Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది.
పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment