సాక్షి,ముంబై: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు నష్ట పోయాయి. ఆ తరువాత ఆర్బీఐ వడ్డీ వడ్డనతో దలాల్ స్ట్రీట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జోరుగా కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 216పాయింట్ల పతనంతో 62,411 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి18 560 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 62500 మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ 18,600 మార్క్ దిగువకు చేరింది.
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్రంట్‌లైన్ సూచీలతో సమానంగా పడిపోయాయి. ఏసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్‌టీ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్, ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటామోటార్స్ టాప్ లూజర్స్‌గా స్థిర పడ్డాయి.
ఎఫ్‌ఎంసీజీ రికార్డ్
ఎఫ్‌ఎంసీజీ షేర్లు దూసుకుపోయాయి. దీంతో ఇండెక్స్ ఆల్ టైం గరిష్టానికి చేరింది. ఇమామీ, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్‌గేట్ పామోలివ్ (ఇండియా), మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ 1 శాతం నుంచి 3 శాతం శ్రేణిలో లాభపడ్డాయి.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి 18పైసలు లాభంతో 82.47వద్ద ఉంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును వడ్డించింది. అలాగే గ్లోబల్ సంక్షోభం, ద్రవ్యోల్బణం అప్రమత్తత కారణంగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment