![Reserve bank of india repo rate details about shaktikanta das - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/10/rbi-governor-says-about-repo-rate_0.jpg.webp?itok=GGKo4M9t)
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు రేపో రేటు మీద కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత మూడు రోజులుగా జరుగుతున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచాలని తీర్మానించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంలోనే ఉండేలా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ కమిటీ కూడా వసతి వైఖరుల ఉపసంహరణను కొనసాగించింది.
రేపో రేటు గత మూడు సార్లుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా నిలకడగా ఉంది. అంతకు ముందు సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ రెపో రేటుని 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు 250 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 2023లో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.3 శాతానికి చేరింది. అయితే జూన్‌లో పెరిగిన ధరల ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరల కారణంగా జూలై అండ్ ఆగస్టులో పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
FY2023-24 CPI ద్రవ్యోల్బణం అంచనా కూరగాయల ధరల కారణంగా 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో GDP అంచనా 6.5 శాతం వద్ద నిలిచింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కావున కస్టమర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment