ముంబై: వినూత్న అకౌంటింగ్ విధానాలతో మొండిపద్దుల వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చకుండా వాటిని రాబట్టడంపై మరింత తీవ్రంగా ప్రయత్నించాలని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు (యూసీబీ) ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
రుణాల మంజూరు తర్వాత కూడా పద్దులను సమీక్షించడం, మొండిబాకీలు తలెత్తే అవకాశాలను సకాలంలో గుర్తించడం తదితర రుణ రిస్కుల నిర్వహణ విషయంలో బోర్డులు సైతం క్రియాశీలకంగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ముంబై జోన్ యూసీబీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దాస్ ఈ మేరకు సూచనలు చేసినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆర్థిక ఫలితాల నివేదికలు పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చూడటంలో డైరెక్టర్ల ప్రధాన పాత్ర పోషించాలని దాస్ చెప్పారు. అలాగే, బ్యాంకు స్థాయిలో ఐటీ, సైబర్‌సెక్యూరిటీ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిపుణుల నియామకంలోనూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment