repo rate
-
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ
-
RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. జీడీపీ 6.7% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.రెపో రేటు అంటే.. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. -
లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయా?.. శుభవార్త సిద్ధం!
రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. -
ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
ముంబై: కీలక వడ్డీ రేట్ల కోతను ఆర్బీఐ(RBI) ఈ వారంలో జరిగే సమీక్షతో షురూ చేయొచ్చని ప్రముఖ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య భేటీ కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించొచ్చని భావిస్తున్నారు.రెండేళ్లుగా కీలక రెపో, రివర్స్ రెపో (ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోంది. కేంద్ర బడ్జెట్లో వినియోగానికి మద్దతుగా ఆదాయపన్ను విషయంలో పెద్ద ఎత్తున ఊరట కల్పించినందున, దీనికి కొనసాగింపుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రణ పరిధి 6 శాతం లోపే ఉన్నందున రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉందని నిపుణులు అంటున్నారు. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు కనిష్టాల త్రైమాసిక స్థాయిలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి: షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల జోరుఇవీ సానుకూలతలు..‘రేట్ల తగ్గింపునకు రెండు బలమైన కారణాలున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే లిక్విడిటీ పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది రేట్ల కోత ముందస్తు సూచికగా ఉంది’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో చర్యలకు మద్దతుగా రెపో రేటును తగ్గించొచ్చన్నారు. ‘కేంద్ర బడ్జెట్లో ద్రవ్యపరమైన ఉద్దీపనలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని భావించడం లేదు. కనుక 2025 ఫిబ్రవరి సమీక్షలో రేట్ల కోతకు సానుకూలతలు ఉన్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ వారంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకుంటే రేట్ల కోత వాయిదా పడొచ్చన్నారు. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
-
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఊహించిందే జరిగింది.. ఆర్బీఐ సమావేశంలో ముఖ్యాంశాలు..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ సమావేశంలోని ముఖ్యాంశాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మానిటరీ పాలసీ సమావేశం(ఎంపీసీ)లో ద్రవ్యోల్బణం పోకడలు, ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనలపై చర్చలు జరిగాయి.ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరికొందరు 25 బేసిస్ పాయింట్లు కట్ చేయాలన్నారు.రెపో రేటును స్థిరంగా 6.50 శాతం వద్దే కొనసాగిస్తున్నాం.స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు: 6.25 శాతంమార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు: 6.75 శాతం2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ అంచనా 7.2%గా ఉంటుందని అంచనా. అది మొదటి త్రైమాసికంలో 7.3 శాతం నుంచి 7.2కి స్వల్పంగా తగ్గింది. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో వరుసగా 7.3 శాతం, 7.2 శాతం వద్ద ఉంటుంది. ద్రవ్యోల్బణం 4.5 శాతం నమోదవుతుంది.జూన్-ఆగస్టులో (ఆగస్టు 6 వరకు) 9.7 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిలువలు భారత్‌కు వచ్చాయి.ఇదీ చదవండి: 15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలిఏప్రిల్-మే 2024లో స్థూల ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా పెరిగాయి.భారతదేశం విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2,2024 నాటికి 675 బిలియన్ డాలర్లతో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనా ఆశించిన వర్షపాతం నమోదవుతుంది. దాంతో ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.అనధికార రుణదాతలను కట్టడి చేసేందుకు డిజిటల్ లెండింగ్ యాప్‌ల కోసం పబ్లిక్ రిపోజిటరీని రూపొందించాలి.యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్బీఐ పెంచింది.చెక్ క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
6.5 శాతం వద్ద రెపో రేటు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు (ఆగస్టు 8) ప్రకటించారు. రెపో రేటు తొమ్మిదవ సారి కూడా మారలేదు. కాబట్టి రెపో రేటు 6.5 శాతం వద్ద ఉంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన మూడవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని ఆగస్టు 6 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించింది.#WATCH | RBI Governor Shaktikanta Das says, "Real GDP growth for 2024-25 is projected at 7.2% with Q1 at 7.1%, Q2 at 7.2%, Q3 at 7.3%, and Q4 at 7.2%. Real GDP growth for Q1 of 2025-26 is projected at 7.2%."(Video source: RBI) pic.twitter.com/KCBKg11Qd0— ANI (@ANI) August 8, 2024రెపో రేటుఆర్బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.రివర్స్ రెపో రేటువాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి. -
కీలక వడ్డీరేట్లను తగ్గించిన చైనా!
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న చైనా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 1.8% నుంచి 1.7%కు తగ్గిస్తున్నట్లు సోమవారం తెలిపింది.చైనా ఊహించిన దాని కంటే గత వారం వెలువడిన రెండో త్రైమాసిక ఆర్థిక డేటా నిరాశజనకంగా ఉన్నా కీలక వడ్డీరేట్లలో కోతలు విధించడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే ‘ప్లీనం సమావేశం’లో భాగంగా వడ్డీ కోతలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) ఏడు రోజుల రివర్స్ రెపో రేటును 1.8% నుంచి 1.7%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను 3.45% నుంచి 3.35%కి తగ్గించింది.చైనాలో దీర్ఘకాల ఆస్తి సంక్షోభం పెరుగుతోంది. అప్పులు అధికమవుతున్నాయి. వస్తు వినియోగం తగ్గుతోంది. చైనా ఎగుమతుల ఆధిపత్యం పెరగడంతో ఇతర ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో చైనాలో వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించడం విశేషం.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జొరొమ్ పావెల్ ఇటీవల వడ్డీరేట్లును పెంచబోమని ప్రకటించారు. దాంతో అంతర్జాతీయంగా వడ్డీరేట్లు పెంపుపై కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న మానిటరీ పాలసీ సమావేశాల్లో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా ఈమేరకు వడ్డీరేట్లును తగ్గించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
వడ్డీరేట్లు యథాతథం.. 6.5 శాతంగా ఉంచిన RBI
-
రేపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'శక్తికాంత దాస్' నేతృత్వంలోని 6 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో రేపో రేటు ఎనిమిదోసారి కూడా 6.5 శాతం వద్ద యధాతధంగా ఉంచింది.ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వాస్తవ జీడీపీ వృద్ధిలో పెరుగుదలను ప్రకటించారు. ఇది 7 శాతం నుంచి 7.2 శాతానికి చేరింది. రేపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.రెపో రేటుఆర్బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.రివర్స్ రెపో రేటువాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.#WATCH | RBI Governor Shaktikanta Das says "...The provisional estimates released by the National Statistical Office (NSO) placed India's real gross domestic product, that is GDP growth at 8.2% for the year 2023-24. During 2024-25, so far the domestic economic activity has… pic.twitter.com/PL9hSfcqpo— ANI (@ANI) June 7, 2024 -
రేటు తగ్గించే పరిస్థితి లేదు
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం... రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలనే ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఆర్బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ మీటింగ్‌లో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు."మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, దృక్పథాలను వివరణాత్మకంగా అంచనా వేసిన తర్వాత ద్రవ్య విధాన కమిటీ ఐదుగురు సభ్యుల మెజారిటీతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మళ్లీ జూన్‌లోనే... ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ముందుగానే అంచనా వేసింది. ఊహించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. -
ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. మళ్లీ యథాతథమే! ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తగ్గింపు అప్పుడే.. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ 'శక్తికాంత దాస్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్‌లో ఏకగ్రీవంగా అంగీకరించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఓ వైపు అప్పుడు పెరగటం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా గత ఏడాది నుంచి వడ్డీ రేట్లను 2.5 శాతం పెంచుతూ వచ్చిన ఆర్బీఐ.. గత నాలుగు సార్లు వడ్డీరేట్లను ఏ మాత్రం పెంచలేదు, ఇప్పుడు ఐదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ 2023 - 24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం. #WATCH | RBI Governor Shaktikanta Das says, "...The Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the Standing Deposit Facility rate remains at 6.25% and the Marginal Standing Facility rate and the Bank Rate at 6.75%." pic.twitter.com/yQSppS7IzJ — ANI (@ANI) December 8, 2023 -
కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్ బిఐ
-
మళ్ళీ అదే రెపో రేటు.. ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెండు రోజుల సమీక్ష తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడించారు. ఇందులో భాగంగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశమైన తర్వాత దాస్ ప్రకటన వెలువడింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది నాలుగోసారి. అయితే జూలైలో టొమాటో, ఇతర కూరగాయల ధరల కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది. https://t.co/bjo3MjAYqs — ReserveBankOfIndia (@RBI) October 6, 2023 -
మానిటరీ పాలసీ ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్
-
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు రేపో రేటు మీద కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత మూడు రోజులుగా జరుగుతున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచాలని తీర్మానించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంలోనే ఉండేలా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ కమిటీ కూడా వసతి వైఖరుల ఉపసంహరణను కొనసాగించింది. రేపో రేటు గత మూడు సార్లుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా నిలకడగా ఉంది. అంతకు ముందు సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ రెపో రేటుని 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు 250 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 2023లో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.3 శాతానికి చేరింది. అయితే జూన్‌లో పెరిగిన ధరల ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరల కారణంగా జూలై అండ్ ఆగస్టులో పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! FY2023-24 CPI ద్రవ్యోల్బణం అంచనా కూరగాయల ధరల కారణంగా 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో GDP అంచనా 6.5 శాతం వద్ద నిలిచింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కావున కస్టమర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం లేదు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం : సామాన్యులకు భారీ ఊరట?
ముంబై: గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 3 రోజుల ఈ సమావేశ నిర్ణయాలు గురువారం (ఆగస్టు 10వ తేదీ) వెలువడతాయి. ద్రవ్యోల్బణంపై అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో యథాతథ రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి కమిటీ మెజారిటీ మొగ్గుచూపవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే జరిగితే రేటు యథాతథ స్థితి కొనసాగింపు ఇది వరుసగా మూడవసారి (ఏప్రిల్, జూన్ తర్వాత) అవుతుంది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి (ఫిబ్రవరికి) చేరింది. అటు తర్వాత రేటు మార్పు నిర్ణయం తీసుకోలేదు. -
2023-24 తొలి త్రైమాసికానికి ద్రవ్య పరపతి విధానం ప్రకటన
-
ఆర్బీఐ రుణరేటు తగ్గే అవకాశం! అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం అంచనా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) కీలక రుణ రేటు– రెపోను (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6.5 శాతం) తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం– ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘‘రుణ రేటు తగ్గింపునకు తగిన వాతావరణం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఆర్థిక వ్యవస్థలో సరళతర పరిస్థితిని తీసుకురావడానికి ఆర్బీఐ ఉపయోగించుకునే వీలుంది’’ అని విశ్లేషించింది. 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న– రెండంకెల పైనే కొనసాగింది. ఈ నేపథ్యంలో గత ఏడాది మే వరకూ 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 2.5 శాతం పెంచింది. అంటే ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి రిటైల్ ద్రవ్యోల్బణం తగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆర్బీఐ అనూహ్య నిర్ణయంపై ఆసక్తి... ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో జరిగిన 2023–24 తొలి ద్వైమాసిక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అందరి అంచనాలకు భిన్నంగా యథాతథ రెపో రేటును కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంపై విశ్లేషకులు ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 11 నెలల వరుస రేటు పెంపు అనంతరం ఆర్బీఐ ఎంపీసీ తీసుకున్న నిర్ణయం విశ్లేషకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. నిజానికి ఈ దఫా రేటు పావుశాతం వరకూ ఉంటుందని మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు అంచనావేశారు. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరిలో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరిలో అంచనా వేస్తే, ఏప్రిల్ మొదటి వారం సమీక్షలో ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. అయితే ద్రవ్యోల్బణంపై పోరు ముగిసిపోలేదని ఆర్బీఐ స్పష్టం చేయడం మరో విశేషం. ‘‘ఇది కేవలం విరామం మాత్రమే.ఈ నిర్ణయం –కేవలం ఈ సమావేశానికి మాత్రమే– అవసరమైతే మళ్లీ రేటు పెంపు ఉంటుంది. అంతర్జాతీయ అంశాలను, ద్రవ్యోల్బణం కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యతపై ప్రస్తుతానికి దృష్టి సారించడం జరుగుతోంది. ఆర్బీఐ అంచనాలకు ఊతం ఇస్తూ, 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ రేటు తగ్గింపునకు దారితీసే అంశాలని నిపుణులు భావిస్తున్నారు. హెచ్ఎస్బీసీ, నోమురా... ఇదే వైఖరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని మరికొందరు నిపుణులూ భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నా ము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యేయంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లే షించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూ డా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు -
రెపో రేటు పెరగనుందా? .. నేటి నుంచి ఆర్బీఐ పాలసీ భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు (3,5,6 తేదీల్లో... మహవీర్ జయంతి సందర్భంగా 4న సెలవు) జరగనున్న ఈ సమవేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
ఎఫ్డీ చేసేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు పెంపు
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచిన 24 గంటల్లోనే కోటక్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను సవరించింది. రుణ రేట్లు డిపాజిట్ రేట్లతో అనుసంధానమై ఉంటాయని తెలిసిందే. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి చేరింది. రూ.2–5 కోట్ల డిపాజిట్లపై రేటు 7.25 శాతానికి చేరింది. ‘‘ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ ప్రయోజనాన్ని మా విలువైన కస్టమర్లకు బదిలీ చేయాలని, వారి పొదుపు నిధులపై అధిక రాబడులను ఆఫర్ చేయాలని నిర్ణయించాం’’అని కోటక్ బ్యాంక్ ప్రకటించింది. -
RBI Monetary Policy: రెపో పెంపుతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందిలేదు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పెంచడం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రెపో రేటును ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం పావుశాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఎన్బీఎఫ్సీపై రేటు పెంపు ప్రభావం విషయంలో ఇక్రా రేటింగ్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► రెపో రేటు పెరుగుదల ఎన్బీఎఫ్సీ వసూళ్ల సామర్థ్యాలను ప్రభావితం చేయదు. రుణగ్రహీతలు ఇచ్చిన పూచీకత్తులు, వారు తిరిగి చెల్లింపులకు ఇచ్చే ప్రాధాన్యతను ఇక్కడ ప్రాతిపతికగా తీసుకోవడం జరిగింది. ► ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు రంగాలపై ఈ ప్రభావాన్ని ప్రస్తుతం నిర్ధారించడం కష్టంగా ఉన్నప్పటికీ, మెజారిటీ రంగాల అవుట్‌లుక్ పటిష్టంగానే ఉంది. ఇది ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్ల సామర్థ్యానికి సానుకూల అంశం. ► అందుతున్న గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు (2022–23, ఏప్రిల్–డిసెంబర్) నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వసూళ్ల సామర్థ్యం 97–105 శాతం శ్రేణిలో ఉంది. ► అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్ల నేపథ్యంలోనూ వస్తున్న ఈ సానుకూల గణాంకాలు ఆర్థిక పటిష్టతను సూచిస్తున్నాయి. ► పటిష్ట రుణ వసూళ్ల సామర్థ్యం కొనసాగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉంటుంది. సానుకూల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులకు ఇది దారితీస్తుంది. ► మహమ్మారి కారణంగా అంతరాయం కలిగిన రెండు సంవత్సరాల తర్వాత నాన్–బ్యాంకింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ► కోవిడ్ సమయంలో తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్న వ్యక్తులు, వ్యాపారాలకు ప్రస్తుతం తిరిగి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సజావుగా అందుతోంది. పటిష్ట దేశీయ వృద్ధి ధోరణి దీనికి నేపథ్యం. -
రెపో రేటు పెంచిన ఆర్బీఐ
-
ప్రస్తుత కీలక సమయంలో రేటు పెంపు ఆపితే కష్టం: దాస్
ముంబై: కఠిన ద్రవ్య విధాన బాటలో పయనిస్తున్న ప్రస్తుత కీలక సమయంలో.. రెపో రేటు పెంపును అపరిపక్వంగా నిలుపుచేయడం తీవ్ర విధానపరమైన లోపం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నెల 5 నుంచి 7 మధ్య జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్ష మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ఈ సమావేశంలో 35 బేసిస్ పాయింట్ల కీలక రెపో రేటు పెంపునకు కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
నెలవారీ చెల్లింపులు మరింత భారం
ముంబై: వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. వృద్ధి అంచనాలకు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ పాలసీలోని ఇతర అంశాలు ►ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. ►సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ►ఆర్బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ►యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం. ►భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్ల పెంపు స్పీడ్ తగ్గినట్టే ఆర్బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్‌గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్‌గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
ఆర్బీఐ.. రేట్ల పెంపుపై దూకుడు వద్దు
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఎకానమీ రికవరీకి భారీ రేటు పెంపు సరికాదని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు ఒక లేఖ రాస్తూ, కొత్త రేటు పెంపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల శ్రేణిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అంతకు మించి పెంపు వద్దని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రిటైల్ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని, రాయితీ వడ్డీ రేటును అందించాలని తన సిఫారసుల్లో అసోచామ్ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. చదవండి: 17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా! -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎస్బీఐ, బీవోఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ రుణ రేట్ల పెంపు మొదలైంది. ఇటు ఆర్బీఐ అరశాతం రెపో పెంపు నిర్ణయం వెంటనే, అటు బ్యాంకింగ్ కూడా ఈ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్ తమ రుణ రేట్లను 0.5% పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులూ రేటు పెంపు బాటలో పయనించే అవకాశం ఉంది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ (ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు) 50 బేసిస్ పాయింట్లు పెరిగి 8.55 శాతానికి చేరింది. రెపో ఆధారిత ఆర్ఎల్ఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 8.15 శాతానికి ఎగసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రెపో ఆధారిత రేటును అరశాతం పెంచింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి ఎగసింది. ► ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు అరశాతం పెరిగి 9.60కి చేరింది. కొన్ని స్థిర డిపాజిట్ల రేట్లను కూడా మార్చుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ► హెచ్డీఎఫ్సీ తన రుణ రేటును అరశాతం పెంచింది. అక్టోబర్ 1 నుంచి పెంపు అమ ల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ వీర బాదుడు.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా!
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ పెంపు నిర్ణయంపై నిపుణుల ఏమంటున్నారంటే.. హర్షణీయం.. అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉన్నాయి. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష దోహదపడుతుంది. వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాలుగా పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. అస్థిర అంతర్జాతీయ వాతావరణంలో అతి చురుకైన, చురుకైన పాలసీ విధానమిది. – దినేష్ కారత్, ఎస్బీఐ చైర్మన్ బడ్జెట్ రూపకల్పనపై ప్రభావం పండుగల సీజన్ కావడంతో డిమాండ్ పరిస్థితులే వ్యవస్థలో కొనసాగవచ్చు. అయితే ఇవే పరిస్థితులు వచ్చే ఏడాది కొనసాగడం కొంత కష్టమైన అంశంమే. ఆయా అంశాలన్నీ బడ్జెట్ రూపకల్పనలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కమోడిటీ ధరల పెరుగుదలను ఎదుర్కొనడానికి వ్యాపార సంస్థలు సంసిద్ధంగానే ఉండడం మరో విషయం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆటో పరిశ్రమకు ప్రతికూలమే తాజా పరిణామం ఆటో పరిశ్రమలో డిమాండ్ తగ్గుదలకు దారితీస్తుందని భావిస్తున్నాం. ప్రత్యేకించి ద్విచక్ర, పాసింజర్ వాహన విక్రయాలపై ఈ ప్రతికూల ప్రభావం పడుతుంది. అధిక ముడి పదార్థాల ధరల వల్ల ద్విచక్ర వాహనాల ధరలు గడచిన ఏడాది కాలంలో 5 సార్లు పెరిగడం గమనార్హం. – మనీష్ రాజ్ సింఘానియా, ఫెడా డిసెంబర్లో 0.35 శాతం అప్ డిసెంబర్ పాలసీ సమీక్షాలో రెపో రేటు మరో 0.35 శాతం పెరుగుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలోనే ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉంది. అటు తర్వాత రేటు పెంపు పక్రియకు ఆర్బీఐ కొంత విరామం ఇచ్చే వీలుంది. – ఉపాసనా భరద్వాజ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ స్వల్ప ప్రభావమే... ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాలు మరింత భారంగా మారతాయి. అయితే ఇండ్ల అమ్మాకాలు తక్షణం భారీగా పడిపోయే అవకాశం లేదు. పండుగల సీజన్ నేపథ్యంలో పలు డెవలప్పర్లు అనేక డిస్కౌంట్లను ప్రకటించడం దీనికి కారణం. ఇక గృహ రుణ రేట్లు 9 శాతం దిశగా కదిలితే వ్యవస్థలో సెంటిమెంట్ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. – అనూజ్ పురి, అనరాక్ చైర్మన్ చదవండి: RBI Monetary Policy: రుణాలు మరింత భారం! -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారం తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. ఆగస్టు 5న ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు. ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా? పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ప్రీపేమెంట్ వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్లోన్లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మరో ఆప్షన్. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్ చేసుకోవడం మంచిది. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
ఆర్బీఐ పాలసీ సమావేశాలు.. ‘వడ్డింపు’ భయాలు..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 35 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణం. ఇదే పెంపు ధోరణిని ఆర్బీఐ తాజా సమావేశంలోనూ కొనసాగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.6 శాతం వరకూ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మే మధ్యంతర సమావేశంలో రెపో రేటుతోపాటు బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా (రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోవడం లక్ష్యంగా) పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. కొనసాగుతున్న బ్యాంకింగ్ ‘వడ్డింపు’ ఆర్బీఐ రెపో పెంపు నేపథ్యంలో బ్యాంకింగ్ పలు దఫాలుగా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. తాజాగా సోమవారం ఈ వరుసలో కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులు నిలిచాయి. నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
పీఎన్బీ రుణ రేట్లు పెంపు..జూన్ 1 నుంచి అమల్లోకి!
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) చీఫ్ అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) 40 బేసిస్ పాయింట్లు పెరిగిన నేపథ్యంలో తమ విధానం ప్రకారం జూన్ 1 నుంచి అదే పరిమాణంలో రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ఉండబోతోందని ఆయన వివరించారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా ఆర్బీఐ గత వారం అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో రెపో రేటు 4.4 శాతానికి చేరింది. దీంతో ఇప్పటికే పలు బ్యాంకులు దానికి అనుగుణంగా రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయగా, మరికొన్ని బ్యాంకులు డిపాజిట్ల రేట్లను కూడా పెంచాయి. -
SBI Ecowrap: రెపో రేటు పెరిగే అవకాశం.. ఎంతంటే?
ముంబై: ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4 శాతం) పావుశాతం పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకోర్యాప్ అంచనావేసింది. జూన్‌లో జరిగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రేటింగ్ సంస్థ ఇక్రా కూడా జూన్ త్రైమాసికంలో రేట్లు పెంపు తప్పకపోవచ్చని ఇప్పటికే అంచనా వేసింది. తాజాగా ఎస్బీ ఎకోవ్రాప్ అంచనాలను క్లుప్లంగా పరిశీలిస్తే... ► జూన్, ఆగస్టు నెలల్లో పావుశాతం చొప్పున రేట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ముప్పావుశాతం వడ్డీరేటు పెరిగే అవకాశం ఉంది. ► రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుండి చికెన్ ఫీడ్ దిగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి చికెన్ ధరలను అమాంతం పెంచేసింది. ఉక్రెయిన్ నుండి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇది ఇండోనేíÙయా నుండి ఎగుమతి విధానంలో మార్పులకు దారితీసింది. పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ► టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం భారీ అంతరం ఏర్పడింది. రిటైల్ ఆహార ధరల కంటే టోకు ఆహార ధరలు ఎక్కువగా ఉన్నాయి. 2022 జనవరి ఈ వ్యత్యాసం 4.7 శాతంగా ఉంటే, ఇప్పుడు ఇది 2.3 శాతానికి తగ్గింది. ధరల నియంత్రణలో వైఫల్యాన్ని గణాంకాలు చూపుతున్నాయి. ► చమురు ధర బేరల్‌కు 100 డాలర్ల ప్రాతిపదికన 2022–23లో వినియోగ ధరల సూచీ 6 శాతం నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉంటుదని భావిస్తున్నాం. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ ఈ నెల మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)నూ తీసుకుంటే, ఈ విభాగంలో ఒక శాతం పెరుగుదల వినియోగ ద్రవ్యోల్బణంలో నాలుగు బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) దారితీస్తుంది. 2022–23లో మా సగటు ద్రవ్యోల్బణం క్రితం అంచనా 5.8 శాతం. ఎంసీఎం పెరుగుదల ఎఫెక్ట్ 48 నుంచి 60 బేసిస్ పాయింట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనా 5.7 శాతం కాకుండా, 6 శాతం దాటిపోయే వీలుంది. ► సెప్టెంబరు వరకు ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉండవచ్చు. ► వడ్డీరేట్ల పెరుగులకు సంకేతంగా ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ సెపె్టంబర్ నాటికి 7.75 శాతానికి పెరగవచ్చు. అయితే ఈ రేటును 7.5 శాతం వద్ద కట్టడికి ఆర్బీఐ అసాధారణ పాలసీ చర్యలు తీసుకునే వీలుంది. చదవండి: క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం.. -
ఎకానమీకి ‘యుద్ధం’ సెగ!
ముంబై: భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. ఇక పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనా పెరగడం కొంత ఆందోళనకరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ వృద్ధికి ఊతం ఇవ్వడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని సమీక్షా సమావేశం నిర్ణయించింది. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. వృద్ధికి–ఎకానమీ సమతౌల్యతకు అనుగుణమైన (అకామిడేటివ్) పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని సమీక్షా సమావేశం పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే... ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మార్జినల్ స్టాడింగ్ ఫెసిలిటీ రేటును (ఎంఎస్ఎఫ్) కూడా యథాపూర్వ 4.25 శాతం వద్ద కొనసాగనుంది. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బును అందించి వసూలు చేసే వడ్డీరేటు ఇది. స్వల్పకాలిక (ఓవర్‌నైట్) నిధుల అవసరాలకు బ్యాంకింగ్ ఈ విండోను వినియోగించుకుంటుంది. ► లిక్విడిటీ సమస్యల నివారణకు బ్యాంక్ రేటు కూడా యథాతథంగా 4.25%గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెపో రేటు అనేది బాం డ్ల కొనుగోలు ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. అయితే బ్యాంక్ రేటు అనేది వాణిజ్య బ్యాం కులు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఆర్బీఐ నుండి రుణం పొంది, అందుకు చెల్లించే వడ్డీరేటు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనావేసింది. ఈ ప్రాతిపదికన వృద్ధి అంచనాలను కుదించింది. ► గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ రికవరీకి రబీ ఉత్పత్తి దోహదపడుతుంది. ► కాంటాక్ట్–ఇంటెన్సివ్ సేవలు పుంజుకునే అవ కాశాలు కనిపిస్తున్నాయి. హోటల్లు, రెస్టారెంట్లు, టూరిజం–ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్/హెరిటేజ్ సౌకర్యాలు, విమానయాన అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి. ► ప్రభుత్వ పెట్టుబడుల ప్రణాళిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడుల క్రియాశీలత పుంజుకుంటుంది. ► ఆర్బీఐ నియంత్రణలోని ఫైనాన్షియల్ మార్కెట్ల ప్రారంభ సమయం ఏప్రిల్ 18 నుండి ఉదయం 9. ఈ మేరకు మహమ్మారి ముందస్తు సమయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ► హేతుబద్ధీకరించబడిన గృహ రుణ నిబంధన లు 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు. ► వాతావరణానికి సంబంధించి సమస్యలు, నివారణకు తగిన నిధుల కల్పనపై త్వరలో ఒక చర్చా పత్రం విడుదల ► ఆర్బీఐ నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్ష కోసం కమిటీ. ఇక కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్... యూపీఐ వినియోగం ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌలభ్యతను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లకు విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మోసాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, ఏటీఎంల ద్వారా కార్డ్–లెస్ నగదు ఉపసంహరణకు దేశంలోని కొన్ని బ్యాంకులకు అనుమతి ఉంది. అదనపు లిక్విడిటీకి ‘ఎస్డీఎఫ్’ మందు వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉపసంహరణ ప్రక్రియకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా మహమ్మారి ముందస్తు సాధారణ స్థాయిలకు ద్రవ్యతను తీసుకువెళ్లాలన్న లక్ష్య సాధనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) ఇన్స్ట్రమెంట్ను ప్రవేశపెట్టింది. తద్వారా లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్)ను ప్రస్తుత 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ రేటు 3.75 శాతంగా ఉంటుంది. గృహ విక్రయాలకు ఊతం గృహ విక్రయాలు పెరగడానికి పాలసీ దోహదపడుతుంది. కోవి డ్–19 అనంతరం కీలక సమస్యల్లో ఉన్న పలు రంగాల పురోగతికి, ఆర్థికాభివృద్ధికి విధాన నిర్ణయాలు బలం చేకూర్చుతాయి. అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకునేందుకు చర్యలతోపాటు వ్యవస్థలో ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తీసుకున్న చర్యలు హర్షణీయం. – హర్ష వర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ ఆచరణాత్మక విధానం ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో ఆచరణాత్మక విధాన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సరిగ్గా మదింపు చేసింది. వృద్ధికి విఘాతం కలగని రీతిలో లిక్విడిటీ సర్దుబాటు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రుణ సమీకరణ విధానానికి మద్దతుగా పలు చర్యలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధికి దోహదపడే విధానమిది. –దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ చదవండి: చదవండి: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు లైన్ క్లియర్, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు! -
6 నుంచి ఆర్బీఐ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి మూడు రోజులు జరగనుంది. ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) మొత్తం ఆరు ద్వైమాసిక సమావేశాలు జరుగుతుండగా, వచ్చే వారం తొలి సమావేశం జరుగుతుంది. సమావేశాల అనంతరం 8వ తేదీన ఎంపీసీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ కమిటీలోని మిగిలిన ఐదుగురిలో ఇద్దరు సెంట్రల్ బ్యాంక్ నుంచి నేతృత్వం వహిస్తారు. మరో ముగ్గురు స్వతంత్య్రంగా వ్యవహరించే ఇండిపెండెంట్ సభ్యులు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి, ఫిబ్రవరిల్లో 6 శాతంపైగా ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆర్బీఐ వృద్ధే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో)ను కొనసాగిస్తోంది. ఈ దఫా కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే యథాతథ వడ్డీరేటు కొనసాగింపు 11వ సారి అవుతుంది. -
రాబోయేదీ యథాతథ విధానమే: భట్టాచార్య
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) వచ్చే వారం ద్రవ్య పరపతి విధానంలోనూ యథాతథ రెపో రేటును(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 4 శాతం) కొనసాగించే అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సౌగట భట్టాచార్య సోమవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి కారణమని విశ్లేషించారు. ఇటీవలి పరిణామాలు వృద్ధి, ద్రవ్యోల్బణానికి విఘాతం కలిగేలా ఉన్నాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న ఆర్బీఐ పరపతి విధాన కమిటీ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి భేటీ ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి ఆరునెలల్లో అరశాతం అప్ కాగా 2022-23 చివరి ఆరు నెలల్లో(2022 అక్టోబర్-2023 మార్చి) రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) మేర పెరగవచ్చని భట్టాచార్య అంచనా వేశారు. 2021-22లో వృద్ధి రేటు 8.9 శాతం ఉంటే 2022-23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గవచ్చని విశ్లేషించారు. ఇక ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.8 శాతంగా ఉంటుందన్నది భట్టాచార్య విశ్లేషణ. రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. ఇక క్రూడ్ ధర బ్యారల్‌కు 2021-22లో సగటున 79.6 డాలర్లుగా ఉంటే, 2022-23లో ఇది 105డాలర్లకు చేరుతుంనది ఆయన అంచనావేశారు. ఇక ఇదే కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ సగటు 74.50 నుంచి 76.50కి తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే దేశీయ కరెన్సీకి నిజమైన పరీక్ష 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎదురవుతుందని అంచనావేశారు. ఆర్బీఐ ప్రస్తుతం తన వద్ద ఉన్న 630 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) అస్థిరతలను అడ్డుకోడానికి, ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుందని అన్నారు. ఇలాంటి సందర్భంలో 2023-24 రూపాయికి కీలకమవుతుందని విశ్లేషించారు. (చదవండి: భారత్‌లో మరో మైలురాయి దాటిన లంబోర్గిని) -
ఏప్రిల్ వరకు రేట్లలో మార్పులు ఉండవు
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వచ్చే ఏప్రిల్ సమీక్షలోపు కీలక పాలసీ రేటు– రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4 శాతం) పెంచకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ నెల 7–9 తేదీల్లో ఆర్బీఐ సమీక్షా సమావేశం జరగనుంది. 9న పాలసీ ప్రకటన వెలువడుతుంది. బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్న క్రమంలో ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఏప్రిల్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తన అంచనాలతో ఓ నివేదికను విడుదల చేసింది. 2020 మే నుంచి రెపో రేటు 4 శాతం వద్దే కొనసాగుతోంది. ఇది ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి. కానీ, బాండ్ ఈల్డ్స్ మాత్రం పెరుగుతున్నాయి. అయినా కానీ, ఆర్బీఐ పాలసీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని క్రమబద్ధంగానే చేపట్టొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. బాండ్ మార్కెట్‌కు దేశీయంగా, వెలుపలి అంశాలు అనుకూలంగా లేవని పేర్కొంది. బడ్జెట్లో ద్రవ్యస్థిరీకరణకు బదులు వృద్ధికే ప్రాధాన్యం ఇచ్చినందున.. ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల సమీక్షలో రేట్లను మార్చకపోవచ్చని అంచనా వేసింది. మరోవైపు రివర్స్ రెపోను పావు శాతం పెంచొచ్చని మార్కెట్లో ఒక వర్గం అంచనా వేస్తోంది. బడ్జెట్లో రుణ సమీకరణను స్థూలంగా రూ.14.95 లక్షల కోట్లకు పెంచడం ఇందుకు మద్దతునిస్తోంది. 6 శాతానికి ద్రవ్యలోటు ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉన్న 6.9 శాతం స్థాయి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి తగ్గుతుందని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. -
వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ కీలక నిర్ణయాలు బుధవారం (8వ తేదీ) వెలువడతాయి. అయితే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని (2–6 శ్రేణిలో) అదుపులో ఉంచుతూ, బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) యథాతథ పరిస్థితికే ఆర్బీఐ మొగ్గు చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పర్యవసానాలు ఈ అంచనాలకు తాజా కారణం. యథాతథ రెపో రేటు విధానం కొనసాగిస్తే, ఈ తరహా నిర్ణయం వరుసగా ఇది తొమ్మిదవసారి అవుతుంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు 1%). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పార్లమెంటులో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెడుతుండడం తాజా సమావేశాల మరో కీలక నేపథ్యం కావడం గమనార్హం. అంచనాలు ఇవీ... రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. ఇదే జరిగితే సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో ఆర్బీఐ అంచనాలను (7.9 శాతం) మించి 8.4 శాతం వృద్ధిని ఎకానమీ నమోదుచేసుకుంది. వెరసి 2021–22 తొలి ఆరు నెలల్లో 13.7 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. చదవండి : ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే.. -
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడమే లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. తద్వారా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 4 శాతం)ను యథాతథంగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు అక్టోబర్ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన సెంట్రల్ బ్యాంక్ ద్వైమాసిక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శా తం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. -
లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్
మీరు కొత్తగా హోమ్ లోన్, వ్యక్తి గత రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. బ్యాంకులు కొద్ది రోజుల నుంచి వడ్డీ రేట్లు తగ్గయిస్తున్నాయి. ఈ విషయంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందువరుసలో ఉన్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో అనుసంధానిత రుణ రేటును(ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.80 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గిస్తున్న ఆర్ఎల్ఎల్ రేటు అనేది నేటి(17-09-2021) నుంచి అమలులోకి రానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకొనేటప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్న రుణగ్రహితలకు దీని వల్ల లాభం చేకూరుతుంది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు తగ్గడం వల్ల అంత మేర మీరు ప్రతి నెల వడ్డీ తగ్గుతుంది. ఈ బ్యాంకుతో పాటు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త!) -
రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష
-
ఆర్బీఐ కీలక నిర్ణయం... స్టాక్ మార్కెట్లో అనూహ్య మార్పులు
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం వెలువరించిన మరుక్షణం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. రెపోరేటు, రివర్స్ రేపో రేటులలో మార్పులు ఉండబోవంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నిర్ణయం ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కలిసిరావడంతో తిరిగి మార్కెట్ కోలుకుంటోంది. పాజిటివ్ ట్రెండ్ ఈ వారం ప్రారంభం నుంచి స్టాక్మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. వరుసగా ప్రతీ రోజు ఇన్వెస్టర్లు లాభాలు కళ్లజూస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా అయితే సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డులు సృష్టించాయి. ఆల్‌టైం హైలకు చేరుకున్నాయి. ఈవారంలో మార్కెట్‌కి చివరి రోజైన శుక్రవారం సైతం సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఆ వెంటనే పుంజుకుంది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ లాభాల బాటలోనే పయణించింది. గంటలోనే ఈరోజు ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్ రిపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయింట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్ ట్రేడయ్యింది. మరికాసేపటికే కోలుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 88 పాయింట్ల నష్టంతో 54,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 16,304 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 16,336 పాయింట్లకు చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాయింట్లు కోల్పోవడం మొదలైంది. గంట వ్యవధిలో 41 పాయింట్లు నష్టపోయి 16,253 వద్ద ట్రేడయ్యింది. అయితే కాసేపటికే పుంజుకుంది. ఉదయం 11;30 గంటల సమయంలో 24 పాయింట్లు నష్టపోయి 16,270 వద్ద ట్రేడవుతోంది. -
వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్‌బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. మార్పులేదు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. గాడిన పడుతోంది వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రిపోరేటు ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రిపో రేటు అంటారు. -
ఆర్బీఐ వృద్ధి మంత్రం!
ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సర్దుబాటు విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతమిచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు గాను గతేడాది 1.15 శాతం మేర ఆర్బీఐ రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ బాండ్లను రూ.లక్ష కోట్ల మేర ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఎంపీసీ ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రుణ వ్యయాలను తగ్గించడంతోపాటు, బాండ్ ఈల్డ్స్‌ను అదుపులో ఉంచేలా వ్యవహరించనుంది. వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత వృద్ధికి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ఎంపీసీ సమావేశం తర్వాత నిర్ణయాలను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని పరుగు అందుకునే వరకు ఆర్బీఐ అన్ని విధాలుగా (కనిష్ట వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత చర్యలు) మద్దతుగా నిలుస్తుందన్నారు. కనిష్ట రివర్స్ రెపో విధానం నుంచి ఆర్బీఐ ఎప్పుడు బయటకు వస్తుందన్న ప్రశ్నకు.. కాలమే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను దృష్టిలో పెట్టుకుని.. తటస్థ చర్యలను తీసుకోవడంపై అవగాహన కలిగి ఉన్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. వృద్ధి 10.5 శాతం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘క్యూ1లో (ఏప్రిల్–జూన్) 26.2 శాతం, క్యూ2లో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం, క్యూ3లో (అక్టోబర్–డిసెంబర్) 5.4 శాతం, క్యూ4లో (2022 జనవరి–మార్చి) 6.2 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఫిబ్రవరి నుంచి కమోడిటీ ధరలు పెరగడం, ఆర్థిక మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వృద్ధి రేటును కిందకు తీసుకెళ్లే రిస్క్‌లుగా దాస్ పేర్కొన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, మరిన్ని వర్గాలకు విస్తరించడం, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులను పెంచే చర్యలు వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చెప్పారు. 2021–22 బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడి చర్యలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ), సామర్థ్య విస్తరణ అన్నవి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడతాయని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. అదే సమయంలో నైరుతి రుతుపవనాల పురోగతిపైనా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. అవసరమైనంత కాలం అండగా... వృద్ధి రేటు నిలకడగా, స్థిరంగా కొనసాగేందుకు అవసరమైనంత కాలం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోయేంత వరకు సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రానున్న రోజుల్లోనూ ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉంటుంది. ఇటీవల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరగడం భవిష్యత్తు వృద్ధి అంచనాలపై అనిశ్చితికి దారితీసింది. ముఖ్యంగా స్థానిక, ప్రాంతీయ లాక్డౌన్లు ఇటీవలే మెరుగుపడిన డిమాండ్ పరిస్థితులను దెబ్బతీస్తాయా? సాధారణ పరిస్థితులు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. అయితే, ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పుడు మరింత మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా పడకుండా చూసేందుకు ద్రవ్య, పరపతి యంత్రాంగాలు సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణికి తగినట్టు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పుష్కలంగా ఉండేలా ఆర్బీఐ చూస్తుంది. అంటే ఫైనాన్షియల్ మార్కెట్, ఉత్పత్తి రంగాల అవసరాలకు మించి నగదు లభ్యత ఉండేలా చూడడం. ఆర్థిక స్థిరత్వం కోసం చేయాల్సినదంతా ఆర్బీఐ చేస్తుంది. అంతర్జాతీయ ప్రభావాలు, అస్థిరతలను దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లు తట్టుకునేలా తగిన చర్యలతో రక్షణ కల్పిస్తాం. నేటి పరిస్థితుల్లో మారటోరియం (రుణ చెల్లింపులపై కొంత కాలం విరామం) అవసరం లేదు. ప్రైవేటు రంగం తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన సన్నద్ధతతో ఉంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు హామీతో కూడిన, నిరంతర ద్రవ్య లభ్యతకు కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటన స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సవాళ్లను అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శనం చూపించింది. వృద్ధిపై స్పష్టమైన ముద్ర వేసింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతోపాటు ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించింది. పుష్కలంగా ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం.. ఎన్‌హెచ్‌బీకి అదనంగా రూ.10,000 కోట్లు సమకూర్చడం అన్నది.. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సాయపడేవి. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ రూ.లక్ష కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలు సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌లు) కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ) ఆర్బీఐ ప్రకటించింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. బాండ్‌ఈల్డ్స్ గమనా న్ని గాడిలో పెట్టేందుకు (బాండ్ ఈల్డ్స్‌లో క్రమబద్ధత) ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మానిటరీ పాలసీకి అనుగుణంగా బ్యాలన్స్ షీటును కొసాగించేందుకు ఆర్బీఐ మొదటిసారి నిర్ణయించింది. ప్రతీ త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల మేర (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు) మార్కెట్‌కు అందించనున్నాం’ అని మేఖేల్ డి పాత్ర తెలిపారు. బాండ్ల కొనుగోలు అన్నది ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన విధానం మాదిరేనన్నారు. మొదటగా ఏప్రిల్ 15న రూ. 25,000 కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. రాష్ట్రాలకు నిధుల సాయం కొనసాగింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యంతర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏఎస్) కింద రూ.51,560 కోట్ల సాయాన్ని పొందే గడువును వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో విడత ప్రభావాలను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్రాలకు ఈ మేరకు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఆదాయాలు, వ్యయాల మధ్య అంతరాలను గట్టేందుకు గాను రాష్ట్రాలకు అందించే తాత్కాలిక రుణ సదుపాయమే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెన్స్. అలాగే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే అగ్రిగేట్ డబ్ల్యూఎంఏ సాయం రూ.32,225 కోట్లుగా ఉండగా.. దీన్ని 46% పెంపుతో రూ.47,010 కోట్లు చేస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు రూ.50వేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలకు రుణ వితరణ సక్రమంగా అందేలా చూసేందుకు జాతీయ ఆర్థిక సంస్థలకు అదనంగా రూ.50వేల కోట్లను ఆర్బీఐ అందించనుంది. నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.25,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు రూ.10,000 కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కు రూ.15,000 కోట్లు లభిస్తాయి. వ్యాలెట్ల మధ్య నగదు బదిలీలు చెల్లింపుల సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్బీఐ పలు చర్యలను తాజా సమీక్షలో ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలు, ఇతర చెల్లింపుల సేవల సంస్థలు, పేమెంట్ బ్యాంకులు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పించింది. ఆర్బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల సేవలైన (సీపీఎస్) ఆర్టీజీఎస్, నెఫ్ట్లను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దాస్ ప్రకటించారు. ఆపరేటర్లు ఇందుకు గాను సీపీఎస్ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. డిజిటల్ ఆర్థిక సేవలు మరింత మందికి చేరుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రీపెయిడ్ చెల్లింపుల సేవలను అందించే సంస్థలు (ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్/పీపీఐ).. తమ కస్టమర్లు ఇతర సంస్థల పరిధిలోని కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించుకునేలా ఇంటర్ ఆపరేబులిటీని అమలు చేసే చర్యలను చేపట్టనున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ సేవలను అందించే ఎంపికను పీపీఐలకు ఇచ్చామని.. ఒక పీపీఐ పరిధిలోని కస్టమర్ మరో పీపీఐ/బ్యాంకు పరిధిలోని కస్టమర్‌కు నగదు బదిలీలు చేసుకోవచ్చని దాస్ చెప్పారు. పీపీఐ పరిధిలో ఒక కస్టమర్‌కు సంబంధించి బ్యాలన్స్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచింది. పూర్తి స్థాయి కేవైసీ కస్టమర్లకే ఇది వర్తిస్తుంది. -
కరోనా ఉధృతి: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్‌మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు. -
ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై) వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) -
ఆర్బీఐ కీలక సమావేశాలు ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡ ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ తగ్గించే అవకాశం ఉంది. అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా. -
యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ ఓటు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో భాగంగా ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా అమలుకానుంది. ఇదేవిధంగా రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21)కల్లా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు అభిప్రాయపడింది. వ్యవసాయం, కన్జూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. కోవిడ్-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆగస్ట్ నెలలోనూ సీపీఐ 6.69 శాతానికి ఎగసింది. ముగ్గురు సభ్యుల ఎంపికలో ఆలస్యంకారణంగా గత నెలాఖరున వాయిదా పడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ముగిశాయి. ఇప్పటికే 2.5 శాతం కోత 2019 ఫిబ్రవరి మొదలు ఆర్బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం(250 బేసిస్ పాయింట్లు) కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్వహించిన సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ మొగ్గు చూపింది. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం చొప్పున అమలవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో అవసరమైతే కీలక రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా తగిన చర్యలు తీసుకునే వీలున్నట్లు పేర్కొంది. ఎంపీసీ ఇలా ఆరుగురు సభ్యులలో ముగ్గురుని కొత్తగా ఎంపిక చేయడంలో జరిగిన ఆలస్యంకారణంగా గత నెలలో జరగవలసిన ఎంపీసీ సమావేశాలు అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఆషిమా గోయల్, శశాంక బిడే, జయంత్ వర్మలను ఎంపీసీ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ద్వైమాసిక రివ్యూను గురువారం ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో రెండురోజుల సమావేశం అనంతరం మానిటరీ పాలసీ కమిటీ రేటు యథాయథంగా ఉంచేలా ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద యథాతథంగా ఉండనున్నాయి. -
‘ఆర్బీఐ’ నష్టాలు
ఆర్బీఐ అనూహ్యంగా రెపో రేటును తగ్గించినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెపో రేటును తగ్గించడంతో పాటు, రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం తదితర ఆర్బీఐ చర్యలు స్టాక్‌మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల మేర క్షీణించడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాత్మక వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆర్బీఐ అంచనాలు.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 9,039 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల మేర క్షీణించాయి. 633 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే మొదలైంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. అప్పటి నుంచి రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 458 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 633 పాయింట్ల రంజ్‌లో కదలాడింది. ► యాక్సిస్ బ్యాంక్ షేర్ 6 శాతం మేర నష్టపోయి రూ.337 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు ఆర్బీఐ పొడిగించింది.ఈ నిర్ణయం వల్ల రుణ వసూళ్లలో జాప్యం జరగడమే కాకుండా, రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలతో బ్యాంక్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 6 శాతం మేర నష్టపోయాయి. -
ఆగస్టులో మరోమారు రేట్‌కట్?!
వచ్చే పరపతి సమీక్షా సమావేశం నాటికి ఆర్బీఐ మరో 35 శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఇండియా అనలిస్టు కౌశిక్దాస్ అంచనా వేశారు. 2008 సంక్షోభానికి పూర్వం రివర్స్ రెపో 3.75 శాతం ఉండేదని, సంక్షోభానంతరం ఈ రేటను 3.25 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభం ఇంకా పెద్దది కావడం వల్ల రివర్స్ రెపోను మరో 0.35 శాతం తగ్గించి 3 శాతానికి పరిమితం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆర్బీఐ తగ్గించిన రేట్ల ప్రకారం రెపో 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతానికి చేరాయి. ఆగస్టులో జరిగే తదుపరి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో కానీ, అంతకుముందే కానీ మరో 35 పాయింట్ల బేసిస్ పాయింట్ల తగ్గింపుంటుందని దాస్ చెప్పారు. బ్యాంకులు మరింత లిక్విడిటీ పెంచేలా ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంపై పరిమితులుంచాలన్నారు. దీంతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తీసుకువస్తారన్న అంచనాలున్నాయని చెప్పారు. ఈ రెండు విషయాలను మార్కెట్ ఆశిస్తోందని, దీంతో పాటు త్వరలో విడుల చేసే ప్రభుత్వ బాండ్లను ఎవరు కొంటారన్న అంశమై స్పష్టత రావాలని ఆయన అన్నారు. ఆర్బీఐ నుంచి బాండ్ల కొనుగోలు ప్రకటన, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన వస్తే మార్కెట్ సానుకూలంగా ఉండొచ్చన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు మరిన్ని రుణాలివ్వాలని ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడం లేదని, లిక్విడిటీపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. -
రెపో కోత- మార్కెట్లు పతనం
లాక్‌డవున్ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో 0.4 శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. దీంతోపాటు అన్నిరకాల రుణ చెల్లింపులపై ఇప్పటికే ప్రకటించిన మూడు నెలల మారటోరియంను తిరిగి ఆగస్ట్ 31వరకూ పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. మారటోరియం పొడిగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా బ్యాంకింగ్ రంగ కౌంటర్లలో అమ్మకాలకు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 407 పాయింట్లు పతనమై 30,525ను తాకగా.. నిఫ్టీ 130 పాయింట్లు నీరసించి 8,976 వద్ద ట్రేడవుతోంది. ప్రయివేట్ బ్యాంక్స్ బోర్లా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 3.4 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 1 శాతం నీరసించింది. ప్రయివేట్ బ్యాంక్ కౌంటర్లలో బంధన్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఆర్బీఎల్, ఫెడరల్, ఇండస్ఇండ్, సిటీయూనియన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో పీఎస్‌యూ విభాగంలో యూనియన్ బ్యాంక్, పీఎస్బీ, ఇండియన్ బ్యాంక్, ఐవోబీ, ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, జేఅండ్‌కే బ్యాంక్, కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. -
మళ్లీ తగ్గిన వడ్డీ రేట్లు- మారటోరియం పొడిగింపు
కోవిడ్-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి రంగంలోకి దిగింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో తాజాగా 0.4 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ రెపో రేటు 4.4 శాతంగా అమలవుతోంది. రెపో రేటును తగ్గించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో రివర్స్ రెపో సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. కాగా.. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్ పేర్కొన్నారు. కోవిడ్-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డవున్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతోపాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలియజేశారు.దీంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గతంలో భారీ కోత దేశీయంగానూ కరోనా వైరస్ విస్తరించడం ప్రారంభమయ్యాక ఆర్బీఐ నిర్వహిస్తున్న మూడో సమావేశమిది. మార్చి 27, ఏప్రిల్ 17న ఇంతక్రితం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు చర్యలు ప్రకటించారు. కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ విధించడంతో నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పంప్చేసిన విషయం విదితమే. ఈ బాటలో మార్చిలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో 75 బేసిస్ పాయింట్ల(0.7 శాతం)మేర కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. ఇక ఆర్బీఐ వద్ద జమచేసే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు పొందే వడ్డీ రేటుకు సంబంధించిన రివర్స్ రెపోను సైతం 3.75 శాతానికి తగ్గించింది. రెపో బాటలో ఆర్బీఐ.. రివర్స్ రెపోలో సైతం 0.9 శాతం కోతను మార్చిలోనే విధించింది. దీంతో ఏప్రిల్ సమావేశంలో ప్రధానంగా లిక్విడిటీ చర్యలకే ప్రాధాన్యమిచ్చింది. దాదాపు అన్ని రకాల రుణ చెల్లింపుల వాయిదాలపై మే 31వరకూ మూడు నెలల మారటోరియం విధించింది కూడా. -
ఎస్బీఐ బాటలో బీఓబీ, యూబీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను 0.75 బేసిస్ పాయింట్లు (రెపో ప్రస్తుతం 4.4 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు కస్టమర్లకు బదలాయించాయి. రెపో ఆధారిత రుణ రేటు తగ్గింపు మార్చి 28వ తేదీ నుంచీ అమల్లోకి తెస్తున్నట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రెపోకు అనుసంధానమయ్యే వ్యక్తిగత రిటైల్, కార్పొరేట్, చిన్నతరహా పరిశ్రమల రుణ రేట్లు 0.75 శాతం మేర తగ్గనున్నాయి. ఇక తమ తగ్గింపు రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయని యూబీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమవుతున్న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకూ తగ్గించిన వడ్డీరేట్లు అమలవుతాయని తెలిపింది. పీఎన్బీ కొత్త లోగో: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. పీఎన్బీలో ఏప్రిల్ 1 నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. సుజ్లాన్ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ ఓకే టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ సమ్మతి తెలిపింది. 18 బ్యాంకుల కన్సార్షియంకు ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది. సుజ్లాన్‌లో 10% వాటాను భాగస్వామ్య బ్యాంకులు తీసుకోనున్నాయి. బ్యాంకులకు సుజ్లాన్ రూ.12,785 కోట్లు బాకీ పడింది. -
3 నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక మైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అలాగే అన్ని రకాల లోన్లుపై 3 నెలలు మారిటోరియం ప్రకటించింది. శుక్రవారం గవర్నరు శక్తికాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు ఉందన్నారు. దీనివల్ల రుణాలు తీసుకున్న వారి సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉండదని గవర్నర్ హామీ ఇచ్చారు. కరోనా వైరస్, లాక్ డౌన్ లాంటి అనివార్య పరిస్థితుల మధ్య మీడియాతో మాట్లాడాల్సి వచ్చిందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉందన్న ఆయన ప్రస్తుతం మనం ఓ అసాధారణ ముప్పు ఎదుర్కొంటున్నామని, కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే యుద్ధం తరహాలో పోరాడాలన్నారు. కఠినమైన పరిస్థితులు ఎప్పుడూ కొనసాగవని, ఆర్థిక సుస్థిరతకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే సమయమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం మంచి చేసిందన్నారు. ఒకేసారి షేర్లు అమ్ముకోవడం వల్ల మార్కెట్లకు నష్టాలు వచ్చాయన్నారు. ఏప్రిల్ మాసంలో ప్రకటించాల్సిన పరపతి విధాన నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మార్చి 24, 26, 27 తేదీలలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ స్థూల ఆర్థిక , సూక్ష్మ ఆర్థిక పరిస్థితులపై చర్చించిందని తెలిపారు. దీని ప్రకారం రెపో రేటు 75 పాయింట్ల మేర కోత విధింపునకు ఎంపీసీ నిర్ణయించినట్టు చెప్పారు. దీంతో ప్రస్తుత రెపో రేటు 4.40 శాతానికి దిగి వచ్చింది. 90 బీపీఎస్ పాయింట్ల కోతతో రివర్స్ రెపో రేటు 4 శాతంగా ఉండనుంది. తద్వారా ప్రపంచ కేంద్ర బ్యాంకుల బాటలో నడిచిన ఆర్బీఐ ముందస్తు రేట్ కట్ ను ప్రకటించింది. -
మారని రేట్లు.. వృద్ధికి చర్యలు
ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రుణాలకు మంచి రోజులు ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు. ► దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28%. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా. ► వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్‌గ్రేడ్ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల రుణాల్లాగే వీటినీ పరిగణిస్తారు. రియల్టీ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాలు రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి–మార్చి క్వార్టర్లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం 3.8–4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5–5.4%కి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది. వృద్ధి రేటు 5%: 2019–20లో వృద్ధి రేటు 5%గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2020–21లో 6%గా ఉంటుందని అంచనా వేసింది. 2020–21 తొలి ఆరు నెలల్లో 5.9–6.3% మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5–6%కి తగ్గించింది. ఇతర ముఖ్యాంశాలు ► రేట్ల యథాతథ స్థితికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ► దీంతో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి. ► ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్బీఐ పేర్కొంది. ► చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి. ► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్ఎఫ్సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్ 9 నుంచి ఆర్బీఐకి బదిలీ కావటం తెలిసిందే. ► బ్యాంకుల్లో డిపాజిట్ బీమాను ఒక డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ► బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. ► తదుపరి ఆర్బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది. మా వద్ద ఎన్నో అస్త్రాలు ‘‘సెంట్రల్ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ అస్త్రాలను వినియోగించేందుకు ఆర్బీఐ వెనుకాడదన్న సంకేతం ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వృద్ధి తగ్గే రిస్క్ పెరిగిందని... అయితే, పూర్తి ప్రభావంపై అనిశ్చితి ఉందని చెప్పారు. బ్యాంకుల్లోకి రూ.లక్ష కోట్లు లాంగ్‌టర్న్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ (రెపోస్/రుణాలు) ఏడాది, మూడేళ్ల కాల వ్యవధిపై రూ.లక్ష కోట్ల మేర రెపో రేటుకు జారీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రెపోస్ అంటే.. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐకి విక్రయించి నిధులు పొందడం. గడువు తీరిన తర్వాత తిరిగి అవి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఇప్పటి వరకు ఆర్బీఐ గరిష్టంగా 56 రోజులకే రెపోస్‌ను ఇష్యూ చేసింది. అందులోనూఒక రోజు నుంచి 15 రోజుల కాలానికే ఎక్కువగా ఉండేవి. మొదటిసారి ఏడాది, మూడేళ్ల రెపోస్‌ను ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గించడమే ఇందులోని ఉద్దేశం. ‘‘మానిటరీ పాలసీ బదిలీ మరింత మెరుగ్గా ఉండేందుకు తీసుకున్న చర్య ఇది. ఎందుకంటే రెపో రేటుకు నిధులను ఇస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను విడుదల చేయాలనుకుంటున్నాం. దాంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు వీలు పడుతుంది’’ అని ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎవరేమన్నారంటే... ఏడాది, మూడేళ్ల లాంగ్‌టర్మ్ రెపోస్ బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గిస్తాయి. దీంతో ఈ ప్రభావాన్ని మరింత మెరుగ్గా రుణగ్రహీతలకు బదిలీ చేయడం వీలు పడుతుంది. రెపో రేట్లను మార్పు చేయకపోవడం ఊహించినదే. అయితే, అభివృద్ధి, నియంత్రణపరమైన చర్యలు ఆర్థిక రంగానికి సానుకూలం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ప్రాజెక్టు రుణాలకు అదనంగా ఏడాది గడువు ఇవ్వడం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఉపశమనం. – అనుజ్‌పురి, అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆటో, హౌసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చే ఇంక్రిమెంటల్ రుణాలకు సీఆర్ఆర్ నుంచి బ్యాంకులకు మినహాయింపునివ్వడం.. ఈ రంగాలకు రుణ వితరణను పెంచి, మందగమనానికి మందులా పనిచేస్తుంది. – కృష్ణన్ సీతారామన్, క్రిసిల్ -
మరో విడత రేటు కోతకు చాన్స్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత రెపో రేటు తగ్గిస్తామనే సంకేతాలిచ్చారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని ఆర్బీఐ 2019 ఫిబ్రవరిలోనే గుర్తించిందని, దీన్ని నివారించే లక్ష్యంతోనే అప్పటి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశాల్లో రెపో రేటును తగ్గిస్తూ వచ్చామని చెప్పారాయన. ఈ కాలంలో 135 బేసిస్ పాయింట్ల రెపో (1.35%) తగ్గించడాన్ని ప్రస్తావించారు. ఈ నెల్లో పెంచకపోవటాన్ని ప్రస్తావిస్తూ... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, వేచిచూసే ధోరణికి మారామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను సరిచేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించిన దిశలో ఇది ఒక కీలక అడుగు. తదుపరి ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే అంశం’ అని పేర్కొన్నారు. -
పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్ విభాగం, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్ఈ రుణ రేట్లు 8.95–9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సైతం ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వడ్డీ తగ్గింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (పీపీబీ) సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేటును అర శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. నవంబర్ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పీపీబీ ప్రకటించింది. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర తగ్గించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పీపీబీ సీఈవో, ఎండీ సతీష్‌కుమార్ గుప్తా తెలిపారు. 7.5 శాతం వడ్డీ రేటుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని కూడా పీపీబీ ప్రకటించింది. పీపీబీ భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఈ వడ్డీ రేటు పొందొచ్చు. -
పర్సంటేజ్లతో పండగ చేస్కో!
ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. దేశ వృద్ధికి ఆర్బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకుగాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున (0.25 శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ పేర్కొన్న ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది. కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే. వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గింపు... దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్బీఐ షాక్‌కు గురిచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు... ► ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు. ► ఆర్బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది. ► తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపోను తగ్గించారు. ► క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ► అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ► 2019–20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5–3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ► వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 3–5 తేదీల్లో జరుగుతుంది. వృద్ధి కోసం రేట్ల కోత అవసరమే: దాస్ నిలిచిన వృద్ధి ఇంజిన్‌ను వెంటనే పరుగెత్తించేలా చేయాల్సిన అవసరమే.. రేట్లను దశాబ్ద కనిష్ట స్థాయికి తగ్గించాల్సి వచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘‘వృద్ధి ధోరణి ఇలాగే ఉన్నంత కాలం... అలాగే, వృద్ధి పుంజుకునేంత వరకు ఆర్బీఐ తన ప్రస్తుత సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తుంది’’ అని దాస్ అభయమిచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుండడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపించే అవకాశాలపై ఎదురైన ఒక ప్రశ్నకు... ‘‘బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికి (జీడీపీలో 3.3 శాతం) ద్రవ్యలోటును పరిమితం చేస్తామని కేంద్రం చెబుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని సందేహించాల్సిన అవసరం లేదు’’ అని దాస్ చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలుగా దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యంతర డివిడెండ్ రూపంలో రూ.30 వేల కోట్లను కోరనుందన్న విషయమై తనకు అవగాహన లేదన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం దేశ బ్యాంకింగ్ రంగంపై తలెత్తుతున్న సందేహాలు, వదంతులను తోసిపుచ్చుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా, సుస్థిరంగా ఉందని, భయపడేందుకు కారణాలేమీ లేవన్నారు దాస్. ఒక్క కోపరేటివ్ బ్యాంకులో తలెత్తిన సమస్య పునరావృతం కాబోదన్నారు. దీన్ని బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ పరిస్థితికి ముడిపెట్టి చూడడం తగదన్నారు. అక్రమాలు వెలుగు చూడడంతో ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఎవరేమన్నారంటే... 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతతోపాటు అవసరమైతే తదుపరి రేట్ల కోత ఉంటుందని చెప్పడం అన్నది.. వృద్ధి ఆందోళనలకు ముగింపు పలికేందుకు ద్రవ్య, పరపతి విధానాలు కలసి పనిచేస్తాయన్న భరోసాను ఇస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ 135 బేసిస్ పాయింట్లను ఈ ఏడాది తగ్గించడానికి తోడు ప్రభుత్వం తీసుకున్న పలు ప్రోత్సాహక చర్యలు పలు రంగాల్లో వృద్ధికి దారితీస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి దేశ వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను ఆర్బీఐ తగ్గించడం, వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలీ తీసుకున్న చర్యలకు అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది – కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన మేరకే రేట్ల కోత ఉంది. అయితే, మార్కెట్లు మరింత రేటు కోతను అంచనా వేయడంతో నిరాశ చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25–40 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. – అభిషేక్ బారు, వైస్ ప్రెసిడెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఎఫ్‌ఐల రుణ పరిమితి పెంపు సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు/ఎంఎఫ్ఐ) సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఓ సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణాల లభ్యత పెరుగుతుంది. ఓ రుణ గ్రహీతకు గరిష్టంగా రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.25 లక్షలు చేసింది. ఎంఎఫ్ఐ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) రుణ గ్రహీతలకు సంబంధించి గృహ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు, పట్టణాల్లో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రుణ వితరణ పరిమితులను చివరిసారిగా 2015లో ఆర్బీఐ సవరించింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ మరోసారి రేట్ కట్కే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి నాలుగవ ద్వి-నెలవారీ ద్రవ్య విధానాన్ని నేడు (శుక్రవారం, అక్టోబర్ 4 ) తన సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 25 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏకగ్రీవంగా కమిటీ ఈ రేట్ కట్కు నిర్ణయించింది. కాగా ఈ ఏడాదిలో ఇది ఐదవ రేటు కట్. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. దీంతో రెపోరేట్ 2010 నాటికి చేరింది. ఇక రివర్స్ రెపో రేటును 4.9శాతంగా ఉంచింది. జీడీపీ వృద్ధిరేటును 6.9 నుంచి 6.1 నుంచి తగ్గించింది. అలాగే 2020-21 నాటికి జీడీపీ అంచనాను కోత పెట్టి 7.2 శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే రెపో రేటును వరుసగా నాలుగుసార్లు తగ్గించింది, ఈ ఏడాది మొత్తం 110 బేసిస్ పాయింట్లు. ఆగస్టులో జరిగిన చివరి సమావేశంలో, ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) బెంచ్‌మార్క్ రుణ రేటును అసాధారణమైన 35 బేసిస్ పాయింట్ల ద్వారా 5.40 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్బీఐ 1.1 శాతం(0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో చాలామంది ఎనలిస్టులు 40 పాయింట్ల రేట్ కట్‌ను ఊహించారు. తాజా రివ్యూలో ఎంపీసీ లో ఒక సభ్యుడుకూడా 40శాతం కోతకు ఓటు వేయడం గమనార్హం. -
రుణాలన్నీ ఇక ‘రెపో’తో జత!
ముంబై: బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇలాంటి అనుసంధాన నిర్ణయాలు (రిసెట్) జరగాలని సర్క్యులర్ నిర్దేశించింది. ‘‘వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది’’ అని సర్క్యులర్ స్పష్టం చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు ఇకపై తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, మూడు నెలలు లేదా ఆరు నెలల బ్యాండ్లపై లభించే వడ్డీరేట్లకు లేదా ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించే ఇతర బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది. బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్బీఐ తాజా సర్క్యులర్ జారీ అయ్యింది. ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం... ‘‘ప్రస్తుతం నిధుల సమీకరణ–వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆర్బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్ఆర్ మార్గంలో ఆలస్యం అవుతోంది’’అని కూడా ఆర్బీఐ తన సర్క్యులర్‌లో తెలిపింది. కాగా ఇప్పటికి దాదాపు 12 బ్యాంకులు తమ రుణ రేటును రెపోను అనుసంధానించడం జరిగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేటును తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్బీఐ స్వయంగా పేర్కొంది. అయితే రెపోకు బ్యాంకింగ్ రుణ రేటు మరింతగా అనుసంధానం కావాల్సి ఉందని కూడా ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. రేటు తగ్గించిన ఐసీఐసీఐ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను అన్ని మెచ్యూరిటీలపై తగ్గించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఏప్రిల్ నుంచీ బ్యాంక్ రుణ రేటు 0.20 శాతం తగ్గించినట్లయ్యింది. కొత్తగా తగ్గించిన రేట్లు సెప్టెంబర్ 1 నుంచీ అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి తగ్గుతుంది. గృహ, ఆటో, వాణిజ్య రుణాలకు ఏడాది రుణ రేటే ప్రామాణికం కావడం గమనార్హం. ఇక ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి తగ్గుతుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యర్థిగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడాది రుణరేటు ప్రస్తుతం 8.60%గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ రేటు 8.55 శాతంగా ఉంది. -
వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ‘‘జూన్ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు. ఎస్బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి ► ఎస్బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్బీఐ రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. అయితే ఇది ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీ ఎల్ఆర్) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. ► జూలై 1 నుంచే బ్యాంక్ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు.. జూన్ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. మరో రేటు కోత! ఆగస్టు 5 నుంచి 9వ తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్ ఉంది. నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి. -
రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా?
సందర్భం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జూన్ 6, 2019న తన వడ్డీరేట్లను (రెపో రేటు) 25 పాయింట్ల మేర తగ్గించింది. దీనితో ఆర్బీఐ రెపో రేటు ప్రస్తుతం 5.75కు చేరింది. ఈ విధంగా రెపోరేటును తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది 3వ దఫా! ఈ రెపో రేటు తగ్గింపు వలన గృహ, వాహన రుణాలపై వడ్డీల స్థాయి తగ్గి, అవి మరింత చౌక అవుతాయి. అంతిమంగా ఈ రేట్ల తగ్గింపు ఉద్దేశ్యం కూడా రుణ స్వీకరణను పెంచడం, ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీల చెల్లింపు భారాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే! మన దేశ ఆర్థిక వృద్ధి రేటు గత అనేక మాసాలుగా, గణనీయంగా దిగజారుతోంది. 2018–2019 కాలానికి సంబంధించిన 3వ త్రైమాసికంలో 6.6%గా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) వృద్ధిరేటు 4వ త్రైమాసికంలో 5.8%కి దిగజారింది. దీని వలన, 2018–2019 ఆర్థిక సంవత్సర మొత్తం కాలానికి గానూ జీడీపీ స్థాయి. 6.8 గానే ఉంది. అంటే గత రెండేళ్లుగా చైనా కంటే అధిక వృద్ధి రేటును సాధించి ఆర్థిక అబివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నామని అనుకున్న మనం నేడు ఆ స్థానాన్ని కోల్పోయాం!! ఈ నేపధ్యంలోనే, దిగజారుతున్న వృద్ధిరేటును పెంచడం, 45 సం‘‘ల గరిష్ట స్థాయికి (6.1%) చేరిన నిరుద్యోగాన్ని తగ్గించడం అనే లక్ష్యాలకు నేటి ఆర్బీఐ రెపోరేట్లు తగ్గింపు కూడ దోహదపడగలదనే అంచనాలు వున్నాయి. కాగా, వాస్తవాలు ఈ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. తొలి రెండు దఫాల రెపోరేట్ల తగ్గింపు ద్వారా ఆర్బీఐ ఇప్పటివరకూ మొత్తంగా 50 పాయింట్ల మేర (0.5%) వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ, ఈ తగ్గిన రెపోరేట్లు లేదా వడ్డీ రేట్ల లబ్దిని పొందిన కమర్షియల్ బ్యాంకులు మాత్రం తామిచ్చే రుణాలపై తమ తమ వడ్డీ రేట్లను కేవలం 5 నుంచి 10 పాయింట్ల మేరకే (0.05% నుంచి 0.1%) తగ్గించాయి అంటే, కమర్షియల్ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో లేదు. తద్వారా, అవి ఆర్బీఐ వడ్డీరేటు తగ్గింపు ప్రయోజనాన్ని తమ రిటైల్, కార్పోరేట్ కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించడం లేదు. దీనికి ఒక ప్రధాన కారణం తాము గనక తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించుకుంటే, తమకు లభించే ఆదాయం తగ్గిపోతుందని బ్యాంకులు ఆందోళన చెందడమే! ఈ రకంగా, బ్యాంకుల ఆదా యం తగ్గితే అవి తమ వ్యయాలను కూడ తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే, అవి తాము ప్రజల నుంచి తీసుకునే డిపాజిట్లపై, తామిచ్చే వడ్డీరేట్ల స్థాయిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే రాబడి తగ్గిన డిపాజిటర్లు తమ సొమ్ముపై మెరుగైన రాబడి కోసం, మరో దారి వెతుక్కుంటారు. ఇప్పటికే పెరిగిపోయిన మొండి బకాయిలూ, అలాగే పెద్దనోట్ల రద్దుతో తగిలిన దెబ్బవలన పలు బ్యాంకులకు మూల ధన కొరతలు లేదా లోట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దానికి తోడు తగ్గించిన వడ్డీరేట్ల ప్రభావం వలన ఆయా బ్యాంకులలో కస్టమర్ల డిపాజిట్లు విత్‌డ్రా కావడం లేదా కొత్త డిపాజిట్లు రాకపోవడం గనుక తోడయితే, ఇది ఆయా బ్యాంకులకు మూలిగే నక్కమీద తాటికాయే కాగలదు. కాబట్టి రెపోరేట్లు తగ్గింపు లక్ష్యమైన, ప్రజల చేతిలో అదనపు ఆదాయం ఉండేలా చూసి, తద్వారా మార్కెట్లో సరుకులూ, సేవల డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ చర్య ఉండజాలదు. దానితో పాటుగా మొండి బకాయిలు భారీగా పెరిగి పోయాక, నేడు మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పెద్దగా కొత్త రుణాల మంజూరుకు సానుకూలంగా లేవు. అలాగే ఒకవేళ రుణాల మంజూరును డిమాండ్ మేరకు భారీగా పెంచుకోవాలన్నా నేడు పలు బ్యాంకుల వద్ద, తగిన మేరకు నగదు లేదు. అందుకే ప్రభుత్వం వివిధ బ్యాంకులకు మూల ధనాన్ని (రూ. 40,000 కోట్లు) సమకూర్చాలనే డిమాండ్ కూడా వినపడుతుంది. దీనంతటితో పాటుగా, బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ సంస్థలలో కూడా త్రీవ స్థాయిలో నెలకొన్న సంక్షోభం, దివాలాలు ప్రజలకూ, కార్పోరేట్లకూ రుణ అందుబాటు సమస్యను మరింత తీవ్రతరం చేసాయి. కాబట్టి, ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వృద్ధిరేటు దిగజారుడు, పెరిగిపోతున్న నిరుద్యోగం ఫలితంగా పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి వంటి సమస్యలను పరిష్కరించేందుకు రెపోరేట్ల తగ్గింపు వంటి పైపై ఉపశమన, ఉద్దీపన చర్యలు ఏమాత్రం సరిపోవు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం దాని తాలూకు దుస్థితిలో కావల్సింది కాయకల్ప చికిత్స మాత్రమే!! ఆ చికిత్స ఖచ్చితంగా, దేశంలోని మెజారిటీ ప్రజల జీవనాధారం అయిన వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేయడంలో మాత్రమే ఉంది!! ఆర్బీఐ రెపోరేట్లను తగ్గించిన రోజునే (జూన్ 6, 2019) షేర్ మార్కెట్ సూచీలు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని (552 పాయింట్లు సెన్సెక్స్) నమోదు చేయడం దీన్నే చెబుతోంది. డి. పాపా రావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ఆర్బీఐ లక్ష్యం సిద్ధిస్తుందా?
అటు ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం తెచ్చేందుకు ప్రయత్నించడంతోపాటు ఇటు బ్యాంకు ఖాతా దార్లకు ఊరట కలిగించేలా గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయాలు ఉన్నంతలో మెచ్చదగినవే. కానీ దాన్నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించినందువల్ల కావొచ్చు... మార్కెట్ల నుంచి పెద్దగా స్పందన లేదు. రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గిస్తూ, దాన్ని 5.75 శాతానికి పరిమితం చేసింది. రివర్స్ రెపో రేటు 5.5 శాతంగా ఉంది. 2013 తర్వాత ఆర్బీఐ వరసగా మూడో దఫా రెపో రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. అంతేకాదు... రెపో రేటు 5.75 శాతానికి పరిమితం కావడం తొమ్మిదేళ్ల కనిష్టం. అలాగే ద్రవ్య విధానాన్ని ‘తటస్థత’ నుంచి ‘అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు’ చేసుకునే విధంగా మార్చింది. కనుక సమీప భవిష్యత్తులో రెపో రేటు పెరుగుదల ఉండదని భావించాలి. మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, చాన్నాళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెరగకపోవడం, ద్రవ్యకొరత ఏర్పడటం కనబడు తూనే ఉంది. పైగా రుతుపవనాలు ఆశించినంతగా ఉండబోవని వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. ముడి చమురు ధరలు ప్రస్తుతానికి తగ్గుముఖంలో ఉన్నా అంతర్జాతీయ పరిణామా లరీత్యా ఇదిలాగే కొనసాగుతుందన్న విశ్వాసం ఎవరికీ లేదు. ఫైనాన్షియల్ మార్కెట్లు సైతం ఒడిదుడుకుల్లో ఉన్నాయి. కనుకనే రెపో రేటు తగ్గినప్పుడు సాధారణంగా కనబడే ఉత్సాహం ఈసారి లేదు. మన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో గతవారం వెల్లడైన అధికార గణాం కాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. మొన్న మార్చిలో ఇది క్షీణ దశకు కూడా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.8 శాతం మించలేదు. ఇది అయిదేళ్ల కనిష్టం. పైగా వచ్చే ఏడాది వృద్ధి రేటు గతంలో ప్రకటించినట్టు 7.2 శాతం కాక, 7 శాతమే ఉండొచ్చునని ఆర్బీఐ అంచనా వేస్తోంది. వినియోగం మందగించటం, ఎగుమతులు కూడా ఆశించినంతగా లేకపోవడం, నిరుద్యోగిత ఆందోళన కలిగించే అంశాలు. ఏతా వాతా మన దేశాన్ని ‘ప్రపంచంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’గా ఇప్పటికైతే ఎవరూ పరిగణించరు. తన నియంత్రణలోలేని ఇతర అంశాల సంగతలా ఉంచి, ఏదోమేరకు చేయడానికి అవకాశము న్నచోట సైతం ఆర్బీఐ దృఢంగా వ్యవహరించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తిం చాలి. ఈ విషయంలో అది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గి స్తున్నా దానికి అనుగుణంగా బ్యాంకులు స్పందించడం మానుకుని చాన్నాళ్లయింది. రెపో రేటు ఇలా తగ్గడం ఏడాదిలో ఇది మూడోసారి. ప్రతిసారీ ఈ తగ్గింపు వృద్ధికి ఊతమిస్తుందని గంభీరంగా ప్రకటించడం తప్ప బ్యాంకులు తమ వంతుగా వడ్డీ రేట్లు తగ్గించి ఆ ప్రయోజనాలను ఖాతాదార్లకు బదలాయించడం లేదు. అలా చేయమని కోరుతూ ఆర్బీఐ సూచనలిస్తున్నా వాటికి పట్టడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఆర్బీఐ రెపో రేటును అరశాతం తగ్గించింది. ఖాతా దార్లకు అదే నిష్పత్తిలో అందాల్సిన ప్రయోజనానికి బ్యాంకులు గండికొట్టాయి. ఖాతాదార్లకు వడ్డీ రేట్లలో 0.21 శాతం మాత్రమే కోత పడిందని నిపుణులు చెబుతున్న మాట. పైగా ఈ తగ్గింపైనా కొత్త రుణ గ్రహీతలకు వర్తింపజేస్తున్నారు తప్ప పాతవారికి అందజేయడం లేదు. వాస్తవానికి ఖాతాదార్లకు ఇలా ప్రయోజనాన్ని బదలాయిస్తే వచ్చే ఫలితాలు బహుముఖంగా ఉంటాయి. అది వస్తు వినిమయాన్ని పెంచుతుంది. అందువల్ల తయారీ రంగం మెరుగవుతుంది. గృహ కొనుగోళ్లు పెరిగి రియాలిటీ రంగం ఊపందుకుంటుంది. వాహన కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుంది. ఆర్బీఐ నేరుగా బ్యాంకు ఖాతాదార్లకు ప్రయోజనం చేకూర్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ(నెఫ్ట్)ల ద్వారా జరిపే ఆన్లైన్ లావాదేవీలకు వసూలు చేస్తున్న చార్జీలను తొలగించాలన్న నందన్ నిలేకని నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. రూ. 2 లక్షల వరకూ నగదును బదిలీ చేయ డానికి వినియోగించే నెఫ్ట్, అంతకు పైబడిన లావాదేవీలకు వినియోగించే ఆర్టీజీఎస్‌లపై వసూలు చేసే చార్జీలు ఇకపై ఉండవు. వాస్తవానికి ఆన్లైన్ లావాదేవీల సదుపాయం ఖతాదార్లకు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని కూడా నిలేకని కమిటీ సూచించింది. కానీ ఆ విషయంలో ఆర్బీఐ ఎందుకనో మౌనంగా ఉండిపోయింది. డిజిటల్ లావాదేవీలపై వసూలు చేస్తున్న చార్జీల తొలగింపు నిర్ణయాన్ని బ్యాంకులు వెనువెంటనే అమలు చేస్తాయా అన్నది చూడాల్సి ఉంది. డిజి టల్ లావాదేవీలతోపాటు సాధారణ జనం సైతం గణనీయంగా వినియోగిస్తున్న ఏటీఎంల విష యంలోనూ ఆర్బీఐ సరైన విధానాన్ని ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అటు డిజి టల్ లావాదేవీలైనా, ఇటు ఏటీఎం వినియోగమైనా బ్యాంకులపై ఒత్తిళ్లను గణనీయంగా తగ్గిస్తున్నా యన్నది కాదనలేని సత్యం. ఈ వెసులుబాటు వల్ల అవి సిబ్బందిని తగ్గించుకోగలిగాయి. ఆ మేరకు బ్యాంకుల వ్యయం సైతం తగ్గింది. ఏటీఎంలు వినియోగించకతప్పని స్థితిని ఆసరా చేసుకుని ఖాతా దార్లనుంచి బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలు తక్కువేమీ కాదు. ఖాతా తెరిచేటపుడు ఇచ్చే డెబిట్ కార్డుకు రూ. 130 నుంచి 300 వరకూ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపారని, మా బ్యాంకు ఏటీఎంను కాక, వేరే బ్యాంకు ఏటీఎంను లెక్కకు మించి ఉప యోగించారని బ్యాంకులు ఖాతాదార్లను ఉసురుపెడుతున్నాయి. అసలు లావాదేవీలు జరపక పోయినా తప్పుగా పరిగణించి సర్‌చార్జీల మోతమోగిస్తున్నాయి. ఇన్ని రూపాల్లో వాటికొస్తున్న వార్షికాదాయం వేల కోట్లలో ఉంటోంది. కనుక ఏటీఎం లావాదేవీల విషయంలోనూ ఆర్బీఐ సాను కూల నిర్ణయం తీసుకోవాలి. తన చర్యల వల్ల కలిగే ఏ ప్రయోజనమైనా అంతిమంగా ఖాతాదారుకు చేర్చగలిగినప్పుడే దానివల్ల సత్ఫలితాలు వస్తాయని రిజర్వ్‌బ్యాంక్ గ్రహించాలి. -
గృహ, వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీరేట్లు
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటు కోతకే మొగ్గు చూపింది. 2019 సంవత్సరంలో వరుసగా రెండవ త్రైమాసికంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ గురువారం నిర్ణయం తీసుకొంది. దీంతో కీలక వడ్డీరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగి వచ్చింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలపై భారం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం కూడా తగ్గనుంది. గత సమీక్షలో రెపో రేటు తగ్గించడంతో పలు బ్యాంకులు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను ఇప్పటికే 5 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కోటక్, ఎస్‌బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో తొలి ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది. జీడీపీ 7.2 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో 7.4 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ బాటలో తొలి అర్ధభాగానికి 6.8-7.1 శాతం స్థాయిలో జీడీపీ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. -
రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ
ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు గృహ, వాహన, వ్యక్తిగత రుణాల కస్టమర్లకు ఊరట ఇచ్చేలా ఆర్బీఐ వరుసగా రెండోసారి కీలక రేట్లను తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు శాతానికి పరిమితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి మూడు రోజుల భేటీ అనంతరం ఆర్బీఐ కీలక రేట్ల నిర్ధారణ కమిటీ గురువారం వడ్డీ రేట్ల తగ్గింపును వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును ఉత్తేజింపచేసేందుకు ఆర్బీఐ రెపోరేటును పావు శాతం మేర తగ్గిస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆశించాయి. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులకు కేంద్ర బ్యాంక్ నుంచి తీసుకునే నిధులపై వ్యయం తగ్గడంతో అవి రుణ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు పొంది నెలవారీ వాయిదాలు చెల్లించే కస్టమర్లకూ ఈఎంఐల భారం కొంతమేర తగ్గనుంది. -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమావేశం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం వరకూ మూడు రోజులు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ గురువారం ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)పై ప్రకటన వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊపును ఇవ్వడానికి మరో దఫా రేటు కోత ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తుండగా, ఇప్పటికే తీసుకున్న రేటు కోత నిర్ణయాలను బ్యాంకింగ్ అమలు చేయడంపైనే ఆర్బీఐ దృష్టి సారిస్తుందని మరికొందరి విశ్లేషణ. -
మళ్లీ వడ్డీ రేట్ల కోత చాన్స్..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2018 డిసెంబర్లో కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 7.3 శాతం. ధరలు తక్కువగా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం నేపథ్యంలో ఏప్రిల్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలకు మరింత బలం చేకూరింది. పారిశ్రామిక విభాగాలు వేర్వేరుగా... ► తయారీ: సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధిరేటు డిసెంబర్లో 8.7 శాతం (2017 డిసెంబర్) నుంచి 2.7 శాతానికి (2018 డిసెంబర్) పడిపోయింది. అయితే 2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ రేటు 3.8 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేశాయి. ► మైనింగ్: డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –1.0 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రేటు కనీసం 1.2 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చూస్తే, వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది. ► విద్యుత్: డిసెంబర్లో వృద్ధి అక్కడక్కడే 4.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో మాత్రం ఈ రేటు 5.1 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు, యంత్ర సామగ్రి కొనుగోలుకు సూచిక అయిన ఈ రంగంలో వృద్ధి రేటు 13.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో మాత్రం వృద్ధి 2.1 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: ఈ విభాగంలో ఉత్పాదకత వృద్ధి రేటు భారీగా 16.8 శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. జనవరిలో మరింత తగ్గిన ధరలు జనవరిలో రిటైల్ ధరల పెరుగుదల వేగం (ద్రవ్యోల్బణం) కేవలం 2.05 శాతంగా ఉంది. 2018లో ఈ రేటు 5.07 శాతం. జనవరిలో మొత్తం ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం సూచీ పెరక్కపోగా –1.29 శాతం తగ్గింది. వేర్వేరుగా చూస్తే, గుడ్లు (–2.44 శాతం), పండ్లు (13.32 శాతం), కూరగాయలు (–13.32 శాతం), పప్పు దినుసులు (–5.5 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తుల (–8.16 శాతం) ధరలు 2018 ఇదే నెలతో పోల్చితే తగ్గాయి. అయితే మాంసం, చేపల ధరలు 5.06 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 1.45 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్ ధరలు 3.48 శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో మరో నాలుగు ప్రధాన విభాగాలను చూస్తే... పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల విభాగం బాస్కెట్ ధర 5.62 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల సూచీ 2.95 శాతం ఎగసింది. హౌసింగ్ ధర 5.20 శాతం పెరిగితే, ఫ్యూయెల్ అండ్ లైట్లో ద్రవ్యోల్బణం 2.20 శాతం పెరిగింది. -
మార్కెట్ అక్కడక్కడే
అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ వైఖరి మారడం, అనూహ్యూంగా రేట్ల కోత చోటు చేసుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ట్రేడై, మిశ్రమంగా ముగిసింది. ఇంట్రాడేలో 197 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 4 పాయింట్లు నష్టపోయి 36,971 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 11,069 వద్ద ముగిశాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు ఒడుదుడుకులకు గురై మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్లు లాభపడగా, బ్యాంక్, రియల్టీ షేర్లలో షేర్లు కొన్ని లాభాల్లో, కొన్ని నష్టాల్లో ముగిశాయి. రెపో తగ్గింపువల్ల ఈ ప్రభావితమైన వాహన షేర్లు లాభపడ్డాయి. 273 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆర్బీఐ పాలసీ వెలువడక ముందు వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైన స్టాక్ సూచీలు ఆ తర్వాత హెచ్చుతగ్గులకు గురయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. గత ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్ లాభపడినందున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరి అరగంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 197 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 76 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 273 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా అనిల్ కంపెనీల షేర్ల క్షీణత కొనసాగింది. ఛాలెట్ లిస్టింగ్...స్వల్ప లాభం ఛాలెట్ హోటల్స్ షేర్ స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర, రూ.280తో పోలిస్తే 3.9 శాతం లాభంతో రూ.291 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 5.4 శాతం లాభంతో రూ.292 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 3.7 శాతం లాభంతో రూ.290 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 9.45 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 94 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,954 కోట్లుగా నమోదైంది. మెట్రో నగరాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహించే ఈ కంపెనీ గత నెల 29–31 మధ్య ఐపీఓకు వచ్చింది. -
కుదిరితే మరిన్ని కోతలు
ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు. ఎన్పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్సీఎల్టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది. మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు. చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే... ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సాగు రంగానికి వెసులుబాటు హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది. డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు. మరో రేటు కోత అంచనా! తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా... తటస్థ వైఖరి... సానుకూలం పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు కీలక నిర్ణయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది. – దినేష్ ఖేరా, ఎస్బీఐ ఎండీ వేచి చూడాల్సి ఉంది వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది. – ప్రజుల్ భండారీ, హెచ్ఎస్బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ మరింత తగ్గింపు ఉండవచ్చు ఆర్బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్ ఏప్రిల్‌లో మరో కోత ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి. – రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్ బ్యాంకింగ్ రంగానికి సానుకూలం శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ -
రుణాలిక..బిం‘దాస్’
ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి. గతానికి భిన్నంగా... ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో వడ్డీ రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్, ఆగస్ట్ సమావేశాల్లో ఆర్బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. వృద్ధి కోసమే కోత... ‘‘పెట్టుబడుల ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోణీ రుణ రేటు తగ్గింపు.. ముంబై: ఆర్బీఐ రేట్లు తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏడాది సహా మిగిలిన కాల వ్యవధి రుణాలకు ఇంతకుముందు రేట్లే అమలవుతాయి. ఆరు నెలల రుణాలకు ఇక 8.55 శాతం రేటును బ్యాంకు అమలు చేస్తుంది. చౌకగా రుణాలు... ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి హౌసింగ్ డిమాండ్ జోరు.. ఈ నిర్ణయం గృహ కొనుగోలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఆర్బీఐ కల్పించిన తాజా వెసులుబాటును బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నాం. మరోపక్క, రియల్టీ రంగానికి ద్రవ్య లభ్యత పెరుగుదల దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – జక్సాయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వ్యాపార వర్గాలకు శుభవార్త... తాజా పాలసీలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, దీనితోపాటు ‘జాగరూకతతో కూడిన కఠిన వైఖరి’ నుంచి ‘తటస్థ’ దిశగా తన పాలసీ వైఖరిని మార్చుకోవడం పారిశ్రామిక రంగానికి శుభవార్తలు. వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరుగుతాయ్. దీనివల్ల వృద్ధి జోందుకుంటుంది. – రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ మరింత తగ్గే సంకేతాలు... దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. దీంతో రేట్ల కోతకు వెసులుబాటు లభించింది. రానున్న కొద్దికాలంపాటు ధరలు కట్టడిలో ఉండే అవకాశాల నేపథ్యంలో రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ పరపతి విధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ పాలసీ ముఖ్యాంశాలు... ► రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం. ► ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ► నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది. ► వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు. ► రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి–మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2–3.4 శాతంగా అంచనా. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం. ► జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019–20లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 7.2–7.4 శాతంగాను, అక్టోబర్–డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు. ► చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. ► వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు. ► రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ► కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత. ► పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల. ► కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి. ► ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు. ► ఆర్బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది. -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే... వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు ► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది. ► మొత్తంగా...: 2018 డిసెంబర్లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం. ► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం. ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది. ► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%. రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్.. ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది. -
ఎక్కడి రేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్బీఐ గత సమీక్ష(అక్టోబర్)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా ఆర్బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి– బ్యాంకులు తమ డిపాజిట్ నిల్వల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది. రూపాయి రివర్స్‌గేర్... అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72–73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్ క్రూడ్) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31%కి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం. ఎవరేమంటున్నారంటే... ఆర్బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9–4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో 4.5 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం. మరోపక్క, గత కొద్ది నెలలుగా భగ్గుమన్న పెట్రో ధరలు.. శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అంచనా వేశారు. ఈ తరుణంలో పాలసీలో ఆర్బీఐ రెపో రేటులో మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
వడ్డీ.. రిస్కు రెండూ ఎక్కువే!
ఈ మధ్య ఆర్బీఐ వరుసగా రెండు సార్లు రెపో రేటు పెంచింది. దీంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. కాకపోతే సురక్షితంగా... నిర్ణీత మొత్తం వడ్డీగా కావాలనుకునేవారికి ఇలా బ్యాంకులు డిపాజిట్ రేట్లు పెంచటం అనుకోకుండా కలిసొచ్చిందని అనుకోవాలి. కాకపోతే ఇంకాస్త ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుతుందనుకునేవారు వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల (సీఎఫ్‌డీ) వైపు చూస్తుంటారు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులయితే వాటికి పరోక్షంగానైనా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఉంటుంది. ప్రయివేటు బ్యాంకులయితే వాటికి నిధుల బ్యాకప్ ఉంటుంది కనక అవి కూడా పర్వాలేదు. కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉందని మరే ఇతర అంశాలూ చూడకుండా కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మాత్రం అంత శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సూచన. ‘‘ఇలాంటి పెట్టుబడులు పెట్టినవారు తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అరుదైన సందర్భాల్లో పెట్టుబడులను కూడా నష్టపోవాల్సి రావచ్చు.ఎందుకంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నంత భద్రత కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండదు. వీటిలో రిస్క్ ఎక్కువ. వీటిని అన్సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి’’ అనేది నిపుణుల మాట.!! దానికి కారణాలేమిటో చూద్దాం... –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తయారీ రంగ కంపెనీలు, ఎన్బీఎఫ్సీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు, నిర్వహణకు నిధులు కావాల్సి వచ్చినపుడు వాటిని వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తూ ఉంటాయి. కంపెనీలో వాటాను ఇతరులకు విక్రయించటం... రుణాలు తీసుకురావటం వంటి మార్గాలతో పాటు... నిర్ణీత మొత్తాన్ని వడ్డీగా ఇస్తామంటూ జనం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆహ్వానించటం కూడా ఈ మార్గాల్లో ఒకటి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ కాల వ్యవధులతో ఉంటాయి. అంటే.. మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు మాదిరి అన్నమాట. బ్యాంకు ఎఫ్‌డీల్లో వడ్డీ 6.7 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉంటే, ఈ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి పైగానే ఉంటుంది. కొన్నయితే 9– 9.5 శాతం కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. కంపెనీలు, కాల వ్యవధులను బట్టి కనీస డిపాజిట్ మొత్తం, వడ్డీ రేట్లు మారుతుంటాయి. కొన్ని డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఆఫర్ చేయవచ్చు. కొన్ని కంపెనీలు ఆన్లైన్లోనే డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తుంటే, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో మాత్రమే పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్లైన్ డిపాజి ట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటు ఉండొచ్చు. ఎందుకం టే వాటికి బ్రోకర్ల ద్వారా సమీకరించటానికి అయ్యే చార్జీల బెడద తప్పుతుంది కనక. కొన్ని కంపెనీలు డిపాజిట్ల రెన్యువల్‌పై అధిక వడ్డీ రేటును ఇవ్వజూపు తున్నాయి. క్యుమిలేటివ్ డిపాజిట్ ఎంచుకుంటే వడ్డీని కాల వ్యవధి ముగిసిన తర్వాత అసలుతో కలిపి చెల్లిస్తాయి. నాన్ క్యుమిలేటివ్ డిపాజిట్లు ఎంచుకుంటే వడ్డీని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, సంవత్సరానికోసారి చెల్లించడం జరుగుతుంది. కంపెనీలు ఆఫర్ చేసే ఎఫ్డీలన్నింటికీ రేటింగ్‌లు ఒకేలా ఉండవు. ఏ, ఏఏ, ఏఏఏ ఇలా ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను బట్టి వాటి డిపాజిట్లకు రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా డిపాజిట్లలో పెట్టుబడులకు భద్రత ఏ మేరకు ఉంటుందన్నది ఈ రేటింగ్ తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక డిపాజిట్‌కు ఇచ్చిన రేటింగ్ కాల వ్యవధి ముగిసే వరకూ స్థిరంగా ఉండదు. డిపాజిట్లు జారీ చేసిన కంపెనీ ఆర్థిక పరిస్థితులు, చెల్లింపు సామర్థ్యాలను రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. అవసరమైతే రేటింగ్లను తగ్గించేస్తుంటాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ రేటింగ్‌ను తప్పకుండా గమనించాలి. ఉన్నట్లుండి ఆ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే... మన డిపాజిట్ల భద్రత మరింత తగ్గిందని భావించాలి. వడ్డీతో పాటే.. రిస్క్ కూడా! కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కొంతలో కొంత మెరుగేమి టంటే అధిక రేటింగ్ ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయ టం.వీటిక్కూడా రిస్క్ ఉంటుంది. అధిక రేటింగ్ అన్నది భద్రతను సూచించేదే కానీ... హామీ కాదు. అధిక రేటింగ్ కలిగిన కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు డిఫాల్ట్ అవడం, పెట్టుబడి కూడా చెల్లించలేకపోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి కూడా. ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించాలంటే తయారీ రంగంలోని కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా రేటింగ్ పొందడం తప్పనిసరి. రూ.100 కోట్లకుపైగా నికర విలువ కలిగిన కంపెనీలు, టర్నోవర్ రూ.500 కోట్లకు పైగా ఉన్నవి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేందుకు కంపెనీల చట్టం అనుమతిస్తోంది. నిజానికి రేటింగ్ తక్కువ ఉండి, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న కంపెనీలు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయటానికి ముందుకొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు... రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తే ఆయా సాధనాల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్ఏవీలు క్షీణిస్తాయి. సదరు ఫండ్ ఈ సాధనాల్లో ఎంత పెట్టుబడి పెట్టిందనేదానిపై ఈ క్షీణత ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి ఉంటే ఎక్కువ నష్టం తప్పదు. ఆగస్ట్ చివరి గణాంకాల ప్రకారం 40 డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్ ఫండ్స్ ఎన్ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా. సీఎఫ్డీల్లో పెట్టుబడులకు పరిశీలించాల్సిన అంశాలివీ... ► సీఎఫ్డీల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ రాబడుల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల్లో రూ.లక్ష వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. సీఎఫ్డీల్లో ఇది రూ.20,000కే పరిమితం. కనుక ఒక కంపెనీలో రూ.20,000కు డిపాజిట్ పరిమితం చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ►అధిక రాబడులే కాదు! అదే సమయంలో అధిక రిస్క్ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ఏడాది కాల పరిమితి డిపాజిట్ల విషయంలో బ్యాంకులు, కంపెనీల డిపాజిట్ల మధ్య వడ్డీ రేటు వ్యత్యాసం తక్కువే. కనుక తక్కువ కాల వ్యవధి కోసం రిస్క్ చేయడం మంచిది కాదు. ►కార్పొరేట్ గవర్నెన్స్‌లో మంచి ప్రమాణాల కంపెనీల ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ►దీర్ఘకాలం పాటు సీఎఫ్డీల్లో లాకిన్ అయిపోకుండా ఉండేందుకు, వివిధ కాల పరిమితుల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం తెలివైన పని. పైగా వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతున్నందున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల పరిమితుల డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ► సీఎఫ్డీలో వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఏడాదిలో ఈ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీయే టీడీఎస్ మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. ఈ వడ్డీ ఆదాయం సంబంధిత డిపాజిట్ దారుని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ అంటే..? ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. దేశంలో కేర్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తున్నాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే... డిపాజిట్లు, ఎన్సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి తగ్గినట్టు లెక్క. దీనివల్ల రుణదాతలు కొత్త రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోకపోవచ్చు. అలాగని, ఏ రేటింగ్ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగెటివ్ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్ అనేవి అధిక రేటింగ్ సూచికలు. ఈ రేటింగ్ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతనిస్తుంది. ఇంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టే. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్ రేటింగ్ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించయినా ముందే వైదొలగడం సురక్షితమన్నది నిపుణుల సూచన. క్రెడిట్ రేటింగ్ తగ్గితే...? క్రెడిట్ రేటింగ్ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ రేటింగ్ అత్యంత ప్రధానమైన కొలబద్దగా భావించాలి. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్లను తగ్గించాయి. చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీస్తుంది కూడా. అయితే, ఓ కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఆమ్టెక్ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్ ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ మ్యూచువల్ ఫండ్ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రేటింగ్లను కూడా ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఈ కంపెనీ షేర్ల ధరలు పతనమయ్యాయి. రేటింగ్ ఏం చెబుతోంది..? దీర్ఘకాలిక డెట్ సాధనాలకు.... ఏఏఏ: చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహిం చడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్ తెలియ జేస్తుంది. అతి తక్కువ క్రెడిట్ రిస్క్ గ్రేడ్ ఇది. ఏఏ: ఈ రేటింగ్ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌ను సూచిస్తుంది. ఏ: సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ. బీబీబీ: తీసుకున్న డిపాజిట్లు, రుణాలు తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్ అర్థం. మోస్తరు రిస్క్ ఉంటుంది. బీబీ: తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్ రిస్క్ ఉంటుందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. బీ: ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. సీ: ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక రిస్క్ ఉంటుంది. డీ: డిఫాల్ట్ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్ అవనున్నట్టు ఈ రేటింగ్ తెలియజేస్తుంది. షార్ట్ టర్మ్ డెట్ సాధనాలకు రేటింగ్ ఏ1: క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు, అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది. ఏ2: తక్కువ క్రెడిట్ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ3: మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఏ4: భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. డీ: ఈ రేటింగ్ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్ లేదా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. -
రేట్ల పెంపు బాటలో మరిన్ని బ్యాంకులు
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచిన నేపథ్యంలో... పలు బ్యాంకులు ఈ భారాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సిండికేట్ బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచాయి. వచ్చే వారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. ►బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ ప్రతి కాలపరిమితిపై రేటును 0.10 శాతం పెంచింది. దీనితో ఏడాది కాలానికి రేటు 8.50 శాతానికి చేరుతుంది. ఓవర్‌నైట్ రేటు 7.90కి చేరింది. నెల రేటు 8.20కి, మూడు నెలల రేటు 8.30కి చేరింది. ఆరు నెలల రేటు 8.45 శాతానికి చేరుతుంది. ► ఓబీసీ రేటు 0.10–0.15% పెరిగింది. ► సిండికేట్ బ్యాంక్ ఏడాది కాలానికి సంబంధించిన రేటును 0.05 శాతం పెంచింది. ► రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి. గురువారం ఇండియన్ బ్యాంక్, కరూర్వైశ్యా బ్యాంక్‌లు రేటు పెంపు నిర్ణయం తీసుకున్నాయి.