recovery
-
అమ్మో పోలీస్.. ఇదేం పని బాస్!
చిత్తూరు అర్బన్: దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్‌కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్‌కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్‌ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసు నమోదుపై చర్చ విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది. ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్‌కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్‌ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్‌లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
సెల్‌ఫోన్ రికవరీలో ‘అనంత’ టాప్
అనంతపురం: సెల్ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయిని దాటి అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 10,195 ఫోన్ల రికవరీ చేసి, బాధితులకు అందజేశారు. వీటివిలువ సుమారు రూ.18.85 కోట్లుగా నిర్ధారించారు. తాజాగా రికవరీ చేసిన 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ పి.జగదీష్ అందజేశారు. వీటివిలువ రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న తర్వాత ఆచూకీ దొరకదనుకునే ఫోన్లను సైతం రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని బాధితులకు 1,156 ఫోన్లు అందజేశారు. -
6.6% నుంచి 7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. ఎకానమీ పురోగతి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం ఉంటుందన్న తొలి (జూన్ నివేదికలో) అంచనాలను తాజాగా 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ‘ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్’ నివేదికలో పేర్కొంది. రుతుపవనాల మెరుగుదల, ప్రైవేట్ వినియోగం–ఎగుమతులు పెరిగే అవకాశాలు.. అంచనాల తాజా పెంపుదలకు తోడ్పడినట్లు ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లీ చెప్పారు. అవుట్‌లుక్ పాజిటివ్...: అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక అవుట్‌లుక్ ‘పాజిటివ్’ గా ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. 2024–25లో 7 శాతం వృద్ధి రేటు నమోదయితే, తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాలు (2025–26, 2026–27) ఎకానమీ పటిష్టంగా ఉంటుందని ఉద్ఘాటించింది. -
క్రెడిట్ కార్డ్ వసూళ్లకూ ఓ పద్ధతుంది
ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.మరీ ముఖ్యంగా ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్ ఫోన్ లో ఓ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్‌లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్ ఇంజక్షన్ ద్వారా కూడా సివిల్ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్లైన్లో కూడా ఎఫ్.ఐ.ఆర్. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
‘డబుల్’ పెన్షన్‌పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్‌ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.ఈ మేరకు సీఐడీ ఇన్చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు. -
ఆ దేవుడి ఆశీస్సులతో సీఎం త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత నూతన శక్తితో తిరిగిరావాలని కోరారు. రాబోయే రోజుల్లో మీ పనులను మళ్లీ విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఎన్నికల ప్రచారంలో గాయపడిన సీఎం వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి. మీరు త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలి. మరింత నూతన ఉత్సాహంతో మీ విధులను పునఃప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో గాయపడిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సైతం సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విష్ణు ట్వీట్ చేశారు. Sending my best wishes to @ysjagan anna for a speedy recovery after last night's unfortunate incident. Hoping for his quick healing and return to good health. 🙏 — Vishnu Manchu (@iVishnuManchu) April 14, 2024 Wishing Sri @ysjagan a swift recovery from the injury sustained during campaigning. With the. Blessings of Shirdi Sai Baba and Lord Venkateshwara, May you heal quickly and resume your duties with renewed strength. — Mohan Babu M (@themohanbabu) April 14, 2024 -
కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ‘ ఐటీ’.. రూ.3 వేల కోట్లకు చేరిన నోటీసులు
న్యూఢిల్లీ: తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి ఆదాయపన్ను శాఖకు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన రికవరీ సొమ్ము మొత్తం రూ.3567 కోట్లకు చేరింది. 2014-15,2015-16, 2016-2017,2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.3567 కోట్ల ట్యాక్స్ రికవరీ నోటీసులను రెండు విడతల్లో ఐటీ శాఖ కాంగ్రెస్‌కు పంపింది. రాజకీయ పార్టీలకు ట్యాక్స్ రాయితీలు తొలగించడం కారణాంగానే కాంగ్రెస్ సేకరించిన మొత్తం విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించడంతోనే నోటీసుల్లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం డిమాండ్ నోటీసులను ఐటీ శాఖ తమ పార్టీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, మళ్లీ ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు మరో 2 ఐటీ నోటీసులు -
హెల్త్ అప్డేట్ షేర్ చేసిన సద్గురు
ఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(66) శరవేగంగా కోలుకుంటున్నారు. తలకు బ్యాండేజ్ ప్యాచ్‌తో ఆస్పత్రిలో బెడ్ మీద ఆయన పేపర్ చదువుతూ ఉండగా.. వీడియో తీసిన ఆయన కుమార్తె రాధే జగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, శిష్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సద్గురు.. ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మెదడు, కపాలం మధ్య చేరిన రక్తాన్ని తొలగించడానికి ఈ నెల 17న న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు. #Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM — Sadhguru (@SadhguruJV) March 25, 2024 సద్గురుకి సర్జరీ విషయం తెలియగానే ఆయన అభిమానులు, శిష్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారంటూ ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన చేసింది. మరోవైపు.. ఆ టైంలో సద్గురుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ సైతం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక తాము ఊహించిందానికంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు. -
కేన్సర్‌పై యువతి పోరు : ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో
ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని కేన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలావరకు ప్రమాదం తప్పుతుంది. ఇది తెలియక చాలామంది ఆందోళనలో పడిపోతారు. తాజాగా చర్మ కేన్సర్ బారినపడి కోలుకున్న ఒక యువతి ఈ ధైర్యాన్నిస్తోంది. తీవ్రమైన మెలనోమా బారిన పడి కోలుకున్నతన జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేన్సర్ బాధల నుంచి కోలుకున్న వైనాన్ని రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన అలోండ్రా సియెర్రా టిక్‌టాక్‌లో స్కిన్ క్యాన్సర్ బారిన పడింది. గత ఏడాది కాలంగా చికిత్సలు, ఆపరేషన్లను అచంచలమైన ధైర్యంతో ఎదుర్కొంది. అంతేకాదు తనలాంటి వారికి అవగాహన కల్పించేందుకు, బలాన్నిచ్చేందుకు తాను అనుభవించిన బాధలను పంచుకుంటూ ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇవ్వడం విశేషం. వయస్సు, జెండర్, లేదా చర్మం రంగుతో సంబంధం లేకుండా ఎవరినైనా దాడి చేసే మెలనోమా అత్యంత తీవ్రమైనదని ఇది చాలా త్వరగా విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. తగిన శ్రద్ధతో చికిత్స తీసుకోవాలని సూచించింది. తన జుట్టును షేవ్ చేసుకోవడం నుండి మళ్లీ పొడవాటి జుట్టు దాకా, తీవ్రమై అలసట నుంచి పూర్తి ఆరోగ్యం దాకా ఇలా మొత్తం జర్నీని రికార్డు చేసింది. ‘‘నేను ముందుకు సాగడానికి తగిన శక్తిని వచ్చిన దేవునికి ధన్యవాదాలు’’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు అందించారు. అదృష్టవంతురాలు, ఆమె చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. క్రేజీ క్లిప్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. Woman with cancer records her recovery process pic.twitter.com/aJxSLI398z — Crazy Clips (@crazyclipsonly) March 7, 2024 -
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతు రుణాలను రికవరీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్‌ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్‌లను బలోపేతం చేయండి: ప్యాక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్‌ఫెడ్ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు. తుమ్మల ఆదేశాలపై చర్చ కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. -
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
ఫోన్ల రికవరీలో దేశంలోనే ప్రథమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో 33.71 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 15,024 మొబైల్ ఫోన్లను గుర్తించడంతోపాటు యజమానులకు అప్పగించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలందరి కృషితోనే ఇది సాధ్యమైందని మహేశ్ భగవత్ అభినందించారు. -
చోరీ అయిన సెల్ ఫోన్ల రికవరీలో టాప్‌లో అనంతపురం జిల్లా..!
అనంతపురం క్రైం: చోరీ జరిగిన, సొంతదారు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. చాట్‌బాట్ సేవలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో రూ.13.13 కోట్లు విలువ చేసే 8,010 సెల్ఫోన్లు రికవరీ చేసి సొంతదారులకు అందజేసినట్లు వివరించారు. ఇటీవల వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ.71 లక్షలు విలువ చేసే 385 సెల్ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సంబంధీకులకు సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని 9 జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు చేతులు మారిపోయిన సెల్ఫోన్లను కూడా రికవరీ చేసినట్లు వివరించారు. పాత ఫోన్లు కొనొద్దు ఫోన్లు కొనుగోలు చేసే వారెవరైనా పాత ఫోన్లను కొనకపోవడం మంచిదని ఎస్పీ అన్బురాజన్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి అస్సలు కొనుగోలు చేయరాదన్నారు. పరిచయస్తుల ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌కు సంబంధించిన బాక్స్‌తో పాటు బిల్లు తప్పక తీసుకోవాలన్నారు. ఫోన్ తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోన్లు చోరీకి గురైనా, కనపడకుండా పోయినా సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్లు విక్రయిస్తున్న అపరిచత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే 94407 96800కు సమాచారం అందించాలని కోరారు. పోగొట్టుకున్న డబ్బు ఖాతాలో పడుతుంది బ్యాంక్ ఖాతాలోని సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేస్తే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా గంట వ్యవధిలోనే ఆ డబ్బు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఎస్పీ వివరించారు. 1930 పేవలను సకాలంలో వినియోగించుకోవాలన్నారు. అన్ని యాప్‌లకు గుడ్డిగా అనుమతులివ్వకూడదన్నారు. ‘పోలీసు స్పందన’కు 128 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 128 వినతులు అందాయి. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఇందిర, దిశ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీకి కృతజ్ఞతలు రౌడీ మూకలు కబ్జా చేసిన తమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఎస్పీ అన్బురాజన్ చూపిన చొరవను అభినందిస్తూ 73 మంది బాధితులు సోమవారం ఆయనను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమలో చాలా మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నామని, ఉద్యోగ విరమణ సమయంలో అందిన డబ్బుతో స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. వీటిని కొందరు రౌడీ మూకలు కబ్జా చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ స్థలాలు తిరిగి స్వాధీనం చేసిన ఎస్పీ అన్బురాజన్ సేవలను మరిచిపోలేమంటూ సన్మానం చేశారు. కాగా, మొత్తం ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నూర్‌బాషాకే సన్మానం పొందే అర్హత ఉందని, ఎస్పీ ప్రతిగా ఆయనకు సన్మానం చేశారు. కానిస్టేబుల్‌కు అవార్డు కుందుర్పి: సైబర్ క్రెం కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచిన కుందుర్పి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్‌ను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీలో అనిల్ చూపిన చొరవను అభినందిస్తూ సోమవారం డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అభినందిస్తూ అవార్డు అందజేశారు. -
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 10,018 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతికతతో గుర్తించి, వాటిని తిరిగి యజమానులకు అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ సీఈఐఆర్ టెక్నాలజీ వాడటంతో 39 శాతం మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని, మరో 86,395 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్న సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ లావణ్య, ఇతర అధికారులను డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
చోరీలకు చెక్.. మొబైల్ రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ల దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు టాప్ ప్లేస్ నిలిచి రికార్డు క్రియేట్ చేశారు. 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. వివరాల ప్రకారం.. పోగొట్టుకున్న ఫోన్లలో 39 శాతం రికవరీతో దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ సీఐడీ పోలీసులు టాప్ ప్లేస్‌లో నిలిచారు. టెలికాం డిపార్ట్ మెంట్ సీఈఐఆర్ అప్లికేషన్‌ను ఉపయోగించి 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్స్ రికవరీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. దీంతో, హిస్టరీ క్రియేట్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే, చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది. ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది. పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి. -
మొండిబాకీల రికవరీపై మరింత దృష్టి పెట్టండి - ఆర్బీఐ గవర్నర్
ముంబై: వినూత్న అకౌంటింగ్ విధానాలతో మొండిపద్దుల వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చకుండా వాటిని రాబట్టడంపై మరింత తీవ్రంగా ప్రయత్నించాలని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు (యూసీబీ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. రుణాల మంజూరు తర్వాత కూడా పద్దులను సమీక్షించడం, మొండిబాకీలు తలెత్తే అవకాశాలను సకాలంలో గుర్తించడం తదితర రుణ రిస్కుల నిర్వహణ విషయంలో బోర్డులు సైతం క్రియాశీలకంగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ముంబై జోన్ యూసీబీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దాస్ ఈ మేరకు సూచనలు చేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నివేదికలు పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చూడటంలో డైరెక్టర్ల ప్రధాన పాత్ర పోషించాలని దాస్ చెప్పారు. అలాగే, బ్యాంకు స్థాయిలో ఐటీ, సైబర్‌సెక్యూరిటీ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిపుణుల నియామకంలోనూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. -
తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండి బకాయిలను (ఎన్పీఏ) తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత తొమ్మిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయి. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ.10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. ► 2018–19 చివరి నాటికి మొండి బకాయిలు రూ.7,09,907 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ విలువ రూ.6,32,619 కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి ఈ విలువ మరింతగా రూ.2,66,491 కోట్లకు తగింది. ► 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎన్పీఏల విలువ రూ.10,36,187 కోట్లు. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏల నిష్పత్తి 11.18 శాతం. 2023 నాటికి విలువ రూ.5,71,515 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏ నిష్పత్తి 3.87 శాతం. కీలక చర్యల ఫలితం... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడినట్లు ఇటీవలి ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ ఖరాద్ లోక్‌సభకు తెలిపారు. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు/డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. -
2023–24లో 6.4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్‌లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది. -
లోన్ రికవరీ కోసం వచ్చిన సిబ్బంది.. కర్రలతో బెదిరించిన మహిళలు!
మాలూరు(బెంగళూరు): రుణాల వసూళ్లకు వచ్చిన డీసీసీ బ్యాంకు సిబ్బందిని మహిళలు కర్రలతో అడ్డుకుని బెదిరించిన ఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాస్తి ఫిర్కా దిన్నేరి హారోహళ్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం 2023 ఫిబ్రవరిలో రాజేనహళ్లి గ్రామానికి చెందిన ఏడు సీ్త్రశక్తి సంఘాలకు రూ. 5 లక్షల ప్రకారం మొత్తం రూ. 35 లక్షలు వడ్డీ రహిత రుణాలు ఇచ్చారు. రుణాలు తీసుకున్న మహిళలు ప్రతి నెలా రుణాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా స్వసహాయ సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందనే విశ్వాసంతో మహిళలు ఉన్నారు. దీంతో రుణాల వసూళ్ల కోసం వచ్చిన అధికారులను, సిబ్బందిని ప్రతి గ్రామంలోను మహిళలు అడ్డుకుంటున్నారు. గతంలో మహిళలు స్వయం ప్రేరితంగా రుణాలు చెల్లించే వారు, అయితే గత నెల రోజుల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఎవరూ రుణాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రుణాల వసూళ్ల కోసం వెళ్లిన దిన్నేరి హారోహళ్లి సహకార సంఘం కార్యదర్శి తిరుమేగౌడ, గుమాస్తా శ్రీనివాస్, అకౌంటెంట్ చిత్రలను మహిళా సంఘాల సభ్యులు కర్రలతో అడ్డుకుని బెదిరించారు. రుణాలు వసూళ్లకు ఎందుకు వస్తారని సిబ్బందిని నిలదీశారు. ఏం చేస్తారో చేసుకోండని అన్నారు. చదవండి: కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు.. -
ఎగవేతదారులతో సెటిల్మెంట్
ముంబై: మొండిపద్దుల నుంచి బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకునేందుకు వీలు కల్పించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతలు, మోసపూరిత ఖాతాల విషయంలో రాజీ కుదుర్చుకుని, మొండిబాకీలను సెటిల్ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాజీ సెటిల్మెంట్లను చేపట్టే క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతలు, సాంకేతిక రైటాఫ్‌ల అంశాల్లో పాటించాల్సిన ప్రక్రియలకు సంబంధించి బోర్డు ఆమోదిత పాలసీలను నియంత్రిత సంస్థలన్నీ (ఆర్ఈ) అమలు చేయాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో రాజీ యత్నాలు చేయవచ్చనేది వాటిలో నిర్దిష్టంగా పేర్కొనాలి. కనీస బాకీ వ్యవధి, తనఖా పెట్టిన ఆస్తుల విలువ కరిగిపోవడం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. నోటిఫికేషన్ అంశాలు.. ► ఇలాంటి కేసుల్లో ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పర్యవేక్షించేందుకు తగు వ్యవస్థ ఉండాలి. బాకీ పరిమాణం, కాలపరిమితులు మొదలైనవి బోర్డు నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరిత ఖాతాలంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో, రుణదాతలపై క్రిమినల్ చర్యలతో సంబంధం లేకుండా, ఆర్ఈలు రాజీ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ► రాజీ సెటిల్మెంట్ విషయంలో తనఖా ఉంచిన ఆస్తి (ఏదైనా ఉంటే) నుంచి ప్రస్తుతం రాబట్టుకోగలిగే మొత్తాన్ని సముచిత రీతిలో మదింపు చేసి, ఎంత మొత్తం వదులుకోవచ్చు, ఎంతకు సెటిల్ చేసుకోవచ్చు అనే నిబంధనలను పాలసీలో పొందుప ర్చాలి. తనఖా పెట్టిన వాటి నుంచి రాబట్టుకోగలికే విలువను లెక్కించే విధానాన్ని కూడా నిర్దేశించాలి. ► ఆర్ఈకి ప్రయోజనం చేకూర్చేలా మొండిబాకీల నుంచి తక్కువ ఖర్చులో, అత్యధికంగా రాబట్టాల నేది లక్ష్యంగా ఉండాలి.రాజీ సెటిల్మెంట్ చేసుకున్న రుణగ్రహీతలకు ఆర్ఈలు నిర్దిష్ట వ్యవధి తర్వాతే మళ్లీ కొత్తగా రుణాలివ్వడానికి వీలుంటుంది. -
ప్యాకెట్ సైజ్ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆశలు
న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి. మందగమనం ముగిసినట్టే.. ‘‘ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్‌గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్‌యూఎల్ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్‌నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్‌యూఎల్ భావిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్ ఈడీ అబ్నీష్రాయ్ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్ చెప్పారు. అయితే, ఎల్‌నినో, ఎఫ్ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సుధీర్ సీతాపతి తెలిపారు. ఇదీ చదవండి: బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ -
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
డబ్బు రికవరీకి నూతన చట్టాలు తేవాలి
కాచిగూడ: బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ప్రభుత్వమే రికవరీ చేసే విధంగా నూతన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. కెనరా బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర సదస్సు ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్ రాంబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతమున్న చట్టలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను అసరా చేసుకుని బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్నారని, దీంతో బ్యాంకులు దివాలతీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83వేల కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలంటే విచారణకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని 3,4 తరగతులలో ఖాళీగా ఉన్న 2లక్షలకు పైగా ఉద్యోగాను వెంటనే బర్తీ చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ భ్యాంకులను నిర్విర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలనే అలోచనలను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసన్, వేణుగోపాల్, కె.శ్రీకృష్ణ, కె.హెచ్. పటా్నయక్, సాయి ప్రసాద్, ఎస్. మధుసూదన్, హరివర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఎగవేతదారుల ఆస్తుల వివరాలిస్తే రివార్డ్
న్యూఢిల్లీ: జరిమానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఎగవేతదారుల నుంచి సొమ్ము రికవర్ చేసుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొత్త పథకానికి తెరతీసింది. ఎగవేతదారుకు చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించేవారికి రూ. 20 లక్షలవరకూ బహుమతి(రివార్డు)ని అందించేందుకు పథకం రచించింది. రివార్డును రెండు(మధ్యంతర, తుది) దశలలో అందించనుంది. మధ్యంతర రివార్డు కింద ఎగవేతదారుడికి చెందిన ఆస్తి విలువ రిజర్వ్ ధరలో 2.5 శాతం మించకుండా లేదా రూ. 5 లక్షలవరకూ(వీటిలో ఏది తక్కువైతే అది) చెల్లిస్తారు. తదుపరి బకాయిల వసూల విలువలో 10 శాతం మించకుండా లేదా రూ. 20 లక్షలలోపు తుది బహుమతిగా ఇవ్వనుంది. అయితే రికవరీకి వీలయ్యే ఆస్తుల సమాచారమిచ్చే వ్యక్తి విశ్వాసపాత్రమైన వివరాలు అందించవలసి ఉంటుంది. సమాచారమిచ్చేవారి వివరాలు, రివార్డు తదితరాలను రహస్యంగా ఉంచుతారు. ఇందుకు అనుగుణంగా సెబీ 515 ఎగవేతదారులతో రూపొందించిన జాబితాను తాజాగా విడుదల చేసింది. -
TodayStockMarketUpdate: డే కనిష్టం నుంచి 800 పాయింట్లు జంప్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. అదానీ, హిండెన్ బర్గ్ వివాదం, రానున్న బడ్జెట్ సెషన్ మధ్య ఒడిదుడుకుల నెదుర్కొన్నాయి. అయితే మిడ్‌సెషన్‌లో కోలుకుని, ఆఖరి ఆర్ధగంటలో ఒక్కసారిగా పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. చివరికి సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 59500 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 17649 వద్ద ముగిసాయి. ముఖ్యంగా అదానీ కంపెనీ కొన్ని భారీ రికవరి సాధించాయి. మరికొన్ని అదానీ షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. కానీ ఐటీ షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. రిలయన్స్ 3 శాతం రికవరీ సాధించింది. ఐటీ, పిఎస్‌యు బ్యాంక్ , కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా గ్రీన్‌లోనూ ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ దాదాపు 3.5 శాతం పతనమైంది ఫలితంగా డే కనిష్టం నుంచి మార్కెట్ ఏకంగా 800 పాయింట్లు ఎగియడం విశేషం. బజాజ్‌ఫైనాన్స్, అదాని ఎంటర్ ప్రైజెస్ హెచ్‌సీఎల్ టెక్, బజాజ్‌ఫిన్‌సర్వ్ లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గగ్రిడ్; జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, హెచ్ యూఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 81.50 వద్ద ముగిసింది. శుక్రవారం 81.52 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే. -
రిషభ్ పంత్ కోలుకోవాలని టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫోటోలు వైరల్
-
Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే
టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ను మరింత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అతను క్రికెట్ ఆడడం కష్టమనిపిస్తోంది. దీంతో జనవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్లో పంత్ ఆడకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. లిగమెంట్ గాయం నుంచి పంత్ కోలుకోవాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే అప్పుడు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ రాణించిన విషయం తెలిసిందే. ఒకవేళ పంత్ ఆడలేని పక్షంలో.. కేఎస్ భరత్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ సంగతి పక్కనబెడితే ఐపీఎల్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంత్ అందుబాటులోకి రాకపోతే జట్టు యాజమాన్యం మరో ప్లేయర్ కోసం ఎదురుచూడాల్సిందే. చదవండి: Rishabh Pant: ఫ్యామిలీ కోసం పంత్ కొన్న విలువైన వస్తువులు చోరీ? పోలీసుల క్లారిటీ పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఏవియేషన్ పరిశ్రమ.. వీ షేప్ రికవరీ!
న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కేసులు ఆందోళనకరం.. ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు. అంత రద్దీని అంచనా వేయలేదు.. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి హంసానందిని క్యాన్సర్‌ను జయించింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసా నందిని తాజాగా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. మూవీ సెట్లో మళ్లీ అడుగుపెట్టాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. నా పుట్టినరోజును నా కోస్టార్స్, మూవీ టీంతో సెలబ్రేట్ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే నేను కోలుకోగలిగాను. ఐ యామ్ బ్యాక్ అంటూ హంసా నందిని రాసుకొచ్చింది. షూటింగ్లో పాల్గొన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసుకుంది. దీంతో వెల్కమ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో ఐటెం సాంగ్స్‌లో కనువిందు చేసింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు మస్క్ ప్రకటన
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటన -
దివాలా ప్రక్రియతో రూ. 2.43 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: ఎన్సీఎల్టీ పర్యవేక్షణలో దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బాకీలను గణనీయంగా రికవరీ చేసుకోగలుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి రూ. 2.43 లక్షల కోట్లు రాబట్టుకోగలిగాయి. నిర్దిష్ట తేదీ నాటికి సంక్షోభంలో కూరుకున్న కంపెనీల నుండి మొత్తం రూ. 7.91 లక్షల కోట్లు బ్యాంకులకు రావాల్సి ఉంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తమ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం కొనసాగుతున్న సీఐఆర్పీల్లో (కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ) 64 శాతం కేసుల పరిశీలనకు 270 రోజుల పైగా జాప్యం జరుగుతోందని తెలిపింది. సీఐఆర్పీలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటం సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దివాలా కోడ్ (ఐబీసీ) ప్రకారం పిటిషన్ స్వీకరించిన తేదీ నుండి 180 రోజుల్లోగా సీఐఆర్‌పీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార నిపుణుడి (ఆర్పీ) అభ్యర్థన మేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీన్ని మరో 90 రోజుల వరకూ పొడిగించవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ 330 రోజుల్లోగా ముగియాలి. లిటిగేషన్లు, ఎన్సీఎల్టీ బెంచీల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, కోవిడ్‌పరమైన అవాంతరాలు మొదలైనవి పరిష్కార ప్రక్రియల జాప్యానికి కారణమవుతున్నాయి. -
తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఎట్టకేలకు 8నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. విజయ్‌కు కొన్నినెలల కొందట భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పితోనే లైగర్ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అయితే చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడినట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సినిమాల్లోకి రాకముందే విజయ్‌కు షోల్డర్ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్ షూటింగ్ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ద్రవ్యోల్బణం కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా? ఆర్బీఐ కీలక ఆర్టికల్
ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ బులిటెన్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్‌గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది
కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎందరో అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే ఇలా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడం పోలీసులకు సాహసమనే చెప్పాలి. కానీ ముంబైలోని ఓషివారా పోలీసులు మాత్రం ఓ సైబర్ క్రైమ్‌ను చేధించి అతి త్వరగా ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాందిచుకుంది బుల్లితెర బ్యూటీ అమన్ సంధు (Aman Sandhu). ప్రస్తుతం గోరేగామ్లో నివసిస్తోన్న అమన్ తాజాగా సైబర్ నేరగాళ్ల (Cyber Crime) ట్రాప్‌లో పడింది. తన తల్లికి డాక్టర్ అపాయింట్మెంట్ కోసమని జుహుకి చెందిన ఆస్పత్రి వెబ్సైట్ కోసం జులై 6న నెట్లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్సైట్లా కనిపించే నకిలీ సైట్లో తన నెంబర్‌ను నమోదు చేసింది. ఆమె నెంబర్‌కు కాల్ చేసిన వ్యక్తి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం పంపిన వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయాలని సూచించాడు. ఆ లింక్‌పై నటి అమన్ సంధు క్లిక్ చేయగానే తన మూడు ఖాతాల నుంచు రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన అమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య సత్వరమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా ఆ డబ్బును రికవరీ చేశారు. అలాగే కాజేసిన అకౌంట్‌ను బ్లాక్ చేశామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి అమన్ సంధు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఓషివారా పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. 'నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి. కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు' అని ఇన్‌స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్.. పెళ్లికి రెడీ అయిన బుల్లితెర బ్యూటీ!.. అతనెవరంటే ? View this post on Instagram A post shared by Aman Sandhu 🧿ਜੱਟੀ (@officialamansandhu) -
అక్కడ జీరో కరోనా కేసులు, ఇక్కడి మార్కెట్లకు ఊతం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా కోలుకున్నాయి. రోజంతా లాభనష్టాలమధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు ఆరంభ నష్టాలనుంచి కోలుకున్నాయి. వరుసగా నాలుగో సెషన్లో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 15,850 వద్ద స్థిరపడింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిల ఎగువకు చేరాయి. చైనాలోని ప్రధాన నగరాలు బీజింగ్, షాంఘైలో కరోనా కేసుల నమోదు జీరోకు చేరడం, కోవిడ్-19 క్వారంటైన్ సమయాన్ని తగ్గించడం ఆసియా మార్కెట్లకు బలాన్నిచ్చింది. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు వరుసగా 1.25 శాతం, 1.67 , 2.27 శాతం లాభపడ్డాయి. ఓఎన్జీసీ 6 శాతం లాభపడగా, హిందాల్కో, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటితోపాటు సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డా.రెడ్డీస్, టెక్ఎం, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లాభపడ్డాయి. మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎయిర్టెల్ నష్టాల్లో ముగిశాయి. అలాగే ఫుడ్ డెలివరీసంస్థ జొమాటో 8.35 శాతంపతనమై 60.35 వద్ద ముగిసింది. అటు డాలరు మారకంలో రూపాయి మంగళవారం 78.83 వద్ద మరో ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 55 పైసల నష్టంతో 78.77 వద్ద ముగిసింది. వరుసగా ఐదో సెషన్లోనూ రికార్డు కనిష్టం వద్ద ముగిసింది. -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
ఎన్పీఏల విక్రయానికి ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు), ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవీ ఖాతాలు: ఎస్బీఐ విక్రయించనున్న ఎన్పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌వర్త్ ఉర్జా అండ్ మెటల్స్(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్ అలాయ్స్కు రూ. 178.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్పీఏ ఖాతాలకు ఏప్రిల్ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు. -
రూ.99 కోట్లు గాయబ్.. ఎలాగో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: ఓ చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో పాటు పోయిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేస్తేనే బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినట్లు. అయితే రికవరీల ఏ ఏడాదీ 80 శాతానికి కూడా చేరట్లేదు. ఫలితంగా బాధితులకు దొంగ దొరికినా... దొరక్కపోయినా... బాధితులకు మాత్రం నష్టమే జరుగుతోంది. 2014 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరంలో చోరీ అయిన సొత్తులో కేవలం 65.14 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. ఈ కాలంలో మొత్తం రూ.285,47,88,204 విలువైన సొత్తు నేరగాళ్ల పాలు కాగా పోలీసులు రూ.185,96,11,821 విలువైంది మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన రూ.99,51,76,383 విలువైంది పత్తాలేకుండా పోయింది. ఇందులో నగదు, నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి. దర్యాప్తు అధికారులపై భారం... ► నగర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత, వనరుల లేమి నేపథ్యంలో చోరీ జరిగిన తరవాత దొంగలను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఒక్కో దర్యాప్తు అధికారీ ఏడాదికి కేవలం 60 నుంచి 70 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఓ కొలిక్కి చేర్చగలడు. అయితే దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఎస్సై స్థాయి అధికారుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి సరాసరిన 200లకు పైగా కేసులను దర్యాప్తు చేస్తున్నాడు. ఫలితంగా అవి అంత తొందరగా ఓ కొలిక్కి రావడం, చోరీ కేసుల్లో దొంగలు దొరకడం ఆలస్యం జరుగుతోంది. ఎంత ఆలస్యంగా దొంగ దొరికితే... రికవరీ అంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘పెరిగిపోతున్న’ మెుత్తాలు... ► ఓ ఇంట్లోనే, దుకాణంలోనో చోరీ జరిగితే... అందులో ఎంత మెుత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెప్తున్నదీ వాస్తవంగా ఉండట్లేదన్నారు. ఓ చోరీ కేసు పరిష్కారమై, దొంగ దొరికిన తరవాత రికవరీ పూర్తయి, మిగిలిన చట్టపరమైన అంశాలను దాటి బాధితుడికి సొత్తు చేరడానికి కొంత సమయం పడుతోంది. మరోపక్క 100 శాతం సొత్తు రికవరీ కావట్లేదు. గరిష్ఠంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా చేస్తే అన్నీ ప్రక్రియలూ పూర్తయిన తరవాత తమకు అందేది చోరీ అయిన దాంతో సరిపోతుందని బాధితులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిర్యాదులోనే మెుత్తాలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ కారణంగానే వాస్తవంగా చోరీ అయిన దానికి, రికార్డుల్లో నమోదవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యగా మారిన రికవరీ... ► ఈ చోరులకు అరెస్టు చేయడం ఒక ఎత్తయితే... పోయిన సొత్తు రికవరీ చేయడం మరో ఎత్తుగా మారింది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో నమోదైన నేరాల్లో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ఈ పరిష్కారమైన కేసుల్లోనూ సరాసరి రికవరీలు మాత్రం 70 శాతానికి చేరట్లేదు. గతంలో దొంగలు చోరీ సొత్తును రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు. అయితే ప్రస్తుతం నేరం చేసిన మరుక్షణం రాష్ట్రం దాటేస్తున్న నిందితులు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది నగరాల్లో చోరీ సొత్తును అమ్ముతున్నారు. ఫలితంగా నిందితుడు దొరికినా... రికవరీలు మాత్రం పూర్తిస్థాయిలో కావట్లేదు. తాము చోరీ సొత్తు విక్రయించిన ప్రాంతాలను నిందితులు చెప్తున్నా... దానిని కొనుగోలు చేసిన వారు మాత్రం తిరిగి ఇవ్వడంలో అనేక మెలికలు పెడుతున్నారు. దీంతో రికవరీలు శాతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరోపక్క ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలకు మించి కస్టడీలో పెట్టుకునే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు లేకపోవడం కూడా రికవరీలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో నిందితులు చోరీ సొత్తుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించట్లేదు. నగదైతే పత్తా ఉండదు... ► చోరీకి గురైంది బంగారం, వెండి వంటి సొత్తయితే ఎన్నాళ్ల తరవాత నిందితుడు దొరికినా... ఎంతో కొంత రికవరీ చేయడానికి వీలుంటుంది. అదే నగదు దొంగల పాలయితే ఇక రికవరీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకంగా వచ్చే డబ్బు ఈజీ మనీ కావడంతో నేరగాళ్లల్లో చాలా మంది వివిధ దురలవాట్లకు బానిసలుగా ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఫలితంగా చోరీ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ మెుత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. చాలా కొద్దిమంది నేరగాళ్లు మాత్రమే చోరీ సొమ్ముతో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో మాత్రమే చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడం సాధ్యమవుతోంది. -
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సీతారామన్ సన్నద్ధం!
ముంబై: కోవిడ్–19 మూడవ వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రానున్న వార్షిక బడ్జెట్లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ► కన్సాలిడేటెడ్ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో 11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు. ► 2022–23లో కన్సాలిటేడెడ్ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు. ► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది. ► కొత్త బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. ► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం. ► పన్ను, పన్ను యేతర ఆదాయాలు 2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్ లక్ష్యాలను అధిగమించే వీలుంది. ► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్ బేస్) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యలోటు ధోరణి ఇది... కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
కోలుకున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వడంతో మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశామని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కోవిడ్ అనంతర సమస్యలతో బాధ పడుతున్న గవర్నర్ వారం క్రితం ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ స్థాయి, ఇతర ఆరోగ్య ప్రమాణాలు అన్నీ సాధారణ స్థితికి రావడంతో డిశ్చార్జ్ చేశారు -
పటిష్ట రికవరీ బాటలో భారత్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని అత్యున్నత స్థాయి అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇందుకు సంబంధించి మొత్తం 22 ప్రధాన, కీలక ఇండికేటర్లలో 19 ‘కరోనా ముందస్తు స్థాయితో పోల్చిచూసినా’ అప్‌ట్రెండ్‌లో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే.. - 2021 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 19 కీలక, ప్రధాన ఇండికేటర్లు 2019 ఇదే నెలలకన్నా వృద్ధి బాటన పయనిస్తున్నాయి. - వీటిలో కొన్ని రంగాలు ఏకంగా 100 శాతం పైగా వృద్ధిని (2019 ఇదే నెలలతో పోల్చితే) నమోదుచేసుకుంటున్నాయి. ఈ–వే బిల్లు, ఎగుమతులు, బొగ్గు ఉత్పత్తి, రైలు సరుకు రవాణా వంటి విభాగాలు 100 శాతానికి మించి రికవరీని నమోదుచేసుకున్నాయి. ఇది కేవలం రికవరీని మాత్రమే కాకుండా, ఆర్థిక వృద్ధిని సూచిస్తోంది. పలు రంగాల్లో ఉత్పత్తులు కూడా కరోనా ముందుస్థాయికి మించి కూడా పురోగమిస్తున్నాయి. పలు విభాగాలను పరిశీలిస్తే... వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు మోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరిగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. ఇక ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నవంబర్‌లో పది నెలల గరిష్ట స్థాయిలో 57.6కు ఎగసింది. ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో (అక్టోబర్ నాటికి బడ్జెట్ లక్ష్యంలో కేవలం 36.3 శాతం) ఉంది. అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ టోల్ వసూళ్లు (ఈటీసీ) రూ.108.2 కోట్లు. 2019 ఇదే కాలంలో పోల్చితే ఈ వసూళ్లు 157 శాతం అధికం. యూపీఐ పరిమాణం కూడా ఇదే సమయంలో నాలుగు రెట్లు పెరిగి 421.9 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 131 శాతం పెరిగి 114.1 మిలియన్ టన్నులకు ఎగసింది. రైలు రవాణా ట్రాఫిక్ 125 శాతం ఎగసింది. ఎరువుల అమ్మకం, విద్యుత్ వినియోగం, ట్రాక్టర్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తి, పోర్ట్ కార్గో ట్రాఫిక్, ఇంధన వినియోగం, ఎయిర్ కార్గో... ఇలా పలు రంగాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా ఎగువ బాటన పురోగమిస్తున్నాయి. అయితే అక్టోబర్ గణాంకాలను పరిశీలిస్తే, స్టీల్ వినియోగం 2019 స్థాయితో పోల్చితే 99 శాతం వరకే చేరింది. ఆటో అమ్మకాల విషయంలో ఇది 86 శాతంగా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో ఈ స్థాయి 66 శాతం. చదవండి: 2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..! -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్‌లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్‌లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
డెయిరీ పరిశ్రమలో వృద్ధి జోరు
ముంబై: ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) డెయిరీ రంగం 9–11 శాతం మధ్య వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. తలసరిగా పాలు, పాల పదార్థాల వినియోగం పెరగడం, పట్టణీకరణతో ఆహార పరమైన ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వం నుంచి స్థిరమైన మద్దతు కూడా డైరీ వృద్ధికి తోడ్పడతాయని పేర్కొంది. దీర్ఘకాలంలో ఈ పరిశ్రమకు స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత పరిశ్రమలో స్థిరమైన రికవరీ కనిపించినట్టు తెలిపింది. ‘‘డిమాండ్ పుంజుకోవడంపై మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కరోనా కేసుల ప్రభావం పడింది. సంస్థాగత స్థాయిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజా కేసలు గణనీయంగా తగ్గిపోవడం, వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగే పరిస్థితులతో ఇటీవలి కాలంలో డిమాండ్ చక్కగా పుంజుకుంది. పాడి పరిశ్రమలో సంఘటిత రంగం (కంపెనీలు) వాటా 26–30 శాతంగా ఉంటుంది. అసంఘటిత రంగంతో (వ్యక్తులు/సంఘాలు)తో పోలిస్తే సంఘటిత రంగమే వేగవంతమైన వృద్ధిని చూస్తోంది. ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ షీతల్ శరద్ పేర్కొన్నారు. పాడి రంగంలో కేవలం పాల (సగంపైన వాటా) వరకే చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి స్థిరంగా 6–7 శాతం మధ్యే ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
రుణాలు @ రూ.63,574 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఒక ట్వీట్లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్‌టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి. గతంలో ఇలా... 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్‌కు ఇందుకు తగిన సూచనలు అందాయి. -
ప్రపంచ రికవరీకి చమురు మంట
న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ బేరల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్ఏవీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్‌లో భారత్ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ► క్రూడ్ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ► చమురు డిమాండ్, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ► క్రూడ్ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ► 2020 జూన్‌లో 8.8 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాంట్రాక్ట్ విధానం మారాలి: తరుణ్ కపూర్ ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్ కపూర్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి ఒపెక్ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్–టర్మ్ కాంట్రాక్ట్’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు. ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్‌మార్క్‌గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అవసరమని సూచించారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్‌లో చమురు డిమాండ్ కూడా అధికంగా ఉంది. భారత్ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్థిక రికవరీకి చమురు రేట్ల ముప్పు
న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి. ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. -
సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ హీరో సాయిధరమ్‌తేజ్ కోలుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘‘యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని’’ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆకాంక్షించారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2021 సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. Saddened to know that @IamSaiDharamTej met with an accident. Our prayers to Almighty🙏for his quick recovery.@PawanKalyan @KChiruTweets @NagaBabuOffl pic.twitter.com/Xoyi3A6R4E — Dr Sravan Kumar Dasoju (@sravandasoju) September 10, 2021 ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స -
ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ
-
ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ
సాక్షి, విజయవాడ: నకిలీ చలానాల కేసులో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు రూ.4.11 కోట్లు రివకరీ చేసినట్లు రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 26 మంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 12 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ చలనాలు సృష్టించకుండా కొత్త సాఫ్ట్వేర్ తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ చేస్తామని తెలిపారు. క్యాష్ లెస్ వ్యవహారాల ద్వారా నకిలీలకు చెక్ పెడతామని రజత్ భార్గవ తెలిపారు. ఇవీ చదవండి: ‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’ రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ -
జూలైలో ఊపందుకున్న ఎకానమీ: ఇక్రా
ముంబై: భారత్ ఎకానమీ జూలైలో భారీగా రికవరీ అయినట్లు రేటింగ్ సంస్థ– ఇక్రా పేర్కొంది. సెకండ్‌వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం దీనికి కారణమని వివరించింది. పారిశ్రామిక, సేవల రంగాలు, రవాణా, టోల్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. 13 నాన్–ఫైనాన్షియల్ ఇండికేటర్లను చూస్తే, అందులో 10 సానుకూల ఫలితాలను ఇచ్చాయని వివరించింది. జీఎస్టీ ఈ–వే బిల్లులు, ఇంధన వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, వెహికిల్ రిజిస్ట్రేషన్, దేశీయ పాసింజర్ ట్రాఫిక్ వంట విభాగాలు 2021 జూన్‌తో పోల్చితే 2021 జూలైలో గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపింది. ఇదే వరవడి కొనసాగవచ్చని పేర్కొంది. -
నకిలీ చలానాల వ్యవహారంలో భారీగా రికవరీ
సాక్షి, కృష్ణా: విజయవాడలో నకిలీ చలానాల వ్యవహారంలో భారీగా రికవరీ చేపట్టినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. కాగా, రూ. 3కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క పటమట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే రూ.1.22 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. మండవల్లి రైటర్ సుబ్రహ్మాణ్యం నుంచి రికవరీకి చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. మొత్తం నకిలీ చలానాలు ఒకే రైటర్ సృష్టించినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై విచారణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఎద్దు అంతిమ సంస్కారం.. 3 వేల మంది హాజరు -
వ్యాక్సిన్ వేసుకున్నా వదలని డెల్టా వేరియెంట్ !
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం అయిన ఐఎన్ఎస్ఏసీఏజీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని అంచనా వేసింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని ఐఎన్ఎస్ఏసీఏజీ తాజా బులెటిన్‌లో తెలిపింది. భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ సెకండ్ వేవ్ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఆ సంస్థ వేస్తున్న అంచనాలు ఆందోళనని పెంచుతున్నాయి. 97.54% కి పెరిగిన కోవిడ్ రికవరీ రేటు దేశంలో కోవిడ్–19 కేసులు మరో 36,571 నిర్థారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,58,829కి చేరుకున్నట్లు శుక్రవారం కేంద్రం తెలిపింది. కోవిడ్ బారిన పడిన మరో 540 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,33,589కి పెరిగాయని వెల్లడించింది. 540 మరణాల్లో కేరళ నుంచి 197, మహారాష్ట్ర నుంచి 154 నమోదైనట్లు తెలిపింది. అదేవిధంగా, మార్చి 2020 తర్వాత కోవిడ్ రికవరీ రేటు 97.54%కి పెరిగిందని పేర్కొంది. యాక్టివ్ కేసులు 150 రోజుల తర్వాత 3,63,605కి పడిపోయాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.12%గా ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,26,99,702 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా, 57.22 కోట్ల డోసుల కోవిడ్ టీకా వేసినట్లు పేర్కొంది. -
యాచకుల మధ్య వివాదం.. నాలుగు తులాల గొలుసు దొరికింది..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): రోడ్డుపై దొరికిన బంగారాన్ని పంచుకునే క్రమంలో యాచకుల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీసుల వరకు వెళ్లి గొలుసు పోగొట్టుకున్న మహిళకు ఊరట కలిగించింది. వివరాల్లోకి వెళితే....ఈ నెల 25న ఉప్పుగూడ తానాజీనగర్‌కు చెందిన స్వాతి అనే మహిళ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి వెళ్లిన క్రమంలో నాలుగు తులాల బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఈ విషయమై ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ఈ గొలుసు చార్మినార్ వద్ద యాచకులకు దొరికింది. దీనిని పంచుకునే క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో వీరిలో ఒకరు చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గొలుసును స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ గొలుసు స్వాతికి చెందిందని నిర్ధారించిన పోలీసులు....ఆమెకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. -
రికవరీ రేటు 96.59 శాతం
ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. గురువారం రికవరీ రేటు 96.59 శాతానికి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మరణాల రేటు 2.01 శాతంగా ఉంది. గత నెలలో రికవరీ రేటు 93 శాతంగానే ఉంది. అలాగే ఒక్కరోజే 11,124 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 60,75,888కి పెరిగింది. ఇక కొత్తగా 7,242 కోవిడ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 62,90,156కి చేరుకుంది. గత 24 గంటల్లో 190 మంది కరోనాతో పోరాడుతూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,32,335కి చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో 6,857 కొత్త కేసులు, 286 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 1,90,181 కరోనావైరస్ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 4,75,59,938 కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 78,562 క్రియాశీల కేసులు ఉన్నాయి. 4,87,704 మంది గృహ నిర్బంధంలో 3,245 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. క్రియాశీల రోగులలో పుణే జిల్లాలో అత్యధికంగా 16,177 కేసులు ఉన్నాయి. అలాగే అదే జిల్లాలో అత్యధికంగా 10,52,367 మంది రోగులు కోలుకున్నారు. రాజధానిలో 341 కేసులు.. గత 24 గంటల్లో రాజధాని ముంబైలోనే కొత్తగా 341 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,35,505 అయింది. ముంబైలో 13 మంది కరోనాతో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 15,808గా నమోదైంది. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్లో ఒక్కరోజులో 1,011 కేసులు నమోదయ్యాయి. పుణే డివిజన్లో 2,801 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. లాతూర్ డివిజన్లో కొత్తగా 375 కరోనా కేసులు నమోదైతే ఔరంగాబాద్ డివిజన్లో 94, కొల్లాపూర్ డివిజన్లో 1,847 కేసులు నమోదయ్యాయి. కొల్హాపూర్ ప్రాంతంలో 48 మరణాలు నమోదయ్యాయి, తరువాత పుణే, ముంబై పరిసర ప్రాంతాలలో వరుసగా 40, 31 మరణాలు సంభవించాయి. అకోలా డివిజన్లో 28, నాగ్‌పూర్ డివిజన్లో 32 కేసులు నమోదయ్యాయి. నాసిక్ డివిజన్లో తాజాగా 1,054 కేసులు నమోదయ్యాయి. భండారా, నందుర్బార్ జిల్లాలతో పాటు పర్భని మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో గురువారం ఎలాంటి కొత్త కరోనా వైరస్ కేసులు రాలేదు. ఔరంగాబాద్, నాసిక్, లాతూర్, నాగ్‌పూర్, అకోలా ప్రాంతాలలో వరుసగా 26, 17,12, 9, 7 తాజా కరోనా మరణాలు నమోదయ్యాయి. థానేలో 292 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 5,43,814కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలో 11 మంది కోవిడ్ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 11,009కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.02 శాతంగా ఉంది. రికవరీ, క్రియాశీల కేసుల వివరాలను జిల్లా యంత్రాంగం అందించలేదు. పాల్ఘర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,29,488కి చేరుకోగా మరణాల సంఖ్య 3,190గా ఉందని అధికారులు తెలిపారు. -
భారత్ ఎకానమీపై హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఎకానమీ పురోగమిస్తోందని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా భారత్‌కు కీలక సవాలుగా కొనసాగుతుందని కూడా అభిప్రాయపడ్డారు. హెచ్డీఎఫ్సీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి పరేఖ్ ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ మొదటి వేవ్‌లో నష్టపోయినంత రెండవ వేవ్‌లో నష్టపోలేదని పేర్కొన్నారు. దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు (600 బిలియన్ డాలర్లపైన) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పటిష్టంగా ఉన్నాయన్నారు. క్యాపిటల్ మార్కెట్లు బులిష్ ధోరణిని కొనసాగిస్తున్నాయని, వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఎకానమీ పురోభివృద్ధికి కేంద్రం ఒకపక్క పలు సంస్కరణాత్మక చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరమైన పటిష్ట చర్యలను కొనసాగిస్తోందన్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఎదురుకాకుండా ఆర్బీఐ సమర్థవంతమైన విధానాలను అనుసరిస్తోందన్నారు. దేశంలో ఇంకా రుణ వృద్ధి రేటు మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సవాళ్లు కొనసాగుతున్నాయని, రికవరీ ఒడిదుడుకులకు గురవుతోందని పేర్కొన్నారు. గృహ రుణాలు, కమర్షియల్ రియల్టీ, గోడౌన్లు, ఈ-కామర్స్ విభాగాల నుంచి దేశంలో రుణాలకు డిమాండ్ ఉందని ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా రంగం కూడా పురోగమిస్తోందన్నారు. కాగా హెచ్డీఎఫ్సీ ఈఆర్జీఏ జనరల్ ఇన్సూరెన్స్ లిస్టింగ్ ప్రణాళికలు తక్షణం ఏమీ లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఐటీ.. రికవరీ పటిష్టం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ పరిశ్రమ రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని, ఆదాయాలు 11 శాతం దాకా వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు.. బీమా (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల్లో డిజిటలీకరణ వేగవంతం కానుండటం, ఔట్సోర్సింగ్ వంటి అంశాలు రికవరీకి దోహదపడగలవని పేర్కొంది. పరిశ్రమ వృద్ధి అంశంపై విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ కూడా రెండంకెల స్థాయిని అంచనా వేస్తుండటం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం ఐటీ సేవల పరిశ్రమ 2020–21లో 2.7 శాతం వృద్ధి చెంది 99 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ–కామర్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ మొదలైన విభాగాలన్నీ కలిపితే 2.3 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిజిటల్ డీల్స్ జూమ్.. కంపెనీల నిర్వహణ మార్జిన్లు మరింత మెరుగుపడటానికి లాభదాయకమైన డిజిటల్ ఒప్పందాలు ఉపయోగపడగలవని క్రిసిల్ తెలిపింది. ‘వ్యయాలను తగ్గించుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నందున ఐటీ సేవల ఔట్సోర్సింగ్ అంతర్జాతీయంగా క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రిమోట్ వర్కింగ్, ఈ–కామర్స్, ఆటోమేటెడ్ సేవలు వంటి విధానాలు పెరిగిన నేపథ్యంలో, డిజిటల్ సర్వీసుల వ్యాపారావకాశాలు మరింత పెరిగాయి‘ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. 2020–21లో దేశీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల పరిమాణం 20 శాతం పెరగ్గా.. ఇందులో సుమారు 80 శాతం వాటా డిజిటల్ డీల్స్‌దే ఉందని ఆయన పేర్కొన్నారు. క్రిసిల్ అంచనాల్లో మరికొన్ని.. ► ఐటీ సర్వీసుల ఆదాయంలో సుమారు 28 శాతం వాటా ఉండే బీఎఫ్ఎస్ఐ విభాగం .. ఈ ఆర్థిక సంవత్సరం 13–14 శాతం వృద్ధి నమోదు చేయనుంది. డిజిటల్ లావాదేవీలు, డేటా భద్రతరమైన జాగ్రత్తలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ వృద్ధి 9 శాతంగా నమోదైంది. ► ఐటీ ఆదాయాల్లో 30 శాతంగా ఉండే రిటైల్, తయారీ విభాగాలు ఈసారి కాస్త కోలుకుని 8–9 శాతం మేర వృద్ధి చెందవచ్చు. 2020–21లో ఇవి 2–3 శాతం క్షీణించాయి. ► కోవిడ్–19ని ఎదుర్కొనేందుకు మరింత వ్యయం చేస్తున్నందున హెల్త్‌కేర్ విభాగం వృద్ధి భారీగా 15–16 శాతం స్థాయిలో కొనసాగనుంది. ఐటీ సేవల ఆదాయంలో దీని వాటా 6 శాతం. ► ఆదాయ వృద్ధి మెరుగుపడినప్పటికీ 2020–21లో నమోదైన స్థాయికి మించి లాభదాయకత పెరగకపోవచ్చు. ప్రయాణాలు, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తగ్గడం వంటి అంశాల కారణంగా నిర్వహణ మార్జిన్లు 2 శాతం మెరుగుపడి ఏడేళ్ల గరిష్టమైన 25 శాతానికి పెరిగాయి. అయితే, ఈసారి క్రమంగా వ్యాపారపరంగా సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నందున ఇవి తగ్గవచ్చని అంచనా. ► ఐటీ సర్వీసులకు కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో కరోనా మహమ్మారి కొత్తగా మళ్లీ విజృంభించే అవకాశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి: ప్రేమ్‌జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయగలదని ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమ 2–3 శాతం వృద్ధి చెందడంతో పాటు నికరంగా కొత్తగా 1.58 లక్షల ఉద్యోగాలను కల్పించిన నేపథ్యంలో ఈసారి అంతకన్నా మెరుగ్గా రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రేమ్‌జీ ఈ విషయాలు తెలిపారు. మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలైన పరిస్థితుల్లో ఐటీ రంగం శరవేగంగా కొత్త మార్పులను ఆకళింపు చేసుకుని, యావత్ప్రపంచం ముందుకు సాగేందుకు తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే కంపెనీలు.. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాయని, ఇప్పటికీ చాలా ప్రాజెక్టులకు సంబంధించి 90 శాతం దాకా సిబ్బంది ఇదే విధానంలో పనిచేస్తున్నారని ప్రేమ్‌జీ వివరించారు. కొంత మంది సిబ్బంది ఇంటి నుంచి, మరికొందరు ఆఫీసులోను పనిచేసే హైబ్రిడ్ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. -
కరోనా సెకండ్ వేవ్: ఆశ-నిరాశల ఎకానమీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మొదటివేవ్ నుంచి 2020-21 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికాలూ కొంత కోలుకున్నాయని ఊరట చెందుతున్న నేపథ్యంలోనే సెకండ్ వేవ్ దేశంపై విరుచుకుపడింది. కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. తదుపరి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. అయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 0.5 శాతం, 1.6 శాతంగా నమోదయ్యాయి. ఇక మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణ రేటు అంచనాకన్నా తక్కువగా మైనస్ 7.3 శాతానికి పరిమితమైంది. అయితే 2021-22 మొదటి త్రైమాసికం ప్రారంభంలోనే ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసిరింది. సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలోనూ ఎకానమీ 12 శాతం క్షీణిస్తుందని బ్రోకరేజ్ సంస్థ-యూబీఎస్ అంచనాకూడా వేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మహమ్మారి కొత్త కేసులు స్థానికంగా రాష్ట్రాల్లో లాక్డౌన్ల వల్ల జూన్‌లో కొంత అదుపులోనికి వచ్చాయి. తిరిగి ఎకానమీ రికవరీపై ఆశలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో ఆర్థిక పరిస్థితులు చూస్తే, మొత్తంగా ఆశ-నిరాశల మధ్య ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఆ వివరాలు చూస్తే.. నోమురా ఇండియా బిజినెస్ రిజమ్షన్ ఇండెక్స్: జూలై 4వ తేదీతో ముగిసిన వారంలో 91.3కు పెరిగింది. అంతక్రితం వారం జూన్ 27వ తేదీతో ముగిసిన వారంలో ఈ ఇండెక్స్ 86.3 వద్ద ఉంది. నిజానికి అంతక్రితం ఆరు వారాల నుంచీ ఈ ఇండెక్స్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రవాణా, విద్యుత్ డిమాండ్, కార్మిక శక్తి భాగస్వామ్యం వంటివి సూచీ వెయిటేజ్‌లో ప్రధానమైనవి. ప్రస్తుతం సూచీ (91.3) మహమ్మారి ముందస్తు స్థాయికన్నా 8.7 శాతం తక్కువగా ఉంటే, సెకండ్‌వేవ్ ముందు స్థాయికన్నా 3.6 శాతం తక్కువగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్: జూన్ 28వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 78.3 నుంచి 91.8కి ఎగసింది. వారంవారీ కూరగాయల సరఫరాలు, ప్రాంతాల వారీ రవాణా సంఘాల రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. అయితే కార్మిక భాగస్వామ్యం రేటు ఇంకా తక్కువగానే ఉందని ఎస్బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ తెలిపారు. విద్యుత్ డిమాండ్: సాయంత్రం కీలక రద్దీ సమయంలో విద్యుత్ డిమాండ్ విషయానికి వస్తే, 2021 మేలో 11.2 శాతం క్షీణత నమోదుచేసుకుంటే, జూన్‌లో 8.3 శాతం పురోగమించింది. ఎకానమీ తిరిగి క్రియాశీలం అవుతోందనడానికి ఇది సంకేతంగా కనబడుతోంది. సేవలు, తయారీ రంగాలు: అయితే సేవల రంగం మాత్రం ఇంకా తీవ్ర పేలవంగా ఉంది. జూన్‌లో ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మరింత క్షీణించి 41.2కు పడిపోయింది. మేలో సూచీ 46.4 వద్ద ఉంది. కాగా సేవలు-తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మేలో 48.1 వద్ద ఉంటే, జూన్‌లో 43.1 దగ్గరకు పడింది. ఒక్క తయారీ రంగ కార్యకలాపాలను సూచించే ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూడా జూన్‌లో క్షీణతలోకి జారి 48.1 పాయింట్లకు పడిపోయింది. మేలో ఈ సూచీ 50.80 వద్ద ఉంది. వస్తు రవాణా: జూన్‌లో వస్తు రవాణా పెరిగిందని ఈ-వే బిల్లులు సూచిస్తున్నాయి. జూన్ 27తో అందిన గణాంకాలను చూస్తే, ఈ– వే బిల్లుల పరిమాణం 4.75 కోట్లు. అంతక్రితం ఇదే తేదీతో ముగిసిన నెల్లో ఈ మొత్తం రూ.4 కోట్లే. అయితే 2021 మార్చితో పోల్చితే మాత్రం ఇంకా ఈ పరిమాణం తక్కువగానే ఉంది. ప్రధాన రూట్లలో మేలో 6 నుంచి 8 శాతం పడిపోయిన ట్రక్ రెంటల్స్ తాజా సమీక్షా నెల్లో 13 నుంచి 15 శాతం పెరిగినట్లు ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ గణాంకాలు తెలిపాయి. అయితే అధిక ట్రక్ రెంటల్స్ పెరుగుదల్లో డీజిల్ ధర పెరుగుదల పాత్రా ఉందన్న విశ్లేషణ ఉంది. ఎగుమతులు: జూన్‌లో ఎగుమతుల విలువ 32.46 బిలియన్ డాలర్లు. మేలో 32.27 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతులు 38.55 బిలియన్ డాలర్ల నుంచి 41.86 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఉపాధి: ప్రభుత్వ ప్రధాన ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద డిమాండ్ ఏడాది స్థాయికి ఎగసింది. సమీక్షా నెలల్లో పనుల్లో పాల్గొన్న వారి సంఖ్య 1.7 కోట్ల నుంచి 1.9 కోట్లకు పెరిగింది. సీఎంఐఈ అంచనాల ప్రకారం, నిరుద్యోగం రేటు 2021 మేలో 11.9 శాతం ఉంటే, జూన్‌లో ఈ రేటు 9.1 శాతానికి తగ్గింది. కాగా కార్మిక భాగస్వామ్యం రేటు జూన్‌లో సగటున 40 శాతంగా ఉంది. ఏప్రిల్, మేలకు ఇది దాదాపు సమానం. అయితే కోవిడ్ ముందస్తు కాలంలో ఈ సగటు 42.7 శాతంగా ఉండేది. స్టాక్ మార్కెట్: ఫైనాన్షియల్ వెల్త్ విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్ బంపర్ ర్యాలీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.25.46 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. బీఎస్ఈ చరిత్రలో మే 24న మొదటిసారిగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల(రూ.218 లక్షల కోట్లు)కు చేరింది. అలాగే జూన్ 15న రూ.232 లక్షల కోట్లకు చేరుకుని మార్కెట్ క్యాప్ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇదే 3 నెలల్లో సెన్సెక్స్ సూచీ 2,973 పాయింట్లు(6%) లాభపడంది. ఈ జూన్ 28వ తేదిన 53,127 వద్ద జీవితకాల గరిష్టాన్ని, జూన్ 25 తేదీన 52,925 వద్ద ఆల్‌టైం హై ముగింపు స్థాయిని లిఖించింది. ఫారెక్స్: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు జీవితకాల గరిష్టాలకు చేరాయి. జూన్ 25తో ముగిసిన వారంలో 608.999 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆబీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రూపాయిల్లో ఇది సుమారు రూ.45 లక్షల కోట్లకు పైనే. ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో రెండంకెల వృద్ధి వేగంగా విక్రయమయ్యే ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు లాక్డౌన్ల కాలంలోనూ మంచి వృద్ధిని చూపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మొదటి త్రైమాసికంలో రెండంకెల స్థాయిలో అధిక విక్రయాలను నమోదు చేశాయి. గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో సంస్థలు మొదటి త్రైమాసికం పనితీరుకు సంబంధించి గణాంకాలను స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేశాయి. ‘‘2021–22 క్యూ1లో మా ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగానే ఉంది. రెండంకెల స్థాయిలో విక్రయాలు నమోదైనట్టు అంచనా వేస్తున్నాము’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. మారికో సైతం దేశీయ వ్యాపారం మొదటి త్రైమాసికంలో 30 శాతం వృద్ధి చెందినట్టు ఇప్పటికే ప్రకటించింది. క్యూ1లో అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజా సైతం ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు బలమైన విక్రయాలు నమోదు చేశాయని, అనంతరం కరోనా కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ.. తిరిగి జూన్‌లో విక్రయాలు జోరుగా నమోదైనట్టు ఎడెల్వీజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ఆబ్నీష్రాయ్ పేర్కొన్నారు. -
కోవిడ్ నుంచి కోలుకున్నాక మన గుండె పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వచ్చి తగ్గిన మొత్తం బాధితుల్లో దాదాపు నాలుగోవంతు మందికి గుండె సమస్యలు వస్తుంటే... వారిలోనూ నాలుగో వంతు మందిలో అవి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘జామా కార్డియాలజీ’లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... అంతకు ముందు అస్సలు గుండె సమస్యలు లేనివారు సైతం... కోవిడ్ తర్వాత గుండెజబ్బుల బారినపడి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని తేలింది. కరోనా నుంచి బయటపడ్డాక కూడా గుండె సమస్యలు ఎందుకొస్తున్నాయి ? గుండె కణాల్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్–2 (ఏసీఈ–2) అనే రిసెప్టార్లు ఎక్కువ. వీటికి అంటుకునే కరోనా మన దేహంలోకి చొరబడుతుంది. ఇలా ఈ రిసెప్టార్ల వల్లనే వ్యాప్తి చెందుంతుంది కాబట్టి గుండెకు సంబంధించిన కండరాలు ప్రభావితమయ్యే అవకాశాలూ ఎక్కువ. ఆ తర్వాతి క్రమంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ... వైరస్‌తో పోరాడే సమయంలో అక్కడ (గుండెలోని కణాల్లో) జరిగే ప్రతిక్రియల వల్ల గుండె కణాలూ, కండరాలు దెబ్బతింటాయి. అలాగే గుండెలోపలా, పైనా ఉండే రక్తనాళాలూ (ధమనులూ, సిరలు) ప్రభావితమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ ధమనులూ, సిరల్లోనూ లోపలి పొరలో (లైనింగ్లో) ఉండే ‘ఎండోథీలియల్’ కణాలు దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాల్లోని కణాలూ దెబ్బతినడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావిమవుతుంది. అది మళ్లీ గుండెపైనే ప్రభావం చూపుతుంది. ప్రధానమైనది ‘పాట్స్’ కరోనా సోకి కోలుకుంటున్న కొందరిలో పాట్స్ అనే సమస్య కనిపించవచ్చు. ‘పోష్చురల్ ఆర్థోస్టాటిక్ టాకికార్డియా సిండ్రోమ్’ అనే వైద్య సమస్య (కండిషన్)కు సంక్షిప్త రూపమే ఈ ‘పాట్స్’. ప్రస్తుతం ఈ పాట్స్కూ... కోవిడ్‌కు ఎంతవరకు సంబంధం ఉందనే అంశంపై పరిశోధనలు చాలా చురుగ్గా, విస్తృతంగా జరుగుతున్నాయి. ఇది కొంత ‘గుండె’కు సంబంధించిన, మరికొంత ‘నాడీ వ్యవస్థ’కు సంబంధించిన సమస్య. గుండె స్పందనలను నియంత్రించే నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యతో పాటు గుండె కూడా ప్రభావితం కావడం వల్ల గుండె సంస్పందనలు ప్రభావితమవుతాయి. దాని కారణంగానే చాలామందిలో కోవిడ్ అనంతర పరిణామంగా చెప్పుకుంటున్న అయోమయ పరిస్థితి (బ్రెయిన్ ఫాగ్), తీవ్రమైన నిస్సత్తువ (ఫెటీగ్), గుండెదడ (పాల్పిటేషన్స్), తల అంతా తేలికైపోయినట్లుగా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించే లైట్‌హెడెడ్‌నెస్ వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. సాధారణ లక్షణాలివే.. గుండెపై కరోనా అనంతర ప్రభావాల వల్ల కనిపించే లక్షణాలు చాలా ఉన్నాయి. తీవ్రమైన నిస్సత్తువ అందులో ఒకటి. కరోనా వల్ల రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరా తగ్గడం వంటివి సంభవిస్తాయని చెప్పుకున్నాం కదా. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన అలసట కనిపిస్తుంటుంది. దాంతో వారాల తరబడి పడకకే పరిమితమవుతారు. కొన్నిసార్లు ఊపిరి అందకపోవడం, త్వరత్వరగా ఊపిరిపీలుస్తూ ఉండటం, ఆయాసం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో ఛాతీనొప్పి, గుండెదడ వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వీటిలో కొన్ని గుండెకు సంబంధించిన లక్షణాలూ అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి అందకపోవడం, ఆయాసం, నిస్సత్తువ, నీరసం వంటి లక్షణాలు కనిపించనప్పుడు అది ఊపిరితిత్తులకు సంబంధించినవి కావచ్చు అని అనుకోకుండా ఒకసారి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెదడ అయితే అది గుండెకు సంబంధించిన సమస్యే అని తెలిసిపోతుంది కాబట్టి నిర్ద్వంద్వంగా గుండె డాక్టర్‌ను సంప్రదించాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత... కోవిడ్ నుంచి కోలుకున్నవారూ కనీసం మూడు నెలల పాటు అందరిలాగే మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం / శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాలు పాటించడం వంటి కోవిడ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి. ∙అంతకు ముందు తాము తమ వైద్య సమస్యల కారణంగా వాడుతున్న మందులనూ / చికిత్సనూ ఆపకుండా కొనసాగించాలి. ఛాతీలో నొప్పి / అసౌకర్యం, చెమటలు పెట్టడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి.మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ఒత్తిళ్లు, యాంగై్జటీ గుండెకు కీడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ∙కోవిడ్–19 నుంచి కోలుకున్న చాలామందిలో గుండె స్పందనల రేటు నిమిషానికి 100 – 120 ఉండటం కూడా వైద్యనిపుణులు గుర్తించారు. కాబట్టి గుండెదడగా అనిపించినప్పుడు అది పల్మునరీ ఎంబాలిజమ్ (రక్తప్రవాహంలో గాలి బుడగ రావడం), మయోకార్డయిటిస్ (గుండె కండరానికి ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ రావడం), హైపాక్సియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లోపించడం) వంటి సమస్యలా లేక సాధారణ సమస్యలా అన్నది నిర్ధారణ చేయడానికి తక్షణం హృద్రోగ నిపుణులను సంప్రదించాలి. చాలామంది యువకులు నెగెటివ్ రిపోర్టు రాగానే వ్యాయామం మొదలుపెడుతున్నారు. అలా చేయడం సరికాదు. ఊపిరితిత్తులు తగినంత బలం పుంజుకునేంతవరకు కొంత వ్యవధి ఇవ్వడమే మేలు. మరీ ముఖ్యంగా లంగ్ నిమోనియా / సీటీ స్కాన్ కౌంట్ 9 లేదా 10 ఉన్నవారు వ్యాయాయం మొదలుపెట్టడానికి ముందర తప్పనిసరిగా తగినంత సమయం తీసుకోవాలి. ∙మంచి పోషకాహారం తీసుకుంటూ, తగినంతగా నీళ్లు తాగుతూ (హైడ్రేటెడ్‌గా ఉంటూ), బాగా విశ్రాంతి తీసుకుంటూ, గుండెకు సంబంధించిన మందులు లేదా ఇతరత్రా మందులను కొనసాగిస్తూ... ఆందోళన కంటే అవగాహన పెంచుకుని నిశ్చింతగా ఉండటం మంచిది. ఇది గుండెతోపాటు వారి సాధారణ ఆరోగ్య మెరుగుదలకూ దోహదపడుతుందన్నది నిపుణుల మాట. గుండె స్పందనల్లో మార్పులు... కోవిడ్ తర్వాత చాలామందిలో గుండె స్పందనల వేగం పెరిగి గుండెదడగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ఇలాంటివారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తీరాలి. ఈ గుండెదడకు ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు దేహానికి సరిపడా నీరు అందనప్పుడూ గుండెదడ వస్తుంది. అంటే బాగా నీళ్లు తాగడం, తగినంతగా ద్రవాహారం తీసుకోవడం వల్ల గుండెదడ దానంతట అదే తగ్గుతుంది. ఇలాంటివే మరికొన్ని చిన్నా, పెద్దా కారణాల వల్ల కూడా గుండెదడ రావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో... నిజంగా అది ‘డీ హైడ్రేషన్’ కారణంగా వస్తున్న గుండెదడా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది డాక్టర్ నిర్ణయించడమే మంచిది. అందుకే గుండె లయ (రిథమ్) తప్పడం, తలతిరుగుతున్నట్లు అనిపించడం (డిజ్జీనెస్), ఛాతీలో అసౌకర్యం (చెస్ట్ డిస్కంఫర్ట్) వంటివి కనిపించినప్పుడు తప్పనిసరిగా గుండెవైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నాయా... అప్రమత్తం కండి... ► త్వరత్వరగా గాలి పీలుస్తూ ఉండాల్సి రావడం, పడుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ (ఫెటీగ్ / టైర్డ్‌నెస్) ఉంటూ... ఆక్సీమీటర్ పెట్టినప్పుడు రక్తంలో ఆక్సిజన్ శాతం 92% కంటే తగ్గడం. ► ఛాతీనొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, తలతిరిగినట్లుగా ఉండటం, బాగా విశ్రాంతిగా ఉన్నప్పుడు లక్షణాలు తగ్గినట్లుగా అనిపించడం. గుండెపై ప్రభావం తాత్కాలికమా... శాశ్వతమా? ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘గుండెపై ఉన్న ఈ ప్రభావం తాత్కాలికమా? లేక శాశ్వతంగా ఉంటుందా?’ అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. తాము నేరుగా కోవిడ్ బారిన పడకపోయినా... తమ ఇంట్లోని కుటుంబసభ్యులెరిలోనైనా ఈ లక్షణాలు కనిపించినా ఇవే సందేహాలు ముప్పిరిగొంటాయి. అయితే గుండె కండరం ఏ మేరకు దెబ్బతింది, ఎంత మేరకు ప్రభావితమైంది అనే అంశాల ఆధారంగానే అది శాశ్వతమా, తాత్కాలికమా అన్నది ఆధారపడుతుంది. ఈ అంశంపై ఇంకా పరిశోధనలూ, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచి ఫిట్నెస్తో ఉండి, బాగా ఆటలాడే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో సైతం కోవిడ్ తర్వాత వారి గుండె కండరం మీద గాటు / గీత (స్కార్) రావడం చాలామందిలో కనిపించింది. ఇలాంటివారిని ఏ తరుణంలో మళ్లీ క్రీడలకు అనుమతించాలనే అంశంపై నిపుణులు తగిన ప్రోటోకాల్ నిర్ణయించే పనిలో ఉన్నారు. మరికొన్ని అనర్థాలు... మరికొందరిలో గుండె పంపింగ్ తీరు దెబ్బతినడం, అది రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోవడం వంటి సమస్యలనూ గమనించారు. కొందరు అథ్లెట్లలో కోవిడ్ తర్వాత మునుపటి ఫిట్నెస్ దానంతట అదే రాకపోవడంతో... ఫిజియోథెరపీ అవసరం కావడం, బ్రీతింగ్ వ్యాయామాలతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తోంది. -
గుడ్ న్యూస్: కోలుకుంటున్నవారి సంఖ్యే అధికం
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసులతో పోలిస్తే.. ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది కొత్తగా కోవిడ్ బారిన పడుతుండగా.. 4,500 నుంచి 4,900 మందికిపైగా కోలుకుంటుండటం శుభ పరిణామమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనరల్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55,120 పడకలు ఉండగా, వీటిలో 23,374 మంది చికిత్స పొందుతున్నారు. మరో 31,746 పడకలు ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్ పడకలకు ఇప్పటికీ అదే డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. జనరల్, ఆక్సిజన్ పడకలు భారీగా అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటనతో.. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం రెండు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు తెరుచుకున్న సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు సహా ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ పూర్తిగా మూతపడ్డాయి. ప్రజా రవాణా స్తంభించడంతో పాటు రహదారులపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా మే మొదటి వారంలో రోజుకు సగ టున ఎనిమిది వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రజల్లోనూ కోవిడ్‌పై భయం ఏర్పడింది. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే..సెకండ్ వేవ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కోవిడ్ బాధితులుగా మారారు. వైరస్ సోకిన వారు కళ్ల ముందే కన్నుమూస్తుండటంతో కుటుంబ సభ్యులు, ఇతరులు అప్రమత్తమవుతున్నారు. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాంధీ నుంచే రోజుకు 120 మంది డిశ్చార్జీ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 38,632 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 23,374 మంది వివిధ ప్రభుత్వ ప్రై వేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 1,250 మందికిపైగా చికిత్స పొందుతుండగా, టిమ్స్‌లో 850 మంది, కింగ్‌కోఠిలో 250 మంది, ఈఎన్టీలో 250 మంది, ఛాతీ ఆస్పత్రిలో 200 మంది చికిత్స పొందుతున్నారు. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ పూర్తి స్థాయిలో పడకలు నిండిపోయాయి. వెంటిలేటర్ పడకలకు ఇప్పటికు ఫుల్ డిమాండ్ ఉంది. రోగుల రద్దీ తగ్గడంతో ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లోని జనరల్, ఆక్సిజన్ పడ కలు ఖాళీగా ఉంటున్నాయి. గాంధీ నుంచి రోజుకు సగటున 120 నుంచి 150 మంది డిశ్చార్జీ అవుతుండగా, టిమ్స్ నుంచి 50 మంది, కింగ్‌కోఠి నుంచి 25 మంది, ఈఎన్టీ నుంచి పది, చెస్ట్ నుంచి పది మంది చొప్పున డిశ్చార్జీ అవుతున్నారు. కార్పొరేట్ ఆస్ఫత్రుల నుంచి మరో 500 మంది వరకు డిశ్చార్జీ అవుతున్నారు. చదవండి: పోలీసుల వీడియో వైరల్.. యూనిఫాంలో కొనుగోళ్లు వద్దు! రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ.. తేదీ కొత్త కేసులు కోలుకున్న వారి సంఖ్య 19 3,837 4,976 20 3,660 4,826 21 3,464 4,801 22 3,308 4,723 23 2,242 4,693 24 3,043 4,305 25 3,821 4,298 26 3,762 3,816 -
ఏడో రోజూ రికవరీలే అధికం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 2,76,110 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు పెరిగింది. తమిళనాడులో అత్యధికంగా ఒక్క రోజులో 34,875 కేసులు రాగా, కర్ణాటకలో 34,281 నమోదయ్యాయి. మరో సానుకూల పరిణామంగా వరుసగా నాలుగు రోజులుగా కొత్త కేసులు రోజుకు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. దేశంలో మరో 3,69,077 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,23,55,440కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా 3,874 మంది మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల తర్వాత తొలిసారిగా దేశంలో కోవిడ్‌తో మరణించి వారి సంఖ్య 4వేల కన్నా తక్కువగా నమోదైంది. కొత్తగా నమోదైన మరణాల్లో 72.25 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,87,122కు చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,29,878కు తగ్గింది. రోగుల రికవరీ రేటు 86.74 శాతం ఉండగా, దేశంలో మరణాల రేటు 1.11 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం గడిచిన 24 గంటల్లో 20,55,010 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు జరగటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 13.44 శాతంగా నమోదైంది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 18,70,09,792కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద దాదాపు రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు ఉన్నాయని, మరో మూడ్రోజుల్లో మరో 26 లక్షల డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,660 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,826 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం4,95,446 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 45,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3060 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 69,252 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,43,36,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: Coronavirus: వ్యాక్సిన్.. కోవిడ్‌పై విన్ -
లాక్డౌన్ సుదీర్ఘకాలం కొనసాగితే వాటికి కష్టమే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కంపెనీలకు తాజా సెకండ్ వేవ్ మరో సమస్యగా మారుతోంది. ఇది సత్వరం అదుపులోకి వస్తే ఫర్వాలేదు .. లేకపోతే సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగిన పక్షంలో వ్యాపార సంస్థల ఆదాయాల రికవరీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ లాక్డౌన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో తాము రేటింగ్ ఇస్తున్న సంస్థల ఆదాయాల రికవరీ ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలించడం మొదలయ్యాక 2020 అక్టోబర్ తర్వాత వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. కానీ పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షల విధింపుతో ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ బలహీనపడవచ్చని, ఇటీవలి రికవరీని దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. ‘కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టడికి భారత్‌లో ప్రాంతీయంగా అమలు చేస్తున్న లాక్డౌన్లు మరీ అంత కఠినంగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకానైతే ఆర్థిక కార్యకలాపాలపై పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉంది. అయితే, వైరస్ వ్యాప్తి తగ్గి, పరిస్థితులు అదుపులోకి రాకపోయిన పక్షంలో..లాక్డౌన్లను మరింతగా పొడిగించాల్సి రావచ్చు.ఇంకా విస్తృతం చేయాల్సి కూడా రావచ్చు. ఇది మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చు‘ అని వివరించింది. జూన్ క్వార్టర్ కాస్త ఓకే.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని మూడీస్ అంచనా వేసింది. కానీ పరిస్థితి దిగజారితే మాత్రం కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని వివరించింది. ‘ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. కానీ వీటితో పోలిస్తే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తే యావత్‌దేశంలో కార్యకలాపాలు దెబ్బతింటాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే వ్యక్తుల రాకపోకలపై భారీ స్థాయిలో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ పడిపోతుంది. అలాగే సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడతాయి. కార్మికుల కొరత సమస్య తీవ్రమవుతుంది‘ అని మూడీస్ తెలిపింది. ఆటో, రియల్టీపై ప్రభావం.. కదలికలపై ఆంక్షల కారణంగా రవాణా ఇంధనానికి డిమాండ్ తగ్గిపోతుందని, చమురు రిఫైనర్ల ఉత్పత్తి పడిపోవచ్చని వివరించింది. అలాగే, పలు ఆంక్షల కారణంగా వినియోగదారులు .. కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకోవడం వల్ల్ ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో డిమాండ్ క్షీణిస్తుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల ఉక్కు, సిమెంట్, మెటల్స్, మైనింగ్ వంటి భారీ పరిశ్రమలకు చెందిన కంపెనీలు తమ పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి చేయలేకపోతాయని మూడీస్ తెలిపింది. విస్తృతంగా, సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లు విధిస్తే వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతింటుందని, వస్తు.. సేవలకు డిమాండ్ బలహీనపడుతుందని పేర్కొంది. నిత్యావసరయేతర కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకుంటారని.. ఫలితంగా దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయని వివరించింది. లాక్డౌన్లను కఠినంగా అమలు చేస్తే కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని, దీంతో తయారీ కార్యకలాపాలు నిల్చిపోతాయని మూడీస్ తెలిపింది. ఫలితంగా ఆంక్షలు సడలి, తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. లాక్డౌన్ సడలింపు తర్వాత కూడా వారాలు, నెలల పాటు ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చని మూడీస్ తెలిపింది. -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,961 కేసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 5,559 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం4,80,458 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2985 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,41,24,316 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ( చదవండి: ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి ) -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 4,298 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 6026 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,69,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2928 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 64,362 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,40,16,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ( చదవండి: గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి ) -
కరోనా సెకండ్‌వేవ్: ఎకానమీ కష్టాలు!
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్ తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2021లో రెండంకెల్లో వృద్ధి రేటు ఉన్నా 2020లో అతి తక్కువ స్థాయి గణాంకాలే(బేస్ ఎఫెక్ట్) ఇందుకు ప్రధాన కారణమవుతోందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా, పాక్షిక లాక్డౌన్ వల్ల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలువురు సీఈవోలు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు సీఐఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సెకండ్‌వేవ్ కేసుల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 1.4 శాతం నష్టం జరగనుందని బ్రిటిష్ బ్రోకరేజ్ దిగ్గజం– బార్ల్కేస్ అంచనావేస్తోంది. కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా కేసుల తీవ్రత, ధరల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత తత్సంబంధ సవాళ్లు తిరిగి ఎకానమీ రికవరీ వేగంపై అనుమానాలను సృష్టిస్తున్నాయి. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యలో గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో సీఐఐ, మూడీస్, బార్ల్కేస్ అంచనాలను వేర్వేరుగా పరిశీలిస్తే.. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) ఆర్థికాభివృద్ధి బాటలో అవరోధమే: మూడీస్ ► భారత్ వృద్ధి సానుకూల అంచనాలకు కోవిడ్–19 తాజా కేసులు సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతకు సెకండ్‌వేవ్ అవరోధమే. అయినా జీడీపీ 2021లో రెండంకెల్లో వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. దీనికి ప్రధాన కారణం గత ఏడాది అతి తక్కువ స్థాయి (బేస్ ఎఫెక్ట్) గణాంకాలు కావడమే. ► 2020లో దేశ వ్యాప్తంగా జరిగిన కఠిన లాక్డౌన్ తరహా పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకపోవచ్చు. లాక్డౌన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా మాత్రమే పరిమితమవవచ్చు. దీనివల్ల 2020లో జరిగిన ‘లాక్డౌన్’ నష్టం తిరిగి 2021లో ఏర్పడదు. ► ఏప్రిల్ 12 వరకూ చూస్తే, భారత్ కోవిడ్–19 వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,70,179గా ఉంది. భారత్‌లో యువత తక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంది. ► వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడంసహా కోవిడ్–19 కట్టడికి తీసుకునే పలు చర్యలు భారత్‌ను ‘క్రెడిట్–నెగటివ్’ ప్రభావం నుంచి తప్పిస్తాయి. ► ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2021లో 12 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. అయితే వృద్ధి అంచనాలను తాజా పరిస్థితులు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కేసులు పెరగడం ఆర్థిక క్రియాశీలతను అలాగే కన్జూమర్ సెంటిమెంట్‌నూ దెబ్బతీస్తుంది. ► కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కమోడిటీ ధరల పెరుగుదల డిమాండ్‌కు అవరోధంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులను భారత్ ఇప్పటికే ఎదుర్కొంటోంది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్ కొంత ఎక్కువగానే ఉంది. ► దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర సెకండ్‌వేవ్‌కు కేంద్రంగా నిలవడం గమనార్హం. ఏప్రిల్ 12 నాటికి యాక్టివ్ కేస్లోడ్లో 50 శాతం ఇక్కడే ఉంది. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు ) వారానికి 1.25 బిలియన్ డాలర్ల నష్టం: బార్లే్కస్ ♦ సెకండ్‌వేవ్ తీవ్రత వ్యాపారాలు, రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్ల వల్ల వారానికి ఆర్థిక వ్యవస్థ సగటున 1.25 బిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.75 చొప్పున చూస్తే దాదాపు రూ. 9,375 కోట్లు) నష్టం జరుగనుంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో దాదాపు 140 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) నష్టపోతుంది. నియంత్రణలు తక్కువగా ఉన్న వారం రోజుల క్రితం వారానికి ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 0.52 బిలియన్ డాలర్లే. ♦ మే నెల వరకూ ప్రస్తుత ఆంక్షలు కొనసాగితే ఇటు ఆర్థిక వ్యవస్థకు అటు వాణిజ్య కార్యకలాపాలకు రెండింటికీ కలిసి దాదాపు 10.5 బిలియన్ డాలర్ల నష్టం జరగనుంది. ♦ రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్ డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ♦ సెకండ్‌వేవ్ కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ♦ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదవుతుంది. దీనికి బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. కాగా కేసులు మరింత తీవ్రతరం కావడం, కఠిన లాక్డౌన్ పరిస్థితులు తలెత్తితే వృద్ధి రేటు మరింత పడిపోడానికే అవకాశం ఉంది. ♦ తాజా అంచనాల ప్రకారం, మే నెలాంతానికి కొత్త కేసుల పెరుగుదల సంఖ్యలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ విస్తృతి, మెరుగైన వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పనకు చర్యలు వంటి అంశాలు భారత్ సమీప భవిష్యత్ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఉత్పత్తి పతనంపై సీఈవోల ఆందోళన: సీఐఐ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పాక్షిక లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడుతుందని 75 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. కరోనా.. లాక్డౌన్ అంశాలపై సీఐఐ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్మెంట్, కరోనా నియంత్రణ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటివి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రత చెందకుండా నియంత్రిస్తున్నప్పటికీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలపై మహమ్మారి ప్రభావం పడకుండా చూడాల్సి ఉందని సీఐఐ పేర్కొంది. ఇందుకు తగిన చర్యలు అవసరమని పలు పరిశ్రమల సీఈవోలు అభిప్రాయపడ్డారని తెలిపింది. సీఈవోలు పాక్షిక లాక్డౌన్ పెడతారని భావిస్తున్నారని, అదే జరిగితే వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, సరకు రవాణాకు అంతరాయం ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. సీఐఐ నిర్వహించిన పోల్ సర్వేలో 710 మంది (75శాతం) సీఈవోలు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపింది. సరకు రవాణాపై నియంత్రణ తీసుకొస్తే తమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని 60శాతం సీఈవోలు తెలిపారని సీఐఐ వెల్లడించింది. సరకు రవాణాకు అనుకూలించే పర్యావరణ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తే ఉత్పత్తి నష్టపోతామని 56 శాతం సీఈవోలు తెలిపారు. ఈ పోల్ సర్వేలో 68శాతం ఎంఎస్ఎంఈ సీఈవోలతోపాటు తయారీ, సేవల రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమలు ఆరోగ్య, భద్రత ప్రోటోకాల్స్ పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయని 96 శాతం సీఈవోలు చెప్పగా... పాక్షిక లాక్డౌన్ కన్నా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం మంచిదని 93శాతం సీఈవోలు పోల్ ద్వారా వెల్లడించారని సీఐఐ పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలు విధించినప్పటికీ కార్మికులను అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలని, సరకు రవాణా ఆగకుండా చూడాలని 60శాతం సీఈవోలు తెలిపారు. ఈ సమయంలో కార్మికులు, పరిశ్రమ సిబ్బంది ఆరోగ, భద్రత ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా చూడాలని వారు తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠిన అమలు: టీవీ నరేంద్రన్ సీఐఐ అధ్యక్షుడు(ఎన్నికైన) టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమూహాలుగా ఒకే చోట చేరడం, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి తరచూ నిర్వహించే కార్యక్రమాలపైనా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీకా మహోత్సవ్‌లో పరిశ్రమల కార్మికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్లోని 65 కార్యాలయాలను కోరామని తెలిపారు. 10.5 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు: గోల్డ్‌మన్ శాక్స్ భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉండొచ్చని లోగడ వేసిన అంచనాలను తాజాగా 10.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం విధిస్తున్న లాక్డౌన్లు వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. -
వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకం
న్యూఢిల్లీ: వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకమని.. పెరిగిపోతున్న కరోనా కేసులు ఆర్థిక రికవరీకి సవాళ్లను తీసుకురావచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. ఇప్పటి వరకు చూస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగానే ఉందంటూ.. అయినప్పటికీ భారత విధాన కర్తలు నిర్లక్ష్యానికి ఏ కొంచెం కూడా అవకాశం ఇవ్వరాదని పేర్కొంది. కఠిన లాక్డౌన్లను విధించే విషయంలో రాష్ట్రాలు పునరాలోచిస్తుండడడంతో ఆర్థిక ప్రభావం గతేడాది ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి కావాల్సిన స్థాయిలో భారత్‌లో టీకాల కార్యక్రమం నడవడం లేదని అభిప్రాయపడింది. ఆరోగ్య పరిస్థితులు మరింత దారుణంగా మారి, కఠినమైన నియంత్రణలను అమలైతే కనుక 2021 సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థపై తమ అంచనాలు ప్రభావితం కావొచ్చని పేర్కొంది. -
ప్రపంచ ఎకానమీ రికవరీపై ఒపెక్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?) గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి. -
రికవరీ బాటన భారత్ ఎకానమీ: ఐఎంఎఫ్
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటన నడుస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధి గ్యారీ రైస్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌తో కలిసి వచ్చే నెల్లో ‘స్ప్రింగ్’ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే ఏప్రిల్ 6వ తేదీన ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను కూడా విడుదల చేయనుంది. ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ అవుతోంది. 2020 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) క్షీణతలోంచి బయటపడింది. మూలధనం, పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్నాయి అని విలేకరుల సమావేశంలో గ్యారీ పేర్కొన్నారు. దీనికితోడు 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, రవాణాసహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు ఇండికేటర్స్ సానుకూలంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్స్, స్థానిక లాక్డౌన్లు రికవరీబాటలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలని కూడా ఆయన అన్నారు. చదవండి: దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు! -
వేగంగా రికవరీ అవుతున్న ఎకానమీ!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ విశ్లేషించింది. కరోనా ప్రేరిత అంశాలతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోనే వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. కాగా ఆర్బీఐ అధికారులు రాసిన ఈ ఆర్టికల్‌లో వ్యక్తమైన అభిప్రాయాలను రచయితల అభిప్రాయాలుగానే పరిగణించాలితప్ప, ఆర్బీఐకి ఆపాదించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. తొలి త్రైమాసికంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 23.9 శాతంగా నమోదుకావడం... దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8% నుంచి 14% వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనాలు... అటు తర్వాత కనబడిన ఆర్థిక క్రియాశీలత... సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణరేటు 7.5 శాతానికి కట్టడి... ఈ సానుకూల వాతావరణంలో ఆర్బీఐసహా పలు సంస్థల తమ క్షీణ అంచనాలను సవరించడం (2020–21 ఆర్థిక సంవత్సరానికి) వంటి అంశాల నేపథ్యంలో వెలువడిన ఆర్టికల్‌లో ముఖ్యాంశాలు చూస్తే... ► కోవిడ్–19 కఠిన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలోనే భారత్ 0.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంకేతంగా రెండు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అందులో ఒకటి సెప్టెంబర్ మధ్యస్థం నుంచే పెట్టుబడులు, వినియోగ డిమాండ్ విషయంలో సానుకూలత కనిపించింది. ఇక రెండవ విషయానికి వస్తే, ద్రవ్యపరమైన చర్యలు వినియోగంవైపే కాకుండా, పెట్టుబడుల వైపునకూ మళ్లాయి. ► దేశంలో సెకండ్‌వేవ్ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంబంధించిన ద్రవ్యపరమైన చర్యలు మరింత ఊపందుకున్నాయి. ► ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలోనే క్షీణతకు సంబంధించి తొలి అంచనాల సవరణ జరుగుతోంది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సానుకూలత పరిస్థితుల్లో ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి), ఎస్అండ్పీ ఆ సంస్థ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి), ఇక్రా (–11 శాతం నుంచి 7.8 శాతానికి) ఎస్బీఐ రీసెర్చ్ (– 10.9 శాతం నుంచి 7.4 శాతానికి) క్షీణ అంచనాలను తగ్గించాయి. క్షీణ అంచనాలను తగ్గించిన ఇండియా రేటింగ్స్ కాగా, 2020–21 భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన తొలి క్షీణ అంచనాలను ఇండియా రేటింగ్స్ గురువారం 11.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా – 0.8 శాతం, – 0.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.6 శాతంగా విశ్లేషించింది. -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అంచనాలకు మించి రికవరీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ) వెలువడుతుండడం, క్యూ2లో క్షీణ రేటు ‘సింగిల్’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకానికి సంబంధించి భారత్ డీలర్ల సంఘం (ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ అందుబాటు విషయంలో మార్కెట్ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. ► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది. ► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది. ► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్ 13 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది. ► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్ పేపర్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి. -
16 రోజులుగా.. 50 వేల లోపే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 16 రోజులుగా బయటపడుతున్న కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేలకు మించట్లేదు. గత 24 గంటల్లో 44,059 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,865కు చేరుకుం దని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 511 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,738కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సోమవారానికి 85,62,641కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.68 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,43,486 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.85 శాతం ఉన్నాయి. నగరాల్లో విస్తరిస్తున్న మహమ్మారి నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంలో పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. కేసుల తంతు ఇలాగే కొనసాగితే నగరాల వరకు లాక్డౌన్ విధించే పరిస్థితులు మళ్లీ రావచ్చని భావిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారత్‌లో అయిదు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. ఇలా ఉండగా, డిసెంబర్ మూడో వారం వరకు విద్యా సంస్థలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తీవ్రత దృష్ట్యా పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని రెండు మార్కెట్లను ఈనెల 30 వరకు మూసివేయాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కోవిడ్ చికిత్సలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు అవకాశం ఎంబీబీఎస్, బీడీఎస్, నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం విద్యార్థులు, ఇంటర్న్స్ ని డ్యూటీ డాక్టర్లకు సహాయం చేయడానికి అనుమతిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రు ల్లోని కోవిడ్ ఐసీయూలలో ఎదుర్కొంటోన్న వైద్యుల కొరతను అధిగమించడానికి ఈ విధుల్లో చేరే విద్యార్థులకు ఎనిమిది గంటల షిఫ్ట్‌కి 1,000 రూపాయలు, 12 గంటల షిఫ్ట్‌కి 2,000 రూపాయలు, గౌరవ వేతనం ఇస్తారు. ఇంటర్న్స్‌కి ఇచ్చే స్టైపెండ్‌కి ఈ గౌరవ వేతనం అదనమని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. -
అంబానీ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం!
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభంలో పడిదివాలా బాటపట్టిన అనిల్ అంబానీకి మరో షాక్ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సిఎల్) ఆస్తులు విక్రయానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాలనుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయని సీఎన్‌బీసీ నివేదించింది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్ తరపున ఈ ప్రక్రియను చూడనున్నాయి. ఆర్సీఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్ రీ కన్స్ట్రక్షన్లో 49శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాతోపాటు సంస్థ ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను అమ్మి బకాయిగా జమ కట్టుకోనుంది. అయితే తాజా పరిణామంపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం చర్యలు తీసుకోవాలని రిజర్వుబ్యాంకును కోరగా, దీన్ని ఆర్బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
తగ్గుతున్న కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ/లండన్: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 50 వేల లోపే నమోదవుతోంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 508 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,20,010కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 72,59,509కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,803గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 90.85శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది. తొలి టీకాలు అంతంతమాత్రమే కరోనా వైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేస్తున్న తొలి తరం వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందరికీ పనిచేసే అవకాశాలు తక్కువేనని కోవిడ్ వ్యాక్సిన్లపై యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు కేట్ బింగమ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై అతిగా ఆశలు పెంచుకోవడం కంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నివారించడం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ, సేకరణ, పంపిణీ వంటి అంశాలపై కేట్ ద లాన్సెట్ కోసం రాసిన కథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు. తొలి తరం వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు ఉన్న నేపథ్యంలో అవి వ్యాధిని నియంత్రించకపోయినా లక్షణాలు తగ్గిస్తుందని, అందరికీ అన్నివేళలా పనిచేయదు అన్న వాస్తవానికి సిద్ధమై ఉండాలని అన్నారు. అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందనను కలుగ చేసే టీకాలపై తాము దృష్టి కేంద్రీకరించామని, కోవిడ్ కారణంగా మరణించిన వారిలో మూడొంతుల మంది ఈ వయసు వారేనని ఆమె పేర్కొన్నారు. సనోఫి, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఔషధ తయారీ సంస్థలు 20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ఫెసిలిటీకి అందించడానికి అంగీకరించాయి. కోవాక్స్ ఫెసిలిటీ అన్ని దేశాలకూ సమానంగా కరోనా వ్యాక్సిన్లను అందించే వ్యవస్థ. సనోఫి, జీఎస్కె ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరినాటికి మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఆ కంపెనీలు తెలిపాయి. పేద దేశాల్లో మరణాలు తక్కువ పుణే: అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్ 19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్), చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీన్ని మెడ్రిక్సివ్ అనే జర్నల్‌లో ప్రచురిం చారు. వీరు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీ వ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు కోవిడ్ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమా ణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్ బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు. -
‘ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెగెటివ్ జోన్లో లేదా జీరోకు చేరువగా ఉండవచ్చని అన్నారు. తొలి త్రైమాసంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం మేర దెబ్బతినడమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరం కార్యక్రమంలో మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల జీవనోపాధి కంటే వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్చి 25 నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసిందని గుర్తుచేశారు. అన్‌లాక్ తర్వాత దేశంలో స్థూల ఆర్థిక ప్రమాణాలన్నీ రికవరీ సంకేతాలను చూపాయని పేర్కొన్నారు. పండుగ సీజన్ ఆర్థిక వ్యవస్థలో మరింత జోరు పెంచి మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిపై ఆశలు పెంచిందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటు ఊపందుకుంటుందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరమయ్యేలా ప్రభుత్వ వ్యయం పెంచడంపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు. చదవండి : మరో ఉద్దీపనకు చాన్స్ -
రంగారెడ్డిలో ఎక్కువ.. నారాయణపేటలో తక్కువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. రంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. కరోనా పాజిటివిటీ రేటు ఏయే జిల్లాల్లో ఏ స్థాయిలో ఉందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను తాజాగా విడుదల చేసి ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం ఆధారంగా పాజిటివిటీ రేటును తయారుచేశారు. ఆ నివేదిక ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 % పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. అత్యంత తక్కువగా 3.4% నారాయణపేట జిల్లాలో ఉందని వెల్లడించింది. అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీలో మాత్రం పాజిటివిటీ రేటు 6.3 శాతముంది. అంటే పదో స్థానంలో జీహెచ్ఎంసీ నిలిచింది. రెండోస్థానంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో7%, మూడో స్థానంలో ఉన్న మహబూబాబాద్ జిల్లాలో 6.7% పాజిటివిటీ రేటున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఐసీయూ పడకలకు అదే స్థాయిలో.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల బోధనాస్పత్రుల్లో కరోనా కోసం ప్రభుత్వం 30,302 పడకలను కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది. అందులో ప్రభుత్వాస్పత్రుల్లో 8,868 పడకలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 9,484 పడకలు, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 11,950 పడకలు కరోనా కోసం కేటాయించినట్లు తెలిపింది. వాటిల్లో సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలున్నాయి. కరోనా వైరస్ కేసులు తగ్గకపోయినా ఆçస్పత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని నివేదిక తెలిపింది. ఐసో లేషన్, ఆక్సిజన్ పడకలకు జూలై నుంచి డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పడకల్లో జూలైలో ఐసోలేషన్ పడకలు 33.89% నిండిపోగా, అదే నెలలో ఆక్సిజన్ పడకలు 41.80%, ఐసీయూ పడక లు 15.14% నిండిపోయాయి. ఆగస్టులో ఐసోలేషన్ పడకల ఆక్యుపెన్సీ 24.09 శాతానికి పడిపోగా, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 38.19 శాతానికి తగ్గింది. అయితే ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ మాత్రం 17.50 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో ఆక్యుపెన్సీ 12.95 శాతానికి పడిపోగా, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 27.33 శాతానికి తగ్గింది. ఐసీయూ పడకల్లో ఆక్యుపెన్సీ కాస్తంత పెరిగి 17.82 శాతానికి చేరుకుంది. అక్టోబర్‌లో అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఐసోలేషన్ పడకల ఆక్యుపెన్సీ 10.63 శాతానికి, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 24.37 శాతానికి పడిపోయాయి. ఐసీయూ పడకల్లోనూ ఆక్యుపెన్సీ కాస్తంత తగ్గి 16.96 శాతానికి చేరుకుంది. కరోనా మరణాల్లో 26వ స్థానం..దేశంలో తక్కువ కరోనా మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్య, ఆరోగ్యశాఖ ఆ నివేదికలో తెలిపింది. జాతీయ స్థాయి సగటు మరణాల రేటు 1.50 శాతముంది. ఇక దేశంలో అత్యధిక కరోనా మరణాల రేటు పంజాబ్‌లో ఉంది. అక్కడ వైరస్ మరణాల రేటు 3.10 శాతముంది. ఆ తర్వాత రెండోస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో కరోనా మరణాల రేటు 2.60%, మూడో స్థానంలో ఉన్న గుజరాత్లో 2.40%, నాలుగో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 1.90% ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ రకంగా తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. మిజోరాంలో మరణాల రేటు సున్నా ఉండగా, ఆ తర్వాత దాద్రానగర్ హవేలీలో 0.10% మరణాల రేటు ఉంది. కేరళలో 0.40% వైరస్ మరణాల రేటున్నట్లు నివేదిక తెలిపింది. 5,937 వైద్య పోస్టుల మంజూరు..కరోనాను నియంత్రించేందుకు రూ.1,369 కోట్లు మంజూరు చేసింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేసింది. అందుకోసం 5,937 వైద్య సిబ్బందిని భర్తీ చేసేందుకు జీవోలను జారీచేసినట్లు ఆ నివేదికలో ప్రస్తావించింది. -
తగ్గుతున్న యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇటీవల 9లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉంటూ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9లక్షల దిగువకు వచ్చింది. శుక్రవారం 70,496 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,06,151కు చేరుకుంది. గత 24 గంటల్లో 964 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,06,490 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 59,06,069కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,93,592 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.94 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 85.52 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 358 మంది మరణించారు. ఈ నెల 8 వరకూ 8,46,34,680 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 11,68,705 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. -
మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, మన మార్కెట్ మాత్రం నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో మొదలై, నష్టాల్లోకి జారిపోయి, భారీ నష్టాల నుంచి ఒకింత రికవరీ అయ్యాయి. ఇంట్రాడేలో 406 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 66 పాయింట్ల నష్టంతో 37,668 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,132 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీల నష్టాలు వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. మార్చి 2వ తేదీ తర్వాత స్టాక్ సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం ఇదే మొదటిసారి. యూరప్‌లో కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటం, ఆర్థిక రికవరీపై సంశయాలు కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. సరిహద్దు స్థావరాల వద్దకు అదనపు బలగాలను పంపించకూడదని, వీలైనంత త్వరలో మళ్లీ చర్చలు జరపాలని భారత్, చైనాలు ఒక అంగీకారానికి రావడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. టెలికం, ఆర్థిక రంగ షేర్లు పతనమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం 1 పైసా పెరిగి 73.57 వద్దకు చేరింది. డేటా, స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లతో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్ 8 శాతం నష్టంతో రూ.434 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ 10%నష్టంతో రూ.9.22 వద్ద ముగిసింది. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి. హెచ్డీఎఫ్సీ 5000 కోట్ల సమీకరణ: భారత ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్‌పై బాండ్లను జారీ చేయనున్నట్లు బుధవారం తెలిపింది. -
24 గంటల్లో 87,882 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 86,961 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,87,580 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,130 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 87,882కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,96,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,03,299 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 33 లక్షలకు పైగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 18.28 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.12 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 20 వరకు 6,43,92,594 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 7,31,534 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ దేశంలో దాదాపు 6.3 కోట్లకుపైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 455 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కరోనా వల్ల మరణిస్తున్న వారిలో 70 శాతం మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారేనని చెప్పింది. -
కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..?
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఐదేళ్ల సమయం పడుతుందని వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థిక వేత్త కార్మెన్ రెన్హర్ట్ గురువారం పేర్కొన్నారు. లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేస్తే వేగంగా వృద్ధి చోటుచేసుకుంటుందని, అయితే పూర్తి స్ధాయిలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఐదేళ్లు పట్టవచ్చని మాడ్రిడ్‌లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో రెన్హర్ట్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో నెలకొన్న మాంద్యం కొన్ని దేశాల్లో అత్యధిక కాలం ఉంటుందని, రికవరీలో అసమానతలు ఉంటాయని అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయని ఆమె చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభంతో గత ఇరవై సంవత్సరాల్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పేదరిక శాతం పెరిగిందని ఆమె వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మూడు కోట్లకు చేరువవగా, వ్యాధి బారినపడి 2.3 కోట్ల మంది కోలుకున్నారు. మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 9.45 లక్షలకు పెరిగింది. మరోవైపు మహమ్మారి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వివిధ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి : కోవిడ్-19 వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన -
మరిన్ని చర్యలకు సిద్ధం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో దేశ జీడీపీ మైనస్ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్బీఎఫ్సీ’లు బలహీనంగా.. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం.. డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్ చెప్పారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు. -
మహారాష్ట్రలో మిలియన్ కేసులు
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 24,886 కేసుల నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 10,15,681కి చేరింది. ఇలా దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో ముందున్న మహారాష్ట్ర ప్రపంచంలోని అనేక దేశాలను వెనక్కినెట్టింది. కేసుల సంఖ్యలో మహారాష్ట్రను ఒక దేశంగా లెక్కిస్తే ప్రపంచ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. గతంలో అత్యధిక కేసులతో ముందున్న చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది. తాజాగా ప్రస్తుతం 66.47 లక్షలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 46.59 లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. 42.83 లక్షల కేసులతో బ్రెజిల్ మూడవ స్థానం. 10.57 లక్షల కేసులతో రష్యా నాల్గో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో నిల్చిన పెరూ దేశంలో 7.16 లక్షల కేసులున్నాయి. అయితే, మహారాష్ట్రలో 10 లక్షలు దాటడం గమనార్హం. మహారాష్ట్రలో రికవరీ సైతం గణనీయంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,15,023కు చేరింది. ఇది 70.4 శాతం కావడం విశేషం. మరోవైపు మృతుల సంఖ్య సెప్టెంబర్ 12వ తేదీ నాటికి మృతి చెందినవారి సంఖ్య 2.83 శాతం (28,724) ఉంది.ఇక యాక్టివ్ కేçసుల సంఖ్య 2,71,566గా ఉంది. దాదాపు నెల రోజుల్లో మరో 5 లక్షలు.. ఆగస్టు తొమ్మిదవ తేదీకి 5 లక్షలు దాటిన కరోనా మళ్లీ నెల రోజుల్లో సెప్టెంబర్ 12వ తేదీనాటికి మరో 5 లక్షల కేసులు పెరిగాయి. మరోవైపు, ఇలా కేవలం 5 రోజుల్లోనే లక్ష కొత్త కేసులు నమదయ్యాయి. 33 వేల చిన్నారులకూ.. సెప్టెంబర్ 7నాటి గణాంకాల ప్రకారం నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు వయసున్న 33 వేల మందికి పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతాన్ని మించింది. దేశంలో ఒక్కరోజులో 97 వేలు దేశంలో గత మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97,570 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరుకుంది. గత 24 గంటల్లో 81,533 మంది కోలుకోగా.. 1,201 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 36,24,196 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.56 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.66 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 11 వరకు 5,51,89,226 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 10,91,251 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5.4 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 442 మంది మరణించారు. మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. -
కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్ డిమాండ్!
ముంబై: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా విద్యుత్ డిమాండ్ క్రమంగా పుంజుకుని కరోనా ముందస్తు స్థాయికి చేరుతోంది. ఇండియా రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం ఈ మేరకు తన తాజా నివేదికను వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది. అయితే పారిశ్రామిక రంగంలో ఇంకా డిమాండ్ ధోరణులు కనిపించడం లేదని కూడా పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► అఖిల భారత స్థాయిలో చూస్తే, వార్షికంగా 2020 జూలైలో 6 నుంచి 13% విద్యుత్ డిమాండ్ రికవరీ నమోదయ్యింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్ మెరుగుదల దీనికి నేపథ్యం. దీనికితోడు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కూడా క్రమంలో పుంజుకుంటోంది. ► ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే, జూలైలో భారీ పారిశ్రామిక రాష్ట్రాల విద్యుత్ డిమాండ్ 6 నుంచి 15 శాతం తక్కువగానే ఉంది. పారిశ్రామిక రంగంలో క్రియాశీలత నెమ్మదిగా ఉండడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ► లాక్డౌన్ తరవాత మొదటి నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 13.1 శాతం పడిపోయింది. మార్చి 25 నుంచీ దేశంలో కఠిన లాక్డౌన్ అమలు సంగతి తెలిసిందే. ► నెలవారీగా చూస్తే, 2020 ఏప్రిల్‌లో విద్యుత్ డిమాండ్ 85 బిలియన్ యూనిట్లగా ఉంటే, జూలైలో ఇది 112 బిలియన్ యూనిట్లకు చేరింది. అయితే వార్షికంగా చూస్తే మాత్రం డిమాండ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ► 2020 ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్ 133 గిగావాట్లయితే జూలైలో ఇది 171 గిగావాట్లకు రికవరీ అయ్యింది. అయితే 2019 జూలైతో పోల్చితే ఇది ఇంకా 3.3 శాతం తక్కువే కావడం గమనార్హం. ► ఇక ఆగస్టు విషయానికి వస్తే, కోవిడ్–19 ముందస్తు స్థాయితో పోల్చితే 98 శాతానికి విద్యుత్ డిమాండ్ మెరుగుపడింది. డిస్కమ్‌లకు నష్టాలు! 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 5% నుంచి 6% వరకూ క్షీణతలోనే ఉండే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇది విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్స్) ఆదాయాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. ముఖ్యం గా అధిక టారిఫ్‌లు చెల్లించే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బల్క్ వినియోగ డిమాండ్ పడిపోవడాన్ని ఇక్రా ప్రస్తావించింది. ఈ పరిస్థితు ల్లో 2020–21లో డిస్కమ్‌లకు ఆదాయ వ్యత్యాసం అఖిల భారత స్థాయిలో రూ.42,000–45,000 కోట్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. -
మోకరిల్లిన స్వరం
విజయనగరం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు కరోనా బారిన పడి కోలుకున్నారు. తన పై అధికారులు తనను తిరిగి విధులకు స్వాగతిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఔన్నత్యం మీద సొంతంగా పాట రాసి, బాణీలు సమకూర్చి, పాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎస్పీ ఎదుట మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కన్నీళ్లతో ఆమెను కొనియాడారు. ఊహించని ఆ అభివాదానికి ఎస్పీ..స్టేజ్ పై నుంచి అతడి వద్దకు వచ్చి ఆప్యాయంగా చేయిపట్టి పైకి లేపారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరి కన్నులు చెమ్మగిల్లాయి. రాజకుమారి ఎదుట కన్నీళ్లతో పాటపాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు. ఖాకీ డ్రెస్ వేసుకుంటే చట్టానికి కట్టుబడి, శాంతి భద్రతల సంరక్షణే బాధ్యతగా నడుచుకోవడం తప్ప భావోద్వేగాలకు లోనవడం ఉండదు. అయితే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి విధి నిర్వహణలో అధికారిగా ఉంటూనే.. సిబ్బందికి ఇంటి పెద్దలా నిలబడుతున్నారు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందుకు తాజా నిదర్శనమే కానిస్టేబుల్ రాంబాబు కృతజ్ఞతాభివందనం. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధుల్లోని వారితోపాటు.. పోలీసులు కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లలోనూ, ఆస్పత్రులలోనూ ఐసోలేషన్లోకి వెళ్లిపోయి కొన్నాళ్లపాటు కరోనాతో పోరాడి విజేతలుగా తిరిగి వస్తున్నారు. ఎస్పీ రాజకుమారి ఎదుట మోకరిల్లి నమస్కరిస్తూ పాట పాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు ఆ సమయంలో వీరి విధులను కూడా ఎస్పీ రాజకుమారి నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వారి స్థానంలో తనే రోడ్ల మీద పహారా కాస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సిబ్బంది బాగోగులను వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఆమె అందించిన తోడ్పాటుతో, ఇచ్చిన స్ఫూర్తితో మానసిక దృఢత్వాన్ని సాధించి జిల్లాలో దాదాపు నాలుగు వందల మంది పోలీసులు కరోనానుంచి బయటపడ్డారు. వాళ్లందర్నీ సత్కరించి, నిత్యావసర సరుకులు అందించి, తిరిగి విధులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎస్పీ రాజకుమారి. గతంలో ఎంతోమంది సమర్థులైన అధికారులను చూసి ఉండవచ్చు.. సిన్సియర్ ఆఫీసర్ల వద్ద పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఈ కష్టకాలంలో అమ్మలా ఆదరిస్తున్న రాజకుమారి వంటి అధికారి దగ్గర పనిచేయడం తమ అదృష్టం అని విజయనగరం పోలీసులు భావిస్తున్నారు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
ఆగని కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా దాడి ఆగడం లేదు. బుధవారం తాజాగా మరో 67,151 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,474కు చేరుకుంది. 24 గంటల్లో 63,173 మంది కోలుకోగా, 1,059 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59,449కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,67,758కు చేరు కోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,267గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.87గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 17,60,489 ఎక్కువ ఉన్నాయి. అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.30 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరణాల రేటు క్రమంగా 1.80 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 25 వరకు 3,76,51,512 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 8,23,992 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. తాజా 1,059 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 329 నమోదయ్యాయి. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగు తున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళు తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1524 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. -
కరోనా వైరస్ : 1.58 శాతానికి తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిలీ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గకపోయినా మరణాల రేటు తగ్గడం, కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్‌లో కరోనా వైరస్ మరణాల రేటు 1.58 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6400 మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 22 శాతమే యాక్టివ్ కేసులున్నాయని, రికవరీ రేటు 75 శాతం దాటిందని ఆయన వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో కేవలం 2.7శాతం మందే ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారని, 1.29 శాతం మంది రోగులు ఐసీయూలో ఉండగా, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని భూషణ్ వెల్లడించారు. ఇక భారత్‌లో మూడు కోవిడ్-19 వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ రెండో దశ(బీ), మూడో దశ పరీక్షల్లో ఉండగా, భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా వ్యాక్సిన్లు తొలి దశ పరీక్షలను పూర్తిచేశాయని తెలిపారు. బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించని వ్యక్తులే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 3.4 రెట్లు అధికంగా ఉందని అన్నారు. ఒక్కరోజులోనే 66,500 మంది కోవిడ్-19 రోగులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 24.04 లక్షలకు ఎగబాకిందని చెప్పారు. దీంతో రికవరీ రేటు 75.92 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికవరీ రేటు 25 రోజుల్లోనే నూరు శాతం పైగా పెరిగిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. మరోవైపు అన్‌లాక్ 4.0లో భాగంగా ఈ ఏడాది మార్చి నుంచి నిలిచిపోయిన మెట్రో రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే స్కూళ్లు, కాలేజీలు సహా విద్యా సంస్ధలను ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదు. చదవండి : కోవిడ్-19 షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేం! -
మార్కెట్‌కు ‘ఫెడ్’ భయాలు!
అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆ దేశ కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ సంశయాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం నష్టపోయింది. గత మూడు రోజుల లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.02కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో దఫా నష్టాలు...! సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్ల మేర పతనమయ్యాయి. మార్కెట్లో మరో దఫా నష్టాలు ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెడ్ భయాలు...! అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకింత రికవరీ అయింది. అయితే ఈ రికవరీ కొనసాగుతుందో,లేదో అన్న సంశయాలను ఫెడరల్ రిజర్వ్ మినట్స్ (జూలై సమావేశం) వెల్లడించాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఐదు షేర్లు–ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► హెచ్డీఎఫ్సీ షేర్ 2.3 శాతం నష్టంతో రూ.1,785 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఎన్టీపీసీ షేర్ 7 శాతం లాభంతో రూ.101 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► దాదాపు 170కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టాటా కమ్యూనికేషన్స్, టాటా కాఫీ, జేబీ కెమికల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఒక్కో ఈక్విటీ షేర్‌కు మూడు బోనస్ షేర్ల జారీకి(3:1) ఆమోదం లభించడంతో ఆర్తి డ్రగ్స్ షేర్ 18 శాతం లాభంతో రూ. 2,839 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ ఏడాది 400 శాతం ఎగసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై రూ.2,893ను తాకింది. ► డిస్కమ్‌ల రుణ పరిమితి పెరగడంతో విద్యు త్ రంగ షేర్లు 12 శాతం వరకూ ఎగిశాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
28 లక్షల కేసులు..
న్యూఢిల్లీ: భారత్‌లో గురువారం రికార్డు స్థాయిలో 69,652 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకుంది. గత 24 గంటల్లో 58,794 మంది కోలుకోగా, 977 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53,866కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,96,664కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,86,395 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 73.91 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల్లో కేవలం 0.28 శాతం కేసులు మాత్రమే వెంటిలేటర్ వరకూ వెళుతున్నాయని వెల్లడించింది. ఐసీయూలో 1.92 శాతం కేసులు ఉన్నాయని, ఆక్సిజన్ సపోర్ట్ మీద 2.62 శాతం ఉన్నాయని చెప్పింది. మరణాల రేటు 1.90 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 977 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 346 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. ఆగస్టు 19 వరకు 3,26,61,252 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం మరో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర రాష్ట్రా లు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,476 ల్యాబ్‌లలో పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. 24 గంటలు.. 9 లక్షల పరీక్షలు.. గడచిన 24 గంటల్లో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఒక్క రోజులో జరిపిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ సంఖ్యను 10లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,26,61,252కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో టెస్ట్స్ పర్ మిలియన్ 23,668కి చేరినట్లు చెప్పింది. -
భారత్‌కు మరో 100 వెంటిలేటర్లు అందించిన అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19పై భారత్ పోరాటానికి ఊతమిస్తూ అమెరికా ప్రభుత్వం బుధవారం భారత్‌కు రెండో విడత 100 వెంటిలేటర్లను అందచేసింది. భారత ప్రభుత్వం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో సమన్వయం ద్వారా అమెరికా వెంటిలేటర్లను భారత్‌కు అందించిందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నా వ్యాధి నుంచి రికార్డుస్ధాయిలో రోగులు కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారం నాటికి 20 లక్షలు దాటింది. దీంతో రికవరీ రేటు 73.64 శాతానికి ఎగబాకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాల రేటు సైతం 1.91 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6,76,514 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకూ మహమ్మారి నుంచి 20,37,870 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకూ 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్ధాయిలో 8,01,518 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 64,531 తాజా కేసులు వెలుగుచూడగా 1092 మంది మరణించారు. చదవండి : మనకు తొలి వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా నుంచే! -
24 గంటల్లో 57,937 మంది రికవరీ
న్యూఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 57,937 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,77,779కు చేరుకుంది. మరో వైపు కొత్తగా 55,079 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 27,02,742కు చేరుకుంది. గత 24 గంటల్లో 57,937 మంది కోలుకోగా, 876 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 51,797 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,73,166 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 24.91 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 73.18 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.92 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజాగా దేశవ్యాప్తంగా సంభవించిన 876 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 228 మంది మరణించారు. ఆగస్టు 17 వరకు 3,09,41,264 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో 7.72 శాతం పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం రికార్డు స్థాయిలో 8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,476 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. కోలుకున్న వారే ఎక్కువ.. దేశంలో కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం పలు విషయాలను వెల్లడించారు. ఏప్రిల్‌లో 7.35 శాతంగా ఉన్న రికవరీ శాతం ప్రస్తుతం 73.18కి చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులతో పోలిస్తే 2.93 రెట్లు కోలుకున్న వారు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 7 నుంచి 8 లక్షల పరీక్షలు చేస్తున్నారని, దానివల్ల పాజిటివిటీ రేటు గతంలో ఉన్న 10.03 శాతంతో పోలిస్తే 7.72కు దిగి వచ్చిందన్నారు. మరణాల రేటు కూడా భారీగా తగ్గిందన్నారు. పరీక్షలతో వ్యాధిని ముందే గుర్తించి అరికట్టవచ్చని తెలిపారు. ఆ వైరస్ ప్రమాదకారి కాదు అమెరికా, యూరప్, మలేసియా సహా ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనుగొన్న కరోనా వైరస్‌లో కొత్త రకం డీ614జీతో ప్రమాదకరమైంది కాదని నిపుణులంటున్నారు. జన్యు మార్పులు జరిగిన ఈ వైరస్ 10 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతున్నా ఆరోగ్యానికి పెద్దగా హాని జరగదని, ప్రాణాలకు ముప్పు తక్కువని అంటున్నారు. ఈ కొత్త వైరస్ వ్యాప్తి వల్ల మరణాల రేటు తగ్గిపోవడం చూశామని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇంటర్నేషనల్ సొసైటీ అధ్యక్షుడు పాల్ తంబియా అన్నారు. -
బాలు సార్ త్వరగా కోలుకోవాలి: రజనీకాంత్
కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియోలో రజనీకాంత్.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఐదు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రస్తుతం బాలుగారి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి ఆరోగ్యంగా మారి సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు రజనీకాంత్. (కోలుకుంటున్న ఎస్పీ బాలు) బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ‘నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వదంతులను నమ్మొద్దు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని వైద్యులు చెప్పారు’ అని చరణ్ పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా get well soon అంటూ ప్రార్థిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాలు ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
ఆగని కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం కొత్తగా 63,490 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 25,89,682కు చేరుకుంది. గత 24 గంటల్లో 53,322 మంది కోలుకోగా, 944 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 49,980కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,62,258 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,77,444గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 26.16 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.91 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.93 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 944 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 364 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. ఆగస్టు 15 వరకు 2,93,09,703 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం 7,46,608 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. భారీ స్థాయిలో టెస్టులు.. ఆగస్టు 7 నుంచి ఒక్క 11వ తేదీన తప్ప ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవు తున్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగు తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,469 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. అమెరికాలో 50 వేల మరణాలకు 23 రోజులు పట్టగా, బ్రెజిల్ లో 95 రోజులు పట్టిందని, భారత్‌లో అది 156 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కాలంలో వైద్య రంగ మౌలిక వసతులను భారత్ భారీగా పెంచుకుందని చెప్పింది. కరోనాను ఎదిరించడంలో ఆశ కార్యకర్తల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. -
కరోనా పడగ నీడలో 200 రోజులు
కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి భారత్‌పై పంజా విసిరి 200 రోజులైంది. ఈ ఆరునెలల కాలంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నాం. కేసుల పెరుగుదల భయపెడుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో రికవరీ భారత్ సాధించిన విజయంగా చెప్పాలి. జనాభాతో కిటకిటలాడే భారత్‌కి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి లేదని తొలుత అందరూ భావించారు. కరోనాని కట్టడి చేసే ఏకైక ఆయుధమైన భౌతిక దూరం మన దేశంలో పాటించడం దుర్లభమని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ భారత్ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రికవరీ, మరణాలు, కరోనా పరీక్షల్లో మన దేశం బాగా ముందుంది. కేరళలో జనవరి 30న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు కేంద్రం పకడ్బందీ ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో స్పందించి మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించడంతో కేసులు పెరగకుండా అడ్డుకోగలిగారు. మే 3 నుంచి లాక్‌డౌన్‌పై ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ 200 రోజుల్లోనే కేసుల సంఖ్య 26 లక్షలకి చేరుకుంది. మొత్తం కేసుల్లో 92% లాక్డౌన్ తర్వాతే నమోదయ్యాయి. అయితే రికవరీ అంశంలో భారత్ అనూహ్యమైన పురోగతిని సాధించింది. ఏప్రిల్‌లో 26% మాత్రమే ఉన్న రికవరీ రేటు ఆగస్టు నాటికి 72శాతానికి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 50 వేలు దాటినప్పటికీ మరణాల రేటు 1.9% ఉండడం భారీగా ఊరటనిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలి మరణం నమోదైన 23 రోజుల్లోనే 50 వేల మంది ప్రాణాలు కోల్పోతే భారత్‌కి తొలి మరణం నుంచి 50 వేలకు చేరుకోవడానికి 156 రోజులు పట్టింది. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. హైదరా బాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్, అహ్మదాబాద్‌లోని జైడస్ కేడిలా లిమిటెడ్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. కరోనా కొమ్ముల్ని సమర్థంగా వంచిన కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ కరోనా వైరస్ సందర్భంలో ట్వీట్ చేస్తూ మనం అనుభవిస్తున్న కష్టనష్టాల కంటే మహమ్మారిని ఎదుర్కొనే ధైర్యసాహసాలు, మనుగడ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు, సంక్షోభాన్ని సానుకూలంగా మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు స్ఫూర్తిని ఇస్తున్నాయని అన్నారు. ఏడాది చివరికి కోటి ? ప్రపంచంలోని కేసుల్లో ప్రస్తుతం 23% భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రతీ 10 లక్షల మందిలో 1857 మందికి వైరస్ సోకుతోంది. 25 లక్షలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ నిలిచింది. పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి కోటికి పైగా కేసులు నమోదవుతాయని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మృతుల సంఖ్య 1.74 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి అన్‌లాక్ 1.0 ప్రక్రియ మొదలయ్యాక దేశంలో కేసుల సంఖ్య చాలా త్వరగా రెట్టింపవుతోంది. అమెరికా, బ్రెజిల్‌తో పోల్చి చూస్తే 5 లక్షలు దాటిన తర్వాత మన దేశంలో తక్కువ రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొదట్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు కోవిడ్ హాట్స్పాట్లుగా ఉంటే ఇప్పుడు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారానికి కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. రికవరీ పెరిగిందిలా .. ! కోవిడ్–19 రికవరీ రేటు జూన్ నుంచి బాగా పెరగడం మొదలైంది. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించడం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, పరీక్షలు కూడా భారీగా పెంచి తొలి దశలోనే కోవిడ్ రోగుల్ని గుర్తించడం రికవరీలో రికార్డులు సృష్టిస్తున్నాం. తొలుత పుణేలో ఒక్క ల్యాబ్‌లో మాత్రమే పరీక్షలు జరిగేవి, అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా 1433 ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాట క, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా పరీక్షలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజుకి 8 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకి 10 లక్షల టెస్టులు జరపాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 2.9 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ కేసులు 9% నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 10 వేల పడకలతో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరించడానికి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకి అనుమతినివ్వడంతో రికవరీ రేటు భారీగా పెరిగింది. -
కోలుకుంటున్న ఎస్పీ బాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలు కుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం సాయంత్రం ఒక బులెటిన్ విడు దల చేసింది. వెంటిలేటర్ అమర్చిన స్థితిలోనే వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోందని పేర్కొంది. ప్లాస్మా చికిత్స: మంత్రి విజయభాస్కర్ తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ శనివారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా చికిత్స అందిస్తు న్నారని, వెంటిలేటర్‌పైనే మరో రెండు రోజు లు ఉంచి చికిత్స కొనసాగిస్తారని తెలిపారు. కన్నీళ్ల పర్యంతమైన ఇళయరాజా.. ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియ గానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా తమిళంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే... ‘బాలు తొందరగా లేచిరా. మన జీవితం కేవలం సినిమాతో ముగిసిపో యేది కాదు. సినిమాతో ప్రారంభమైనది కూడా కాదు. ఎక్కడో స్టేజీల్లో ఇద్దరం కలిసి ప్రారంభించిన సంగీత కచేరీలోని సంగీతం మన జీవితంగానూ, మనకు ముఖ్యమైన జీవితాధారంగా మారింది. ఆ స్టేజీ కచేరీల్లో ప్రారంభమైన మన స్నేహం, సంగీతం, స్వరాలు ఎలా ఒకటికి ఒకటికి ఎలా పెనవేసుకుని ఉంటాయో అలా మన స్నేహం ఏనాడు చెదిరిపోలేదు. మనం తగవులు వేసుకున్నపుడు స్నేహమే, తగవులు లేన ప్పుడూ స్నేహమే అనే సంగతి నీకూ నాకూ తెలుసు. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను, నీవు కచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది’ అని ముగించారు. -
ఊరట : 70.77 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పుంజుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 17 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగిందని పేర్కొంది. దేశంలో కోవిడ్-19 మరణాల రేటు మరింత తగ్గి 1.96 శాతంగా నమోదైందని తెలిపింది. భారీగా రికవరీలు చోటుచేసుకుంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 27.27 శాతం కేసులే యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య 10 లక్షలకు పైగా అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక గడిచిన 24 గంటల్లో 56,383 మంది వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీల సంఖ్య 16,95,982కు చేరిందని గణాంకాలు పేర్కొన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి. ఈనెల 12 వరకూ 2,68,45,688 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 8,30,391 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 66,999 తాజా పాజిటివ్ కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. మహమ్మారితో ఒక్క రోజులోనే 942 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. చదవండి : నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా -
ఏపీ: భారీగా పెరుగుతున్న కరోనా డిశ్చార్జ్‌లు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో 1.39 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్ కేసుల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల మంది రికవరీ అయినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ట్విటర్లో తెలిపింది. ప్రస్తుతం 87,597 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. (63.28 % రికవరీ ) తాజా గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. మంగళవారం ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు. మిలియన్ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు. దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాల్లో తేలింది. -
భారీగా పెరిగిన వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో అమ్మకాలు లేక డీలా పడిన భారత ఆటో పరిశ్రమ తిరిగి గాడినపడుతోంది. గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు పడిపోతున్న క్రమంలో జులైలో 14,64,133 ప్రయాణీకుల వాహన విక్రయాలు జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో వాహన విక్రయాలు 30 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) గణాంకాలు వెల్లడించింది. జూన్‌లో 11,19,048 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్ఐఏఎం తెలిపింది. అయితే గత ఏడాది జులైతో పోలిస్తే తాజా అమ్మకాలు భారీగా పడిపోయాయి. చదవండి : కరోనా భయం.. కారే నయం! గత ఏడాది జులైలో దేశంలో 17,01,832 వాహన అమ్మకాలు నమోదయ్యాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు భారీగా పడిపోగా జులైలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్రవాహన విక్రయాలు పుంజుకోవడం పరిశ్రమ రికవరీకి సంకేతమని ఎస్ఐఏఎం అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. కాగా బీఎండబ్ల్యూ మెర్సిడెస్, టాటా మోటార్స్, వోల్వో ఆటో వంటి బ్రాండ్స్ అమ్మకాల వివరాలు అందుబాటులో లేనందున వాటి వివరాలు ఈ గణాంకాల్లో కలుపలేదని ఎస్‌ఐఏఏం తెలిపింది. ఇక ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులైలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 26 శాతం పెరగడం ప్రోత్సాహకరమని ఎస్ఐఏఎం పేర్కొంది. ఇక కార్ల విక్రయాలు అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో 73 శాతం ఎగబాకాయని వెల్లడించింది. -
19 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఏడో రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,08,254కు చేరుకుంది. 24 గంటల్లో 51,706 కోలుకోగా మొత్తం మొత్తం దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 12,82,215కు చేరుకుంది. మరోవైపు మంగళవారం 857 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 39,795కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,244కు చేరుకుంది. మొత్తం కేసుల శాతంలో యాక్టివ్ కేసుల శాతం 30.72గా ఉంది. 14 రోజుల్లో 63.8 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 67.19 శాతం పెరగ్గా, మరణాల రేటు 2.09కు పడిపోయిందని పేర్కొంది. ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఆగస్టు 4 వరకూ 2,14,84,402 పరీక్షలు చేసినట్లు తెలిపింది. మంగళవారం 6,19,652 పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపింది. తాజా 857 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 300 మంది మరణించారు. తమిళనాడులో 108, కర్ణాటక నుంచి 110, పశ్చిమబెంగాల్లో 54, ఉత్తర ప్రదేశ్‌లో 39, రాజస్తాన్ బిహార్లలో 12 మంది మరణించినట్లు తెలిపింది. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రతి మిలియన్ మందికి చేస్తున్న పరీక్షల సంఖ్య 15,568కు చేరుకుంది. కరోనా యోధులకు కృతజ్ఞతగా..మిలటరీ బ్యాండ్ ప్రదర్శన కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక మిలటరీ బ్యాండ్ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఆగస్టు 1న మొదలైనట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులపాటు.. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రదర్శన ముఖ్యనగరాలు, పట్టణాల్లో కొనసాగుతందని వెల్లడించాయి. ఇప్పటికే పోరుబందర్, హైదరాబాద్, అలహాబాద్, కోల్‌కతా తదితర నగరాల్లో ఈ ప్రత్యేక మిలటరీ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (61) కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11 రోజుల పాటు ఆయన్ను ఇంటిలోనే క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారని ఆయన వెల్లడించారు. ఆదివారం జరిపిన పరీక్షలో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. గత నెల 25న ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. అనంతరం ఓ ప్రైవేటు ఆçస్పత్రిలో చికిత్స పొందారు. గత 10 రోజులుగా చౌహాన్‌కు ఏ లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఐసీఎంఆర్ విధానం ప్రకారం 10 రోజుల పాటు ఏ లక్షణాలు లేకపోతే వారిని డిశ్చార్జ్ చేయవచ్చు. తనకు వైద్యం అందించిన వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
ఆరో రోజూ.. 50 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో సోమవారం కొత్తగా 52,050 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. గత 24 గంటల్లో 803 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 12,30,509కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,298గా ఉంది. గత ఆరు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా 803 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 266 మంది మరణించారు. కర్ణాటక నుంచి 98, ఆంధ్రప్రదేశ్ నుంచి 63, పశ్చిమబెంగాల్ నుంచి 53, ఉత్తర ప్రదేశ్ నుంచి 48, ఢిల్లీ నుంచి 17, తెలంగాణ నుంచి 23, గుజరాత్ నుంచి 22 మంది మరణించారు. ఆగస్టు 2 వరకు 2,08,64,750 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 6,61,892 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. జూలైలో ఏకంగా 1,05,32,074 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.31 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.10 శాతానికి పడిపోయిందని తెలిపింది. 10 రాష్ట్రాల్లోనే.. దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 82 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. అంతేగాక 50 జిల్లాల్లోనే 66 శాతం కేసులు ఉన్నాయి. మరణించిన వారిలో 50 శాతానికిపైగా 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారని తెలిపారు. 45 నుంచి 60 సంవత్సరాల వయసులో వారిలో 37 శాతం మంది మరణించారని, 26 నుంచి 44 సంవత్సరాల వయసువారిలో 11 శాతం మరణించారని చెప్పారు. మరణించిన పురుషుల శాతం 68గా ఉండగా, మహిళల శాతం 32గా ఉందన్నారు. ప్రతిరోజూ మిలియన్ మందిలో 149 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. -
కరోనాను జయించిన పది లక్షల మంది
-
కరోనా: 10 లక్షల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ప్రతి రోజు 45 వేలకు పైగా కేసులు వెలుగు చూడటం సర్వసాధారణమైపోయింది. అయితే భారీగా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతే భారీ స్థాయిలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోందని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలు దాటగా ఇందులో 10 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. కరోనాతో పోరాడుతున్న 5 లక్షలమంది కంటే దాని నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు కావడం విశేషం. అలాగే ప్రతివారం కరోనా పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి 10 లక్షల మందిలో 324 మందికి వైరస్ పరీక్షలు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు కోటి 82 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. మరోవైపు కోవిడ్‌ను నివారించేందుకు పరీక్షిస్తున్న 14 వ్యాక్సిన్లు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొంది. (కర్ఫ్యూ ఎత్తివేత) చదవండి: (15 లక్షలు దాటిన కరోనా కేసులు) -
ఊరట : పది లక్షలు దాటిన రికవరీలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 దేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో సానుకూల పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య 10 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో సాధించిన ఈ ఘనతను ప్రాణాంతక వైరస్‌పై పోరాడుతున్న వైద్యారోగ్య సిబ్బందికి అంకితం చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖట ట్వీట్ చేసింది. భారత్‌లో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటిన సందర్భంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య, పారిశుద్ధ సిబ్బంది సేవలను కొనియాడాల్సి ఉందని పేర్కొంది. చదవండి : అంబులెన్స్ .. మృతదేహమైతే లక్ష డిమాండ్ వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించడంతోనే కోవిడ్-19 రోగులు పెద్దసంఖ్యలో కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నారని ట్విటర్ వేదికగా ప్రస్తుతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా కరోనా టెస్టులు నిర్వహించి చికిత్స అందిస్తుండటంతో దేశంలో మరణాల రేటు కూడా తగ్గుతోందని పేర్కొంది. మరణాల రేటు జూన్ 19న 3.3 శాతం ఉండగా, బుధవారానికి అది 2.23 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 30,000 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని పేర్కొంది. ముంబై, ఢిల్లీ వంటి కరోనా హాట్‌స్పాట్స్‌లోనూ వైరస్ వ్యాప్తి, మరణాల రేటు క్రమంగా దిగిరావడం సానుకూల పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 నుంచి రోగులు కోలుకునే రేటు 64.51 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. -
12 లక్షలకు చేరువగా..
న్యూఢిల్లీ: దేశంలో బుధవారం కొత్తగా 37,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరుకుంది. మరో వైపు గత 24 గంటల్లో 28,432 మంది కోలుకున్నారు. ఒకే రోజులో ఇంత మంది కోలుకోవడం ఇప్పటి వరకూ అత్యధికం కావడం గమనార్హం. అంతేగాక గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 648 మంది మరణించారని, దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 28,732కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,53,049 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని చెప్పింది. రికార్డు స్థాయిలో రికవరీలు.. దేశంలో బుధవారం 28,478 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన అత్యంత ఎక్కువ రికవరీ కేసులు ఇదే కావడం గమనార్హం. అంతేగాక రికవరీ రేటు 63.13 శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.41కి పడిపోయింది. మరణాల రేటు తగ్గుతూ వస్తోందని, రికవరీ రేటు పెరుగుతోందని తెలిపింది. జూన్ 17న మరణాల రేటు 3.36 శాతంగా ఉండగా అది బుధవారానికి 2.41కి పడిపోయింది. -
ఢిల్లీలో తగ్గుతున్న కరోనా తీవ్రత
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కరోనా బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే రికవరీ రేటు 82 శాతం దాటిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ర్ట వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,22,793 కాగా 3628 మంది మరణించారు. అయితే ప్రస్తుతం 16,031యాక్టివ్ కేసులే ఉన్నాయని 1,03,134 మందికి పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడి దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా 685 కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు 8,18,989 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో రికవరీ రేటు పెరగడం అధికారుల్లో ఉపశమనం కలిగిస్తుంది. (తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి) -
కరోనా: రికవరీ తర్వాత అవే లక్షణాలు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా వైరస్ బారినపడి 6 లక్షల మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. పెద్దసంఖ్యలో రోగులు కోవిడ్-19 నుంచి కోలుకోవడం సానుకూల పరిణామమే అయినా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం అంత సులభం కాదు. కోవిడ్-19 నుంచి కోలుకునే ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని, ఇది సంక్లిష్టతతో కూడినదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాధి నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుందని, రికవరీ తర్వాత సైతం రోగుల్లో శారీరక, నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. వీరిలో విపరీతమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు. రికవరీ తర్వాత రోగులు సాధారణ స్ధితికి వచ్చేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన డాక్టర్ సందీప్ తెలిపారు. శ్వాస ఇబ్బందులతో పాటు నరాల బలహీనత వంటి సమస్యలూ వీరిలో కనిపించాయని కోవిడ్-19 రోగులకు చికిత్స అందించిన వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులు గుర్తించారు. అరుదుగా కొందరు రోగుల్లో వైరస్ మెదడుపైనా ప్రభావం చూపిందని చెప్పారు. కోవిడ్-19 రోగులు కొందరిలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయని, భయం కారణంగా వారు ఉద్వేగాలకు లోనవుతున్నారని సర్ గంగారాం ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్ ధీరెన్ గుప్తా తెలిపారు. గతంలో వైరస్ కేవలం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని భావించగా, తాజాగా గుండె, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలపైనా ఇది ప్రభావం చూపుతుందని గుర్తించామని ఆయన చెప్పారు. కొందరు కోవిడ్-19 రోగుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండె పోట్లు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పలువురు రోగుల్లో తీవ్ర తలనొప్పి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఎక్కువ మంది రోగులు ఎలాంటి సమస్యలూ లేకుండా కోలుకుంటున్నా కొద్దిమందిలో పలు లక్షణాలు రికవరీ ప్రక్రియలోనూ కొనసాగుతున్నాయని ఎయిమ్స్ హెడ్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ నవీత్ విగ్ వెల్లడించారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో రికవరీ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. చదవండి : కరోనా బాధితుడికి 1.5 కోట్ల బిల్లు మాఫీ! -
ఊరట : 63 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉధృతంగా నమోదవుతూ పాజిటివ్ కేసుల సంఖ్య 8.49 లక్షలకు ఎగబాకినా సానుకూల పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్-19 నుంచి 18,850 మంది కోలుకున్నారని, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,53,470కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకునే వారిని సూచించే రికవరీ రేటు 63.20 శాతానికి చేరుకోవడం ఊరట కలిగిస్తోంది. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కన్నా అధికంగా రికవరీ రేటును నమోదు చేశాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వైరస్ కేసులు అధికంగా వెలుగుచూస్తున్న రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో పలు చర్యలను చేపడుతున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు వారాంతాల్లో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశాయి. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,701 తాజా కరోనా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,254కు చేరింది. మరణాల సంఖ్య 23,174కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్ మూడో స్ధానానికి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఏకంగా 1.3 కోట్లకు ఎగబాకాయి. ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా మరణించారు. చదవండి : అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు -
ఫలితాలు కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్డౌన్ ఎత్తివేయడం వంటి చర్యల ఫలితాలు కనిపించడం మొదలైందని ఒక సర్వేలో వెల్లడైంది. వ్యాపారాల పనితీరు మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ – ధృవ అడ్వైజర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాల సంస్థలకు చెందిన 100 పైగా టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు (సీఎక్స్‌వో) పాల్గొన్నారు. రికవరీ దాఖలాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది స్థిరంగా నిలబడి ఉండేలా ప్రభుత్వం నుంచి నిరంతరంగా తోడ్పాటు అవసరమవుతుందని సర్వే తెలిపింది. మార్కెట్ డిమాండ్‌ను మెరుగుపర్చడానికి గట్టి చర్యలు అవసరమని లేకపోతే ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ రికవరీ మళ్లీ కుంటుపడిపోతుందని పేర్కొంది. సర్వే ప్రకారం ప్రస్తుతం 30 శాతం సంస్థలు 70 శాతం పైగా వ్యాపార సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. 45 శాతం సంస్థలు సమీప భవిష్యత్తులో ఈ స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే, దశలవారీగా అన్లాకింగ్, ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్, నిధుల లభ్యత మొదలైన వాటిని సీఎక్స్‌వోలు ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో విడతలో మరింతగా విజృంభించిన పక్షంలో వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. ఇక చైనా నుంచి అకస్మాత్తుగా దిగుమతులు ఆగిపోవడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత..: తమ తమ కంపెనీల్లో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల్లో కోత పడొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది సీఎక్స్‌వోలు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 40 శాతం. ఎకానమీ అన్‌లాకింగ్‌తో క్రమంగా ఎగుమతులు, నిధుల ప్రవాహం, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం మొదలైందని సర్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో ఎగుమతులు మెరుగుపడ్డాయని 22 శాతం మంది సీఎక్స్‌వోలు తెలిపారు. ఇక 25 శాతం మంది ఆర్డర్ బుక్ మెరుగుపడిందని, 21 శాతం మంది నిధుల లభ్యత బాగుపడిందని పేర్కొన్నారు. కొనుగోళ్లకు మరింత సమయం.. మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి విషయానికొస్తే.. అయిదింట ఒక కంపెనీ మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం ఫలితాలిస్తోందన్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కేవలం పావు శాతం సంస్థలకు లభించింది. అది కూడా స్వల్పంగా 25–50 బేసిస్ పాయింట్ల స్థాయిలో మాత్రమే దక్కింది. -
కరోనా : రికార్డు స్థాయిలో రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినపడి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. కోవిడ్-19 రోగుల రికవరీ రేటు శుక్రవారం 60.73 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 20,033 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారిసంఖ్య 1,50,000 అధికంగా ఉంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,79,891 మంది కరోనా నుంచి కోలుకోగా 2,27,439 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు కోవిడ్-19 శాంపిల్స్ పరీక్షల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,41,576 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇప్పటివరకూ మొత్తం 92,97,749 శాంపిల్స్‌ను పరీక్షించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 20,903 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. చదవండి : పీపీఈ సూట్లో డాక్టర్ డాన్స్.. -
దేశంలో 5 లక్షలు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. లక్ష కేసులకి చేరడానికి 110 రోజులు పడితే ఆ తర్వాత కేవలం 39 రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయాందోళనలు పుట్టిస్తోంది. కేవలం ఆరంటే ఆరే రోజుల్లో లక్ష మందికి వైరస్ సోకడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 18,552 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరుకుంది. 24 గంటల్లో 384 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,685కి చేరుకుంది. రోజుకి 15 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది నాలుగో రోజు. అయితే దేశంలో రికవరీ రేటు మాత్రం నిలకడగా 58.13శాతంగా ఉంది. అన్‌లాక్ 1 మొదలయ్యాకే.. భారత్‌లో లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం కేసులు బాగానే అదుపులో ఉన్నాయి. 100 కేసుల నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 64 రోజుల సమయం పట్టింది. అదే నాలుగు లక్షల నుంచి 5 లక్షలు కేవలం ఆరు రోజుల్లోనే దాటేసింది. కేవలం కంటైన్మెంట్ జోన్లలోనే లాక్డౌన్ ఎత్తేసి, మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్1 మొదలుపెట్టడంతోనే కేసులు పెరిగిపోతున్నాయని మాక్స్ హెల్త్‌కేర్‌లో ఇంటర్నల్ మెడిసన్ డైరెక్టర్ డాక్టర్ మోనికా మహాజన్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేశాక ప్రజలు భౌతిక దూరాన్ని సరిగా పాటించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఒకరి నుంచి అత్యధికులకు వైరస్ సోకుతోందని అన్నారు. అంతేకాకుండా కరోనా పరీక్షలు పెరగడం కూడా కేసులు పెరగడానికి కారణమేనని ఆమె విశ్లేషించారు. కోవిడ్ టెస్ట్ కిట్స్ ధరలు బాగా తగ్గి, అందరికీ అందుబాటులో ఉండడంతో రోజూ ఎక్కువ మందికి పరీక్షలు చేస్తుండటంతో కేసులు పెరిగిపోతున్నాయని ఆమె విశ్లేషించారు. రోజూ 2 లక్షలకు పైగా పరీక్షలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం జూన్ 26 నాటికి 79,96,707 కరోనా పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,20,479 మందికి పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా 1,007 ల్యాబ్‌లు ఉంటే అందులో 734 ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. 273 ల్యాబ్‌ల్లో ప్రైవేటు సంస్థలు కోవిడ్ పరీక్షలు చేస్తున్నాయి. మార్చి 25న దేశవ్యాప్త లాక్డౌన్ మొదలయ్యే నాటికి దేశంలో 100 మాత్రమే పరీక్ష ల్యాబ్‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యి దాటింది. 8 రాష్ట్రాల నుంచే 85% కేసులు మొత్తం కేసుల్లో 85.5 శాతం కేసులు , 87 శాతం మరణాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌సహా 8 రాష్ట్రాల నుంచి నమోదవుతున్నట్టుగా కేంద్ర తెలిపింది. కేసుల్ని కట్టడి చేయడానికి ఆరోగ్య సదుపాయాలు మెరుగుకు చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందానికి కేంద్రం సూచించింది.కేంద్ర మంత్రులు, ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి నిరోధక నిపుణులు, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతో 15 కేంద్ర బృందాలు కోవిడ్ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాయి. -
ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్ దేశాలను కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. ఈ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ వైరస్ సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకోవడం భారీగా ఊరటనిచ్చే అంశం. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 54 శాతంగా ఉంది. మన దేశంలో కరోనా వైరస్ సోకినా పెద్దగా భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 56.70శాతం రికవరీ రేటుతో భారత్ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటుతో పోల్చి చూస్తే మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. అంతేకాదు అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి చేరుకొని ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఇక భారత్‌లో రాజస్తాన్ 78శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో రికవరీ రేటు ఎలా పెరిగింది ? ► భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ వాటిలో సీరియస్ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారందరికీ వైరస్ స్వల్పంగా, మధ్యస్థంగా సోకింది. దీంతో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ► వైరస్ బట్టబయలైన తొలిరోజుల్లో అందరినీ ఆస్పత్రికి తీసుకువెళ్లి క్వారంటైన్ చేసేవారు. కానీ ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెడికల్ (ఐసీఎంఆర్) తన విధానాన్ని మార్చుకుంది. స్వల్ప లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్లో ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నపాటి జ్వరం, గొంతునొప్పి ఉన్నవారు ఇంట్లో వైద్యుల సూచన మేరకు వ్యవహరిస్తూ 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు. ► భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లతో వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ. క రోనా వైరస్‌కు మందు లేకపోవడం వల్ల ఇమ్యూని టీని పెంచడానికే మందులు ఇస్తున్నారు. ఈ తర హా చికిత్సకు భారతీయులు త్వరగా స్పందిస్తున్నారు ► కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానమే మార్గం. ఆ దిశగా భారత్ అడుగులు బలంగానే పడుతున్నాయి. 3 నెలల క్రితం రోజుకి సగటున 100 కూడా కోవిడ్ పరీక్షలు జరిగేవి కావు. అలాంటిది ఇప్పుడు రోజుకి 2 లక్షల పరీక్షలు జరుగుతున్నాయి. అత్యంత పకడ్బందీ ప్రణాళికతో వైరస్ అనుమానితుల్ని పట్టుకొని క్వారంటైన్ చేయడం వల్ల రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో రికవరీ 2.58 లక్షలు భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది. గత 24 గంటల్లో 15,968 కేసులు నమోదయ్యాయని, 465 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య 14,476కి చేరుకుంది. అయితే ప్రతీ లక్ష మంది జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే మన దేశంలో మృతుల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్టుగా శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ లక్ష మంది జనాభాకి ఆరుగురు కోవిడ్‌తో మరణిస్తే, భారత్‌లో ఆ సంఖ్య ఒక్కటి మాత్రమే. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఇప్పటివరకు 2.58 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ఒక్కరోజే దాదాపుగా 4 వేల కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 66,602కి చేరుకుంది. దీంతో జూలై 6లోపు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ కోవిడ్‌తో మృతి చెందారు. కోల్‌కతాలో ఓ ఆస్పత్రిలో మే నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘోష్‌కు అప్పటికే గుండె, కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో బుధవారం ఆయన మరణించారు. ప్రపంచంలో జర్మనీ టాప్ కోవిడ్–19 బారినపడి కోలుకున్న వారిలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో లక్షా 92 వేల కేసులు నమోదైతే, ఇప్పటివరకు లక్షా 75 వేల మందివరకు కోలుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఇరాన్, ఇటలీ నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఆ దేశంలో కోలుకున్న వారు 40శాతం మంది మాత్రమే ఉన్నారు. -
భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చిచూస్తే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే ప్రపంచంలోనే భారత్ చిట్టచివరి స్థానంలో ఉంటుందని సోమవారం తెలియజేసింది. ఇండియాలో జనసాంద్రత అత్యధికంగా ఉన్నప్పటికీ కరోనా రికవరీ రేటు దాదాపు 56 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జూన్ 21న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి లక్ష జనాభాకు ప్రపంచవ్యాప్తంగా సగటున 114.67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, భారత్‌లో ఆ సంఖ్య కేవలం 30.04. అంటే భారత్‌లో కంటే మూడు రెట్లు అధికంగా కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఒక్కరోజులో 14,821 కేసులు పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరో 445 మందిని బలితీసుకుంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక్కరోజులో కొత్తగా 14,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 4,25,282కు, మరణాల సంఖ్య 13,699కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు ఏకంగా 2,34,747 పాజిటివ్ కేసులు బహిర్గతం కావడం గమనార్హం. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,74,387 కాగా.. ఇప్పటిదాకా 2,37,195 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 9,440 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 55.77 శాతానికి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 21వ తేదీ నాటికి దేశంలో 69,50,493 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనా ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కరోనా సంబంధిత మరణాల విషయంలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూలైలో గరిష్టం.. తర్వాత తగ్గుదల ముంబై: భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య ఇప్పటికే 4.25 లక్షలు దాటేసింది. మరణాలు 14 వేలకు చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నెట్వర్క్ అంచనాల్లో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. దీనిప్రకారం.. దేశంలో చాలా నగరాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు జూలై నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. సెప్టెంబర్‌లో కరోనా వైరస్ దాదాపుగా అంతరించిపోతుంది. అంటే కేసులు అత్యల్పంగా నమోదవుతాయి. దేశంలో కరోనా పరిస్థితిపై ఈ సంస్థ తాజాగా ‘టైమ్స్ ఫ్యాక్ట్–ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్టు’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బులెటిన్లు, కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ విడుదల చేస్తున్న సమాచారంతో కొన్ని గణిత సిద్ధాంతాల ఆధారంగా దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసింది. కరోనా కేసుల విషయంలో టైమ్స్ గ్రూప్ అంచనాలు 96 శాతం నిజమవుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో జూలై 15వ తేదీ నాటికి కరోనా యాక్టివ్ కేసులు 2,59,967కు, జూలై 25 నాటికి గరిష్ట స్థాయిలో 3,86,916కు చేరుకుంటాయి. దేశంలో సెప్టెంబర్ 19వ తేదీ నాటికి కరోనా దాదాపుగా అంతమైపోతుంది. -
ఏపీలో కరోనా సామూహిక వ్యాప్తి 8 శాతమే
సాక్షి, అమరావతి: అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కోవిడ్–19 సోకిన వారిని త్వరగా గుర్తించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం సత్ఫలితాలనిస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్ (సామూహిక వ్యాప్తి) జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇండియా డాట్ ఇన్ పిక్సెల్స్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మన రాష్ట్రంలో కోవిడ్–19 కమ్యూనిటీ స్ప్రెడ్‌కు 8 శాతం మాత్రమే అవకాశముంది. 7,000 కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రాష్ట్రాల్లో నమోదైన కేసులు, కోలుకున్న వారు, క్వారంటైన్లో ఉన్న వారి వివరాల ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ అవకాశాలకు ఒక ఫార్ములా రూపొందించారు. దీని ప్రకారం 100 శాతం దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ తప్పనిసరి. ఇలా చూస్తే ఢిల్లీ 143 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 45 శాతం, మహారాష్ట్ర 65 శాతం, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ను అరికట్టామంటూ పలువురు అధికారులు ట్వీట్ చేస్తున్నారు. 7 లక్షలకు చేరువలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 7 లక్షలకు చేరుకోనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 6,93,548కి చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్తగా 443 మందికి వైరస్ సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,372కు చేరింది. ఈ కేసుల్లో 1,584 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, 337 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు. కొత్తగా 128 మందిని డిశ్చార్జి చేయడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,435కి చేరింది. కృష్ణా, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 111కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,826కి చేరింది. ఇన్ఫెక్షన్ రేటు -1.35% రికవరీ రేటు -47.32% మరణాల రేటు -1.18% -
రికవరీ రేటు మా రాష్ట్రంలో ఎక్కువ: సీఎం
చెన్నై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అయితే తమ రాష్ట్రంలో రికవరీ రేటు మాత్రం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం ప్రకటించారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. కాగా, తమిళనాడులో జూన్ 15 నాటికి 46,504 కోవిడ్ కేసులు నమోదుకాగా 25,344 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,678 యాక్టివ్ కేసులుండగా 479 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. (‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’) రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 54.49 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లోనే 10,667 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. జూన్ 19 నుంచి 30 వరకు తాజా లాక్డౌన్ కొనసాగనుంది. (నడిచి వచ్చిన కార్మికుల వెతలు) -
అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్
న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయనిచ్చిన రూ. 1,200 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుకి సంబంధించిన మొత్తాన్ని రికవర్ చేసుకునే దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలంటూ అనిల్ అంబానీని ట్రిబ్యునల్ ఆదేశించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) తీసుకున్న రుణాలకు గాను అనిల్ అంబానీ ఈ వ్యక్తిగత పూచీకత్తునిచ్చినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా తగు సమాధానాలను అంబానీ దాఖలు చేస్తారని వివరించారు. 3 చైనా బ్యాంకులకు చెల్లించాల్సిన 717 మిలియన్ డాలర్ల బాకీలను రుణ ఒప్పందం ప్రకారం 21 రోజుల్లోగా కట్టేయమంటూ గత నెలలో బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సిందేనని లండన్‌లోని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్ట్ స్పష్టం చేసింది. -
పాజిటివ్ న్యూస్: 50 దాటిన రికవరీ శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసలు సంఖ్య పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో పాటు వైరస్ సోకి చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యేవారి శాతం కూడా పెరుగుతోంది. తాజాగా ఆదివారం కరోనా వైరస్ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50.60 శాతం మంది కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో వైరస్ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. (సంప్రదింపులతో సరిహద్దు సమస్యకు పరిష్కారం) గత రెండు రోజులుగా.. రోజుకు 11 వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,49,348 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,62,378 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 9,195 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (‘కరోనా దేవి’కి కేరళలో నిత్య పూజలు) ఇక శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరోగ్య మౌలిక సదుపాయలను కల్పిస్తామని, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించాడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్న విషయం తెలిసిందే. (‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’) -
కోవిడ్-19 పోరులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నా ఊరట కలిగించే పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కరోనా రోగుల్లో దాదాపు సగం మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య రెట్టింపయ్యే వ్యవధి 17.4 రోజులకు పెరగడం మరో సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం కిందట కేసులు రెట్టింపయ్యే వ్యవధి 15.4 రోజులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 రోగులు కోలుకునే రేటు 49.47 శాతానికి ఎగబాకిందని పేర్కొంది. ఇప్పటివరకూ 1,47,194 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 1,41,842 క్రియాశీలక కేసులున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 6166 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 10,956 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535కు పెరగ్గా మృతుల సంఖ్య 396 తాజా మరణాలతో 8498కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతుండటంతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాజా కోవిడ్-19 హాట్‌స్పాట్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు. మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పెద్దసంఖ్యలో టెస్టింగ్‌లు జరపాలని, ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. చదవండి : ఢిల్లీ సర్కార్‌పై సుప్రీం ఫైర్ -
కోవిడ్-19 : భారీగా మెరుగుపడిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశంలో క్రియాశీలకంగా ఉన్న కేసులను తొలిసారిగా మహమ్మారి నుంచి కోలుకున్న కేసులు అధిగమించాయి. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1,35,206కు పెరగ్గా ప్రస్తుతం 1,33,000 మంది వైరస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా వైరస్ రికవరీ రేటు 48.8 శాతానికి ఎగబాకింది. ఇక గడిచిన 24 గంటల్లో 9985 తాజా కేసులు వెలుగుచూడటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,583కు పెరిగింది. మహమ్మారితో 279 మంది తాజాగా మరణించగా మొత్తం మరణాల సంఖ్య 7745కు పెరిగిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50 లక్షల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో అమెరికా, బ్రెజిల్, రాష్యా, బ్రిటన్ల తర్వాత ఐదో స్ధానంలో భారత్ నిలిచింది. ఒక్కరోజులో 9000కు పైగా కేసులు నమోదవడం భారత్‌లో వరుసగా బుధవారం ఎనిమిదో రోజు కావడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకూ 90,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో గత ఏడాది డిసెంబర్లో మహమ్మారి వెలుగుచూసిన 84,000కు పైగా కేసులను మహారాష్ట్ర అధిగమించింది. చదవండి : ఆ 9 దేశాలు కరోనాను జయించాయి -
ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 62,228 మంది కరోనా బారిన పడగా 26,997 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజులోనే 8,381 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరిలో ముంబై నుంచే 7,358 మంది ఉన్నారు. ముంబైలో ఇప్పటి వరకు 16,008 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,133 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అదేవిధంగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,325కు చేరగా ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. షిర్డీలో తొలి కరోనా కేసు షిర్డీకి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో పట్టణాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వచ్చే 14 రోజులపాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. -
తమిళనాడులో 817 తాజా కేసులు
చెన్నై : తమిళనాడులో మహమ్మారి వేగంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఏకంగా 817 తాజా కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. తాజా కేసులతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,545కు పెరిగింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 133కు ఎగబాకింది. ఇక కరోనా నుంచి కోలుకుని 567 మంది డిశ్చార్జి కావడంతో రికవరీ అయిన వారి సంఖ్య 9909కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. చదవండి : దారుణం: 9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు...! -
ఏపీలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు
-
భారీ ఊరట : 39 శాతానికి చేరువైన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం భారీ ఊరట ఇస్తోంది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 39,174కి పెరగడంతో కరోనా రోగుల్లో రికవరీ రేటు ఏకంగా 38.73 శాతానికి చేరింది. రికవరీ రేటు మెరుగుదల కొనసాగడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 24 లక్షల శాంపిళ్లను పరీక్షించామని తెలిపింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 4970 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 1,01,139కి చేరగా మృతుల సంఖ్య 3163కి ఎగబాకింది. వీటిలో 50 శాతం కేసులు ఐదు మహానగరాల నుంచే నమోదవడం గమనార్హం. ఇక ముంబైలోని ధారవిలో 26 కేసులు బయటపడగా ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కేసుల సంఖ్య 1353కి పెరిగిందని బీఎంసీ అధికారులు వెల్లడించారు.మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఢిల్లీలో మంగళవారం 500 తాజా కోవిడ్-19 కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,500కు పెరిగింది. చదవండి : ప్రముఖ నిర్మాత ఇంట కోవిడ్-19 కలకలం -
కరోనా: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 140 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాను జయించిన వారు వాళ్ల సొంత ఇళ్లకు వెళుతున్నారు. జిల్లాలవారిగా పరిశీలిస్తే.. కృష్ణాలో 61, కర్నూలులో 39, చిత్తూరులో 20, అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 4, ప్రకాశం, పశ్చిమ గోదావరిజిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ కడప, గుంటూరులో ఒక్కొక్కరు డిశ్చార్జ్ అయ్యారు.(ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు..) ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 729 మంది కరోనా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దేశ సగటు కంటే అధికంగా డిశ్చార్జ్ రేటు ఏపీలో నమోదు అవుతోంది. గత 24 గంటల్లో 7,782 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 60 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్ నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయటంలో ఏపీ.. దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లక్షా 41వేల 274 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. -
కరోనా విపత్తు: భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచమంతా విలవిల్లాడుతున్న సమయంలో సానుకూల పరిణామం చోటు చేసుకుంది. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మిలియన్ మార్క్ దాటింది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిన్నర లక్షల(10,48,724) మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఊరట కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కష్టమేమి కాదని దీని ద్వారా రుజువుతోంది. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, కొన్ని జాగ్రత్తలతో వైరస్‌ను ఎదుర్కొవచ్చని కోవిడ్ నుంచి కోలుకున్న ఈ 10 లక్షల మంది ప్రపంచానికి వెల్లడించారు. అంతర్జాతీయంగా ఇప్పటివరకు మొత్తం 33 లక్షల మందిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్-19 సోకిన వారిలో 2 లక్షల 34 వేల మంది ఇప్పటివరకు మృతి చెందారు. అయితే వైరస్‌ను తట్టుకునే శక్తి మనుషుల్లో రోజు రోజుకు పెరుగుతుండటం, మరణాల రేటు కాస్త తగ్గుముఖం పట్టడం వంటి సానకూల పరిణామాలు కరోనాపై పోరులో ఆశాకిరణాలుగా కన్పిస్తున్నాయి. మన దేశంలో కొవిడ్-19 బారిన పడి కోలుకుంటున్నవారి సగటు గురువారం నాటికి 25.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా కరోనా కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య కేవలం 3.2 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్ దాడిని తట్టుకునే రేటు క్రమంగా పెరుగుతున్నట్టు దీన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే లాక్డౌన్ ఉపసంహరించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. (ప్రత్యేక రైళ్లు వేయండి: సుశీల్ మోదీ) గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 35,043కి పెరిగింది. ఇప్పటివరకు 8,889 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది చనిపోయారు. (కరోనా కాలం: బిలియనీర్ల విలాస జీవనం) -
‘అక్కడ సగానికి పైగా కోలుకున్నారు’
టెహ్రాన్ : ఇరాన్లో కరోనా వైరస్ సోకినవారిలో సగానికి పైగా కోలుకోవడం మహమ్మారి ముప్పును ఎదుర్కోవడంపై సరికొత్త ఆశలు నింపుతోంది. కరోనా బారిన పడిన వారిలో సగం మందికి పైగా కోలుకున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియనుష్ జహన్‌పూర్ ఇరాన్ స్టేట్ టెలివిజన్‌తో మాట్లాడుతూ శుక్రవారం వెల్లడించారు. ఇరాన్లో అదృష్టవశాత్తూ మహమ్మారి నుంచి రోగులు కోలుకునే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఇరాన్లో 68,192 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 35,465 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారని తెలిపారు. కాగా అన్ని వాణిజ్య సంస్ధల యజమానులు, వ్యాపారులు తమ సిబ్బంది ఆరోగ్య పరిస్ధితిని వివరిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించే ప్రశ్నావళిని నింపాలని ఆయన సూచించారు. ఇక ఇరాన్లో ఇప్పటివరకూ కరోనా వైరస్‌తో బాధపడుతూ 4232 మంది మరణించారని ఆ ప్రతినిధి వివరించారు. చదవండి : ఇరాన్ లో తగ్గుతున్న మరణాల సంఖ్య -
పుంజుకున్న సూచీలు, 9వేల ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. భారీ నష్టాల్లోంచి భారీగా ఎగిసాయి. ఆరంభంలోనే 400 పాయింట్టలకుపైగా క్షీణించిన సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు పుంజుకుని తిరిగి30వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 9వేల ఎగువకు చేరింది. ముఖ్యంగాబ్యాంకింగ్ షేర్లలో భారీ రికవరీతో నిఫ్టీ బ్యాంకు 900 పాయింట్లకు పైగా ఎగిసింది. ఫార్మ,ఆటో, మెటల్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల షేర్లలో లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 932 పాయింట్లు ఎగిసి 30982 వద్ద, నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 9057 వద్ద కొనసాగుతోంది. గెయిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత, యాక్సిస్ బ్యాంక్ , హిందూస్తాన్ యూనిలీవర్ భారీగా లాభపడుతుండగా, టీసీఎస్, ఐటీసీ నష్టపోతున్నాయి. -
ఒడిదుడుకుల వారం!
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్ తరువాత, ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు. ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఉండొచ్చని ఇండియానివేష్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ తెలిపారు. ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్ మార్కెట్ నుం చి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు. -
విలయం నుంచి భారీ రికవరీ
సాక్షి, ముంబై: ప్రపంచ మార్కెట్లలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. 2008 తరువాత మొదటిసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపివేస్తోంది. దీంతో దేశీయ స్టాక్మార్కెట్లో కీలక ప్రధాన సూచికలు శుక్రవారం 10 శాతం పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. తిరిగి ప్రారంభమైన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. కనిష్టంనుంచి ఏకంగా సెన్సెక్స్ 5381 పాయింట్లు నిఫ్టీ 1604 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 1325 పాయింట్లు ఎగిసి 34,103 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు లాభంతో 9955 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 0.8 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు 11 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఒక్కొక్కటి 5 శాతం పెరిగాయి. టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బిఐ, సన్ ఫార్మా, యూపీఎల్, జీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, నెస్లే నష్టపోయాయి. అలాగే అంతకుముందు డాలర్‌తో పోలిస్తే 74.5 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి కూడా భారీగా పుంజుకుని 73.99 వద్ద 0.4 శాతం లాభపడింది. -
స్టాక్మార్కెట్లో భారీ రికవరీ
ముంబై : కరోనా భయాలతో పాటు ముసురుతున్న మాంద్య మేఘాలతో శుక్రవారం ఆరంభంలో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఓ దశలో కీలక సూచీలు పది శాతంపైగా పతనమై 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేసిన సంగతి తెలసిందే. ట్రేడింగ్ పునఃప్రారంభమైన తర్వాతా నెగెటివ్ జోన్లో కొనసాగిన సూచీలు ఇంట్రాడేలో పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 1680 పాయింట్ల లాభంతో 34,458 పాయింట్ల వద్ద, 479 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,069 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : మార్కెట్ల మహాపతనం : ట్రేడింగ్ నిలిపివేత -
బంగారం రిక'వర్రీ'.!
బంగారం కుదువ పెట్టి రుణం తీసుకుంటే అవసరానికి ఉపయోగపడుతుందని భావించారు... తీరా బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైంది. అధికారులు రికవరీ చేసి ఏడాదవుతున్నా... తమకు ఇంకా అందకపోవడంపై ఖాతాదారులు మండిపడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతేడాది మార్చి 29న భారీగా బంగారు నగలు, నగదు మాయమైన విషయం బయటకు వచ్చింది. బ్యాంకులో హెడ్ క్యాషియర్, గోల్డ్ ఇన్ఛార్జిగా పని చేస్తున్న గురుమోహన్‌రెడ్డి దీనికి బాధ్యుడిగా గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలన జరిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదుతో పాటు బంగారం చోరీకి గురైనట్లు తేల్చారు. ఈ బంగారమంతా బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం పెట్టిన ఖాతాదారులకు చెందినది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నెలన్నర వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. ముత్తూట్, బజాజ్ ఫైనాన్స్‌లో కుదువ పెట్టిన బంగారంతో పాటు నిందితుడి వద్ద ఉన్న బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మే నెలలో పోలీసులు బంగారం రికవరీ చేసినా ఖాతాదారులకు మాత్రం అందలేదు. బ్యాంకుకు చేరినా... పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు అనంతరం నాలుగు నెలల కిందట బ్యాంకు గ్యారెంటీ పెట్టుకుని నగలను బ్యాంకులో అప్పగించారు. అధికారులు సైతం నగలకు సంబంధించిన ఖాతాదారులను పిలిపించి వాటిని గుర్తింపజేశారు. త్వరలోనే తమ బంగారు అందుతుందని సంతోషపడ్డారు. కానీ బంగారు మాత్రం అందలేదు. దీనిపై ఉన్నతాధికారులను అడుగుతున్నా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై పోరుమామిళ్ల మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగార్జునరెడ్డి బాధితుల తరుఫున పలుమార్లు బ్యాంకు అధికారులతో చర్చించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అధిక వడ్డీ కట్టాలంటే ఎలా.. దాదాపు 12 మందికి పైగా చెందిన మూడు కిలోల బంగారం ఖాతాదారులకు అందాల్సి ఉంది. ప్రస్తుతం తమ అవసరాలు తీరాయని రుణం జమ చేస్తామని చెబుతున్నా కట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పిదంతో రుణం కట్టించుకోకపోవడంతో అధిక వడ్డీ కట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలున్నా బ్యాంకు నుంచి నగలు విడిపించుకోలేక సతమతమవుతున్నాని అంటున్నారు. దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవ్వలేకున్నాం కోర్టు బ్యాంకుకు బంగారు, నగదు అప్పగించినా కేసు పూర్తయ్యే వరకు వాటిని అలానే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేం ఖాతాదారులకు బంగారం ఇవ్వలేకున్నాం. దీనిపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నాం. బాధితులకు వడ్డీ పడకుండా రుణ బకాయి కట్టించుకుని రసీదు ఇస్తాం. రసీదులు కోర్టుకు సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతాం. సమస్య తీరగానే ఖాతాదారులకు వారి బంగారం అందజేస్తాం. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.– శ్రీనివాస్, రీజినల్ మేనేజరు, కడప త్వరగా ఇవ్వాలి అవసర నిమిత్తం బ్యాంకులో 250 గ్రాముల వరకు బంగారం తాకట్టు పెట్టి రూ.3లక్షలు లోను తీసుకున్నా. ప్రస్తుతం నగదు కడతామని చెప్పినా బ్యాంకు అధికారులు కట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడే బంగారు ఇవ్వలేమంటున్నారు. రుణం కట్టకపోతే సిబిల్ స్కోరు తగ్గి భవిష్యత్తులో రుణం పొందే అవకాశం ఉండదు. – సురేష్‌బాబు, పోరుమామిళ్ల -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
భారత్‌లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
తొలుత బేబీ స్టెప్స్.. ఆ తర్వాత వీల్‌చైర్‌లో
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్‌మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన, నచ్చిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అయితే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గత కొద్ది రోజుల క్రితమే తన శస్త్ర చికిత్స పూర్తయిందని, త్వరలోనే కోలుకొని మైదానంలో అడుగుపెడతానని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్, ట్రైనర్స్ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్.. అనంతరం వీల్‌చైర్‌లో కాసేపు తిరిగినది ఆ వీడియోలో ఉంది. ‘పూర్తి ఫిట్నెస్ సాధించడానికి బేబీ స్టెప్స్‌తో నా ప్రయాణం ప్రారంభించాను. త్వరలోనే మైదానంలో అడుగుపెడతా. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ హార్టిక్ ఓ వీడియోను జత చేసి పోస్ట్ చేశాడు. దీంతో హార్దిక్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్ధిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి హార్దిక్ వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో ఓ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ వెన్ను నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం తాజాగా మళ్లీ ఆ గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స తప్పనిసరని వైద్యులు తెలిపారు. దీంతో హార్దిక్ లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9న ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు శనివారం జైట్లీని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వీ ‘జైట్లీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మంజిందర్ ఎస్ సిర్సా కూడా జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైట్లీ.. తనకు మెంటర్ వంటి వారని, అంతే కాకుండా 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆగస్టు 9 రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. -
మాల్యా కేసు: రూ 1008 కోట్లు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్ల రుణ ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కంపెనీ యూబీఎల్ నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్లు రాబట్టగలిగింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ అధికారి వసూలు చేశారు. యస్ బ్యాంక్ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి చెల్లించిందని, రుణ మొత్తంలో కొద్ది భాగమే పెండింగ్‌లో ఉందని తదుపరి దర్యాప్తులో ఈడీ తేల్చింది. దీంతో యస్ బ్యాంక్ వద్ద కుదువ పెట్టిన షేర్లపై బ్యాంకుకు నియంత్రణ ఉండే అవకాశం పెద్దగా ఉండబోదని దర్యాప్తు ఏజెన్సీ భావించి ఆ దిశగా పావులు కదిపింది. వీటి స్వాధీనం కోసం ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. ఈడీ వినతితో తనఖాతో కూడిన, తనఖా లేని 74,04,932 యూబీఎల్ షేర్లను కోర్టు అటాచ్ చేసింది. అయితే ఈ షేర్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి తనఖాగా యస్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. పీఎంఎల్ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్ షేర్లను డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్ బ్యాంక్‌కు గత ఏడాది జులై 9న నోటీసులు జారీ అయ్యాయి. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ యస్ బ్యాంక్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనలు పూర్తయిన మీదట యూబీఎల్ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న యస్ బ్యాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్ధానం నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి. -
రిక‘వర్రీ’!
సాక్షి, సిటీబ్యూరో: లాటరీలు, బహుమతులు, సన్మానాల పేరుతో సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌తో ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు దొరకడం దుర్లభంగా మారింది. ఒకవేళ నిందితులుగా ఉంటున్న నైజీరియన్ల చిక్కుతున్నా... వీరి నుంచి నగదు, సొత్తు రికవరీ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రజలు సైబర్ నేరాల్లో కోల్పోతున్న మొత్తాల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే రికవరీ చేయగలుగుతున్నామని సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొంటున్నారు. మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును నైజీరియన్లు వస్తువులుగా మార్చి తమ దేశానికి తరలిస్తుండటమే ఇందుకు కారణమన్నారు. ‘వివరాల’ సేకరణకు మార్గాలెన్నో... సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలను ఈ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్‌తో ప్రారంభిస్తారు. అనేక మార్గాల ద్వారా మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. బహుమతులు, క్విజ్‌ల పేరుతో ఆన్లైన్లో చాలా సాధారణమైన ప్రశ్నలను అడుగుతూ వ్యక్తిగత వివరాలు పూరించమంటారు. మరోపక్క ఫ్రీ గిఫ్ట్ ఓచర్ల పేరుతో అనేక వాణిజ్య ప్రాంతాల్లో పేరు, నంబర్, మెయిల్ ఐడీలతో స్లిప్స్ పూరించి బాక్సుల్లో వేయించే విధానాలు ఇటీవల పెరిగాయి. ఇవన్నీ అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఆన్లైన్ ద్వారా లక్ష ఫోన్ నెంబర్లు/ఈ–మెయిల్స్ రూ.30 వేలకు విక్రయించే వెబ్సైట్లూ ఉన్నాయి. వీటి ఆధారంగా ముఠాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలకూ ‘వక్రమార్గాలు’... స్కీములు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలెక్కువ. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇందుకోసం వారు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, అందుకోసమే ఖాతాలంటూ వారిని నమ్మిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్’ గా పేర్కొంటారు. రోజుల్లోనే వస్తువులుగా ‘ఎక్స్పోర్ట్’... దీంతో ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోంది. కేవలం ఆయా ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు తీసుకుంటున్న నైజీరియన్లు తమ పని కానిస్తున్నారు. మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియాకు పంపడం ఇబ్బందికరం కావడంతో దీనిని వస్తురూపంలోకి మార్చి తమ దేశానికి తరలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరు బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి ఎక్కువగా వస్త్ర వ్యాపారుల ముసుగులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుని, మిగిలిన దాంతో ఢిల్లీలో ఉన్న పాలికాబజార్, సరోజినీ మార్కెట్, చాందినీ చౌక్‌ల్లో హోల్‌సేల్‌గా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్సైన్మెంట్ రూపంలో ఓడల ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారు. ఈ కన్సైన్మెంట్స్ను రిసీవ్ చేసుకునే ముఠా సభ్యులు నైజీరియాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే నైజీరియన్ల నుంచి నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోంది. 24 గంటల్లో ఫిర్యాదు చేయాలి ‘సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంలో ఆలస్యం చేస్తుండటం మరో ఇబ్బందికర అంశంగా మారుతోంది. బాధితులు 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయుక్తం. నగదు ఆన్లైన్లో బదిలీ చేసినట్లైతే అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. ఏటీఎం ద్వారానూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయలేరు. ఈ అవకాశాల్ని వినియోగించుకుని బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి, రికవరీ చేయవచ్చు’.– సైబర్‌క్రైమ్ అధికారులు -
ఎన్పీఏ రికవరీ రూ.1.80 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్పీఏ) రికవరీ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.80 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఆర్థికశాఖ అంచనావేస్తోంది. రెండు బడా ఎన్పీఏ కేసుల పరిష్కారం తుది దశలో ఉండటం దీనికి కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద ఇప్పటికే బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలు రికవరీ చేశాయి. మరికొన్ని కేసుల పరిష్కారం తుదిదశలో ఉన్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఎస్సార్ స్టీల్ కేసులో రూ.52,000 కోట్లు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ నుంచి మరో రూ.18,000 కోట్లు రికవరీ అవుతాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు వీడియోకాన్ గ్రూప్, మానెట్ ఇస్పాత్, ఆమ్టెక్ ఆటో, రుచీ సుయాలకు సంబంధించి కూడా దివాలా వివాదాలు కూడా త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2016లో దివాలా కోడ్ అమల్లోకి వచ్చాక దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన ఇబ్బందికర బకాయిలు పరిష్కారం అయినట్లు అంచనా. ఆయా అంశాలన్నీ బ్యాంకులకు సానుకూలమని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.9.62 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అటు తర్వాత రూ.23,000 కోట్లకు తగ్గాయి. -
రూ. 80 వేల కోట్ల రికవరీ..
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్సీఎల్టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా ఎన్సీఎల్టీ అవతరించిందని జైట్లీ ప్రశంసించారు. ‘‘దివాలా కోడ్ – రెండేళ్లు’ అన్న అంశంపై జైట్లీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే... ► వాణిజ్యానికి సంబంధించి దివాలా సమస్యలను పరిష్కరించలేని క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్లింది. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంది. దివాలా చట్టానికి పదునుపెట్టింది. ► 2016 చివర్లో ఎన్సీఎల్టీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ కేసులను విచారించడం ప్రారంభించింది. ఇప్పటికి 1,322 కేసుల విచారణను (అడ్మిట్) చేపట్టింది. అడ్మిషన్‌కు ముందే 4,452 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.2.02 లక్షల కోట్లు పరిష్కారమయినట్లు ఎన్సీఎల్టీ డేటా చెబుతోంది. విచారణా ప్రక్రియ ద్వారా 66 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.80 వేల కోట్ల రికవరీ జరిగింది. 260 కేసుల విషయంలో దివాలా చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ► భూషణ్ పవర్ అండ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ ఇండియా వంటి 12 బడా కేసులు విచారణ ప్రక్రియ చివరిదశలో ఉంది. వీటిలో కొన్ని కేసుల పరిష్కారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో రూ.70,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. ఆయా కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు. ► ఎన్పీఏ అకౌంట్లు తగ్గుతుండడం హర్షణీయం. రుణాల మంజూరు, చెల్లింపుల వ్యవస్థల్లో మార్పులను ఈ పరిణామం సూచిస్తోంది. దివాలా చట్టం– రుణదాత, గ్రహీత మధ్య సంబంధాల్లో కూడా సానుకూల మర్పును సృష్టించింది. ► ఖాయిలా పరిశ్రమల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ 1980లో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం తీసుకువచ్చింది. ఇది తీవ్ర వైఫల్యం చెందింది. ఈ చట్టం పలు ఖాయిలా పరిశ్రమలకు రుణదాతల నుంచి రక్షణ కల్పించింది. బ్యాంకింగ్ రుణ బకాయిల వసూళ్లకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటయినా, అది అంత ఫలితమివ్వలేదు. ► 2008–2014 మధ్య బ్యాంకుల విచక్షణారహితంగా రుణాలను మంజూరుచేశాయి.వాటిలో ఎక్కువ మొండిబకాయిలుగా మారాయని ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు పేర్కొంటున్నాయి. ► ఆయా అంశాలే ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు కారణమయ్యింది. 2016 మేలో పార్లమెంటు రెండు సభలూ ఐబీసీ (ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్)కి ఆమోదముద్ర వేశాయి. నేను చూసినంతవరకూ పార్లమెంటు ఆమోదించిన సత్వర చర్యల, అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక చట్టం ఇది. -
రూపాయి రెండున్నర నెలల గరిష్టం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ ధోరణి కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంకింగ్ ట్రేడింగ్‌లో సోమవారం వరుసగా ఐదవ రోజు ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలపడింది. ఒకేరోజు 26 బలపడి 71.67కు చేరింది. ఇది పది వారాల గరిష్ట స్థాయి. విదేశీ నిధుల ప్రవాహం, గరిష్ట స్థాయిల నుంచి 20 డాలర్ల వరకూ క్రూడ్ ధరలు పతనం వంటి అంశాలు రూపాయి బలపడ్డానికి దారితీస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో 9 పైసలు నష్టంతో 72.02 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రధాన విదేశీ కరెన్సీలపై డాలర్ బలహీనత నేపథ్యంలో రూపాయి రికవరీ బాట పట్టింది. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ సమావేశం జరుగుతుండటం గమనార్హం. అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది. ‘‘రూపాయి ఒత్తిడికి గురవుతున్న వాస్తవమే. అయితే ఆ ఒత్తిడి కొంత తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదలే దీనికి కారణం’’ అని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ రిసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారూ పేర్కొన్నారు. రికవరీపై భిన్నాభిప్రాయాలు.. ఇదిలావుండగా, రూపాయి రికవరీపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. 2019 మార్చి నాటికి 71 వరకూ బలపడే అవకాశం ఉందని ఒక నివేదికలో రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిల నుంచి తగ్గడం, బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో 75 బిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ వంటి అంశాలనుకేర్ నివేదిక ప్రస్తావించింది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే 3 నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్ బ్రోకరేజి సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. రూపాయికి శుభ ‘అంచనా’! 2019లో డాలర్ బలహీనం: సిటీగ్రూప్ న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి పయనం ఎటు వెళుతుందోనన్న ఆర్థిక వర్గాల అంచనా, ఆందోళనల నేపథ్యంలో– ప్రముఖ ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్ అమెరికా డాలర్ కదలికకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2019లో డాలర్ గరిష్ట పరిమితికి చేరుతుందని, అటు తర్వాత వెనక్కు తిరిగే అవకాశం ఉందని సిటీగ్రూప్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే జరిగితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న భారత్ రూపాయికి ఇది శుభవార్తే. కీలక అంశాలను చూస్తే... ♦ జీ–10 దేశాల (బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్) కరెన్సీలతో అమెరికా కరెన్సీ ఈ ఏడాది ర్యాలీ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మూడు సార్లు పెంచిన ఫెడ్ ఫండ్ రేటు, కంపెనీల లాభాలు బాగుండటం దీనికి నేపథ్యం. ♦ అయితే వచ్చే ఏడాది డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు దీనికి కారణం కావచ్చు. వచ్చే మూడు నెలల్లో మరో ఒకశాతం పెరిగినా, వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో జీ–10 దేశాల కరెన్సీలపై దాదాపు 2 శాతం డాలర్ పతనమయ్యే వీలుంది. -
చోరీ సొమ్ము రికవర్రీ
అనంతపురం సెంట్రల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దొంగలను విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఏ తప్పూ చేయకున్నా పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గత రెండురోజులుగా త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద పెద్ద వివాదమే నడుస్తోంది. జిల్లాలో దొంగ– పోలీసు ఆట ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది. దొంగలను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వారి నుంచి రికవరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. సొమ్ములు ఎక్కడ విక్రయించారన్నది దొంగలు చెబుతున్నప్పటికీ రికవరీ మాత్రం కావడం లేదు. తమకు ఎలాంటి సబంధం లేకున్నా పోలీసులు కక్షకట్టి వసూలు చేస్తున్నారని సదరు వ్యక్తులు వాపోతున్నారు. పోలీసులు చెప్పినంత ఇవ్వకపోతే తమపై అక్రమకేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై నగరంలోని బంగారుషాపు నిర్వాహకులంతా ఏకమై పాతూరు నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తొలుత తమ తప్పేమీ లేదంటున్నప్పటికీ తర్వాత కొంతమేర ముట్టుజెబుతుండడం నేరాలను ఒప్పుకున్నట్టు పరోక్షంగా అర్థమవుతోంది. పోలీసులు కూడా ఇలాంటి వారిపై తమకు రికవరీ రూపంలో నగదు, బంగారు ఇచ్చేస్తే చాలు కేసులేమీ అవసరం లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తరచూ వివాదాలే.. అనంతపురంలో దొంగలను పట్టుకొని పోలీసులు రికవరీ చూపిస్తున్న ప్రతి కేసులోనూ అంతకుముందు వివాదాలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్ఐ దొంగను వెంటబెట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ వ్యక్తిని బెదిరించి రికవరీ చేసుకొని వచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై సదరు వ్యక్తి సైబరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తమిళనాడులో ఏకంగా ధర్మవరం పోలీసులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఏడాది కాలంలో రెండు, మూడు దఫాలు పోలీసు వర్సెస్ స్వర్ణకారులు అన్న చందంగా ఆందోళనలు జరిగాయి. తాజాగా ప్రస్తుతం సీసీఎస్– త్రీటౌన్‌పోలీసులు అదుపులో ఉన్న దొంగల విషయంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెవిలో కమ్మలతో సహా తీసుకొచ్చారని కొంతమంది మహిళలు విలేకరుల ఎదుట వాపోయారు. తమ బంధువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా... గతంలో ఒక్క కేసు కూడా లేకపోయినా తీసుకొచ్చారని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమేనని, తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉంటేనే తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.