Stockmarket
-
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ట్రేడింగ్‌లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్‌ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్‌వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: 20,100 పైనే నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు నెలవారీ గడువు ముగింపు, ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఫెడ్ఛైర్మన్ పావెల్ సమావేశం ఉండడంతో కూడా మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల పుంజుకుని 20,133కు చేరింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్‌ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్‌కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్‌లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్‌సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్‌తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్‌క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
సాక్షి మనీ మంత్రా: వచ్చే వారం మార్కెట్, ఏయే సెక్టార్లు బావుంటాయి?
రానున్న వారంలో మార్కెట్ మూమెంటం ఎలా ఉండబోతోంది. ఈ వారం భారీ నష్టాలనుంచి పుంజుకుని ముందుకొచ్చాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచిన నేపథ్యంలో నెక్ట్స్ ఎలా ఉండ బోతోంది.. తదితర విషయాలపై అశిక ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ లీడ్ ఎనలిస్ట్ కౌశిక్ మోహన్‌తో సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ.. గ్లోబల్ పరిణామాలు ఎఫ్ఐఐ సెల్లింగ్, ఆయిల్ ధరలు బలమైన డాలర్ నేపథ్యంలో మార్కెట్లో పరిణామాలు చూశాం. రానున్నది ఎలక్షన్ సీజన్, అలాగే పండుగ సీజన్ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం కాలేదు. దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎందుకు బలంగా ఉన్నాయంటే భారత్ అందిస్తున్న పీఎల్ఐ ప్రయోజనాల మూలంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.పురోగతి ఆకర్షణీయంగా ఉంది. వినియోగం పెరిగింది. అలా మనదేశంలో యంగస్టర్, నిపుణులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే చైనాతో పోలిస్తే ఇండియాపై పరిశ్రమలు మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేటు బాంక్స్, పీఎస్‌యూ బ్యాంక్స్ ఫలితాలు, క్రెడిట్ గ్రోత్ బావుంది. ఎస్బీఐ కొనుక్కోవచ్చు. హెచ్డీఎఫ్సీ గ్లోబల్‌గా టాప్-5 లో బ్యాంకుగా ఉంది. కోటక్, ఐసీఐసీఐ, కర్నాటక బ్యాంక్ పాజిటివ్‌గానే ఉన్నాయి. కనుక ఫైనాన్సియల్ రంగంలోనే ఎల్ఐసీ లాంటి ఇన్సూరెన్స్ సెక్టార్ బుల్లిష్‌గా ఉంది. అమెరికా ట్రెజరీ, ఇండియా బాండ్స్‌కి తేడా ఏంటి? ఇండియా డెఫిసిట్ ఎక్కువగాఉంటే గవర్నమెంట్స్ ట్రెజరీ బాండ్స్‌ను జారీ చేస్తుంది. టాక్స్ సేవింగ్స్ లాంటి వాటికోసం వాటిని కొనుగోలు చేస్తాం. లాంగ్ టర్న్ క్యాపిటల్ గెయిన్స్ కోసం కూడా వీటిని బై చేయవచ్చు. యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో వడ్డీ ఎక్కువ ఇస్తే.. అక్కడ రిటర్న్స్ ఎక్కువ వుంటాయి. కానీ డాలర్ చిక్కులుంటాయి. ఏదైనా లాంగ్ టెర్మ్‌లో బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇస్తాయి. ప్రస్తుతం పీఎస్‌యూ, ఇన్ఫ్రా, సిమెంట్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. కానీ ఇవీ ఫ్యూచర్ గైడెన్స్ ఆధారంగా ట్రేడింగ్ కావడం లేదు. అందుకే బలహీనత. కానీ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్, టెండర్స్ చూస్తే మనం చాలా పటిష్టంగా ఉన్నాం. సెప్టెంబరు క్వార్టర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే.. మేజర్‌గా నిఫ్టీలోనే కాకుండా ఫార్మా,కెమికల్ బావుండే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో డిఫ్లేషన్ ఉంది. చైనా డంపింగ్ కారణంగా కెమికల్, ఫార్మా ధరలు పడిపోయాయి. ఇపుడు మెల్లిగా కోలుకుంటున్నాయి. లోయర్ లెవల్స్‌ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌కూడా బలంగా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్)సెక్టార్ కూడా బాగా పెర్ఫాం చేయబోతోంది. ముఖ్యంగా మేడిన్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. వీటికి మళ్లీ బ్యాంకింగ్ సహకారం కచ్చితంగా అవసరం.. వీటిని కూడా మనం చూడాలి. ఆటో, ఆటో యాంగ్జీలరీస్లో ఇన్వెంటరీమీద దృష్టిపెట్టాలి. క్యూ 3లోఫెస్టివ్ సీజన్‌తో వస్తుంది కాబట్టి ఇపుడు కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. క్యూ2 ప్రొడక్ట్స్‌ను క్యూ3లో కొంటారు. ఇదొక సైకిల్. అలాగే రీసెంట్గా ఆటో కంపెనీల సేల్స్ బావున్నాయి. భారత్‌ను ట్రేడింగ్ కాగా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. క్యాష్ ఎర్నింగ్స్‌ను పరిశీలించి, షేర్లను కొనుగోలుకు ఎంపిక చేసుకోవాలి. రానున్న పదేళ్లలో ఇండియా గ్రోత్ కూడా శరవేగంగా పెరగబోతోంది. దాదాపు రెండు మూడు రెట్లు పుంజుకోతోంది. 6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవ బోతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఆర్బీఐ బూస్ట్, సెన్సెక్స్ హైజంప్
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది. రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్‌కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ, ఆటో జోరు, భారీ లాభాలు
Today Stockmarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పి భారీ లాభాలతోముగిసాయి.ముగింపులో, సెన్సెక్స్ 406 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 65,632 వద్ద, నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 19,544 వద్ద ముగిసాయి. రెండు రోజుల నష్టాల పరంపరను అధిగమించిన నిఫ్టీ 19,550పైన స్థిరపడింది. ఆటో, బ్యాంక్, ఐటీ క్యాపిటల్ గూడ్స్ లాభపడగా, ఫార్మా, పవర్ , పిఎస్‌యు బ్యాంకింగ్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, M&M , TCS టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, NTPC, నెస్లే ఇండియా ఉన్నాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. రూపాయి: బుధవారం నాటి ముగింపు 83.23తో పోలిస్తే భారత రూపాయి గురువారం డాలర్‌కు 83.25 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఇన్వెస్టర్ల అప్రమత్తత వరుసగా రెండో రోజూ నష్టాలు
Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండో సెషన్లో ఆరంభంలోనే నష్టాల నెదుర్కొన్న సూచీలు తరువాత మరింత దిగజారాయి. ఒక దశలో నిఫ్టీ 19,450 స్థాయిని కూడా కోల్పోయింది. ఎఫ్ఎంసిజి, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పిఎస్‌యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్,హెల్త్‌కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 65,226 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 19,436 వద్ద ముగిసాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోగా, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఐషర్ మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ మీట్- ఇన్వెస్టర్ల అప్రమత్తత గ్లోబల్ మార్కెట్ల సంకేతాలకు తోడు ద్రవ్య విధాన ఫలితాల ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC (ద్రవ్య విధాన కమిటీ) సమావేశాలు ప్రారంభమైనాయి. శుక్రవారం (అక్టోబర్ 6) న గవర్నర్ శక్తి కాంత్ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.20తో పోలిస్తే 83.23 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్రా: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది. ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్‌లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్‌గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో లాభాలు జోరు
Today StockMaket Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారంతాంలో పాజిటివ్‌గా ముగిసాయి. ఆరంభంలోనే లాభాలతో మురిపించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 19,600 ఎగువకుచేరింది. చివరికి 320పాయింట్లు పెరిగి 65,828 వద్ద,నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 19,638.వద్ద ముగిసాయి. ఐటీ మినహా దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ హెల్త్‌కేర్ సూచీలు 1-2.7 శాతం ఎగిసాయి. కాగ్నిజెంట్ ఫలితాల నిరాశాజనకంగా ఉండటంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ చివర్లో నష్టాలనుంచి తేరు కున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, దివీస్ ల్యాబ్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్టిమైండ్ట్రీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి గత ముగింపు 83.18తో పోలిస్తే డాలర్‌కు 14 పైసలు పెరిగి 83.04 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
సాక్షి మనీ మంత్రా: ఐటీ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్‌గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్‌కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది. -
వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారాంతంలో నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్పుల్గా మార్కెట్లు ఈ వారం షాక్ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో తదుపరి వారం పాజిటివ్‌గా ట్రేడ్‌లో ఉండవచ్చు. నియోట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకటరామన్ సాక్షిబిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్ షేర్లలో ఏవి బెటర్. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్ వుంది. లోయర్స్ లెవల్స్‌లో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్ బ్రేక్ అవ్వనంత వరకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈ లెవల్స్‌లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్‌లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్‌యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రికమెండెడ్ స్టాక్స్: టీవీఎస్ మోటార్స్, టీసీఎస్ కొనుగోలు చేయవచ్చుని రాజా వెంకటరామన్ సూచిస్తున్నారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ
Today StockMarket Closin: దేశీయ స్టాక్‌మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి. చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్ఎం ఎస్బీఐ, కోల్ ఇండియా టాప్ గెయనర్స్‌గా నిలవగా, డా.రెడ్డీస్, విప్రో,యూపీఎల్, బజాజ్ ఆటో, సిప్లా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది. 82.93 ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్..రోజంతా నష్టాలే
Bloodbath in Today StockMarket: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్ రోజంతానష్టాలతోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19742 వద్ద ముగిసింఇ. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్; హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్,కోటక్ మహీంద్ర, పీఎన్బీ, ఫెడలర్, ఎస్బీఐ, తదితర బ్యాంకింగ్ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్ ఇతర టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్ర, ఏసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్ బీపీసీఎల్, లాభపడ్డాయి. రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయి 83.09 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా : భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్
Today Stock Market Opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు కుప్పకూలగా నిఫ్టీ 19900 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ , హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్, గ్రాసిం ప్రధానంగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం 276 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 66515 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో 198258 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్, హిందాల్కో లాభపడుతున్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా తగ్గి 83.09 వద్ద ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ ఆరు నెలల గరిష్ట స్థాయి 105.68కి చేరింది. రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రధాన వడ్డీ రేటును విస్తృతంగా ఊహించినట్లుగానే యధాతథంగా ఉంచింది ఫెడ్. అయితే ఈ ఏడాది మరోసారి రేటు పెంపు ఉండ వచ్చని నిపుణుల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: అదే నష్టాల బాట.. నేలచూపుతో ప్రారంభమైన సూచీలు
Today Stockmarket Opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పండగ వేళ వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కీలక సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 67,196 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 117 పాయింట్లు క్షీణించి 20,016 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ గెయినర్స్‌గా కొనుసాగుతుండగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జియో ఫినాన్సియల్ కంపెనీ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు, మెరిసిన టైటన్
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంక్స్, ఆటో, ఐటీ జోరు, నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)