18099 వద్ద కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్ గ్రిడ్ నష్టపోతుంగా, టైటన్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, మారుతి లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో స్వల్ప నష్టాలతో 82.83 వద్ద ఉంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా నాల్గవ సారి 75 బేసిస్ పాయింట్లు (bps) పెంచిన సంగతి తెలిసిందే. -
ఆటో షాక్: నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నాలుగు రోజుల లాభాలకు సూచీలు చెక్ చెప్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 101 పాయింట్లు క్షీణించి 61019 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 18120 వద్ద కొనసాగుతున్నాయి. షేర్లు నష్టపోతుండగా, మీడియా, ఫార్మా షేర్ల లాభాలకు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 18 వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ స్టేట్మెంట్ను ప్రకటించనుంది.దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది. సన్‌ఫార్మా, డా.రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో ఉంది. 1 పైసా నష్టంతో 82.70 వద్ద ఉంది. -
ఫార్మా షేర్ల ర్యాలీ, సెన్సెక్స్, నిఫ్టీ జూమ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు భారీ లాభాలను ఆర్జించాయి. ఆరంభం నుంచి దూకుడుమీద ఉన్న సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. ఫలితంగా నిఫ్టీ 18వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరపడటం విశేషం. ఇంట్రా డేలో 500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 61121వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాబంతో 18145 వద్ద పటిష్టంగా క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ లాబ్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, డా. రెడ్డీస్ లాబ్స్, పవర్ గ్రిడ్, , హిందాల్కో, గ్రాసిం, ఇన్ఫోసిస్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, ఐషర్ మోటార్స్, రిలయన్స్, మారుతి సుజుకి, పీఎన్బీ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.71 వద్ద ముగిసింది. -
వావ్.. జోరుగా హుషారుగా మార్కెట్లు, అన్నీ లాభాలే
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగిసింది. ఫలితంగా సెన్సెక్స్ 61వే స్థాయిని నిఫ్టీ 18వేల మార్క్‌ను సునాయాసంగా అధిగమించాయి. మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 0.3 శాతం వరకు పెరిగాయి. మెటల్ మినహా, అన్ని రంగాలు, ప్రధానంగా బ్యాంక్, ఫార్మా రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3 80పాయింట్లు ఎగిసి 61126 వద్ద,నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 18130వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డా.రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, దివీస్ లేబ్స్, గ్రాసిం ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో ఉండగా, యాక్సిస్, టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా , ఐటీసీ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిల 82.75 వద్ద ఫ్లాట్‌గా ఉంది. -
లాభాలతో కళకళ లాడిన దలాల్ స్ట్రీట్, 18వేల ఎగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్787 పాయింట్లు ఎగిసి 60787 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల లాభపడి 18012 వద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితరాలు భారీ లాభాల్లో ముగిసాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, డా రెడ్డీస్, ఎ న్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 82.78 వద్ద ఉ ముగిసింది. శుక్రవారం 82.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
దలాల్ స్ట్రీట్ దౌడు : ఎయిర్టెల్ హై జంప్, కారణాలివే!
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రధాన సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేటు కోత అంచనాలు, ఆర్బీఐ సమావేశం, చమురు ధరలు క్షీణత మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. సెన్సెక్స్ 591.12 పాయింట్లు లేదా 0.99 శాతం పుంజుకుని 60551 వద్ద , నిఫ్టీ 164.25 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 17,956 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే న్నాయి. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇంకా ఎంఅండ్ఎం, టెక్ మహీంద్ర, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మ లాభాల్లో ఉండగా, అపొలో హాస్పిటల్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ మాత్రమే నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయ 16 పైసలు ఎగిసి 82.34 వద్ద ఉంది. -
ఆరంభ లాభాలు పోయినా భేష్, మారుతి టాప్ గెయినర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. అయితే ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 60 వేల దిగువన స్థిరపడింది. సెన్సెక్స్ 203 పాయింట్లు ఎగిసి 59959 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17786 వద్ద క్లోజ్ అయింది. వరుసగా రెండో సెషన్లోనూ విజయ పరంపరను కొనసాగించాయి. అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు టెక్ దిగ్గజాలనిరాశాజనక ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా దేశీయ సూచీలు గరిష్ట స్థాయిలను కోల్పోయాయి.. లాభాల జోష్‌తో మారుతి సుజుకి ఏకంగా 5 శాతం ఎగిసింది. రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, హీరోమోటా కార్ప్ భారీగా లాభపడగా, టెక్ ఎం, టాటా స్టీల్, గ్రాసిం, సన్ ఫార్మా, దివీస్ లాబ్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయికూడా లాభాలను కోల్పోయి 82.47 స్థాయి వద్ద ముగిసింది. -
గ్లోబల్ మార్కెట్లు డల్, కానీ సెన్సెక్స్ దూకుడు 60వేలఎగువకు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ శుక్రవారం వరుసగా రెండవ సెషన్లోనూ లాభాల్లో షురూ అయ్యాయి. ఆ తరువాత మరింత పుంజుకుని ప్రస్తుతం 373 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 60వేల మార్క్‌ను దాటేయగా, నిఫ్టీ 101 పాయింట్లు జంప్ చేసి 17837 స్థాయికి చేరింది.దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. బజాజ ఆటో, ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా , మారుతి సుజుకి భారీగా లాభపడుతుండగా, టాటా స్టీల్, హిందాల్కో, సన్‌ఫార్మా, దివీస్ లాబ్స్ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా ఉంది. 17 పైసలు ఎగిసి 82.35 వద్ద ఉంది. -
లాభాల ముగింపు, 17700 పాయింట్లకు పైన నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గి ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరికి పాజిటివ్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 59757వద్ద,నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 17737 వద్ద స్థిరపడ్డాయి. ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపు కావడంతో లాభాల స్వీకరణ కనిపించింది. దాదాపు అన్ని రంగాలు ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా స్టీల్ , రిలయన్స్ లాభపడగా, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్ర నష్టపోయాయి. మారుతిక్యూ2 ఫలితాలను రేపు(శుక్రవారం) ప్రకటించనుంది. -
మెటల్ షైన్: లాభాల జోరు
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ షేర్ మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 394 పాయింట్లు ఎగిసి 59939 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17775 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నెలవారీ F&O గడువు ముగియనుంది. దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగే అవకాశం ఉంది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ లాభపడుతుండగా, ఎన్టిపిసి, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నష్టాల్లో ఉన్నాయి. కాగా బలిప్రతిపాద సందర్భంగా బీఎస్ఈ, ఎన్సీఈ మార్కెట్లకు బుధవారం సెలవు. -
బలిప్రతిపాద: స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు. బలిప్రతిపాద సందర్భంగా బీఎస్ఈ, ఎన్సీఈ మార్కెట్లు పనిచేయవు. బులియన్ సహా హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. ఫారెక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. బలి ప్రతిపాదను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే ఈ పండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రోజుగా భావిస్తారు. కాగా అక్టోబర్ 25న, సెన్సెక్స్ 287.70 పాయింట్లు లేదా 0.48శాతం క్షీణించి 59,544 వద్ద నిఫ్టీ 74.50 పాయింట్లు లేదా 0.42శాతం క్షీణించి 17,656 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
ఆరంభ లాభాలు ఆవిరి: నైకా షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఒక దశలో 60వేలను దాటేసిన సెన్సెక్స్ చివరికి 288 పాయింట్లు నష్టపోయి 59543 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 17659 వద్ద స్థిరపడింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలతో భారీ నష్టాలనుంచి సేచీలు కోలుకున్నాయి. టెక్ మహీంద్ర, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ , ఐషర్ మోటార్స్ లాభపడగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్‌యూఎల్, బజాజ్‌ఫిన్‌సర్వ్, బ్రిటానియా నష్టపోయాయి. అలాగే నైకాషేర్లు 2శాతం పతనాన్ని నమోదు చేశాయి. భారీ అమ్మకాలతో ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా ఆరంభం లాభాలను కోల్పోయింది. తీవ్ర ఒడి దుడుకుల మధ్య శుక్రవారం నాటి 82.68 ముగింపుతో పోలిస్తే స్వల్ప నష్టాలతో 82.73 వద్ద ముగిసింది. -
స్వల్ప నష్టాల్లో సూచీలు;ఐసీఐసీఐ బ్యాంకు రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం కొత్త సంవత్ 2079ని అట్టహాసంగా ప్రారంభించిన సూచీలు మంగళవారం స్వల్పంగా వెనుకబడ్డాయి. ఎనిమిదో వరుస సెషన్లో లాభాలతో టట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 59741 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు వెనుకబడి 17706 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఊహించిన దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్ఇలో 1.81 శాతం పెరిగి గరిష్టంగా రూ.943 తాకింది. అయితే 21 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టెక్‌మహీంద్ర, మారుతి సుజుకి, గ్రాసిం, డా. రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడుతుండగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.72 స్థాయికి బలహీనపడింది. -
ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’
సాక్షి, ముంబై: దీపావళి అంటే పటాసులు, దీపాలు, స్వీట్లు, లక్ష్మీ పూజ మాత్రమే కాదు ఇన్వెస్టర్లకు మరో ప్రత్యేక పండుగ కూడా ఉంది. అదే ముహూరత్ ట్రేడింగ్. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు వ్యాపారులు ఒక శుభదినంగా భావిస్తారు. అందుకే ఈ రోజు కనీసం ఒక షేర్లో అయినా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాలని ట్రేడర్లు ఆశపడతారు. సాధారణంగా దివాలీ రోజు గంట సేపు నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లోనే ముగుస్తుంది. ఫలితంగా ఏడాదంతా షేర్ మార్కెట్లో లాభాలే లాభాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 24న జరిగే ముహూరత్ ట్రేడింగ్ ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, దివంగత రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా లేకుండానే ముగియనుంది. ప్రతీ ఏడాది అనేక మంది ఇన్వెస్టర్లకు ఆయన ఇచ్చే సలహాలు, పెట్టుబడి సూత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆహార్యంతో పలు ఛానెళ్లలో ఆయన మార్కెట్ మంత్రాను వివరించేవారు. మార్కెట్లో తన అనుభవం, టాప్ ప్లేస్‌కు చేరుకున్న తన ప్రస్థానం గురించి చెబుతూ ప్రేరణగా నిలిచేవారు. గత ఏడాది 101 కోట్ల రూపాయల లాభం గత ఏడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా 5 స్టాక్‌ల పెట్టుబడిద్వారా రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 101 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతేకాదు రాకేష్ రికమెండ్ చేసిన స్టాక్‌లు భారీ లాభాలను గడించాయి. ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను ఆకర్షించాయి. దీంతో షేర్ వరుస లాభాలతో ఆల్ టైం గరిష్టాన్ని తాకడం విశేషం. దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో బిలియనీర్ ఇన్వెస్టర్ లేని లోటు తీరనిదని, మిస్ యూ అంటూ విశ్లేషకులు, ట్రేడర్లు రాకేశ్ ఝన్ఝన్వాలాను గుర్తు చేసుకుంటున్నారు. ట్రేడర్లు ఆయన సూచనలు, సలహాలతోపాటు చమక్కులను కూడా మిస్ అవుతారంటూ నివాళులర్పిస్తున్నారు. కాగా ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్ వాలా ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్‌లో లాభాలే లాభాలా?
సాక్షి,ముంబై: దీపావళి వచ్చిందంటే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, ముహూరత్ ట్రేడింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు. దివాలీ రోజు గంట సేపు ముహూరత్ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించటం ఆనవాయితీ. అంతేకాదు ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం భారతదేశం. దీపావళి పర్వదినం రోజు లక్ష్మీ పూజ తరువాత ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించి సంవత్ 2079 సాంప్రదాయంగా ప్రారంభిస్తారు.(ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’) ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర ఈ ఏడాది అక్టోబర్ 24, 2022న దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించ నున్నారు. ఈ సాంప్రదాయ చర్రితను ఒక సారి పరిశీలిస్తే 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించగా, 1992లో ఎన్ఎస్ఈ దీనిని దీపావళి రోజున ప్రారంభించింది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించిన నిర్వహించే శుభ ముహూర్తం. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్' క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 24, 2022న జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. అలాగే దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్ 26న ఎక్స్ఛేంజీలు పనిచేయవు. దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలు మార్కెట్ సాయంత్రం 6:15 కు ఓపెన్ అవుతుంది. మార్కెట్ సాయంత్రం 7:15 ముగుస్తుంది. ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
స్వల్ప లాభాలే అయినా పాజిటివ్ నోట్‌తో ముగిసిన సంవత్ 2078
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోనేముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ సెన్సెక్స్ 59300 స్థాయికి పైన ముగియడం గమనార్హం. ముఖ్యంగా అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ సంవత్ 2078 చివరి రోజున కీలక సూచీలు సానుకూలంగా ముగిసాయి. వరుసగా ఆరో రోజు లాభాల నేపథ్యంలో వారాంతంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ కేవలం 104 పాయింట్ల లాభాలకు పరిమితమై 59307వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17576 వద్ద స్థిరపడింది. ఐటీ, మీడియా రంగ షేర్లు మినహా బ్యాంక్ ,కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇతర రంగాల షేర్లు లాభపడ్డాయి. క్యూ2 ఫలితాల జోష్‌తో యాక్సిస్ బ్యాంకు ఏకంగా 9 శాతం లాభపడగా, ఫలితాలపై అంచనాలను రిలయన్స్ షేరు నష్టపోయింది. .ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు,కోట్ మహీంద్ర, హెచ్‌యూఎల్‌తదితరాలు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్‌ఫిన్ సర్వ్, దివీస్ , అదానీ పోర్ట్స్, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రరూపాయి 82. 67 వద్ద ముగిసింది. -
వరుసగా ఆరో రోజు పరుగు: లాభాల కళ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీలాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగిసి 59506 వద్ద కొనసాగుతుండగా,నిఫ్టీ 82 పాయింట్లు లాభంతో17645వద్ద ట్రేడ్ అవుతోంది. ఫలితంగా వరుసగా ఆరో రోజు శుక్రవారం కూడా లాభాల పరంపర కొసాగుతోంది. గ్లోబల్ అమ్మకాలు వెల్లువెత్తుతున్నన్పటికీ దేశీయ సూచీలు లాభాల దౌడు దీస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఆదాయ ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. యాక్సిస్ బ్యాంకు, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, తదితర షేర్లు భారీగా లాభపడుతుండగా, దివీస్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టెక్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలోరూపాయి స్వల్పనష్టంతో 82.81 వద్ద ఉంది. మరోవైపు బ్రిటీష్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ ఆరు వారాల పదవికి రాజీనామాతో కరెన్సీ మార్కెట్లో యూకే స్టెర్లింగ్ పతనాన్ని నమోదు చేసింది. -
ఆరంభ నష్టాలకు చెక్: మద్దతు స్థాయిలను అధిగమించిన సూచీలు
సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో, పటిష్ట స్థాయిలకు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్ 96 పాయింట్లు ఎగిసి 59202 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 17563 వద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనుంచి తెప్పరిల్లాయి. యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడ్డాయి. మరో వైపు ఇండస్ ఇండ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, హెడ్సీఎఫ్సీ బ్యాంకు నష్టపోయాయి. అటు డాలరు మారకంలో గురువారం ఉదయం రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి భారీగా పుంజుకుంది. 31 పైసలు ఎగిసి 82.76 స్థాయికి చేరింది. -
లాభాలకు చెక్, రూపాయి రికార్డు పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నాలుగు రోజుల లాభాలకు చెక్ పెట్టింది. ఆరంభంలోనే 230 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్ 59 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 17500 మార్క్‌ను కోల్పోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడు కొనసాగిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్ల నష్టంతో 58989 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పతనమై 17479 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల నష్టపోతున్నాయి. ఇండస్ ఇండ్, టైటన్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, బజాజ ఫైనాన్స్నష్టపోతుండగా, నెస్లే, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి. మరో ఆల్‌టైం కనిష్టానికి రూపాయి మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. బుధవారం డాలరు మారకంలో 83 స్థాయికి దిగజారిన కరెన్సీ గురువారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 17 పైసలు నష్టంతో 83.16 వద్ద ఉంది. -
మూడో రోజూ లాభాల జోరు, 59 వేల పైకి సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. అయితే ఇంట్రా డేలో భారీ లాభాలతో మురిపించిన మార్కెట్లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కనిపించింది. అయినప్పటికీ సెన్సెక్స్ 59వేల ఎగువన ముగిసింది. నిఫ్టీ 17500 మార్క్‌ను అధిగమించింది. వరుసగా మూడో సెషన్లోనూ లాభపడిన సెన్సెక్స్ చివరికి 147 పాయింట్ల లాభంతో 59107 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద స్థిరపడ్డాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలు, తగ్గుతున్న ముడి ధరలు విదేశీ పెట్టుబడుదారుల మద్దతు ఇన్వెస్టర్లసెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఎఫ్ఎంసిజి, రియాల్టీ , బ్యాంక్ షేర్లు లాభాల్లో, ఫార్మా మెటల్ నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ , నెస్లే, ఐటీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు పవర్ గ్రిడ్, సిప్లా, లార్సెన్ బజాజ్ ఆటో లా భపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ కోల్ ఇండియా నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి మరోసారి ఢమాల్ అంది. ఏకంగా 80 పైసల నస్టంతో 83.02ని తాకింది. -
బుల్ రయ్..రయ్.. బ్యాంకింగ్, రియల్టీ జూమ్
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 311 పాయింట్లకు పైగా పెరిగి 59,272 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 17,573 వద్ద ట్రేడ్ అవుతోంది.మిశ్రమ ప్రపంచ సంకేతాలు, తగ్గుతున్న ముడి ధరలు విదేశీ పెట్టుబడుదారుల మద్దతు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు మళ్లిస్తోంది. ఎఫ్ఎంసిజి, రియల్టీ , బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా, ఫార్మా మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ , పవర్ గ్రిడ్, సిప్లా, లార్సెన్ బజాజ్ ఆటో లాబాల్లు ఉండగా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 82.33 వద్ద ఫ్లాట్‌గా ఉంది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు, రిలయన్స్, ఐటీసీ దన్ను
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారంలో రెండో రోజుకూడా లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల దూకుడును ప్రదర్శించిన సూచీలు రోజంతా లాభాలతో సందడి చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది. చివరికి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడి 58960 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు ఎగిసి 17486 వద్ద స్థిరపడ్డాయి. బలమైన అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లు సానుకూలంగా కొనసాగాయి. బ్యాంకింగ్,ఆటో, ఐటీ, ఎఫ్ఎంసిజి ఇలా అన్ని రంగాల షేర్లు లాభానార్జించాయి. ప్రధానంగా రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, నెస్లే ఎ స్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్ర, బ్రిటానియా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో మారకంలో రూపాయి 82.36 వద్ద ముగిసింది. -
బుల్ దౌడు: 59 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు ఎగిసి 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు ఎగిసి 17480 వద్ద కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది. హిందాల్కో, భారతి ఎయిర్టెల్, ఎంఅండ్ ఎం, లార్సెన్ భారీగా లాభపడుతుండగా కోల్ ఇండియా, ఎన్టీపీసీ మాత్రమే నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 24 పైసలు లాభపడి 82.15 వద్ద ఉంది. బ్రిటన్ ఆర్థిక విధానంలో యూటర్న్‌తో సెంటిమెంట్ మెరుగుపడింది. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బలపడి రిలీఫ్ ర్యాలీ ఊపందుకుంది. ఫలితంగా మంగళవారం ఆసియా స్టాక్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే డాలర్లో వారం కనిష్టానికి చేరింది. -
భారీ లాభాలు: 58 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో నష్టాలతో నిరాశపర్చినా వెంటనే తేరుకుని లాభాల్లోకి మళ్లాయి. ఇక అక్కడనుంచి వెనుతిరిగి చూసింది లేదు. చివరికి సెన్సెక్స్ 491 పాయింట్లు ఎగిసి 58410 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 17311 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ తిరిగి 58 వేల స్థాయిని, నిఫ్టీ 17300 మార్క్‌ను నిలబెట్టుకోవడం విశేషం. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలున్నప్పటికీ, కార్పొరేట్ కంపెనీ ఫలితాలపై ఇన్వెస్టర్ల కన్ను, కొనుగోళ్లకు దారి తీసింది. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సి, ఇండస్ ఇండ్, బజాజ్ ఆటో, మారుతి, రిలయన్స్, కోటక్ మహీంద్ర, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాభపడ్డాయి. హిందాల్కో, లార్సెన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,హెచ్‌సీఎల్ టెక్, విప్రో నష్టపోయాయి. -
అనూహ్యం: నష్టాల్లోంచి లాభాల్లోకి జంప్ చేసిన స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల ప్రభావంతో సూచీలు గ్యాప్ డౌన్ తో ఓపెనయ్యాయి. సెన్సెక్స్ 121 పాయింట్లు కోల్పోయి 57798 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17146 వద్ద కొనసాగాయి. కానీ మొదటి గంట తరువాత సూచీలు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 205 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి ట్రేడ్ అవుతోంది. బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, హీరో మోటో కార్ప్, లాభపడు తుండగా, ఎం అండ్ ఎండ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 82.38 వద్ద ఉంది. -
ఇన్ఫోసిస్ దన్ను: వారంతంలో లాభాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. చివరికి వారాంతంలోసెన్సెక్స్ 685 పాయింట్లు ఎగిసి 57919 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు లాభంతో 17186 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ తదితరాలు లాభపడగా, ఓఎన్జీజీసీ, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.35 వద్ద ముగిసింది. -
ఐటీ షేర్ల ర్యాలీ: తగ్గేదేలే దలాల్ స్ట్రీట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం దలాల్ స్ట్రీట్ లాభాల పరుగందుకుంది. బలమైన అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల సడలింపుతో దేశీ సూచీలు తగ్గేదేలే అన్నట్టున్నాయి. నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసి 17,300 స్థాయిని తాకింది. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా ఎగబాకి 58,267 ఎగువకు చేరింది. వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ సూచీలుతోపాటు అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఐటీ మేజర్ ఇన్ఫీ 11 శాతం వృద్ధితో 6,021 కోట్ల రూపాయల నికర లాభాల ఫలితాల జోష్‌తో కంపెనీషేర్లు 3 శాతానికి పైగాఎగిసాయి. ఇంకా హెచ్‌సీఎల్, టెక్ ఎం, లార్సెన్, యూపీల్ కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. ఒక్క సన్ ఫార్మ మాత్రమే నష్టపోతోంది. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 82.33 వద్ద ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకులు, రియాల్టీ, ఐటీ షేర్ల నష్టాలు ప్రభావితంచేశాయి. చివరికి సెన్సెక్స్ 391 పాయింట్లు కుప్పకూలి 57235 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 17014 వద్ద క్లోజ్ అయ్యాయి. అయితే సెన్సెక్స్ 57200 మార్క్‌ను, నిఫ్టీ 17వేల మార్క్‌ను నిలబెట్టుకున్నాయి. ఫలితాల షాక్‌తో విప్రో షేరు ఏకంగా 6శాతం నష్టపోయింది. అలాగే ఎస్బీఐ, ఐసీఐసీఐ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్ టీ భారీగా నష్టపోయాయి. అయితే ఫలితాలు, డివిడెండ్ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ 4 శాతం ఎగిసింది. ఇంకా సన్ ఫార్మ, కోల్ ఇండియా, బ్రిటానియా, గ్రాసిం బాగా లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్పల్ప లాభంతో 82.35 వద్ద ముగిసింది. -
ఇన్‌ప్లేషన్ సెగ: నష్టాల్లో మార్కెట్, ఇన్ఫీ ఫలితాలపై దృష్టి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 121 పాయింట్లు నష్టపోయి 57505 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు నష్టంతో 17095 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా ఉన్నాయి. సెప్టెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో బరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరింత వడ్డీరేట్ల పెంపు ఆందోళన నెలకొంది. అటు ఆహార ధరలు పెరగడంతో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.41 శాతానికి పెరిగింది.మరోవైపు ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెప్పి లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే 250 పాయింట్లకుపైగా ఎగిసిన సూచీలు మధ్యలో కాస్త తడబడినా చివరికి భారీ లాభాల్లో స్థిరపడ్డాయి.సెన్సెక్స్ 479 పాయింట్ల లాభంతో 57625 వద్ద,నిఫ్టీ 140 పాయింట్లు ఎగిసి 171223 వద్ద క్లోజ్ అయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 57,600కి ఎగువన, నిఫ్టీ 17వేల 100 ఎగువన స్థిరంగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడాయి. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఆసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్, భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా కోలుకుంది. 82. 31 వద్ద మునుపటి ముగింపు 81.32తో పోలిస్తే ఫ్లాట్‌గా ముగిసింది. -
ఐటీ జోరు, లాభాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెప్పి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే మార్కెట్లు 250 పాయింట్లకు పైగా ఎగిసాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 57292 వద్ద,నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి 17022 వద్ద టట్రేడ్ అవుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 57, 200కి ఎగువన, నిఫ్టీ 17వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఇతర ఐటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పవర్ గ్రిడ్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, డా. రెడ్డీస్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా కోలుకుంది. 14 పైసలు ఎగిసి 82. 20 వద్ద ఉంది. -
ఒక్క రోజులో రూ. 1.2 లక్షల కోట్లు హాంఫట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి భారీగా కోలుకున్నాయి. 700 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్ చివర్లో 200 పాయింట్ల నష్టాలకు పరిమితమై 57991 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 17241వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్ లాభపడగా, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, ఐటీసీ నష్టపోయాయి. ఇంట్రాడేలో 826 పాయింట్లు పడిపోయి 57,365.68 వద్ద కనిష్టానికి చేరుకుంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్టోబర్ 7న రూ. 275.6 లక్షల కోట్ల నుండి రూ. 274.4 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్క రోజులో దాదాపు రూ. 1.2 లక్షల కోట్లను పెట్టుబడిదారులు నష్ట పోయారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనల నడుమ వరుసగా రెండో సెషన్లో బలహీనంగా ముగిసింది. అటు డాలరు మారకంలో రూపాయి 82.32 వద్ద ఉంది. -
కుప్పకూలిన మార్కెట్, రూపాయి మరోసారి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి అత్యంత కనిష్టానికి పడిపోయింది. డాలరు మారకంలో రూపాయి సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 38 పైసలు కోల్పోయి 82.68 వద్ద ఆల్ టైం కనిష్టాన్ని తాకింది. రూపాయి వరుసగా రెండో సెషన్లో కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి 82 మార్కును తాకింది. శుక్రవారం ముగింపు 82.33తో పోలిస్తే, రెండో వరుస సెషన్లో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పతనమైంది. అటు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ బెంచ్‌మార్క్‌లు బీఎస్ఈ , ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 సోమవారం 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు క్షీణించి 57,409 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 239 పాయింట్లు దిగజారి 17,074 వద్ద నిలిచింది.దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోల్ ఇండయా టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ , మారుతీ సుజుకీ ఇండియా, టైటాన్ లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. -
ఫ్లాట్ ముగింపు, రూపాయి రికార్డ్ కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పెట్టాయి. ఆరంభ లాభాలను కోల్పోయి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి. అయితే సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 58014 స్థాయిని తాకింది. చివర్లో బాగా పుంజుకుని సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 58191 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 17314 వద్ద స్థిరపడ్డాయి. టాటా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎంఅండ్ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టైటన్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. ఏకంగా 54 పైసల నష్టంతో 82.32 ఆల్ టైం కనిష్టం వద్ద ముగిసింది. గత సెషన్లో 81.88 వద్ద క్లోజ్ అయింది. -
మెటల్, రియల్టీ షైన్ : లాభాల ముగింపు
సాక్షి, ముంబై: ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. వీక్లీ ఎఫ్ & ఓ గడువు ముగింపు, మిశ్రమ ప్రపంచ సంకేతాలు, బలమైన విదేశీ ప్రవాహాల మధ్య బిఎస్ఇ సెన్సెక్స్ 157 పాయింట్లు ఎగిసి 58222వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు లాభంతో 17331 వద్ద స్థిరపడ్డాయి. ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్,యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సీ, హెచ్‌యుఎల్, టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45 పైసలు కోల్పోయి 81.88 వద్ద ముగిసింది. -
దలాల్ స్ట్రీట్‌లో వరుసగా ఆరవ రోజూ నష్టాలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి ఏ మాత్రం కోలుకోని సూచీలు చివరికి భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 509 పాయింట్లు పతనమై 56598 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 16858 వద్ద ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో వరుసగా ఆరవ రోజు కొనసాగిన నష్టాలతో ట్రేడర్ల వేల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగి పోతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యుస్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, రిలయన్స్ భారీగా నష్ట పోయాయి. ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డా. రెడ్డీస్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 44 పైసలు క్షీణించి 81.94 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. -
10 మల్టీ బేగర్స్.. ఏకంగా 6700 శాతం రిటర్న్స్
దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడులుపెట్టి లాభాలనుఆర్జించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కంపెనీ వ్యూహాలు, వృద్ది, భవిష్యత్తు ప్రణాళికలు, ఫండ మెండల్స్, తాజా మార్కెట్ ట్రెండ్ లాంటి విషయాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అలా అన్ని మెళకువలను ఒంట పట్టించుకొని కోట్లు గడించాడు 29 ఏళ్ల మద్రాస్ ఐఐటీ పోస్ట్ గ్రాడ్యుయేట్. తాజాగా ముంబైకి చెందిన నిఖిల్ గంగిల్ (29) ఐఐటీ మద్రాస్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. గత ఐదేళ్లలో కనీసం 10 మల్టీ బ్యాగర్లను గుర్తించి భారీ లాభాలను గడించాడు. తనదైన పరిశీలన, నైపుణ్యంతో ఆకర్షణీయమైన లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బిజినెస్ టుడేతో జరిగిన ఇంటరాక్షన్‌లో యువ పెట్టుబడిదారుడు తన సక్సెస్జర్నీని పంచు కున్నాడు. స్టాక్ పికింగ్ అనేది ఒక చక్కటి కళ, అయితే సహనం పోర్ట్‌ఫోలియోను ఎంచుకుంటే ఫ్యూచర్ అద్భుతంగా మారిపోతుంది అంటాడు. సవాకా బిజినెస్ మెషీన్స్ వంటి స్టాక్‌లు తనకు 68 రెట్లు లేదా 6,700 శాతం రాబడిని అందించాయని చెప్పారు. అలాగే మేఘమణి ఫినెకెమ్ (15 రెట్లు), టాటా పవర్ (6.5 రెట్లు), టాటా మోటార్స్ (6.5 రెట్లు), GNA యాక్సిస్ (5.8 రెట్లు), రామ్‌కో సిస్టమ్ (5 సార్లు), నవ (4.7 రెట్లు), మారథాన్ నెక్స్ట్‌జెన్ రియాల్టీ (4.7 రెట్లు), తేజస్ నెట్వర్క్స్ (4.5 రెట్లు) ఫీమ్ ఇండస్ట్రీస్ 4 రెట్ల లాభాలను తెచ్చిపెట్టాయి. కొన్నేళ్ల ప్రయత్నాలు, వైఫల్యాల తరువాతపెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేసుకుని భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికీ ఈ షేర్లలో కొన్నింటిని హోల్డ్ చేస్తున్నాడు. పెట్టుబడి వ్యూహంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమాలు చూడటం, ప్రయాణాలు, పాడటం కూడా ఇష్టపడే తాను తక్కువపెట్టుబడితో అద్భుతమైన లాభాలనిచ్చి బిజినెస్‌ను ఇష్టపడతాడట. ప్రతి బిజినెస్‌కు అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ సరియైన ధరకోసం వేచి ఉంటానని చెప్పాడు. మూలధనంపై రాబడి (రిటన్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్) అనే సొంత ర్యాంకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. తాను ఎంపిక చేసిన స్టాక్స్ టాప్ 3లో ఉన్నాయంటూ సంతోషాన్ని ప్రకటించాడు. ఐఐటీ మద్రాస్‌లో ఎం-టెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నిఖిల్ పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడే గాంగిల్ ఇటీవల వారెన్ బఫెట్ లాగా పెట్టుబడికి 7 రహస్యాలు పుస్తకం చదివానని చెప్పాడు. ఇంకా ది లిటిల్ బుక్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ (క్రిస్టోఫర్ హెచ్ బ్రౌన్) మాస్టరింగ్ ది మార్కెట్ సైకిల్ (హోవార్డ్ మార్క్స్) ది లిటిల్ బుక్ దట్ బీట్స్ ది మార్కెట్- (జోయెల్ గ్రీన్బ్లాట్) బుక్స్కూడా తనకు ఉపయోగపడ్డాయని చెప్పాడు గాంగిలి విజయ రహస్యాలు, ఇన్వెస్టర్లకు సందేశాలు ♦ మొదటి రోజు నుండీ వాల్యూ ఇన్వెస్టర్‌గా ఉండాలి. ♦ మొదటి నుంచి దూర దృష్టి ఉండాలి. ♦ లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్ లక్క్ష్యంతో పెట్టుబడులుపెట్టాలి. ♦ కనీసం 5-8 సంవత్సరాలు ఎదురుచూస్తే ఓపిక ఉండాలి. ♦ వాల్యూ ఇన్వెస్టర్‌గా వృద్ధిని తక్కువ అంచనా వేయకూడదు ♦ గ్రోత్ ఇన్వెస్టర్‌గా వాల్యూని తక్కువ అంచనా వేయకూడదు. ♦ వీలైనన్ని బిజినెస్ పుస్తకాలు, విశ్లేషణలు చదవాలి ♦ ప్రతీ షేరును విశ్లేషించి.. కరెక్ట్ ధర కోసం వేచి చూడాలి ♦ వాల్యుయేషన్ , సైకిల్ ఆధారంగా ఒక స్టాక్‌ను అండర్వాల్యూడ్ , ఓవర్‌వాల్యూడ్ అనేది నిర్వచించుకుంటా. ♦ దాన్నే నేను కనిష్ట అంతర్గత విలువ , గరిష్ట అంతర్గత విలువ. ♦ స్టాక్ ‘మిన్ ఇంట్రిన్సిక్ వాల్యూ’కి వచ్చినప్పుడు కొంటాను , అది ‘మాక్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ’ని టచ్ చేసినపుడు అమ్మేస్తా -
మరింత కుదేలవుతున్న మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బుధవారం నష్టాలతో ప్రారంభమైనాయి. వరుసగా ఏడో రోజు నష్టపోతున్న సెన్సెక్స్ 287 పాయింట్లు కుప్పకూలి 56821 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 16918 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండు మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. సెన్సెక్స్ 57వేల స్థాయిని, నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయి మరింత బలహీన సంకేతాలిచ్చాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఓఎన్టీజీ, ఎన్టీపీసీ హెచ్డీఎఫ్సీ నష్టపోతుండగా, సన్‌ఫార్మ, పవర్‌గగ్రిడ్, ఎం అండ్ ఎండ, డా.రెడ్డీస్, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద సరికొత్త ఆల్ టైం కనిష్టానికి పతనమైంది. -
వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలే
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులమధ్య కొనసాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి.వరుసగా ఐదో రోజు నష్టాలనెదుర్కొన్నాయి. నవంబర్ 2020 నుండి కనిష్ట స్థాయికి కోలుకుని, సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసాయి.చివరికి సెన్సెక్స్ ఇండెక్స్ 38 పాయింట్ల నష్టంతో 57,108 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 9 పాయింట్లు నష్టంతో 17,007వద్ద ముగిసింది. టాటా స్టీల్, టైటాన్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సిఎల్ టెక్,నెస్లే ఇండియా లాభపడ్డాయి. -
దలాల్ స్ట్రీట్ దంగల్: అదానీ, అంబానీ టాప్ ర్యాంకులు పాయే!
సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో సోమవారం నాటి అమ్మకాలసెగ భారత కుబేరులను భారీ షాక్ ఇచ్చింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా టాప్-10 నుండి నిష్క్రమించారు గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. దలాల్ స్ట్రీట్ లో సోమవారం నాటి భారీ నష్టాలతో బిలియనీర్ అదానీ ఇప్పుడు టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంటే వెనుక బడి ఉన్నారు. గౌతమ్ అదానీ కంపెనీల షేర్ల క్షీణత కారణంగా అదానీ నికర విలువ 6.91 బిలియన్ డాలర్లు తగ్గి 135 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఆర్ఐఎల్ చీఫ్ నికర విలువ 82.4 బిలియన్ డాలర్లకు తగ్గడంతో 11వ స్థానానికి పడిపోయారు. ఈ నెల ప్రారంభంలో, బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు, తొలి భారతీయుడు, తొలి ఆసియన్‌గా నిలిచారుఅదానీ. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం గౌతమ్ అదానీ దేశంలో టాప్ ట్రిలియనీర్‌గా నిలిచారు. ప్రకారం లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడు గౌతమ్ అదానీ. పదేళ్లపాటు అత్యంత సంపన్న భారతీయ ట్యాగ్‌ను పట్టుకున్న అంబానీ ఈ ఏడాది రూ.7.94 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. -
ఓలటైల్ సెషన్: లాభాల్లోనే సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలనను కోల్పోయాయి. తీవ్ర ఓలటాలిటీ మధ్యసెన్సెక్స్ 145 పాయింట్లు ఎగిసి 57291 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 17048 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఇండస్ ఇండ్, డా.రెడ్డీస్ లాభపడుతుండగా, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, టైటన్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు కుప్పకూలి 81.38 వద్ద కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయిన సంగతి తెలిసిందే. -
గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్‌మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్‌మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 57,981కి పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్‌గా సెన్సెక్స్ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్ అయితే అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఫెడ్ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనం,ఎఫ్ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్‌లుక్‌ను బేరిష్‌గా మార్చాయి. దీనికి తోడుఫెడ్‌బాటలోనే ఆర్బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
బ్లాక్ ఫ్రైడే: పాతాళానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. కీలక సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే కుదేలయ్యాయి. రోజంతా అదే ధోరణి కొనసాగింది. చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ బ్యాంకింగ్, ఐటీ, ఆటో సహా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. మూడవ సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 1020 పాయింట్లు కుప్పకూలి 58098 వద్ద ముగిసింది. తద్వారా 58,500 స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ 302 పాయింట్లు పతనమై 17327వద్ద స్థిరపడింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, యాక్సిస్, ఇండస్ ఇండ్ తదితర బ్యాంకింగ్ షేర్లతోపాటుపవర్‌గ్రిడ్, హిందాల్కో, అపోలో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ నష్టపోయాయి. మరోవైపు దివీస్ లాబ్స్, సన్‌ఫార్మా, సిప్లా, ఐటీసీ, టాటా స్టీల్ లాభపడ్డాయి. అటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 81.04 వద్ద ముగిసింది. -
బ్లాక్ ఫ్రైడే: మార్కెట్లు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో బాగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో మరింత కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1116 పాయింట్లు కుప్ప కూలింది. నిఫ్టీ 329 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువెత్తాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్ 59000 దిగువకు పడిపోయింది. టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్తాన్ హెచ్‌సీఎల్ టెక్, టైటన్, మారుతీ సుజుకీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్ బోర్డు తన గ్రూప్ కామ్‌లోని ఏడుకంపెనీల విలీన పథకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. -
నష్టాల ముగింపు: ఐటీ, బ్యాంకింగ్ షేర్లు డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభంలో బాగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో ఒక దశలో 59 వేల స్తాయిని కోల్పోయింది.తిరిగి అదే రేంజ్లో పుంజుకుంది. చివరికి సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించి 59119 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో 17629 వద్ద ముగిసింది. గురువారం ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు కావడంతో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొన్నాయి.ఐటీ, బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఇన్ఫోసిస్ షేర్లు ఏడు సెషన్లలో ఆరు సెషన్లకు పడిపోయి 16 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ,కోల్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ భారీగా నష్టపోయాయి. టైటన్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఐఫర్ మోటార్స్, బ్రిటానియా లాభపడ్డాయి. రుపీ ఢమాల్ అటు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 91 పైసలు కుప్పకూలి 80.70 చేరింది. ఆ తరువాత మరింత క్షీణించి ఏకంగా 99 పైసలు పతనమై 80.95 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. -
ఫెడ్ వడ్డీ పెంపు: నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు.సెన్సెక్స్ 168 పాయింట్లు క్షీణించి 59288 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 17666 వద్ద కొనసాగుతోంది. దాదాపుఅన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, బ్రిటానియా,మారుతి సుజుకి లాభాల్లో ఉన్నాయి. ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, ఓఎన్జీసీ నష్టాల్లో ఉన్నాయి.మరో వైపు డాలరుమారకంలో రూపాయి భారీగా నష్టపోతోంది.ఏకంగా 60 పాయింట్లు పతనమై 80.45 వద్ద రికార్డ్ లోను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్‌పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ భయాలు: చివరికి నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి.గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఫెడ్ రేటు పెంపు భయాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో చాలా బాగా పుంజుకున్నాయి.కానీ చివర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో కీలక మద్దతుస్థాయిలకు దిగువకు చేరాయి.సెన్సెక్స్ 263 పాయింట్లుకుప్పకూలి 59456 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 17718 వద్ద ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ 59, 500 స్థాయిని, నిఫ్టీ 17800 స్థాయిని కోల్పోయాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు ఒత్తడి మధ్య కొనసాగాయి. బ్రిటానియా, హెచ్‌యూఎల్, అపోలో హాస్పిటల్స్,కోల్ ఇండియా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ,సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్విన్నర్స్గా నిలవగా, శ్రీ సిమెంట్స్, అదానీపోర్ట్స్, ఇండస్ఇండ్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 28పైసలు కుప్పకూలి 79.97వద్ద 80 మార్క్‌కు చేరువలో ఉంది. -
ఫెడ్‌పై కన్ను: భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ మీట్ ఫలితాలకు ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత నేపథ్యంలో బుధవారం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 401 పాయింట్లు క్షీణించి 59318 వద్ద, నిప్టీ 135 పాయింట్లు పతనమై 17681 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లుఅమ్మకాల ఒత్తిడిలోఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించి 41339 స్థాయిలకు చేరుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ టాప్ ఇండెక్స్ డ్రాగర్స్‌గా ఉన్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్ లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ఉంది. 22పైసల నష్టంతో 79.92 వద్ద ఉంది. ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నేతృత్వంలోని పాలసీ మీట్ ఈ రోజుతో ముగియనుంది. 75 బీపీఎస్ వడ్డీ రేటు పెంపును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. 100 బీపీఎస్ పాయింట్లు పెంచవచ్చని కూడా చాలా మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
ఆరంభ లాభాలు పోయినా..స్ట్రాంగ్‌గా సూచీలు
సాక్షి, ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినా చివరికి లాభాల్లోనే ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగిసి 60 వేల మార్క్ స్థాయికి చేరింది. అలాగే 206 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 17850స్థాయికి పైన కదలాడింది. కానీ ఆఖరి గంటలో లాభాల స్వీకరణతో చాలావరకు లాభాలను వదులుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభంతో 59719 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లుఎగిసి 17816 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగ షేర్లు లాభాలు మార్కెట్లకు భారీ ఊతమిచ్చాయి. అపోలో హాస్పిటల్స్, సిప్లా, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్, టైటన్, ఏసియన్పెయింట్స్, టీవీఎస్ మోటార్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా ఎగిసాయి. అయితే హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్, ఇన్ఫోసిస్ చివర్లో నష్టపోయాయి. ఇది మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు నెస్లే, శ్రీసిమెంట్స్, గ్రాసింగ్, పవర్‌గ్రిడ్, నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 79.75 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్, అన్ని రంగాల్లోనూ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ195 పాయింట్లు లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడుతుండగా, గ్రాసిం మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి. -
బ్లాక్ ఫ్రైడే, మార్కెట్లో బ్లడ్ బాత్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీసెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. వారాంతంలో దాదాపు రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1098 పాయింట్లు కుప్పకూలి 58840వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు పతనంతో 17530 వద్ద ముగిసాయి. వరుసగా మూడో సెషన్లో వచ్చిన నష్టాలతో సెన్సెక్స్ చివరికి 59వేల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు డాలరు మారకంలో రూపాయి 5 పైసల నష్టంతో 79.74 వద్ద ముగిసింది. -
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వ్యాఖ్యలు: నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో 500 పాయింట్లు కుప్పకూలింది. సెన్సెక్స్ 324 పాయింట్లు కోల్పోయి 59609 వద్ద,నిఫ్టీ 91 పాయింట్లు బలహీనపడి 27786 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ , అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికల తర్వాత ప్రపంచ మాంద్యం ఆందోళనల మధ్య పెట్టుబడి దారుల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆటో షేర్లు లాభపడుతున్నాయి. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్,ఎఎన్టీపీసీ లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్ర, విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్ డౌన్‌బీట్‌గా ఉందని, కొన్నిదేశాలు 2023లో మాంద్యంలోకి జారిపోతాయనే ఆందోళన ఇన్వెస్టర్లను భయపెడుతోంది.అయితే విస్తృతమైన ప్రపంచ మాంద్యం ఉంటుందా అనేది ఇపుడే అంచనా వేయలేదని ఐఎంఎఫ్ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్ల పెంపుతో 2023లో ప్రపంచం ప్రపంచ మాంద్యం వైపు దూసుకు పోవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా, యూరో జోన్ ప్రభావితం కావవచ్చని తెలిపింది. -
కీలక మద్దతుస్థాయిలు పాయే..బలహీనంగా ముగిసిన మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీనంగా ఉన్నప్పటికీ ఉదయం పటిష్టంగా ఉన్న మార్కెట్లు గురువారం కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ డే హైనుంచి ఏకంగా 600పాయింట్లకు పైగా కుప్పకూలింది. ఫలితంగా 60వేల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ కూడా 18వేలస్థాయి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు కుప్పకూలి 59934 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు క్షీణించి 17877 వద్ద ముగిసాయి. మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ లాభపడగా, హిందాల్కో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, సిప్లా, హీరో మోటాకార్ప్ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయల 31పైసలు నష్టంతో 79.69 వద్ద ఉంది. -
తగ్గేదెలే.. భారీ లాభాలు, నిఫ్టీ బ్యాంకు రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగిసి 60655 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 18083 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.(వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ) ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ భారీగా లాభపడుతున్నాయి. అటు హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా నష్టపోతున్నాయి. -
ఆరంభంలో 2.21 లక్షల కోట్లు హుష్ కాకి, కానీ చివర్లో
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి కోలుకున్నా చివరకు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభం నష్టాల నుంచి కోలుకున్నాయి. అలాగే మిడ్ సెషన్ తరువాత లాభాల్లోకి మళ్లాయి సూచీలు. కానీ చివరి గంటలోతిరిగి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 60,347 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు లేదా 0.4 శాతం నష్టంతో 18004 వద్ద స్థిరపడ్డాయి. ఫైనాన్షియల్స్, మెటల్‌లాభపడగా, ఐటీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. గ్లోబల్ మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేసినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలకు పైన నిలబడటం విశేషం. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 37 పైసలు క్షీణించి 79.44 వద్ద ముగిసింది. కాగా, అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ ట్రెండ్, ఫెడ్ భారీగా వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల మధ్య మార్కెట్లో బుధవారం నాటి ఆరంభ ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల సంపద రూ. 2.21 లక్షల కోట్లకు పైగా తుడుచుపెట్టుకు పోయింది. అయితే ఈ నష్టాలనుంచి కోలుకోవడంతో కాస్త ఇన్వెస్టర్లు కాస్త ఊరట చెందారు. -
ఐటీ షాక్, నష్టాల్లో మార్కెట్లు, అయినా పటిష్టంగానే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం నుంచీ అమ్మకాలఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు అదే ధోరణిలో ఉన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 202 పాయింట్లు కుప్పకూలి 6068 వద్ద,నిఫ్టీ 56పాయింట్లు బలహీన పడి 18013 వద్ద కొనసాగుతున్నాయి. ఒక దశలో 700 పాయింట్లు పతనమై 60 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 50 1.13 శాతం క్షీణించి 17865 వద్దకు చేరుకుంది. బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాభపడుతుండగా, ఇన్ఫోసీస్, టెక్ ఎం, టీసీఎస్ , హెచ్‌సీఎల్, టెక్, విప్రో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. -
మార్కెట్ ర్యాలీ, ఏప్రిల్ తరువాత తొలిసారి ఇలా..!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి.మంగళవారం భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం అర శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఆరంభంనుంచి జోరుగా ఉన్న కీలక సూచీలు ఆద్యంతమూ అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. నిప్టీ18వేలకు ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 456 పాయింట్లు ఎగిసి 60571 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 18070వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత తొలిసారిగా నిఫ్టీ 18000ని రీక్లెయిమ్ చేసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి,మెటల్, బ్యాంక్ షేర్లు బాగా లాభపడ్డాయి. అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి. శ్రీసిమెంట్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, టీసీఎస్ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 47పైసలు ఎగిసి 79.15 వద్ద ముగిసింది. సోమవారం 79.52 వద్ద క్లోజ్‌అయిన సంగతి విదితమే. -
ఐటీ జోరు, బుల్ దౌడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంలోనే కీలకమైన 60వేల మార్క్‌ను మరోసారి అధిగమించిన సెన్సెక్స్ అదే ధోరణిని కొనసాగించి దాదాపు 400 పాయింట్లకుపైగా ఎగిసింది. అయితే మిడ్‌సెషన్ తరువాత లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గినా కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. ఐటీ, రియాల్టీ షేర్ల లాభాలు మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ 323 పాయింట్లుఎగిసి 60115 వద్ద,నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17936 వద్ద స్థిరపడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, టెక్ మహీంద్ర, దివీస్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచసీఎల్ టెక్, ఎం అండ్ ఎం, విప్రో, టీసీఎస్‌డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా, శ్రీ సిమెట్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్ట పోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 79.52 వద్ద ఉంది. -
భారీ లాభాలు: సెన్సెక్స్ 60వేల ఎగువకు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పటిష్టంగా ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండూ పాజిటివ్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 215 పాయింట్లుఎగిసి 60009 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభంతో 178910 వద్ద ట్రేడ్ అవుతోంది.తద్వారా సెన్సెక్స్ 60 వేల ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ 18వేలకు అతి చేరువలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఐటీ లాభ పడుతుండగా, బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోతోంది. ముఖ్యంగా రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ , టాప్ ఇండెక్స్ గెయినర్స్‌గా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. -
వారాంతంలో లాభాలతో పటిష్ట ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్ల లాభాలు వారంతంలో కీలక సూచీలు పటిష్టంగా ముగిసేందుకు తోడ్పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 104 పాయింట్లు ఎగిసి 59793 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 17883 వద్ద పటిష్టంగా ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 60వేల మార్క్‌ను టచ్ చేసింది. అయితే రియల్టీ, పవర్ రంగ షేర్ల నష్టాలు బలహీపనర్చాయి. టెక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, ఇండస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాభ పడగా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టైటన్ ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 16 పాయింట్లు ఎగిసి 79.58 వద్ద ముగిసింది. -
60వేల మార్క్‌ను టచ్ చేసిన సెన్సెక్స్
సాక్షి,ముంబై: సానుకూల ప్రపంచ సూచనల మధ్య శుక్రవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.మిడ్‌సెషన్‌తరువాత లాభాల నుంచి కాస్త వెనక్కి తగ్గినప్పటికీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 60వేల మార్క్‌ను టచ్ చేసింది. ప్రస్తుం సెన్సెక్స్154, నిఫ్టీ, 47పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, ఇండస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాభ పడుతున్నాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టైటన్ ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పాయింట్లు ఎగిసి 79.50 వద్ద ఉంది. -
రోజంతా ఫుల్ జోష్, బ్యాంకులు, ఐటీ షైన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచీ పాజిటివ్‌గా ఉన్న సూచీలు రోజంతా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సెక్స్ 659 పాయింట్లు జంప్ చేసి 59688 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల లాభంతో 17799 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. ఫైనాన్షియల్, ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 59600 ఎగువకు చేరగా, నిఫ్టీ 17800 స్థాయికి చేరువలో ఉంది. శ్రీ సిమెంట్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు హిందాల్కో, టాటాస్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ నష్ట పోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 23 పైసలు ఎగిసి 79.71 వద్ద ఉంది. -
భారీ లాభాలు, సెన్సెక్స్ 480 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెండు రోజుల నష్టాలకుచెక్ చెప్పిన సూచీలు గురువారం ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. అయితే ఆరంభంలో 550 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 488 పాయింట్లు లా భంతో 59510 వద్ద ,నిఫ్టీ 132 పాయంట్ల లాభంతో 17755 వద్ద టట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లుకనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంకు ఎక్కువగా లాభపడుతోంది. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఇండస్ఇండ్, హిందుస్తాన్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, బ్రిటానియా తదితర షేర్లు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 23 పైసలు లాభంతో 79.72 వద్ద ఉంది. -
నష్టాలను కుదించుకుని ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. ఆరంభంలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టాలకు పరిమితమై 59028 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17624వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఐటీ షేర్లు ఎగిసాయి. సిమెంట్ షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామెటార్స్, బజాజ్ ఆటో, హ్‌ఎచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా స్టీల్, టాప్ లూజరర్స్గానూ, శ్రీసిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ పోర్ట్స్, సిప్లా,కోల్ ఇండియా , బ్రిటానియా టాప్ గెయినర్స్‌గానూ నిలిచాయి. -
అమ్మకాల సెగ, భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైన నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 259 పాయింట్లు కుప్పకూలి 58937 వద్ద,నిఫ్టీ 70 పాయింట్టు నష్టపోయి 17585 వద్ద కొనసాగుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ ఇలా దాదాపు అన్ని రంగాలు అమ్మకాలను చూశాయి. అయితే సిమెంట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. శ్రీసిమెంట్స్, ఆషియన్స్‌పెయింట్స్, టాటా, కోల్ ఇండియా లాభపడుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంకు,భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, టెక్‌మహీంద్ర రిలయన్స్, నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి మరింత బలహీన పడింది. 12 పైసల నష్టంతో 79.93వద్ద ఉంది. మంగళవారం 79.84 వద్ద ముగిసింది. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అక్కడక్కడే ముగిసాయి. రోజంతా ఫ్లాట్గాకొనసాగిన కీలక సూచీలు ఫ్లాట్‌గానే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 59,197 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టంతో 17,656 వద్ద స్థిరపడ్డాయి. ఇది చదవండి: బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ఫిన్ సర్వ్, టాటా ప్రొడకక్ట్స్, బ్రిటానియా, యూపీఎల్, కోటక్ మహీంద్ర ఇతర టాప్ లూజర్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, భారతిఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీసిమెంట్స్, టాటాస్టీల్ లాభపడ్డాయి. -
వావ్.. మార్కెట్లో భారీగా పెరుగుతున్న ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి
సాక్షి, ముంబై: దేశంలో స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేయడం విశేషం. కోవిడ్‌కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య 40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం. బుల్లిష్ మార్కెట్ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్లో డీప్ కరెక్షన్ కారణంగా జూన్‌లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు -
రెండో రోజూ లాభాలు, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 98 ఎగిసింది. కానీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెంటనే సెన్సెక్స్ 16 పాయింట్ల లాభానికి పరిమితమై 59279 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17678 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, సిప్లా లాభపడుతున్నాయి. అటు నెస్లే, కోటక్ మహీంద్ర, ఓఎన్జీసీ, ఆసియన్ పెయింట్స్, విప్రో నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం ముగింపు 79.85తో పోలిస్తే 79.83 వద్ద ప్రారంభమైంది. అనంతరం 12 పైసలు పడిపోయి 79.90 స్థాయిని టచ్ చేసింది. -
పేటీఎంకు షాక్: 59వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్ నోట్‌తో ఉన్న కీలకసూచీలు మిడ్‌సెషన్‌లో మరింత ఎగిసాయి. చివరికి సెన్సెక్స్ 442 పాయింట్లు ఎగిసి 59245 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 17665 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి. సెన్సెక్స్ మళ్లీ 59 వేల స్ఠాయిని నిలబెట్టుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మ, రిలయన్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇంకా టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా లాభపడ్డాయి. అటు బజాజ్ఆటో, నెస్లే, బ్రిటానియా,ఐషర మోటార్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 79.84 వద్ద ఉంది. ఇది చదవండి: చైనా లోన్ యాప్స్: పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలకు ఈడీ షాక్! పేటీఎంకు షాక్ మరోవైపు చైనా లోన్‌యాప్స్ కేసులో ఈడీ సోదాల నేపథ్యంలో చెల్లింపుల సంస్థ పేటీఎం భారీగా నష్ట పోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు 6 శాతం కుప్పకూలింది. చైనీస్ నియంత్రణలో ఉన్న కొన్ని ఇన్స్టంట్ యాప్ ఆధారిత లోన్ డిషింగ్ ఎంటిటీలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గతవారం పేటీఎం, రేజర్ పే, క్యాష్‌ఫ్రీ బెంగళూరులోని కార్యాలయాల్లో ఈడీ దాడులు చేసింది. దాదాపు 17 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది ఈడీ. -
రోజంతా ఒడిదుడుకులు: చివరికి ఫ్లాట్‌గా
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి.సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 58803 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 17539 వద్ద స్థిరపడ్డాయి. శుక్రవారం పాజిటివ్‌నోట్‌తో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరికి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి ఇది చదవండి: 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా! రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి లార్జ్ కాప్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్‌టీ, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, హిందాల్కో, హీరో మోటో, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 79.76 వద్ద 26 పైసలు కోల్పోయింది. ఇదీ చదవండి: WhatsApp: దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్ -
లాభాల రింగింగ్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్ టైం హై
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ నష్టాలనుంచి తెప్పరిల్లిన సెన్సెక్స్ 100 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా 17,550 ఎగువకు చేరింది. ప్రస్తుతం 61 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి కొనసాగుతున్నాయి. అన్ని రంగాలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.3,290కి స్థాయిని తాకింది.అలాగే ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం తన గ్రీన్ యూనిట్ కోసం మైనారిటీ వాటా విక్రయానికి బిడ్లను స్వీకరించిన తర్వాత ఎన్టీపీసీ షేర్లు 3 శాతం పెరిగాయి. ఇంకా బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్ లాభాల్లోనూ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 13పైసలు కోల్పోయిన రూపాయి 79.65 వద్ద ఉంది. -
రిలయన్స్ షాక్, భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ప్రపంచ వృద్ధి ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో గురువారంకీలక సూచీలు ఆరంభంలోనే కుప్పకూలాయి. రోజంతా అమ్మకాలు, కొనుగోళ్ళ మధ్య తీవ్ర ఒత్తిడితో ఊగిసలాడాయి. దీనికితడు బలహీనమైన దేశీయ జీడీపీ డేటా, ఆగస్ట్ తయారీ రంగం పీఎంఐ తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌నుప్రభావితం చేసింది. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రా-డేలో 1,014 పాయింట్లు పతనమైంది. చివరికి 770.5 పాయింట్లు లేదా 1.29 శాతం క్షీణించి 58,766 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 50 కూడా 216.5 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 17,543 వద్ద స్థిరపడింది. ఒకదశలో 17,468 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.9 శాతం నిఫ్టీ ఫార్మా 1.12 శాతం నష్టపోయాయి. విండ్ ఫాల్‌టాక్స్ ప్రభావంతో ఆయిల్ రంగషేర్లుకూడా నష్టాల్లోనే ముగిసాయి. రిలయన్స్ 3 శాతం నష్టపోగా, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ ఎం,హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐషేర్లు ఒక్కొక్కటి 1.5 శాతానికి పైగా పడిపోయాయి. అయితే రియాల్టీ , ఆటో స్వల్పంగా లాభపడ్డాయి. ఏసియన్పెయింట్స్, బజాజ్‌ఫిన్స్‌సర్వ్, ఐషర్ మోటార్స్, హీరోమోటో లాభపడ్డాయి. అటు డాలరుమారకంలో రూపీ 10 పైసల నష్టంతో 79.53 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2 శాతం తగ్గి బ్యారెల్ మార్క్‌కు 100 డాలర్ల కంటే దిగువకు చేరింది.