losses
-
వరమివ్వని ఉద్యానం
‘గ్రోత్ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్ నైన్ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది. మిరప, టమాట రైతుల కన్నీళ్లు మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్ మార్కెట్లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. చీనీ రైతులకూ చేదు గుళికలే.. రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.ప్రభుత్వమే ఆదుకోవాలి రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గంమార్కెటింగ్ సౌకర్యం లేదు2 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతులకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం, శింగనమల, మండలం -
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పంచుతోంది. కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధరల్ని అమాతం తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో తోటలు ఉండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ఏటా 12 వేల టన్నుల గింజల దిగుబడి వస్తోంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ (Lotus) తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్లోనూ, ఒక వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది కిలో గింజల ధర రూ.1,050 గతేడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించింది. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్‌గా మారి అనూహ్యంగా ధరలు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజల ధర రూ.770కి పైగా పలుకుతుండగా, కంపెనీలు మాత్రం నాణ్యమైన (ప్రీమియం) గింజలకు సైతం రూ.400–450 మధ్య చెల్లిస్తున్నాయి. అన్‌సీజన్ గింజల్ని కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కిలో రూ.200–250 మధ్య కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన సీజన్ పంటకు సైతం కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాకుండా రైతుల వద్ద దాదాపు 1,500 టన్నులకు పైగా కోకో గింజల నిల్వలున్నాయి. దిగుమతుల వల్లే.. ఈ ఏడాది చాక్లెట్ కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు, పొడి, బటర్ దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులు పండించిన పంటకు డిమాండ్ లేకుండాపోయింది. కోకో రైతుల్లో అత్యధికులు కౌలుదారులే. ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కౌలు చెల్లిస్తుంటారు. తెగుళ్లు, చీడపీడలు, యాజమాన్య పనుల కోసం ఏటా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక సతమతమవుతున్న రైతులు కంపెనీల మాయాజాలం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సీజన్, అన్‌సీజన్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజల్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీల మాయాజాలాన్ని అడ్డుకోవాలని ఏపీ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కోకో రైతులకూ వర్తింప చేయాలని కోరారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రభుత్వం స్పందించడం లేదుఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించేలా 60 ఎకరాలను కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. అన్సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజలు ఉండగా.. కిలో రూ.330 చొప్పున 2.50 టన్నులు అమ్మాను. మిగిలిన 4.50 టన్నులు అమ్ముదామంటే కొనేవారు లేదు. సీజన్‌కు సంబంధించి 7 టన్నుల గింజల్ని కిలో రూ.550 చొప్పున కొన్నారు. ఇంకా 4 టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.450కు మించి కొనలేమని చెబుతున్నారు. మరో రెండు టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. లీజుకు చెల్లించాల్సిన మొత్తం నష్టపోయినట్టే. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏమాత్రం స్పందించలేదు.రూ.45 లక్షలకు పైగా నష్టపోతున్నా ఈ రైతు పేరు అవర్ని అనిల్‌కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలను కౌలుకు తీసుకుని.. ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున కౌలు చెల్లిస్తూ కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3.50 క్వింటాళ్ల చొప్పున కోకో గింజల దిగుబడి వచ్చింది. అన్ సీజన్(వర్షాకాలం)లో తీసిన పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. బతిమాలుకుంటే కిలోకు రూ.200–250 మించి ధర ఇచ్చేది లేదంటున్నారు. చదవండి: భోజనం లేదు.. పుస్తకాల్లేవు!గతేడాది ఇదే సమయంలో సీజన్, అన్ సీజన్‌తో సంబంధం లేకుండా కిలో గింజలకు రూ.1,050 చొప్పున ధర దక్కింది. ఈ ఏడాది అమాంతం ధర తగ్గిపోవడంతో ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తంగా తాను రూ.45 లక్షల మేర నష్టపోతున్నట్టు రైతు అనిల్‌కుమార్ ఘొల్లుమంటున్నారు. కోకో గింజల్ని కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ధరల్ని దారుణంగా తగ్గించేయడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
కన్నీటి దిగుబడి
రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లాలో దోస, కర్బూజ పంటలు పండించే రైతులకు ఫలితాలు.. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేవు. నట్టేట ముంచి అప్పులపాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల ఆఖరులో, మార్చి మొదటి వారంలో దోస 22 రూపాయలు, కర్బూజ 18 రూపాయలు ధరలు పలకడంతో కొందరు రైతులు లాభపడ్డారు. దీంతో రైతులు కొండంత ఆశ పెట్టుకొన్నారు. కానీ అందరి దిగుబడి చేతికి వచ్చే సరికి.. దళారులు మోసాలతో ధరలను పాతాళానికి పడేశారు. జిల్లాలో భారీగా దోస, కర్బూజ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో వందలాది మంది రైతులు వేశారు. తెగుళ్లు, దళారీల మోసాలు, గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోతున్నారు. ఓబులవారిపల్లిలో కోహినూర్ దోస వేసి ఎగుమతులు లేక రూ.లక్షల్లో నష్టపోయారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం.. దోస, కర్బూజ పంటల సాగు ప్రారంభ దశ నుంచే రైతులకు మందుల పిచికారీ, ఎరువులు పెనుభారంగా మారింది. విత్తన దశ నుంచి క్రిమి సంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు పూతకు పిందెలు వచ్చే సమయం నుంచి తెగుళ్ల నివారణకు మందుల పిచికారీ అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల పూత రావడానికి, పిందె నిలవడానికి, తెగుళ్లకు రెండు రోజులకు ఒక సారి అయినా మందులు పిచికారీ చేయాలి. కేవలం మందులకే రైతులు దుకాణాల్లో రూ.లక్షలు అప్పులు చేశారు.తూకాల్లో కోత రైతులు పంటకు ధరలు పడి పోయి కన్నీరు కారుస్తుంటే.. పలువురు దళారీలు ఇదే అదునుగా మరింతగా రేటు తగ్గిస్తున్నారు. ఇక్కడి దిగుబడిని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు. ఇదే అదునుగా రైతులకు, వ్యాపారులకు మధ్య దళారులు చేరి అక్కడ ఒకరేటు, రైతులకు ఒకరేటు, లోడ్ తూకాలలో కోత, కమీషన్లు ఇలా రకరాలుగా మోసం చేస్తున్నారు. కరుణించని పాలకులు మార్కెట్ ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన దోస రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతు సంఘాల నేతలు గళమెత్తి అరుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం.. కష్టాల కడలిలో ఉన్న కర్షకులను పరామర్శ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సీఎం కొత్తపల్లిలో రైతు రామచంద్ర 4 ఎకరాలలో రూ.6 లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. దళారులు అడిగినంతకు కాయలు ఇవ్వలేదని వాటిని కొనుగోలు చేయలేదు. కాయలు తోటలోనే కుళ్లిపోవాల్సిన పరిస్థితి. పండించిన పంటను మార్కెట్‌కి తరలించలేక రైతు తోటలోనే కూలిపోయాడు. ఇలా వేల మంది రైతులు దోస, కర్బూజ తోటలను సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం రీజనల్ కోఆర్డినేటర్, అన్నమయ్య జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి జిల్లాలో సాగవుతున్న పంటలో సగం ఒక పైగా రైతులు పండ్ల తోటలు వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచి ఆదాయాన్ని గడించవచ్చని దోస పంట సాగు చేశారు. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మంచి ఆరోగ్యం కోసం ఆహారంలో 200 గ్రాములు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జిల్లాలో పండించిన రైతుకు బాగుంటుంది. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానవన అధికారి, అన్నమయ్య జిల్లా అనుకూలించని రేటుకష్టపడి పండించిన కర్బూజాకు మార్కెట్ ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా దోస, పుచ్చకాయ పంటను సాగు చేశారు. మార్కెట్లో కేజీ దాదాపు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. దళారులు కేజీ రూ.5 లేదా రూ.8 మాత్రమే చెల్లిస్తున్నారు.కానీ ఎకరాకు పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలంలోనే కాయలను వదిలి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. దళారీల సిండికేటుతో ఇక్కట్లు నా పేరు ఎద్దుల ప్రసాద్. మాది రైల్వేకోడూరు. పది ఎకరాలలో కర్బూజా పంటను సాగు చేశా. దళారుల సిండికేట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వ్యాపారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కలిసి వాట్సాప్ గ్రూపులలో దోస, కర్బూజా ధరలను పంచుకుంటున్నారు. ఒక వ్యాపారి తోట దగ్గరికి వచ్చి కిలో 5 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లిన విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతు పేరుతోపాటు గ్రూపులలో షేర్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యాపారులు అదే ధరకు లేదా మరో రూపాయి అదనంగా ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదు నా పేరు నిరంజన్‌రెడ్డి. మా ఊరు చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె. 20 ఎకరాల్లో దోస సాగు చేశా. పంట దిగుబడి వచ్చే వరకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యానవన అధికా రుల సూచనలతో పురుగు నివారణ మందులు పిచికారీ చేశాను. ఎకరాకు నాలు గైదు టన్ను లు వస్తుందని ఆనందపడ్డాను. ప్రకృతి కరుణించలేదు, తెగుళ్లు వీడలేదు. ఫలితంగా సగం తోట దెబ్బతిన్నది. వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడి వస్తుందని ఆశించాను. మార్కెట్‌కి వెళ్తే ధరలు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి. అప్పుల పాలైన అన్నదాత ఇదీ ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. -
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
ఆశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వ్యాపారాలను సృష్టిస్తోంది.. ఆయా సామ్రాజ్యాలను కుప్పకూలుస్తుంది. కడు పేదరికంలో ఉన్నవారిని కోటీశ్వరులను చేస్తుంది.. తేడా వస్తే అథపాతాళానికి తొక్కేస్తుంది. డబ్బు మీద ఉన్న అత్యాశే ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి తన రూ.1.24 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో.. అందుకుగల కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో మొదటి సంస్థగా..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాలు ఇవే..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్‌ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.ఆరోపణలు.. ఆర్థిక పతనం2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.1,24,000 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరందివాలా.. న్యాయ పోరాటాలుబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి. -
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric) నష్టాలతో సతమతమవుతోంది. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిన పోటీ, నియంత్రణ పరిశీలన, నిర్వహణ వ్యయాలతో కంపెనీకి సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదీ నేపథ్యం..ప్రొక్యూర్మెంట్, ఫుల్ ఫిల్ మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాలపై ఈ ఉద్యోగ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉంది. 2023 నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 మార్చి నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో నాలుగో వంతుకు పైగా తాజా తొలగింపుల ప్రభావానికి గురికానున్నారు. అయితే కంపెనీ బహిరంగ వెల్లడిలో భాగం కాని కాంట్రాక్ట్ కార్మికులను చేర్చడం వల్ల ఖచ్చితమైన ప్రభావం అస్పష్టంగా ఉంది.ఆర్థిక ఇబ్బందులుఓలా ఎలక్ట్రిక్ గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టాలు 50% పెరిగాయి. ఆగస్టు 2023 లో బలమైన ఐపీఓ అరంగేట్రం తరువాత కంపెనీ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు వార్తలు కంపెనీ షేరును మరింత ప్రభావితం చేశాయి. ఇది 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే.. కోఫౌండర్ పిలుపువ్యూహాత్మక పునర్నిర్మాణంపునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కస్టమర్ అనుభవాన్ని పెంచడానికి తన కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలలో కొన్ని విభాగాలను ఆటోమేట్ చేస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ తన లాజిస్టిక్స్, డెలివరీ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. ఓలా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ సేల్స్, సర్వీస్, వేర్‌హౌస్ సిబ్బంది తొలగింపుతో ప్రభావితమయ్యారు.మార్కెట్ స్థానం.. పోటీఒకప్పుడు భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలవుతోంది. డిసెంబర్ లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ తరువాత మూడవ స్థానానికి చేరుకుంది. వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ డేటా ప్రకారం 2023 చివరి నాటికి దేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో తొమ్మిదింటిలో ఓలా ఎలక్ట్రిక్ తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది.భవిష్యత్తు కోసం ప్రయత్నాలుసవాళ్లు ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తన పరిధిని విస్తరించడానికి, సర్వీస్ నాణ్యత గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ ఇటీవల 2023 డిసెంబర్లో 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. ఏదేమైనా అధిక మొత్తంలో కస్టమర్ ఫిర్యాదులు, ఎబిటాను చేరుకోవడానికి దాని అమ్మకాల లక్ష్యాలను సాధించాల్సిన అవసరంతో సహా కంపెనీ గట్టి అడ్డంకులను ఎదుర్కొంటోంది. -
Stock Market: కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
-
రేడియో వ్యాపారం మూసివేత
ఇష్క్ 104.8 ఎఫ్ఎం(Ishq FM) బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్న రేడియో(Radio) వ్యాపారాన్ని వచ్చే ఆరు నెలల్లో మూసివేయనున్నట్లు టీవీ టుడే నెట్వర్క్(TV Today) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే మూసివేత నిర్ణయానికి కారణమని పేర్కొంది. టీవీ టుడే నెట్వర్క్ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మూడు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేడియో వ్యాపారం టర్నోవరు రూ.16.18 కోట్లుగాను, నష్టం రూ.19.53 కోట్లుగాను నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో రేడియో విభాగం వాటా 1.7 శాతంగా ఉంది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరువిస్తరణ బాటలో కామధేనుబ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై దృష్టి పెడుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను నెక్ట్స్’ తయారీ సామర్థ్యాన్ని 20 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. అలాగే చానల్ పార్ట్నర్ల నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయి. రూ.1,299 కోట్లను అధిగమించాయి. అమ్మకాలు 4.5 శాతం బలపడి రూ. 1,810 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1,853 కోట్లయ్యింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది(2022–23) రూ. 1,732 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 1,133 కోట్ల నష్టం ప్రకటించింది. నెదర్లాండ్స్ దిగ్గజం ఇంకా హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థ ఇది. ఓమ్నిచానల్ ద్వారా కార్యకలాపాల విస్తరణ కోసం భారీ పెట్టుబడులు చేపట్టడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ధరలు పెంచకపోగా.. కొన్ని ప్రొడక్టులపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు పెంచుకోగలిగినట్లు ఐకియా ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చులు 2 శాతం అధికమై రూ. 196 కోట్లను దాటాయి. గతేడాది మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 3,152 కోట్లను తాకాయి. అంతక్రితం ఏడాది రూ. 2,895 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. కంపెనీ హైదరాబాద్, నవీముంబై, బెంగళూరు తదితర నగరాలలో లార్జ్ఫార్మాట్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈకామర్స్ కార్యకలాపాల ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేపడుతోంది. -
నష్టపోయి'నారు'
దేవరపల్లి: ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో.. పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 23 వేల హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది.అయితే, గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి, ఇప్పటికే సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకూ నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది. గత ఏడాది కాసుల పంట గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి, రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు (6 వేల మొక్కలు) ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంత మంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బ తిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండూ ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం వచ్చింది. అప్పటి వరకూ గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలు దారులకు కాసుల పంట పండింది. ఆశ పడితే మొదటికే మోసం గత ఏడాది ధరలు చూసిన కౌలుదార్లు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు రూ.40 వేలు కాగా, ఈ ఏడాది అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పలికింది. అయినా సరే తగ్గేదేలే.. అన్నట్లు కౌలుదార్లు పోటీ పడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని నాలుగు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలకగా, నవంబరులో అది రూ.1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాథుడు లేక చాలా మంది రైతులు బోణీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80 శాతం కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని, ఏటా నారుమడులు కట్టి, నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తూంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి, నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.40 వేలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు అయ్యింది. రెండేళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. – గెల్లా గోవిందరాజు, సుబ్బరాయపురం, కౌలు రైతు, దేవరపల్లి కోలుకోలేని దెబ్బ ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.30 లక్షలు అయ్యింది. ఎకరం నారు ధర రూ.1,500 పలికింది. అది కూడా అడిగిన నాథుడే లేడు. ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు రూ.2 లక్షల నష్టం వస్తోంది. నారు రైతులు నిండా మునిగారు. – సీహెచ్ వెంకటేశు, కౌలు రైతు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం -
మైనింగ్‌పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్‌గా కేటాయించిన అమౌంట్‌ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్‌గా కాకుండా ప్రతి పర్మిట్‌పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్‌లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్‌పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు రాయల్టీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
డిస్కంల దివాలా బాట!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏటేటా నష్టాల్లో కూరుకుపోతు న్నాయి. అత్యధిక నష్టాలున్న డిస్కంలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని డిస్కంలకు కలిపి 2015–16లో రూ.3,74,099 కోట్ల నష్టాలు ఉండగా.. 2022–23 నాటికి అవి రూ.6,76,681 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో తెలంగాణ డిస్కంల నష్టాలు రూ.16,520 కోట్ల నుంచి రూ.60,922 కోట్లకు ఎగబాకాయి. రాజ్య సభలో ఎంపీ సంజయ్‌కుమార్ ఝా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ప్రభుత్వరంగ డిస్కంల నష్టాల్లో రూ.1,62,507 కోట్లతో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. రూ.92,070 కోట్ల నష్టాలతో రాజస్థాన్, రూ.91,632 కోట్ల నష్టాలతో ఉత్తరప్రదేశ్, రూ.64,843 కోట్ల నష్టాలతో మధ్యప్రదేశ్ వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. లాభాల్లో ప్రైవేటు.. నష్టాల్లో సర్కారీ సంస్థలుదేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచున నిలువగా, ప్రైవేటు రంగ డిస్కంలు మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ డిస్కంల లాభాలు రూ.12,146 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి రూ.23,116 కోట్లకు పెరిగాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 12 ప్రైవేటు డిస్కంలు ఉండగా, అవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 42 డిస్కంలు ఉండగా.. గుజరాత్‌లోని మూడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్లో ఒక్కో డిస్కం కలిపి మొత్తం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన 37 ప్రభుత్వ రంగ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. మోయలేని అప్పుల్లో దక్షిణ తెలంగాణ డిస్కంతెలంగాణలో రెండు ప్రభుత్వ రంగ డిస్కంలున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నష్టాలు 2015–16లో రూ.10,625 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.42,330 కోట్లకు చేరాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) నష్టాలు ఇదే కాలంలో రూ.5,895 కోట్ల నుంచి 2022–23 నాటికి రూ.18,592 కోట్లకు పెరిగాయి. భారీగా పెరిగిన అప్పులుదేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ డిస్కంల అప్పులు 2015–16లో రూ.4,08,941 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.6,61,263 కోట్లకు పెరిగాయి. ఇదేకాలంలో తెలంగాణ డిస్కంల అప్పుల రూ.13,944 కోట్ల నుంచి రూ.35,883 కోట్లకు పెరిగాయి. దేశంలోని డిస్కంల పరిస్థితి» మొత్తం ప్రభుత్వరంగ డిస్కంలు 42» నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ డిస్కంలు 37» 2022–23 నాటికి సర్కారు డిస్కంల నష్టాలు రూ.6,76,681 » లాభాల్లో ఉన్నవి 5» దేశంలో మొత్తం ప్రైవేటు డిస్కంలు 12» లాభాల్లో ఉన్న ప్రైవేటు డిస్కంలు 12 -
నిస్సాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
గుడ్డు రైతుకు గడ్డు కాలం!
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్‌ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతిగతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు. మేత ఖర్చులు తడిసి మోపెడు... ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది. 40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి సాధారణంగా ఫామ్‌లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.సిండికేట్‌తో ధరలు పతనం గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్‌గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ మేత ఖర్చులు భారం.. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్‌ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు
-
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్‌కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్‌లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
77,000 స్థాయి తాకి.. వెనక్కి
ముంబై: సరికొత్త రికార్డుల వద్ద ఐటీ, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారంతో ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 77,000 స్థాయిపై 77,079 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 23,412 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి.తదుపరి ఐటీ, ఫైనాన్స్ మెటల్, ఇంధన షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పతనమై 76,490 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 23,259 వద్ద నిలిచాయి. సరీ్వసెస్, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, పారిశ్రామికోత్పత్తి రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.04%, 0.56% చొప్పున రాణించాయి. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.136)తో పోలిస్తే 21% ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయ్యింది. ఆఖరికి 17% లాభంతో రూ.159 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.591.25 కోట్లుగా నమోదైంది. డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్ఎస్ఈకాగా, డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్సే్చంజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డ్ మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు యంఫీ వెల్లడించింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
రికార్డు స్థాయిల్లో లాభాల స్వీకరణ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల అందడంతో రికార్డు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా స్టాక్ సూచీల అయిదు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకొని ప్రథమార్ధంలోనే జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 73,428 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 22,124 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు తాకాయి. సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఐటీ, రియలీ్ట, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చేసుకోవడంతో సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టపోయి 73,427 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పతనమై 22,032 వద్ద ముగిశాయి. చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.31%, 0.43% చొప్పున పతనమయ్యాయి. మరోవైపు మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలతో ఇటీవల భారీగా ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుకుంది. చిన్న, మధ్య తరహా షేర్ల విలువలు భారీ పెరిగిపోవడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగకపోవచ్చు. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే తాజా అంశాలేవీ లేకపోవడంతో ఎఫ్ఐఐలు నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. భౌగోళిక ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.331)తో పోలిస్తే షేరు బీఎస్ఈలో 12% ప్రీమియంతో రూ.372 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 34% ఎగసి రూ.445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 31% లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,851 కోట్లుగా నమోదైంది. ► క్యూ3 లో నికర లాభం 56% క్షీణించడంతో జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు 7% నష్టపోయి రూ.249 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 8% పతనమై రూ.247 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ ఒక్క రోజులోనే రూ.11,372 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్ 2%, విప్రో 2%, టెక్ మహీంద్ర 1.40%, ఇన్ఫోసిస్ 1.27%, టీసీఎస్ 1% చొప్పున నష్టపోయాయి. ► గతవారంలో 8% ర్యాలీ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 ఆర్థిక ఫలితాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.2747 వద్ద ముగిసింది. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
ఫస్ట్‌క్రై నష్టాలు పెరిగాయ్.. ఏకంగా ఆరు రెట్లు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో బ్రెయిన్‌బీస్ సొల్యూషన్ లిమిటెడ్ నికర నష్టాలు భారీగా పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 486 కోట్లను తాకాయి. ఫస్ట్‌క్రై బ్రాండ్ ఓమ్నిచానల్ బిజినెస్ నిర్వాహక కంపెనీ అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 79 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రెట్టింపునకుపైగా ఎగసి దాదాపు రూ. 5,633 కోట్లకు చేరింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం 2021–22లో రూ. 2,401 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. వెరసి సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులున్న స్టార్టప్.. ఫస్ట్‌క్రై రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించిన స్టార్టప్‌ల జాబితాలో తాజాగా చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,568 కోట్ల నుంచి రూ. 6,316 కోట్లకు పెరిగాయి. కాగా.. కంపెనీ ఇటీవల పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో 90 కోట్ల డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీలో 40 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి నాటికి దేశమంతటా.. కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. రైతులపై పైసా కూడా భారం పడదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది. స్మార్ట్‌మీటర్లతో ఉపయోగాలు.. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులకు అభ్యంతరం లేదు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్‌తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా -
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. -
గాడిన పడుతున్న ఎయిర్‌లైన్స్..
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కరోనా కారణంగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నెమ్మదించడం తెలిసిందే. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇవి రూ.17,500 కోట్ల వరకు నష్టాలను చవి చూశాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.3,000–3,500 కోట్లకు పరిమితం అవుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వైరస్ సమసిపోయి, ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దేశ, విదేశీ ప్రయాణాలు ఊపందుకోవడం తెలిసిందే. గతంలో నిలిచిన ప్రయాణాలు కూడా తోడు కావడంతో విమానయాన సర్వీసులకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విమాన ప్రయాణికుల రద్దీ 8–13 శాతం మధ్య పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 15–15.5 కోట్లకు చేరుకుంటుందని.. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో ఉన్న 14.1 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీలో చక్కని వృద్ధికితోడు, రాబడులు మెరుగుపడడం, వ్యయాలు స్థిరంగా ఉన్నందున ఈ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలోనూ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నష్టాలు ఎదురవుతాయని ఇక్రా తెలిపింది. ‘‘ప్రస్తుత స్థాయి నుంచి రాబడులు మరింత పెరిగే అవకాశాలు పరిమితమే. కనుక ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024–25లోనూ 3,000–5,000 కోట్ల మధ్య నష్టాలను నమోదు చేయవచ్చు’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ వివరించారు. విమానాశ్రయాల సదుపాయాల విస్తరణతో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం మాదిరే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రయాణికుల వృద్ధి ఉంటుందని ఇక్రా తెలిపింది. ఎనిమిది నెలల్లో 10 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) విమాన ప్రయాణికుల సంఖ్య 10.07 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 17 శాతం వృద్ధి కనిపిస్తోంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం వృద్ధి నమోదైంది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2022–23లో 2.39 కోట్లుగా ఉంది. కరోనా ముందు నాటి గణాంకాల కంటే ఇది ఎక్కువ. 2018–19లో 2.59 కోట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. విమానయాన సంస్థలకు ధరలు నిర్ణయించే బలం చేకూరిందని, ఫలితమే రాబడులు మెరుగుపడడమని వివరించింది. విమానయాన సంస్థలకు 1500 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల నిదానంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మధ్య కాలానికి డిమాండ్–సరఫరా మధ్య సమతుల్యత ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్లో భారత ఎయిర్‌లైన్స్ సంస్థల వాటా 42 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రయాణికుల రికవరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణతను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 66,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,812 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,560 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు బలపడి 19,850 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివర్లో పలు రంగాల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా లాభాలు కోల్పోయాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు వరుసగా 0.70%, 0,40% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.264 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.113 కోట్ల షేర్లు కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సియట్ లిమిటెడ్ షేరు 4.50% లాభపడి రూ.2,197 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 11% దూసుకెళ్లి రూ.2,334 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది క్యూ2 సంస్థ నికర లాభం రూ.6.4 కోట్లుగా ఉంది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.388 కోట్లు పెరిగి రూ. 8,887 కోట్లకు చేరింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీ షేరు 4.09% లాభపడి రూ.295 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.298 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల మైలురాయిని అధిగమించి రూ.30,422 కోట్లకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు 133% దూసుకెళ్లింది. రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు కనబరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% పెరిగి రూ.1,541 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2% ర్యాలీ చేసి రూ.1,558 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎల్రక్టానిక్ సేవల తయారీ సంస్థ సైయెంట్ డీఎల్ఎం షేరు 3% ఎగసి రూ.709 వద్ద స్థిరపడింది. క్యూ2 లో కంపెనీ నికర లాభం 106% వృద్ధి చెందడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 8.50% ఎగసి రూ.748 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
నెల కనిష్టానికి సూచీలు
ముంబై: బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం కొనసాగడంతో స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 286 పాయింట్లు పతనమై 65,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 19,436 వద్ద నిలిచింది. రెండు సూచీలకు ముగింపు స్థాయిలు నెల కనిష్టం. ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 633 పాయింట్లు నష్టపోయి 65 వేల స్థాయి దిగువన 64,879 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు పతనమై 19,334 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,424 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,769 కోట్ల షేర్లను కొన్నారు. ► అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 3% పెరిగి రూ.2464 వద్ద స్థిరపడింది. అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్(ఐహెచ్సీ) ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆదానీలో తన వాటాను 4.98% నుంచి 5.04 శాతానికి పెంచుకోవడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► అప్డేటర్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో 0.03 స్వల్ప డిస్కౌంట్‌తో 299.90 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 6% క్షీణించి రూ.282 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచి్చంది. చివరికి 5.38% నష్టంతో 284 వద్ద నిలిచింది. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
66 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్సీఐ 12%, కొచి్చన్ షిప్‌యార్డ్ 11%, ఎన్ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్‌కాన్ 8%, ఎన్సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్‌లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి. రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి. -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు, మెరిసిన టైటన్
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
అయ్యో వొడాఫోన్ ఐడియా! పాపం భారీ నష్టాలు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది. -
లూడో తెచ్చిన ముప్పు: లక్షలు గోవిందా! చివరికి..!
Online Gaming Ludo Bangalore Woman ఆన్లైన్ గేమ్‌కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ కొంత నగదుతో సహా ఇంటి నుంచి పారిపోవడం మరింత సంచలనం రేపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్‌లైనింగ్ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో రూ. 50వేల పోగొట్టుకుంది. రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం. అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ అలాంటి పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్లైన్లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్‌ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్ కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. -
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్‌కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకుల దెబ్బ, భారీ నష్టాలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్లో జోష్ మూడ్‌కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19,400 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ , దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలచాయి. యూపీఏ టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. క్యూ1 ఫలితాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469 కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది. కానీ ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438 కోట్లకు చేరుకుంది. రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన సూచీలు.. రిలయన్స్, ఐటీసీ షేర్లు పతనం
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్‌బుకింగ్, కుప్పకూలిన స్టాక్‌మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు ప్రధానంగా ఇన్ఫోసిస్ , అలాగే రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. ఇటీవల మార్కెట్ భారీగా ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ మార్చి 24 నాటి 57,527 తో పోలిస్తే 67,500 వేలకు ఎగువన ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది. ఒక్క ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద 234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బీపీసీఎల్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్‌యూఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అదరగొట్టిన రిలయన్స్ మరోవైపు రిలయన్స్ నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది. రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్ మారకంలో భారత కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
భారీ నష్టాల్లో ఉత్తర డిస్కం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. 2023 జనవరి 1– మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి సంస్థ తాజాగా ప్రకటించిన ‘త్రైమాసిక విద్యుత్ ఆడిట్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ పరిధిలోని 17 జిల్లాల/విద్యుత్ సర్కిళ్లలో మొత్తం 38 విద్యుత్ డివిజన్లుండగా.. డివిజన్ల వారీగా విద్యుత్ సాంకేతిక, ఆర్థిక నష్టాల మొత్తాలను (ఏటీఅండ్‌సీ లాసెస్)ను సంస్థ ఈ నివేదికలో పొందుపరిచింది. మూడు డివిజన్లలో పరిధిలో ఈ నష్టాలు ఏకంగా 70–80 శాతానికి ఎగబాకినట్లు నివేదిక పేర్కొంది. అంటే ఈ డివిజన్లకు సరఫరా చేసిన మొత్తం విద్యుత్‌కు గాను కేవలం 20–30 శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయన్నమాట. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థూలంగా 36 శాతం నష్టాలు గత త్రైమాసికంలో టీఎస్ఎన్పీడీసీఎల్ మొత్తం రూ.4,726.60 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, రూ.3,203.89 కోట్లను (67.78శాతం) మాత్రమే వసూలు చేసుకోగలిగింది. అంటే 36.33 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. డిస్కంల సుస్థిర మనుగడ కోసం ఏటీ అండ్ సీ నష్టాలను 2019–20 నాటికి 6 శాతానికి తగ్గించుకోవాలని ఉదయ్ పథకం కింద కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. అయినా రాష్ట్ర డిస్కంలు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వసూలు కాని ‘ఇతర’ కేటగిరీ బిల్లులు గృహాలు, వాణిజ్యం, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారులు 90 నుంచి 100 శాతం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదిక తెలిపింది. ఇతర కేటగిరీలో మాత్రం చాలా డివిజన్లలో ఒక శాతం బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ డివిజన్ల పరిధిలోని కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్‌హౌస్‌ల విద్యుత్ కనెక్షన్లు ఇతర కేటగిరీలోనే ఉన్నాయి. ఏటీ అండ్ సీ నష్టాలు అంటే..? సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో డిస్కంలకు జరిగే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో.. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలంటారు. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో పాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి..అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ (ఏటీ అండ్ సీ లాసెస్) అంటారు. పెద్దపల్లిలో 80%..కరీంనగర్ రూరల్‌లో 78.99% నష్టాలు పెద్దపల్లి డివిజన్లో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం ఏకంగా 80.18 శాతానికి ఎగబాకి రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డివిజన్లో గత త్రైమాసికంలో రూ.435.08 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, కేవలం రూ.89.63 కోట్లు (20.6%) మాత్రమే వసూలయ్యాయి. డివిజన్ పరిధిలో 1,71,002 విద్యుత్ కనెక్షన్లుండగా, 421.55 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ సరఫరా చేశారు. 15.95 ఎంయూల (3.78 శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు (టీ అండ్ డీ లాసెస్) పోగా, మిగిలిన 405.6 ఎంయూల విద్యుత్‌ను వినియోగించినందుకు గాను వినియోగదారులకు రూ.435.08 కోట్ల బిల్లులు జారీ చేశారు. ♦ కరీంనగర్ రూరల్ డివిజన్లో 78.99 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.445.67 కోట్ల బిల్లులకు గాను రూ.96.28 కోట్లు (21.6%) మాత్రమే వసూలయ్యాయి. ♦ భూపాలపల్లిలో 71.2 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.205.7 కోట్ల బిల్లులకు గాను రూ.80.19 కోట్లే (38.98 శాతం) వసూలయ్యాయి. ఇక అక్కడ టీ అండ్ డీ నష్టాలు సైతం 26.13 శాతంగా ఉన్నాయి. చౌర్యం/సాంకేతిక లోపాలతో ఏకంగా 99.35 ఎంయూల విద్యుత్ నష్టం జరిగింది. ♦ ములుగు డివిజన్లో 61.58 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.122.36 కోట్ల బిల్లులకు గాను రూ.48.97 కోట్లు (40.02 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ♦కరీంనగర్ డివిజన్లో 48.86 శాతంఏటీఅండ్సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.444.12 కోట్ల బిల్లులకు గాను రూ.218.46 కోట్లు (49.10%) మాత్రమే వసూలయ్యాయి. ♦మంథని డివిజన్లో 44.12 శాతం ఏటీఅండ్ సీ నష్టాలున్నాయి. అక్కడ రూ.328.8 కోట్ల బిల్లులకు గాను రూ.144.48 కోట్లు (43.94%) మాత్రమే వసూలయ్యాయి. హన్మకొండ రూరల్‌లో 34.54 శాతం ఏటీఅండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.177.25 కోట్ల బిల్లులకు గాను రూ.124.79 కోట్లు (70.4శాతం) మాత్రమే వసూలయ్యాయి. మరో 7.04 శాతం టీ అండ్ డీ నష్టాలున్నాయి. పైన పేర్కొన్న ఈ డివిజన్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లతో పాటు దేవాదుల, సమ్మక్క సాగర్ వంటి భారీ లిఫ్టులు కూడా ఉన్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాలు: అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై, రికార్డు స్థాయిని టచ్ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్,రియల్టీ ఇతర హెవీవెయిట్ షేర్లలో ఒత్తిడి, ప్రాఫిట్ బుకింగ్‌తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్ఎంసిజి నష్టపోగా, పిఎస్‌యు బ్యాంక్స్, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం. టాప్ లూజర్ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది. గత మూడు నెలలో ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి. మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.12,000 కోట్లను నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ ఎం, టీసీఎస్ లాభపడగా, కోటక్ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. -
మూడు రోజుల లాభాలు పాయే: సెన్సెక్స్ పతనం, ఫార్మా జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఆరంభంనుంచీ స్తబ్ధుగా ఉన్న సూచీలు చివరికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 62,922వద్ద, 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,684 వద్ద 18,700 మార్క్ దిగువన ముగిసింది. సెక్టార్లలో, బ్యాంకింగ్ , రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. మేజర్‌గా ఫార్మా ఇండెక్స్ 1.4 శాతం ఎఫ్ఎంసిజి 0.5 పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ ,దివీస్ , రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి.అలాగే హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు, విపప్రో, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 14పైసలు నష్టపోయి 82.19 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ అప్డేట్స్, బిజినెస్ వార్తల కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
నష్టాల్లో ముగిసిన మార్కెట్, బ్యాంకు, ఐటీ షేర్ల దెబ్బ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు తొలి రెండు గంటలపాటు గ్రీన్‌లో కొనసాగాయి. కానీ మిడ్ సెషన్‌నుంచి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 62,625.63 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ 71.10 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 18,563.40 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ లాభపడగా,బ్యాంకు, ఐటీ, మెటల్ , ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లునష్టపోయాయి. ఇండస్ ఇండ్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, అదానీ లాభపడగా, హీరోమోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ, దివీస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. గత ముగింపు 82.57తో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి 11 పైసలు పెరిగి 82.46 వద్ద ముగిసింది. -
నాలుగు రోజుల రన్‌కు బ్రేక్: మార్కెట్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్‌కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి. భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్‌ఫార్మ టాప్ విన్నర్స్‌గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ , హెచ్డీఎఫ్సీ బాగా నష్టపోయాయి. -
ఇండియా సిమెంట్స్ నష్టాలు పెరిగాయ్, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్‌లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో ఆస్తుల మానిటైజేషన్ తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) డోంట్ మిస్ టూ క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ -
నష్టాల్లో సూచీలు: అదానీ , బ్యాంకింగ్ షేర్ల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రతికూల ప్రపంచ సూచనల మధ్య సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా కుప్పకూలింది. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్ల లాభాలతో నష్టాలనుంచి తెప్పరిల్లాయి. కానీ ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో లాభాల బుకింగ్ కనిపిస్తోంది. దీంతో బనిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 18306 వద్ద, 121 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 61864 వద్ద కొనసాగుతున్నాయి. సన్ ఫార్మా, టైటన్, డా.రెడ్డీస్, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్లు ఉండగా, కాఅదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు ఎస్బీఐ,ఐసీఐసీఐ, పీఎన్బీ తదితర బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. -
Today Market Closing: మూడో రోజు నష్టాలు, రూపాయి 22 పైసలు ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజూనష్టాల్లోనేముగిసాయి. దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ప్రాఫిట్-బుకింగ్‌తో ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 61432 వద్ద,నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 18, 130 వద్ద స్థిరపడింది.బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి మరోవైపు మే 26న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. బజాజ్ ఫైనాన్స్,కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్,ఐసీఐసీఐ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివీస్ ల్యాబక్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, టైటన్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 22 పైసలు కుప్పకూలి 82.59 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
భారీ నష్టాల్లో సూచీలు: హెచ్‌సీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించిన సూచీలు ఆ తరువాత మరింత నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టంతో 61500 దిగువన ట్రేడవుతుండగా, 130 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,150 స్థాయిని కోల్పోయింది. ఐటీ , ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. నష్టాలు మరింత కొనసాగుతున్నాయి. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్ బాగా లాభపడుతుండగా హెచ్‌సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్ టాప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అదానీ హిండెన్‌బర్ వివాదంలో సెబీ అప్పీల్‌ను స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంల నేటి (బుధవారం)సెషన్లో అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. -
సెన్సెక్స్ లాభం, నిఫ్టీ అక్కడే
ముంబై: జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మెటల్, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 59,538 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 369 పాయింట్ల పరిధిలో 59,413 వద్ద కనిష్టాన్ని, 59,781 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 23 పాయింట్లు పెరిగి 59,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 17,640 ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,554 – 17,663 వద్ద రేంజ్లో కదలాడింది. ఆఖరికి ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా గురువారం ముగింపు 17,624 వద్దే స్థిరపడింది. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, మీడియా, ఫార్మా షేర్లకు రాణించాయి. మెటల్, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్టీ, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్‌సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్‌కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాయి. కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 3కు ముందు విద్యుత్ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. నిర్లక్ష్యం ఫలితం... విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్‌కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు... కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్‌లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. సంస్కరణలతోనే డిస్కంల బాగు.. విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్ మీటరింగ్ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. -
ఆర్బీఐ పాలసీ రివ్యూపై దృష్టి, నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58588 వద్ద,నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 17526వద్ద కొనసాగుతున్నాయి ఈ ఉదయం RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్‌మార్క్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వడ్డన ఉంటుందనేది ప్రధాన అంచనా. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఎస్బిఐ లైఫ్, ఐషర్ మోటార్స్ ,యాక్సిస్ బ్యాంక్ ఒక్కో శాతం చొప్పున ఎగిసి గిటాప్ గెయినర్లుగా ఉండగా, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ , ఎంఅండ్ ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్చి నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ ట్రేడింగ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదయం సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 57,752 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 455 పాయింట్ల పరిధిలో 57,495 వద్ద కనిష్టాన్ని, 57,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 40 పాయింట్ల నష్టంతో 57,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,032 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 16,914 –17,062 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 34 పాయింట్లు పతనమై 16,952 వద్ద ముగిసింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.79%, 0.42 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1531 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను విక్రయించారు. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 82.16 స్థాయి వద్ద స్థిరపడింది. వేదాంతా డివిడెండ్ రూ. 20.5 వేదాంతా లిమిటెడ్ వాటాదారులకు ఐదో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 20.5 చొప్పున చెల్లించనుంది. ఇందుకు ఏప్రిల్ 7 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం రూ. 7,621 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: వరుసగా నాలుగో రోజు నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు కూడా పతనమైనాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభం, అంతర్జాతీయమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆ తరువాత నష్టాలనుంచి కోలుకున్నప్పటికీ చివరల్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 337.66 పాయింట్లు లేదా 0.58 శాతం క్షీణించి 57,900 వద్ద, నిఫ్టీ 111 పతనంతో 17,043 వద్ద ముగిసాయి. ఒక దశలో నిఫ్టీ 17వేల కిందికి పడిపోయింది. అయితే డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టం వద్ద నమోదు కావడం ఊరట నిచ్చింది. మీడియా, ఫార్మా మినహా ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్‌లు వరుసగా 8, 4శాతం నష్టపోయాయి. టైటన్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా, ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. -
పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త!
ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మిడ్ క్యాప్ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: సాధారణంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్‌లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అంతంత మాత్ర బిజినెస్‌లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతాయి. అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్‌లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ తీరు గతేడాది నవంబర్ నుంచి సాఫ్ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్ షేరు 1,823 శాతం జంప్‌చేసింది. గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్ ఇండస్ట్రీస్ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కన్ను కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు. సాధనా బ్రాడ్‌క్యాస్ట్, షార్ప్‌లైన్ బ్రాడ్‌క్యాస్ట్ యూట్యూబ్ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్‌అండ్‌టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్‌ఆర్ రైల్ ఇంజినీరింగ్, టేలర్‌మేడ్ రీన్యూ, ఆస్కమ్ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!! -
నాలుగు నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది. -
TodayStockMarketClosing: తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలే!
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి మిడ్‌సెషన్ తరువాత కోలుకున్నప్పటికీ ఆ లాభాలనునిలబెట్టుకోవడం విఫలమైంది. సెన్సెక్స్ 124 పాయింట్లు కుప్పకూలి 60683 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17857 వద్ద ముగిసింది. మెటల్ షేర్లు భారీగా నష్టపోగా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, యూపీఎల్, సిప్లా, హీరోమోటో, లార్సెన్ టాప్ గెయినర్స్‌గా, అదానీ ఎంటర్పప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, కోల్ఇండియా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అలాగే పేటీఎంలో మొత్తం వాటాను అలీబాబా విక్రయించడంతో పేటీఎం షేరు దాదాపు 8శాతం కుప్పకూలింది. అటు ఎంఎస్‌సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ తగ్గించడంతో అదానీకి చెందినకొన్నిషేర్లు నష్టపోయాయి. -
Today StockMarket Opening: నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభ మైనాయి. అనంతరం మరింత అమ్మకాలు కొనసాగాయి. ఐటి, ఎఫ్ఎంసిజి, మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫలితంగా 65 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17827 వద్ద, సెన్సెక్స్ 198 పాయింట్లు కోల్పోయి 60610 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం కూడా అదానీ షేర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ విన్నర్స్‌గా హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.63ప్రారంభమైనా 82.59 వద్ద పాజిటివ్‌గా ఉంది. -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్‌దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐటీ షాక్‌తో నష్టాల ముగింపు, రూపాయి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివర్లో నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి. తద్వారా 5 రోజుల లాభాలకు చెక్ పడింది. అమెరికా జాబ్ రిపోర్ట్ తరువాత ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఐటీ షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్, బీపీసీఎల్, టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. దివీస్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదాంత టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరుమారకంలో రూపాయి సెప్టెంబర్ 22 తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది. 1.10 నష్టంతో 82. 72 వద్ద ముగిసింది. -
టైటన్ స్పీడ్ తగ్గింది, షేర్లు మాత్రం దౌడు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3) లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 913 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,012 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 10,094 కోట్ల నుంచి రూ. 11,698 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 8,750 కోట్ల నుంచి రూ. 10,454 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో జ్యువెలరీ విభాగం 11 శాతం పుంజుకుని రూ. 9,518 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ బాటలో వాచీలు, ఇతర విభాగం అమ్మకాలు సైతం 15 శాతం ఎగసి రూ. 811 కోట్లకు చేరాయి. ఐ కేర్ అమ్మకాలు 12 శాతం అధికమై రూ. 174 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో గురువారం నీరసించిన శుక్రవారం టైటాన్ షేర్లు దూసుకుపోయాయి. భారీగా లాభాలతో టాప్ గెయినర్‌గా దాదాపు 7 శాతంఎగిసి రూ. 2458 వద్ద ముగిసింది. -
స్మగ్లింగ్ కట్టడికి భారత్ నాయకత్వం వహించాలి
న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్) కారణంగా నష్టపోతున్న భారత్ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. స్మగుల్డ్ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో నా యకత్వ పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్‌దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కలసికట్టుగా పోరాడాలి.. అంతర్జాతీయంగా స్మగుల్డ్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్ చేంజ్ ఫోరమ్ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘‘స్మగ్లింగ్ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్ అంశంపై భారత్ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. బ్రాండెడ్ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్‌లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఈ ఫోరమ్ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్ యజమానాలను కార్పొరేట్ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్‌లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది. -
ఎఫ్‌అండ్‌వోలో రిటైలర్లకు నష్టాలే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) రిటైల్ ఇన్వెస్టర్లు చేపట్టిన ఈక్విటీ డెరివేటివ్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నివేదిక తాజాగా వెల్లడించింది. ప్రతీ 10 మంది రిటైల్ ఇన్వెస్టర్లలో 9 మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లావాదేవీలలో నష్టపోయినట్లు పేర్కొంది. దీంతో అటు స్టాక్ ఎక్సే్ఛంజీలు, ఇటు బ్రోకర్లు అదనపు రిస్కులపై సమాచారాన్ని అందించేలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలియజేసింది. 2019–22 మధ్య కాలంలో టాప్–10 స్టాక్ బ్రోకర్ల వద్ద నమోదైన రిటైల్ ఇన్వెస్టర్ల గతేడాది ఎఫ్‌అండ్‌వో టర్నోవర్ ఆధారంగా అధ్యయనం చేపట్టింది. మొత్తం రిటైల్ క్లయింట్ల టర్నోవర్‌లో ఇది 67% వాటాకాగా.. 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు వెల్లడించింది. అంటే ప్రతీ 10 మందిలో 9 మంది ఎఫ్‌అండ్‌వో లావాదేవీల ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయినట్లు తెలియజేసింది. 90% యాక్టివ్ ట్రేడర్లను పరిగణిస్తే ఈ నష్టం రూ. 1.25 లక్షలుగా నమోదైనట్లు వెల్లడించింది. వెరసి డెరివేటివ్ విభాగంలో 11% మంది రిటైలర్లు మాత్రమే లాభాలు ఆర్జించారు. సగటున రూ. 1.5 లక్షల లాభం నమోదైంది. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు, ఐటీ షేర్ల ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు తరువాత 250 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 60093వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 17895వద్ద ముగిసింది. ఐటీ మినహా బ్యాంకింగ్, మెటల్, ఆటోఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, హీరోమోటో భారీగా లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల, హిందాల్కో నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 39 పాయింట్లు నష్టంతో 81.64 వద్ద ఉంది. -
TodayStockMarketUpdate: బ్యాంకింగ్ దెబ్బ, మూడో రోజూ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్‌ల వారంవారీ గడువు ముగియనున్న నేపథ్యం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో లాభాలు ఆవిరై పోయాయి. రోజంతా ఊగిస లాడిన సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 59958 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 17858 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు, నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొన సాగాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోగా, ఐటీ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ దిగ్గజాల డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు, యుఎస్ ద్రవ్యోల్బణ డేటా అంచనాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగుతోంది. అల్టట్రా టెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, లార్సెన్. హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లోనూ, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్పనష్టాలతో 81.55 వద్ద ముగిసింది. -
భారీ నష్టాలు, 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలన్నీ కోల్పోయి భారీ నష్టాల్లో ముగిసాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి, ఫెడ్ వడ్డీరేట్ల భయాల కారణంగా, మంగళవారం సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్ట పోయింది. ఆరంభంలోనే డీలా పడిన సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఐటీ, ఫైనాన్షియల్స్ బ్యాంకింగ్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 632 పాయింట్లు పతనమై 60115 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు నష్టంతో 17925 వద్ద ముగిసాయి. టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ , బీపీసీఎల్ లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ తదితర షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 62పైసలు ఎగిసి 81.85 స్థాయికి చేరింది. ఈ పతనంతో లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇ ఎం-క్యాప్ నమోదు ప్రకారం సోమవారం నాటి రూ.282.99 లక్షల కోట్ల విలువతో పోలిస్తే దలాల్ స్ట్రీట్ రూ. 3 లక్షల కోట్లను కోల్పోయింది. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ లాంటి ఫ్రంట్‌లైన్ స్టాక్‌ల పతనం మార్కెట్‌ను బలహీనపర్చింది. -
స్విగ్గీకి పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టాఫ్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్‌వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 451 పాయింట్లు కుప్పకూలి 61735 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టంతో 18375 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐషర్, మారుతి లాంటి ఆటో షేర్లుకూడా బలహీనంగా ఉన్నాయి. ఐటీసీ, ఎం అండ్, నెస్లే, కోల్ ఇండియా, డా. రెడ్డీస్ గ్రాసిం, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. ఈ సాయంత్రం విడుదల కానున్న నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటాకానుందని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సులా వైన్యార్డ్స్ , అబాన్స్ హోల్డింగ్స్ IPO ఈరోజు షురూ కానుంది. -
ఐటీ ఢమాల్: కుప్పకూలిన హెచ్‌సీఎల్‌టెక్ షేరు
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో లాభపడిన సూచీలు చివరలో కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స్ 389 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 62,182 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 18,497 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రా డేలో ఏకంగా 700 పాయింట్లకు పైగా పడి 61,889 కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 18,500 మార్క్‌ను బ్రేక్ చేసింది. ఎఫ్ఎంసిజి, ఫార్మా లాభపడగా, ఐటీ ఇండెక్స్ 3.16 శాతం పతనమైంది. అలాగే పీఎస్‌యూ బ్యాంక్ రియాల్టీ సూచీలు వరుసగా 1.7 శాతం1.5 శాతం నష్టపోయాయి. నెస్లే, టైటన్, సన్ ఫార్మ, డా.రెడ్డీస్, ఐషర్ మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ ఏకంగా 6 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విపప్రో, హిందాల్కో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు ఎగిసి 82.28 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ వడ్డింపు,18600 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు నష్ట పోయాయి. ఆ తరువాత ఆర్బీఐ వడ్డీ వడ్డనతో దలాల్ స్ట్రీట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జోరుగా కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 216పాయింట్ల పతనంతో 62,411 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి18 560 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 62500 మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ 18,600 మార్క్ దిగువకు చేరింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్రంట్‌లైన్ సూచీలతో సమానంగా పడిపోయాయి. ఏసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్‌టీ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటామోటార్స్ టాప్ లూజర్స్‌గా స్థిర పడ్డాయి. ఎఫ్ఎంసీజీ రికార్డ్ ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకుపోయాయి. దీంతో ఇండెక్స్ ఆల్ టైం గరిష్టానికి చేరింది. ఇమామీ, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ 1 శాతం నుంచి 3 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 18పైసలు లాభంతో 82.47వద్ద ఉంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును వడ్డించింది. అలాగే గ్లోబల్ సంక్షోభం, ద్రవ్యోల్బణం అప్రమత్తత కారణంగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. -
ఆటో, ఐటీ షాక్: బుల్ రన్‌కు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజుల లాభాల పరుగుకు బ్రేక్ చెప్పాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు సెన్సెక్స్, నిఫ్టీ వరుస రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసింది. డే హై నుంచి 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ 63 వేల దిగువకు చేరింది. అలాగే నిఫ్టీ కూడా 18700 దిగువకు చేరింది. ఆటో, ఐటీ షేర్లు భారీగా నష్ట పోయాయి. చివరికి సెన్సెక్స్ 416 పాయింట్లు కుప్పకూలి 62868 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు నష్టంతో 18696 వద్ద ముగిసింది. అపోలో హాస్పిట్సల్, టెక్ మహీంద్ర, గ్రాసిం, బ్రిటానియా డా. రెడ్డీస్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా కన్జూమర్స్స్ హెచ్‌యూఎల్, హీరో మోటో నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయ 12 పైసల నష్టంతో 81.31 వద్ద ఉంది. -
రిలయన్స్, ఇన్ఫోసిస్ షాక్: వరుసగా మూడో సెషన్లో నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సంకేతాలతో సోమవారం వరుసగా మూడో సెషన్లో నష్టపోయిన సెన్సెక్స్ ఆరంభంలో సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయింది. ఐటీ,పవర్, రియాల్టీ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగి, చివరకు సెన్సెక్స్ 519 పాయింట్లు కుప్పకూలి , 61114 వద్ద నిఫ్టీ 148 పాయింట్ల పనతంతో నిఫ్టీ వద్ద 18159 వద్ద ముగిసింది. బీపీసీఎల్ , భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌యూఎల్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హీరో మోటాకార్ప్, అదానీపోర్ట్స్ , ఎల్ అండ్ టీ, టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 17పైసలు నష్టోయి 81.83 వద్ద ఉంది. -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్‌లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్‌లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్‌లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్‌క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్‌క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్‌క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్‌లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
భారీ నష్టాలు, మూడు రోజుల లాభాలకు రుపీ చెక్
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్న సూచీలు , తరువాత మరింత బేజారయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 60,500 దిగువకి, నిఫ్టీ 18000 దిగువనకు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 420 పాయింట్లు నష్టపోయి 69613 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 18028 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60,600 ఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన ముగియం విశేషం. అమెరికా ఇన్ఫ్లేషన్ డేటాపై దృష్టి, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు వారం F&O గడువు ముగింపు కావడంతో దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ హెచ్‌యుఎల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా లాభపడ్డాయి. ముఖ్యంగా నైకా షేర్లు ఏకంగా 10 శాతం జంప్ చేశాయి. అటు డాలరుమారకంలో రూపాయి వరుస లాభాలకు చెక్‌పెట్టింది. 40పైసలు కోల్పోయి 81.76 స్థాయికి చేరింది. -
ప్రాఫిట్ బుకింగ్: ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. అయినా సెన్సెక్స్ 61 వేలకు ఎగువన, నిఫ్టీ 18150స్థాయిని నిలబెట్టుకున్నాయి. ఫార్మా, మెటల్ సూచీల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అలాగే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, రేపు వెలువడనున్న యూఎస్ ద్రవ్యోల్బణం డేటాపై పెట్టుబడి దారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 152 పాయింట్లను కోల్పోయి 61033 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 18157 వద్ద ముగిసాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐటీసీ, హీరోమోటో, డా. రెడ్డీస్ లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, పవర్‌గగ్రిడ్, దివీస్ ల్యాబ్స్, టెక్ ఎం, గ్రాసిం భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45పైసలు ఎగిసి 81.44 వద్ద ముగిసింది. సోమవారం 81.92 వద్ద 82 మార్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. -
టైర్ల దిగ్గజం సియట్ ఆసక్తికర ఫలితాలు, లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 81 శాతం క్షీణించి కేవలం రూ.7.83 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,452 కోట్ల నుంచి రూ. 2,894 కోట్లకు ఎగసింది. ఇన్పుట్ ఖర్చులు తమ లాభాలను ప్రభావితం చేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,402 కోట్ల నుంచి రూ. 2,864 కోట్లకు పెరిగాయి. రానున్న రెండేళ్లలో అంబర్నాథ్ ప్లాంటులో రేడియల్ టైర్ల తయారీ సామర్థ్యాన్ని రోజుకి 55 టన్నులకు పెంచేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అదనంగా రూ. 396 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్టుబడులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. -
ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా: ఉద్యోగాల కోతపై మస్క్
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించారు. లేదు..లేదు అంటూనే ట్విటర్లో దాదాపు 50 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్న మస్క్ తాజా తొలగింపులపై ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఈ వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ తమకు ఇంతకుమించి వేరే మార్గంలేదని ప్రస్తుతం సంస్థ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడించారు. (ElonMusk ట్విటర్ డీల్: అమెరికా అధ్యక్షుడి మండిపాటు) నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, అంతకు మించి మరో మార్గం లేదని మస్క్ ట్వీట్ చేశారు. అయినా ఉద్యోగం కోల్పోయిన వారికి మూడు నెలల వేతనం చెల్లిస్తున్నామనీ. నిజానికి చట్టపరంగా చెల్లించాల్సిన దానికంటే 50 శాతం ఎక్కువేనని పేర్కొన్నారు. అలాగే కంటెంట్ నియంత్రణకు తాము కట్టబుడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వారంలో ద్వేషపూరిత ప్రసంగాలు ఈ వారంలో చాలా తగ్గాయంటూ ట్వీట్ చేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ బ్లాక్‌బస్టర్ టేకోవర్ తర్వాత కేవలం వారం లోజుల్లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు, 7500 మంది సిబ్బందిలో సగం మందిని శుక్రవారం తొలగించింది. దీనికి ముందు, ట్విటర్ ఆఫీసులకు ఆయా ఉద్యోగుల యాక్సెస్‌ను బ్యాన్ చేసింది. దీంతో ట్విటర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌మీడియాలో ఈ సమాచారాన్ని పంచుకోవడం వైరల్‌గా మారింది. ముఖ్యంగా అమెరికా, కెనడా ట్విటర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మిచెల్ ఆస్టిన్ తనను తొలగించడంపై విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day. Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required. — Elon Musk (@elonmusk) November 4, 2022 ట్విటర్ డీల్ తరువాత కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్న మస్క్ ఆమేరకు ట్విటర్ టీంలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్టమైన టార్గెట్లను విధించి, దానికిడెడ్లైన్ కూడా విధించిన సంగతి తెలిసిందే. పొదుపు చర్యల్లో భాగంగా కంపెనీ సీఈవో,టాప్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సాధారణ ఉద్యోగులను ఇంటికి పంపించారు. కొత్త కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ప్రతిపాదన, వెరిఫైడ్ ఖాతాల వినియోగదారుల నుండి నెలకు 8 డాలర్లు వసూలు, పొదుపు చర్యలు, ఉద్యోగులకు ఎక్కువ పనిగంటలు లాంటి చర్యలతో, అటు పొదుపు, ఇటు ఆదాయ ఆర్జనకు కొత్త మార్గాలను మస్క్ అన్వేషిస్తున్నారని భావిస్తున్నారు. Again, to be crystal clear, Twitter’s strong commitment to content moderation remains absolutely unchanged. In fact, we have actually seen hateful speech at times this week decline *below* our prior norms, contrary to what you may read in the press. — Elon Musk (@elonmusk) November 4, 2022 Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day. Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required. — Elon Musk (@elonmusk) November 4, 2022 -
వొడాఫోన్‌కు తప్పని నష్టాలు..ఏడు వేల కోట్లకుపైగా నష్టాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. రూ. 7,596 కోట్లకు చేరాయి. గత క్యూ2లో ఇవి రూ. 7,132 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం సుమారు 13 శాతం పెరిగి రూ. 9,406 కోట్ల నుంచి రూ. 10,614 కోట్లకు చేరింది. యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 19.5 శాతం పెరిగి రూ. 131కి చేరింది. సమీక్షాకాలంలో వొడాఫోన్ ఐడియా మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 24 కోట్ల నుంచి 23.44 కోట్లకు తగ్గినప్పటికీ 4జీ యూజర్ల సంఖ్య 15 లక్షలు పెరిగి 12 కోట్లకు చేరింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం (లీజులకు చెల్లించాల్సినది కాకుండా) రూ. 2,20,320 కోట్లకు చేరింది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించిన మొత్తం రూ. 1,36,650 కోట్లు (ఇటీవల కొన్న స్పెక్ట్రం కోసం కట్టాల్సిన రూ. 17,260 కోట్లు సహా), సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 68,590 కోట్లు ఉన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ. 15,080 కోట్లు కట్టాలి. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు 0.6 శాతం పెరిగి రూ. 8.6 వద్ద ముగిసింది. -
అదానీ ట్రాన్స్మిషన్: 32 శాతం లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ దిగ్గజం అదానీ ట్రాన్స్మిషన్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 289 కోట్లు ఆర్జించింది. అయితే రూ. 138 కోట్ల ఫారెక్స్ నష్టాలు(విదేశీ రుణాలపై ఎంటూఎం సర్దుబాటు) ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో ఇవి రూ. 6 కోట్ల లాభంగా నమోదైనందున ఫలితాలు పోల్చిచూడతగదని వివరించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,675 కోట్ల నుంచి రూ. 3,377 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 223.3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. గత క్యూ2లో 197.5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే విక్రయించింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించింది. నేటి(2) నుంచి ట్రాన్స్మిషన్ బిజినెస్‌కు సీఈవోగా విమల్ దయాల్, పంపిణీ విభాగ సీఈవోగా కందర్ప్ పటేల్‌ను బోర్డు ఎంపిక చేసింది. అనిల్ సర్దానా కంపెనీ ఎండీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. -
మాక్రోటెక్ డెవలపర్స్‌కు రూ.933 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా బ్రాండ్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.933 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. తన బ్రిటిష్ అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణానికి సంబంధించి రూ.1,177 కోట్లు కేటాయింపులు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు దారితీసినట్టు సంస్థ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.223 కోట్లుగా ఉండడం గమనించాలి. రుణానికి కేటాయింపులు, ఫారెక్స్ ప్రభావాలను పక్కన పెట్టి చూస్తే నికర లాభం 28 శాతం పెరిగి రూ.367 కోట్లుగా ఉంటుందని మాక్రోటెక్ డెవలపర్స్ వివరించింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,137 కోట్ల నుంచి రూ.1,761 కోట్లకు పరిమితమైంది. బ్రిటన్‌లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గాను లోధా డెవలపర్స్ యూకేకు గ్రూపు రుణాలు ఇవ్వాల్సి వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుతమున్న భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తదితర పరిస్థితులు తమ రుణాలపై ప్రభావం చూపించినట్టు వివరించింది. ఎన్సీడీల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
Bharat Jodo Yatra: చిన్న వ్యాపారాలపై బీజేపీ దెబ్బ: రాహుల్
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి భారత్‌ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్‌కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది. -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్‌యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్‌లో చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
నష్టాల బాటలోనే ఎయిర్‌లైన్స్
ముంబై: కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. కరోనా వైరస్ నియంత్రణ ఆంక్షల నడుమ పరిమిత సర్వీసులతో, విమానయాన సంస్థలు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీనికితోడు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా గరిష్ట స్థాయలో చలిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.15,000–17,000 కోట్ల నష్టాలను నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ రంగం నష్టాలు రూ.23,000 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. పరిశ్రమ మొత్తం రుణ భారం 2023 మార్చి నాటికి రూ.లక్ష కోట స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో అస్థిరతలు, ఏటీఎఫ్ ధరల్లో హెచ్చు తగ్గుల ప్రభావం ఎయిర్‌లైన్స్ వ్యయాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కోసం ఖర్చు చేసేది 45 శాతంగా ఉంటుందని తెలిసిందే. ఇది కాకుండా ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చుల్లో 35–50 శాతం మేర డాలర్ మారకంలోనే ఉంటాయని ఇక్రా గుర్తు చేసింది. ప్రయాణికుల్లో వృద్ధి.. లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అయిన ఇండిగో ప్రస్తుత ఆర్థిక సంవ్సరం మొదటి మూడు నెలల కాలానికి (జూన్ క్వార్టర్) రూ.1,064 కోట్లు, స్పైస్‌జెట్ రూ.789 కోట్ల చొప్పున నష్టాలను ప్రకటించాయి. రూపాయి బలహీనత, ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్టు ఇక్రా తెలిపింది. ప్రయాణికుల సంఖ్య 57.7 శాతం పెరిగి 8.42 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణికుల్లో మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ 2022–23లో రూ.17,000 కోట్ల వరకు నష్టాలు తప్పుకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య, వార్షికంగా అంతకుముందు ఇదే ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగి 3.25 కోట్లుగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. కాకపోతే కరోనా ముందు 2019 ఏప్రిల్–జూన్‌లోని ప్రయాణికుల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తక్కువని వివరించింది. కరోనా వైరస్ సమసిపోవడంతో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 52–54 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. లీజర్, వ్యాపార పర్యటనలకు డిమాండ్ ఉండడం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31 నుంచి విమాన టారిఫ్‌లపై నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు 25–30 శాతం పెరిగినట్టు ఇక్రా తెలిపింది. దీంతో తీవ్ర పోటీ తగ్గొచ్చని అంచనా వేసింది. -
అమ్మకాల సెగ, భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైన నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 259 పాయింట్లు కుప్పకూలి 58937 వద్ద,నిఫ్టీ 70 పాయింట్టు నష్టపోయి 17585 వద్ద కొనసాగుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ ఇలా దాదాపు అన్ని రంగాలు అమ్మకాలను చూశాయి. అయితే సిమెంట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. శ్రీసిమెంట్స్, ఆషియన్స్‌పెయింట్స్, టాటా, కోల్ ఇండియా లాభపడుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంకు,భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, టెక్‌మహీంద్ర రిలయన్స్, నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి మరింత బలహీన పడింది. 12 పైసల నష్టంతో 79.93వద్ద ఉంది. మంగళవారం 79.84 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ఐటీ బేజారు: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి మార్చాయి.సెన్సెక్స్ 212 పాయింట్లు నష్టపోయి 58,640వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 17,462 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ షేర్లు కుదేలయ్యాయి. అయితే ఆటో, నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నెస్లే ఇండియా, యూపీఎల్ షేర్లు లాభపడుతున్నాయి. మరోవైపు ఎన్టీపీసీ, అదానీ, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ నష్ట పోతు న్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు లాభంతో 79.52 వద్ద కొనసాగుతోంది. మొహర్రం కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లకు మంగళంవారం సెలవు. -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
అలీబాబా షాకింగ్ నిర్ణయం.. అయ్యో ఎంత పనిచేసింది!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా అధినేత, బిలియనీర్ జాక్ మా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 10వేల మంది ఉద్యోగులకుఉద్వాసన పలికినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు అమ్మకాలు క్షీణించి, భారీ నష్టాల కారణంగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్ చైనాలో తీవ్ర ఆంక్షలు, నష్టాలు, ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేపింది. (మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?) అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. జూన్ త్రైమాసికంలో 9,241కు పైగా ఉద్యోగులను తొలిగించింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 245,700కి పడిపోయింది. అంతేకాదు 2016 మార్చి తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. మరోవైపు జూన్ త్రైమాసికంలో అలీబాబా నికర ఆదాయం 50 శాతం తగ్గి 22.74 బిలియన్ యువాన్లకు (3.4 బిలియన్లు డాలర్లు) గత ఏడాది ఇదే కాలంలో 45.14 బిలియన్ యువాన్ల నుండి తగ్గింది. అయితే ఈ ఏడాది దాదాపు 6 వేల ఫ్రెష్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను తమ హెడ్‌కౌంట్‌లో చేర్చుకోనున్నట్లు అలీబాబా చైర్మన్, సీఈఓ డేనియల్ జాంగ్ యోంగ్ తెలిపారు. (పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్లు!) కాగా 1999లో స్థాపించిన అలీబాబా గ్రూపు చైనాలో తిరుగులేని సంస్థగా రాణించింది. సంస్థ పునర్వవస్థీకరణలో భాగంగా 2015లో డేనియల్ జాంగ్‌కు సీఈఓగా ,2019లో ఛైర్మన్‌గా బాధ్యతలను అప్పగించారు జాక్ మా. చైనా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలపైనా అలీబాబా ఫౌండర్ జాక్‌మా విమర్శలు నేపథ్యంలో అలీబాబా, ఆంట్ గ్రూప్‌ల సంస్థలను అక్కడి ప్రభుత్వం టార్గెట్ చేసింది. గత నెలలో, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ఒత్తిడి మధ్య జాక్‌మా యాంట్ గ్రూప్‌పై తన నియంత్రణను వదులుకోవాలనే యోచనలో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిది.ఓటింగ్ పవర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ జింగ్‌తో సహా ఇతర యాంట్ అధికారులకు బదిలీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. -
పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..
సాక్షి ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.380 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం 89 శాతం పెరిగి రూ.1,680 కోట్లుగా నమోదైంది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ రెట్టింపై రూ.3లక్షలకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. (ఇది చదవండి: ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్) పోస్ట్‌పెయిడ్ లోన్లు సంవత్సరానికి 486 శాతం పెరిగగా, పంపిణీ చేసిన రుణాల విలువ ఏడాది క్రితం రూ.447 కోట్లతో పోలిస్తే 656 శాతం పెరిగి రూ.3,383 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వ్యాపారం బాగా పెరిగిందని Paytm తెలిపింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం రూ.5,554 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ పంపిణీ చేసిన రుణాలు రూ.632 కోట్లతో పోలిస్తే రుణ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. వార్షికంగా చూస్తే రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉంటుందని పేటీఎం పేర్కొంది. చదవండి: కోవిడ్‌సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
ఆర్బీఐ వడ్డింపు గుబులు: నష్టాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 230 పాయింట్ల దాకా కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 94 పాయింట్ల నష్టంతో 55675 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి16569 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 56వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ నిఫ్టీ 16,600 దిగువన ముగిసింది. ఐటీ, మెటల్స్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా రానున్న పాలసీ రివ్యూ లో మరోసారి వడ్డీ రేటుపెంపు ఉంటుందన్న అంచనాలు మార్కట్ వర్గల్లో నెలకొన్నాయి. జూన్ 8న జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫలితాలపై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. టెక్ మహీంద్రా భారీగా నష్టపోయింది. ఇంకా విప్రో, బీపీసీఎల్, బ్రిటానియా,బజాజ్ ఫిన్సర్వ్ కూడా నష్టపోయాయి. అలాగే ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఆటో, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా,ఓఎన్జీసీ, సిప్లా ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం,యాక్సిస్ బ్యాంక్ , సన్ ఫార్మా లాభపడ్డాయి. -
ముడి చమురు సెగ: నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్‌పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కదలాడుతోంది. రంగాల వారీగా ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అలాగే గత క్వార్టర్‌తో పోలిస్తే లాభాలు క్షీణించడంతో ఎల్ఐసీ షేర్లు 2శాతం నష్ట పోతున్నాయి. మార్చి త్రైమాసికంలో రూ. 2,371.55 నికర లాభాన్ని నివేదించింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ. 2,893 కోట్ల నికర లాభంతో పోలిస్తే 18 శాతం తగ్గింది. సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, టైటన్, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్ టెక్ మహీంద్రా 1-2 శాతం పతనమై టాప్‌లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే లాభపడుతున్నాయి. -
నష్టాల్లోకి సన్ ఫార్మా
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,277 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 894 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అనుకోని నష్టం ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,464 కోట్ల నుంచి రూ. 9,386 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3,273 కోట్ల లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 2,904 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. క్యూ4లో మొత్తం రూ. 3,936 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు సన్ ఫార్మా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 888 వద్ద ముగిసింది. -
జొమాటోకుషాక్, షేర్లు జంప్, కొనుక్కోవచ్చా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వరుస నష్టాల షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో నికర నష్టం భారీగా మూడురెట్లు పెరిగి రూ. 360 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020-21) ఇదే కాలంలో రూ. 134 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 692 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 885 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ. 1,225 కోట్లను దాటింది. 202021లో రూ. 816 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,994 కోట్ల నుంచి రూ. 4,192 కోట్లకు ఎగసింది. కంపెనీ తిరిగి వృద్ధి బాట పట్టినట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఫలితాల విడుదల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కోవిడ్ తదుపరి సవాళ్లు బిజినెస్ వృద్ధిపై ఎలాంటి ప్రతికూలతలూ చూపించబోవని అంచనా వేశారు. వృద్ధిని కొనసాగించడం, నష్టాలను తగ్గించుకోవడం తదితర దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం జొమాటో షేరు 2.2 శాతం క్షీణించి రూ. 57 వద్ద ముగిసింది. అయితే మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 17 శాతం ఎగిసింది. ప్రస్తుతం 8శాతం లాభాలతో కొనసాగుతోంది. ట్రేడ్పండితులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించడంతో పేర్కొనడంతో కొనుగోళ్ల జోరు నెలకొంది. -
మెటల్ షాక్: నష్టాల్లోకి స్టాక్‌మార్కెట్లు
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 114పాయింట్ల నష్టంతో 54173వద్ద నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 16169 వద్ద ట్రేడింగ్‌ను కొన సాగిస్తున్నాయి. మెటల్ స్టాక్స్ రికవరీతో ఓపెనింగ్‌లో మంగళవారం ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్కు తయారీ ముడిసరుకులపై కేంద్రం ఎగుమతి సుంకాలను విధించడంతో గత సెషన్లో మెటల్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. 1.56 శాతం లాభంతో M&M టాప్ గెయినర్‌గా ట్రేడ్ అవుతోంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
‘చార్మినార్’లో సగం గాయబ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ నష్టాల్లో చార్మినార్ డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీ అండ్ సీ లాసెస్) 50.63శాతంగా నమోదయ్యాయి. అంటే సరఫరా చేసిన విద్యుత్‌కుగాను బిల్లులు వచ్చింది సగం మేర మాత్రమే. ఇక వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లలో సైతం 30–40శాతం ‘ఏటీఅండ్‌సీ’నష్టాలు రావడం గమనార్హం. 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలానికి సంబంధించి.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదికలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. మొత్తంగా ఎస్పీడీసీఎల్ 13.05శాతం, ఎన్పీడీసీఎల్ 9.46 శాతం ఏటీ అండ్ సీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అన్నిరకాలుగా నష్టం చార్మినార్ డివిజన్ పరిధిలో 247.89 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను సరఫరా చేయగా.. 116.29 ఎంయూల మీటర్డ్ సేల్స్ (వినియోగదారులు వాడినట్టుగా మీటర్లలో నమోదైన లెక్క) మాత్రమే జరిగాయి. మిగతా 131.60 ఎంయూ (53శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) నష్టాలు వచ్చాయి. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో జరిగే నష్టాలను కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలు’అంటారు. ఇక రూ.78.89 కోట్ల బిల్లులకుగాను రూ.83.02 కోట్లు (105 శాతం) వసూలయ్యాయి. ఇక్కడ మొత్తంగా ఏటీఅండ్ టీ నష్టం 50.63శాతంగా నమోదైంది. (సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతోపాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి ఏటీఅండ్‌సీ నష్టాలు అంటారు.) ► నాగర్‌కర్నూల్ డివిజన్లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఏడుశాతమే నమోదైనా.. రూ.252.7 కోట్ల బిల్లులకు గాను రూ.166.55 కోట్లు (65.9శాతం) మాత్రమే వసూలయ్యాయి. మొత్తం నష్టం 39.01 శాతంగా నమోదైంది. ► ఇదే తరహాలో టీఅండ్‌డీ నష్టాలు తక్కువగానే ఉన్నా.. బిల్లుల వసూలు సరిగా లేక.. వనపర్తి డివిజన్లో 37.63 శాతం, సిద్దిపేట డివిజన్లో 31.87 శాతం, గజ్వేల్ డివిజన్లో 28.71%, దేవరకొండ డివిజన్లో 25.42%, గద్వాల డివిజన్లో 24.58%, తాండూరు డివిజన్లో 19.96% ఏటీఅండ్ టీ నష్టాలు నమోదయ్యాయి. ► బిల్లుల వసూళ్లు బాగానే ఉన్నా.. కీలకమైన సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యం (టీఅండ్‌డీ) నష్టాలే ఎక్కువగా ఉండటంతో ఆస్మాన్‌గఢ్ (33.33శాతం), బేగంబజార్ (26.94 శాతం) తదితర డివిజన్లలో నష్టాలు ఎక్కువగా నమోదయ్యాయి. -
కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ మహమ్మారి వల్ల వాటిల్లిన నష్టాలను పూడ్చుకోవడానికి 12 ఏళ్లు పట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కాలంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తి నష్టం జరిగిందని అంచనా వేసింది. ‘‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతరాయాల కారణంగా ప్రపంచ, దేశీయ వృద్ధికి ఆటంకాలు అధికం అవుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతంగా ఉంటుందని ఊహిస్తే.. భారత్ 2034–35లో కోవిడ్ నష్టాలను అధిగమించగలదని అంచనా’’ అని నివేదిక వివరించింది. ఆర్బీఐలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్ బృందం ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఇవి పూర్తిగా రచయితల అభిప్రాయాలేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అంతేగాక రష్యాకు కనీవినీ ఎరగని స్థాయిలో నష్టాలు కలిగించింది. అగ్రరాజ్యం అమెరికా పుష్కలంగా అందిస్తున్న అండదండలే ఇందుకు చాలావరకు కారణం. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకున్నా ఉక్రెయిన్‌కు భారీగా సాయుధ సాయం చేస్తోంది. ప్రధానంగా యూఎస్ నుంచి వస్తున్న ఆయుధాలతోనే రష్యా దాడులను ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఈ రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు అమెరికా ఏకంగా 340 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేసింది. ఎనిమిదో విడత సాయంగా తాజాగా మరో 80 లక్షల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించింది. వాటికి తోడు ఇంకా భారీగా ఆయుధాలను పంపుతోంది. ► రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అమెరికా పంపిన జావెలిన్ క్షిపణులు. సులువుగా భుజం మీద మోసుకెళ్లగలిగే ఈ పోర్టబుల్ క్షిపణుల సాయంతో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించవచ్చు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 6,000 జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను సరఫరా చేసింది. ఇవే రష్యా సైన్యానికి పెను సవాలుగా మారాయి. ► 1,44,000 రౌండ్లను కాల్చే సామర్థ్యమున్న డజన్ల కొద్దీ అత్యాధునిక శతఘ్నులను కూడా అమెరికా అందజేసింది. ► అఫ్గానిస్తాన్ యుద్ధంలో వాడిన మరెన్నో అత్యాధునిక రైఫిల్స్, 3 వేలకుపైగా బాడీ ఆర్మర్ సెట్స్, హెలికాఫ్టర్లు, రాడార్ వ్యవస్థలు, సాయుధ వాహనాలను కూడా భారీగా పంపింది. ► వందల సంఖ్యలో 200 ఎం113 సాయుధ వాహనాలను సమకూర్చింది. 90 శతఘ్ని విధ్వంసక వ్యవస్థలను కూడా ఇచ్చింది. దాంతో ఉక్రెయిన్‌కు రష్యా హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం సమకూరింది. ► రష్యా శతఘ్నల్ని ఎదుర్కోనేలా 10 రాడార్ వ్యవస్థలను కూడా పంపింది. ► అత్యాధునిక ఎంఐ–17 హెలికాప్టర్లను పంపేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది. ► 4 కోట్ల రౌండ్ల చిన్న మారణాయుధాలు, భారీగా అత్యాధునిక రైఫిల్స్, పిస్టల్స్, మిషన్ గన్లు, షాట్ గన్స్, 10 లక్షలకు పైగా గ్రెనేడ్లు ఈ 2 నెలల్లో యూఎస్ నుంచి అందాయి. ► తూర్పున డోన్బాస్లో రష్యా దాడుల్ని ముమ్మరం చేస్తూండటంతో ఉక్రెయిన్ అవసరాలకు తగ్గట్టుగా అమెరికా వాయుసేన ప్రత్యేకంగా తయారు చేసిన 121 డ్రోన్లను తాజాగా పంపినట్టుగా పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. వీటి వాడకంలో శిక్షణ ఇవ్వడానికి డా ఒక బృందం ఉక్రెయిన్‌కి వెళ్తోంది కూడా. మరో 300 స్విచ్ బ్లేడ్ డ్రోన్లు కూడా ఇప్పటికే కీవ్ చేరుకున్నాయి. మరిన్ని డ్రోన్లు పంపేందుకు కూడా యూఎస్ సిద్ధమవుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఎదురుదాడి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కాలు దువ్వి సరిగ్గా రెండు నెలలైంది. ఇన్ని రోజుల్లోనూ ఉక్రెయిన్ను అన్నివిధాలా అతలాకుతలం చేయడం తప్ప పెద్దగా సాధించిందేమీ లేకపోగా సైనికంగా కనీవినీ ఎరుగని నష్టాలను మూటగట్టుకుంది. దీనికి తోడు పశ్చిమ దేశాల ఆంక్షలతో అతలాకుతలమవుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకుని గౌరవప్రదంగా యుద్ధానికి తెర దించాలన్న రష్యా ప్రయత్నాలూ సులువుగా ఫలించేలా కన్పించడం లేదు. అక్కడ శనివారం రష్యా దాడులను ఉక్రెయిన్ సైనికులు దీటుగా తిప్పికొట్టడమే గాక 9 యుద్ధ ట్యాంకులను, 18 సాయుధ యూనిట్లను, 13 సాయుధ వాహనాలను, 3 ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. దాంతో రష్యా దళాలు బాగా నెమ్మదించాయి. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, బ్లింకెన్ ఆదివారం ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. మారియుపోల్‌పై దాడులు మారియుపోల్‌ను ఆక్రమించామని పుతిన్ ప్రకటించినా అక్కడ పోరు కొనసాగుతూనే ఉందని ఇంగ్లండ్ రక్షణ శాఖ అంటోంది. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని నగర మేయర్ చెప్తున్నారు. నగర టీవీ టవర్‌పై రష్యా అనుకూల డొనెట్స్క్ వేర్పాటువాదుల జెండా ఎగురుతున్న దృశ్యాన్ని రష్యా అధికార చానల్ ప్రసారం చేసింది. నగరం నుంచి పౌరులను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నగరంలో 45 మీటర్లకు పైగా పొడవున్న మరో సామూహిక సమాధి బయటపడింది. అందులో వెయ్యికి పైగా పౌరుల శవాలుంటాయని భావిస్తున్నారు. మరోవైపు ఖర్కీవ్ తదితర నగరాలపైనా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నల్లసముద్రం నుంచి ఒడెసాపైకి రష్యా ఆరుకు పైగా క్షిపణులను ప్రయోగించగా చాలావాటిని కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఆంక్షలతో రష్యా కుదేలు న్యూయార్క్: పాశ్చాత్య దేశాల ఆంక్షలను తట్టుకున్నామని పుతిన్ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా, అవి రష్యాను బాగా కుంగదీస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ‘‘ద్రవ్యోల్బణం 17.3 శాతానికి చేరింది. కంపెనీలు మూతపడుతున్నాయి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. అవ్యవసర మందులతో సహా అన్నింటికీ తీవ్ర కొరత ఏర్పడింది’’ అని చెబుతున్నారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని మాస్కో మేయరే అంగీకరించారు. మరో నెల గడిస్తే ఆంక్షల ప్రభావం తీవ్రతరమవుతుందని అంటున్నారు. పుతిన్‌తో త్వరలో గుటెరస్ భేటీ ఐరాస: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వచ్చే వారం రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న మాస్కోలో పుతిన్‌తో, 28న ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీలతో ఆయన చర్చిస్తారు. ‘మాస్క్వా’లో 27 మంది గల్లంతు గత వారం తమ యుద్ధ నౌక మాస్క్వా మునిగిపోయిన దుర్ఘటనలో సిబ్బందిలో ఒకరు మరణించారని, 27 మంది గల్లంతయ్యారని రష్యా ఎట్టకేలకు ప్రకటించింది. 396 మందిని కాపాడినట్టు వివరించింది. నౌకలో ఉన్న 500 పై చిలుకు సిబ్బందిలో చాలామంది మరణించి ఉంటారని వార్తలు రావడం, వాటిని రష్యా ఖండించడం తెలిసిందే. సర్మాట్ మోహరింపు! ఇటీవల పరీక్షించిన ఖండాంతర అణు క్షిపణి సర్మాట్ను రష్యా త్వరలో మోహరించనుంది. మాస్కోకు 3,000 కిలోమీటర్ల దూరంలోని మిలిటరీ యూనిట్‌కు వీటిని అందజేస్తారని రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ద్మత్రీ రొగోజిన్ తెలిపారు. -
ఆటో, బ్యాంకు షేర్లు పడేశాయ్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి. ‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు. ► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది. ► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్డీఎఫ్సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
-
మార్కెట్లో మరో బ్లాక్ మండే
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర పాలసీకి మొగ్గుచూపుతుండటంతో ఈక్విటీ మార్కెట్ మరో బ్లాక్ మండేను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజూ పైపైకి ఎగబాకుతోంది. వీటిని అదుపులో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులు బాండ్ల వైపు మళ్లుతున్నాయి. ఈనెల పదో తేదీ నుంచి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వు అనుకున్న దానికంటే వేగంగా వడ్డీరేట్లను పెంచవవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నీ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని స్టాక్ నిపుణులు తెలిపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,024 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,621 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 17,214 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల భారీ అమ్మకాలు ఒత్తిడికిలోనయ్యాయి. ఎస్బీఐ రికార్డు ర్యాలీ అండతో ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ సూచీలో ఐదుశాతం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు రెండు శాతం వరుకు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1157 కోట్ల షేర్లను, డీఐఐలు రూ. 1376 కోట్ల షేర్లను అమ్మేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 17 పైసలు క్షీణించి 74.60 వద్ద స్థిరపడింది. లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో సోమవారం ఫారెక్స్, మనీ మార్కెట్లు పనిచేయలేదు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ‘గతవారంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల నుంచి 5% శాతానికి పెంచింది.పాలసీ ప్రకటన సందర్భంగా పావెల్ వ్యాఖ్యలతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ మార్చిలో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చనే స్పష్టత వచ్చింది. దేశంలో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదునెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 95 డాలర్లకు ఎగసిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడి (గురువారం) అయ్యేంత వరకు మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది’ జియోజిత్ ఫైనాన్షియన్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్రాష్ ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలతో ఉదయం సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 58,550 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పతనంతో 17,516 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గంట గంటకూ అమ్మకాల ఉధృతి పెరుగుతుండటంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్షీణించి 57,299 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 17,119 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలు పెరిగినట్లు ప్రకటించడంతో పేటీఎం షేరు ఇంట్రాడేలో ఆరుశాతం క్షీణించి రూ.899 వద్దకు దిగివచ్చింది. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పూడ్చుకొని అరశాతం స్వల్పలాభంతో రూ.957 వద్ద స్థిరపడింది. ► ఇదే క్యూ3లో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వరంగ ఎస్బీఐ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో మూడున్నరశాతం ఎగసి రూ.549 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణతో చివరికి అరశాతం లాభంతో 533 వద్ద స్థిరపడింది. ► మూడో త్రైమాసికంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇండిగో, లుపిన్ షేర్లు వరుసగా ఎనిమిది, పదిశాతం చొప్పున క్షీణించాయి. ► వీఐఎక్స్ ఇండెక్స్ ఎనిమిది శాతం పెరిగి 20.44 స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో మరో ముప్పై రోజుల తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సూచిస్తోంది. 3 రోజుల్లో రూ. 6 లక్షల కోట్లు హుష్ గత 3 రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1,937 పాయింట్లు, నిఫ్టీ 566 పాయింట్లు చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో రూ.ఆరు లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.270 కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
రక్త కన్నీరు! భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూస్తున్నారు. స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు నష్టపోతున్నాయి. రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఒమిక్రాన్ వ్యాప్తి, ఫెడ్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు తదితర అంశాలతో అంతర్జాతీయ మార్కెట్లో కుదుపుకు లోనవుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాలోని సెన్సెక్స్, నిఫ్టీ సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది. వెయ్యికి పైగా పాయింట్లు కోత బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు సగం సెషన్ పూర్తయ్యే సరికే వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1182 పాయింట్లు నష్టపోయి 57,854 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. లార్జ్ క్యాప్ కంపెనీల షేర్ల ధరలో 2 శాతం క్షీణత నమోదు అయ్యింది. మీడియం, స్మాల్ కేటగిరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు నిఫ్టీ 370 పాయింట్లు నష్టపోయి 17,246 దగ్గర కొట్టుమిట్టాడుతోంది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో నిఫ్టీ సుమారు 1100 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 2500కి వరకు పాయింట్లను కోల్పోయింది. గడిచిన వారం రోజుల్లో 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి అయ్యింది. ర్యాలీలో వచ్చిందంతా గతేడాది తొలి త్రైమాసికంలో సెన్సెక్స్ 50వేల మార్క్‌ని క్రాస్ చేసింది. అప్పటి నుంచి నవంబరు మధ్య వరకు బుల్ ర్యాలీ కొనసాగింది. దీంతో సెన్సెక్స్ ఆరు నెలల కాలంలోనే ఏకంగా పది వేల పాయింట్లు లాభపడింది. నిఫ్టీ సైతం 16 వేల నుంచి 19 వేల వరకు చేరుకుంది. ఆ బుల్‌ర్యాలీలో విపరీతంగా లాభపడిన షేర్ల ధరలు ఇప్పుడు కోతకు గురవుతున్నాయి. నవంబరు మధ్య నుంచి కరెక్షన్ మొదలవగా జనవరిలో ఒమిక్రాన్, రష్యా అమెరికా ఉద్రిక్తతలు మార్కెట్‌పై పను ప్రభావం చూపుతున్నాయి. ఐపీవో సందర్భంగా ఆసక్తి రేపిన జోమాటో, పేటీఎం షేర్ల ధరలు కనిష్ట స్థాయిల వద్ద నమోదు అవుతున్నాయి. -
జర్నీకి ఝలక్.. సగానికి పైగా బస్సులు ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: చాలా రోజులుగా పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు కోవిడ్ మూడో ఉధృతి మరింత గట్టి షాక్‌నిచ్చింది. సంక్రాంతి వరకు సిటీ బస్సులు కళకళలాడాయి. గత వారం రోజులుగా ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిటీ బస్సులు సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి. బస్సెక్కేవారేరీ... ► నగరంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా తగ్గాయి. రోజు రోజుకూ కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండంతో జనం స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. అవసరమైతేనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సెక్కేవారి సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్న వారు సైతం తప్పనిసరి అవసరాలకే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపైన వాహనాల రద్దీ కూడా తగ్గింది. ► సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 2750 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 30వేల ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం అన్ని రూట్లలోనూ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించారు. నగర శివార్లలోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించే విద్యార్ధుల కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 1500 బస్సులు నడిచేవి. ► ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తిరిగి ఆన్లైన్ బోధన ప్రారంభించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు.మరోవైపు కోవిడ్ నేపథ్యంలోనే అనేక సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. దీంతో సిటీ బస్సుల వినియోగం చాలా తగ్గింది . పడిపోయిన ఆక్యుపెన్సీ... ► సంక్రాంతికి ముందు ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 45శాతానికి తగ్గినట్లు అంచనా. ► కొన్ని రూట్లలో ఇంధనం ఖర్చులు కూడా లభించడం లేదని, ట్రిప్పులను రద్దు చేసుకోవలసి వస్తుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదేబాటలో క్యాబ్‌లు... ► క్యాబ్‌లలోనూ ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. ఐటీ కారిడార్లకు ప్రయాణాలు తగ్గాయి. గతంలో రోజుకు 60 వేల క్యాబ్‌లు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 30వేలకు పడిపోయిందనిడ్రైవర్లు చెబుతున్నారు. ► క్యాబ్‌లు నడిపేందుకు ఓలా, ఉబర్ సంస్థలు సరైన సదుపాయాలు కల్పించడం లేదని తెలంగాణ క్యాబ్ అండ్ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ జేఏసీ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ తెలిపారు. రవాణా రంగంపై మరోసారి కోవిడ్ పిడుగు పడింది. కొద్ది రోజులుగా పెరిగిన కరోనా ఉధృతితో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. విమానాలు, రైళ్లతో పాటు బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పడింది. ఇదిలా ఉండగా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. సర్వీసులు ప్రారంభించిన కొద్ది రోజులకే విమానయానరంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌కు తగ్గిన నష్టాలు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీస్ నష్టాలు కొంత తగ్గి రూ. 4,748 కోట్లకు పరిమితమయ్యాయి. ఆదాయం 49 శాతం పెరిగి రూ. 16,200 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర నష్టం రూ. 5,849 కోట్లు కాగా ఆదాయం రూ. 10,848 కోట్లు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ సమర్పించిన పత్రాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం సమీక్షా కాలంలో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మొత్తం వ్యయాలు రూ. 16,877 కోట్ల నుంచి రూ. 21,127 కోట్లకు చేరాయి. ఉద్యోగులపై వ్యయాలు రూ. 1,383 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మాతృ సంస్థ నుంచి అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మూడు విడతల్లో రూ. 4,360 కోట్లు సమకూర్చుకుంది. ప్రతిగా అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్డాట్కామ్డాట్ ఐఎన్సీఎస్లకు 2020 జూన్‌లో రూ. 2,310 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 1,125 కోట్లు, డిసెంబర్లో రూ. 925 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది. -
ఎత్తిపోతల్లో మునిగిన డిస్కంలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల పథకాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గుదిబండగా మారుతున్నాయా? ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న డిస్కంలను మరింతగా కుంగదీస్తున్నాయా? దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఎనర్జీ అడిట్ నివేదిక అవుననే సమాధానం చెబుతోంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేస్తుండగా, గతంలో ఒక్క హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోనే అసాధారణ రీతిలో విద్యుత్ నష్టాలు జరిగేవి. అయితే తాజాగా చార్మినార్ డివిజన్లో 35.73 శాతం, అస్మాన్‌గఢ్‌లో 35.01 శాతం, గజ్వేల్‌లో 35.5 శాతం, సిద్దిపేటలో 32.31 శాతం విద్యుత్ సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్) నష్టాలున్నట్టు 2021 జూలై –సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నివేదిక వెల్లడించింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు సంబంధిం చిన పంప్‌హౌస్‌ల కరెంట్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడంతోనే ఓల్డ్‌సిటీకి సమానంగా ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏటీఅండ్‌సీ (అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్) నష్టాలు పెరిగిపోయినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతిక లోపాలతో జరిగే విద్యుత్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని ఏటీఅండ్‌సీ లాసెస్ అంటారు. భారీగా కొనుగోలు.. అరకొరగా బిల్లులు! ఎత్తిపోతల పథకాల నిర్వహణకు డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కరెంట్ బిల్లులను చెల్లించడం లేదు. దీంతో ఎత్తిపోతల పథకాల కనెక్షన్ల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు, వాటిపై చెల్లించాల్సిన అపరాధ రుసుం (డిలేయ్డ్ పేమెంట్ సర్‌చార్జీ)లు రూ.వందల నుంచి రూ.వేల కోట్లకు ఎగబాకి డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 132 కేవీ లోడ్ సామర్థ్యం గల 18 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లుండగా, గత జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 476.04 ఎంయూల విద్యుత్‌ను వినియోగం జరిగింది. మరో 11 కేవీ లోడ్ సామర్థ్యం కలిగిన 130 కనెక్షన్లుండగా, 7.99 ఎంయూలు, 33 కేవీ సామర్థ్యం లోడ్ కలిగిన 19 కనెక్షన్లుండగా 2.69 ఎంయూల విద్యుత్‌ను వాడినట్టు ఆడిట్ రిపోర్టు వెల్లడించింది. -
ఓల్డ్ సిటీకి పోటీగా గజ్వేల్, సిద్దిపేట.. ఏ విషయంలో అంటే?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యం, బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థత వెరసి విద్యుత్ శాఖను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. పలు డివిజన్లలో ఇలాంటి కారణాలతో సంస్థకు కోట్ల రూపాయలు లోటు వస్తోంది. వీటిలో ఇప్పటిదాకా ఓల్డ్ సిటీ ముందుండగా.. దీనికి పోటీగా గజ్వేల్, సిద్ది పేట కూడా ఉండటం గమనార్హం. దక్షిణ తెలంగాణ లోని 5 ఉమ్మడి జిల్లాల పరి ధిలో అత్యధిక విద్యుత్ నష్టాలు చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట డివిజన్లలో నమోదయ్యాయి. చార్మినార్ డివిజన్లో 35.73%, గజ్వేల్‌లో 35.5%, ఆస్మాన్‌గఢ్‌లో 35. 01%, సిద్దిపేటలో 32.31% సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్) నష్టాలు జరిగినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్వ హించిన తొలి త్రైమాసిక ఎనర్జీ ఆడిట్లో బహిర్గత మైంది. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సం స్కరణల అమల్లో భాగంగా సంస్థ ఎనర్జీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. 2021 జూలై 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నిర్వహించి గురువారం నివేదికను ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఏటీఅండ్‌సీ నష్టాలు 10.63% ఉండ డం గమనార్హం. సాంకేతిక లోపాలతో జరిగే విద్యు త్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని సాంకేతిక పరిభాషలో ‘అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ (ఏటీఅండ్‌సీ) లాసెస్’అంటారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 20 సర్కిళ్లు, 50 డివిజన్లు, 1,01,32,163 మంది వినియోగదారులు ఉన్నారు. అధిక ఏటీఅండ్ సీ నష్టాలు ఇక్కడే... ► చార్మినార్ డివిజన్‌కు 198.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ సరఫరా చేయగా, వినియోగదారుల మీటర్ల నుంచి తీసిన లెక్కల ప్రకా రం 122.7ఎంయూల అమ్మకాలే జరిగాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల రూపంలో 76.04(38%) ఎంయూల విద్యుత్ నష్టమైంది. అయితే, ఈ జోన్ పరిధిలో మీటర్డ్ సేల్స్‌కి జారీ చేసిన బిల్లులకు 104% వసూళ్లు జరిగాయి. గృహాల నుంచి 107.47% కలెక్షన్ ఉంది. ► గజ్వేల్ డివిజన్‌కు 399.44 ఎంయూల విద్యుత్ సరఫరా కాగా, 201.9 ఎంయూలు మీటర్డ్ సేల్స్, 171.72 ఎంయూలు అన్‌మీటర్డ్ సేల్స్(మీటర్ లేని వ్యవసాయ పంప్ సెట్లకు) జరిగా యి. సాంకేతికంగా 25.7 శాతం నష్టాలు నమోద య్యాయి. మొండిబకాయిలతో ఏటీఅండ్‌సీ నష్టాలు 35.5 శాతానికి పెరిగాయి. గృహాలు 102.19%, రైతులు 64.54%, ఎల్టీ కమర్షియల్/ ఇండస్ట్రీలు 105.68%, హెచ్‌టీ కమర్షియల్/ఇండస్ట్రీలు 90.27% బిల్లులు చెల్లించగా, ఇతరులు మాత్రం 38.01 శాతమే బిల్లులు చెల్లించారు. ► దక్షిణ హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆస్మాన్‌గఢ్ డివిజన్‌కు 176.5 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 107.26 ఎంయూలకే బిల్లింగ్ జరిగింది. అంటే 69.55 ఎంయూ (39%)ల విద్యుత్ నష్టపోయింది. ఏటీఅండ్‌సీ నష్టాలు 35.01% ఉన్నాయి. ► బేగంబజార్ డివిజన్‌కు 120.95 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 42.05 (35శాతం) ఎంయూల నష్టం వాటిల్లింది. 78.91 ఎంయూలకు మాత్రమే బిల్లింగ్ జరిగింది. ఈ డివిజన్ పరిధిలో ఏటీఅండ్‌సీ నష్టాలు 34.01శాతం. ► సిద్దిపేట డివిజన్‌కు 341.27 ఎంయూలను సరఫరా చేస్తే మీటర్డ్ రీడింగ్ ద్వారా 158.4, అన్మీటర్డ్గా 157.55 ఎంయూలు కలిపి మొత్తం 316 ఎంయూలకు బిల్లింగ్ జరిగింది. 25.12 (7శాతం) ఎంయూలు నష్టపోయాయి. మొండి బకాయిల వల్ల 32.31 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నాయి. -
అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..!
కోవిడ్-19 రాకతో అనుకోని అతిథిలా వచ్చిన చిప్స్(సెమికండక్టర్స్) కొరత ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయా కంపెనీల ఉత్పత్తి పడిపోవడంతో అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. చిప్స్ కొరతతో సతమతమవుతోన్న కంపెనీలో మారుతీ సుజుకీ కూడా చేరింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి అంతంతే..! మారుతీ సుజుకీ ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 1,39,184 యూనిట్లను విక్రయించగా..గత ఏడాది నవంబర్ నెలలో 1,53,223 యూనిట్లను విక్రయించిన్నట్లు మారుతి సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లోబల్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మందగించడంతో అమ్మకాల్లో 9.16 శాతం తగ్గుదల వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని కంపెనీ పేర్కొంది.గత నెలలో జరిగిన మొత్తం అమ్మకాలలో... దేశీయ విక్రయాల సంఖ్య 113,017 యూనిట్లుగా ఉండగా, ఇతర ఓఈఎమ్లకు 4774 యూనిట్లును విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..! మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో...అల్టో, ఎస్ ప్రెసో, బాలెనో, సెలెరియో, డిజైర్, ఈగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ వంటి కార్లపై పలు ఆఫర్లను కలిగి ఉన్న నవంబర్ 2021లో 74,492 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్ నెలలో 98,969 యూనిట్లను అమ్మకాలను జరిపింది. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు 100,839 యూనిట్ల నుంచి 75,581 యూనిట్లుగా వరకు క్షీణించాయి. యుటిలిటీ వాహనాల విభాగంలో అమ్మకాలు పరవాలేదనిపించింది. ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ , విటారా బ్రెజ్జా, ఎక్స్ఎల్ఆర్తో సహా గత నెలలో 24,574 యూనిట్లను విక్రయించింది. మరోవైపు నాన్ కార్గో ప్యాసింజర్ ఈకో వ్యాన్ విక్రయాలు నవంబర్‌లో 9,571 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది క్రితం నవంబర్ నెలలో 11,183 యూనిట్లను మారుతి విక్రయించింది. చదవండి: వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు -
కష్టాల్లో హైదరాబాద్ కలల మెట్రో.. అటకెక్కిన సాఫ్ట్‌లోన్ అంశం!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక కష్టాల్లో ఉన్న గ్రేటర్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించే అంశం ప్రకటనలకే పరిమితమైంది. కోవిడ్, లాక్డౌన్, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడంతో కలల మెట్రో వరుస నష్టాలను చవిచూస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మెట్రో నష్టాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సాఫ్ట్‌లోన్ అంశం తెరపైకి వచ్చింది. సులభ వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం, తక్కువ వడ్డీరేటు సాఫ్ట్లోన్కున్న ప్రత్యేకత. మెట్రో నిర్మాణ వ్యయం పెరగడం, రుణాలపై వడ్డీ పెరగడంతో దీని మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సానుకూలంగా స్పందించింది. కానీ రుణ మంజూరు అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంలేదు గమనార్హం. నష్టాల బాట.. గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.1 కి.మీ రూట్లో మెట్రో అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన మెట్రోకు నాటి నుంచి నేటి వరకు వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కోవిడ్‌కు ముందు మూడు రూట్లలో 4.5 లక్షల మంది జర్నీ చేయగా.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల వర్క్‌ఫ్రం హోం కారణంగా నిత్యం కనాకష్టంగా 2 నుంచి 2.5 లక్షలమంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ సుమారు రూ.14,132 కోట్లు వ్యయం చేసింది. ఈమొత్తాన్ని వివిధ బ్యాంకులు,ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించింది. రుణాలపై వడ్డీ సైతం సుమారు రూ.2 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు మెట్రో నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా రూ.3 వేల కోట్ల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సర్కారు సాయం కోసం అర్థించింది. కానీ ఈవిషయంలో ఎలాంటి ముందడుగు పడడం లేదు. ఈ పరిస్థితుల కారణంగా మెట్రో మొదటి దశలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.1 కి.మీ రూట్లో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం కానుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎయిర్పోర్ట్ మెట్రో సైతం ఆలస్యం? రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ)రూట్లో మెట్రో ఏర్పాటు ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించింది. తొలిదశ మెట్రో అనుభవాల నేపథ్యంలో.. రూ.5 వేల కోట్లు అంచనా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల సమీకరణ ఎలా అన్న అంశం కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ఇండిగో నష్టాలు తీవ్రతరం
న్యూఢిల్లీ: విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నష్టాలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మరింత పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.1,194 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. అవి మరింత అధికమై రూ.1,435 కోట్లకు చేరాయి. ఈ సంస్థ నిర్వహణలో 219 విమానాలు ఉన్నాయి. మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.5,798 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. వ్యయాలు 71 శాతం అధికమై రూ.7,234 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆదాయంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాలన్స్షీటును బలోపేతం చేసుకోవడంలో భాగంగా తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాం’’ అని కంపెనీ సీఈవో రోనోజోయ్దత్తా తెలిపారు. ఏవియేషన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీటి కారణంగా వ్యయాలు మరింత అధికమవుతాయన్నారు. -
మార్కెట్ జోరుకు రెండో రోజు కూడా బ్రేకులు..!
వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం రోజు కూడా అదే బాటలో దేశీ సూచీలు నడిచాయి. లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా ఒకనొక సమయంలో 61,109.29 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు ట్రేడింగ్ ముగిసే సమయానికి 456.09 పాయింట్ల నష్టంతో 61,259.96 వద్ద సెన్సెక్స్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా నష్టాలను నమోదుచేసింది. 152.15 పాయింట్లను నష్టపోయి 18,266.60 వద్ద నిఫ్టీ స్థిరపడింది. నష్టాలను చవిచూసిన షేర్లలో టైటన్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ కంపెనీలు ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ 4 శాతం మేర లాభపడింది. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి. చదవండి: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..! -
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
ఆ విద్యుత్ ఏమైపోతోంది?
సంస్కరణలు అమలు చేస్తేనే.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణలతో దేశవ్యాప్తంగా డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3.03 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని (ఆత్మనిర్భర్–2 కింద) ప్యాకేజీని ప్రకటించింది. వ్యవసాయం మినహా మిగతా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగించడం, వ్యవసాయ ఫీడర్లను విభజించడం, ఫీడర్లు–డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడం, ప్రతి పట్టణంలో స్కాడా సెంటర్ ఏర్పాటు చేయడం, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్/ఏఐ) వినియోగం వంటి సంస్కరణలను ప్రతిపాదించింది. వీటిని అమలు చేస్తే డిస్కంలు ‘ఏటీ–సీ’నష్టాలను సమూలంగా నిర్మూలించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఏటేటా పెరుగుతున్న నష్టాలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిపాలన, నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్న డిస్కంలు గట్టెక్కేదెలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో గుర్తించడం, సాంకేతిక–వాణిజ్యపర లోపాలతో ఏర్పడే ‘ఏటీ–సీ’నష్టాలను నియంత్రించడం, వినియోగదారులకు ఇచ్చే రాయతీలకు తగ్గట్టు ప్రభుత్వ సబ్సిడీలను పెంచడం, అధిక ధర విద్యుత్ కొనుగోళ్లను వదులుకోవడం, దుబారా ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపడితేనే.. డిస్కంలు మెరుగుపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలు తోడ్పతాయని చెప్తున్నారు. ఏటా వేల కోట్ల నష్టాలు.. డిస్కంలు ఏటా భారీ విద్యుత్ నష్టంతో వేల కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లు 2019–20 ఉమ్మడిగా రూ.6,061 కోట్ల వార్షిక నష్టాలను ప్రకటించగా.. అందులో నియంత్రించదగిన ‘సాంకేతిక, వాణిజ్య(అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్/ఏటీ–సీ)’నష్టాలే రూ.3,837.65 కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆ ఏడాది రెండు డిస్కంలు కలిపి విద్యుత్ ప్లాంట్ల నుంచి 65,751.1 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా.. వినియోగదారులకు సరఫరా చేసినట్టు లెక్క తేలినది 59,631.68 ఎంయూలు మాత్రమే. మిగతా 6,119.42 ఎంయూల విద్యుత్ ఏమైందో తెలియదు. డిస్కంలు దానిని సాంకేతిక, వాణిజ్య నష్టాల కింద లెక్కలు చూపాయి. ►ఎస్పీడీసీఎల్ రూ.24,907.26 కోట్ల వ్యయంతో 45,247.02 ఎంయూ విద్యుత్ కొనుగోలు చేయగా.. సరఫరా లెక్కలు 40,981.27 ఎంయూలకే ఉన్నాయి. మిగతా 4,265.75 ఎంయూల విద్యుత్ ఏమైంది, ఎలా నష్టపోయిందన్న లెక్కలు తెలియవు. సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.5.5 ఖర్చు చేయగా.. వినియోగదారులకు అమ్మినది రూ.6 చొప్పున. అయినా రూ.2,560.68 కోట్లు నష్టపోయింది. ►ఎన్పీడీసీఎల్ రూ.11,326.08 కోట్లతో 20,504.08 ఎంయూ విద్యుత్ కొన్నది. 18,650.41 ఎంయూల సరఫరా లెక్కలతో రూ.12,848.57 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్కో యూనిట్ కొనుగోలుకు సగటున రూ.5.52 పైసలు ఖర్చుచేయగా.. వినియోగదారులకు విక్రయించినది రూ.6.88. అంటే గణనీయంగా ఆదాయం రావాలి. కానీ 1,853.67 ఎంయూల విద్యుత్ లెక్కలు తెలియక.. రూ.1,276.97 కోట్ల ఆదాయానికి గండిపడింది. వాస్తవ నష్టాలు ఇంకా ఎక్కువే! వ్యవసాయం మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ మీటర్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ వినియోగం అంచనాలను పెంచడం ద్వారా నష్టాలను తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. వాస్తవానికి డిస్కంల నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు 2019–20లో ఎన్పీడీసీఎల్ 11,510.14 ఎంయూ విద్యుత్‌ను మీటర్లు గల వినియోగదారులకు విక్రయించగా, మరో 7,140.27 ఎంయూ విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేసినట్టు అంచనా వేసింది. మరో 1,853.66 ఎంయూ నష్టపోయినట్టు చూపింది. అంటే మూడో వంతుకుపైగా విద్యుత్‌ను వ్యవసాయానికే వినియోగించినట్టు పేర్కొంది. ఎక్కడికక్కడ నష్టాలు తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా తొలివిడత కింద 2023 డిసెంబర్ నాటికి 10 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఫీడర్లు, డిస్ట్రిబ్యుషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికేబుల్ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటిద్వారా ఏయే ప్రాంతాల్లో, ఏ కారణాలతో విద్యుత్ నష్టాలు వస్తున్నాయో గుర్తించవచ్చు. సాంకేతిక లోపాలతో నష్టం వచ్చినా, చౌర్యం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఆయా ప్రాంతాల్లో బాధ్యులైన అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ‘సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా)’కేంద్రం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాను దీని ద్వారా సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్ సరఫరా ఫీడర్లను వేరుచేసి, మీటర్లు ఏర్పాటు చేస్తే.. వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు బయటపడతాయి. ఇతర నష్టాలను వ్యవసాయ ఖాతాలో వేయడానికి అవకాశం ఉండదు. రూ.9,020 కోట్లు నష్టాలు: నీతి ఆయోగ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2018–19 నాటికి రూ.9,020 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని విద్యుత్ పంపిణీ రంగం– సంస్కరణలపై తాజాగా ప్రచురించిన అధ్యయన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ వచ్చాక 2014–15లో రూ.2,912 కోట్లుగా ఉన్న నష్టాలు ఏటా పెరుగుతూ ఐదేళ్లలో మూడింతలైనట్టు తెలిపింది. నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలివీ.. -
‘మోనో’ ఆవరణల్లో ప్రకటనలు
సాక్షి, ముంబై: ప్రారంభమైన నాటి నుంచి నష్టాల్లోనే నడుస్తున్న మోనో రైలు ప్రాజెక్టు కరోనా మహమ్మా రి ప్రభావంతో మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. కరోనా, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులెవరూ మోనో రైళ్లలో ప్రయాణించేందుకు సుముఖత చూపలేదు. దీంతో మోనో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతీరోజు రూ. లక్షల్లో నష్టం వస్తోంది. ఇలా ఆర్థికంగా నష్టాల బాట పట్టిన మోనో ప్రాజెక్టును లాభాల దిశగా నడపాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీ యే) భావించింది. ఈ మేరకు ఆదాయం పెంచుకు నే మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగానే మోనో రైల్వే స్టేషన్ల ఆవరణలు, ప్లాట్‌ఫారాలు, మోనో రైలు మార్గం వెంబడి ఉన్న పిల్లర్లు, ప్రహరీ గోడలు, ఇతర స్థలాలను ప్రకటనల కోసం అద్దెకు ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి గల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ప్రస్తు తం నగరంలోని చెంబూర్–సాత్‌రాస్తా ప్రాంతాల మధ్య మోనో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతీరోజు నష్టం వస్తున్నా కూడా సంస్థకు వీటి ట్రిప్పులను నడపక తప్పడం లేదు. దీంతో టికెట్ల ద్వారా ఆదాయం రాకపోయినప్పటికీ, ప్రకటనల ద్వారానైనా ఆదా యం రాబట్టుకోవాలని సంస్థ భావించింది. ఈ మేరకు ప్రకటనల ద్వారా ఏటా రూ. 40–50 కోట్ల మేర ఆదాయం సంపాదించేందుకు ఎమ్మెమ్మార్డీయే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే అధికారులు కొన్ని కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ, అవి సఫలం కాలేదు. దీంతో టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలని గడువు విధించింది. దాఖలైన టెండర్లను 12వ తేదీన తెరవనున్నారు. ఈ టెండర్లలో ఎవరు ఎక్కువ చెల్లించడానికి ముందుకు వస్తారో వారి ప్రకటనలను మోనో రైల్ ఆవరణల్లో ఏర్పాటు చేయనున్నారు. -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
ముంబై: ఏషియా మార్కెట్లలో టెక్ షేర్ల అమ్మకాలు భారీగా సాగుతుండటంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 259 పాయింట్లు నష్టపోయి 52,319 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ 15,761 పాయింట్లతో మొదలై 65 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో15,681 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నెస్టల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి. -
పేరుకే బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు..నష్టాలు మాత్రం..!
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టార్టప్ కంపెనీల విలువ గణనీయంగా పెరిగి యునికార్న్ స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. యునికార్న్ స్టార్టప్ అనగా కంపెనీ విలువ సుమారు ఒక బిలియన్ డాలర్ విలువకు చేరితే ఆ స్టార్టప్‌లను యునికార్న్లుగా పిలుస్తారు. యునికార్న్ అనే పదాన్ని ఐలీన్ లీ ప్రతిపాదించారు. విచిత్రమైన పరిస్థితి.. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పలు యునికార్న్ స్టార్టప్‌లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. కరోనా సమయంలో స్టార్టప్‌ల షేర్ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. మరికొన్ని స్టార్టప్‌ల షేర్ ధరలు అమాంతం రెట్టింపు, మూడు రెట్లు కూడా పెరిగాయి. జూమ్, రోకు, స్వ్కేర్ వంటి స్టార్టప్‌లు షేర్లు బాగా వృద్ధిని నమోదుచేసిన అంతే నష్టాలను చవిచూశాయి. స్నాప్‌చాట్, ట్విలియో, పిన్ట్రెస్ట్, స్లాక్, యూబర్, లిఫ్ట్ షేర్లు భారీగా పెరిగాయి. ఆయా స్టార్టప్‌లు షేర్ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ అంతే స్థాయిలో స్టార్టప్‌లు నష్టాలను కూడా చవిచూశాయి. ఆయా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిలిస్టుల నుంచి ఫండింగ్ బలంగానే ఉంది. 2021 తొలి త్రైమాసికంలో గరిష్టంగా 125 బిలియన్ డాలర్లకు ఫండింగ్ చేరుకుంది. భారీ ఎత్తున వెంచర్ ఫండింగ్, అధిక షేర్ ధరలు ఉన్నపటీకి ఆయా స్టార్టప్‌లు నష్టాలనుంచి బయట పడలేదు. ఈ స్టార్టప్‌లతో పోల్చుకుంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభంలో గరిష్టమైన నష్టాలను చవిచూసినప్పటికి తిరిగి స్టార్టప్ లాభాలవైపు అడుగులు వేసింది. అమెరికాలో అత్యధికంగా నష్టాలను పొందిన సంస్థగా అమెజాన్ నిలిచింది. అమెజాన్ తన పదవో సంవత్సరం నుంచి లాభాలను పొందలేకపోయింది. ఈ లాభాలు 2016 సంవత్సరం వరకు స్టార్టప్ 3 బిలియన్ డాలర్ల నష్టాలను కవర్ చేయలేకపోయాయి. ప్రస్తుతం అమెజాన్ అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది. పలు యునికార్న్ స్టార్టప్‌లను స్థాపించి సుమారు 10 నుంచి 20 సంవత్సరాలైనప్పటికీ అమెజాన్ తరహాలో లాభాలను పొందలేకపోతున్నాయి. వోల్ఫ్స్ట్రీట్ రిపోర్ట్ ప్రకారం..ఆయా స్టార్టప్‌ల ఫైలింగ్స్‌ను అమెజాన్‌తో పోల్చితో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. పలు యునికార్న్ స్టార్టప్‌లు స్థాపించి పది నుంచి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఉబర్ స్టార్టప్ 23 బిలియన్ డాలర్లు, స్నాప్ చాట్ 8 బిలియన్ డాలర్లు, ఎయిర్‌బీఎన్‌బీ, లిఫ్ట్ సుమారు 7 బిలియన్ డాలర్లు, పలన్టిర్ 6 బిలియన్ డాలర్లు, నూటానిక్స్ 5 బిలియన్ డాలర్లు కమ్యూలేటివ్ నష్టాలను ఆయా స్టార్టప్‌లు చవిచూశాయి. ఈ స్టార్టప్‌ల విలువ అత్యధికంగా ఉంది. ఇక్కడ ఆయా స్టార్టప్‌లకు వచ్చిన నష్టాలు అమెజాన్ స్టార్టప్‌కి వచ్చిన కమ్యూలేటివ్ నష్టాలకంటే అధికం. పలు స్టార్టప్‌ల నష్టాలు 2021లోను కొనసాగుతున్నాయి. కాగా ఈ స్టార్టప్‌లను అమెజాన్‌తో పోల్చే మోడల్ సరైనది కాదు..! అమెజాన్ కూడా ప్రారంభంలో కమ్యూలేటివ్ నష్టాలను చవిచూసినప్పటికీ తన పదవో సంవత్సరంలో అమెజాన్ లాభాలను ఆర్జించింది. అమెజాన్ స్టార్టప్ చరిత్ర ప్రకారం..అత్యధికంగా నష్టాలను ఎదుర్కొనే స్టార్టప్‌లు అమెజాన్ స్టార్టప్ లాగా కమ్యూలేటివ్ లాభాలను మాత్రం పొందలేవు. లాభాలను గడించడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఆయా స్టార్టప్‌లకు ఏలాంటి నష్టం జరగదని నిపుణులు పేర్కొన్నారు. -
కాఫీడే....చేదు ఫలితాలు
న్యూఢిల్లీ: కాఫీడే ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి–మార్చి)కి సంబంధించి రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 69 శాతం క్షీణించి రూ. 165 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 534 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో సికాల్ లాజిస్టిక్స్‌లో గల ఈక్విటీ షేర్ల విలువ తగ్గిన కారణంగా రూ. 151 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాఫీ డే పేర్కొంది. కోవిడ్–19 కారణంగా తలెత్తిన లాక్డౌన్లు, ఆంక్షలు బిజినెస్ కార్యకలాపాలు, సప్లై చైన్ దెబ్బతిన్నట్లు తెలియజేసింది. డైరెక్టర్ రాజీనామా క్యూ4లో కాఫీ, తత్సంబంధిత ఆదాయం 61 శాతంపైగా క్షీణించి రూ. 141 కోట్లకు పరిమితమైనట్లు కాఫీడే పేర్కొంది. అయితే ఆతిథ్య సర్వీసుల టర్నోవర్ 40 శాతం ఎగసి రూ. 11 కోట్లను తాకినట్లు వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 652 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో దాదాపు రూ. 1,849 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం 67 శాతం పడిపోయి రూ. 853 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 2,552 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే 2019–20లో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీలో ఈక్విటీ వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 1,828 కోట్లు కలసి ఉన్న విషయాన్ని కాఫీడే ఫలితాల సందర్భంగా ప్రస్తావించింది. అంతేకాకుండా గ్లోబల్ విలేజ్ ప్రాపర్టీ అమ్మకం ద్వారా మరో రూ. 1,190 కోట్లు లభించినట్లు తెలియజేసింది. కాగా.. 2020–21లో వే2వెల్త్ సెక్యూరిటీస్ విక్రయం ద్వారా రూ. 151 కోట్లు లభించినట్లు పేర్కొంది. జర్మనీలో నివసిస్తున్న కంపెనీ డైరెక్టర్ ఆల్బర్ట్ జోసెఫ్ హీరోనిమస్ వ్యక్తిగత ఆరోగ్య రీత్యా పదవికి రాజీనామా చేసినట్లు కాఫీడే వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కస్టమర్ల ప్రాంతాల నుంచి వెండింగ్ మెషీన్ల వినియోగానికి రూపొందించిన 30,000 కేబినెట్లను వెనక్కి తీసుకున్నట్లు కాఫీడే తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేరు ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 41.30 వద్ద ముగిసింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
stockmarket: అదానీ షాక్, భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు వెంటనే మరింత పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 51949 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టంతో15613 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 52 వేల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్‌లలో అమ్మకాలు మార్కెట్‌నుప్ర భావితం చేస్తున్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు,.లోహాలు, ఫైనాన్షియల్స్, ఆటో, రియాల్టీ సూచికలలో భారీ అమ్మకాల ధోరణి నెలకొంది. రూ .43,500 కోట్ల విలువైన షేర్లను ముఖ్యంగా ఎన్ఎస్డిఎల్ మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్నవార్తల మధ్య అదానీ గ్రూప్ స్టాక్స్ (అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్) భారీగా నష్టపోతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ భారీ నష్టాల్లో ఉన్నాయి. చదవండి: ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్ నెక్ట్స్ టార్గెట్ టెక్నాలజీతో మెరుగైన సేవలు -
ఆటో, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభాల స్వీకరణ కొనసాగడంతో సూచీలు రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 334 పాయింట్లను కోల్పోయి 52 దిగువున 51,941 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్లు పతనమైన 15,635 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు, రూపాయి బలహీన ట్రేడింగ్ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇటీవల మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దూసుకెళ్లిన చిన్న, మధ్య తరహా కంపెనీ షేర్లలో అధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఉదయం సెషన్లో లాభాల్లో కదలాడిన సూచీలు.., మిడ్‌సెషన్‌లో ఒక్కసారిగా తలెత్తిన అమ్మకాలతో భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 730 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు పరిధిలో కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.846 కోట్ల విలువైన షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1627 కోట్ల ఈక్విటీలను అమ్మేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండోరోజూ క్షీణించింది. డాలర్ మారకంలో ఎనిమిది పైసలు నష్టపోయి 72.97 వద్ద స్థిరపడింది. ముంచేసిన మిడ్‌సెషన్ అమ్మకాలు... ఆసియా మార్కెట్ల నష్టాలతో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 52,401 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 15,766 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత ఆటో షేర్లతో మినహా అన్ని రంగాల షేర్లు రాణించడంతో ఒక దశలో సెన్సెక్స్ 147 పాయింట్లు ర్యాలీ చేసి 52,447 వద్ద, నిఫ్టీ 60 పెరిగి 15,800 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. సాఫీగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌లో ఒక్కసారి తలెత్తిన అమ్మకాలు సూచీల ర్యాలీని అడ్డుకున్నాయి. క్రమంగా విక్రయాల ఒత్తిడి పెరగడంతో ఆరంభ లాభాలన్ని కోల్పోయి నష్టాల బాట పట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(52,447) నుంచి 730 పాయింట్లు, నిఫ్టీ డే హై(15,800) నుంచి 233 పాయింట్లు పతనాన్ని చవిచూశాయి. చివరి అరగంటలో కాస్త కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత తగ్గాయి. |ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు... చైనా మే మాసపు ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో ఆసియాలో ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. జపాన్, సింగపూర్, తైవాన్, కోప్పీ దేశాల సూచీలు ఒకశాతం నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం గురువారం ప్రారంభవుతుంది. వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై ఫెడ్ వైఖరిని తెలిపే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అదే రోజున వెల్లడి కానున్నాయి. కీలకమైన ఈ ఘట్టాలకు ముందు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. -
నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 51,935 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఎనిమిది పాయింట్లను కోల్పోయి 15,575 వద్ద నిలిచింది. దీంతో నిఫ్టీ ఏడురోజులు, సెన్సెక్స్ నాలుగు రోజుల లాభాల ముగింపునకు విరామం పడినట్లైంది. మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనంతో ఐటీ, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో ఉదయం నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 15,661 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ సైతం 292 పాయింట్లు లాభపడి 52,229 స్థాయిని అందుకుంది. మిడ్ సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.450 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెండ్ క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత రెండోరోజూ కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరపు జీడీపీ డేటాతో పాటు ఏప్రిల్ మౌలిక, మే తయారీ రంగ గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఆర్బీఐ పాలసీ కమిటీ సమావేశాల ప్రారంభం(బుధ–శుక్ర)నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. వీటికి తోడు సూచీల వరుస ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ►ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ షేరు రెండు శాతం లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.435.35 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేసింది. ►కొత్త యాజమాన్య నియామకంతో బ్యాంకింగేతర సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ షేరు ఐదు శాతం లాభపడి రూ.143 వద్ద స్థిరపడింది. ► పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుందని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తెలపడంతో షేరు 20 శాతం పెరిగి రూ.631 వద్ద ముగిసింది. ►నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను వెల్లడించడంతో నారాయణ హృదయాలయ షేరు 12 పెరిగి రూ.493 వద్ద నిలిచింది. ►బ్రిటన్ ఏస్ ఇన్వెస్టర్ జెరెమీ గ్రాన్థమ్ రూప కంపెనీలో వాటాను కొనుగోలు చేయడంతో షేరు 20 శాతం ర్యాలీ చేసి రూ.476 వద్ద ముగిసింది. -
భారీగా పతనమవుతున్న క్రిప్టో కరెన్సీ...!
పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. ఇక పనైపోయిందని అంతా అనుకుంటుంటే.. మళ్లీ అంతలోనే రాకెట్లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంతే వేగంగా కుప్పకూలుతుంది. పెరిగినా, తగ్గినా ఇన్వెస్టర్లను టెన్షన్ పెడుతున్న క్రిప్టో కరెన్సీల తీరు ఇది. ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్ల స్థాయి నుంచి ఏప్రిల్ నాటికి 60,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్ మళ్లీ నెల తిరగకుండానే 30,000 డాలర్లకు కూడా పతనం కావడం ఇందుకు నిదర్శనం. నియంత్రణ సంస్థలు, సంప్రదాయ చెల్లింపు మార్గాలతో సంబంధం లేకుండా డిజిటల్ రూపంలో నగదును బదలాయించేందుకు ఉపయోగిస్తున్న క్రిప్టోకరెన్సీల పతనంపై ఈ ప్రత్యేక కథనం... మే 19.. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. పలు క్రిప్టో కరెన్సీల విలువ 12 శాతం నుంచి ఏకంగా 40% దాకా పడిపోయింది. మిగతా వాటితో పోలిస్తే భారీగా ట్రేడయ్యే బిట్‌కాయిన్ విలువ చివరికి కాస్త కోలుకున్నప్పటికీ ఒక దశలో 30% దాకా పతనమైంది. వెరసి క్రిప్టోకరెన్సీల విలువ ఒక్క రోజులో ఏకంగా లక్ష కోట్ల డాలర్లు ఆవిరైంది. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరెన్సీల్లో బిట్‌కాయిన్ అగ్రస్థానంలో ఉంటోంది. కానీ ఈ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం.. ఇన్వెస్టర్లను కలవరపర్చే అంశం. తాజా పతనం వెనుక టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, చైనా నియంత్రణలు కారణంగా నిల్చాయి. మస్క్ ట్వీట్లు .. చైనా ఆంక్షలు.. ఒక్క చిన్న ట్వీట్‌తో బిట్‌కాయిన్‌ను పైకి పరుగులు తీయించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ .. అలాంటిదే మరో ట్వీట్‌తో కిందికి కూలదోశారు. బిట్కాయిన్లతో తమ కార్లను కూడా కొనుగోలు చేయొచ్చంటూ కొన్నాళ్ల క్రితం ఆయన ట్వీట్ చేసినప్పుడు దాని విలువ ఎకాయెకిన 32,000 డాలర్ల నుంచి 38,000 డాలర్లకు ఎగిసింది. ఆ తర్వాత అదే ఊపు కొనసాగిస్తూ 65,000 డాలర్ల దాకా పెరిగింది. అయితే, పర్యావరణ కారణాల రీత్యా బిట్కాయిన్ల ద్వారా లావాదేవీలు జరపబోమంటూ మే 13న మస్క్ మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన తనదగ్గరున్న దాదాపు 1.5 బిలియన్ డాలర్ల బిట్కాయిన్లను అమ్మేయనున్నారంటూ మే 19న వార్తలు రావడం, దాన్ని దాదాపు ధృవీకరించేలా ఆయన ట్వీట్ చేయడం.. బిట్‌కాయిన్‌ను దెబ్బతీసింది. ఆ రోజునే బిట్‌కాయిన్ భారీగా పతనమైంది. అయితే, తన దగ్గరున్న బిట్‌కాయిన్‌ను విక్రయించే యోచనేదీ లేదంటూ వివరణనివ్వడంతో మళ్లీ కాస్తంత కోలుకుంది. ఇక, క్రిప్టో కరెన్సీల పతనంలో చైనా పాత్ర కూడా కొంత ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. చైనా 2017లోనే తమ దేశంలో క్రిప్టో ఎక్సే్చంజీలను మూసివేసినప్పటికీ.. ప్రజలు మాత్రం అనధికారికంగా ట్రేడింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సొంతంగా డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా వినియోగించడం మొదలుపెట్టిన చైనా.. మే 18న క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి సర్వీసులు అందించకుండా ఆర్థిక సంస్థలు, పేమెంట్ కంపెనీలను నిషేధించింది. అలాగే స్పెక్యులేటివ్ క్రిప్టో ట్రేడింగ్ చేయరాదంటూ ఇన్వెస్టర్లను కూడా హెచ్చరించింది. ఇది కూడా క్రిప్టో కరెన్సీల పతనానికి దారి తీసింది. లాభాల స్వీకరణ..: ఇన్వెస్టర్లు కంగారుపడి అమ్మేసుకోవడం కూడా ప్రస్తుత పతనానికి కారణం. గతేడాది క్రిప్టోలను కొనుగోలు చేసిన వారు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెక్నికల్‌గా చూస్తే సాధారణంగా కరెక్షన్లు వచ్చినప్పుడు సుమారు 50% దాకా విలువ పడిపోతుంది. దాన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ కనిష్ట స్థాయిని తాకి ఉండొచ్చన్నది భావిస్తున్నారు. కాయిన్గెకోడాట్కామ్ లెక్కల ప్రకారం మే 13–20 మధ్య క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాప్ ఏకంగా 50 శాతం తుడిచిపెట్టుకుపోయింది. గత వారం రోజుల వ్యవధిలో ఎథీరియం 25 శాతం, బైనాన్స్ విలువ 33% పడిపోయింది. మస్క్ బాధ్యతారహితమైన ట్వీట్లతో చిరాకెత్తిన కొందరు ట్రేడర్లు స్టాప్ఎలాన్ పేరుతో కొత్త క్రిప్టో కరెన్సీని తెరపైకి తెచ్చారు. దీని విలువ కేవలం 24 గంటల్లో 4,874 శాతం ఎగియడం గమనార్హం. 0.0000019 డాలర్ల నుంచి 0.00009450 డాలర్లకు పెరిగింది. ఆమోదయోగ్యత అంతంతే.. పేరుకి కరెన్సీ అయినప్పటికీ క్రిప్టోలను వ్యాపార లావాదేవీల్లో ఉపయోగిస్తున్నది మాత్రం తక్కువే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15,000 వ్యాపార సంస్థలే క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలకు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం తాము కూడా క్రిప్టో కరెన్సీల ద్వారా చెల్లింపులు తీసుకుంటామంటూ ఘనంగా ప్రకటించినప్పటికీ.. అంతలోనే మనసు మార్చుకున్నారు. అయిదేళ్లలో 500 డాలర్ల నుంచి 65వేల డాలర్లకు.. గడిచిన 5 ఏళ్లలో చూస్తే 2016లో 500 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ ఆ మరుసటి ఏడాది 2017లో 19,000 డాలర్లకు ఎగిసింది. ఆ మరుసటి ఏడాది 2018లో 3,000 డాలర్లకు పతనమైంది. 2019లో నెమ్మదిగా 7,000 డాలర్లకు, 2020 ఆఖరు నాటికి 20,000 డాలర్లకు చేరింది. ఇక ఈ ఏడాదైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. అలాగే పడిపోయింది కూడా. ఉదాహరణకు ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ ఏప్రిల్ మధ్య నాటికి దాదాపు 65,000 డాలర్లకు ఎగిసింది. ఇప్పుడు 40,000 డాలర్ల దగ్గరికి పడిపోయింది. కరెక్షన్స్ సాధారణమే .. భారీ ర్యాలీ తర్వాత క్రిప్టో సహా చాలా మటుకు మార్కెట్లలో పెద్ద యెత్తున కరెక్షన్స్ జరగడం సాధారణమేనని క్రిప్టో ఎక్సే్చంజీ జెబ్‌పే సీఈవో రాహుల్ పగిడిపాటి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా క్రిప్టోపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోందని, దీనికి అనుగుణంగానే ఎక్సే్చంజీలు తమ సర్వర్లు, ఇన్ఫ్రాను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. నియంత్రణ సంస్థలపరంగా స్పష్టత లేకపోవడం మరో సవాలని వివరించారు. క్రిప్టో వంటి సాధనాల గురించి అవగాహన పెంచుకున్న తర్వాతే దీర్ఘకాలిక ప్రణాళికతో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని దేశీ ఇన్వెస్టర్లకు రాహుల్ సూచించారు. ప్రస్తుతం 40 లక్షల మంది తమ ప్లాట్‌ఫాం ద్వారా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవల క్రిప్టో కరెన్సీని స్వీకరించే విషయంలో టెస్లా యూటర్న్ తీసుకోవడం ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని దేశీ బిట్‌కాయిన్ ఎక్సే్చంజీ బైటెక్స్ వ్యవస్థాపక సీఈవో మోనార్క్ మోదీ తెలిపారు -
Lockdown: ‘ఫలం’ దక్కలే
సాక్షి, హైదరాబాద్: పుచ్చ, అరటి, జామ, కర్బూజా, బత్తాయి, దానిమ్మ.. ఇవి అందరూ ఇష్టంగా తినే పండ్లే. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి బాగా డిమాండ్ కూడా ఉంది. ఇవి దాదాపుగా నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయన్నా అతిశయోక్తి కాదు. అయినప్పటికీ.. రాష్ట్రంలో ఈ పంటలు పండించిన రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అడ్వాన్సు కొనుగోళ్లేవీ.. రాష్ట్రంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణం దాదాపు 4.5 లక్షల ఎకరాలు కాగా ఇందులో ఒక్క మామిడి తోటలే 3,17,591 ఎకరాల్లో ఉన్నాయి. బత్తాయి 63,479 ఎకరాల్లో ఉండగా మిగతావి పుచ్చ, జామ, బొప్పాయి, కర్బూజ వంటి ఇతర పంటలు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన.. అకాల వర్షాలకు తోడు లాక్డౌన్ ఉద్యాన రైతుల్ని అష్టకష్టాల పాలు చేస్తోంది. పంటలను అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి ముందస్తు అడ్వాన్సులిచ్చి మరీ కొనుగోళ్ల జరిపేవారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటం, కేవలం 4 గంటల సడలింపు మాత్రమే ఉండటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. రవాణాలో ఇబ్బందులు, కష్టనష్టాల కోర్చి ఎలాగో మార్కెట్‌కు తెచ్చినా సరైన ధర లేక, తక్కువ సమయం కావడంతో హడావుడిగా అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి కొనే నాథుడు కూడా లేకపోవడంతో తెచ్చిన పంటను అక్కడే వదిలేసి పోతున్నారు. కాగా వేసవి సీజన్లో వచ్చే మామిడి పరిస్థితి మరీ దయనీయంగా మారగా.. లాక్డౌన్ కారణంగా శుభకార్యాలకు చాలావరకు బ్రేక్ పడటంతో పూలు సాగు చేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి, దిక్కుతోచని పరిస్థితుల్లో పూల తోటల్లో గొర్రెలు, మేకల్ని మేపుతున్నారు. కూరగాయల రైతులు కూడా కొనే దిక్కులేక చేళ్లను పశువులకు వదిలేశారు. గత ఏడాది కరోనా దెబ్బతోనే ఇప్పటికీ కోలుకోలేని రైతులు, తాజా లాక్‌డౌన్‌తో మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారు. తప్పని కూర‘గాయాలు’ ఈ ఫొటోలో పాలకూర చేనులో బర్రెలను మేపుతున్న రైతు కత్తి గోవిందరెడ్డి. ఇతనిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మచెట్టుస్టేజీ గ్రామం. తనకున్న మూడు ఎకరాల్లో వంకా య, టమాట, దోస, గోరు చిక్కుడుతో పాటు పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు వేశాడు. మొ త్తం రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేశాడు. వేసవికాలంలో ఆకుకూరలు, కూరగాయలకు రేటు బాగానే ఉంటుందని భావించినా.. పంట చేతికి వ చ్చిన దశలో లాక్డౌన్ పుణ్యమా అని కూరగాయలు కొనే దిక్కులేకుండా పోయింది. టమాట కిలో రూ. 3, వంకాయలు రూపాయి, దోస రూ.4 కు అమ్ముతామన్నా వ్యాపారులు తీసుకోలేదు. లాక్డౌన్లో దుకాణాలు తెరిచేందుకు సమయం తక్కువగా ఉం డటమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అమ్ముడుపోకుంటే కూరగాయలు చెడిపోతాయని అంటున్నారు. దీంతో గోవిందరెడ్డి సాగు చేసిన పం టలన్నీ చేనుపైనే వదిలేసి బర్రెలను మేపుతున్నాడు. పూలు.. గగ్గోలు ఈ ఫొటో చూస్తే పూలతోటలా ఉంది.. గొర్రెలు మేస్తున్నాయేంటి అనుకుంటున్నారా? అవును గొర్రెలు మేస్తోంది పూలే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కాశీంబౌలి గ్రామానికి చెందిన మునుగాల జంగారెడ్డి.. అర ఎకరంలో బంతి, మరో అర ఎకరంలో జర్మనీ పూలు సాగు చేశాడు. బంతి నారుకు రూ.3కు ఒక మొక్క చొప్పున 8 వేల మొక్కలకు రూ.24 వేలు ఖర్చు పెట్టాడు. ఎరువులు, మందులు, కలుపు కూళ్లకు మరో రూ.15 వేల వరకు ఖర్చయింది. ఇక జర్మనీ విత్తనాలు ఇంటి దగ్గరే వేశాడు. దీనికి మందులు, ఎరువులు, కలుపుకూళ్లు రూ.10 వేల వరకు ఖర్చయ్యింది. సరిగ్గా పూలు కోసే సమయంలోనే కరోనా ఎక్కువైందని లాక్డౌన్పెట్టారు. మార్కెట్ రెండు మూడు గంటలే నడుస్తుండటంతో పూలు కొనేవాళ్లే లేకుండా పోయారు. పది రోజుల క్రితం ఒకసారి బంతిపూలు తీసుకుని హైదరాబాద్ మార్కెట్‌కు వెళ్తే ఒక్క కిలోకూడా అమ్మకపోవడంతో అక్కడే పారబోసి వచ్చాడు. కూరగాయలైతే గ్రామాల్లోనైనా తిరిగి అమ్ముకునే అవకాశం ఉండేది. కానీ పూల విక్రయానికి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కే వెళ్లాలి. నగర శివారు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇక్కడికి పూలు తెస్తారు. కానీ లాక్డౌన్ కారణంగా మార్కెట్ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే కొనసాగుతోంది. సుమారు రూ.50 వేలు ఖర్చుపెట్టి పూలు సాగుచేస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు. చేసేదేమీలేక పూలతోటలో గొర్రెలు వదలిపెట్టాడు. పోయినేడు కూడా లాక్‌డౌన్‌తో పూలు సరిగా అమ్మలేదని, ఈసారి మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు పూల డిమాండ్ ఉంటుందనుకుంటే ఇలా అయ్యిందని జంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డిమాండ్ కొరవడిన అంజీర.. ఈ రైతు పేరు ధనేశ్వర్‌రెడ్డి. జోగుళాంబ గద్వా ల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నెకు చెందిన ఇతను 16 ఎకరాల్లో అంజీర తోట సాగు చేశాడు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ 800 కేజీల నుంచి 1,000 కేజీల వరకు హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టేవారు. లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు లేవని, 50 నుంచి 100 కేజీలే పంపమని చెబుతుం డటం దిక్కుతోచడంతో లేదు. లాక్‌డౌన్‌కు ముందు కేజీ ధర రూ.120 ఉండేది, ప్రస్తుతం రూ.100 నిర్ణయించారు. కూరగాయలు తరలించే ఆటోలో వంద కేజీలు పంపుతున్నాం. మిగతా పండ్లు మాగినా కో యకపోవడంతో పురుగులు పడుతున్నాయి. పురుగుల వల్ల తోట దెబ్బతింటుందని రోజుకు 25 మం ది కూలీలతో పండ్లు తెంపి పారబోస్తున్నాం. పది రోజులు లాక్డౌన్ అనుకుంటే ఇప్పుడు నెలాఖరు వరకు పొడిగించారు. మా పరిస్థితి దారుణంగా వుంది. రోజుకు కూలీలకు రూ.పది వేలు ఖర్చువుతోంది. వచ్చే ఆదాయం ఆటోకు, కమీషన్ పోను కూలీలకు సరిపోవడం లేదు. పరిస్థితి ఇలా కొనసాగితే పొలాలు అమ్ముకోవాల్సిందేనని ధనేశ్వర్‌రెడ్డి వాపోతున్నాడు. కర్బూజ.. ఏక్ కహానీ ఇతని పేరు రమేష్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామం. రెండున్నర ఎకరాలలో తెల్ల కర్బూజ, కీరదోస వేశాడు. రూ.1.80 లక్షలు ఖర్చు చేశాడు. పంట అమ్మగా తిరిగి చేతికి రూ.1.10 లక్షలు మాత్ర మే వచ్చాయి. అంటే రూ.70 వేలు నష్టపోయాడన్నమాట. లాక్డౌన్ కారణంగా వ్యా పారులు కొనేందుకు ముందుకు రాలేదని, తామే అష్టకష్టాలు పడి నిజామాబాద్, ఇతర మార్కెట్లకు వెళ్లి అమ్ముకున్నామని చెప్పాడు. చివర్లో రవాణా ఖర్చులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పంటను దున్నేశానని వాపోయాడు. గుమ్మడి కాయకు కష్ట కాలం! సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఆయా గ్రామాల్లో రైతులు సుమారు వంద ఎకరాల్లో గుమ్మడికాయ సాగు చేశారు. మామూలుగా అయితే హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఏ శుభకార్యానికైనా గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితీ. ఇలా గుమ్మడికీ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు అంతగా లేకపోవడంతో పంట అమ్ముడు పోవడం లేదు. దీంతో కోతకు వచ్చిన గుమ్మడి కాయలను రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. ‘ఎకరాకు సుమారు పదిహేను వేల చొప్పున ఖర్చు చేసి రెండెకరాల్లో గుమ్మడికాయ పంట సాగు చేశా. ప్రస్తుతం కొన్ని కోసి సిద్ధంగా ఉంచా. కానీ కొనేందుకు ఎవరూ రావడం లేదు. పొలంలో ఇంకా కాయలున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి..’అని గుమ్మడిదలకు చెందిన రైతు రవీందర్‌రెడ్డి కోరుతున్నారు. రేటు దక్కని అరటి రెండెకరాల్లో అరటి పంట వేశా. ఇప్పటివరకు రూ.1,50,000 పెట్టుబడి అయింది. లాక్డౌన్ లేకుంటే ఈ సీజన్లో సుమారుగా రూ.4 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉండేది. కానీ వ్యాపారులు.. అరటిపండ్లు తక్కువగా అమ్ముడు పోతున్నాయంటూ మా దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అరటికాయలు కిలోకు రూ.13– 16 ధర పలకగా, ఇపుడు రూ.5–6 మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు అకాల వర్షాలతో అరటి చెట్లు పడిపోయి గెలలు దెబ్బతింటున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. – హింగే నాగేశ్వర్రావు, దామెర, వరంగల్ రూరల్ జిల్లా బొప్పాయికి తప్పని తిప్పలు నాకున్న రెండున్నర ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసిన. కలుపుతీత కోసం కూలీలకే ఇప్పటివరకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చయ్యింది. పూతకు వచ్చినప్పటి నుంచి రెండు సార్లు మందులు పిచి కారీ చేసిన. ఇలా ఇప్పటివరకు మొ త్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పె ట్టిన. పంట కోతకు వచ్చిన సమయంలో లాక్డౌన్ వచ్చి పడింది. రవాణా సౌకర్యం లేదంటున్నారు. స్థానికం గా అమ్ముకుంటే ఏమొస్తుందో ఏమో.– నర్సయ్య, రైతు 20 శాతం పంటలకు నష్టం జనగామ జిల్లాలో రైతులు 15 వేల ఎకరాల్లో మామిడి, కూరగాయలు, బొప్పాయి, జామ తదితర పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, గాలి దుమారంతో 20 శాతం మేర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇందులో మామిడి 950 ఎకరాల్లో, బొప్పాయి 150 ఎకరాల్లో , కూరగాయలు 2 వేల ఎకరాల్లో 15 నుంచి 20 శాతం మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తాం. లాక్‌డౌన్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. – కేఆర్ లత, హార్టికల్చర్ ఆఫీసర్, జనగామ ఇబ్బందులు వాస్తవమే.. ఉద్యాన ఉత్పత్తుల విక్రయాలకు లాక్డౌన్ కొంత ఇబ్బందిగా మారిన విషయం నిజమే. ప్రతిరోజూ మార్కెట్‌కు పుచ్చతో పాటు ఇతర పండ్లు వస్తున్నాయి. మార్కెట్లో పండ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదు. అయితే మే మాసంలో కోతకు వచ్చేలా పంటలు సాగు చేసిన వారుంటే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. సడలింపు సమయం తక్కువ కావడంతో కూరగాయలు, ఆకుకూరలు మాత్రం పూర్తి స్థాయిలో విక్రయించుకోలేక పోతున్నారు. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా పంట పేరు: పుచ్చ సాగుచేసిన విస్తీర్ణం: మూడు ఎకరాలు పెట్టుబడి: రూ.2.10 లక్షలు నష్టం: రూ.5 లక్షలు ఇదీ పుచ్చ సాగు వ్యయాల లెక్క. నలిమెల ప్రవీణ్‌రెడ్డి (ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర) రెండేళ్లుగా యాసంగి పంటగా పుచ్చ సాగుచేస్తున్నాడు. గతేడాది ఆరెకరాల్లో సాగుచేయగా, పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌తో లాభాలకు తాళంపడింది. అప్పట్లో ఊరూరా తిరిగి ఒక్కో కాయను రూ.10 చొప్పు న అమ్మి కొంత సొమ్ము చేసుకున్నాడు. ఈసారి లాక్డౌన్ కఠిన నిబంధనలతో ఆ అవకాశమూ లేకపోయింది. పైగా ధర లేదు. వ్యాపారులూ కొనుగోలుకు రాలేదు. కూలీలతో కాయలు కోయించి విక్రయిద్దామంటే కూలీ డబ్బులైనా వస్తాయో రావోనని మూడెకరాల్లోని పంట మొత్తం వదిలేశాడు. అన్నీ సవ్యంగాజరి గుంటే.. పెట్టుబడి పోను రూ.3 లక్షల లాభం మూటగట్టుకునే వాడు. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ బుధవారం నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 13 పైసల పతనం కూడా ప్రతికూలంగా మారింది. ఫలితంగా సెన్సెక్స్ 291 పాయింట్లను కోల్పోయి 50వేల దిగువున 49,903 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లను కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది. మెటల్, ఆర్థిక, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 362 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. ఎఫ్ఐఐలు రూ.698 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.853 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. కమోడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలు దేశీయ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అయితే క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు.., మార్కెట్లో భారీ అమ్మకాలను అడ్డుకున్నాయి’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 50,089 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లను కోల్పోయి 15,059 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత రెండురోజులుగా సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 362 పాయింట్లను కోల్పోయి 49,831 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయి 15,009 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,585 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2019–20) ఇదే కాలంలో రూ. 9,864 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 63,057 కోట్ల నుంచి రూ. 89,319 కోట్లకు ఎగసింది. ఇదే కాలంలో యూకే అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) 95.2 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు నష్టం(రూ. 9,600 కోట్లు) ప్రకటించింది. ఇందుకు 1.5 బిలియన్ పౌండ్ల(రూ. 14,994 కోట్లు) అనూహ్య చార్జీలు కారణమయ్యాయి. వీటిలో పెట్టుబడులపై నగదేతర రైటాఫ్‌లు, పునర్వ్యవస్థీకరణ చార్జీలు కలసి ఉన్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. తద్వారా జేఎల్ఆర్కు సంబంధించి కొత్త గ్లోబల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఆధునిక లగ్జరీ డిజైన్లు, డెలివరీ తదితరాల రీఇమేజిన్కు తెరతీసినట్లు తెలియజేసింది. దీంతో 2025–26కల్లా రెండంకెల ఇబిట్ మార్జిన్లు సాధించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. స్టాండెలోన్ ఇలా క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 20 శాతంపైగా ఎగసి 6.5 బిలియన్ పౌండ్లను తాకింది. రిటైల్ అమ్మకాలు 12 శాతం పుంజుకుని 1,23,483 యూనిట్లకు చేరాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ క్యూ4లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. దాదాపు రూ. 1,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో రూ. 4,871 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 10,002 కోట్ల నుంచి రూ. 20,306 కోట్లకు జంప్‌చేసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన విక్రయాలు 90 శాతం దూసుకెళ్లి 1,95,859 యూనిట్లకు చేరాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జేఎల్ఆర్ మొత్తం ఆదాయం 19.7 బిలియన్ పౌండ్లను తాకింది. వాహన అమ్మకాలు దాదాపు 14 శాతం క్షీణించి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక గతేడాదిలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,395 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో రూ. 11,975 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,64,041 కోట్ల నుంచి రూ. 2,52,438 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ1 వీక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో పటిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల సమస్యకానున్నాయి. కోవిడ్–19 సెకండ్‌వేవ్ లాక్డౌన్, కమోడిటీల పెరుగుదలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను దెబ్బతీసే వీలున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే 2021–22 రెండో త్రైమాసికం నుంచీ పటిష్ట రికవరీ కనిపించగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో జేఎల్ఆర్ బిజినెస్‌పై 2.53 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలియజేశారు. దేశీయంగా రూ. 3,000–3,500 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.4% జంప్‌చేసి రూ. 332 వద్ద ముగిసింది.ఇంట్రాడేలో రూ. 337 వరకూ బలపడింది. సవాళ్లు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నాం.. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గతేడాది కంపెనీ నిలదొక్కుకోవడంతోపాటు పటిష్ట రికవరీని సాధించింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్లతో కూడిన భవిష్యత్ లగ్జరీ డిజైన్ల ద్వారా అమలు చేస్తున్న రీఇమేజిన్ వ్యూహాలు ఇందుకు దోహదపడుతున్నాయి. – థియరీ బోలోర్, జేఎల్ఆర్ సీఈవో సరఫరాల సమస్యను అధిగమిస్తున్నాం.. కోవిడ్–19 కారణంగా గతేడాది ఆటో పరిశ్రమ భారీగా ప్రభావితమైంది. అయినప్పటికీ వాహనాలకు నిలకడైన వృద్ధి కనిపించింది. లాక్డౌన్లు తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక రికవరీ వంటి అంశాలు ఇందుకు సహకరించాయి. సరఫరా సమస్యలను అధిగమిస్తూ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇదే సమయంలో ఉద్యోగులు, సహచర సిబ్బంది ఆరోగ్యం, రక్షణ తదితరాలకు ప్రాధాన్యమిచ్చాం. – గాంటర్ బుషక్, టాటా మోటార్స్ సీఈవో -
చికెన్ కేజీ ధర సగం తగ్గింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చికెన్ కారణమంటూ గత ఏడాది ప్రారంభంలో పుకార్లు వచ్చిన కారణంగా అమ్మకాలు 75 శాతం పడిపోయి ధర కిలోకు రూ.30కి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తర్వాత పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సెకండ్‌వేవ్ రూపంలో దెబ్బతీసింది. ఇప్పటికే చికెన్ వినియోగం 30 శాతం తగ్గింది. తాజాగా కర్ఫ్యూ, లాక్డౌన్లతో పరిశ్రమకు కొత్త సవాల్ విసిరింది. కిలోకు రూ.40 దాకా నష్టం.. గతేడాది ఫామ్ గేట్ వద్ద బ్రాయిలర్ కోడి కిలోకు ధర సగటున రూ.85 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.60–65 మధ్య ఉంది. ఉత్పత్తి వ్యయం ఏడాదిలో కిలోకు రూ.20–25 అధికమై ఇప్పుడు రూ.95–100కు చేరిందని స్నేహా ఫామ్స్ సీఎండీ డి.రామ్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ లెక్కన కిలో కోడికి రైతుకు రూ.40 దాకా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. గతేడాది నుంచి పరిశ్రమ నష్టాలను మూటగట్టుకుంటోందని వెల్లడించారు. ‘మొక్కజొన్న టన్నుకు ఏడాదిలో రూ.15,000 నుంచి రూ.17,000కు, సోయా రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. దీంతో దాణా వ్యయం అదే స్థాయిలో అధికమైంది. కోళ్లకు వాడే మందులు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటి ధరలు 30 శాతం పెరిగాయి’ అని వివరించారు. క్రమంగా తగ్గుతున్న వినియోగం.. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–16 లక్షల కోళ్లు అమ్ముడవుతాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ వాటా 6 లక్షలు. ఇప్పుడీ వినియోగం 12 లక్షల కోళ్లకు వచ్చి చేరింది. కోవిడ్ ముందు వరకు మొత్తం చికెన్ అమ్మకాల్లో హోటళ్లు, ఫంక్షన్ల వాటా 25 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 5 శాతానికి వచ్చింది. వైరస్ ఉధృతితో శుభకార్యాలు దాదాపుగా వాయిదా పడ్డాయి. కొద్ది రోజుల క్రితం వరకు జరిగినా పరిమిత సంఖ్యలో అతిథులతో వేడుకలు కొనసాగాయి. ఇప్పుడు లాక్డౌన్ తోడు కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. కేజీ ధర సగం తగ్గింది.. రిటైల్‌లో స్కిన్లెస్ చికెన్ ధర ఈ ఏడాది కిలోకు కనిష్టంగా రూ.140 పలికితే.. గరిష్టంగా రూ.300 వరకు వెళ్లింది. ప్రస్తుతం రూ.150–180 మధ్య ఉంది. అంటే ఈ ఏడాది అమ్ముడైన గరిష్ట ధరతో పోలిస్తే కిలోకు దాదాపు సగం తగ్గిందన్న మాట. 2019లో ధర రూ.340 దాకా పలికిందని హైదరాబాద్‌లోని విజయనగర్ చికెన్ సెంటర్ యజమాని బండి సాయి కిరణ్ తెలిపారు. కోవిడ్‌కు చికెన్ కారణమంటూ పుకార్లు రావడంతో గతేడాది ఫిబ్రవరి–మార్చిలో కిలో ధర రూ.30కి పడిపోయిందని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా రూ.260 వరకు వెళ్లిందన్నారు. వైరస్ భయంతో ప్రస్తుతం జనాలు బయటకు రావడం లేదని, హోటళ్ల వ్యాపారం తగ్గడంతో చికెన్ అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. విలువ రూ.90,000 కోట్లు భారత పౌల్ట్రీ పరిశ్రమ విలువ రూ.90,000 కోట్లు. ఈ పరిశ్రమకూ కోవిడ్–19 ముప్పుగా పరిణమించింది. పరిశ్రమలో దక్షిణాది వాటా ఏకంగా 70%. సగటు చికెన్ వినియోగం దేశంలో 4.5 కిలోలుంటే దక్షిణాదిన ఇది 8 కిలోలు ఉంది. ఇక పౌల్ట్రీలు ఏర్పాటు చేసి సొంతంగా మార్కెట్ చేసుకునేవారు తెలుగు రాష్ట్రాల్లో 25 శాతముంటారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవారే. అంటే రైతుల నుంచి కోళ్లను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ వ్యాపారంలో 100 వరకు కంపెనీలు ఉన్నట్టు సమాచారం. -
NIFTY: 14900 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లోనే ముగిసింది. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్న సెన్సెక్స్ 341, కుప్పకూలి 49161 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు నష్టంతో 14850 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. జెఎస్డబ్ల్యు స్టీల్, కోటక్ బ్యాంక్, హిందాల్కో, విప్రో పీఎన్బీ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోయాయి. కోల్ ఇండియా ఐవోసీ,ఎన్టీపీసీ అల్ట్రాటెక్, మిడ్‌క్యాప్ షేర్లలో భెల్, కోఫోర్జ్, కాంకోర్, గెయిల్, వోల్టాస్ ఎక్కువ లాభాల్లో ముగిసాయి. మరోవైపు రుపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో ఒక పైసా నష్టంతో 73.34వద్ద క్లోజ్ అయింది. -
కోవిడ్ టెర్రర్: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా కరోనా మహమ్మారి విలయానికి తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే 600 పాయింట్లు కుప్పకూలి భారీ పతనాన్ని నమోదు చేసింది. పతనం నుంచి తేరుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 344 పాయింట్ల నష్టంతో 48437 వద్ద, 88 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 14549వద్ద ట్రేడవుతోంది. మెటల్స్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ మినహా మిగిలిన రంగాలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, కన్యూజర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ యూనిలీవర్ లాభాల్లోనూ, టైటన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు కూడా 3వేలకు పైగామరణాలను నమదయ్యాయి. పాజిటివ్ కేసుల నమోదు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.68లక్షలుగా ఉంది. దీంతో మొత్తం కరోనాబాధితుల సంక్య 1.99 కోట్లుగా ఉండగా 3,417 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 2.18 లక్షలకు చేరింది. -
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ ఆర్థిక సంవత్సరాన్ని(2020–21) నష్టాలతో ముగించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా భయాలతో ఇన్వెస్టర్లు అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 627 పాయింట్లను కోల్పోయి 50 వేల దిగువున 49,509 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్ 154 పాయింట్లు నష్టపోయి 14,691 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల లాభాలకు ముగింపు పడినట్లైంది. అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్‌తో పెరగడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనంగా కదలాడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక, ఐటీ, ఆటో రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. వృద్ధి అవకాశాలకు ఆస్కారం ఉన్న మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. వీటితో పాటు ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు కూడా రాణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజున విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,686 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,082 కోట్ల షేర్లను అమ్మారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్ మౌలిక రంగ ప్యాకేజీతో పాటు కార్పొరేట్ పన్నులు పెంపు నిర్ణయాన్ని వెల్లడించవచ్చనే అంచనాలతో ఈక్విటీ మార్కెట్లలో తిరిగి బలహీన వాతావరణం నెలకొంది. దీనికి తోడు యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 14 నెలల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంట్ మరింత బలహీనపడింది. కరోనా కేసులు అంతకంతా పెరుగుతూనే ఉన్నాయి’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. నాలుగు శాతం నష్టపోయి హెచ్డీఎఫ్సీ షేర్లు బ్యాంకు సేవల్లో సాంకేతిక సమస్యలు వస్తున్న విషయాన్ని వెల్లడించంతో హెచ్డీఎఫ్సీ ద్వయం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.2,504 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 3.82 శాతం క్షీణించి రూ.1,494 వద్ద స్థిరపడింది. 2020–21లో మెరుపులు భారత్ స్టాక్ మార్కెట్ ఆర్థిక సంవత్సరం(2020–21)లో గడిచిన పదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కరోనా సవాళ్లను అధిగమిస్తూ, లాక్డౌన్ ఆంక్షల విధింపు అవాంతరాలు ఎదురైనా, సెన్సెక్స్ 20,041 పాయింట్లు, నిఫ్టీ 6,093 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లు అధిక లాభాల్ని ఇచ్చాయి. సెన్సెక్స్ ఈ ఏడాది (2021) ఫిబ్రవరి 16 తేదిన 52,517 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,423 వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్థిక ఇబ్బందులతో ఈక్విటీ మార్కెట్ పతనమైతే.., అది పెట్టుబడుల పెట్టేందుకు అవకాశంగా భావించాలని ఎఫ్వై 21 నిరూపించినట్లు స్టాక్ నిపుణులు తెలిపారు. ‘2008–09లో మార్కెట్ 40% పతనమైన నేపథ్యంలో 2009–10లో ఇన్వెస్టర్లకు 80% లాభాల్ని అందించింది. అవే పరిస్థితులు ఇప్పుడు పునరావృతమయ్యాయి. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ 30 శాతం దిద్దుబాటుకు గురైంది. తర్వాత ఏడాది అంటే 2020–21లో 68% రాబడిని ఇచ్చింది’’ ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ తెలిపారు. ఇన్వెస్టర్లకు కాసుల పంట.. స్టాక్ మార్కెట్ ఎఫ్వై 21లో 68 శాతం ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది. కేవలం ఏడాది కాలంలోనే రూ.91 లక్షల కోట్లను గడించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ(మార్కెట్ క్యాప్) మార్చి 31 నాటికి రూ.204 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. 2021 మార్చి మూడో తేదీన మార్కెట్ క్యాప్ రూ.210 లక్షల కోట్లకు చేరుకొని జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 21) చివరి ట్రేడింగ్ రోజు బెంచ్‌మార్క్ సూచికలు సగం శాతానికి పైగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు పడి 49,750 స్థాయిని, నిఫ్టీ 14,750 మార్కును కోల్పోయింది. ఫార్మా తప్ప అన్ని రంగాలు నష్టపోతున్నాయి.నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతం పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 424 కుప్పకూలి 49710 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 14732 వద్ద కొనసాగుతోంది. (బుల్ మళ్లీ రంకెలేసింది..) -
హెడ్జ్ ఫండ్ డిఫాల్టుతో బ్యాంకులకు భారీ నష్టాలు
బెర్లిన్: అమెరికాకు చెందిన ఓ హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్ కావడంతో పలు పెద్ద బ్యాంకులు భారీగా నష్టాలు నమోదు చేయనున్నాయి. మార్జిన్ కాల్స్‌కి అవసరమైన నిధులను సమకూర్చడంలో సదరు సంస్థ విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్చిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే హెడ్జ్ ఫండ్ లావాదేవీలు ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం. ‘మార్జిన్ అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చడంలో ఫండ్ విఫలం కావడంతో మా సంస్థ సహా పెద్ద సంఖ్యలో ఇతర బ్యాంకులకు ’గణనీయంగా నష్టాలు’ వాటిల్లాయి అని స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ తెలిపింది. జపాన్ దిగ్గజం నొమురా తమ నష్టాలు 2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. హెడ్జ్ ఫండ్లు తమ స్టాక్స్ పోర్ట్‌ఫోలియోనూ పూచీకత్తుగా ఉంచి, ట్రేడింగ్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ షేర్ల విలువ పడిపోతే నిర్దేశిత మార్జిన్ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తాజాగా ఆర్చిగోస్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. వయాకామ్సీబీఎస్తో పాటు పలు చైనా టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌లో ఆర్చిగోస్ భారీగా పొజిషన్లు తీసుకుంది. కానీ, వయాకామ్‌సీబీఎస్ షేర్ల ధరలు గణనీయంగా పతనం కావడంతో ఆర్చిగోస్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దానికి నిధులిచ్చిన ఆర్థిక సంస్థలపైనా ప్రతికూల ప్రభావం పడింది. -
కరోనా షాక్ : మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. కానీ వెంటనే ఇన్వెస్టర్ల అమ్మకాలతో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రదానంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 49 వేల దిగువకు పడిపోయింది. అటు నిప్టీ కూడా 14500 స్తాయిని కూడా కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయి 48839 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు పతనంతో 14447 వద్ద కొనసాగుతున్నాయి. టాటామోటార్స్, అదానీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంకు ఐటీసీ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్ర, బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టపోతున్నాయి. మరోవైపు భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అంతటా పొపాయ్ రెస్టారెంట్లకు సబ్ లైసెన్సింగ్ ప్రకటించడంతో జూబిలెంట్ ఫుడ్ 2 శాతం లాభపడుతోంది. (గుడ్ న్యూస్ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ) కరోనా మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లుదాదాపు 2 శాతం కుప్పకూలాయి. ఐరోపాలో కరోనా విజృంభణ, లాక్డౌన్ ఆందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు నడిపిస్తోంది. (వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర) కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 53,476 కొత్త కోవిడ్ కేసులు నమోదుగా 251 మరణాలు సంభవించాయి. -
మార్కెట్లకు కోవిడ్ సెగ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.దేశీయంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల ఆందోళనకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లప్రతికూల సంకేతాలతో సోమవారం (మార్చి 22) కీలక సూచీలు భారీగా నష్టాలనెదుర్కొంటున్నాయి. ఆరంభంలోనే 350 క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 281 పాయింట్లు నష్టంతో 49577వద్ద, 57 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 14686 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో,కేపిటల్ గూడ్స్ ఫ్లాట్‌గా ఉన్నాయ్. కన్జ్యూమర్ గూడ్స్, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. (జియోకు షాకిస్తున్న ఎయిర్టెల్) టాటా మోటర్స్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టిసిఎస్ ఉండగా, బిపిసిఎల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్‌ఫార్మా,బ్రిటానియా లాభాల్లోనే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటర్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఎల్ అండ్ టి, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ స్వల్పలాభాల్లోనూ కొనసాగుతున్నాయి. కాగా దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఆందోళన రేపుతోంది. గత 24 గంటల్లో 46,951 తాజా కరోనావైరస్ కేసులునమోదయ్యాయి. ఒక రోజులో ఇంత పెద్ద స్థాయిలో కేసులు రావడం గత ఏడాది నవంబర్ 7 తరువాత ఇదే తొలిసారి. దీంతో మొత్తం 1,16,46,081 మంది కరోనా బారిన పడగా, మరణించినవారి సంఖ్య మొత్తం 1,59,97 కు చేరింది. -
అమ్మకాల సెగ: 49 వేల దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభ నష్టాలనుంచి ఏ మాత్రం కోలుకోని కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి.దాదాపుఅన్ని రంగాలషేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ 14 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 253 పాయింట్లు కోల్పోయి 48982 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు నష్టంతో 14476 వద్ద ట్రేడ్ అవుతోంది. పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ ఆటో, రియాల్టీ, బ్యాంక్, ఫైనాన్స్, మెటల్, మీడియా, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి సూచీలు కూడా 1-3.5 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్, ఓఎన్జిసి,గెయిల్, ఎల్ అండ్ టీ, కోల్ఇండియా భారీగా నష్టపోతున్నాయి. ఇంకా టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జెఎస్డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, టైటాన్, బజాజ్ఆటో, ఐషర్ మోటార్స్ కూడా నష్టాల్లోనే ఉన్నాయి.మరోవైపు కోటక్ మహీంద్రా భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ స్వల్పంగా లాభపడుతున్నాయి. -
440 పాయింట్లు పతనమైన మార్కెట్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసింది. ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. తీవ్రంగా ఊగిసలాట మధ్య సూచీలుచివరికి వారాంతంలో మద్దతు స్థాయిలకు దిగువకు చేరడం గమనార్హం.సెన్సెక్స్ 441 నష్టంతో 50405 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు పతనమై 14938 వద్ద క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్‌తోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి. -
తీవ్ర ఒడిదుడుకులు :15వేల దిగువకు నిఫ్టీ
సాక్షి ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగానే కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నా, తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నిఫ్టీ 15వేలకు దిగువకు, సెన్సెక్స్ 50600 స్థాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతంసెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 50591 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు క్షీణించి14991 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్ ఐటీ రంగాల్లో అమ్మకాలుకి కనిపిస్తుండగా,అయిల్ రంగ షేర్లు లాభ పడుతున్నాయి. ఓఎన్జిసి, గెయిల్, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం లాభపడుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ , విప్రో, టాటామోటర్స్ , ఎస్బీఐ, హిందాల్కో నష్టాల్లోఉన్నాయి. -
మార్కెట్‌ను ముంచేసిన అంతర్జాతీయ అస్థిరతలు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు మరోసారి మన మార్కెట్‌ను ముంచేశాయి. ఆరున్నర గంటల పాటు అమ్మకాల పరంపరం కొనసాగడంతో సూచీలు గడిచిన తొమ్మిది నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు వెల్లువెత్తడం సూచీలు భారీ క్షీణతకు దారితీసింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,939 పాయింట్ల నష్టంతో 49,100 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,149 పాయింట్ల మేర నష్టపోయి 48,890 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 630 పాయింట్ల పతనమై 14,467 వద్దకు దిగజారింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సూచీలతో పాటు ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ సూచీలు 5% పతనమయ్యాయి. మెటల్, ఫార్మా, ఐటీ, ఆటో ఇండెక్స్‌లు 3% పతనయ్యాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో వడ్డీరేట్ల పెరుగుదల భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి భారీ పతనం ప్రతికూలాంశాలుగా మారాయి. దేశీయ మార్కెట్‌ను రానున్న రోజుల్లో క్యూ3 జీడీపీ గణాంకాలు కొంతకాలం ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం పాటు మన మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలనే అనుసరిస్తుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని అంశాలు... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు, నిఫ్టీలోని 50 షేర్లలో ఏ ఒక్క షేరూ లాభంతో ముగియలేదు. ► మార్కెట్లో ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. ► క్రూడాయిల్ ధర కాస్త దిగిరావడంతో ఓఎన్జీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా షేరు ఎనిమిది శాతం పతనంతో రూ.111 వద్ద ముగిసింది. ► హెచ్డీఎఫ్సీ ద్వయం షేరు 4 నుంచి 5 శాతం పతనయ్యాయి. నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టం సూచీలు మూడు శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు 5.43 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టాన్ని చూవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచ్చింది. పతనానికి కారణాలు... ► భయపెట్టిన బాండ్ ఈల్డ్స్ ... కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా పుంజుకుంటోంది. వ్యవస్థ ఊహించని రీతిలో వృద్ధి బాట పట్టడంతో రానున్న రోజుల్లో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తిరిగి వడ్డీరేట్లను పెంచవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఈక్విటీలతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడులకు రిస్క్ సామర్థ్యం చాలా తక్కువ. పైగా వడ్డీరేట్ల పెంపుతో బాండ్ల నుంచి అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఈక్విటీల నుంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు. ► మళ్లీ పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఒకపక్క దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనూ తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 15వేల కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పెరుగుతున్న కేసుల నియంత్రించే చర్యల్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన లాక్డౌన్ చర్యలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆంటంకాన్ని కలిగించవచ్చనే ఆందోళనలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ► లాభాల స్వీకరణ.. అప్రమత్తత! అంతకుముందు సూచీలు మూడురోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 1295 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అలాగే మార్కెట్ ముగింపు తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ► ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు... పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య రాజుకున్న ఘర్షణలు కూడా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం రాత్రి రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లపై పడటంతో శుక్రవారం ఆసియాలో ప్రధాన దేశాలైన జపాన్, చైనా, సింగపూర్, కొరియా, తైవాన్ దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు 2–3 % శాతం నష్టాన్ని చవిచూశాయి. ► రూపాయి భారీ పతనం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ కుప్పకూలింది. గత 19 నెలల్లోలేని విధంగా 104 పైసలు కోల్పోయింది. 73.47 వద్ద ముగిసింది. -
అమ్మకాల సెగ : నష్టాల్లో సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగుతోంది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 187 పాయింట్ల నష్టంతో 50702 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 14936 వద్దకొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 51 వేల దిగువన, నిఫ్టీ 15వేల దిగువకు చేరాయి. అటు డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో సిరీస్ దాదాపు అన్ని రంగాల షేర్లులో అమ్మకాలు కొనసాగుతున్నాయి. -
అమ్మకాల సెగ : 52 వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అత్యధిత స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో సెన్సెక్స్ 52వేల దిగువకు చేరగా, నిఫ్టీ 15300 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 347పాయింట్లు కుప్పకూలి, 51756 నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 15230 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్, మీడియా, ఆటో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఎస్బీఐ లాభపడుతుండగా, హెచ్‌డిఎఫ్‌సి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ భారీగా నష్టపోతున్నాయి. -
లాభాల స్వీకరణ: బుల్ రన్‌కు బ్రేక్
సాక్షి, ముంబై: అత్యధిక రికార్డు స్థాయిలనుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదు పరుల లాభాల స్వీకరణ సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో కొనసాగుతున్నప్పటికీ 50వేలకు ఎగువన సెన్సెక్స్, నిఫ్టీ 14700కు పైన స్థిరంగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. 50వేల మద్దతు స్థాయికి పైన ఉన్నంతవరకు ఆందోళన అవసరం లేదని విశ్లేషకుల అంచనా. అయితే ఈ స్థాయిల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తునన్నారు. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 50040 వద్ద, నిఫ్టీ 51 పయింట్ల నష్టంతో 14750 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఐటీ, పీఎస్‌యు బ్యాంక్ సూచికల్లో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. మరోవైపు, ఆటో, ఎఫ్ఎంసిజి, మెటల్, మీడియా షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటామోటార్స్ ఏషియన్ పెయింట్స్ తదితరాలు నష్టాల్లోనూ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జిసి, బజాజ్ ఆటో లాభాల్లోను ఉన్నాయి. మెరుగైన ఫలితాలనుప్రకటించినభారతి ఎయిర్టెల్ లాభాల జోరు కనిపిస్తోంది. -
ప్రీ బడ్జెట్ ఫీవర్ : తీవ్ర ఊగిసలాట
సాక్షి, ముంబై : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రానున్న బడ్జెట్ మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే లాభాలతో సూచీలు ఫిబ్రవరి సిరీస్‌ను ఉత్సాహంతో ప్రారంభించాయి. 400 పాయింట్లకు పైగాఎగిసి 5 రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. కానీ ఆ తరువాత తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46285 వద్ద 46 వేల 300 స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ కూడా అదే పరిస్థితి. 183 పాయింట్ల నష్టంతో 13634 వద్ద నిఫ్టీ ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు కనిపించింది. (ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ , బీపీసీఎల్ లాభపడగా, రిలయన్స్, బ్రిటానియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, హీరో మోటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, డా. రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ , భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి. (ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా) -
ఐదో రోజూ ఆగని పతనం: కరెక్షన్ మంచిదే!
సాక్షి,ముంబై: 2021లో కొత్త ఏడాదిలో ఆల్‌టైం రికార్డులుతో మెరుపులు మెరిపించింది దలాల్ స్ట్రీట్. కానీ ఏడాది తొలి డెరివేటివ్ సిరీస్‌మాత్రం నష్టాల్లో ముగిసింది. జీవితకాలం గరిష్టాలు, వచ్చే వారం రానున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలుమార్కెట్లనుదెబ్బతీసాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇంట్రా డేలో ఏకంగా 800 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పతనమై 47వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 13750 స్థాయిని కూడా కోల్పోయింది. అయితే చివరి అర్ధగంటలో కాస్త తెప్పరిల్లింది. చివరకు సెన్సెక్స్ 536 పాయింట్ల నష్టంతో 46874 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 13817వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి, ఐటి, రియాల్టీ ఇండెక్స్ 1.5-2.7 శాతం మధ్య నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఐసీఐసీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. విప్రో, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్ కూడా నష్టాలో ముగిసాయి. అయితే రికార్డు స్థాయిల నుండి ఇది ఆరోగ్యకరమైన దిద్దుబాటని, బడ్జెట్ కంటే ముందే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారని డెరివేటివ్ రోల్ ఓవర్ల బట్టి అర్థమవుతుందని ఇది మంచి సంకేతమని ఐడీబీఐ క్యాపిటల్ పరిశోధన విభాగాధిపతి ఏకే ప్రభాకర్ అన్నారు -
అమ్మకాల జోరు, 47వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు వరుసగా ఐదోరోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి తోడు జనవరి ఫ్యూచర్స్ , ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ఫలితంగా సూచీలు నెల రోజుల కనిష్టానికి పతనమైనాయి. సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టం నుంచి 3వేల పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. గురువారం ఒక దశలో సెన్సెక్స్ 589 పాయింట్ల వరకు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 46,821 ను తాకింది. నిఫ్టీ ముఖ్య మద్దతు స్థాయి 13,800 దిగువకు చేరువలో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 457 పాయింట్లు కోల్పోయి 46956 వద్ద 47 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పతనమై 13836 వద్ద కొనసాగుతోంది. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్పంగా లాభపడుతుండగా, బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో, ఐటి, పవర్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పవర్‌గ్రిడ్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, టెక్ఎం, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సీ భారీగా నష్ట పోతున్నాయి. మరోవైపు రిలయన్స్ , ఓన్జీసీ, బిపిసిఎల్, ఎన్టిపిసి, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీసిమెంట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
బేర్ గుప్పిట్లోకి... మార్కెట్
ముంబై: బడ్జెట్ భయాలతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం బేర్ గుప్పిట్లో విలవిల్లాడింది. అలాగే జనవరి ఎఫ్ అండ్æఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో అప్రమత్తత మార్కెట్‌ను మరింత భయపెట్టింది. ఫలితంగా సెన్సెక్స్ 48 వేల స్థాయిని కోల్పోయి 938 పాయింట్ల నష్టంతో 47,410 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు కోల్పోయి 14వేల దిగువన 13,967 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగో నష్టాల ముగింపు. మార్కెట్ మొదలైన మరుక్షణం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ కొనసాగే కొద్దే విక్రయాల ఒత్తిళ్లు పెరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,007 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.1,688 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నాలుగురోజుల్లో నెల లాభాలు ఆవిరి... మార్కెట్ నాలుగు రోజుల పతనంతో సూచీలు ఈ జనవరిలో ఆర్జించిన లాభాలన్నీ ఆవిరైపోయాయి. మొత్తం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,382 పాయింట్లు, నిఫ్టీ 678 పాయింట్లను కోల్పోయాయి. ఇదే నెలలో సూచీలు అందుకున్న జీవితకాల గరిష్టస్థాయిల నుంచి ఐదుశాతం పతనాన్ని చవిచూసినట్లైంది. నష్టాలకు నాలుగు కారణాలు... వెంటాడిన బడ్జెట్ భయాలు... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేవారం మొదటిరోజు(ఫిబ్రవరి 1న)నే 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో అధిక పన్ను విధింపునకు ఆస్కారం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. బడ్జెట్ తర్వాత కొనుగోళ్ల కోసం కొంత లిక్విడిటీ చేతుల్లో ఉంటే మంచిదనే ఆలోచనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు కొందరు నిపుణులు తెలిపారు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే బడ్జెట్ ఈక్విటీ మార్కెట్‌ను మెప్పించిందనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. బేరిష్‌గా మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ... భారత ఈక్విటీ మార్కెట్ల విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా బేరిష్ వైఖరిని ప్రదర్శించడం మార్కెట్ సెంటిమెంట్ బలహీనపరిచింది. గత మూడురోజుల నుంచి ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతూ మొత్తం రూ.3,089 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు పేర్కొన్నాయి. దేశీయ కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడ్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్యపరపతి సమావేశాలు లాంటి ప్రధాన ఈవెంట్ల నేపథ్యంలో ఎఫ్ఐఐలు ‘‘వేచిచూసే ధోరణి’’ని ప్రదర్శిస్తున్నారని నిపుణులు తెలిపారు. నిరాశపరచిన క్యూ3 ఫలితాలు కొద్దిరోజులుగా కార్పొరేట్ కంపెనీలు వెల్లడిస్తున్న మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. అధిక మొత్తంలో మొండిబకాయిలను ప్రకటిస్తూ బ్యాంకింగ్ కంపెనీలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆరి ్థక వ్యవస్థ పనితీరుకు అద్దంపట్టే బ్యాంకింగ్ రంగం బలహీనంగా ఉందనే సంకేతాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ప్రపంచ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు బలహీన అంతర్జాతీయ సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్యపాలసీ విధాన నిర్ణయం కోసం ఎదురుచూపులతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చుట్టూ నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీలతో పాటు యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కాగా అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. రూ. 2.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం... ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.6 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.189 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇక నాలుగురోజుల పతనంతో ఇన్వెస్టర్లు మొత్తం రూ.8 లక్షల కోట్లను కోల్పోయినట్లైంది. మరిన్ని సంగతులు బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, అపోలో హాస్పిటల్, సైయెంట్, రూట్ మొబైల్స్, యూపీఎల్ షేర్లు తాజాగా ఏడాది గరిష్టాన్ని తాకాయి. రియలన్స్ షేరు 2.50 శాతం క్షీణించి రూ.1900ల దిగువున రూ.1895 వద్ద స్థిరపడింది. అమెజాన్‌తో ఫ్యూచర్స్ గ్రూప్ కొనుగోలు వివాదంతో పాటు బలహీన క్యూ3 ఆర్థిక గణాంకాలన నమోదు షేరు పతనానికి కారణవుతోంది. మొత్తం మూడు రోజుల్లో 10 శాతం నష్టపోయింది. ఎఫ్అండ్ఓ ముగింపు గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఎక్స్ఐ ఇండెక్స్ ఐదు శాతం పెరిగి 24.39 వద్ద స్థిరపడింది. -
బ్యాంకుల దెబ్బ, 48 వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ కూడా అమ్మకాల సెగ తాకుతోంది. దీంతో సెన్సెక్స 48వేలకు దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 14100 దిగువకు చేరడం గమనార్హం. ఆరంభంలో స్వల్ప లాభాలను ఆర్జించినా, అమ్మకాల ఒత్తిడితో మిడ్‌సెషన్‌లో 620 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 619 పాయింట్ల నష్టంతో 47733 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో 14,067 వద్ద బలహీనంగా కొనసాగుతున్నాయి. ఐటీ, టెక్నాలజీ మినహా మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రాలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, ఐషర్ మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు విప్రో, టెక్ఎం, ఎల్అండ్టీ మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. -
రిలయన్స్ షాక్: కుప్పకూలిన సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి.వారం ఆరంభం రోజు సోమవారం జోరుమీదున్న దేశీయ మార్కెట్లు ఆ తరువాత భారీ ఒడి దుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో ఆఖరి అర్థగంటలో మరింత అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 531 పాయింట్ల నష్టంతో 48347 వద్ద 49వేల దిగువకు చేరింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమై 14239 వద్ద 14వేల 300 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ మినహా మిగిలిన సూచీలన్నీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా హెవీవెయిట్ షేరురిలయన్స్ 5 శాతం పతనంకావడంమార్కెట్లను దెబ్బతీసింది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ భారీగా నష్టపోయాయి. అలాగే క్యూ3 లో నికర లాభాలు 16 శాతం ఎగిసినట్టు ప్రకటించిన కోటక్ మహీంద్ర కూడా నష్టపోయింది. మరోవైపు గ్రాసిం, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి. టీసీఎస్ ఘనత భారతీయ సాఫ్ట్వేర్ సేవలసంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) నయాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం 169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు. -
బ్యాంకింగ్ షాక్ : 49 వేల దిగుకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: చారిత్రక గరిష్టాలనుంచి కీలక సూచీలు వెనక్కి తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ ఆరంభంలో లాభాల్లో ఉన్నా ఆతరువాత నుంచి అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ ఇండెక్స్‌లో భారీ అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1000పాయింట్లు కుప్పకూలింది. లాభనష్టాల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 746 పాయింట్ల నష్టంతో 48878 వద్ద 49 వేల స్థాయినికూడా కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 14372 వద్ద 14400 వేల దిగుకు చేరింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. యాక్సిస్,ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, హిందాల్కో, టెక్ మహీంద్రా, బజాజ్‌ఫైనాన్స్ డాక్టర్ రెడ్డీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు టాటా మోటార్స్ బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ , హీరోమోటోకార్ప్, బ్రిటానియా నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. -
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
సాక్షి, ముంబై: సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభానికి చేరినా, ఆ తరువాత 400 పాయింట్లు కోల్పోయింది. నిప్టీ 14,300 దిగువకు చేరింది. మళ్లీ కొనుగోళ్లతో పుంజుకున్నా తిరిగి ఏకంగా 600 పాయింట్ల నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్ 454 పాయింట్లకుపైగా నష్టంతో 484 75 వద్ద, నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 14244 వద్ద కొనసాగు తోన్నాయి. మెటల్, ఆటో, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అయితే ప్రముఖ కార్ల సంస్థ టెస్లాతో ఒప్పందం కుదుర్చుకుందన్నవార్తలతో టాటా మోటార్స్ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. అయితే ఈ వార్తలను సంస్థ కొట్టి పారేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్‌లు మోస్ట్ యాక్టివ్‌గా ట్రేడవుతోన్నాయి. యూపీఎల్ , హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్రిటానియా టాప్ గెయినర్స్‌గా ఉండగా,. టాటా స్టీల్ , హిందాల్కో , కోల్ ఇండియా ఇండస్ఇండ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.