
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. అదానీ, హిండెన్ బర్గ్ వివాదం, రానున్న బడ్జెట్ సెషన్ మధ్య ఒడిదుడుకుల నెదుర్కొన్నాయి. అయితే మిడ్‌సెషన్‌లో కోలుకుని, ఆఖరి ఆర‍్ధగంటలో ఒక్కసారిగా పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. చివరికి సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 59500 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 17649 వద్ద ముగిసాయి.
ముఖ్యంగా అదానీ కంపెనీ కొన్ని భారీ రికవరి సాధించాయి. మరికొన్ని అదానీ షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. కానీ ఐటీ షేర్ల లాభాలు మార‍్కెట్‌కు మద్దతునిచ్చాయి. రిలయన్స్ 3 శాతం రికవరీ సాధించింది. ఐటీ, పిఎస్‌యు బ్యాంక్ , కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా గ్రీన్‌లోనూ ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ దాదాపు 3.5 శాతం పతనమైంది ఫలితంగా డే కనిష్టం నుంచి మార్కెట్ ఏకంగా 800 పాయింట్లు ఎగియడం విశేషం.
బజాజ్‌ఫైనాన్స్, అదాని ఎంటర్ ప్రైజెస్ హెచ్‌సీఎల్ టెక్, బజాజ్‌ఫిన్‌సర్వ్ లాభపడగా, ఇండస్‌ఇండ్ బ్యాంకు, పవర్ గగ్రిడ్; జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, హెచ్ యూఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 81.50 వద్ద ముగిసింది. శుక్రవారం 81.52 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment