
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజూనష్టాల్లోనేముగిసాయి. దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ప్రాఫిట్-బుకింగ్‌తో ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 61432 వద్ద,నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 18, 130 వద్ద స్థిరపడింది.బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి మరోవైపు మే 26న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు.
బజాజ్ ఫైనాన్స్,కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్‌టెల్,ఐసీఐసీఐ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివీస్ ల్యాబక్స్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, టైటన్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 22 పైసలు కుప్పకూలి 82.59 వద్ద ముగిసింది.
మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్
ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ
Comments
Please login to add a commentAdd a comment